KPHB Colony
-
గంజాయి అమ్ముతూ నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగుల అరెస్ట్
సాక్షి, కూకట్పల్లి: ఏపీ నుంచి సిటీకి గంజాయి తెచ్చి అమ్ముతున్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ పార్కులో గంజాయి విక్రయిస్తున్న వీరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 1300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్ డీమార్ట్ సమీపంలోని పార్కులో నలుగురు యువకులు గంజాయి విక్రయిస్తున్నారంటూ పోలీసులకు సమాచారం వచ్చింది.పోలీసులు వెంటనే పార్కు వద్దకు చేరుకుని అనుమానాస్పద స్థితిలో కనిపించిన యువకులను అదుపులోకి తీసుకొని విచారించారు. కవర్ ప్యాకెట్లలో గంజాయి లభించింది. గంజాయి విక్రయిస్తున్న వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాజేశ్ (24), రమేశ్ కృష్ణ (27), నక్కా నాగవంశీ (23), పల్నాడు జిల్లాకు చెందిన జంపనీ సాయిగోపీ విహారి (26) ఉన్నారు. ఈ నలుగురు యువకులు సాఫ్ట్వేర్ ఉద్యోగులని, కేపీహెచ్‌బీ హాస్టల్లో ఉంటూ జల్సాలకు అలవాటు పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరంతా రాజమండ్రి నుంచి గంజాయిని నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఉత్సాహంగా వినాయక నిమజ్జనం
కూకట్పల్లి: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు జీఎల్ఎన్ రెడ్డి, కోటిరెడ్డి, చెన్నారెడ్డి, శివ, మాధవరెడ్డిల ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ మండపంలో భారీ వినాయకుడిని ఏర్పాటు చేశారు. నిత్యం పూజలతో పాటు అన్నదానం నిర్వహించారు. సోమవారం వినాయక నిమజ్జనం ఉత్సాహంగా సాగింది. కాలనీలో జగన్మోహన్రెడ్డి లైటింగ్ బోర్డులను ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు.Hyderabad KPHB Colony....😍 @ysjagan pic.twitter.com/XyRLr7CRA4— rebelstar Trends ™ (@fanofysjagann) September 15, 2024KPHB, HYD 💥🔥🔥 @ysjagan @YSJaganTrends @YSRCParty @JaganannaCNCTS pic.twitter.com/qI8xkP3Bom— Bangalore YSRCP Forum (@YSRCPFORUM_BLR) September 16, 2024 -
హైదరాబాద్ లోని KPHB కాలనీ వద్ద కారు బీభత్సం
-
హైదరాబాద్‌లో అతిపెద్ద బొమ్మల కొలువు.. ప్రారంభించిన సితార
ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార సంస్థ హైదరాబాద్‌లో అతిపెద్ద బొమ్మల కొలువు పెట్టింది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు కూతురు సితార దీన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి మహేశ్ భార్య నమ్రత కూడా హాజరైంది. వినియోగదారులని ఆకర్షించడం, లేటెస్ట్ ఫ్యాషన్ల అతి తక్కువ ధరలకు ఇవ్వడమే లక్ష్యంగా నెల రోజుల పాటు సదరు వ్యాపార సంస్థ ఈ వేడుకని చేస్తోంది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలోని ఓ మాల్లో 30 x 40 అడుగుల సైజులో ఈ బొమ్మల కొలువుని ఏర్పాటు చేశారు. (ఇదీ చదవండి: నో చెప్పానని ఛాన్సులు ఇవ్వడం మానేశారు.. నటి కామెంట్స్!) ఈ బొమ్మల కొలువుని దసరా పండుగ కలెక్షన్‌తో అలంకరించారు. బహుమతులు ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎన్జీవోల నుంచి పిల్లలు, వృద్ధులకు దసరా కానుకలను అందజేశారు. అలానే హైదరాబాద్ నగరంలో ఈ వేడుకను ప్రారంభించినందుకు సంతోషిస్తున్నామమని సదరు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: 'స్కంద' కలెక్షన్స్.. సగానికి సగం పడిపోయాయి!) -
కూకట్పల్లి షాపింగ్‌మాల్‌లో డింపుల్ హయాతి సందడి (ఫొటోలు)
-
జయత్రి ఇన్ఫ్రా మోసాలు.. రియల్ ఎస్టేట్ పేరుతో నమ్మించి ముంచేశారు
కేపీహెచ్‌బీకాలనీ: జయత్రి ఇన్ఫ్రా కంపెనీ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఫ్రీ లాంచ్ పేరుతో పలువురి నుంచి రూ.కోట్లలో దండుకుని మొహం చాటేయటంతో బాధితులు పోలీసుస్టేషన్‌కు క్యూ కడుతున్నారు. దాదాపు రూ.20 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ప్రస్తుతం పోలీసులను ఆశ్రయించిన వారి వివరాలను బట్టి తెలుస్తుండగా, రూ.100 కోట్లకు పైగా మోసాలకు పాల్పడి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్త మౌతున్నాయి. మీడియాలో వస్తున్న కధనాలను చూసి బాధితులు తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కాగా, 2020 నుంచి ఆకర్షణీయమైన ప్రాజెక్టుల పేరుతో, వివిధ సంస్థల పేరుతో రూ. కోట్లలో డబ్బులు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నారని ఫిర్యాదు చేశారు. వినియోగదారులకు ఇస్తానన్న ఓపెన్ ప్లాట్లు, అపార్టుమెంట్ల ఫ్లాట్లు ఇవ్వక పోవటంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. బాధితుల ఫిర్యాదుతో బుధవారం సంస్థ ఎండి కాకర్ల శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో భారీ మొత్తంలో చెల్లించిన పలువురు గురువారం కేపీహెచ్‌బీ కాలనీ 6వ ఫేజులోని జయత్రి రిలయబిలిటి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే కార్యాలయం మూసి ఉండటంతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మరో 15 మంది ఫిర్యాదు.. కేపీహెచ్‌బీ కాలనీలో కార్యాలయం మూసివేసి ఉండటంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమతో డబ్బులు కట్టించిన సంస్థ ఉద్యోగులు, ఏజెంట్లకు ఫోన్ చేస్తే కొందరు లిఫ్ట్ చేయడం లేదని, మరి కొందరు తాము జయతి సంస్థలో ఉద్యోగం మానేశామని చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మరో 15 మంది బాధితులు కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిజాంపేట్, చందానగర్, సర్ధార్‌పటేల్ నగర్, అమీన్‌పూర్‌లలో అపార్టుమెంట్లు నిరి్మస్తున్నట్లు నమ్మిస్తూ భూ యజమానులతో సంతకాలు, అగ్రిమెంట్ పత్రాలు చూపించటంతో ఫ్రీ లాంచ్‌లో తక్కువకు వస్తుందని కొనుగోలు చేసినట్లు బాధితులు తెలిపారు. ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలు మొదలు 1.5 కోట్లు డబ్బులు కట్టించుకుని ఫ్లాట్లు ఇవ్వకుండా మొహం చాటేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర సంస్థల్లో పెట్టుబడులు.. జయత్రి రిలియబిలిటీ సంస్థతో పాటు గడిచిన రెండున్నరేళ్ల కాలంలో పదుల సంఖ్యలో ఇన్ఫ్రా, మైనింగ్, రిసార్ట్స్ సంస్థలను ఏర్పాటు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్మును భూముల కొనుగోలు, మైనింగ్లలో పెట్టుబడులు పెట్టి ఉంటారని బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆధారాలతో వస్తే కేసులు నమోదు చేస్తాం.. జయత్రి సంస్థ బాధితుల ఎవరైనా సరే డబ్బులు చెల్లించి మోసపోయినట్లు ఆధారాలతో వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. బుధవారం వరకు 8 మంది ఫిర్యాదు చేయగా నిందితుడు కాకర్ల శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం. గురువారం కొందరు బాధితులు వచ్చారు. డబ్బులు ఇచి్చనట్లుగా రశీదులు, అగ్రిమెంట్లు వంటి ఆధారాలు తీసుకువచ్చి నిరి్థష్టమైన ఫిర్యాదులు ఇవ్వాలని సూచించాం. – కిషన్ కుమార్, సీఐ, కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ -
Hyderabad: హౌసింగ్‌బోర్డు భూములు అన్యాక్రాంతం!
