
హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజేశ్వర్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నంద్యాల పట్టణానికి చెందిన సంగిరెడ్డి నర్సింహారెడ్డి (28) విష్ణుప్రియ దంపతులు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదిత్య నగర్ కృష్ణకాలనీలో నివాసముంటున్నారు. నర్సింహారెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం కుమారుడికి అన్నం తినిపించే విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన నర్సింహారెడ్డి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.
అతను ఎంత సేపటికీ బయటికి రాకపోవడంతో విష్ణు ప్రియ స్థానికుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా నరసింహారెడ్డి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. అతడిని కిందకు దింపి చూడగా అప్పటికే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య విష్ణుప్రియ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో సాఫ్‌్టవేర్ ఉద్యోగి దుర్మరణం
మియాపూర్: టిప్పర్ లారీని ఓవర్ టెక్ చేయబోయి స్కూటీని ఢీకొని అదుపుతప్పి బుల్లెట్ పై వెళ్తున్న సాఫ్‌్టవేర్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప జిల్లాకు చెందిన రోషన్(27) మూడేళ్లుగా చందానగర్‌లో స్నేహితులతో కలిసి ఉంటూ సాఫ్‌్టవేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి అతను బైక్‌పై చందానగర్ నుంచి మియాపూర్ వైపు వెళ్తుండగా మదీనాగూడ దీప్తీశ్రీనగర్ కాలనీ కమాన్ సమీపంలో ముందు వెళ్తున్న టిప్పర్‌ను ఓవర్ టెక్ చేసే క్రమంలో స్కూటీని ఢీనడంతో అతడి బైక్ అదుపుతప్పింది.
హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి, అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తల్లి జహరాబాను ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment