Max Brand
-
హైదరాబాద్‌లో అతిపెద్ద బొమ్మల కొలువు.. ప్రారంభించిన సితార
ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార సంస్థ హైదరాబాద్‌లో అతిపెద్ద బొమ్మల కొలువు పెట్టింది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు కూతురు సితార దీన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి మహేశ్ భార్య నమ్రత కూడా హాజరైంది. వినియోగదారులని ఆకర్షించడం, లేటెస్ట్ ఫ్యాషన్ల అతి తక్కువ ధరలకు ఇవ్వడమే లక్ష్యంగా నెల రోజుల పాటు సదరు వ్యాపార సంస్థ ఈ వేడుకని చేస్తోంది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలోని ఓ మాల్లో 30 x 40 అడుగుల సైజులో ఈ బొమ్మల కొలువుని ఏర్పాటు చేశారు. (ఇదీ చదవండి: నో చెప్పానని ఛాన్సులు ఇవ్వడం మానేశారు.. నటి కామెంట్స్!) ఈ బొమ్మల కొలువుని దసరా పండుగ కలెక్షన్‌తో అలంకరించారు. బహుమతులు ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎన్జీవోల నుంచి పిల్లలు, వృద్ధులకు దసరా కానుకలను అందజేశారు. అలానే హైదరాబాద్ నగరంలో ఈ వేడుకను ప్రారంభించినందుకు సంతోషిస్తున్నామమని సదరు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: 'స్కంద' కలెక్షన్స్.. సగానికి సగం పడిపోయాయి!) -
బెంగళూరు బాలికకు అందాల టైటిల్
కర్ణాటక,జయనగర: కొద్దిరోజుల క్రితం దేశ ముంబయి నగరంలో జరిగిన మ్యాక్స్ ఎలైట్ లుక్ ఇండియా 2018 ఫ్యాషన్ షోలో నిర్వహించిన ఉత్తమ మోడల్ పోటీల్లో బెంగళూరు అ మ్మాయి విరోనికా రూబి విజేతగా నిలిచి అందాల కిరీటం సాధించింది. ఫ్యాషన్ రంగంలో ప్రతిభావంతులైన యువతీ, యు వకులను గుర్తించడానికి ఆగస్టు నుంచి వివిధ నగ రాల్లో పోటీలు నిర్వహించి ఫైనల్స్‌కు మొత్తం 16 మంది పోటీదారులను ఎంపిక చేశారు. ఈ క్రమంలో సోమవారం ముంబయిలో 16 మంది పోటీదారులకు మొత్తం మూడు రౌండ్ల ఫైనల్ పోటీలు నిర్వహించారు. మూడు రౌండ్లలో విరోనికా రూబి ప్రతిభను చాటుకుని ఉత్తమ మోడల్ టైటిల్‌ను గెల్చుకుంది. పురుషుల విభాగంలో ముంబయి నగరానికి చెందిన ప్రతీక్‌సింగ్ విజేత అయ్యాడు. వచ్చే ఏడాది జనవరిలో కెనరి ఐల్యాండ్‌లో జరిగే అంతర్జాతీయ అందాల పోటీల్లో విరోనికా పాల్గొంటుంది. -
మ్యాక్స్ నుంచి 40 కొత్త మొబైల్స్
సెల్‌ఫోన్ అసెంబ్లింగ్ లైన్ ఏర్పాటు చేస్తున్నాం * కంపెనీ సీఎండీ అజయ్ అగర్వాల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మ్యాక్స్ బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు విక్రయిస్తున్న మ్యాక్స్ మొబిలింక్.. మొబైల్ ఫోన్ల అసెంబ్లింగ్‌లోకి ప్రవేశిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ వద్ద కంపెనీకి యాక్సెసరీస్ తయారీ ప్లాంటు ఉంది. అక్కడే సెల్ఫోన్ల అసెంబ్లింగ్ లైన్‌ను ఏర్పాటు చేస్తోంది. రోజుకు లక్ష ఫోన్ల తయారీ సామర్థ్యంతో ఇది రానుందని మ్యాక్స్ మొబిలింక్ సీఎండీ అజయ్ ఆర్ అగర్వాల్ బుధవారం చెప్పారు. హైదరాబాద్‌లో ఎక్స్‌క్లూజివ్ స్మార్ట్‌కేర్ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2015-16లో నెలకు 15 లక్షల సెల్ఫోన్ల విక్రయంతోపాటు రూ.1,500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. కంపెనీ ప్రస్తుతం సెల్ఫోన్లను చైనాలో తయారు చేయిస్తోంది. ఫ్యాబ్లెట్స్ లోకి.. జూన్‌కల్లా ఫ్యాబ్లెట్‌ను తేనున్నట్లు అజయ్ చెప్పారు. 2015-16లో 40 మోడళ్లను విడుదల చేస్తామని, దేశవ్యాప్తంగా ఈ ఏడాది 100కుపైగా ఎక్స్‌క్లూజివ్ స్మార్ట్‌కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వీటిని కంపెనీ సొంతంగా ఏర్పాటు చేసి నిర్వహిస్తుందన్నారు. ఈ కేంద్రాల్లో సర్వీసింగ్‌తోపాటు మొబైల్స్, యాక్సెసరీస్ విక్రయిస్తారు. భారత్‌లో వివిధ కంపెనీల సెల్ఫోన్లు నెలకు 2.8 కోట్లు అమ్ముడవుతున్నాయి. వీటిలో స్మార్ట్ఫోన్లు 35 శాతం. 2015-16లో ఇదే స్థాయి అమ్మకాలు నమోదవుతాయనేది మ్యాక్స్ అంచనా.