ఫైనల్స్‌లో విరోనికా
కర్ణాటక,జయనగర: కొద్దిరోజుల క్రితం దేశ ముంబయి నగరంలో జరిగిన మ్యాక్స్ ఎలైట్ లుక్ ఇండియా 2018 ఫ్యాషన్ షోలో నిర్వహించిన ఉత్తమ మోడల్ పోటీల్లో బెంగళూరు అ మ్మాయి విరోనికా రూబి విజేతగా నిలిచి అందాల కిరీటం సాధించింది. ఫ్యాషన్ రంగంలో ప్రతిభావంతులైన యువతీ, యు వకులను గుర్తించడానికి ఆగస్టు నుంచి వివిధ నగ రాల్లో పోటీలు నిర్వహించి ఫైనల్స్‌కు మొత్తం 16 మంది పోటీదారులను ఎంపిక చేశారు. ఈ క్రమంలో సోమవారం ముంబయిలో 16 మంది పోటీదారులకు మొత్తం మూడు రౌండ్ల ఫైనల్ పోటీలు నిర్వహించారు. మూడు రౌండ్లలో విరోనికా రూబి ప్రతిభను చాటుకుని ఉత్తమ మోడల్ టైటిల్‌ను గెల్చుకుంది. పురుషుల విభాగంలో ముంబయి నగరానికి చెందిన ప్రతీక్‌సింగ్ విజేత అయ్యాడు. వచ్చే ఏడాది జనవరిలో కెనరి ఐల్యాండ్‌లో జరిగే అంతర్జాతీయ అందాల పోటీల్లో విరోనికా పాల్గొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment