Fashion show
-
హైదరాబాద్ : గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో అందాల భామలు (ఫొటోలు)
-
సుందరీమణుల మనస్సు దోచిన 'పోచంపల్లి చీరలు'..ఫ్యాషన్ షో అదరహో (ఫొటోలు)
-
మిస్ వరల్డ్ : అందాల ముద్దుగుమ్మలు సందడి.. (ఫొటోలు)
-
హైదరాబాద్ : మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధం (ఫొటోలు)
-
ఫ్యాషన్ ఈవెంట్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్.. ఇంతకీ ముద్దుపెట్టిన ఆమె ఎవరు?
బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లామర్ విషయానికొస్తే హీరోయిన్లలో ఓ మెట్టు ముందు వరుసలో ఉంటుంది. గతేడాది దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో కనిపించనుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఇటీవల చెర్రీ బర్త్ డే సందర్భంగా రివీల్ చేశారు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఫ్యాషన్ షో మెరిసింది. తన ర్యాంప్‌వాక్‌తో అభిమానులను కట్టిపడేసింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ ర్యాంప్ వాక్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన బాలీవుడ్ బ్యూటీ ఈ షోకు హాజరైన ఓ పెద్దావిడను ఆలింగనం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో జాన్వీ కపూర్‌కు అప్యాయంగా ముద్దు పెట్టిన ఆమె ఎవరు? అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు.అయియతే అక్కడ ఉన్నది శ్లోకా మెహతా తల్లిదండ్రులు మోనా, రస్సెల్ మెహతా. కాగా.. రస్సెల్ మెహతా భారతదేశంలోని వజ్రాల తయారీదారులలో ఒకటైన రోజీ బ్లూ ఇండియాను కలిగి ఉన్న వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ఆయన కుమార్తె శ్లోకా మెహతా ప్రముఖ బిలియనీర్ ముఖేశ్ అంబానీ, నీతా అంబానీలకు పెద్ద కోడలు కావడంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
రంజాన్ వేళ కశ్మీర్లో అర్ధనగ్న ఫ్యాషన్ షో.. సీఎం ఒమర్‌కు ఝలక్!
శ్రీనగర్: పవిత్ర రంజాన్ మాసం వేళ జమ్ము కశ్మీర్లో అర్ధనగ్న ఫ్యాషన్ షో తీవ్ర దుమారం రేపుతోంది. ఫ్యాషన్ షోలో మహిళలు, పురుషులు పొట్టి పొట్టి దుస్తులతో తెల్లటి మంచుపై ర్యాంప్ వాక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పర్యాటకంపై ప్రచారం పేరుతో ఈ అశ్లీల ప్రదర్శన ఏమిటని విపక్షాలు, ప్రజలు.. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో కశ్మీర్లో నిర్వహించిన ఫ్యాషన్ షో కార్యక్రమంపై సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి ఫ్యాషన్ షో జరగడం పట్ల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ప్రజల కోపాన్ని తాము అర్థం చేసుకున్నట్లు చెప్పారు. తన కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ పరిణామంపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.మరోవైపు.. ఈ ఫ్యాషన్ షో వ్యవహారం అటు జమ్ము కశ్మీర్ అసెంబ్లీని సైతం తాకింది. రంజాన్ వేళ ఇలాంటి కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని ప్రతిపక్ష నేతలు ఒమర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. దీంతో, అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. A fashion show in Gulmarg has ignited controversy in J&K, with critics calling it "obscene" for being held during Ramzan. pic.twitter.com/4P77B8mtbf— Briefly (@Brieflybynewj) March 10, 2025ఇదిలా ఉండగా.. అంతకుముందు ఉత్తర కశ్మీర్ గుల్మార్గ్లోని ప్రముఖ స్కై రిసార్టులో ఆదివారం ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారు రెచ్చగొట్టే తరహాలో దుస్తులు ధరించారని స్థానిక మత పెద్దలతో పాటు హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దారుణంగా ఉందని విమర్శించారు. ఫ్యాషన్ షోకు సంబంధించిన చిత్రాలు, వీడియో తమను దిగ్భ్రాంతికి గురి చేశాయని అన్నారు. సూఫీ, సాధు సంస్కృతి, ప్రజల మతపరమైన దృక్పథానికి పేరుగాంచిన లోయలో దీన్ని ఎలా సహించాలి? ఇందులో పాల్గొన్న వారిని వెంటనే జవాబుదారీగా చేయాలి అని మండిపడ్డారు.#Watch: Noisy scenes in J&K #assembly over #Kathua killings, #Gulmarg fashion show pic.twitter.com/R80BG1YQ7A— Greater Kashmir (@GreaterKashmir) March 10, 2025 -
అమ్మతనం ఆటకు అడ్డుకాలేదు
సంకల్పమే సగం విజయమన్నారు పెద్దలు.. కృషితో ఉన్నత శిఖరాలను చేరుకొన్న కొంత మంది మహిళలను ఆదర్శంగా తీసుకున్న ఆమె లేటు వయస్సులో టెన్నిస్ క్రీడపై మక్కువ పెంచుకొంది. ఇద్దరు పిల్లల తల్లి అన్న విషయాన్ని పక్కన పెట్టి భర్త ప్రోత్సాహంతో కఠోర శ్రమతో అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణించింది. దాంతో సంతృప్తి చెందకుండా నేను సైతం అంటూ ఫౌండేషన్ ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అడివెంలకు చెందిన బోయలపల్లి రేఖ. అర్వపల్లి: హైదరాబాద్‌లో రేఖ ఎంబీఏ చదువుతుండగా కళాశాలలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో పాల్గొంది. అదే సమయంలో ఆల్బమ్ చిత్రీకరణ పనిలో ఉన్న సినీ దర్శకుడు అగస్త్య హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. ఆయన రేఖను ఎంపిక చేశాడు. కానీ, రేఖను ఆల్బమ్‌లో నటింపజేసేందుకు కాకుండా తన జీవిత భాగస్వామిగా ఉండేందుకు ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. వారు పెళ్లి చేసుకుని ల్యాంకోహిల్స్‌లో కాపురం పెట్టారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఫిట్నెస్ను మెరుగుపరుచుకోవడానికి ఇరుగుపొరుగు మహిళలతో కలిసి జిమ్ చేయడంతో పాటు టెన్నిస్ ఆడేవారు. అప్పుడే ఆమె ప్రొఫెషనల్ ప్లేయర్ కావాలని నిర్ణయించుకున్నారు.ముంబైలో కోచింగ్..తన భర్త అగస్త్య.. హిందీ సినిమాల్లో పనిచేసేందుకు ముంబైకి వెళ్లాల్సి వచ్చింది. భర్తతోపాటు రేఖ కూడా తన ఇద్దరు పిల్లలను వెళ్లారు. అప్పుడు రేఖ ముంబైలోని ‘ప్రాక్ టెన్నిస్’ అనే అకాడమీలో చేరి కఠోర సాధన చేశారు. ఉదయం 5 గంటలకే గ్రౌండ్లో ఉండేవారు. 6.30 గంటల వరకు ప్రాక్టీస్ చేసి 7.30 గంటలకు ఇంటికి వెళ్లి పిల్లలను రెడీచేసి స్కూల్‌కు పంపించేవారు. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు అకాడవీుకి వెళ్లి ముందుగా జిమ్ చేసి ఒక గంటపాటు టెన్నిస్ ప్రాక్టీస్ చేసేవారు.సింగిల్స్‌గానే..రేఖ మొదట ఏఐటి(ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్)లో రేఖకు మొదట సింగిల్స్ ఆడే అవకాశం వచ్చింది.. తన వ్యక్తిగత కారణాల వల్ల డబుల్స్ ఆడలేదు. ఐటీఎఫ్ (ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్)లో ఆడారు. ఆ తర్వాత థాయిలాండ్‌తో పాటు వివిధ దేశాల్లో ఆడారు. స్పెయిన్‌కు పయనంజాతీయ స్థాయి పోటీలలో పాల్గొనాలంటే.. ముంబైలో ప్రాక్టీస్ సరిపోదని, విదేశాలకు వెళ్లాలని రేఖకు తన భర్త అగస్త్యతో పాటు పలువువరు సలహా ఇచ్చారు. దాంతో ఆమె యూరప్‌లోని స్పెయిన్‌కు వెళ్లి అక్కడ ‘మున్డో’ స్పోర్ట్స్ అకాడమీలో చేరారు. భర్త, పిల్లలు ముంబైలోనే ఉంచి ఆమె ఒక్కరే స్పెయిన్ వెళ్లి రెండు నెలలపాటు స్పెయిన్‌లో కోచింగ్ తీసుకున్నారు. ఆమెకు ఎవరూ స్పాన్సర్షిప్ లేకపోవడంతో సొంత ఖర్చులతోనే స్పెయిన్ వెళ్లారు.ఆటకు ‘లాక్డౌన్’రేఖ వివిధ దేశాల్లో ఆడుతూ బిజీ అవుతున్న సమయంలో వచ్చిన లాక్‌డౌన్‌తో ఆటకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. లాక్డౌన్ సమయంలో ఆమె హైదరాబాద్‌లోని ల్యాంకోహిల్స్‌లో ఉన్నారు. తాను ఉంటున్న అపార్ట్మెంట్ల పక్కన వివిధ రాష్ట్రాలకు చెందిన వేల మంది తిండికి ఇబ్బంది పడడం రేఖ చూసి చలించిపోయారు. ఆ కూలీలకు ఆమె స్వయంగా అన్నం వండిపెట్టారు. అప్పుడే తనకు సేవ చేయాలనే ఆలోచన వచ్చి ‘రేఖా చారిటబుల్ ఫౌండేషన్’ ఏర్పాటు చేశారు. తన ఫౌండేషన్ నుంచి కరోనా సమయంలో రోజుకు 2వేల మందికి భోజనం వండిపెట్టారు. వివిధ రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు పంపారు. ఆ సమయంలో రేఖకు సేవా రంగంలో మంచి గుర్తింపు వచ్చింది. ఆయా రాష్ట్రాల సీఎంల నుంచి అభినందనలు అందుకున్నారు. అంతేకాకుండా ‘రేఖ స్పోర్ట్స్ ఫౌండేషన్’ను కూడా స్థాపించి క్రీడాకారులను ఆమె ప్రోత్సహిస్తున్నారు.సొంత నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలురేఖ తన సొంత నియోజకవర్గమైన తుంగతుర్తి నియోజకవర్గంలో సేవా కార్యక్రమంలో ముమ్మరం చేశారు. జాజిరెడ్డిగూడెం మండలంలో ఈ విద్యా సంవత్సరం 30 ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు నోటు పుస్తకాల పంపిణీ చేశారు. క్రీడా దుస్తులు ఇచ్చారు. ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. క్రీడా సామగ్రి అందజేశారు. తాను చదువుకున్న అడివెంల గ్రామ ప్రాథమిక పాఠశాలకు రూ.3లక్షలతో మరమ్మతులు చేయించి క్రీడా సామగ్రి, ఆరో ప్లాంట్ పెట్టించారు. తాను చేసే సేవ రాజకీయాల కోసం కాదని, కేవలం సేవా దృక్పథంతోనేనని రేఖ చెబుతున్నారు. -
సబ్యసాచి ఫ్యాషన్ షోలో మెరిసిన సుకుమార్ భార్య తబిత (పోటోలు)
-
జూబ్లీహిల్స్ క్లబ్లో ఫ్యాషన్ షో..ఆకట్టుకున్న మోడల్స్ ర్యాంప్ వాక్ (ఫోటోలు)
-
ఉత్సాహంగా ఎఫ్–టామ్ ట్రెడిషనల్ ఫ్యాషన్ షో..
ముంబై సెంట్రల్: ఎఫ్–టామ్ ఆధ్వర్యంలో బుధవారం థాణేలో తెలుగువారి కోసం ఫ్యాషన్ షోను నిర్వహించారు. ఎఫ్–టామ్ ఫ్యాషన్ విభాగం బాధ్యురాలు మచ్చ అంజలి నేతృత్వంలో ఠాణేలోని కాశీనాథ్ ఘాణేకర్ సభాప్రాంగణంలో నిర్వహించిన తెలుగువారి ‘సాంప్రదాయ దుస్తుల ఫ్యాషన్ షో, అవార్డు ప్రదానోత్సవ’కార్యక్రమంలో సాంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా నటి మీనాక్షీ గడేకర్, నగల వ్యాపారి సుహాస్ మాలవీయ, టీవీ నటీమణి సష్టి సింగ్, నటుడు సిద్ధాంత్ దాండే, సెలబ్రిటీ ఆర్గనైజర్ ప్రమోద్ సింగ్, మోడల్ వల్లకాటి జ్యోతి, మేకప్ ఆర్టిస్ట్ మానసి తదితరులు హాజరయ్యారు. ఫ్యాషన్ దివా, ‘బెస్ట్’విజేతల ఎంపిక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోడి సునీత, వేముల వాణికి బెస్ట్ స్మైల్, ఇవటూరి కిరణ్మయికి బెస్ట్ వాక్, మామిడాల హరిత రావుకు బెస్ట్ కాని్ఫడెన్స్, నారయ్య నీరజకు బెస్ట్ ఆటిట్యూడ్, జోషి ప్రియాంకకు బెస్ట్ బ్యూటిఫుల్, అనుపమకు బెస్ట్ గ్రేస్‌ఫుల్, కూన లక్ష్మీప్రసన్నకు బెస్ట్ అటైర్, పారసు నివేదితకు బెస్ట్ ఫోజ్, పోలు నూతన్‌కు బెస్ట్ ఐస్, సూర భాగ్యశ్రీకి బెస్ట్ డ్యాన్స్ స్టెప్స్ అవార్డులు లభించాయి. ఉత్తమ ఫ్యాషన్ దివా అవార్డుల ప్రథమ విజేతగా ఉబాలే సరోజ్, రెండవ విజేతగా జోషి ప్రియాంక, మూడవ విజేతగా కూన లక్ష్మీప్రసన్న ఎన్నికయ్యారు. అన్నిరంగాల్లో ‘తెలుగు’ముద్ర అవసరం: గంజి జగన్‌బాబు ‘‘వేగంగా మారుతున్న ప్రపంచంలో తెలుగు యువత కూడా అన్ని రంగాల్లో ముందంజ వేయాలనీ, సాహిత్య, సాంస్కృతిక రంగాలతో పాటు ఫ్యాషన్ రంగంలో కూడా తమదైన ముద్రను ఏర్పాటు చేసుకోవాలనీ, అప్పుడే తెలుగు అనే భావన, గర్వం అందరిలో కలుగుతుందని’ఎఫ్–టామ్ అధ్యక్షుడు గంజి జగన్‌బాబు అభిప్రాయపడ్డారు. ముంబైలో తెలుగువారి కోసం ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఫ్యాషన్ రంగానికి చెందిన పూర్తిస్థాయి కార్యక్రమంగా ఫ్యాషన్ షో నిలిచిందని అన్నారు -
ధర్మాటిక్ ఫ్యాషన్ ఫండ్ ఈవెంట్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
విజయవాడ : సిద్ధార్థ ఫెట్ –2024.. ఫ్యాషన్ షో అదుర్స్ (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఎత్నిక్ ఫ్యాషన్ షోలో మెరిసిన మోడల్స్ (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఆధ్వరియా సిల్క్స్ ఫ్యాషన్ షో అదరహో (ఫొటోలు)
-
రూ.1.43 కోట్ల డ్రెస్‌లో అదరగొట్టిన వ్యాపారవేత్త, మోడల్ మోనా పటేల్
ప్రముఖ మోడల్, వ్యాపారవేత్త మోనా పటేల్ మరోసారి తన ఫ్యాషన్ లుక్‌తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. బ్రిటీష్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024కి హాజరైన మోలా పటేల్ వింటేజ్ సిల్వర్ కలర్ కార్సెట్‌ను ధరించింది. అంతేకాదు ఈ డ్రెస్ ధర నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచింది.బ్రిటీష్ ఫ్యాషన్ అవార్డ్స్‌లో రెడ్ కార్పెట్‌పై పోజులిచ్చింది మోనా పటేల్. ఈ సందర్బంగా తనదైన ఐకానిక్ స్టైల్లో, వింటేజ్ స్కర్ట్‌లో దర్శనమివ్వడం విశేషంగా నిలిచింది. క్రిస్టియన్ లాక్రోయిక్స్ హాట్ కోచర్ కలెక్షన్లోనిది ఈ డ్రెస్. దీన్ని వేలంలో సుమారు రూ. 1.43కోట్లు (169,828.65డాలర్లు) మోనాగానీ, ఆమె స్టైలిస్ట్ గానీ కార్సెట్‌ను కొనుగోలు చేసి ఉంటారని అంచనా. దీన్ని చేతితో దయారు చేశారు. దీనికి చక్కని ఎంబ్రాయిడరీని కూడా జతచేశారు. వేలకొద్దీ చేతితో కుట్టిన స్ఫటికాలు, భుజంపై ఉన్న సున్నితమైన సిల్క్ ఆర్గాన్జా పూసల సీతాకోకచిలుక, స్వరోవ్స్కీ పూసలు, స్ఫటికాలుతో తీర్చి దిద్దారు.మోనా 3డీ సీతాకోక చిలుకలను కైనెటిక్ మోషన్ ఆర్టిస్ట్ కేసీ కుర్రాన్ సహాయంతో స్వయంగా డిజైన్ చేసిందట. ఈ ఏడాది ప్రారంభంలో మెట్ గాలాలో తొలిసారి పాల్గొన్న మోనా పటేల్ ఐరిస్ వాన్ హెర్పెన్ కోచర్ బటర్ ఫ్లై మోడల్ డ్రెస్‌లో అందర్నీ కట్టిపడేసిన సంగతి తెలిసిందే. -
ఫ్యాషన్ షోలో మురిపించిన ముద్దుగుమ్మలు! (ఫొటోలు)
-
విజయవాడ : అదరహో.. మిస్ బ్లాక్ షో, ర్యాంప్ వాక్‌తో సందడి (ఫొటోలు)
-
ఫెమినా మిస్ ఇండియా 2024 విజేత నికితా పోర్వాల్ (ఫొటోలు)
-
పెళ్లికొడుకు గెటప్‌లో రణబీర్ కపూర్ సందడి (ఫొటోలు)
-
Fashion: ఫ్యాషన్ ఇలాకా.. ట్రిపుల్ ధమాకా..
సాక్షి, సిటీబ్యూరో: ఒకేరోజున ముగ్గురు ఆల్ ఇండియా టాప్ క్లాస్ ఫ్యాషన్ డిజైనర్లు తమ డిజైన్లతో నగరాన్ని పలకరించారు. తమదైన శైలికి చెందిన అంతర్జాతీయ దుస్తుల శ్రేణిని నగరవాసులకు అందుబాటులోకి తెచ్చారు. దేశంలోనే అగ్రగామి డిజైనర్లుగా పేరొందిన ఢిల్లీకి చెందిన అబ్రహమ్, ఠాకూర్ ద్వయంతో పాటు రాహుల్ మిశ్రాలు హాజరయ్యారు.అదే విధంగా ప్రముఖ డిజైనర్ దుస్తుల బ్రాండ్ సత్యపాల్.. బంజారాహిల్స్ రోడ్ నెం1లో ఉన్న సత్వా సిగ్నేచర్ టవర్‌లో వరుసగా తమ స్టోర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఒకేరోజున వాటిని ప్రారంభించారు. సిటీ ఫ్యాషన్ సర్కిల్లో సందడి నింపిన ఈ అత్యాధునిక దుస్తుల స్టోర్ల ప్రారం¿ోత్సవం, లాంచింగ్ పారీ్టలకు సినీనటులు తమన్నా, నిహారికా, శోభితా దూళిపాళ్ల, సిరత్ కపూర్‌తో పాటు నగరంలోని పలువురు సెలబ్రిటీలు హాజరై డిజైనర్లకు అభినంధనలు తెలిపారు. ఈ సందర్భంగా హాజరైన అతిథులతో డిజైనర్లు తమ కలెక్షన్స్ గురించిన విశేషాలను పంచుకున్నారు. -
తారల తలుక్కు..మోడల్స్ ర్యాంప్ వాక్ (ఫొటోలు)
-
Hyderabad: రాకింగ్ ర్యాంప్ వాక్..! టాప్ మోడల్స్.. క్యాట్ వాక్!!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పార్క్ హోటల్ వేదికగా జరిగిన బిగ్గెస్ట్ ఫ్యాషన్ షోలో టాప్ మోడల్స్ క్యాట్ వాక్ తో అలరించారు. ఇండియన్, వెస్ట్రన్ లుక్స్‌తో మోడల్స్ ర్యాంప్ పై సోమవారం సందడి చేశారు.లండన్‌లోని ప్రముఖ రేవన్స్ బోర్న్ యూనివర్సిటీ, సవరియా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంయుక్త భాగస్వామ్యంతో పలు కొత్త కోర్సులను లాంచ్ చేశారు. ఇందులో భాగంగా ఎంబీఏ ఫ్యాషన్ మేనేజ్మెంట్, బీకాం, బీఏ చేసిన వారికీ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, లగ్జరీ మేనేజ్మెంట్ వంటి కోర్సులను లాంచ్ చేశారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డెలిగేట్ మీట్ అండ్ గ్రీట్ ఫ్యాషన్ షో అలరించింది. ముఖ్య అతిథిగా రావెన్స్బోర్న్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆండీ కుక్, డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సైమన్ రాబర్ట్‌షా, యూనివర్సిటీ ప్రతినిధులు మోహిత్, గంభీర్ తదితర ప్రతినిధులు, ఫ్యాషన్ ఔత్సాహికులు పాల్గొన్నారు. -
చేనేత దినోత్సవం.. విజయవాడ ఫ్యాషన్ షోలో మెరిసిన అమ్మాయిలు (ఫొటోలు)
-
ఫ్యాషన్ షోలో మెరిసిన ముద్దుగుమ్మ వామికా గబ్బి.. ఇండియా కౌచర్ వీక్ ఫ్యాషన్ షో (ఫొటోలు)
-
మాదాపూర్ : సినీ తారల ఫ్యాషన్ షో అదరహో (ఫొటోలు)
-
దేశాధినేతల ర్యాంప్ వాక్! వైరల్ వీడియో
ఎప్పుడూ బిజీగా ఉండే దేశాధినేతలు చిత్ర విచిత్రమైన దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుంది? వారు ర్యాంప్ వాక్ చేయడమేంటి అనుకుంటున్నారా? ఇదంతా నిజంగా కాదు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేసిన చమత్కారం ఇది.భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌లతో సహా పలు దేశాధినేతలు భవిష్యత్ దుస్తులలో ర్యాంప్‌పై నడుస్తున్నట్లు ఏఐ రూపొందించిన వీడియోను చూపిస్తూ టెక్ బిలియనీర్ ఇలాన్ మస్క్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "ఇది ఏఐ ఫ్యాషన్ షో సమయం" అంటూ ఈ వీడియోకు మస్క్ క్యాప్షన్ ఇచ్చారు. ఇది అత్యధికంగా 35 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సంపాదించింది.నిమిషానికి పైగా నిడివిగల ఈ వీడియోలో ప్రధాని మోదీ, కమలా హారిస్, జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా, పోప్ ఫ్రాన్సిస్, టిమ్ కుక్, ఉత్తర కొరియాకు చెందిన కిమ్ జోంగ్ ఉన్, నాన్సీ పెలోసి, జి జిన్‌పింగ్, జస్టిన్ ట్రూడో, బిల్, హిల్లరీ క్లింటన్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, బెర్నీ సాండర్స్, బిల్ గేట్స్, ఇలాన్ మస్క్ ర్యాంప్ మీద నడుస్తున్నట్లు కనిపిస్తారు. పనిలో పనిగా మైక్రోసాఫ్ట్ అంతరాయాన్ని కూడా ఇందులో చమత్కారంగా ప్రస్తావించారు.High time for an AI fashion show pic.twitter.com/ra6cHQ4AAu— Elon Musk (@elonmusk) July 22, 2024 -
తిరుపతి : అదిరే డ్రస్‌లతో అదరగొట్టిన విద్యార్థినులు (ఫోటోలు)
-
విజయవాడ : అదరహో అనిపించిన ఫ్యాషన్ షో (ఫొటోలు)
-
విజయవాడ : ఫ్యాషన్ షోలో మెరిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
-
ప్రియాంక చోప్రా న్యూ లుక్! ఏకంగా రూ. 300 కోట్ల డైమండ్ నెక్లెస్..
బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. పలు ఫ్యాషన్ వేడుకలకు తన డిజైనర్‌వేర్ డ్రెస్‌లతో మిస్మరైజ్ చేస్తుంది. అలానే రోమ్‌లో జరిగిన బల్గారీ ఈవెంట్‌కు హాజరైన ప్రియాంక తన న్యూ లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. సరికొత్త హెయిర్ స్టైల్‌తో ప్రియాంక ప్రేక్షకులను అలరించింది. పైగా ఆ హెయిర్ స్టైల్‌కి తగ్గట్టు నలుపు, తెలపు కాంబినేషన్ గౌను, అందుకు తగ్గట్టు డైమండ్ నెక్లస్‌ని ధరించి అత్యద్భుతంగా కనిపించింది. నెక్కు కోట్లు ఖరీదు చేసే 200 క్యారెట డెమండ్ నెక్లెస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బల్గేరి అటెర్నె బ్రాండ్‌కి చెందిన ఈ నెక్లెస్ అత్యంత లగ్జరియస్ జ్యువెలరీ. ఈ మేరకు ఈ విషయాన్ని బల్గారీ అధికారిక వెబ్సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే ఫ్యాషన్, పాప్ సంస్కృతిని ఫాలో అయ్యే ఇన్‌స్టాగ్రామర్ డైట్ సబ్యా కూడా ఈ నెక్లెస్ మాన్యుఫాక్చరింగ్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ నెక్లెస్ రూపొందిచడానికి దాదాపు 2,800 గంటలు శ్రమతో కూడిన నైపుణ్యం అవసమరమని, ఇది చాలా కఠినమైన వజ్రమని తెలిపారు. దీన్ని 140 క్యారెట్ల ఏడు పియర్ ఆకారపు చుక్కలుగా రూపొందించడానికే ఇంత సమయం తీసుకుంటుందని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ బ్రాండ్ చరిత్రలో ఇది అత్యద్భుతమైన నెక్లెస్ అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ వేడుకలో ప్రియాంక ధరించిన కళ్లమిరుమిట్లు గొలిపే డైమండ్ నెక్లెస్ తోపాటు ఆమె కొత్త హెయిర్ స్టైల్ హైలెట్‌గా నిలిచింది. ఈ నెక్లెస్ ధర ఏకంగా రూ. 300 కోట్ల పైనే ఉంటుందని సమాచారం.ఇక కనుబొమ్మలకు మెరిసే గోల్డెన్ ఐ షాడో, కనురెప్పలపై మస్కరా, బెర్రీ-టోన్డ్ లిప్ షేడ్, చెంపలపై గులాబీ రంగు బ్లష్ వంటివి హైలెట్‌గా నిలిచాయి. View this post on Instagram A post shared by Patty Cardona (@jerryxmimi) (చదవండి: కేన్స్ రెడ్ కార్పెట్‌పై సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమన్న నటి!) -
చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్‌వేర్ ఫ్యాషన్ షో!
సౌదీ అంటూ ఉలా ఉంటుందో మనకు తెలుసు. ఇప్పుడు అందరూ అభిప్రాయం మార్చుకునేలా సరికొత్త సంస్కరణలకు. శ్రీకారం చుడుతోంది. అసలు సౌదీలో మహిళలు మొత్తం శరీరం అంతా కంపి ఉంచేలా బట్టలు ధరించాలి. అలాంటి సంప్రదాయవాద దేశంలో తొలిసారి స్విమ్‌సూట్ ఫ్యాషన్ షోని భారీ ఎత్తున నిర్వహించింది. ఈ నిర్ణయం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొనవచ్చు. ఈ స్విమ్‌సూట్ ఫ్యాషన్ గత శుక్రవారమే సెయింట్ రెజిస్ రెడ్ సీ రిసార్ట్‌లోని రెడ్సీ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా జరిగింది. ఈ షోలో మెరాకో డిజైనర్ యాస్మినా క్వాన్జల్ వన్ పీస్ ఎరుపు రంగు స్విమ్‌సూట్, నీలరంగులో స్వీమ్సూట్లలో సందడి చేసింది. ఈ షోలో పాల్గొన్న చాలా మోడల్‌లు భూజాలు బహిర్గతమయ్యేలా స్విమ్‌సూట్ ధరించారు. ఈ క్రమంలో డిజైనర్ క్వాన్జల్ మీడియాతో మాట్లాడుతూ.."ఈ దేశం చాలా సంప్రదాయవాదంగా ఉంది. కానీ తాము అరబ్ ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించే సొగసైన స్విమ్‌సూట్‌లో కనిపించేందుకు యత్నం చేస్తున్నాం. ఇది తమ గౌరవంగా భావిస్తున్నాం." అని తెలిపింది క్వాన్జల్. అంతేగాదు నిజానికి సౌదీ అరేబియాలో స్విమ్‌సూట్ ఫ్యాషన్‌షో అనేది చరిత్రాత్మకం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి షో నిర్వహించడం సౌదీలో ఇదే తొలిసారి. Red Sea Fashion Week లో భాగంగా సౌదీ అరేబియాలో ఓ రిసార్ట్‌లో ఈ షో నిర్వహించారు. Red Sea Globalలో భాగంగా ఏర్పాటు చేసిన రెడ్ సీ రిసార్ట్‌లో ఈ షో జరగడం మరింత ఆసక్తికరంగా మారింది. విజన్ 2030లో భాగంగా ఈ రిసార్ట్ని నిర్మించింది సౌదీ ప్రభుత్వం. అందరి దృష్టి పడేలా ఇక్కడే కావాలని ఈవెంట్స్ చేస్తోంది.ఎన్నో సంస్కరణలు..ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ హయాంలో ఇలాంటి సంస్కరణలు ఎన్నో జరుగుతున్నాయి. 2017లో అధికారంలోకి వచ్చిన సల్మాన్ అప్పటి నుంచి సామాజిక సంస్కరణలను కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు సౌదీలో ప్రార్థన చేయకపోతే పోలీసులు వెంటపడి మరీ కొట్టేవాళ్లు. మాల్స్‌లో ఉన్నా సరే బయటకు ప్రేయర్ రూమ్‌కి తీసుకెళ్లి మరీ బలంవంతంగా ప్రార్థన చేయించే వాళ్లు. ఈ నిబంధనపై చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. సల్మాన్ వచ్చిన తర్వాత నుంచి ఈ నిర్బంధపు ప్రార్థనల్ని పక్కన పెట్టేశారు. అంతే కాదు సినిమా హాల్స్‌ని మళ్లీ తెరిపించారు. మ్యూజిక్ ఫెస్టివల్స్‌లో పురుషులు, మహిళలు కలిసే కూర్చునే విధంగా నిబంధనలు సవరించారు. టూరిజం సెక్టార్లో రాణిస్తున్న సౌదీ అరేబియా ఫ్యాషన్ రంగంలోనూ అదే స్థాయిలో సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు మహమ్మద్ బిన్ సల్మాన్.2022 లెక్కల ప్రకారం సౌదీలో ఫ్యాషన్ ఇండస్ట్రీ విలువ 12.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ రంగంలో దాదాపు 2 లక్షల 30 వేల మంది ఉపాధి పొందుతున్నారని అంచనా. ఎవరైనా ఏమైనా ప్రశ్నించినా సరే..స్విమ్‌సూట్ ఫ్యాషన్ షో సౌదీలో ఎందుకు పెట్టకూడదు అని సల్మాన్ఎ దురు ప్రశ్న వేస్తున్నారు. ఈ ఏడాది జరగనున్న మిస్ యూనివర్స్ పోటీలో సౌదీ అరేబియాకి చెందిన రూమీ అల్ఖాతానీ పాల్గొననుంది. ఈ పోటీలో సౌదీ పాల్గొనడం ఇదే తొలిసారి.SAUDI ARABIA HOSTS A SWIMSUIT FASHION SHOW FOR THE FIRST TIME pic.twitter.com/eOcLRnv2K9— Sulaiman Ahmed (@ShaykhSulaiman) May 18, 2024 (చదవండి: బరువు తగ్గాలని రైస్‌కి దూరంగా ఉంటున్నారా? ఫిట్నెస్ కోచ్ ఏమంటున్నారంటే..) -
జూబ్లీహిల్స్ : ఇండో కాటన్ ఫ్యాషన్‌షోలో అదరగొట్టిన మోడల్స్ (ఫొటోలు)
-
బ్రైడల్ ఫ్యాషన్ షో.. ర్యాంప్ వాక్ తో అదరగొట్టిన మోడళ్లు (ఫొటోలు)
-
విజయవాడ : తెలుగమ్మాయి ఫ్యాషన్ షో (ఫొటోలు)
-
విజయవాడ : హైలైఫ్ ఎగ్జిబిషన్ ఈవెంట్లో మెరిసిన మోడల్స్ (ఫొటోలు)
-
నేతన్నకు భరోసా వస్త్ర ప్రదర్శనలతో మార్కెటింగ్‌కు ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: చేనేత వస్త్రాలకు ప్రచారం, విక్రయాలను విస్తృతం చేసేలా ఎగ్జిబిషన్(వస్త్ర ప్రదర్శన)లు దోహదం చేస్తాయనడంలో ఏమాత్రం సందేహంలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు మార్కెటింగ్‌కు అవసరమైన సహకారం అందిస్తోంది. సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే చేనేత వస్త్రాలను అపురూప నైపుణ్యం, సృజనాత్మకతతో అందించే నేతన్నలకు భరోసాగా నిలవడంలో ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. గత నాలుగేళ్లలో 23 భారీ చేనేత వస్త్ర ప్రదర్శనలు(ఎగ్జిబిషన్) నిర్వహించగా, 392 చేనేత సహకార సంఘాలు పాల్గొన్నాయి. మొత్తం ఎగ్జిబిషన్లలో రూ. 21.62 కోట్లు విక్రయాలు జరిగేలా రాష్ట్ర చేనేత జౌళి శాఖ ప్రత్యేక చొరవ తీసుకోవడం విశేషం. కోవిడ్ సమయంలో చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్‌కు కొంత ఇబ్బంది వచ్చినప్పటికీ మిగిలిన సమయంలో వా టిని విరివిగా నిర్వహించి చేనేత సహకార సంఘా లకు తమ ఉత్పత్తుల అమ్మకాలకు ఊతమిచ్చింది. ప్రతి యేటా అంతర్జాతీయ చేనేత దినోత్సవం రోజైన ఆగస్టు 7 నుంచి వారం పాటు రాష్ట్ర వ్యాప్తంగా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోనే కాక, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యా తులు గడించిన చేనేత ఉత్పత్తి సంఘాలు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఇదే సందర్భంలో ఫ్యాషన్ షో నిర్వహించి చేనేత వస్త్రాలు ప్రదర్శించి వస్త్ర ప్రేమికులను ఆకట్టుకుంటున్నారు. వారంలో ఒక రోజైన చేనేత వస్త్రాలను ధరించాలని అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం సూచించింది. దేశంలో వ్యవ సాయ రంగం తర్వాత అత్యధిక జనాభాకు ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆన్లైన్ మార్కెటింగ్, ఆప్కో షోరూమ్‌లతో పాటు వస్త్ర ప్రదర్శనలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. -
ఐఎఫ్ఎస్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్‌షోలో అదరగొట్టిన మోడల్స్, విద్యార్థులు (ఫోటోలు)
-
ర్యాంప్ వాక్ చేస్తుండగా ఈడ్చిపడేసిన సిబ్బంది..ఇంతకీ ఏం జరిగిందంటే..
మోడల్స్ వయ్యారాలు, కాస్ట్యూమ్స్‌కి హద్దేలేదు. మారుతున్న ట్రెండ్‌కి తగ్గట్లు చిత్రవిచిత్ర ఫ్యాషన్‌తో కనువిందు చేస్తుంటారు. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ మోడల్ స్టైల్‌గా ర్యాంప్ వాక్ చేస్తుంటే, సిబ్బంది అతన్ని పక్కకి ఈడ్చిపడేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ అవుతుంది. ఇంతకీ అతను ఏం చేశాడు? ర్యాంప్ వాక్ నుంచి ఎందుకు నెట్టేశారన్నది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ట్రెండ్ మారేకొద్ది రకరకాల ఫ్యాషన్ స్టైల్స్ పరాకాష్టకు చేరుతున్నాయి. టాలెంట్ ఎవడి సొత్తూ కాదు అనేది ఎంత నిజమో ఫ్యాషన్ కూడా ఎవడి సొంతం కాదు అన్నట్లు ఉన్నారు చాలామంది. కాస్త వెరైటీగా, చిత్ర విచిత్రమైన డ్రెస్‌లో కనిపిస్తే చాలు అదే ఫ్యాషన్ అనుకుంటున్నారు. చిరిగిన బట్టలు, పగిలిన గ్లాస్ ముక్కలు, ప్లాస్టిక్ కవర్స్.. ఇలా ఒకటేమిటి ఫ్యాషన్‌కు కాదేదీ అనర్హం అన్నట్లు రకరకాల కాస్టమ్స్తో దర్శనం ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక మోడల్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకోండి. హెయిర్ స్టైల్, జ్యువెలరీ, బ్యాగ్స్, చెప్పులు, బట్టలు, ఆఖరికి లిప్‌స్టిక్ కలర్స్‌లో కూడా వెరైటీ కోరుకుంటూ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు. ఫ్యాషన్ సెన్స్‌తో నిజంగానే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తారు చాలామంది. మరికొంత మంది మాత్రం తమ స్టైల్‌కు ఫ్యాషన్ అన్న పేరు అంటించేసుకొని వెరైటీ కాస్టూమ్స్‌తో జనాలను కన్ఫ్యూజ్ చేసేస్తుంటారు. తాజాగా న్యూయార్క్ ఫ్యాషన్ షోలో ఇలాంటి వింత ఘటన చోటు చేసుకుంది. అచ్చం మోడల్లా రెడీ అయి వచ్చిన ఓ యువకుడు ర్యాంప్‌పైకి వచ్చి మోడల్లా వాక్ చేశాడు. పాలిథీన్ కవర్నే కాస్టూమ్గా మార్చుకొని వెరైటీ లుక్స్‌తో దర్శనం ఇచ్చాడు. స్టైల్‌గా వాక్ చేస్తూ మోడల్‌లానే బిల్డప్ ఇచ్చాడు. ఇతను నిజంగానే మోడలా? ఈ బట్టలేంట్రా బాబు అని జనాలు ఆలోచించేలోపు నిర్వాహకులు అప్రమత్తమై డమ్మీ మోడల్‌ను పక్కకు ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కవర్‌తో బాడీ కప్పీసి ఇదేం ఫ్యాషన్‌రా బాబు అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, అతని స్టైల్ రియల్ మోడల్‌లానే ఉంది. ఒక్క ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది అంటూ మరికొందరు ఆ యువకుడికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. Given what passes for fashion these days, I wouldn’t be surprised if that was a real outfit. pic.twitter.com/s4y1fttuwc — Censored Men (@CensoredMen) September 11, 2023 -
విజయవాడ : చీరకట్టు .. అదిరేట్టు ..(ఫోటోలు)
-
తారల మెరుపులతో మనీష్ మల్హోత్రా ఈవెంట్ (ఫొటోలు)
-
రాంప్ వాక్ అదరగొట్టిన లూపస్ పేషెంట్స్
-
మోడల్ ప్రాణం తీసిన ర్యాంప్ వాక్
నోయిడా: నోయిడా ఫిలిం సిటీలోని లక్ష్మీ స్టూడియోలో దారుణం చోటుచేసుకుంది. అందాల పోటీల్లో భాగంగా ఓ మోడల్ రాంప్ వాక్ చేస్తుండగా ఇనుప స్తంభం మీద పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువకుడు గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సంఘటన గురించి తెలుసుకున్న నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందాలపోటీ జరుగుతున్న సమయంలో అందరి దృష్టి రాంప్ మీద తళుకులీనుతున్న అందమైన మోడల్స్ మీదే ఉంది. వారంతా ఫ్యాషన్ షోలో లీనమైపోయారు. వరుసక్రమంలో రాంప్ వాక్ చేయడానికి వచ్చిన మోడల్ వంశిక చోప్రా యధాప్రకారం రాంప్ మీద నడక మొదలుపెట్టింది. అంతలోనే లైట్ల కోసం పైన అమర్చిన ఇనుప స్తంభం ఉన్నట్టుండి కూలింది. అది నేరుగా వంశిక మీద పడటంతో ఆమెకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయారు. కొంచెం దూరంలో ఉన్న బాబీ రాజ్ అనే మరో వ్యక్తికి కూడా తీవ్రంగా గాయాలవడంతో వైద్యం నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేసు విచారణ నేపధ్యంలో అడిషనల్ డిసిపి మోహన్ అశ్వతి మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో మృతి చెందిన మోడల్ వంశిక చోప్రాగా గుర్తించాము. ఆమె మరణం గురించి తన కుటుంబ సభ్యులకు తెలియజేశాము. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పంపించాము. ఈవెంట్ నిర్వహిస్తున్న వ్యక్తి తోపాటు లైటింగ్ అమర్చిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: మన్మోహన్ సింగ్ ఒక పిరికిపంద.. అమిత్ షా -
విజయవాడ: ఫ్యాషన్ షోలో తళుక్కుమన్న మోడల్స్ (ఫొటోలు)
-
విజయవాడ: ఫ్యాషన్ షోలో తళుక్కుమన్న మోడల్స్ (ఫొటోలు)
విజయవాడ: ఫ్యాషన్ షోలో తళుక్కుమన్న మోడల్స్ (ఫొటోలు) -
క్రిస్టియన్ డయర్ ఫాల్ ఫ్యాషన్ షో.. తళుక్కుమన్న అందాల భామలు (ఫొటోలు)
-
న్యూజెర్సీలో ఆపి కన్వెన్షన్ లాంచ్ రెడ్ కార్పెట్ డిన్నర్ గాలా
అగ్రరాజ్యం అమెరికాలో ఎంతో సేవ చేస్తున్న అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ -ఆపి 41వ వార్షిక కన్వెన్షన్ ముహూర్తం ఖరారైంది. ఫిలడెల్ఫియాలో ఈ ఏడాది జులై 6 నుంచి 9వ తేదీ వరకు జరగనుంది. ఈ సందర్భంగా న్యూజెర్సీలో ఆపి కన్వెన్షన్ లాంచ్ రెడ్ కార్పెట్ డిన్నర్ గాలా జరిగింది. న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్, బాలీవుడ్ ఐకాన్ భాగ్యశ్రీతో పాటు ఆపి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో, లైవ్ మ్యూజిక్ ఆహుతులను ఆకట్టుకుంది. ఫిలడెల్ఫియాలో జరిగే ఆపి 41వ కన్వెన్షన్‌కు అందరూ విచ్చేసి, విజయవంతం చేయాలని న్యూజెర్సీ స్టేట్ ఆపి ఫ్రెసిడెంట్ డాక్టర్ ప్రదీప్ షా కోరారు. కన్వెన్షన్ అద్భుతంగా నిర్వహించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆపి ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
హైదరాబాద్.. ఫ్యాషన్‌షో అదుర్స్
హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీహబ్‌లో గురువారం నిర్వహించిన ఫ్యాషన్‌షో అదుర్స్ అనిపించింది. త్రీసీ (సృష్టించు, సహకరించు, జయించు) ఫెస్టివల్లో భాగంగా దీనిని తలపెట్టారు. ఈ సందర్భంగా 8 మంది మోడల్స్ ర్యాంప్‌పై హొయలొలికించారు. ప్రెట్ అండ్ ఇండో వెస్ట్రన్, ఎత్నిక్ బ్రైడల్ కలెక్షన్లు ఎస్జీ ఫ్యాషన్‌కి చెందిన శ్రీకాంత్ గట్ల ఈ షోను క్యూరేట్ చేశారు. మిస్ ఇండియా వరల్డ్–2020 మానస వారన్సి, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు ఫ్యాషన్ షోను తిలకించారు. డెనౌర్లెన్ స్టార్టప్ సీఓఓ సౌమ్యారావు, డెనౌర్లెన్ స్టార్టప్ సీఈఓ ఠాగూర్ సీనియర్, ఎండీ జూనియర్ ఠాగూర్, టీ హబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. – రాయదుర్గం -
కొక్కొరొకో.. ఎంత సొగసో.. అందాల పోటీలకు సై అంటున్న కోడిపుంజులు
‘‘నడత హుందాగా ఉండాలి..నడకలో హొయలొలకాలి..రంగు మెరిపించాలి.. పొంగు భళా అనిపించాలి..’’ ఇవి గ్లామర్ కాంటెస్ట్‌లో పోటీపడే బ్యూటీలకు కావాల్సిన అర్హతలని చదువుతుంటేనే అర్థమైపోతుంది. అయితే ఆ అందం గంప కింద నుంచి రావాలి అనే కొత్త రూల్ చదివితే మాత్రం మైండ్ బ్లాంకైపోతుంది. అవును.. ఆ గంప కింద ఉన్న కోడి ఇప్పుడు అందాల ర్యాంప్‌పైన కూస్తోంది. తోటి కోళ్లతో పోటీపడి మరీ వయ్యారాలొలకబోస్తోంది. అందాల కోడి కిరీటం కోసం ‘సై’ అంటోంది. కోడేమిటి? అందాల పోటీలేమిటి? సమాధానమే ఈ కథనం..ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా మరి.. కొమరోలు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన సయ్యద్ బాష ..పక్షి ప్రేమికుడు. ఇతని వద్ద రకరకాల పక్షులతోపాటు వివిధ రకాల కోడి పుంజులు, పెట్టలు ఉన్నాయి. ప్రత్యేకంగా కనిపిస్తున్న పుంజుల గురించి అడగగా..ఇవి అందాల పోటీల కోళ్లని చెప్పడంతో ఆశ్చర్యపోయాం.. వాటి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగింది. అందాల పోటీలా? ఎక్కడ జరుగుతున్నాయి..? ఏంటి ప్రత్యేకతలు అని ప్రశ్నించాం.. మనకు సంప్రదాయ బద్ధంగా సంక్రాంతికి గోదారోళ్లు నిర్వహించే కోడి పందేల్లా..తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో దాదాపు 50 సంవత్సరాలుగా అందాల పోటీలు నిర్వహిస్తున్నారని చెప్పాడు. జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఈ పోటీలకు హాజరవుతున్నాం. ఈ సారి రాష్ట్రంలోని పెంపకందారులం అందరం కలసి అసోసియేషన్‌గా ఏర్పడ్డాం. అనంతపురం జిల్లాలో తొలిసారిగా సంక్రాంతికి కోడి అందాల పోటీలు నిర్వహించారని చెప్పాడు. తమిళనాడు, కేరళ, కర్నాటక, చత్తీస్ఘడ్, ఒడిసా, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల వారు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నారు. వయ్యారాలొలకబోసే కోడి పుంజుల ప్రత్యేకతలు తెలుసుకుందాం.. ఆహార్యం..అద్భుతం ఈ పోటీల్లో పాల్గొనే పుంజులు ప్రత్యేక ఆహార్యాన్ని కలిగి ఉండాలి. తల నుంచి బాడీ, తోక, కాళ్ల వరకూ అన్నీ విభిన్నంగా ఉండాల్సిందే. మెడ నిటారుగా 90 డిగ్రీలో బాడీ ఉండాలి. తెల్ల కళ్లు బెస్ట్ క్వాలిటీ..తలపై భాగం జుట్టు ఎర్రగా ఉండి గుండ్రంగా గులాబి రేకుల్లా ముద్దగా పువ్వు అతికించినట్టుగా ఉండాలి. బాడీ దృఢంగా ఉండి కాళ్లు..కాళ్లు మధ్య ఎడం ఉండాలి. బాడీ బిల్డర్ ఎలా నడుస్తాడో అలా నడకలో స్టైల్ ఉండాలి. కాళ్ల వేళ్లు పొడవుగా చక్కగా ఉండాలి. తోక అందంగా ఉండి ఈకలు దుబ్బగా ఉండాలి. తెలుపు, రెడ్, బ్లాక్ కిరీ ఇలా కోడి మొత్తం ఫ్యాన్సీ కలర్లో ఉంటే అందరూ ఇష్టపడతారు. ఎంపిక ఇలా.. అందాల పోటీల ఎంపిక ఇలా ఉంటుంది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన కోళ్లను ముందుగా నిర్వాహకులు పరిశీలిస్తారు. అర్హమైన వాటిని గుర్తిస్తారు. వాటికి నంబర్‌తో కూడిన ట్యాగ్లు ఇస్తారు. ఐదుగురు న్యాయనిర్ణేతలు ఉంటారు. అందులో ప్రభుత్వాధికారులు (పశుసంవర్ధకశాఖకు చెందిన) కూడా ఉంటారు. మధ్యలో ఒక టేబుల్ ఏర్పాటు చేస్తారు. నంబర్ ప్రకారం పిలుస్తారు. టేబుల్‌పై ఉంచిన పుంజును జడ్జిలు పరిశీలించి మార్కులు ఇస్తారు. ఒకరు ముక్కు నుంచి మెడ వరకూ ఎంత దూరం ఉంది అని పరిశీలిస్తారు. మరొకరు బాడీ స్టైల్, రంగు, కాళ్లు, కళ్లు ఇలా అన్నీ పరిశీలిస్తారు. ఈ ఐదుగురు ఇచ్చిన మార్కులను కలుపుతారు. అందులో ఎక్కువ మార్కులు వచ్చిన పుంజును విజేతగా ప్రకటిస్తారు. ప్రత్యేక శిక్షణ: పుంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పోటీలకు మూడు నెలల నుంచి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ శిక్షణ ఇస్తారు. బెదురు పోయేందుకు బాడీని నిమురుతారు. అలాగే నీళ్లతో తడుపుతారు. ఇసుకలో పొర్లిస్తారు. ఇలా చేయడం ద్వారా ఈక ఒత్తుగా ఉంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రెండేళ్లు పెంచుతారు. పోటీలకు సిద్ధమయ్యే పుంజులు ఏడు నుంచి ఎనిమిది కేజీల బరువు ఉండేలా చూసుకుంటారు. డబుల్ బాడీ వచ్చేలా ఫీడింగ్ ఇస్తారు. గంభీరంగా బాడీబిల్డర్‌లా ఉంటుంది. కాళ్లు దృఢంగా, పాదాలు పెద్ద పెద్దగా ఉండేలా చూసుకుంటారు. వీటిని ఎక్కువగా అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పెంచుతారు. పౌష్టికాహారం... ఈ పోటీలకు సిద్ధం చేసే పుంజులకు ఆహారం ప్రత్యేకంగా ఉంటుంది. జొన్నలు, రాగులు, గోధుమలు, సజ్జలు, మొక్కజొన్న, పెసలు, గుడ్డు, ఖర్జూరం, పిస్తా, బాదం, జీడిపప్పు, పండ్లు తినిపిస్తారు. రోజూ మూడు విడతలుగా ఆహారం ఇస్తారు. అరటి, ద్రాక్ష, దానిమ్మ, సమ్మర్లో వేడి తగ్గించేందుకు పుచ్చకాయ పెడతారు. ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది వరకూ కొలత ప్రకారం జొన్నలు, రాగులు, సజ్జ, మొక్కజొన్న, పెసలు, గోధుమలు ఇస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు కోడి గుడ్డు, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినిపిస్తారు. ఆహారం సులభంగా జీర్ణం అయ్యేందుకు అరటి, దానిమ్మ, ద్రాక్ష పండ్లు ఇస్తారు. ఇలా క్రమం తప్పకుండా ఆహారం ఇవ్వడంతో శరీరం బలిష్టంగా ఉంటుంది. అందాల పోటీలకు ఒక కోడిని తయారు చేసేందుకు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చవుతుంది. చిన్నప్పటి నుంచి మంచి ఆహారాన్ని ఇస్తే ఎదుగుదల బాగుంటుంది. క్రాస్ బ్రీడింగ్.. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఉండే బ్రీడర్ దగ్గర నుంచి బ్రీడ్ తెచ్చుకుంటారు. ఇక్కడ పెట్టలతో క్రాస్ బ్రీడ్ చేస్తారు. అలా వచ్చిన పుంజులను రెండేళ్లపాటు పెంచుతారు. వీటి గుడ్డు కూడా చాలా విలువైంది. నాణ్యతను బట్టి రేటు ఉంటుంది. మన జిల్లాలో రూ.1000 ఉంటుంది. తమిళనాడులో అయితే రూ.5 వేల వరకూ ఉంటుంది. చిన్న, చిన్న పిల్లలను ఆసక్తి ఉన్నవారికి విక్రయిస్తుంటారు. ఆసక్తితోపాటు ఆదాయం.. చిన్నప్పటి నుంచి పక్షులను పెంచడం హాబీగా ఉండేది. తమిళనాడులో అందాల పోటీలు నిర్వహిస్తున్నారని మిత్రుడు చెప్పాడు. ఒకసారి వెళ్లి చూసి వచ్చిన తర్వాత కోడి పుంజులను పెంచాలన్న ఆసక్తి నెలకొంది. మంచి బ్రీడ్లను తీసుకొచ్చాను. అలా పుంజులను పోటీలకు సిద్ధం చేస్తున్నా. అనంతపురంలో తొలిసారిగా నిర్వహించిన పోటీలకు పుంజును తీసుకువెళ్లా. ఈ పోటీల్లో నాలుగో స్థానం వచ్చింది. వీటిని పెంచి ఆసక్తి ఉన్నవారికి విక్రయించడం ద్వారా ఉపాధి కూడా ఉంటోంది. – సయ్యద్ బాష, రాజుపాలెం, కొమరోలు మండలం చదవండి: బ్రాండెడ్ గుడ్డు గురూ.. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్! -
విశాఖపట్నం : ర్యాంపులపై హోయలొలుకుతున్న వైజాగ్ బ్యూటీలు (ఫొటోలు)
-
హైదరాబాద్ : హామ్స్టెక్ కళాశాలలో ఫ్యాషన్ షో (ఫొటోలు)
-
Fashion Show: క్యాట్‌వాక్‌తో అదరగొట్టిన మోడల్స్
-
వారెవ్వా.. కరోనా టైంలో పుట్టిన ఆలోచనే ఫ్యాషన్‌గా! (ఫొటోలు)
-
వైభవంగా హ్యామ్స్టెక్ ఫ్యాషన్ షో (ఫొటోలు)
-
ర్యాంప్ వాక్‌లో రష్మిక హోయలు (ఫొటోలు)
-
రోల్ మోడల్: తొలి ఇండియన్ అమ్మాయిగా చరిత్ర సృష్టించనున్న రిజా
వయసుకు తగ్గట్టుగా మానసికంగా, శారీరకంగా పరిపూర్ణంగా ఎదగని పిల్లల...మాట, నడక, నవ్వు సాధారణ పిల్లలకంటే విభిన్నంగా ఉంటుంది. కొంతమంది అయితే ఒకటీ రెండు మాటలు కూడా స్పష్టంగా పలకడం కూడా కష్టమే. అటువంటిది డౌన్‌సిండ్రోమ్‌తో బాధపడుతోన్న రిజా రేజి ఏకంగా ప్రీమియర్ ఫ్యాషన్ షోకు ఎంపికైంది. గ్లోబల్ ఈవెంట్లో ర్యాంప్ వాక్ చేయనున్న తొలి ఇండియన్ అమ్మాయిగా రిజా చరిత్ర సృష్టించనుంది. కేరళకు చెందిన వహీద్, అనితారేజి దంపతులకు ఇద్దరు కూతుర్లు రియ, రిజాలు. 2014 నుంచి బెంగళూరులో స్థిరపడిన రేజి దంపతులు క్రియేటివ్ ఆర్ట్స్ వృత్తినిపుణులు. దివ్యాంగ పిల్లల సంక్షేమమే లక్ష్యంగా ‘బ్యూటిపుల్ టుగెదర్’ పేరిట అనితా ఓ ఇనిస్టిట్యూట్‌ను కూడా నడుపుతోంది.పెద్ద కూతురు రియా ముంబైలోని అడ్వరై్టజింగ్ కంపెనీలో అసోసియేట్ క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. చిన్న కూతురైన 23 ఏళ్ల రిజా చిన్నప్పటి నుంచి డౌన్ సిండ్రోమ్ కారణంగా అక్కలా ఎదగలేదు. అయినప్పటికీ మిగతా డౌన్ సిండ్రోమ్ పిల్లలందరిలోకి చురుకుగా ఉండేది. ఇది గమనించిన ఆమె తల్లిదండ్రులు రిజాను డ్యాన్స్, యాక్టింగ్‌లలో శిక్షణ తీసుకునేందుకు ప్రోత్సహించి, ‘క్రిసాలిస్ ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్’లో చేర్పించారు. దీంతో రిజా మనస్సులోని భావాలను వ్యక్తం చేయడానికి మంచి సాధనం దొరికింది. తన డ్యాన్స్ భంగిమలు, నటనతో అనేక విషయాలను వ్యక్తం చేయడం ప్రారంభించింది. ఒకపక్క యాక్టింగ్ నేర్చుకుంటూనే సింగింగ్, డ్యాన్సింగ్, స్టేజి షోల ద్వారా పాపులర్ స్టార్‌గా మారింది. తల్లిదండ్రులతో రిజా తొలి భారతీయురాలిగా.. డౌన్‌సిండ్రోమ్ పిల్లల అభ్యున్నతికోసం నిధులు సేకరించే ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ ‘గ్లోబల్ డౌన్ సిండ్రోమ్ ఫౌండేషన్’. ఉత్తర అమెరికాకు చెందిన ఈ సంస్థ ఏటా ‘బీ బ్యూటిఫుల్ బీ యువర్ సెల్ఫ్’ పేరిట ఫ్యాషన్ షోను నిర్వహిస్తోంది. ఈ షో ద్వారా వచ్చిన నిధులను డౌన్‌సిండ్రోమ్ బాధితుల అభ్యున్నతి కోసం ఖర్చుచేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఆన్లైన్ ఆడిషన్స్‌లో పాల్గొన్న రిజా..‘కాస్ట్యూమ్, వాకింగ్ స్టైల్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్’లో తన ప్రతిభను ప్రదర్శించి ఇండోవెస్ట్రన్ విభాగంలో ఫ్యాషన్ షోకు ఎంపికైంది. దీంతో ఇప్పటిదాక ఎప్పుడూ మోడలింగ్‌లో పాల్గొనని రిజా అంతర్జాతీయ వేదికపై ర్యాంప్ వాక్ చేయనుంది. డౌన్‌సిండ్రోమ్ కలిగిన వారికి ప్రత్యేకంగా నిర్వహించేæఈ గ్లోబల్ ఈవెంట్లో.. ఇండియా తరపున ప్రాతినిధ్యం వహిస్తోన్న తొలి అమ్మాయి రిజా కావడం విశేషం. అమెరికాలోని కొలరాడోలో ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న ఈ షోలో వివిధ దేశాలకు చెందిన ఇరవై మంది మోడల్స్ పోటీపడనున్నారు. రిజా ఇప్పటి నుంచే దీనికోసం తన వెర్బల్ స్కిల్స్‌ను పెంచుకోవడానికి శిక్షణ తీసుకుంటూ సన్నద్ధమవుతోంది. ఈ ఫ్యాషన్ షోలో విన్నర్‌గా నిలిచి తన కమ్యూనిటీ వారికి ప్రేరణగా నిలవడానికి ప్రయత్నిస్తోంది. ‘‘ఎవరైనా తమ బిడ్డకు మానసిక వైకల్యం ఉందని తెలిసినప్పడు దానిని అంగీకరించడమే అతిపెద్ద సవాలు. సమాజంలో ఎదురయ్యే సానుభూతిని దాటుకుని వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దాలి. ప్రస్తుతం మా రిజా ఇవన్నీ దాటుకుని దేశం తరపును తొలిసారి ఫ్యాషన్ షోలో పాల్గొని తనలాంటి వారందరికి ఆదర్శంగా నిలవబోతోంది. నా కూతురు యాక్టివ్‌గా మాట్లాడడమేకాదు, డ్యాన్స్ కూడా చేస్తోంది. తన మనసులోని భావాలను ఎంతో ఆత్మవిశ్వాసంతో వ్యక్తం చేయగలదు. అలా అని తన వైకల్యాన్నీ దాయలేదు. కానీ తనని తాను నిరూపించుకుని మంచి క్రియేటివ్ ఆర్టిస్ట్‌గా ఎదిగి అందరితో చక్కగా కలిసిపోతుంది’’ – రిజా తల్లి అనితా రేజి అందరితో సమానంగా చూడాలి వైకల్యాలను దృష్టిలో పెట్టుకుని దివ్యాంగుల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటారు. కానీ మానసిక, శారీరక వైకల్యం ఉన్న వారిలో కూడా కొన్ని నైపుణ్యాలు దాగున్నాయి. వాటిని అర్థం చేసుకుని మెరుగు పరిచే దిశగా సంక్షేమ పథకాలను రూపొందిస్తే దివ్యాంగులు సైతం వారి కాళ్ల మీద వాళ్లు నిలబడగలరు. వారు కూడా అందరిలాగే సమాజంలో మనగలుగుతారు. ఫ్యాషన్ షోలో పాల్గొనబోతున్న రిజా ఒంటరిది కాదు. డౌన్‌సిండ్రోమ్ కమ్యూనిటీ తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది. వారంతా కూడా ఇలాంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ఇల్లు, కేర్ సెంటర్లకే పరిమితమైన వారంతా వెలుగులోకి రావడం కాస్త కష్టమైనప్పటికీ వారికి ఉన్న అవకాశాలను అందుకునే మార్గాలను చూపితే వారు ఉన్నతంగా ఎదగగలుగుతారు. వీటన్నింటికంటే ముందు వారిని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలుగా అస్సలు చూడకూడదు. అందరితో సమానంగా ఎప్పుడు చూస్తామో అప్పుడే వాళ్లు చక్కగా ఎదగగలుగుతారు. – రిజా తండ్రి రేజి వహీద్ -
ఇదేం ‘ఫ్యాషన్ షో’.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోండి
ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసే మోడల్స్‌ను అనుకరిస్తూ ఓ వ్యక్తి వినూత్న వీడియోను షూట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. మోడల్స్ ధరించిన దుస్తులను చిత్రీకరించడానికి అతను ఉపయోగించిన పరికరాలు నెటిజన్లను కేకలు పెట్టిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను డాక్టర్ అజయిత అనే ట్విట్టర్ యూజర్ తన ప్రొఫైల్ పోస్టు చేశారు. ఈ వీడియోకు ‘ఈ రోజుల్లో చాలా ఫ్యాషన్ షోలు’ అనే క్యాప్షన్ పెట్టారు. కాగా, ఈ వీడియోలో ‘మోడల్’ షహీల్ షెర్మాంట్ ఫ్లెయిర్.. ఫ్యాషన్ షోలో ఉపయోగించే ఫ్యాన్సీ దుస్తులకు బదులుగా ఇంట్లో వాడుకునే వస్తువులను ఎంచుకున్నాడు. ఆ వస్తువులను పట్టుకుని ర్యాంప్ వాక్‌ను అనుకరిస్తూ కనిపించాడు. ఆ వస్తువుల్లో వాకర్, స్కర్ట్, అల్యూమినియం నిచ్చెన, ఓ అమ్మాయి, రేకును ఉపయోగించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవడంలో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఫ్యాషన్ షోనా లేక ఇంట్లో దోపిడీ చేస్తున్నాడా అంటూ స్పందించారు. మరో నెటిజన్.. ‘అది పారిస్ లేక మిలన్’ అంటూ కామెంట్స్ చేశాడు. That third one got me reeling 😂😂😂 https://t.co/FupJhEuRaK — Black Dynamite (@jamesrautta) June 29, 2022 ఇది కూడా చదవండి: విమానంలోంచి గుట్టలు గుట్టలుగా చేపలు... -
Srimathi Vizag 2022 Grand Finale: శ్రీమతి హొయలు
-
ఫ్యాషన్ షోలో తళుక్కున మెరిసిన ప్రగ్యా జైస్వాల్
-
కేఎంసీ మైదానంలో ‘అవేక్ వరంగల్’ (ఫొటోలు)
-
విజయవాడ: బ్రైడల్ ఫ్యాషన్ షోలో మెరిసిన ముద్దుగుమ్మలు
-
అదరగొట్టిన తెలుగమ్మాయిలు (ఫోటోలు)
-
వాలుకళ్ల వయ్యారి..
-
కిరణ్ బర్త్‌డే పార్టీలో సెలబ్రిటీల రచ్చ
వినూత్న శైలి 'కె పార్టీ'కి నగరం వేదిక అయ్యింది. పార్టీ ప్రియులకు మునుపెన్నడూ ఎరుగని అనుభూతులను అందించి అదుర్స్ అనిపించింది. సుచిర్ ఇండియా అధినేత లయన్ కిరణ్ బర్త్ డే పార్టీని ఆయన సన్నిహితులు కే పార్టీగా ప్రతి ఏడాది ఒక థీమ్‌తో సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం శిల్పారామం రాంచ్ రాక్ హైట్స్‌లో కె పార్టీ కౌబాయ్ స్టైల్ ఫ్యాషన్, బాలీవుడ్ డ్యాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కె పార్టీ లో టాలీవుడ్ స్టార్స్, సినీనటులు, ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. కౌబాయ్ స్టైల్ థీమ్‌లో నిర్వహించిన ఈ నైట్ ఈవెంట్ ఆద్యంతం అతిధులకు అపురూపమైన అనుభూతి పంచింది. నృత్యాలు, విందు వినోదాలు, ఫ్యాషన్ షో అదరహో అనిపించాయి. స్వయంగా లయన్ కిరణ్ షో స్టాపర్ గా మారడం విశేషం. ఆయన రాంప్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. -
విజయవాడ : ఆకట్టుకున్న మేరీస్ స్టెల్లా కళాశాల విద్యార్థుల ఫ్యాషన్ షో
-
బొమ్మ కాదు.. ముద్దుగుమ్మ
-
ఫ్యాషన్ రంగంలో దూసుకుపోతున్న ‘విశాఖ’
-
నడి రోడ్డుపై మహిళల ఫ్యాషన్ షో.. ఎందుకో తెలుసా?
భోపాల్: మహిళలు నడిరోడ్డుపై.. నీటి కుంటల వద్ద హొయలొలుకుతూ క్యాట్ వాక్ చేశారు. రోడ్డుపై ఫ్యాషన్ షో మొదలుపెట్టడం మధ్యప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. వారు అలా ఎందుకు చేశారో తెలుసా..? తమ ప్రాంతంలో రోడ్లు బాగా లేవని చెప్పేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు మహిళలు తెలిపారు. రోడ్డుపై గుంతలతో తాము ఇబ్బందులు పడుతున్నామని చెప్పేందుకు.. అధికారుల నిర్లక్ష్యం చూపించేందుకు తాము ఈ తరహా ఆందోళన చేసినట్లు వివరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి: పదో తరగతి పాసయిన మాజీ సీఎం.. దాంతోపాటు ఇంటర్ కూడా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని హోషంగాబాద్, ధనిశ్‌నగర్‌లో రోడ్లు బాగా లేవు. గుంతలు తేలడంతో రోడ్డు ప్రమాదకరంగా మారింది. దీనికి తోడు వర్షాలకు నీరు నిలిచి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టింపు లేకపోవడంతో నారీమణులు కొంగు బిగించి రోడ్డు బాట పట్టారు. ధర్నాలు, కార్యాలయాల ముట్టడితో పని లేదని విన్నూత్నంగా చేద్దామని ఫ్యాషన్ షో ప్లాన్ వేశారు. అనుకున్నదే తడువుగా ధనీశ్‌నగర్ మహిళలు బయటకు వచ్చారు. రోడ్డుపై గుంతలు ఉన్న చోట.. నీరు నిలిచిన చోట ప్రత్యక్షమయ్యారు. ఫ్యాషన్ షో మాదిరి క్యాట్ వాక్ చేస్తూ నడిచారు. బురదలోనే నడిచారు. రోడ్డు మరమ్మతులు వెంటనే చేయాలని తమ అందచందాలతో డిమాండ్ చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో తాము ఈ విధంగా నిరసన చేపట్టినట్లు మహిళలు తెలిపారు. రోడ్డుపై ప్రమాదకరంగా గుంతలు తయారయ్యాయని వాపోయారు. మున్సిపల్ అధికారులు పన్నుల వసూళ్లపై చూపించే శ్రద్ధ ప్రజల సమస్యలను పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం చెల్లించే పన్నులను ఏం చేస్తున్నారని నిలదీశారు. ఈ మహిళల విన్నూత్న నిరసన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
శ్రీమతి వైజాగ్ ట్రెడిషనల్ ఫ్యాషన్ షోలో మెరిసిన సినీ నటి అర్చన
-
మెరిసిన తెలుగమ్మాయిలు
-
ర్యాంప్‌పై హొయలు ఒలుకుతన్న గొర్రెలు ...
-
గొర్రెల క్యాట్ వాక్ కేకో కేక
ర్యాంప్‌పై హొయలు ఒలుకుతూ.. వయ్యరంగా నడుస్తూ వస్తున్న గొర్రెలు ఔరా అనిపించాయి. అందంగా తయారైన గొర్రెలు మోడళ్లకు తీసికట్టు మాదిరి అందచందాలు ప్రదర్శిస్తూ క్యాట్ వాక్ చేశాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ దృశ్యం టర్కీలో కనిపించింది. గొర్రెల పెంపకంపై అవగాహన కల్పించేందుకు.. గొర్రెల రకాలు, వాటి మాంసం వివరాలు తెలుపుతూ ఈ ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ షో టర్కీలోని దియాబకీర్ నగరంలో జరిగింది. ఈ పోటీలో దాదాపు 12 గొర్రె జాతులు పాల్గొన్నాయి. ఆ గొర్రెలను యజమానులు అందంగా తయారు చేసి ర్యాంప్‌పై నడిపించారు. ఈ క్రమంలో స్టేజీపైకి వచ్చిన గొర్రెలు పెద్ద ఎత్తున జనాలు ఉండేసరికి గందరగోళ పడ్డాయి. యజమానులు వెంట నిల్చుని వాటిని నడిపించేందుకు అపసోపాలు పడ్డారు. ఒక్కో గొర్రె ఒక్కో రీతిన తయారై జ్యూరీ వారి దృష్టిని ఆకర్షించేలా వాటిని తయారుచేశారు. ఫ్యాషన్ షోల మాదిరి గొర్రెలకు నంబర్లు ఇచ్చి ర్యాంప్‌పై హొయలొలికిస్తూ అవి నడిచాయి. కళ్లజోడు ధరించి.. వింత హెయిర్ స్టైల్‌తో ఉన్న గొర్రె ఫైనల్ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా విజేతతో కలిసి అందరూ ఫొటోలు దిగారు. అనంతరం పోటీల పాల్గొన్న అన్ని గొర్రెలతో యజమానులు ఫొటోలకు ఫోజిచ్చారు. ఈ ఫ్యాషన్ షోకు పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఈ సమయంలో నిర్వాహకులు కరోనా నిబంధనలు విధిగా పాటించారు. పోటీల్లో పాల్గొన్న వారందరూ మాస్క్ ధరించారు. పెద్దాచిన్న గొర్రెలు సందడి చేశాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
ప్రపంచ ఫ్యాషన్ షోలో కన్నీరు పెట్టిన సుందరి
బ్యాంకాక్: ప్రపంచ దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్న ఫ్యాషన్ షో అది. హొయలు ఒలుకుతూ.. తమ అందచందాలను చూపుతూ ఆహూతులను ఆకట్టుకునేలా వయ్యారంగా నడుస్తున్నారు. వందలాది మంది పాల్గొన్న ఆ షోలో 20 మంది తుది పోటీకి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారితో నిర్వాహకులు మాట్లాడించారు. ఈ క్రమంలో ఓ సుందరి మాట్లాడుతూ.. తన దేశాన్ని తలుచుకునూ కన్నీటి పర్యంతమైంది. నా దేశాన్ని కాపాడండి’ అంటూ అంతర్జాతీయ వేదికపై రోదిస్తూ విజ్ఞప్తి చేసింది. ఈ రోజు నా సోదరులు 64 మంది మృతి చెందారని ఆవేదన చెందుతూ కన్నీరు పెట్టుకుంది. ఈ పరిణామం మయన్మార్‌లో నెలకొన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించింది. బ్యాంకాక్ మిస్ గ్రాండ్ పోటీలు-2020 ఉత్సాహంగా జరుగుతున్నాయి. మయన్మార్‌కు చెందిన 22 ఏళ్ల హాన్ లే కూడా పాల్గొంది. తన అందం.. వస్త్రధారణ, నడక, చూపులతో అందరినీ దృష్టిని ఆకర్షించి టాప్ 20 మందిలో చోటు సంపాదించుకుంది. ఈ క్రమంలో ఆమె వేదికపై మాట్లాడుతూ.. తన దేశంలో జరుగుతున్న పరిణామాలను వివరించింది. ‘ఈ స్టేజీపై నిలబడి మాట్లాడడం సాధారణ రోజుల్లో గర్వపడేదాన్ని. కానీ నా దేశంలో అస్థిర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి సమయంలో మీ ముందు మాట్లాడడం చాలా కష్టంగా ఉంది. వందలాది మంది అమాయక ప్రజలు చనిపోతున్నారు. 64 మంది మరణించారనే విషయం నన్ను దిగ్ర్భాంతికి గురి చేసింది. మా దేశానికి అత్యవసర సాయం, అంతర్జాతీయ జోక్యం అవసరం’ అని హాన్ లే గుర్తు చేసింది. ‘దయచేసి మయన్మార్‌కు సాయం చేయండి’ అంటూ విలపిస్తూ ఆ అందాల సుందరి విజ్ఞప్తి చేసింది. దీంతో ఒక్కసారిగా ఆ ఫ్యాషన్ షో వాతావరణం ఉద్విగ్నంగా మారింది. హాన్ లే మిస్ గ్రాండ్ మయన్మార్ అవార్డు సొంతం చేసుకుని ఈ పోటీలకు ఎంపికైంది. Han Lay, a Miss Grand Myanmar made an emotional appeal for international help for her country during the Miss Grand International pageant in Thailand https://t.co/tsb3jj86qy pic.twitter.com/JL3ei9RzwZ — Reuters (@Reuters) March 30, 2021 -
శిల్పారామంలో ట్రాన్స్‌జెండర్స్ ఫ్యాషన్ ర్యాంప్ వాక్ ఫోటోలు
-
ఫ్యాషన్ షో మళ్లీ మొదలు
కోవిడ్–19 నుంచి ఇప్పుడిప్పుడే గుండె చిక్కబట్టుకుంటున్న ఫ్యాషన్ ఇండస్ట్రీలో కొన్ని వెలుగులు, మెరుపులు మొదలయ్యాయి. వాటిలో భాగంగా ఇటలీలో ఈ బుధవారం జరిగిన మిలన్ ఫ్యాషన్ వీక్ 2021లో డేనియల్ డెల్ కోర్ మెన్– ఉమన్ కోసం తీసిన న్యూ బ్రాండ్ కలెక్షన్‌ను ప్రదర్శించారు. సామాజిక దూరం పాటిస్తూ కేవలం 40 మంది ఆహుతులతో నేలమాలిగలో మొదలైన ఈ రన్ వే కొత్తదనాన్ని కొత్తగా కళ్లకు కట్టింది. లగ్జరీయస్ బ్రాండ్‌కు పెట్టింది పేరుగా నిలిచిన గూచీ మాజీ విఐపీ డిజైనర్ డేనియల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘0 నుంచి మొదలుపెట్టిన నా డిజైన్స్ పూర్తిగా ప్రకృతిపై ప్రేమతో నిండి ఉన్నవే’ అంటాడు. స్ట్రాపీ టాప్స్, మినీ స్కర్ట్స్, సూట్ జాకెట్, రెడీ టు వేర్కి పెట్టింది పేరుగా రన్‌వే లో నిలిచాయి డెల్కోర్ డిజైన్స్. ఉన్ని, బ్రొకేడ్, ఆర్గంజా మేటీరియల్‌తో డిజైన్ చేసినవిగా ఈ సందర్భంగా తెలిపాడు 32 ఏళ్ల ఈ డిజైనర్. చదవండి: ప్రియాంక డ్రెస్సింగ్‌పై విపరీతమైన ట్రోలింగ్ పారాచూట్... ఫొటోషూట్ -
విరాళి మోది.. కూర్చుని ఎగిరింది!
పులిని ఎదిరించిన మేకపిల్ల కథ ప్రేరణ. కరువున కురిసిన వాన కథ ప్రేరణ. పేగు అడ్డుపడినా జన్మించి కేర్మనడం ప్రేరణ. ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు జవాబుగా మారడం ప్రేరణ. ప్రేరణ అందరూ కలిగించలేరు. అందుకు అర్హత కలిగిన వారు పలికిన మాట నుంచే అది జనిస్తుంది. విరాళి మోది డిజెబిలిటి యాక్టివిస్ట్. మోటివేషనల్ స్పీకర్. ప్రయోజనకరమైన చలనం మనిషికి అవసరం అని ఆమె చెబుతుంది. ఆమె తన వీల్‌చైర్‌లో నుంచి లేచి నిలబడలేదు. కూర్చుని నేను ఎగర గలుగుతున్నప్పుడు మీకేం తక్కువ? అని సూటిగా అడిగి దమ్మునింపుతుంది. ఆమె పరిచయం... విరాళి మోది వయసు ఇప్పుడు 30 ఏళ్లు. 2006 లో ఆమె తన కాళ్లలో చలనం పోగొట్టుకుంది. అప్పటి నుంచి ఆమె వీల్‌చైర్‌కే పరిమితం అయ్యింది. అయితే ఆ తర్వాతి నుంచి ఆమె ఎలా ఎగిరిందో చూద్దాం. ► 2014లో ‘మిస్ వీల్‌చైర్ ఇండియా’ టైటిల్ గెలుచుకుంది. ► భారతీయ రైల్వేలలో దివ్యాంగుల సౌకర్యాలు కల్పించేలా ఉద్యమం లేవదీసి గెలిచింది. ► 2017లో ‘ప్రభావవంతమైన 100 మంది స్త్రీలు’ బిబిసి జాబితాలో నిలిచింది. ► ఆమె చేసిన ‘మై ట్రైన్ టూ’ ప్రచారం ప్రాముఖ్యం పొందింది. ► ‘ర్యాంప్ మై రెస్టరెంట్’ కాంపెయిన్ రెస్టరెంట్లలో దివ్యాంగుల ప్రవేశపు వీలును గుర్తించేలా చేసింది. ► గొప్ప మోటివేషనల్ స్పీకర్‌గా గుర్తింపు పొందింది. ► వీల్ చైర్ మీద కూచునే ఫ్యాషన్ షోలలో పాల్గొంది. ► స్కూబా డైవింగ్ చేసింది. నిజానికి విరాళి మోదికి ‘దివ్యాంగులు’, ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ అనే మాటలు నచ్చవు. ‘మనందరం ఒకటే. మాకు ఏవేవో పేర్లు పెట్టి బుజ్జగించే పనులు చేయకండి. మీరు కాళ్ల మీద ఆధారపడతారు. మేము వీల్‌చైర్ మీద ఆధారపడతాం. మిగిలిన అన్ని పనుల్లో మేము సమానమే కదా’ అంటుందామె. విరాళి మోది ముంబై లో ఉంటుంది. దివ్యాంగుల హక్కుల సాధన విషయంలో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇవాళ ఆమె మోటివేషనల్ స్పీచెస్ వినడానికి వందలాదిగా తరలి వస్తారు. ఆమె కథ ఎందుకు అంత ప్రేరణ కలిగిస్తోంది? అమెరికా అమ్మాయి విరాళి మోది ఇండియాలో జన్మించినా హైస్కూలు వయసు వరకూ అమెరికాలోనే పెరిగింది. ఆమె తల్లిదండ్రులు పల్లవి, జితేష్ మోదీలు ‘మజూరి’లో స్థిరపడ్డారు. 2006లో విరాళికి పదహారు పదిహేడు సంవత్సరాలున్నప్పుడు ఆమె ఇండియా పర్యటనకు వచ్చి తిరిగి అమెరికా వెళ్లింది. వెళ్లినప్పటి నుంచి ఆమెకు తలనొప్పి పట్టుకుంది. ఆ తర్వాత తీవ్రమైన జ్వరం. డాక్టర్లు పరీక్ష చేస్తే టెస్టుల్లో ఏమీ తేలలేదు. విరాళి ఇండియా వచ్చింది వానాకాలం కనుక మలేరియా వచ్చి ఉంటుందని తల్లిదండ్రులు చెప్పినా టెస్టుల్లో తేల్లేదు కనుక మందులు ఇవ్వం అని డాక్టర్లు చెప్పారు. ఆ జ్వరంలోనే ఒక ఉదయం ఆమె కాళ్లు చచ్చుబడ్డాయి. ఆ తర్వాత ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చింది. 7 నిమిషాలు ఆమెలో చలనం లేదు. డాక్టర్లు చనిపోయిందనే అన్నారు. కాని ఆమె గుండె తిరిగి కొట్టుకుంది. ఆ తర్వాత కోమాలోకి వెళ్లిపోయింది. వెంటిలేటర్ మీద ఉన్న విరాళిని తల్లి మరికొన్ని రోజుల్లో రానున్న విరాళి పుట్టినరోజు వరకూ బతికించమని, ఆ తర్వాత వెంటిలేటర్ తీసేద్దామని కోరింది. డాక్టర్లు తల్లికోరిక కదా అని మన్నించారు. పుట్టినరోజు అందరూ చివరి చూపులకు వచ్చారు. కేక్ కోశారు. ఐసియులో సందడి చేశారు. ఆ సందడిలోనే విరాళి కోమా నుంచి బయటపడి కళ్లు తెరిచింది. అచలనం నుంచి చలనానికి విరాళి బతికింది కాని మెడ కింద నుంచి పూర్తి శరీరం చచ్చుబడింది. చేతులు కాళ్లు ఏవీ కదల్చలేని స్థితి. తల్లి కొన్నిరోజులు సేవ చేసింది. కాని ఇలాగే ఉంటే అమ్మాయి ఏం కాను? ఒకరోజు విరాళికి చాలా ఆకలి వేసింది. తల్లిని భోజనం అడిగితే ఎదురుగా తెచ్చి పెట్టి ‘నీకు కావాలంటే తిను. నేను నీ పనిమనిషిని కాను’ అని కావాలని విసుక్కుంది. విరాళికి పట్టుదల వచ్చింది. నా తిండి నేను తినగలను అనుకుంది. పట్టుదలగా ముందు వేళ్లు కదిలించింది. తర్వాత చేతులు కదిలించింది. ఆ తర్వాత చేయి సాచి ఆహారాన్ని తినగలింది. ‘ఆ రోజు నా జీవితం మారింది. నేను అనుకున్నది గట్టిగా అనుకుంటే సాధించగలను అని అర్థమైంది. అంతా మన మైండ్‌లో ఉంటుంది. దానికి బలం ఇవ్వాలి అని తెలుసుకున్నాను’ అని చెప్పింది. ఆ తర్వాత ఆమె చేతులు ఆమె స్వాధీనానికి వచ్చాయి. కాళ్ల సమస్య? వీల్‌చైర్ ఉందిగా అనుకుంది. ఎందుకు చేయరు? ‘ఈ పని నా వల్ల కాదు.. ఆ పని నేను చేయలేను అని అందరూ అనుకుంటూ ఉంటారు. బద్దకిస్తుంటారు. భయపడుతుంటారు. కాని ఇందుకా మనం పుట్టింది. చేయాలి. సాధించాలి. ముందుకు వెళ్లాలి. జన్మను సార్థకం చేసుకోవాలి’ అంటుంది విరాళి. ఆమె తన సమూహానికే కాదు ప్రతి ఒక్కరికీ ‘లే.. నడు.. పరిగెత్తు.. ఎగురు’ అని ప్రేరణనిస్తుంది. నిరాశ చుట్టుముట్టినవారికి తన జీవితాన్నే అద్దంలా చూపి మనిషికి సమస్యలను దాటే శక్తి ఉంటుందని చెప్పింది. అదే కాదు... న్యాయమైన హక్కులను సాధించుకోలేకపోవడం కూడా ‘అచేతన చైతన్యాన్ని’ కలిగి ఉండటమే అని చెబుతుంది. పోరాడాలి.. సాధించాలి... జీవించాలి... జీవితాన్ని ఇవ్వాలి... ఇదే విరాళి ఇస్తున్న సందేశం. – సాక్షి ఫ్యామిలీ -
మాన్సూన్ ఫ్యాషన్స్ ర్యాంప్‌పై మోడల్స్ మెరుపులు
-
బిగ్‌బాస్: లక్ష రూపాయలు పట్టేసిన గంగవ్వ
ఐపీఎల్, కరోనాను ఎదుర్కొని ప్రేక్షకులకు బిగ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు బిగ్‌బాస్ సీజన్ 4 తమ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. టాస్క్‌లు, ట్విస్టులు, నామినేషన్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో భారీ స్థాయిలో వినోదాన్ని పంచుతోంది. ఇక బిగ్‌బాస్ ఇంటి హౌజ్‌లో 26వ రోజు సందడి సందడిగా సాగింది. ఉదయాన్నే హుషారైన పాటకు అందరూ ఎనర్జిటిక్‌గా డ్యాన్స్‌లు చేశారు. మార్నింగ్ మస్తీలో భాగంగా ఇంటి సభ్యులందరికి మెహబూబ్ డ్యాన్స్ స్టెప్పులు నేర్పిస్తున్నాడు. ఇంటి సభ్యుల్లో కొంతమందికి మాత్రమే లగ్జరీ బడ్జెట్ లభించింది. ష్యాషన్ షోలో ర్యాంప్ వాక్‌లతో అలరించారు. ఇంకేం జరిగిందంటే.. చపాతి స్టెప్ చేసిన మెహబూబ్ లాస్య ఎక్కువగా కిచెన్ వర్క్ చేస్తుంటుంది. కిచెన్‌లో ఆమె చేసే చపాతిని డ్యాన్స్ రూపంలో చేసి చూపించాడు మెహబూబ్. అవినాష్ కాలుకు దెబ్బ తగలడంతో కాలు కదలకుండా, అఖిల్ లాగా వర్కౌట్స్ ఎలా చేయాలో డ్యాన్స్ చేయాలో చేసి చూపించాడు. వీటితోపాటు ఇంట్లో కోపిష్టిగా పేరు తెచ్చుకున్న సోహైల్ ఆగ్రహంతో ఏ విధంగా డ్యాన్స్‌లు చేయాలో చూపించాడు. మాస్టర్‌తో కలిసి కాంచనలా మారి స్టెప్పులు వేశాడు. గంగవ్వ, స్వాతి, కుమార్ సాయి.. ఇలా ఇంట్లోని వారందరితోనూ ఏదో ఒక విధంగా డ్యాన్స్ చేపించాడు. అవినాష్ తనలోని మిమిక్రీ టాలెంట్‌ను ప్రదర్శించాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు సినిమాలోని విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ వాయిస్‌ను మిమిక్రీ చేసి చూపించాడు. చదవండి : అఖిల్‌కు బిగ్‌బాస్ ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి? కన్ఫెషన్ రూమ్‌లోకి అఖిల్ ఇంటి సభ్యులంతా హాల్లో కూర్చొని ఉండగా అఖిల్‌ను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిపించాడు. ఆ రూమ్‌లోకి వెళ్లిన అఖిల్ మిగతా ఇంటి సభ్యులకు కనిపించనున్నాడు. ఈ వారం రేషన్ మేనేజర్‌గా అఖిల్ ఎన్నికైనందున అతనికి లగ్జరీ బడ్జెట్ షాపింగ్ చేయాలి. లగ్జరీ బడ్జెట్ సామాన్ల లిస్ట్‌ను అందించి, తమ దగ్గర ఉన్న 3200 పాయింట్లో ఒక్కొక్కరికి ఒక్కో వస్తువు చొప్పున16 ఎంపిక చేయాలి. లాస్యకు చికెన్ పచ్చడి, నోయల్‌కు బ్రెడ్, నూడుల్స్ సోహైల్, పోహ మెహబూబ్, పన్నీర్ మోనాల్, మాస్టర్‌కు శనగపిండి, కార్నఫ్లెక్స్ గంగవ్వకు కేటాయించాడు. కన్ఫేషన్ రూమ్ నుంచి బయటకు వచ్చాక తమకు ఏ వస్తువులు రాని ఇంటి సభ్యులు కొంత నిరాశ చెందాడు. అఖిల్ వేరే విధంగా ప్లాన్ చేసి ఉంటే బాగుండని అనుకున్నారు. చదవండి : బిగ్‌బాస్: అదిరేటి డ్రెస్ మేమేస్తే.. పిచ్చెక్కించిన ఫ్యాషన్ షో ఇంట్లోని సభ్యులందరికి కొత్త బట్టలు వచ్చాయి. చందన బ్రదర్స్ పంపించిన దుస్తులను ధరించి అందంగా తయారు అవ్వాలి. అనంతరం చందన బ్రదర్స్ ఫ్యాషన్ టాస్క్ చేయాలి. ఈ టాస్క్‌లో ర్యాంప్ వాక్ చేయాలి. ఇందులో మంచిగా చేసిన ఒక అబ్బాయి, అమ్మాయిని విజేతగా ప్రకటించి వారికి లక్ష రూపాయల గిఫ్ట్ వోచర్‌ను అందించాలి. ర్యాంప్ వాక్‌లో అబ్బాయిలందరూ ఒక్కొక్కరూ వచ్చి తమదైన స్టైల్లో వాక్ చేశారు. ఆ తర్వాత అమ్మాయిలందరూ అందంగా ర్యాంప్ వాక్ చేసి అబ్బాయిల గుండెల్లో మంటలు రేపారు. కుందనపు బొమ్మలా కనిపించారు. అమ్మాయిల నుంచి గంగవ్వను ఏకగ్రీవంగా విజేతగా ప్రకటించగా..అవ్వకు లక్ష రూపాయల గిఫ్ట్ వోచర్ అందించారు. అబ్బాయిల నుంచి అవినాష్‌ను విజేతగా తెలిపారు. బిగ్‌బాస్: అదిరేటి డ్రెస్ మేమేస్తే.. అద్దంలా మారిన అవినాష్ ఇంట్లోని అమ్మాయిలకు అందంగా తయారు అవ్వడం మహా ఇష్టం. ఈ క్రమంలో అవినాష్ అమ్మాయిలకు అద్దంగా వ్యవహరించనున్నాడు. ప్రతి అమ్మాయి అద్దం(అవినాష్) ముందుకు వచ్చి తమ మనసులోని ఫీలింగ్స్‌ను చెప్పుకోవాలి. ఇందులో అవినాష్ తన దగ్గరకు వచ్చిన వారిలో ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ఆటాడుకున్నాడు. వాళ్లపై పంచ్‌లు వేస్తూ వారిని సరదాగా అలరించాడు. చివరగా ర్యాంప్ వాక్ షో లో ఎవరూ ఎలా చేశారో ఇమిటెట్ చేసి చూపించారు. అయితే సుజాత బుంగమూతి పెట్టుకుని అలిగింది. ఈ నెపంతో లాస్య, సుజాతకు మధ్య చిన్నగా వివాదం మొదలైంది. విన్నర్‌గా ముందు నోయల్‌ను చెప్పి ఆ తరువాత అవినాష్‌ను ప్రకటించినదని లాస్య సుజాత మధ్య గొడవ అయ్యింది. తర్వాత అవినాష్ సుజాతను కూల్ చేశాడు. అంతేగాక తనకు నచ్చినట్లు ఆడి బిగ్‌బాస్‌లో ఉండాలని, ఇతరులను బతిమాలడం మానేయాలని అరియానా అవినాష్‌లో స్పూర్తిని నింపింది. -
బిగ్‌బాస్: అదిరేటి డ్రెస్ మేమేస్తే..
బిగ్‌బాస్ సీజన్ 4లో కావాల్సినంత వినోదం అందుతోంది. ఆటలు, పాటలు, టాస్క్‌లతోపాటు హౌజ్‌లో అందానికి కూడా కొదవేలేదు. ఈ సీజన్లో గంగవ్వ మినహా ప్రస్తుతం ఉన్న అమ్మాయిలంతా దాదాపు యంగ్ వారే కావడంతో కంటెస్టెంట్ల మధ్య బోలెడంత లవ్‌ట్రాక్‌లు నడుస్తున్నాయి. ఇక రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త టాస్క్‌లు,స్కిట్లతో బిగ్‌బాస్ ప్రేక్షకులను అలరిస్తోంది. కాగా బిగ్‌బాస్ ప్రతి సీజన్లోనూ ఓ ఎపిసోడ్‌ను ఫ్యాషన్ షోకు కేటాయించే సంప్రదాయం కొనసాగుతోంది. అలాగే ఈ సీజన్లో కూడా నేడు బిగ్‌బాస్ హౌజ్‌లో ష్యాషన్ షో జరగనుంది. చదవండి: అఖిల్‌కు సర్ప్రైజ్ ఇవ్వనున్న బిగ్‌బాస్ అయితే ఈ ఫ్యాషన్ షోలో ఇంటి సభ్యులందరూ సంప్రదాయమైన దుస్తులను ధరించాల్సి ఉంటుంది. దీంతో కంటెస్టెంట్లందరూ తమ ట్రెడీషనల్ లుక్‌లో జిగేలు మనిపించారు. అబ్బాయిలంతా కుర్తా దుస్తుల్లో స్టేజ్‌పై ర్యాంప్ వాక్‌తో అదరగొట్టగా..ఇక అమ్మాయిలయితే తమ అందచందాలతో మైమరిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. చీర కట్టుతో పదహారణాల తెలుగింటి అమ్మాయిలాగా మెరిసిపోతున్నారు. అంతేగాక బిగ్‌బాస్ గ్యాంగ్ అంతా స్టేజ్ మీదకు వచ్చి డాన్స్‌లతో కెవ్వు మనిపించనున్నారు. ఆ తర్వాత అవినాష్ ఇంట్లోని ఆడవాళ్లకు అద్దంలా మారబోతున్నాడు. తన ముందుకు వచ్చిన అమ్మాయిలతో అద్దంగా మారిన అవినాష్ వారిపై సరదాగా సెటైర్లు వేస్తూ హాస్యం పండించనున్నారు. చదవండి: బిగ్‌బాస్: మాస్టర్ కాళ్లు పట్టుకున్న సోహైల్ Adarakotte fashion show ayyaka...#Avinash addamlo book aipoyaru 😂 #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/gGGvolKgZr — starmaa (@StarMaa) October 2, 2020 -
క్వారంటైన్ ఫ్యాషన్ వీక్
-
వావ్.. క్వారంటైన్ ఫ్యాషన్ వీక్ చూశారా?
లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అత్యవసర సేవలు మినహా అన్ని సంస్థలు మూతపడటంతోపాటు ప్రజలంతా ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఇళ్లల్లో ఉంటున్న వారికి ఎంటైర్టైన్మెంట్ విషయంలో ఎలాంటి లోటు ఉండటం లేదు. సోషల్ మీడియాలో అనేక వినోధాత్మక కార్యక్రమాలు పుట్టుకొస్తున్నాయి. బోరింగ్ సమయాన్ని సరాదాగా మలుచుకునేందుకు అనేక మంది కొత్త దారులు వెతుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు విచిత్ర వేషధారణతో ఫ్యాషన్ షోను నిర్వహిస్తూ అందరిని ఆకట్టుకునేందకు ప్రయత్నిస్తున్నారు. లాక్డౌన్లో ఉన్న ప్రజలకు బోలెడంతా వినోదాన్ని పంచుతున్నారు. (ఈ చిత్రంలో ఎన్ని పులులు ఉన్నాయి? ) నార్త్ కరోలినాకు చెందిన అలక్స్ జేమ్స్, కెల్టన్ ఎడ్వర్డ్స్ అనే ఇద్దరు వ్యక్తులు ఇంట్లోనే ‘క్వారంటైన్ ఫ్యాషన్ వీక్ 2020’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇందుకు గృహ వస్తువులైన దుప్పట్లు, కర్టెన్లు, బెడ్షిట్లు, టవల్స్‌ను విభిన్న రకాలుగా ఒంటిపై ధరించి వినూత్నంగా ఫ్యాషన్ షోను నిర్వహిస్తున్నారు. ఈ వీడియోలను తమ ట్విటర్, ఫేస్బుక్, టిక్‌టాక్ అకౌంట్లో పోస్ట్ చేస్తున్నారు. మొదటి పార్ట్ వీడియోకు 3.5 మిలియన్లు వ్యూవ్స్ వచ్చాయి. వీటిని చూసిన నెటిజన్లు అలక్స్, ఎడ్వర్డ్ల చమత్కారాన్ని అభినందిస్తున్నారు. వావ్ వాట్ ఏ ఫ్యాషన్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు. (‘మీరు నామినేట్ అయ్యారని మరిచిపోకండి’ ) -
స్త్రీ డిజైనర్ ఫ్యాషన్ షో అదుర్స్
-
నిఫ్ట్ స్పెక్ట్రమ్ 2020 వేడుకలు
-
కిడ్స్ గ్లామ్ ఫ్యాషన్ షో
-
టెంపెస్ట్ 2020
-
ఫ్యూచర్ కిడ్స్...ఫ్యూజన్ షో
-
ఫ్యాషన్ షో అదుర్స్
-
‘జూబ్లీ ఫరేమా–2020’
-
బ్యూటీస్..క్యాట్‌వాక్
-
అల్ట్రా ఫ్యాషన్ అదరహో
-
ర్యాంప్ వాక్‌లో సోనమ్ షోయగం
-
ఫ్యాషన్ ‘షో’
-
ఫ్యాషన్ పదనిసలు
-
మిసెస్ మామ్ పోటీలు
-
బ్యూటీ షో
-
ఫ్యాషన్ షో : షో టాపర్‌గా సింధు అదరహో
-
షో టాపర్‌గా సింధు అదరహో
సాక్షి, హైదరాబాద్: మరి కొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాలు పండుగలు, వివాహ వేడుకలతో బిజీగా మారతాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ ‘శాంక్చురి’ పేరుతో కొత్త కలెక్షన్‌ను పరిచయం చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో ఫ్యాషన్ షో నిర్వహించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణీ పీవీ సింధు షో టాపర్‌గా వ్యవహరించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన తర్వాత స్వస్థలంలో సింధు పాల్గొన్న తొలి బహిరంగ కార్యక్రమం ఇదే కావడం విశేషం. ఈ వేడుకలో సింధు పింక్ కలర్ హాఫ్ షోల్డర్ జాకెట్, అదే కలర్ స్కర్ట్‌తో పూబాలగా కనువిందు చేశారు. సింధు, శ్రియా భూపాల్ ఇద్దరు చిన్ననాటి మిత్రులు. ఈ పరిచయం మేరకు సింధు షోటాపర్‌గా వ్యవహరించారు. ఇక తన నూతన కలెక్షన్ గురించి శ్రియా భూపాల్ మాట్లాడుతూ.. ‘పెళ్లి, పండుగలు వంటి వేడుకల సందర్భంగా ధరించడానికి వీలుగా సంప్రదాయ, సమాకాలీన శైలులకు సంబంధించిన దుస్తులను రూపొందించాను. ఈ పండుగల సీజన్ కోసం తేలికపాటి, మృదువైన, ఆహ్లాదకరమైన వస్త్రశ్రేణిని పరిచయం చేస్తున్నాను’ అని తెలిపారు. ఈ కార్యక్రమానికి నమ్రతా శిరోద్కర్, సానియా మీర్జా కూడా హాజరయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వయ్యారి భామా నీ హంస నడక...
-
మెరుపు తీగలు..
-
షోయగం
-
డియర్ మామ్
-
మెట్ గాలా - 2019 హంగామా
-
టాలెంట్ షో
-
అదిరేటి డ్రెస్సు నేనేస్తే..
-
భార్య ఫ్యాషన్ షోలో పాల్గొన్నదని..
చంఢీగడ్ : భార్య ఫ్యాషన్ షోలో పాల్గొనడం చూసి ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వ్యక్తి తుపాకీతో ఆమె మీద దాడి చేసి గాయపర్చాడు. వివరాలు.. ఆశారాణి(32) అనే మహిళ గత కొద్ది నెలలుగా గురుగ్రామ్‌లోని ఓ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తుంది. ఈ క్రమంలో గత ఆదివారం పాఠశాల యాజమాన్యం సిటీ క్లబ్లో టీచర్ల కోసం ఓ పార్టీని ఏర్పాటు చేసింది. దాంతో పాటు ఫ్యాషన్ షోని కూడా నిర్వహించింది. అయితే పార్టీకెళ్లే ముందు తాను కూడా ఫ్యాషన్ షోలో పాల్గొంటానని ఆశారాణి.. భర్త ఇందర్‌జిత్‌ను కోరింది. అందుకు అతను ఒప్పుకోలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. ఈ క్రమంలో పార్టీకెళ్లిన ఆశారాణి రాత్రి 11 గంటలు దాటిన ఇంటికి రాలేదు. దాంతో ఆమె భర్త పాఠశాలకు వద్దకు వెళ్లాడు. కానీ ఆమె అక్కడ కన్పించలేదు. దాంతో ఇందర్జిత్.. తన భార్యకు ఫోన్ చేసి గొడవపడ్డాడు. దాంతో ఆశారాణి పార్టీ జరుగుతున్న అడ్రస్ లోకేషన్‌ని వాట్సాప్ ద్వారా పంపించింది. పార్టీ జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్న ఇందర్జిత్.. అక్కడ ఆమె ఫ్యాషన్ షోలో పాల్గొనడం చూశాడు. దాంతో వెంటనే ఆమెని తనతో పాటు ఇంటికి బయలుదేరమన్నాడు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. దాంతో ఆగ్రహించిన ఇందర్జిత్.. వెంట తీసుకువచ్చిన గన్‌తో ఆమెపై దాడికి దిగాడు. తొలుత తన భార్య ఫోటో కనిపిస్తున్న స్క్రీన్‌ను కాల్చేశాడు. అనంతరం భయంతో పరుగు తీస్తున్న ఆశారాణి కాలు మీద కాల్చాడు. ఇంత తతంగం జరుగుతున్నప్పటికి అక్కడ ఉన్న వారు ఎవరూ కూడా ఆమెను కాపాడే ప్రయత్నం చేయలేదు. క్లబ్లో పని చేసే ఓ వ్యక్తి ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆశారాణిని ఆస్పత్రిలో చేర్చి.. ఆమె వద్ద నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. అనంతరం భర్త ఇందర్జిత్ మీద కేసు నమోదు చేశారు. -
ఫ్యాషన్ మెరుపుతీగలు
-
మెరుపుల్.. విరుపుల్
-
ముగిసిన ఫ్యాషన్ షో
-
దాండియా ఆటలు ఆడ...
-
ఫ్యాషన్ షో జోష్
-
కిర్రాక్ వాక్
-
సన్నీలియోన్‌కి భారీ భద్రత
కర్ణాటక, బొమ్మనహళ్లి: బెంగళూరు నగరంలో ఈనెల 3న జరగనున్న బాలీవుడ్ నటి సన్నీలియోన్ కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని మాన్యత టెక్ పార్క్‌లో నిర్వహిస్తున్న సన్నీ నైట్ ఫ్యాషన్ కార్యక్రమంలో సన్నీలియోన్ పాల్గొననున్నారు. దీంతో వందల సంఖ్యలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సన్నీలియోన్ వస్తుండగా కొన్ని కన్నడ సంఘాల వారు వ్యతిరేకిస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేస్తున్నారు. -
బెంగళూరు బాలికకు అందాల టైటిల్
కర్ణాటక,జయనగర: కొద్దిరోజుల క్రితం దేశ ముంబయి నగరంలో జరిగిన మ్యాక్స్ ఎలైట్ లుక్ ఇండియా 2018 ఫ్యాషన్ షోలో నిర్వహించిన ఉత్తమ మోడల్ పోటీల్లో బెంగళూరు అ మ్మాయి విరోనికా రూబి విజేతగా నిలిచి అందాల కిరీటం సాధించింది. ఫ్యాషన్ రంగంలో ప్రతిభావంతులైన యువతీ, యు వకులను గుర్తించడానికి ఆగస్టు నుంచి వివిధ నగ రాల్లో పోటీలు నిర్వహించి ఫైనల్స్‌కు మొత్తం 16 మంది పోటీదారులను ఎంపిక చేశారు. ఈ క్రమంలో సోమవారం ముంబయిలో 16 మంది పోటీదారులకు మొత్తం మూడు రౌండ్ల ఫైనల్ పోటీలు నిర్వహించారు. మూడు రౌండ్లలో విరోనికా రూబి ప్రతిభను చాటుకుని ఉత్తమ మోడల్ టైటిల్‌ను గెల్చుకుంది. పురుషుల విభాగంలో ముంబయి నగరానికి చెందిన ప్రతీక్‌సింగ్ విజేత అయ్యాడు. వచ్చే ఏడాది జనవరిలో కెనరి ఐల్యాండ్‌లో జరిగే అంతర్జాతీయ అందాల పోటీల్లో విరోనికా పాల్గొంటుంది. -
ప్యారిస్ బొమ్మ
-
ఫ్యాషన్ కిడ్స్
-
‘ఉత్సవ్’కు రెడీ..
-
తాప్సీ..త‘లుక్’
-
ఫ్యాషన్ బ్యూటీ
-
చీర కట్టు అదుర్స్
-
జిల్ జిగేల్మనిపించిన కరీనా...
-
ఆమె ముడిసరుకు తెలిస్తే షాక్ అవాల్సిందే
ఆకర్షణీయమైన వస్తువులు, బ్యాగులు, చెవి రింగులను కళాత్మకంగా ఎవరైనా చేస్తారు. అందుకోసం రాళ్లు, బంగారం, వెండి ఇలా ఏవేవో వాడుతుంటారు. వెంట్రుకలతో, కుట్టు మిషన్లతో ఇలా కాదేదీ కళకనర్హం అన్నట్లు అన్ని వస్తువులను వాడేశారు కళాకారులు. అయితే వీరందరికీ భిన్నాతిభిన్నంగా బ్రిటన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌కు చెందిన అలైస్ పాట్స్ ఆలోచించారు. మహిళల కోసం పలు రకాల ఉత్పత్తులను భిన్నమైన పదార్థాలతో తయారు చేసి చాలా ఫేమస్ అయిపోయారు. ఎందుకంటే వాటిని తయారు చేసేందుకు ఆమె ఎంచుకున్న ముడిసరుకు తెలిస్తే షాక్ అవాల్సిందే. అవేంటో తెలుసా.. మన శరీరం నుంచి ఉత్పత్తయ్యే చెమట, మూత్రం, రక్తం! ఏంటీ వీటితో ఎలా తయారు చేస్తారనుకుంటున్నారా..? వీటి నుంచి తెల్లగా మెరిసే స్ఫటికాలను తయారు చేసి బట్టలను చాలా అందంగా ముస్తాబు చేస్తారట. ప్లాస్టిక్‌ను వాడే కన్నా వీటితో తయారు చేస్తే ప్రకృతికి కూడా మేలు చేసినట్లవుతుందని పాట్స్ చెబుతున్నారు. ఇటీవల కాలేజీ ఫ్యాషన్ షోలో ఆమె చేసిన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచితే అనూహ్య స్పందన వచ్చింది. -
ఫ్లయింగ్ ష్యాషన్ షో...!
అక్కడ మోడళ్లు లేకుండానే ఆకర్షణీయమైన, రంగు రంగుల దుస్తులు తమ ‘ఫ్యాషన్ పరేడ్’ను తామే నిర్వహించాయి. సంప్రదాయ ఫ్యాషన్‌షోలకు భిన్నంగా డ్రోన్లు మోడళ్ల పాత్ర పోషించి ర్యాంప్‌పై నడిచాయి. ఇదంతా ఎక్కడో నూతన పోకడలు, కొత్త ఫ్యాషన్లకు పుట్టిళ్ల వంటి మిలాన్, న్యూయార్క్, పారిస్ నగరాల్లో జరిగిందనుకుంటే మీరు పొరబడినట్టే...ఇంకా మహిళలపై ఆంక్షలు అమలయ్యే, స్త్రీలకు సంపూర్ణహక్కులు కొరవడిన సౌదీ అరేబియాలో ఇలాంటి వినూత్నమైన ప్రయోగం జరిగింది. ఇటీవల జెద్దాలోని హిల్టన్ హోటల్లో జరిగిన ఈ ప్రదర్శనను ‘ఫ్యాషన్ హౌస్’గా పిలుస్తున్నారు. మధ్యప్రాచ్యంలో ఇలాంటి నవతరం టెక్నాలజీకి ఊతమిచ్చేందుకు ఈ షో నిర్వహించారు. అల్జవాహర్జీ అనే డిజైనర్ దీని వెనక సాగించిన కృషి వల్ల ఇది సాధ్యమైంది. రంజాన్ మాసం పవిత్రతకు భంగం కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఇంతవరకున్న భావనలకు భిన్నంగా సౌదీ అరేబియాలో గత ఏప్రిల్‌లో జరిగిన ఫ్యాషన్వీక్లో మహిళలుపాల్గొనేందుకు అనుమతినిచ్చారు. మొదట ముస్లిం మహిళలు ధరించే బురఖాను పోలిన ‘నల్లటి అబయ’ను, రెండో ఐటెంగా నల్లటి హ్యాంగర్‌కు తగిలించిన పొడవైన ‘ఆకుపచ్చ కుర్తా’ (దానితోపాటు« ధరించే నెక్లెస్‌తో సహా), మూడో వస్తువుగా స్ట్రాపులతో ఉన్న ప్రింటెడ్ డ్రస్ ప్రదర్శించారు. ఈ మూడు ప్రదర్శనలకు సంబంధించిన వీడియోలో అక్కడి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి వేలాది వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి. గత ఫిబ్రవరిలో ఇటలీకి చెందిన ఫ్యాషన్ హౌస్ ‘డాల్స్ అండ్ గబానా’ బ్రాండ్ హ్యాండ్‌బ్యాగ్‌లను డ్రోన్ల ద్వారా ప్రదర్శించింది. ఇలాంటి షోలను నిర్వహించడం సాంకేతికంగా సమస్యలతో కూడుకున్నదే. డ్రోన్ల సిగ్నళ్లకు అంతరాయం కలగని విధంగా అతిథుల ఫోన్లలో వైఫైను ఆపేయాలంటూ ముందుగా విజ్ఞప్తిచేశారు. దాదాపు గంట పాటు అయోమయ పరిస్థితులు కొనసాగాక, చివరకు ఈ షో మొదలైంది. డ్రోన్ల ద్వారా హ్యాడ్బ్యాగ్ల మోడలింగ్ వీడియోలు ఆ తర్వాత ఆన్లైన్లో హల్చల్ చేశాయి. -
‘దెయ్యాల ఫ్యాషన్ షో’, ఆన్లైన్లో సెటైర్లు
ఇప్పుడిప్పుడే సౌదీ మహిళలు తరతరాలుగా తమకు విధించిన ఆంక్షల నుంచి బయటపడుతూ వస్తున్నారు. క్రీడా పోటీలను వీక్షించడానికి స్టేడియాలకు వెళ్లే అనుమతి, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఒక్కొక్కటిగా పొందుతూ వస్తున్నారు. ఈ సంచలనాత్మక నిర్ణయాలను సోషల్ మీడియా సైతం ఆహ్వానిస్తోంది. కానీ ఇప్పుడిప్పుడే ఆంక్షల నుంచి బయటపడుతున్నామని ఆశించిన సౌదీ మహిళలకు ఆ దేశం షాకిచ్చింది. మహిళలే సెంట్రాఫ్ అంట్రాక్షన్గా నిలిచే ఫ్యాషన్ షోల్లో, వారికి బదులుగా డ్రోన్లను ప్రవేశపెట్టింది. సౌదీ అరేబియా జిద్ధాలో జరిగిన ఫ్యాషన్ షోల్లో డిజైన్లను ప్రదర్శించడానికి ఒక్క మహిళా మోడల్ కూడా పాల్గొనలేదు. వారికి బదులుగా డ్రోన్ల ద్వారా వస్త్రాలను ప్రదర్శించారు. దీంతో ఈ ఫ్యాషన్ షో చాలా ఫన్నీగా ఉందంటూ కామెంట్లు వస్తున్నాయి. ఈ ఫ్యాషన్ షోపై సోషల్ మీడియాలో పలువురు పలు అభిప్రాయాలను వెలువరిస్తున్నారు. ఇది చాలా భయానకంగా ఉందని, అధునాతన దుస్తులను దెయ్యాలు ధరించి ప్రదర్శిస్తున్నట్టు ఉందంటున్నారు. దెయ్యాల ఫ్యాషన్ షోగా అభివర్ణిస్తున్నారు. మరికొంత మంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సౌదీ అరేబియా మహిళల సాంప్రదాయిక దృక్పధంపై ఇది ప్రభావం చూపనుందని పేర్కొంటున్నారు. అయితే ఈ మాదిరి రియాక్షన్ వస్తుందని నిర్వాహకులు అసలు ఊహించలేదట. రంజాన్ నెలను దృష్టిలో ఉంచుకుని ఈ షోను ప్లాన్ చేసినట్టు తెలిసింది. కాగ, ఏప్రిల్‌లో జరిగిన తొలి ఫ్యాషన్ వీక్‌లో కూడా కేవలం మహిళా ప్రేక్షకులను అనుమతించారు. ఫీమేల్ మోడల్స్ ప్రదర్శించే వాటిని వారు మాత్రమే చూసేలా ఆ ఫ్యాషన్ షోను నిర్వహించారు. This Saudi Arabian fashion show replaced all its models with drones, to eerie effect: https://t.co/bD4Z3xxWy6 pic.twitter.com/PR09QMbPBW — Dazed (@Dazed) June 7, 2018 I’m dying at this fashion show in Saudi😂😂 they weren’t allowed female models pic.twitter.com/gkMt9bKQI8 — WORLDSTARHIPHOP (@WORLDSTARRCLIPS) June 8, 2018 -
మీరిద్దరూ కలిస్తే బాగుంటుంది: అభిమానులు
‘దీపిక పదుకొనె’... అందం, అభినయం, అదృష్టాల కలబోత. అందుకే ఈ ముద్దుగుమ్మతో నటించాలని బాలీవుడ్ పరిశ్రమలో పెద్ద హీరోల నుంచి యువ హీరోల వరకూ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈ భామ షారుఖ్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, రణ్వీర్ సింగ్ వంటి బడా హీరోలందరి సరసన నటించించారు. ఆయా చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కూడా సాధించాయి. అంతేందుకు ఎన్నో వివాదాల మధ్య విడదలయిన ‘పద్మావత్’ చిత్రం కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో దీపికతో పాటు రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే ఈ చిత్ర విజయంలో దీపిక అందం, అభినయం ప్రాధాన పాత్ర పోషించాయనడంలో సందేహం లేదు. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ ‘పొడుగుకాళ్ల’ సుందరి అప్పుడప్పుడు ఫ్యాషన్ షోలల్లో ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తు హొయలొలికిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటే కొన్ని రోజుల కిందటే ఈ భామ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనిష్ మల్హోత్ర నిర్వహించిన ‘మిజ్వాన్ ఫ్యాషన్ షో’లో రణ్‌బీర్‌తో కలిసి ర్యాంప్ వాక్ చేశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఇది చూసి వారి అభిమానులు వీరిరువురిని మరోసారి బిగ్‌స్క్రీన్ మీద చూడాలని ఆశిస్తున్నారు. ఇదిలావుంటే ఈ షోకు సంబంధించి రణ్‌బీర్‌తో ఉన్న ఫోటోలను దీపిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలపై అభిమానులు భిన్న అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కొందరు దీపిక మరోమారు రణ్‌బీర్‌తో కలిసి నటిస్తే బాగుంటుందని తెలపగా, మరికొందరు మీరిద్దరూ కలిసిపోయి మీ పాత బంధాన్ని కొనసాగిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి కామెంట్స్ చూసి రణ్వీర్ అభిమానులు.. ‘మీరు రణ్‌బీర్‌తో కన్నా రణ్వీర్ సింగ్‌తో ఉంటేనే చాలా అందంగా ఉంటార’ని కామెంట్ చేశారు. గతంలో రణ్‌బీర్ - దీపిక ప్రేమించుకుని తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. విడిపోయిన తర్వాత కూడా వీరివురు ‘యే జవాని హే దివాని’, ‘తమాషా’ చిత్రాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం రణ్వీర్ సింగ్, దీపిక పదుకొనెల పెళ్లికి సంబంధించిన గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిరువురూ నవంబర్‌లో పెళ్లిపీటలెక్కనున్నట్లు వదంతులు షికారు చేస్తున్నాయి. కానీ దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
ర్యాంప్ షో
-
ఫ్యాషన్ షో.. స్టార్స్ ఫ్లో
నగరంలో నిర్వహిస్తున్న ఫ్యాషన్ షోలలో తారల తళుకులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ర్యాంప్‌పై కొలువుదీరే మోడల్స్ మధ్యలో ఒకరిద్దరే స్టార్స్ కనిపించేవారు. అయితే ఆ దశ నుంచి తారల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ‘టీచ్ ఫర్ ఛేంజ్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ షో పూర్తిగా స్టార్స్‌కే పరిమితమైంది. దీంతో సిటీలో సరికొత్త ట్రెండ్‌కి నాంది పలికినట్టయింది. సాక్షి, సిటీబ్యూరో : సిటీలో ఫ్యాషన్ రంగం ఊపందుకుంటున్నా, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డిజైనర్లు తమ బొటిక్‌లను ఇక్కడ నెలకొల్పుతున్నా... ముంబైతో పోలిస్తే ఇక్కడి ఫ్యాషన్ ఈవెంట్లలో సినీతారల సందడి బాగా తక్కువేనని చెప్పాలి. కారణమేదైనా... ఎక్కువగా సినిమారంగ ప్రముఖులు ర్యాంప్ మీద కనపడకపోవడం సిటీలోని ఫ్యాషన్ ఈవెంట్ల రేంజ్‌ని తగ్గిస్తోందని గత కొంత కాలంగా నగరానికి చెందిన ఫ్యాషన్ రంగ ప్రముఖులు అంటున్నారు. అయితే ఇటీవల పరిశీలిస్తుంటే నిదానంగానే అయినా... ర్యాంప్ షోలలో స్టార్స్ సందడి పెరగడం కనిపిస్తోంది. న్యూ ‘ఛేంజ్’.. ఈ క్రమంలోనే మోడల్స్ లేకుండా పూర్తిగా స్టార్స్‌తో ఒక షోని నిర్వహించి ‘టీచ్ ఫర్ ఛేంజ్’ సంస్థ కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. తమ ఎన్జీఓకి నిధుల సేకరణ నిమిత్తం ఈ సంస్థ నిర్వహించిన షోలో నగరానికి చెందిన డిజైనర్ రాజ్యలక్ష్మి గుబ్బా డిజైన్ చేసిన బెనారస్ చీరల్ని ధరించి రకుల్, రెజీనా తదితర తారలు... మరో డిజైనర్ వరుణ్ చకిలం సృష్టించిన మెన్స్‌వేర్‌తో విజయ్ దేవరకొండ లాంటి యువ హీరోలు ఫలక్‌నుమా ప్యాలెస్‌లోని డైనింగ్ టేబుల్ లాంజ్‌ని తమదైన శైలిలో మెరిపించారు. సిటీలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ ఈవెంట్ మరింత మంది స్టార్స్‌ని ఫ్యాషన్ ఈవెంట్ల వైపు మళ్లించడం తథ్యంగా కనిపిస్తున్న నేపథ్యంలో.. సిటీ ర్యాంప్‌పై మెరిసే తారల సంఖ్య భవిష్యత్తులో విజృంభించడం ఖాయం. స్టార్+డిజైనర్=గ్లామర్ ఒక తారను త‘లుక్’మనిపించాలన్నా, కొంతకాలం పాటు యూత్‌ని సినీ స్టైల్‌తో ఉర్రూతలూగించాలన్నా డిజైనర్‌దే ప్రధాన పాత్ర. గ్లామర్ రంగానికి ఫ్యాషన్‌తో విడదీయలేని సంబంధం ఉంటుంది. నగరం వేదికగా ప్రస్తుతం ఫ్యాషన్ రంగంలో తమదైన ముద్ర వేద్దామని ప్రయత్నిస్తున్న డిజైనర్లతో పాటు ఎందరో ఫ్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్స్ అంతిమ లక్ష్యం సినిమా రంగమే అయి ఉంటుంది. మరోవైపు ఔత్సాహిక డిజైనింగ్ నిపుణులకు ఊపునిచ్చేది, వారి వర్క్‌ను ప్రపంచానికి పరిచయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించేవీ ర్యాంప్ షోలే. అలాంటి షోలకు టాలీవుడ్ ప్రముఖుల హాజరు ఒక తప్పనిసరి అవసరం అనడం నిస్సందేహం. ట్రెండీ.. బ్యూటీ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ షో స్టార్స్‌తో కళకళలాడింది. ఇందులో మంచులక్ష్మి, రకుల్‌ప్రీత్ సింగ్, విజయ్ దేవరకొండ, హర్షవర్ధన్ రానే, ప్రగ్యా జైస్వాల్, రెజీనా కసాండ్రా, కృతి కర్బందా, సీరత్ కపూర్, అల్లు శిరీష్, సుర్భి పురాణిక్, హెబ్బా పటేల్, నిఖిల్ సిద్ధార్థ్, సంయుక్త హర్నాడ్, ఈషా రెబ్బా, శుభ్ర అయ్యప్ప, అనీషా ఆంబ్రోస్, మధుశాలిని, తేజస్వి మడివాడ, శివానీ రాజశేఖర్, నవదీప్, అడవి శేషు, సుశాంత్ అక్కినేని, నవీన్ చంద్ర, అదిత్, ఆదర్శ్ బాలకృష్ణ, ప్రిన్స్, ప్రియదర్శి, సిద్ధు జొన్నల గడ్డ, సంధ్యారాజు తదితర తారలు పాల్గొన్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో 101 డైనింగ్ ఏరియాలో ఈ షో నిర్వహించడం మరో విశేషం. కేవలం తమ సంస్థకే ఈ ప్లేస్‌ని ప్రత్యేకంగా ఇస్తారని సంస్థ ప్రతినిధి చైతన్య చెప్పారు. ఎలాంటి ప్రత్యేకమైన ర్యాంప్ నిర్మించకుండా, కార్పెట్ మీదనే అతిథుల సమక్షంలో స్టార్స్ ఈ ఈవెంట్లో వాక్ చేశారు. ఎంపీ జయాబచ్చన్, మాజీ ఎంపీ రేణుకా చౌదరి, బాలీవుడ్ తార అదితిరావ్ హైదరిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. యువోత్సాహం... టాలీవుడ్లో సరికొత్త తరం, యువ రక్తం పరవళ్లు తొక్కుతున్న ఫలితం ఫ్యాషన్ రంగంలో కూడా కనిపిస్తోంది. చిరంజీవి తరం తారలతో పోలిస్తే... ప్రస్తుత జనరేషన్ డిజైనర్లకు బాగా ప్రాధాన్యతనిస్తోంది. దీంతో ర్యాంప్‌పై తారల సందడి బాగా పెరిగింది. నగరంలో జరుగుతున్న ఈవెంట్లలో షో స్టాపర్స్‌గా కనిపించేందుకు వీరు బాగా ఉత్సాహం చూపిస్తున్నారు. నవదీప్, మంచులక్ష్మి, సమంత, రానా తదితరులు తరచూ ఫ్యాషన్ ఈవెంట్లలో మెరుస్తున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుంటున్న నాని, రకుల్‌ప్రీత్ సింగ్, రెజీనా, సాయిధరమ్ తేజ్, విజయ్ దేవరకొండ లాంటి రైజింగ్ స్టార్స్ సైతం డిజైనర్స్‌తో చేతులు కలపడంతో ఈవెంట్లకు నిండుదనం చేకూరుతోంది. ముఖ్యంగా ఎన్జీఓ అనుబంధ కార్యక్రమాలపై వీరు ఆసక్తి చూపుతున్నారు. పరిస్థితి మారింది... ఒకప్పుడు.. అంటే పదేళ్ల క్రితం ఒక సెలబ్రిటీని ఈవెంట్లకు ఒప్పించాలంటే సులభమైన విషయం కాదు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. తారలు స్వచ్ఛందంగా పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు. మా ఎన్జీఓ ఇప్పటికే సేవా పరంగా మంచి అభివృద్ధి సాధించిన క్రమంలో... ఇలాంటి షోలలో పాల్గొనడానికి మాత్రమే కాదు మరిన్ని కార్యక్రమాలకూ స్టార్స్ మాకు సహకారం అందిస్తున్నారు.– చైతన్య, టీచ్ ఫర్ ఛేంజ్ -
వారి కోసం రణ్‌బీర్, దీపికా కలిసిపోయారు..!
ముంబై : బాలీవుడ్ మాజీ ప్రేమ జంట రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణె కలిసిపోయారు... అయితే నిజజీవితంలో కాదులెండి.. ‘ద వాక్ ఆఫ్ మిజ్వాన్’ పేరిట ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్వహిస్తున్న ఫ్యాషన్ షో కోసం. ఏప్రిల్ 9న ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో జరిగే ఫ్యాషన్ షోలో మిజ్వాన్ అనే ఎన్జీవోకు చెందిన చికెన్కారీ(ఎంబ్రాయిడరీ) కళాకారులు రూపొందించిన దుస్తులు ధరించి వీరు ర్యాంప్ వాక్ చేయనున్నారు. చికెన్కారీ కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మనీష్ మల్హోత్రా మిజ్వాన్ వెల్ఫేర్ సొసైటీ(ఎన్జీఓ)తో తొమ్మిదేళ్ల నుంచి ప్రయాణం కొనసాగిస్తున్నారు. అందుకోసం ప్రతీ ఏడాది బాలీవుడ్ నటులతో ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నారు. గతేడాది బాలీవుడ్ బాద్షా, హీరోయిన్ అనుష్క శర్మలతో పాటు కలిసి ర్యాంప్ వాక్ చేశారు. ఈ ఎన్జీఓకు రణ్‌బీర్ కపూర్, షబానా అజ్మీ, నమ్రత గోయల్ గుడ్‌విల్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. మహిళా సాధికారత కోసం పనిచేస్తున్న ఈ ఎన్జీవోకు బాలీవుడ్ అండదండలు ఉంటాయని నటి షబానా అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం తనకెంతో సంతోషంగా ఉందని రణ్‌బీర్ చెప్పాడు. గ్రామీణ భారతంపై దృష్టి సారించాలని, అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు అవకాశాలు కల్పించినపుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గతంలో అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా, ప్రియాంక చోప్రా, శ్రద్ధా కపూర్ కూడా ఫ్యాషన్ షోలో పాల్గొని తమ వంతు సాయం చేశారు. -
కరీనాకేమయ్యింది...
న్యూ ఢిల్లీ : కరీనా కపూర్‌కు ఏమైంది, అసలు ఆమె ఆహారం తీసుకుంటుందా లేదా? ఎందుకిలా అస్థిపంజరంలా మారిపోయింది...మళ్లీ ఏదైనా సర్జరీ చేయించుకుందా, లేదా మళ్లీ సైజ్ జీరో కోసం ప్రయత్నిస్తుందా...అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. విషయమేంటంటే కరీనా కపూర్ అప్పుడప్పుడు ర్యాంప్ వాక్ చేస్తుందని అందరికి తెలిసిన విషయమే. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఆమె ర్యాంప్ వాక్‌చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. 2016 డిసెంబర్లో తైమూర్ పుట్టిన తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆమె ర్యాంప్ వాక్ చేశారు. తన అభిమాన డిజైనర్ మనిష్ మల్హోత్రా కోసం తన బెస్ట్ ఫ్రెండ్ అమృత అరోరాతో కలిసి సింగపూర్‌లో నిర్వహించిన ఒక ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను అమృత అరోరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.ఈ ఫోటోల్లో కరీనా మరీ పీలగా.. చిక్కిపోయినట్లు ఉన్నారు. ఈ ఫోటోలు చూసి నిరుత్సాహపడిన అభిమానులు కరీనాకు ఏమైంది అస్థిపంజరంలా తయారయ్యింది, మళ్లీ సైజ్ జీరో కోసం ప్రయత్నిస్తుందా, ఏదైనా సర్జరీ చేయించుకుందా అంటూ రకరకాల కామెంట్లు చేశారు. కొందరు కరీనా తన వయసు కంటే పెద్దదిగా కన్పిస్తుందని అమృత అరోరానే అందంగా ఉందని కామెంట్ చేశారు. తల్లి అయ్యాక కరీన తన బరువును తగ్గించుకోవడానికి చాలా శ్రమపడ్డారు. అందుకు సంబంధించి ఆమె జిమ్‌లో కష్టపడుతున్న ఫోటోలను తన అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం కరీనా శశాంక్ ఘోష్ ‘వీర్ ది వెడ్డింగ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో కరీనాతో పాటు సోనమ్ కపూర్, స్వర భాస్కర్ లు కీలక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు -
ఫుల్ జోష్
-
ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్‌తో మెరిసిన తారలు
-
వారెవ్వా.. మాగ్నోవా
అందమైన భామలు.. లేత మెరుపు తీగలై క్యాట్‌వాక్ చేసుకుంటూ వస్తుంటే, అబ్బాయిలు నవ మన్మథులై ర్యాంప్‌పై నడిస్తే.. చూసేందుకు రెండు కళ్లూ చాలవు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శనివారం జరిగిన మాగ్నోవా–2018లో విద్యార్థుల ఫ్యాషన్ షో కనుల నిండుగా జరిగింది. అంతకుముందు కళాశాలలో ‘ఛలో’ హీరో నాగశౌర్య సందడి చేశారు.లేటెస్ట్ డిజైన్ డ్రెస్సుల్లో మెరుపుతీగల్లా మగువలు, హుందాతనం ఒట్టిపడే దుస్తుల్లో మగవారు.. ర్యాంప్‌పై నడిచి ఆకట్టుకున్నారు. కొత్తదనం డిజైన్లతో విద్యార్థులు క్యాట్‌వాక్ చేస్తుంటే సహచరులు సందడి చేశారు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎంబీఏ విభాగం, స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన మాగ్నోవా–2018లో విద్యార్థుల ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యంగ్ మేనేజర్, మార్కెటింగ్, సెల్ఫ్ ఈవెంట్స్, కో–ఆర్డినేషన్ ఈవెంట్స్, ట్రెజర్ హంట్, పోస్టర్ మేకింగ్ పోటీల్లో విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు. అనంతరం జరిగిన నృత్యాలు ఆకట్టుకున్నారు. నైపుణ్యాలు పెంచుకోండి పాఠ్యాంశాలను నేర్చుకోవడంతో పాటు ఆ అంశాల్లో నైపుణ్యాలను పెంచుకోవాలని, అప్పుడే ఉపాధి అవకాశాలు లభిస్తాయని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఇన్స్టిట్యూట్స్ సెక్రటరీ డాక్టర్ ఆర్.మనోజ్‌కుమార్ తెలిపారు. మాగ్నోవా–2018 ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్, డీన్ రాజేష్ సి.జంపాల, డైరెక్టర్ బాబూరావు మాట్లాడుతూ విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని పెంచేందుకు తమ కళాశాలలో ఏటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మాగ్నోవా కన్వీనర్ రమేష్ చంద్ర, మేనేజ్మెంట్ విభాగం అధ్యాపకులు బి.సుమలత, కె.విజయ్, వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. – మొగల్రాజపురం(విజయవాడ తూర్పు) -
క్యాట్ ఫ్యాషన్ షో
-
‘క్యాట్’వాక్
లబ్బీపేట (విజయవాడ తూర్పు) : పిల్లి ఎదురొస్తే మంచిది కాదని.. అపశకునమని భావిస్తారు. కానీ, పిల్లులను కూడా కన్నపిల్లలుగా చూసుకునే వారూ ఉంటారని శనివారం నగరంలో జరిగిన క్యాట్ ఫ్యాషన్ షో నిరూపించింది. బందరురోడ్డులోని పీవీపీ మాల్లో జరిగిన ఈ షోలో పెంపుడు పిల్లులకు అందమైన దుస్తులు, జ్యూయలరీ అలంకరించి ఫ్యాషన్ షోకు తీసుకొచ్చారు. డీజే పెర్షియన్, మిశ్య్, పెర్షియన్, కిత్తేన్స్, పెర్షియన్, బ్రౌనీ, టర్కిష్, స్నూఫీ, రోజీ, పారు జాతి పిల్లులతో పాటు బ్రౌన్, వైట్, బ్లాక్, క్రీమ్, మల్టీ కలర్స్ పిల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో మాల్ మేనేజర్ అజయ్, నిర్మలా శ్రీనివాస్, సింధుమాధురి తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సమన ఫ్యాషన్ షో
-
ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యాషన్ షోనా?!
ఈ ఫ్యాషన్ షోలను చూస్తూ ఉంటారా? అదేనండీ, ర్యాంప్ వాక్‌లు గట్రా. ఆ ర్యాంప్ మీద నడవాలంటే చాలా ట్రైనింగ్ ఉంటుంది. కాలు ముందు కాలెయ్యాలి. చేతులు ఓ లాగా ఊపాలి. భుజం ఓ లాగా తిప్పాలి. నడుము మరోలా ఊపాలి. మొన్నెప్పుడో రాణీ ముఖర్జీ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిందట. అది ఎయిర్‌పోర్ట్‌లా అనిపించలేదు! ర్యాంప్ వాక్ ఫ్యాషన్ షోలా కనిపించిందట. దుస్తులు, బూట్లు, పర్సులు, హెయిర్ స్టయిల్, కళ్లద్దాలు, హ్యాంగింగ్స్, ఇన్క్లూడింగ్.. ట్రావెల్ బ్యాగ్.. ఒక స్టయిల్లో ఉంటేనే సెలబ్రిటీలు ఎయిర్‌పోర్ట్‌లోకి వస్తారట. ‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలో ఆ ఎయిర్పోర్ట్ ర్యాంప్‌ను గుర్తు చేసుకుంటూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వి చైర్లోంచి కింద పడిపోయింది రాణీ ముఖర్జీ. అంత గమ్మత్తుగా అనిపించిందట. ఏం చేస్తార్లే పాపం.. ఈ రోజుల్లో సెలబ్రిటీలను ప్రతి విషయానికీ జడ్జ్ చేసేస్తుంటారు. సింపుల్ బట్టలు వేసుకుంటే యూజ్లెస్ ఫెలో అంటారేమోనని.. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లడానికి ఏ బట్టలు వేసుకోవాలి అన్నది చెప్పడానికి ఒక ఫ్యాషన్ డిజైనర్‌ని పెట్టుకుంటున్నారంటూ, మరోసారి నవ్వుతూ చైర్లోంచి కింద పడింది రాణీ ముఖర్జీ. ‘ఒకప్పుడు ఎయిర్పోర్ట్కెళితే సెక్యూరిటీ చెక్‌ల ఇబ్బంది తప్పించుకోవడం కోసం ఒక ట్రాక్ సూట్, ఒక జత చెప్పులు, సింపుల్ హ్యాండ్‌బ్యాగ్ తగిలించుకుని వెళ్లేవాళ్లం. కంఫర్టబుల్‌గా ఉండేది. ఇప్పుడు బెల్టు తియ్యమంటాడు. షూ తియ్యమంటాడు. బ్యాగు తిప్పెయ్యమంటాడు. జుట్టు క్లిప్పు తియ్యమంటాడు. అయినా.. ఎవరు ఎలా జడ్జ్ చేస్తారో అన్న టెన్షన్లో ఎయిర్‌పోర్ట్‌లో ర్యాంప్ వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు’ అనంటూ మళ్లీ పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూ చైర్లోంచి కింద పడిందట. -
బ్యూటీస్ వాక్
-
ఫ్యాషన్ స్మైల్.. అదిరెన్ స్టైల్..
గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్‌లో మంగళవారం రాత్రి 51 స్మైల్ బి ద చేంజ్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ప్యాషన్ షో అదరహో అనిపించింది. ప్రముఖ మోడళ్లతో కలిసి ఏఆర్ ఫౌండేషన్ అనాథ పిల్లలు ర్యాంప్‌పై మెరిశారు. నటులు శ్రీధర్‌రావు, సనా శనూర్, డ్యాన్స్ మ్యాస్ట్రో సం దీప్, బిగ్‌బాస్ సీజన్–10 లోపాముద్ర ప్రత్యేక ఆ కర్షణగా నిలిచారు. దీనిద్వారా వచ్చిన నిధుల ను అనాథ పిల్లల విద్య కోసం ఖర్చు చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. -
చే...నేత్రానందం
-
ఎరుపు సింగారం..నడక వయ్యారం
-
చేనేత అందాల కళబోత
-
ముంబైలో ఆకట్టుకున్న ఫ్యాషన్ షో
-
నైట్ కిక్.. ర్యాంప్ వాక్
-
కలర్ఫుల్గా మిస్సెస్ సిల్క్ ఫ్యాషన్ షో
-
ఫ్యాషన్ హొయలు
-
విశాఖలో కంచి కామాక్షి ఫ్యాషన్‌షో
-
అమ్మో.. బాపుగారి బొమ్మో..
తాజ్‌కృష్ణాలో మంగళవారం ‘లవ్ ఫర్ హ్యాండ్లూమ్’ పేరుతో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. హీరోయిన్ ప్రణీత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినీతారలు, మోడల్స్ హంసనడకలతో ర్యాంప్ మురిసింది. ప్రముఖ వస్త్ర షోరూం ‘త్రిష’ ఆధ్వర్యంలో ‘లవ్ ఫర్ హ్యాండ్లూమ్’ పేరుతో మంగళవారం తాజ్‌కృష్ణాలో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. తారలు ప్రణీత, షామిలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బంజారాహిల్స్‌లో నూతన షోరూం ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ ఫ్యాషన్ షో నిర్వహించామని డిజైనర్ అమృతా మిశ్రా చెప్పారు. – జూబ్లీహిల్స్ -
నిఫ్ట్ ఫ్యాషన్ షో అదిరింది
-
ర్యాంప్‌పై క్యాట్ వాక్‌తో వయ్యారాల ఒలకబోత
-
ఫ్యాషన్ షో అదుర్స్
-
అదిరె..అదిరే..కన్నే అదిరె!