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి ప్రాంతంలోని హౌసింగ్‌బోర్డుకు చెందిన విలువైన భూములపై కబ్జాదారులు కన్నేశారు. తెలంగాణ విభజన తరువాత హౌసింగ్‌బోర్డు విభజన జరుగకపోవడంతో అందులో పని చేస్తున్న అధికారులు నామమాత్రపు విధులకు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో ఎక్కడికక్కడ విలువైన భూములను కబ్జా చేసేందుకు కబ్జాదారులు గుట్టుచప్పుడు కాకుండా కబ్జాకు తెరతీస్తున్నారు. ఇటీవల కాలంలోనే సుమారు ఎకరంన్నర భూమిని కబ్జాచేసేందుకు కొందరు తెరవెనుక జరిపిన కుట్రలను ఏకంగా స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెలుగులోకి తీసుకురావడం విదితమే. సుమారు వందకోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమిని కబ్జాదారులు సర్వేనంబర్ల మార్పు పేరుతో సులభంగా చేజిక్కించుకునేందుకు ప్రయత్నించడం గమనార్హం. ►కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ నుంచి హఫీజ్‌పేట వైపు వెళ్లేదారిలో రైల్వేట్రాక్ పక్కనే ఉన్న ఎకరంన్నర ఖాళీ స్థలంలో హౌసింగ్‌బోర్డు అధికారులు గతంలో ఈ స్థలం తమదేనంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొందరు కబ్జాదారులు సదరు భూమి కూకట్పల్లి మండలం పరిదిలోకి రాదని, శేరిలింగంపల్లి పరిధిలోకి వచ్చే హఫీజ్‌పేట గ్రామానికి చెందిన 78 సర్వే నంబర్ అంటూ అధికారికంగా సర్వే కూడా చేపించడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. ఏకంగా హౌసింగ్‌బోర్డు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించడం, ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలం అంటూ భూమిని కబ్జాలోకి తీసుకునేందుకు ఇనుప రేకులతో కూడిన షెడ్‌ను ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు చూసీచూడనట్లుగా వదిలేయడంలో అధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కబ్జాకు గురవుతున్న స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అధికారులు, తదితరులు (ఫైల్‌ఫొటో) ►కాముని చెరువు ప్రాంతంలోను హౌసింగ్‌బోర్డుకు చెందిన విలువైన భూములు కబ్జాలకు గురవుతున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడి చెరువును ఆనుకొని అనేక సర్వేనంబర్లలో హౌసింగ్‌బోర్డుకు చెందిన భూములును ఉన్నాయి. వాటన్నింటిపై అధికారుల నిఘా లేకపోవడంతో స్థానికులు విలువైన భూముల్లో పాగా వేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఎలాంటి పత్రాలు లేకుండా విలువైన హౌసింగ్‌బోర్డు భూముల్లో పాగా వేస్తున్నవారి పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉండటం గమనార్హం. ►కూకట్పల్లి ప్రాంతంలోని హౌసింగ్‌బోర్డుకు చెందిన భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా అధికారులు మాత్రం పరిరక్షించడంలో విఫలం అవుతున్నారు. ఎక్కడ చూసినా కనీసం చదరపు గజం ధర లక్షల రూపాయలకు తక్కువ లేకపోవడంతో స్థానికంగా కొందరు హౌసింగ్‌బోర్డు భూములపై కన్నేసి కబ్జా చేసేందుకు తెరవెనుక కుట్రలు పన్నుతున్నారు. ఇప్పటికే అనేక చోట్ల హౌసింగ్‌బోర్డుకు చెందిన విలువైన భూములు కబ్జాకు గురికాగా మరికొందరు సైతం ప్రార్థన స్థలాల ముసుగులో ఖాళీస్థలాలను కబ్జాచేసేందుకు యత్నిస్తుండటం ఇక్కడికి పరిస్థితికి అద్దం పడుతోంది. ఉన్నతాధికారుల దృష్టికి.. హౌసింగ్‌బోర్డుకు చెందిన భూములు తమవేనంటూ కొందరు చాలా కాలంగా కోర్టుల్లో కేసులు వేశారు. ఇటీవల కాలంలో కబ్జాకు యత్నించారు. అట్టివారిపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. వెంటనే ఆక్రమణలు తొలగించి భూములను పరిరక్షణకు చర్యలు చేపట్టాం. ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చాం. వారి ఆదేశానుసారంగా తదుపరి చర్యలు ఉంటాయి. –కిరణ్‌బాబు, హౌసింగ్‌బోర్డు వెస్ట్రన్ డివిజన్ ఈఈ -
Hyderabad: కేపీహెచ్‌బీ.. ఇదో హైరైజ్ కాలనీ
ఆసియాలోనే అతి పెద్ద కాలనీగా రూపొందిన కేపీహెచ్‌బీ కాలనీ నగరంలోనే ప్రసిద్ధిగాంచిన నివాస ప్రాంతంగా ఏర్పడింది. సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు స్థానమున్న ఈ కాలనీలో గంజి, బెంజి మిళితమై నివాసకేంద్రంగా ఉండటం విశేషం. ఒకప్పుడు రాళ్లూ రప్పలు, చెట్టూ చేమలతో చిట్టడవిగా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం ఆకాశ హర్మ్యాలకు చిరునామాగా మారింది. విభిన్న సంస్కృతుల మేళవింపుతో దేశ, విదేశాల వారికి ఆవాసంగా ఉంది. మహా నగరానికే మణిమకుటంగా వెలుగొందుతోంది కేబీహెచ్‌బీ కాలనీ. దాని ప్రస్థానమిదీ.. 1969లో 1,326 ఎకరాలను అప్పటి ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. 1978లో హౌసింగ్ బోర్డు పేద, మద్య తరగతి ప్రజలకు నివాసం కోసం నో లాస్, నో ప్రాఫిట్ పేరుతో ఇళ్ల నిర్మాణం కోసం శ్రీకారం చుట్టింది. హుడా నిబంధనల ప్రకారం 40 శాతం ఖాళీ స్థలాలను వదిలి మిగిలిన ప్రాంతాన్ని ప్లాట్లుగా విభజించింది. అనంతరం 1981– 82 ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పట్లో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, ఇళ్లు లేని వారు ఎంతోమంది హౌసింగ్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. - మొదట్లో కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్– 1, ఫేజ్– 2 ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అప్పటికి దరఖాస్తులు మిగిలిపోవటంతో 3, 4 ఫేజుల నిర్మాణం చేపట్టింది. అప్పట్లోనే 100 ఎకరాల స్థలాన్ని జేఎన్టీయూకు కేటాయించింది. అనంతరం 5వ, 6వ ఫేజులో హెచ్ఐజీల పేరుతో పెద్ద ప్లాట్లను వేలం వేసింది. లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్లు కేటాయిస్తూ హౌసింగ్ బోర్డు నిర్ణయం తీసుకొంది. 15 ఫేజుల్లో లాటరీ పద్ధతిలో కమర్షియల్ స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించారు. హౌసింగ్ బోర్డుకు గుండె లాంటి కూకట్‌పల్లిలో హౌసింగ్ బోర్డు ఆదాయం సమకూర్చుకునేందుకు బహిరంగ వేళాన్ని ప్రోత్సహించింది. దీంతో పోటాపోటీగా స్థలాల విక్రయాలు జరిగాయి. స్పైనల్ రోడ్డుతో మహర్దశ.. కూకట్పల్లి నుంచి కేపీహెచ్‌బీ మీదుగా హైటెక్ సిటీ వరకు 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్పైనల్ రోడ్డు నిర్మాణం కోసం చేసిన శంకుస్థాపన ఈ రోజు వేలల్లో ఉన్న సామాన్యులను కోటీశ్వరులుగా చేసింది. స్పైనల్ రోడ్డుకు ముందు 10 వేల రూపాయలకు ఇళ్లు కొనాలన్నా హడలిపోయే ప్రజలు స్పైనల్ రోడ్డు నిర్మాణంతో గజం లక్ష రూపాయలకు చేరింది. అప్పట్లో రాష్ట్రంలోనే హౌసింగ్‌బోర్డు వేసిన వేలంలో గజం ధర లక్ష రూపాయలకు పలకటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకవైపు ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్, మరోవైపు మెట్రో రైల్వే స్టేషన్, ఇంకో వైపు హైటెక్ సిటీకి వెళ్లే హైస్పీడ్ రహదారి, మరో వైపు స్పైనల్ రోడ్డు నిర్మాణంతో హౌసింగ్ బోర్డు దశ మారిపోయింది. రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యాపార కేంద్రంగా కూకట్పల్లి ప్రఖ్యాతి గాంచింది. దీనికి తోడు ప్రతిష్టాత్మకమైన జేఎన్టీయూ యూనివర్సిటీ ఇక్కడే ఉండటంతో జేఎన్టీయూ అనుబంధ కళాశాలలు కూడా సమీపంలోనే ఉండటంతో ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్‌గా మారింది. సకల సౌకర్యాలకు నెలవు.. తెలంగాణలోనే మొట్టమొదట గేటెడ్ కమ్యూనిటిల నిర్మాణం కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభమయ్యాయి. అత్యంత ఎత్తైన 42 అంతస్థుల భవన నిర్మాణాలు చోటుచేసుకోవటమే కాకుండా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఇక్కడ నిర్మాణం కావటంతో ఈ ప్రాంతానికి మహర్దశ పలికింది. ప్రభుత్వం 50 శాతానికిపైగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. కొన్ని డ్లూప్లెక్స్ నిర్మాణాలు చేపట్టారు. ముఖ్యంగా లోదా కాలనీ, రెయిట్ట్రీ పార్కు (మలేసియా టౌన్ షిప్), హిందూ ఫార్చ్యూన్, వన్ సిటీ కాలనీ వంటి ప్రాంతాలు అధునాతనంగా నిర్మించటంతో అధిక శాతం సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఈ ప్రాంతం పట్ల ఆకర్షితులయ్యారు. హైటెక్ సిటీకి సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ రోడ్లు్ల, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, ప్లే గ్రౌండ్స్, క్లబ్ హౌస్, మీటింగ్ హౌస్‌లను ఏర్పాటు చేయటంతో సామాన్యుడితో పాటు కోటీశ్వరులకు కూడా కావాల్సిన వస్తువులు అందుబాటులో లభిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు, సినీ రంగ ప్రముఖులు కూడా ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ ఒకవైపు ఓఆర్ఆర్ సమీపంలో ఉండటమే కాకుండా ముంబై జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతో ఈ ప్రాంతం మరో అబిడ్స్‌ను తలపిస్తోంది. ఇక్కడ అక్షరాలా లక్షకు పైగా జనాభా నివాసం ఉంటారంటే అతిశయోక్తి లేదు. అతిపెద్ద నివాస కేంద్రం.. కూకట్‌పల్లికి చుట్టు పక్కల పారిశ్రామిక ప్రాంతాలైన సనత్‌నగర్, బాలానగర్, జీడిమెట్ల, పాశమైలారం, బొల్లారం, పటాన్ చెరు, కాజిపల్లి, బొంతపల్లి ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొనటంతో ఇక్కడి కారి్మకులకు నివాస యోగ్యమైన ప్రాంతంగా కేపీహెచ్‌బీ అవతరించింది. దీంతో ఈ ప్రాంతానికి మరింత డిమాండ్ పెరిగింది. మాదాపూర్, గచి్చబౌలి ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు రావటంతో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడే బీహెచ్‌ఇయల్ ఆర్ అండ్, ఎన్ఆర్ఎస్ఏ, ఎంఎస్ఎమీ, బీహెచ్ఈఎల్, ఐడీపీఎల్, ఐడీఎల్, బీడీఎల్ ప్రభుత్వరంగ సంస్థలు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతాన్ని నివాస కేంద్రంగా ఏర్పరచుకున్నారు. కోస్తాంధ్రవాసులకు అడ్డా.. నగరంలో నూతనంగా ఇళ్లు నిర్మించుకోవాలన్నా, సామాన్యుడికి అవసరమయ్యే ఇళ్లు అద్దెకు కావాలన్నా ఇతర ప్రాంతాల నుంచి వలస వచి్చన ప్రజలు ఈ ప్రాంతాన్నే ప్రధాన అడ్డాగా ఎంపిక చేసుకుంటున్నారు. ఇక్కడ విద్యారంగంతో పాటు వ్యాపార రంగం, కార్మికరంగం, ప్రజలు ఎక్కువగా నివాసముంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారు కూడా ఈ ప్రాంతంలోనే నివాసముంటూ జీవనోపాధికి బాటలు వేసుకుంటున్నారు. ఇక్కడ నివాసముంటూ హాస్టళ్లలో బ్యాచ్లర్స్ జీవితాలను గడుపుతూ ఏదో ఒక రంగంలో ఉపాధి వెదుక్కొని ఇక్కడే వివాహం చేసుకొని నివాసాలు ఏర్పాటు చేసుకోవటం విశేషం. కోస్తా, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల వారు ఇక్కడే నివాసం ఉండటంతో ఆ ప్రాంతానికి సంబంధించిన హోటల్స్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవటం విశేషం. గుంటూరు గోంగూర, రాగి సంకటి, నాటు కోడి పులుసు, గోదావరి ఘుమఘుమలు, రొయ్యల పులుసు, పాలమూరు చికెన్ గ్రిల్స్, హైదరాబాద్ బిర్యానీతో పాటు అన్ని వంటలకు కేరాఫ్‌గా ఈ ప్రాంతం నిలిచింది. ఇక్కడ సకల సౌకర్యాలు లభించటంతో కేవలం కేపీహెచ్‌బీ ప్రాంతంలోనే వెయ్యికి పైగా హాస్టల్స్ ఏర్పడటం విశేషం. ఇలా.. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ తెలంగాణ ప్రాంతంలోనే అతిపెద్ద ఆదాయ వనరుగా ఏర్పడటం విశేషం. -
క్షుద్ర పూజల కలకలం.. కూకట్‌పల్లిలో సగం కాలిపోయిన స్థితిలో మృతదేహం
సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్‌బీకాలనీ: శ్మశాన వాటికలో సగం కాలిన స్థితిలో కనిపించిన మృతదేహం స్థానికంగా సంచలనం రేపింది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి ఒంటిపై డీజిల్ పోసి దహనం చేసి ఉంటారని భావిస్తున్న ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. ఆనవాళ్లు గుర్తించలేని విధంగా దగ్ధమైన మృతదేహం ఎవరిదనే సీఐ కిషన్ కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం హైదర్‌నగర్‌లోని అలీతలాబ్ పక్కన ఉన్న హిందూ శ్మశాన వాటికలో సగం కాలిన మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి 20 మీటర్ల దూరంలో చెప్పులు, ఓ బ్యాగ్, అందులో రగ్గు(బెడ్ షీట్) స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా బ్యాటరీ, సిమ్ కార్డు లేని ఓ సెల్ ఫోన్‌ను కూడా గుర్తించారు. మృతుడి వయసు సుమారు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండవచ్చునని అతడిని హత్య చేసి దహనం చేసి ఉండవచ్చునని అనుమాన్యం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో అదృశ్యమైన వ్యక్తుల వివరాలను ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సైబరాబాద్ క్లూస్ టీంతో పాటు పోలీస్ ప్రత్యేక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అన్నీ అనుమానాలే... శ్మశాన వాటికలో మృతదేహం లభించిన తీరు మొదలు అక్కడి ఆనవాళ్లు అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహానికి కొద్ది దూరంలో బియ్యం పిండి వంటివి కనిపించడంతో క్షుద్ర పూజలు చేసి ఉండవచ్చునని అనుమానాలు వస్తున్నా పోలీసులు నిర్ధారించడం లేదు. మృతదేహాన్ని శనివారం దహనం చేసి ఉంటారని స్థానికులు పేర్కొంటుండగా పోలీసులు మాత్రం ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత దహనం చేసి ఉండవచ్చునని పేర్కొంటున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే వాస్తవాలు తెలుస్తాయని సీఐ పేర్కొన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. -
కలెక్టర్ అవుదామని కలలు కని.. రియల్ ఎస్టేట్‌ను నమ్ముకుని..
కేపీహెచ్‌బీకాలనీ: సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని తల్లీకొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. జోగులాంబగద్వాల జిల్లాకు చెందిన గోగినేని వరప్రసాద్ భార్య సరళ(58), కుమారుడు సందీప్ చంద్ర(38)లతో కలిసి కేపీహెచ్‌బీ పరిధిలోని బృందావన్‌కాలనీలో గల రిషితాకల్యాణ్ అపార్టుమెంట్‌లోని 208 ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. వ్యాపార రీత్యా రైస్ మిల్లులు నిర్వహిస్తున్న వరప్రసాద్ కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. అయితే మూడు రోజుల కిందట వరకు అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడిన సరళ, సందీప్‌ల ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడం, ఇంట్లోను నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు అపార్టుమెంట్ వాచ్‌మెన్‌ను వెళ్లి చూడాలని కోరారు. దీంతో వారు సరళ, సందీప్‌లు ఉన్న ఫ్లాట్‌కు వెళ్లి తలుపు తట్టినప్పటికీ లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోగా దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించారు. చదవండి: (సర్పాలతో మేలే.. రాష్ట్రంలో విషపూరిత సర్ప జాతులు నాలుగే) కేపీహెచ్‌బీ పోలీసులు వెళ్లి తలుపు గడియ పగుల గొట్టి లోనికి వెళ్లి చూడగా కిచెన్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు సరళ, మరో గదిలోని సీలింగ్ ప్యాన్‌కు సందీప్‌లు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించారు. అంతేకాకుండా ఇద్దరి మృతదేహాలు కూడా ఢీ కంపోజ్డ్ స్థితికి చేరడాన్ని బట్టి మూడు రోజుల కిందటే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. భర్త వరప్రసాద్ వచ్చి పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడిస్తేనే ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొంటున్నారు. కలెక్టర్ అవుదామని.. సందీప్ చంద్ర కలెక్టర్ కావాలని కళలు కని అందుకు తగిన విధంగా సిద్ధమయ్యాడు. అయితే రెండు సార్లు ఇంటర్వ్యూ స్థాయికి చేరుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో రియల్ ఎస్టేట్‌ను నమ్ముకున్నాడు. తాము పోగు చేసుకున్న సొమ్ముతో పాటు తెలిసిన వారి వద్ద కూడా కొంత మొత్తం అప్పుగా తీసుకొని ఓ భూమిని కొనుగోలు చేశాడని, అది వివాదాల్లో చిక్కుకోవడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయని సందీప్‌చంద్ర స్నేహితులు పేర్కొనడం గమనార్హం. స్థానికంగా పలువురి వద్ద తీసుకున్న అప్పులు తీర్చలేకపోవడం, జీవితంలో స్థిరపడకపోవడం వంటి పలు ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు సైతం భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో అశ్లీల కార్యక్రమాలు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలోని మంజీరా మెజిస్టిక్‌లో నిర్వహిస్తున్న క్లబ్ మస్తీ రెస్టో బార్ అండ్ పబ్‌పై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న తొమ్మిది మంది యువతులతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణ అనుమతుల ను తీసుకున్న క్లబ్ మస్తీ యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా తెల్లవారుజాము వరకు పబ్‌ను నిర్వహిస్తూ యువతీ యువకులను ఆకర్షిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో శుక్రవారం అర్ధరాత్రి మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా బార్ అండ్ రెస్టారెంట్‌పై దాడి చేశారు. అప్పటికే హోరెత్తించే డీజే శబ్దాల నడుము యువత మద్యం సేవించి నృత్యాలు చేస్తూ కనిపించా రు. మప్టీలో ఉన్న పోలీసులు వారి ఫొటోలు, వీడియోలను తీయడంతో అనుమానం వచ్చిన పలువురు యువకులు పరుగులు తీశారు. దీంతో అందరినీ ఒకచోటకు చేర్చి వారి వివరాలను సేకరించారు. అనంతరం పబ్‌లో సేవిస్తున్న మద్యం వివరాలు, హుక్కా వివరాలు సేకరించి డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు సేవించారా? అనే విషయమై ఆరా తీశారు. డ్రగ్స్ విషయంలో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో హుక్కా సేవించే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా పబ్ మస్తీ యాజమానులైన శివప్రసాద్‌రెడ్డి, మేనేజర్ విష్ణు, నిర్వాహకుడు కృష్ణ పరారీలో ఉండగా, డ్యాన్స్‌లు చేస్తూ పట్టుబడిన తొమ్మిది మంది యువతులతో పాటు మేనేజర్ ప్రదీప్‌కుమార్, డ్యాన్సర్ ప్రవీణ్, డీజే ఆపరేటర్ ధన్‌రాజ్, సాయిసంతోష్లను అదుపులోకి తీసుకున్నారు. ప బ్లోని డీజే మిక్సర్, కంట్రోలర్, క్రాస్ ఓవర్ పరికరాలను సీజ్ చేశారు. అనంతరం వీరిని కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. కేపీహెచ్‌బీ సీఐ కిషన్‌కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా గతంలోనూ ఇక్కడి బార్ అండ్ రెస్టారెంట్‌పై పలువురు ఫిర్యాదు చేయగా కొద్ది రోజుల పాటు పబ్ కార్యకలాపాలను నిలిపివేసిన యజమానులు తిరిగి ఇటీవల కాలంలో మళ్లీ మొదలుపెట్టినట్లు తెలిసింది. ప్రధానంగా యువతులను ఎరవేసి యువకులను పబ్‌కు రప్పిస్తున్నారన్న ఆరోపణలు పబ్ నిర్వాహకులపై ఉన్నాయి. -
సందడిగా ‘సాక్షి’ స్పెల్‌బీ సెమీ ఫైనల్స్
మూసాపేట/హైదరాబాద్: ‘సాక్షి’ స్పెల్‌బీ సెమీఫైనల్స్ పోటీలు ఆదివారం కేపీహెచ్‌బీ కాలనీలోని మెరిడియన్ స్కూలులో ఉత్సాహంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చదువుతున్న విద్యార్థులు దాదాపు 350 మందికి పైగా పాల్గొన్నారు. వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి విద్యార్థులు ‘సాక్షి’ స్పెల్‌బీ పోటీలకు హాజరయ్యారు. నాలుగు కేటగిరిల్లో నాలుగు బ్యాచ్‌లుగా విద్యార్థులు సెమీ ఫైనల్స్‌లో పోటీ పడ్డారు. మెయిన్ స్పాన్సర్స్‌గా డ్యూక్ వప్పీ అసోసియేషన్ స్పాన్సర్‌గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (రాజమండ్రి) వ్యవహరించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పోటీల్లో పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది ‘సాక్షి’ నిర్వహిస్తున్న స్పెల్ బీ విద్యార్థుల్లో పోటీతత్వం పెంచుతుంది. అంతేకాక పోటీ పరీక్షల సందర్భంగా భయాందోళనకు గురికాకుండా ఉండటం, ఒత్తిడిని అధిగమించేందుకు ఉపయోగపడుతుంది. చిన్న వయస్సులోనే ఇటువంటి పోటీ పరీక్షల్లో పాల్గొనటం విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంపొందుతుంది. –వకుళ, మీర్పేట్ విద్యార్థిని తల్లి కొత్త పదాలు తెలుసుకున్నా ‘సాక్షి’ స్పెల్‌బీ ద్వారా కొత్త కొత్త ఇంగ్లీషు పదాలను తెలుసుకోవటంతోపాటు వాటి అర్థాలను కూడా తెలుసుకున్నాను. స్పెల్ బీలో పాల్గొనటం చాలా గర్వంగా ఉన్నది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విద్యార్థులతో పోటీ పడి సెమీఫైనల్స్ వరకు రావటం ఆనందంగా ఉంది. – సహస్ర మారెడ్డి, మీర్పేట్ చాలా విషయాలు తెలిశాయి ఖమ్మంలోని ప్రైవేట్ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నాను.అక్కడి నుంచి వచ్చి స్పెల్ బీ పోటీలో పాల్గొన్నాను. ఫైనల్స్‌లో గెలుస్తాననే నమ్మకం కూడా నాకు ఉంది. ఈ పోటీల ద్వారా కొత్త స్నేహాలతో పాటు మరిన్ని విషయాలు బోధపడ్డాయి. –హంశ్రిత, ఖమ్మం విద్యార్థిని పోటీతత్వం పెరుగుతుంది ‘సాక్షి’ స్పెల్‌బీలో విద్యార్థులకు కానీ, వారి తల్లిదండ్రులకు ఎలాంటి అసౌకర్యం ఉండదు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ పరీక్షల ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుంది. – అరుణ, విద్యార్థిని తల్లి -
Hyderabad: ఇంట్లో నుంచి ప్రేమికుల పరార్.. ఇద్దరి జాడ చెప్పాలంటూ..
సాక్షి, హైదరాబాద్: ప్రేమించిన యువతిని తీసుకెళ్లిన ఓ యువకుడి తల్లిదండ్రులపై యువతి బంధువులు దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలకు గురైన యువకుడి తండ్రిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. సర్దార్‌పటేల్ నగర్లో నివసించే గాయత్రి, నరేష్ ప్రేమించుకున్నారు. వారివారి ఇళ్లల్లో వివాహానికి అంగీకరించకపోవడంతో శనివారం రాత్రి గాయత్రి, నరేష్‌లు కలిసి ఇల్లు విడిచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు, బంధువులు, అర్ధరాత్రి శాంతయ్య ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న శాంతయ్య, రాజేశ్వరి దంపతులపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ ఇద్దరిని బలవంతంగా తమ ఇంటికి తీసుకొని వెళ్లిన గాయత్రి బంధువులు, వారిని ఓ గదిలో బంధించి నరేష్ ఆచూకీ తెలపాలని చిత్రహింసలకు గురి చేశారని బాధితురాలు రాజేశ్వరి తెలిపారు. నరేష్ ఆచూకీ తెలుపకుంటే చంపుతామని బెదిరించి వదిలేశారని, తన భర్త చెయ్యి, రెండు చేతి వేళ్లు విరిగాయని, తమకు రక్షణ కల్పించాలని బాధితులు వాపోతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని కేపీహెజ్‌బీ సీఐ కిషన్‌కుమార్ తెలిపారు. చదవండి: Hyderabad: మెట్రో స్టేషన్ వద్ద యువకుడి హంగామా -
డ్యూటీకి వెళ్లిన భర్త తిరిగి ఇంటికి వచ్చేసరికి..
సాక్షి, హైదరాబాద్(కేపీహెచ్‌బీకాలనీ): డ్యూటీకి వెళ్లిన భర్త తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్య కనిపించకుండా పోయిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కేపీహెచ్‌బీ 3వ ఫేజులో ముత్యాల జ్యోత్స్న, శ్రీనివాస్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ నెల 27న శ్రీనివాస్ డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య కనిపించలేదు. దీంతో ఆమె కోసం ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి అదృశ్యం భాగ్యనగర్‌కాలనీ: పని నిమిత్తం దుకాణానికి వెళ్లిన ఓ వ్యక్తి ఇంటికి తిరిగిరాని సంఘటన గురువారం కూకటపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మన్సూర్ ఆలి (32), ఆస్మా బేగం దంపతులు బోరబండలో నివాసముంటున్నారు. మన్సూర్‌ఆలీ అల్లాపూర్‌లోని ఓ వెల్డింగ్ షాపులో పనిచేస్తుంటాడు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు పని నిమిత్తం వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. ప్రతి రోజు రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చేవాడు. ఆ రోజు రాకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. షాపునకు ఫోన్ చేసి అడగ్గా రాలేదని సమాధానం చెప్పారు. దీంతో ఆందోళనకు గురైన ఆస్మా, బంధువులు ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో గురువారం కూకట్పల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కేపీహెచ్‌బీ కాలనీ: హాస్టల్లో యువతి ఆత్మహత్య
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): అనారోగ్య కారణాలతో ఓ యువతి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. కృష్ణాజిల్లాకు చెందిన పాలపర్తి శాంతి (26) భాగ్యనగర్ ఫేజ్–2లోని తనూజ హాస్టల్లో నివాసం ఉంటూ బాలానగర్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుంది. కొంతకాలంగా తలనొప్పి తదితర అనారోగ్య కారణాలతో బాధపడుతుంది. ఆదివారం ఉదయం శాంతి ఫోన్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో ఆందోళనకు గురైన శాంతి తల్లి హాస్టల్ నిర్వాహకులకు ఫోన్ చేసి వాకబు చేసింది. హాస్టల్ నిర్వాహకులు శాంతి గదికి వెళ్ళి చూడగా ఆత్మహత్యకు పాల్పడిన విషయం ఆమె తల్లికి, సోదరికి తెలిపారు. దీంతో వారు హుటాహుటిన తరలివచ్చి పోలీసులకూ సమాచారం ఇచ్చారు. అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసి ఉందని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: హైదరాబాద్: అన్నను కొట్టి చంపిన తమ్ముడు -
కేపీహెచ్బీలో విషాదం.. సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతి
సాక్షి, హైదరాబాద్: నిర్లక్ష్యంగా వదిలేసిన సెల్లార్ గుంత అభం శుభం తెలియని ముగ్గురు బాలికలను బలితీసుకుంది. శుక్రవారం పాఠశాలకు సెలవు కావటంతో ఇంటివద్దనే ఉన్న బాలికలు ఆడుకునేందుకు సెల్లార్ గుంత వద్దకు వెళ్లారు. గుంతలో ఉన్న నీటిలోకి దిగే క్రమంలో ఒకరు జారిపడిపోతోంటే.. ఆమెను కాపాడేందుకు ఒకరి తరువాత ఒకరు మొత్తం ఐదుగురు బాలికలు అందులో పడిపోయారు. ముగ్గురు చనిపోగా ఇద్దరు బయటపడ్డారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని 4వ ఫేజ్‌లో ఆర్టీఐ కార్యాలయం ఆనుకొని ఉన్న ఆరెకరాల ఖాళీ స్థలంలో 8 ఏళ్ల క్రితం బహుళ అంతస్థుల నిర్మాణం కోసం సెల్లార్ గుంతలు తవ్వారు. అప్పటి నుంచి ఎలాంటి నిర్మాణం చేపట్టకపోవటంతో గుంతలోకి భారీ ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరింది. బతుకుదెరువు కోసం బిహార్ నుంచి వచ్చిన లక్ష్మీ ప్రసాద్ టీ కొట్టు నిర్వహిస్తూ తన ఐదుగురు కూతుళ్లు, ఒక కొడుకుతో ఆర్టీఐ కార్యాలయం సమీపంలో ఉంటున్నాడు. అతని నాలుగో కుమార్తె సంగీత కుమారి (12) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. యూపీకి చెందిన ప్రమోద్ గుప్త, గీత దంపతులు కూడా ఆర్టీఐ కార్యాలయం సమీపంలోనే టీ కొట్టు నిర్వహిస్తున్నారు. వీరి కూతురు రమ్య (7) అదే పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. నాగర్‌కర్నూల్‌కు చెందిన పర్విన్ కుమార్తె సోఫియా (10) నాలుగో తరగతి చదువుకుంటోంది. వీరితోపాటు చదువుతున్న నేహా, సంగీత చెల్లెలు నబియా ఐదుగురు కలిసి మధ్యాహ్నం ఆడుకునేందుకు సెల్లార్ గుంత వద్దకు వెళ్లారు. తొలుత సంగీత నీటిలో దిగేందుకు యత్నించగా, ఆమెను కాపాడేందుకు రమ్య నీటిలోకి దిగి ఆమె సైతం మునిగింది. వీరిని కాపాడేందుకు సోఫియా యత్నించగా ఆమె కూడా మునిగిపోయింది. నేహా, నబియా వీరిని కాపాడేందుకు యత్నించి అదృష్టవశాత్తు బయటపడ్డారు. వీరు తర్వాత ఇంట్లో విషయం చెప్పడంతో కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి వెళ్లారు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో సంగీత, సోఫియా, రమ్య మృతదేహాలను వెలికి తీశారు. నిర్లక్ష్యమే పెను శాపం.. ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్ర గృహ నిర్మాణ మండలి ఆధ్వర్యంలో కేపీహెచ్‌బీ 4వ ఫేజులో బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మించేందుకు ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి పనులను అప్పగించారు. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో 20 అడుగుల లోతు సెల్లార్ గుంతను తవ్వి వదిలేశారు. దీంతో గుంత నీటితో నిండి నిరుపయోగంగా ఉంది. ఎనిమిదేళ్లుగా ఇలాగే ఉండటంతో పిల్లల ప్రాణాల పాలిట యమపాశంగా మారింది. గతంలో ఇద్దరు బాలురు ఇందులో పడి మృతిచెందారు. -
ఒకే కాలేజీ.. ఫేస్బుక్లో దగ్గరై సహజీవనం.. పవిత్రకు నిజం తెలిసి..
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: ప్రేమించానంటూ, పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించిన ఓ యువకుడు ప్రేయసితో సహజీవనం చేసి పెళ్లి చేసుకోకపోవడంతో ఆవేదనకు గురైన ఆ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన కొండా నారాయణ కూతురు పవిత్ర ఉపాధి కోసం నగరానికి వచ్చి కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసం ఉంటోంది. అయితే ఆమెతో పాటు ఒకే కాలేజీలో చదువుకున్న ఖమ్మం జిల్లాకు చెందిన బండి గౌతమ్‌తో ఫేస్బుక్ ద్వారా పరిచయం పెరిగింది. పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. దీంతో పవిత్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన గౌతమ్ ఆమెతో సంవత్సర కాలంగా సహజీవనం చేస్తున్నాడు. తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే ఇటీవల గౌతమ్‌కు వేరే అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిరిన విషయం తెలుసుకున్న పవిత్ర అతడిని నిలదీసింది. దీంతో పెద్దల ఒత్తిడితోనే పెళ్లికి ఒప్పుకున్నానని అతడు పేర్కొన్నాడు. చదవండి: (Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..) పెద్దలను ఎదిరించి పవిత్రనే పెళ్లి చేసుకుంటానంటూ ఆమెతోనే సహజీవనం సాగిస్తున్నాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం గౌతమ్.. పవిత్ర తండ్రికి ఫోన్‌చేసి పవిత్ర ఆత్మహత్య చేసుకుంటానని చెబుతుందంటూ సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపటికి తిరిగి ఫోన్‌చేసి పవిత్ర సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. దీంతో పవిత్ర కుటుంబీకులు హుటాహుటిన నగరానికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవిత్ర ఆత్మహత్యకు గౌతమ్ కారణమంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: ముగ్గురు యువతుల అదృశ్యం.. షాకింగ్ ఏంటంటే..) -
యువత సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలి
కేపీహెచ్‌బీకాలనీ: యువత తమ ఉజ్వల భవిష్యత్‌కు సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని జేఎన్టీయూహెచ్ చాన్స్‌లర్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. శనివారం జేఎన్టీయూలో నిర్వహించిన రెండు రోజుల మెగా జాబ్ మేళాకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విద్యార్థి దశలోనే తమ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని వాటిని చేరుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలని సూచించారు. ఒకసారి ప్రయత్నం చేసినా ఫలితం రాకపోతే మళ్లీ మళ్లీ ప్రయత్నించి లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటి డెవలప్మెంట్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలని అన్నారు. పట్టభద్రులైన యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో జేఎన్టీయూ జాబ్ మేళా నిర్వహించటం అభినందనీయమని కొనియాడారు. అనంతరం వీసీ కట్టా నరసింహారెడ్డి మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యా బోధనకు జేఎన్టీయూహెచ్ కృషి చేస్తున్నదని తెలిపారు. వర్సిటీ ఇండస్ట్రీ ఇంట్రాక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్‌మేళాలో రెక్టార్ గోవర్ధన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, యూఐఐసీ డైరెక్టర్ తారా కళ్యాణి, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ, సేవా ఇంటర్నేషనల్ ట్రస్టీ కొండా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే జాబ్ మేళాలో 144 ప్రముఖ కంపెనీలు పాల్గొంటుండగా సుమారు 65 వేల మంది యూజీ, పీజీ, డిప్లమో, ఇంటర్, ఎస్ఎస్సి విద్యార్హతలు ఉన్న ఔత్సాహికులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
కూకట్పల్లి: రెండు వ్యభిచార గృహాలపై దాడులు, ఇద్దరు అరెస్టు
సాక్షి, కూకట్పల్లి: రెండు వేర్వేరు చోట్ల వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించిన కేపీహెచ్‌బీ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీ నారాయణ తెలిపిన వివరాలు.. కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని బాస్కెట్ బాల్ గ్రౌండ్ వద్ద ఎల్ఐజీ గృహంలో వ్యభిచారం నిర్హహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆకస్మికంగా దాడులు నిర్వహించి పల్లికల శ్రీనివాసరావును మరో యువతిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరు మహిళలను రెడ్‌హ్యండెడ్‌గా అనంతరం యువతిని రెస్క్యూ హోంకు తరలించగా.. శ్రీనివాసరావును రిమాండ్‌కు తరలించారు.. అదే విధంగా కేపీహెచ్‌బీ కాలనీలో రోడ్డు నెంబర్3లో ఓ గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సాయంత్రం 6..30 గంటలకు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సుంగులూరి నాగ వెంకటేశ్వరరావుతో పాటు ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ జరిపి వారిపై కేసు నమోదు చేసి నిందితులిద్దరిని రిమాండ్‌కు తరలించారు. -
భార్య మీద కోపం.. మామకు నిప్పంటించి పరారైన అల్లుడు
కేపీహెచ్‌బీకాలనీ: భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు వెళ్లిన ఓ వ్యక్తి.. అడ్డువచ్చిన మామపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. ఈ ఘటనలో మంటలను ఆర్పేందుకు వెళ్లిన అత్తకు కూడా గాయాలయ్యాయి. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన మేరకు.. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ 6వ ఫేజుకు చెందిన టి. సాగర్‌రావు, రమా దంపతుల కుమార్తె నీతికకు కరీంనగర్‌కు చెందిన సాయికృష్ణతో 2017లో ప్రేమ వివాహం జరిగింది. సంవత్సరం పాటు వీరి సంసారం సంతోషంగా సాగింది. తరువాత భర్త సాయికృష్ణ భార్య నీతికను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులకు తట్టుకోలేక 2019లో తల్లిదండ్రుల వద్దకు నీతిక వచ్చింది. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో భర్త వేధింపులపై ఫిర్యాదు చేసింది. ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. అప్పటి నుంచి నీతిక తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. అయితే శనివారం రాత్రి 11 గంటల సమయంలో సాయి కృష్ణ పెట్రోల్ బాటిల్‌తో ఇంటికి వచ్చాడు. యాసిడ్ పోసేందుకు వచ్చాడనుకొని భయపడిని నీతిక బెడ్రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. నీతిక తండ్రి సాగర్‌రావు... అల్లుడిని అడ్డుకునేందుకు వెళ్లగా అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో సాగర్‌రావు తీవ్రంగా గాయపడ్డాడు. అత్త రమ మంటలను చూసి అరవటంతో సాయికృష్ణ పరారయ్యాడు. వెంటనే స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా రమకు సైతం గాయాలు అయ్యాయి. దీంతో సాగర్ రావు, రమలను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో సాయి కృష్ణకు సైతం గాయాలైనట్లు తెలుస్తోంది. -
ఉరివేసుకొని వైద్యుడి ఆత్మహత్య
కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్)/మెదక్ జోన్: బీజేపీ నేత కటికె శ్రీనివాస్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పిల్లల వైద్యుడు హైదరాబాద్ కేపీహెచ్‌బీకాలనీలోని హోటల్ గదిలో ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడి నీట్ పరీక్ష కోసం ఇక్కడికి భార్యతో కలసి వచ్చి హోటల్లో దిగారు. ఆదివారం ఉదయం కొడుకును నిజాంపేటలోని పరీక్షా కేంద్రం వద్ద దింపారు. భార్యను తిరిగి మెదక్‌లోని ఆసుపత్రికి పంపి హోటల్ గదికి వచ్చి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు చంద్రశేఖర్ (50) ఆదివారం ఉదయం భార్య డాక్టర్ అనురాధ, కొడుకు సాయివెంకట రామకృష్ణప్పలతో కలసి కేపీహెచ్‌బీ కాలనీలోని సితార గ్రాండ్ హోటల్‌కు వచ్చారు. నిజాంపేట్‌లోని పరీక్ష కేంద్రంలో కొడుకు పరీక్ష రాసి.. తిరిగి వచ్చేవరకు వేచి ఉండటం కోసం ఉదయం 8 గంటలకు హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు. 9 గంటలకు కొడుకును పరీక్షా కేంద్రం వద్ద వదిలిపెట్టారు. అనురాధను మెదక్‌లోని ఆసుపత్రిలో రోగులను చూసేందుకు పంపించి.. 11 గంటల ప్రాంతంలో హోటల్ గదికి తిరిగి వచ్చారు. మధ్యాహ్నం 2.30 గం. సమయంలో అనురాధ.. చంద్రశేఖర్‌కు పలుమార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. దీంతో హోటల్‌కు ఫోన్ చేసి ఆ గదికి వెళ్లి చూడాలని కోరారు. హోటల్ సిబ్బంది వెళ్లి కిటికీ ద్వారా గదిలోకి చూడగా చంద్రశేఖర్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించారు. విషయాన్ని పోలీసులకు తెలప డంతో వారు హోటల్ గది తలుపులు తెరిచి మృతదేహాన్ని కిందకు దించి పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. అనురాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదిలాఉండగా, గత నెల 9న మెదక్ జిల్లా మంగళపర్తి గ్రామ శివారులో కారులో హత్యకు గురైన బీజేపీ నేత కటికె శ్రీనివాస్ హత్యకేసులో చంద్రశేఖర్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యం లోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. అయితే శ్రీనివాస్ హత్యతో డాక్టర్‌కు ఎలాంటి సంబంధం లేదని తూప్రాన్ డీఎస్పీ తెలిపారు. చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకునే ఇక్కడకు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉరివేసుకునేందుకు నైలాన్ తాడు వాడటంతోపాటు హోటల్ గదిలో నిద్రమాత్రలు, సర్జికల్ బ్లేడ్లు లభించడంతో ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఒంటిపై దుస్తులు ఎందుకు లేవనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చి.... చంద్రశేఖర్ స్వస్థలం కర్ణాటక కాగా, ఇరవై ఏళ్ల క్రితం మెదక్ వచ్చి అజంపులలో వైద్యవృత్తిలో స్థిరపడ్డారు. అనురాధ కూడా ప్రముఖ గైనకాలజిస్టు. ఆమె పేరుతోనే అనురాధ నర్సింగ్‌హోం నెలకొల్పారు. ఇద్దరూ మంచి డాక్టర్లుగా పేరు సంపాదించారు. కొంపెల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోనూ భాగస్వామ్యం ఉంది. కాగా, మెదక్ జిల్లాలో ఏ స్థిరాస్తి కొనాలన్నా చంద్రశేఖర్ ముందుండేవారన్న పేరుంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.. చంద్రశేఖర్ మృతిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. గదిలో 140 నుంచి 150 వరకు నిద్ర మాత్రలున్నాయి. మూడు సర్జికల్ బ్లేడ్లు కూడా లభించాయి. ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఈ ఆత్మహత్య వెనుక ఇతర కారణాలున్నాయా? అనేది ఆరా తీస్తున్నాం. వెల్దుర్తి పరిధిలో నమోదైన శ్రీనివాస్ హత్య కేసులో చంద్రశేఖర్‌ను పోలీసులు పిలిచి విచారించారు. – ఆకుల చంద్రశేఖర్, కూకట్పల్లి ఏసీపీ -
‘మెదక్ కారు డెత్’ కేసు: ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వైద్యుడు హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే బెంగళూరుకు చెందిన డా.ఆర్.చంద్రశేఖర్ మెదక్‌లో 20 ఏళ్లుగా అనురాధ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్నాడు. స్థానికంగా నివసిస్తూ వైద్య సేవలు అందిస్తున్నాడు. వైద్యుడిగా మంచి పేరు సంపాదించిన చంద్రశేఖర్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టాడు. ఆగస్టులో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో కారులో హత్యకు గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో చంద్రశేఖర్ ప్రమేయం ఉన్నట్లు శ్రీనివాస్ బంధువులు ఆరోపణలు చేశారు. ఆ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను రిమాండుకు తరలించారు. చదవండి: నీట్ బలిపీఠంపై మరో మరణం.. సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి ఆ కేసుపై భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. నిజాంపేటలో తన కుమారుడికి నీట్ పరీక్ష ఉండడంతో చంద్రశేఖర్ తన భార్యతో కలిసి వచ్చాడు. కుమారుడిని పరీక్షా కేంద్రం వద్ద విడిచిన అనంతరం భార్య తిరిగి మెదక్‌కి వెళ్లింది. చంద్రశేఖర్ కేపీహెచ్‌బీ కాలనీలోని సితార్ గ్రాండ్ హోటల్లో రూమ్ నం.314లో బస చేశాడు. గదిలోకి వెళ్లిన అతడు ఎంతకు బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హోటల్‌కు చేరుకొని గది తలుపులు తెరచిచూడగా చంద్రశేఖర్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదవండి: ప్రతిభకు గుర్తింపు.. విద్యార్థులను ఆకాశాన తిప్పిన టీచర్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ చంద్ర శేఖర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న రూమ్‌లో సర్జికల్ కత్తులు, స్లీపింగ్ పిల్స్ లభించాయని తెలిపారు. ఆయనపై మెదక్ కారు దగ్ధం శ్రీనివాస్ కేసులో ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. -
స్పా ముసుగులో వ్యభిచారం: ఏడుగురి రిమాండ్
కేపీహెచ్‌బీకాలనీ: స్పా ముసుగులో వ్యభిచా రం నిర్వహిస్తున్న నిర్వాహకులను కేపీహెచ్‌బీ పోలీస్‌లు రిమాండ్‌కు తరలించారు. సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నెంబర్–1లోని ఆర్ఏ స్పా అండ్ మసాజ్ పేరుతో వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం కేంద్రంపై దాడిచేసి నిర్వాహకుడు సయ్యద్ అక్బర్ అలీతో ఆయనకు సహకరిస్తున్న మరో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరితో పాటు పట్టుబడిన ముగ్గురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. చదవండి: బంజారాహిల్స్: బ్యూటీ అండ్ స్పా పేరుతో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్ Cyber Crime: అమెరికా వెళ్లాకే పెళ్లి అని, 22 లక్షలు కొట్టేశాడు! -
KPHB Colony: యువతులను బలవంతంగా వ్యభిచారంలోకి..
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: యువతులను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించుతున్న ముఠాలోని ఇద్దరిని కేపీహెచ్‌బీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కేపీహెచ్‌బీ కాలనీ ధర్మారెడ్డి కాలనీఫేజ్ –1లోని ఓ గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ టీంతో కలిసి కేపీహెచ్‌బీ పోలీసులు దాడులు నిర్వహించారు. గాజుల రామారం ప్రాంతానికి చెందిన ఆనంద్ (22), కేపీహెచ్‌బీకాలనీ ధర్మారెడ్డి కాలనీకి చెందిన మేకల కృపాకర్(29)లను అరెస్టు చేశారు. బాధితురాలిని రీహాబిలేషన్ సెంటర్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరికి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. చదవండి: నేరేడ్మెట్: చదువు కోసం వచ్చి.. వ్యభిచారం -
అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం.. నలుగురు అరెస్ట్
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో కేపీహెచ్‌బీ పోలీసులు ఆ ఇంటిపై ఆకస్మికంగా దాడి చేశారు. ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ సమాచారం మేరకు... కేపీహెచ్‌బీకాలనీ మొదటి ఫేజ్‌లోని ఈడబ్ల్యూఎస్ 702 గృహంలో కొన్ని రోజులుగా కొందరు అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిన్నారు. సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడిచేసిన పోలీసులు ముగ్గురు యువకులను, ఒక యువతిని అదుపులోకి తీసుకున్నారు. యువతిని రెస్క్యూ హోమ్‌కు తరలించి యువకులు సురదామసీను, రాయగిరి హరిప్రసాద్, సునీల్ జన్నాలపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వ్యభిచార గృహ నిర్వాహకుడు మధు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.