హైదరాబాద్‪‌లో అతిపెద్ద బొమ్మల కొలువు.. ప్రారంభించిన సితార | Sithara Launch MAX Clothing Brand Sale | Sakshi
Sakshi News home page

Sithara: హైదరాబాద్‪‌లో అతిపెద్ద బొమ్మల కొలువు.. ప్రారంభించిన సితార

Published Sat, Sep 30 2023 7:45 PM | Last Updated on Sun, Oct 1 2023 8:49 AM

Sithara Launch MAX Clothing Brand Sale - Sakshi

ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార సంస్థ హైదరాబాద్‌లో అతిపెద్ద బొమ్మల కొలువు పెట్టింది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు కూతురు సితార దీన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి మహేశ్ భార్య నమ్రత కూడా హాజరైంది. వినియోగదారులని ఆకర్షించడం, లేటెస్ట్ ఫ్యాషన్ల అతి తక్కువ  ధరలకు ఇవ్వడమే లక్ష్యంగా నెల రోజుల పాటు సదరు వ్యాపార సంస్థ ఈ వేడుకని చేస్తోంది. హైదరాబాద్‌‌లోని కేపీహెచ్‌బీలోని ఓ మాల్‌లో 30 x 40 అడుగుల సైజులో ఈ బొమ్మల కొలువుని ఏర్పాటు చేశారు. 

(ఇదీ చదవండి: నో చెప్పానని ఛాన్సులు ఇవ్వడం మానేశారు.. నటి కామెంట్స్!)

ఈ బొమ్మల కొలువుని దసరా పండుగ కలెక్షన్‌తో అలంకరించారు. బహుమతులు ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎన్జీవోల నుంచి పిల్లలు, వృద్ధులకు  దసరా కానుకలను అందజేశారు. అలానే హైదరాబాద్ నగరంలో ఈ వేడుకను ప్రారంభించినందుకు సంతోషిస్తున్నామమని సదరు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ చెప్పుకొచ్చారు. 

(ఇదీ చదవండి: 'స్కంద' కలెక్షన్స్.. సగానికి సగం పడిపోయాయి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement