సాక్షి, కూకట్‌పల్లి: ఏపీ నుంచి సిటీకి గంజాయి తెచ్చి అమ్ముతున్న నలుగురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ పార్కులో గంజాయి విక్రయిస్తున్న వీరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 1300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్ డీమార్ట్ సమీపంలోని పార్కులో నలుగురు యువకులు గంజాయి విక్రయిస్తున్నారంటూ పోలీసులకు సమాచారం వచ్చింది.
పోలీసులు వెంటనే పార్కు వద్దకు చేరుకుని అనుమానాస్పద స్థితిలో కనిపించిన యువకులను అదుపులోకి తీసుకొని విచారించారు. కవర్ ప్యాకెట్లలో గంజాయి లభించింది. గంజాయి విక్రయిస్తున్న వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాజేశ్ (24), రమేశ్ కృష్ణ (27), నక్కా నాగవంశీ (23), పల్నాడు జిల్లాకు చెందిన జంపనీ సాయిగోపీ విహారి (26) ఉన్నారు.
ఈ నలుగురు యువకులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులని, కేపీహెచ్‌బీ హాస్టల్లో ఉంటూ జల్సాలకు అలవాటు పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరంతా రాజమండ్రి నుంచి గంజాయిని నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment