
అగ్రరాజ్యం అమెరికాలో ఎంతో సేవ చేస్తున్న అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ -ఆపి 41వ వార్షిక కన్వెన్షన్ ముహూర్తం ఖరారైంది. ఫిలడెల్ఫియాలో ఈ ఏడాది జులై 6 నుంచి 9వ తేదీ వరకు జరగనుంది. ఈ సందర్భంగా న్యూజెర్సీలో ఆపి కన్వెన్షన్ లాంచ్ రెడ్ కార్పెట్ డిన్నర్ గాలా జరిగింది. న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్, బాలీవుడ్ ఐకాన్ భాగ్యశ్రీతో పాటు ఆపి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో, లైవ్ మ్యూజిక్ ఆహుతులను ఆకట్టుకుంది. ఫిలడెల్ఫియాలో జరిగే ఆపి 41వ కన్వెన్షన్‌కు అందరూ విచ్చేసి, విజయవంతం చేయాలని న్యూజెర్సీ స్టేట్ ఆపి ఫ్రెసిడెంట్ డాక్టర్ ప్రదీప్ షా కోరారు. కన్వెన్షన్ అద్భుతంగా నిర్వహించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆపి ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.