live musical concert
-
భాగ్యనగరం.. సంగీత సాగరం
నగరవాసుల కళాభిరుచిలో సంగీతం ఏనాటి నుంచో ఇమిడిపోయి ఉంది. అందుకే నగరంలో ఐటీ, స్పోర్ట్స్, ఫ్యాషన్, సినిమా ఎంతో ఫేమస్.. ఇటీవల వాటికి సరి సమానంగా సంగీతం కూడా కొనసాగుతోంది. వీకెండ్స్ అంతా సిటీలో లైవ్ మ్యూజిక్ ఈవెంట్స్, ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్స్ ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. వీటికి తోడు నెలలో కనీసం ఒకటి రెండు అయినా పెద్ద మ్యూజిక్ కన్సర్ట్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని రోజుల క్రితమే గచి్చ»ౌలి స్టేడియం వేదికగా జరిగిన దేవిశ్రీప్రసాద్ లైవ్ మ్యూజిక్ షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. గచి్చ»ౌలి వంటి స్టేడియంలో ఈ షో నిర్వహించినప్పటికీ టికెట్స్ దొరకక ఎంతోమంది బయట ఉండిపోయారు. నగరంలో ఈ తరహా సంగీత షోలకు అంతటి ఆదరణ ఉంది. గతంలో ఎల్బీ స్టేడియం వేదికగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ నిర్వహించిన లైవ్ మ్యూజిక్ షో పరిస్థితి అంతే. కొన్ని నెలల క్రితం శిల్పకళా వేదికగా ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత నిర్వహించిన సంగీత కచేరీతో హాల్ మొత్తం నిండిపోయింది. సిటిజనుల ఈ సంగీత అభిరుచికి అనుగుణంగా మరికొందరు అతిపెద్ద ప్రదర్శనలకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సంగీత ప్రదర్శనలో యువత అమితాసక్తితో పాల్గొంటున్నారు.చిత్రాంజలి.. స్వరాలునగరంలో పెరిగుతున్న ఈ మ్యూజిక్ కల్చర్‌కు అనుగుణంగా ఈ నెలలో పలు అతిపెద్ద ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ప్రముఖ సింగర్ ప్రతీక్ కుహాద్ పాప్, రొమాంటిక్ పాటలతో భారీ మ్యూజిక్ షో నిర్వహించనున్నారు. నగరంలోని లునో లాంచ్ బార్ అండ్ కిచెన్ వేదికగా ప్రముఖ టాలీవుడ్ సింగర్ గీతామాధురి ఆధ్వర్యంలో లైవ్ మ్యూజిక్ షో ప్లాన్ చేశారు. ఇందులో బాలీవుడ్ ఫోక్ రీజినల్ ఫ్యూజన్ పాటలతో సంగీత ప్రియులను అలరించనున్నారు. అంతే కాకుండా ప్రిజం పోడియం వేదికగా తాయిక్కుడం బ్రిడ్జి హైదారాబాద్ పేరుతో ఎలక్ట్రిఫయ్యింగ్ మ్యూజిక్ తో ఫోక్, ఇండియన్ పాప్, రాక్ మ్యూజిక్ షో జరగనుంది. ఇవే కాకుండా డిసెంబర్లో శిల్పకళా వేదికగా ఇండియన్ సింగింగ్ సెన్సేషన్ ఫీహు అండ్ ఆవిర్భవ్ లైవ్ షో జరుగుతుంది. ఈ షో కోసం నగర వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే వేదికగా చిత్రామృతం పేరుతో ప్రముఖ సింగర్ చిత్ర లైవ్ పాటల సందడి జరగనుంది. అయితే బుక్ మై షో వేదికదా ఈ షోలకు సంబంధించిన టికెట్స్ ఇప్పటికే హౌస్ ఫుల్ అయిపోవడం విశేషం. మ్యూజిక్ లవర్స్ కోసమే.. ఈ మ్యూజిక్ కన్సర్ట్ కల్చర్ పాశ్చాత్యంగా నార్త్ ఇండియాకు వచి్చనప్పటికీ.. దీనిని అందిపుచ్చుకోవడంలో హైదారాబాద్ ముందుంది. గతంలో ఇయర్ ఎండ్ వేడుకల్లో, హోలీ సంబరాల్లో ఇతర ప్రత్యేక సందర్భాల్లో మ్యూజిక్ ఫెస్ట్‌లు ఎక్కువగా జరిగేవి. కానీ ప్రస్తుతం.. కేవలం సంగీత ప్రియులను అలరించడం కోసమే ఈ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఈవెంట్ ఆర్గనైజర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకూ సిటీలో దివంగత ఎస్పీ బాల సుబ్రమణ్యం, ఇళయరాజా, డీఎస్పీ, సునీత, కార్తీక్ తదితర దక్షిణాది మ్యూజిక్ స్టార్ల ఈవెంట్లు మంచి ఆదరణ పొందాయి.ప్రతీక్ సంగీత ప్రదర్శన.. 8న ప్రముఖ ఫోక్–పాప్ గాయకుడు, పాటల రచయిత రాజస్తాన్‌కు చెందిన ప్రతీక్ కుహాడ్ నగరానికి వస్తున్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఆయన ఈనెల 8వ తేదీన ప్రదర్శన ఇవ్వనున్నారు. ఐ ట్యూన్స్ ఇండియన్ ఇండీ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్, బెస్ట్ ఇండియన్ యాక్ట్ ఎట్ ది ఎంటీవీ యూరప్ మ్యూజిక్ అవార్డ్స్ వంటి పురస్కారాలు అందుకున్న ఘనత ప్రతీక్ సొంతం. ఆయన ప్రదర్శన రాత్రి 6 గంటల నుంచి 10గంటల వరకూ కొనసాగుతుంది. -
మ్యూజిక్.. మ్యూజిక్.. సరికొత్త ట్రెండ్‌గా మినీ షోస్!
మ్యూజిక్.. గత కొంతకాలంగా నగరంలో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్స్కు ఆదరణ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా వారాంతాల్లో రెస్టో బార్స్, కేఫ్, పబ్స్‌లో ఈ లైవ్ మ్యూజిక్ సందడి కనిపిస్తోంది. గతంలో ఫేమస్ దేశీయ, విదేశీ బ్యాండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించే లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ల కోసం నగర వాసులు, సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురు చూసేవారు. కానీ ప్రస్తుతం నగర యువత నుంచి పెద్దల వరకూ స్థానిక మ్యూజిక్ బ్యాండ్స్‌ను ఆదరిస్తున్నారు.వారి మ్యూజిక్‌ని ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా స్నేహితులతో, కుటుంబ సభ్యులతో వారాంతాల్లో సాయంకాలం డైనింగ్‌కు వెళ్లడం నగరంలో పస్తుతం ట్రెండ్‌గా మారింది. ఈ నేపథ్యంలో నగరంలో కూడా అధిక సంఖ్యలో మ్యూజిక్ బ్యాండ్స్ పుట్టుకొస్తున్నాయి. సింగర్లు, గిటారిస్టులు, కీ బోర్డ్ ప్లేయర్లు ఇలా సంగీతంతో ప్రయాణం చేస్తున్న ఆరి్టస్టులకు ఇదొక కెరీర్‌గా మారింది.లైవ్ మ్యూజిక్.. ట్రెండీ కన్సర్ట్స్..ప్రస్తుత యువతరానికి లైవ్‌లో మ్యూజిక్ వినడం అనేది ఓ వ్యాపకంలా మారింది. ఎప్పటికప్పుడు మారుతున్న అధునాతన ట్రెండ్స్‌ను అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్ నగరం ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇలాంటి పలు కారణాలతో నగరంలో మ్యూజిక్ కన్సర్ట్ల నిర్వహణ విపరీతంగా పెరిగింది. వీటికి అనుగుణంగానే దాదాపు 50 నుంచి 60 మ్యూజిక్ బ్యాండ్స్ రూపుదిద్దుకున్నాయి. ఒక్కో బృందంలో ఐదు నుంచి ఏడుగురు సభ్యులతో ఆరి్టస్టులు ఉండగా కొన్ని బృందాల్లో పది మంది వరకూ తమ సంగీత కళా నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు.సినిమాల్లో సైతం...ఒక అంచనా ప్రకారం నగరంలో దాదాపు 1500 మంది సంగీత కళాకారులు ఈ మ్యూజిక్ కన్సర్ట్లతో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. సింగర్లు, వయోలిన్ నిపుణులు, గిటారిస్ట్స్, వోకల్ ఆరి్టస్టులు, కీ బోర్డ్ ప్లేయర్లు, ఉత్సాహాన్ని పెంచే డ్రమ్ ఆరి్టస్టులు ఇలా పలువురికి ఇదొక ప్రత్యామ్నాయ కెరీర్‌గా మారింది. ఇందులోని సభ్యుల్లో చాలా మంది సినిమాలకు సైతం పనిచేస్తున్నారు. అంతేకాకుండా సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్లుగా, మ్యుజీషియన్లుగా ప్రసిద్ధి చెందిన వారు సైతం ఈ లైవ్ కన్సర్ట్లు నిర్వహిస్తుండడం విశేషం. ఒక్కో ఈవెంట్‌కు లక్ష నుంచి 2 లక్షల వరకూ డిమాండ్ ఉండగా.. ఫేమస్‌గా నిలిచిన బ్యాండ్లు, ఇప్పటికే ఇండస్ట్రీలో నిలిచిన బ్యాండ్స్‌కు 4, 5 లక్షల వరకూ పేమెంట్లు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సొంత బ్యాండ్లను తయారు చేసుకున్నారు పలువురు స్టార్ సింగర్లు, మ్యుజీషియన్లు. సోషల్ సెలబ్రిటీలుగా బ్యాండ్స్..మాకు.. సంగీత ప్రియులను సంతృప్తి పరచడం కన్నా మించిన లక్ష్యం మరొకటి ఉండదు. ఈ మధ్య కాలంలో ఈ మినీ మ్యూజిక్ కన్సర్ట్స్కు ఆదరణ పెరగడం చాల సంతోషంగా ఉంది. స్వతహాగా దాదాపు పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. ఎన్నో సినిమాల్లో పాటలు పాడాను, పాడుతున్నాను. ఇలా మా రుద్ర బ్యాండ్‌లో ఉన్న పలువురు సినిమాలకు పనిచేస్తున్నారు. వీటితో పాటుగానే మ్యూజిక్ కన్సర్ట్స్‌లో మా ప్రతిభను ప్రదర్శిస్తున్నాం. నెలలో కనీసం 10, 12 ఈవెంట్లలో మా మ్యూజిక్ ప్రేక్షకులను అలరిస్తుంది.రెస్టో బార్లు, క్లబ్స్, ప్రైవేటు ఫంక్షన్ల నుంచి మాకు ఆహ్వానం అందుతుంది. సినిమాల్లోని పాటలనే అధునాతన ట్రాక్‌లకు అన్వయిస్తూ, విభిన్నంగా సంగీతాన్ని ప్రదర్శిస్తుంటాం. 9 వందల షోలలో నేను పాటలు పాడాను. ఈ అనుభవంతోనే గతేడాది రుద్ర బ్యాండ్ నా మిత్రుడు జయంత్‌తో కలిసి ప్రారంభించాం. సీజన్లో ప్రతి నెలా 15 వరకూ ఈవెంట్లను చేయగలుగుతున్నాం. మమ్మల్ని సోషల్ సెలబ్రిటీలుగా గుర్తిస్తుండటం సంతోషాన్నిస్తుంది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు వంటి పలు నగరాల్లో కూడా ప్రదర్శనలు చేశాం. – రాఘవేంద్ర, రుద్ర బ్యాండ్ వ్యవస్థాపకులు, ప్రముఖ సింగర్ -
రెస్టారెంట్లో మహిళకు వింత అనుభవం.. పాటలు విన్నారని ఊహించని షాక్ ఇచ్చారు!
రెస్టారెంట్‌కు స్నేహితులతో కలిసి వెళ్లి.. టేస్టీ పుడ్‌ని లాగించేసి కాసేపు సరదాగా గడిపేసి రావడం అంటే అందరికీ ఇష్టమే. అయితే సాధారణంగా రెస్టారెంట్ అంటే బిల్ కాస్త ఖరీదుగానే ఉంటుంది కాబట్టి మనం దానికి కూడా సన్నద్ధంగానే ఉంటాం. మహా అయితే భోజనం ధరలు కాస్త ఎక్కువగా ఉండడం, సర్వీస్ ఛార్జీ వంటివి ఊహిస్తాం. అయితే బ్రిటన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు వెయిటర్ ఇచ్చిన బిల్ చూడగానే ఊహించని షాక్ తగిలింది. బిల్లో ఇలాంటివి కూడా వేస్తారా అంటూ అసహనం వ్యక్తం చేస్తూ ఆ ఫోటోని నెట్టింట షేర్ చేసింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌లోని ఓ మహిళ తన స్నేహితులంతా కలిసి సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లింది. ఇంకేముందు చిట్ చాట్ మొదలుపెట్టిన కాసేపటి ఆర్డర్ పెట్టిన పుడ్ వచ్చేసింది. కబుర్లు చెప్పుకొంటూ వాటిని ఆరగించారు. చివర్లో వెయిటర్ తీసుకువచ్చిన బిల్ చూసి షాక్ అవ్వడం వారి వంతైంది. ఎందుకంటే ఆ రెస్టారెంట్లో లైవ్ మ్యూజిక్ కార్యక్రమం నడుస్తోంది. యాజమాన్యం ఆ పాటలు విన్నందుకు 8 పౌండ్లు బిల్లో చేర్చింది. ఏం చేయాలో తోచక వారు బిల్లు చెల్లించి బయటకు వచ్చేశారు. తరువాత తమకు ఇలాంటి అనుభవం ఎదురైందంటూ రెస్టారెంట్ నిర్వాహకులు ఇచ్చిన రసీదును సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇలాంటివి యూకేలో మునుపెన్నడూ లేవంటూ ఈ ఫోటో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ బిల్లులో మరికొన్ని ఫీజులు ఉండటంతో రెస్టారెంట్ యాజమాన్యం పుడ్ లవర్స్ ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: 2,600లకు పైగా విమానాలు రద్దు.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ విజ్ఞప్తులు -
లైవ్ మ్యూజిక్ షోలో పాడుతూ కుప్పకూలిన సింగర్.. 27 ఏళ్లకే..
