జొహన్నెస్‌బర్గ్: దక్షిణాప్రికాకు చెందిన యువ ర్యాపర్, సాంగ్ రైటర్ కోస్టా టిచ్ లైవ్ మ్యూజిక్ షో చేస్తూ స్టేజీపైనే కుప్పకూలాడు. సెకన్ల వ్యవధిలో రెండుసార్లు పడిపోయాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయాడు. కోస్టా టిచ్ మరణవార్తను అతని కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. 27 ఏళ్లకే అతను చనిపోవడం తమ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టిందని కన్నీటిపర్యంతమయ్యారు. తాము అత్యంత విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు భారమైన హృదయంతో చెప్పారు.
ఈ యువ ర్యాపర్ జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న 'అల్ట్రా సౌత్ ఆఫ్రికా మ్యూజిక్ ఫెస్టివల్'లో లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈక్రమంలోనే పాట పాడుతూనే సడన్‌గా స్టేడీపై పడిపోయాడు. వెంటనే లేచి నిల్చున్నా.. మళ్లీ క్షణాల్లోనే కుప్పకూలాడు. ఇతర సింగర్లు వెంటనే అతనికి సాయం అందించారు. కానీ అతడు స్పృహలోకి రాలేదు. కాసేపటికే చనిపోయాడు.
RIP Costa Titch pic.twitter.com/zQN4pvl6hD
— 𝐍𝐰𝐚𝐧𝐲𝐞 (@nwanyebinladen) March 11, 2023
అయితే కోస్టా టిచ్ మృతికి గల కారణాలపై మాత్రం స్పష్టత లేదు. ఆయన కుటుంబసభ్యులు కూడా ఇందుకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఎంబాంబెలాకు చెందిన కోస్టా టిచ్ సింగర్‌గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఇతని సాంగ్స్‌కు యూట్యూబ్‌లో 4.5కోట్లకు పైగా వీక్షణలు వచ్చాయి. అమెరికన్ ఆర్టిస్ట్ అకోన్‌తో కలిసి ఇటీవలే ఓ రీమిక్స్ కూడా చేశాడు.
చదవండి: నూలుపోగు లేకుండా వీధుల్లో హల్‌చల్.. వేరే గ్రహం నుంచి..
Comments
Please login to add a commentAdd a comment