గచి్చబౌలి: అర్థరాత్రి అతి వేగంగా మృత్యు శకటంలా దూసుకొచి్చన ఓ టిప్పర్ బైక్‌ను ఢీ కొనడంతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గచి్చ»ౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ భాను ప్రసాద్ తెలిపిన మేరకు.. ఖమ్మం జిల్లా బయ్యారం, ఉప్పలపాడు లక్ష్మీ నర్సింహపురానికి చెందిన చల్లా లోహిత్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసే తన అన్న చల్లా నవనీత్, స్నేహితులతో కలిసి గౌలిదొడ్డిలోని జగన్‌రెడ్డి మెన్స్ పీజీలో నివాసం ఉంటున్నారు. గౌలిదొడ్డిలో నివాసం ఉండే స్నేహితుడు తెనాలికి చెందిన రావిపూడి సాయి మహేష్ బాబు(24)తో కలిసి లోహిత్ డొమినార్ బైక్‌పై శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడు. అన్వయ కన్వెన్షన్ సమీపంలో వీరి బైక్‌ను వేగంగా వచి్చన టిప్పర్ ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న లోహిత్, మహే‹Ùబాబు ఇద్దరూ కిందపడ్డారు. లోహిత్ తలపై నుంచి టిప్పర్ వెళ్లడంతో చిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన సాయి మహేష్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. టిప్పర్ డ్రైవర్ అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. టిప్పర్ డ్రైవర్ అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరొకరికి తీవ్ర గాయాలు
Comments
Please login to add a commentAdd a comment