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాప్రికాకు చెందిన యువ ర్యాపర్, సాంగ్ రైటర్ కోస్టా టిచ్ లైవ్ మ్యూజిక్ షో చేస్తూ స్టేజీపైనే కుప్పకూలాడు. సెకన్ల వ్యవధిలో రెండుసార్లు పడిపోయాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయాడు. కోస్టా టిచ్ మరణవార్తను అతని కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. 27 ఏళ్లకే అతను చనిపోవడం తమ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టిందని కన్నీటిపర్యంతమయ్యారు. తాము అత్యంత విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు భారమైన హృదయంతో చెప్పారు. ఈ యువ ర్యాపర్ జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న 'అల్ట్రా సౌత్ ఆఫ్రికా మ్యూజిక్ ఫెస్టివల్'లో లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈక్రమంలోనే పాట పాడుతూనే సడన్‌గా స్టేడీపై పడిపోయాడు. వెంటనే లేచి నిల్చున్నా.. మళ్లీ క్షణాల్లోనే కుప్పకూలాడు. ఇతర సింగర్లు వెంటనే అతనికి సాయం అందించారు. కానీ అతడు స్పృహలోకి రాలేదు. కాసేపటికే చనిపోయాడు. RIP Costa Titch pic.twitter.com/zQN4pvl6hD — 𝐍𝐰𝐚𝐧𝐲𝐞 (@nwanyebinladen) March 11, 2023 అయితే కోస్టా టిచ్ మృతికి గల కారణాలపై మాత్రం స్పష్టత లేదు. ఆయన కుటుంబసభ్యులు కూడా ఇందుకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఎంబాంబెలాకు చెందిన కోస్టా టిచ్ సింగర్‌గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఇతని సాంగ్స్‌కు యూట్యూబ్‌లో 4.5కోట్లకు పైగా వీక్షణలు వచ్చాయి. అమెరికన్ ఆర్టిస్ట్ అకోన్తో కలిసి ఇటీవలే ఓ రీమిక్స్ కూడా చేశాడు. చదవండి: నూలుపోగు లేకుండా వీధుల్లో హల్చల్.. వేరే గ్రహం నుంచి.. -
న్యూజెర్సీలో ఆపి కన్వెన్షన్ లాంచ్ రెడ్ కార్పెట్ డిన్నర్ గాలా
అగ్రరాజ్యం అమెరికాలో ఎంతో సేవ చేస్తున్న అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ -ఆపి 41వ వార్షిక కన్వెన్షన్ ముహూర్తం ఖరారైంది. ఫిలడెల్ఫియాలో ఈ ఏడాది జులై 6 నుంచి 9వ తేదీ వరకు జరగనుంది. ఈ సందర్భంగా న్యూజెర్సీలో ఆపి కన్వెన్షన్ లాంచ్ రెడ్ కార్పెట్ డిన్నర్ గాలా జరిగింది. న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్, బాలీవుడ్ ఐకాన్ భాగ్యశ్రీతో పాటు ఆపి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో, లైవ్ మ్యూజిక్ ఆహుతులను ఆకట్టుకుంది. ఫిలడెల్ఫియాలో జరిగే ఆపి 41వ కన్వెన్షన్‌కు అందరూ విచ్చేసి, విజయవంతం చేయాలని న్యూజెర్సీ స్టేట్ ఆపి ఫ్రెసిడెంట్ డాక్టర్ ప్రదీప్ షా కోరారు. కన్వెన్షన్ అద్భుతంగా నిర్వహించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆపి ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
ఆ క్రెడిట్ వాళ్లదే
‘‘నేను అక్షరాల విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాను. ఇది నా తల్లి నుంచి నేర్చుకున్నాను. నేను క్రిష్టియన్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ సంస్కృతంలోని అక్షరాలను నేర్చుకోమని ఆమె చెప్పారు. అది ఆమె నాకు అందించిన ఆశీర్వాదం’’ అని ప్రముఖ గాయకులు కె.జె.ఏసుదాస్ అన్నారు. చాలా కాలం తర్వాత ఆయన హైదరాబాద్‌లో ఈరోజు లైవ్ కాన్సర్ట్ చేస్తున్నారు. ఈ సంగీత విభావరిలో ఏసుదాస్‌తోపాటు గాయకులు విజయ్ ఏసుదాస్, కల్పన కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏసుదాస్ మాట్లాడుతూ– ‘‘మా అమ్మ అందించిన మరో ఆశీర్వాదం ఏంటంటే.. నాకు ఐదేళ్లున్నప్పుడు చదువు గురించి ఎలాంటి బెంగా పెట్టుకోవద్దు. నార్మల్‌గా చదువుకుంటే చాలు. కానీ, కర్నాటిక్ క్లాసికల్ మ్యూజిక్‌ని ప్రాపర్‌గా నేర్చుకోమని చెప్పారు. నాకు బ్రదర్స్, సిస్టర్ ఉన్నారు. వాళ్లు కూడా బాగా పాడేవారు. కానీ, ఈ విషయంలో నాన్నగారు నన్ను మాత్రమే ప్రోత్సహించారు. గురువు లేకుండా ఎవరూ గొప్పవారు కాలేరు. మనల్ని తీర్చిదిద్దిన గురువులంతా దేవుళ్లతో సమానమని నా నమ్మకం. నేను ఇప్పటివరకు ఏం సాధించినా అదంతా నా తల్లిదండ్రులు, గురువుల వల్లే సాధ్యమైంది. అలాగే నా పాటలు వినేవారు, సంగీత ప్రియుల ప్రార్థనల వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. అంతకుమించి మరేం లేదు. నా బ్రదర్ అలేఖ్య హోమ్స్ శ్రీనాథ్ నన్ను లైవ్ మ్యూజిక్ చెయ్యమని చెప్పారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో లైవ్ మ్యూజిక్ చేస్తున్నాను. మా అబ్బాయి విజయ్ వయసు ఇప్పుడు 40. నా వయసు 79. కానీ, నేను ఇప్పటికీ విద్యార్థినే’’ అన్నారు. విజయ్ ఏసుదాస్ మాట్లాడుతూ– ‘‘మొదట్లో నాన్నగారి అడుగుజాడల్లోనే వెళ్లాను. ఆ తర్వాత నా సొంతదారిలోనే వెళ్లాలని డిసైడ్ అయ్యాను. కొన్ని విషయాల్లో ఆయన గైడెన్స్ తీసుకుంటాను. ఇళయరాజాగారితో కలిసి నాన్నగారు చాలా సినిమాలకు పనిచేశారు. ఇప్పుడు నేను, యువన్‌శంకర్‌రాజా కలిసి పనిచేస్తున్నాం. నేను రెండు సినిమాల్లో నటించాను కూడా. నాన్నగారి బయోపిక్ చేసే ఆలోచన ఉందా? అని అడుగుతున్నారు. అయితే నాకు అలాంటి ప్లాన్స్ ఏమీ లేవు. కానీ, ఎవరైనా చేస్తే నేను ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు. -
ఇళయరాజా తొలిసారిగా..!
సౌత్ స్టార్ మ్యూజీషియన్ ఇళయరాజా తొలిసారిగా భాగ్యనగరంలో తొలి సారిగా లైవ్ షో చేయనున్నారు. ప్రస్తుతం సెలెక్టివ్ గా సినిమాలో చేస్తున్న ఈ సంగీత బ్రహ్మా దేశ విదేశాల్లో మ్యూజిక్ కన్సర్ట్ లలో పాల్గొంటున్నారు. అయితే తొలిసారిగా ఆయన నవంబర్ 5న తెలుగు నేల మీద తెలుగులో సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. గచ్చిబౌలిలోని అథ్లెటిక్ స్టేడియంలో 85మంది టీం సభ్యులతో కలిసి భారీ మ్యూజికల్ కన్సర్ట్ ను ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 5 సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఈ షో నిర్వహించనున్నారు. తనని దక్షిణాది ప్రజలంతా ఎంతో అభిమానిస్తారన్న ఇళయరాజా తొలిసారిగా తెలుగులో ప్రదర్శన ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ షో లో ఇళయరాజాతో పాటు ప్రముఖ గాయకులు మనో, చిత్ర, కార్తీక్, సాధనా సర్గమ్ మరి కొంత మంది యువ గాయకులు, వాయిద్య కళాకారులు పాల్గొననున్నారు.