Rapper
-
భార్య వేధింపులు తాళలేక సింగర్ ఆత్మహత్య
భార్య మానసికంగా చిత్రహింసలు పెడుతుంటే బయటకు చెప్పుకోలేని పరిస్థితి. చెప్పినా ఎవరూ పట్టించుకోని దుస్థితి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో, నరక కుంపటి నుంచి బయటపడే ఆలోచనలో ఆత్మాహుతి చేసుకుంటున్న భార్యాబాధితులెందరో! ఈ మధ్య అతుల్ సుభాష్ అనే భార్యాబాధితుడి బలవన్మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత కర్ణాకటలో కానిస్టేబుల్ తిప్పన్న, రాజస్తాన్‌లో డాక్టర్ అజయ్‌కుమార్, ఢిల్లీలో పునీత్ ఖురానా.. ఇలా రోజుకో ఉదంతం బయటకు వచ్చింది. విషం తాగి..తాజాగా ఈ జాబితాలో ప్రముఖ సింగర్, ర్యాపర్ (Odia Rapper) అభినవ్ సింగ్ (Abhinav Singh) చేరినట్లు తెలుస్తోంది.. ఒడిశాకు చెందిన ర్యాపర్ అభినవ్ సింగ్ (32) బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వేధింపులు తాళలేక విషం తాగి చనిపోయాడని అతడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. తన కుమారుడి చావుకు కోడలు సహా ఆమె కుటుంబసభ్యులే కారణమంటూ సింగర్ తండ్రి బిజయ్ నందా సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య వేధింపుల వల్లే?దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరి అభినవ్.. భార్య వేధింపుల వల్లే ప్రాణాలు తీసుకున్నాడా? వేరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్నది తేలాల్సి ఉంది. కాగా అభినవ్ ఒడియా ర్యాప్ సాంగ్స్‌తో ఫేమస్ అయ్యాడు. కథక్ ఆంథెమ్ సాంగ్‌తో మరింత పాపులర్ అయ్యాడు. ఇతడు అర్బన్ లోఫర్ అనే మొదటి హిప్ హాప్ లేబుల్‌ను స్థాపించాడు.చదవండి: డిజాస్టర్ దిశగా అజిత్ పట్టుదల.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే? -
పదేళ్ల తరువాత తొలిసారి : తన బాడీ చూసి మురిసిపోతున్న పాప్ సింగర్
ఒక మనిషి లావుగా ఉండటానికి, సన్నగా ఉండటానికి వివిధ అంశాలు ప్రభావితం చేస్తాయి. జన్యువులు చేసే మ్యాజిక్, ఆహారం, జీవనశైలి, ఇతర అలవాట్లు లాంటివాటి మీద ఇది ఆధారపడి ఉంటుంది. అందుకే కొంతమంది బరువు తగ్గేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూ ఉంటారు. మరికొంతమంది చాలా సులువైన పద్దతుల ద్వారా తమ బరువును నియంత్రణలో ఉంచుకుంటారు. అది బహుమతిగా కూడా ఉంటుంది. బరువు తగ్గడం అనేది కొంతమందికి నెలలు పట్టవచ్చు. మరికొంతమందికి సంవత్సరాలు పట్టవచ్చు. కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నపుడు మాత్రం ఆ ఆనందం చెప్పనలవికాదు. యూఎస్ పాపులర్ సింగర్ ఈ ఆనందంలో మునిగితేలుతోంది. ఇంతకూ ఈ సింగర్ ఎవరు? తెలుసుకుందా పదండి! అమెరికన్ గాయని, ర్యాపర్ లిజ్జో ప్రపంచ సంగీత ప్రియులకు సుపరిచితమైన పేరు. చాలా కష్టపడి ఎట్టకేలకు తన బరువును తగ్గించుకుంది. 2014 నుండి కష్టపడి ఇప్పటికి తన లక్ష్యాన్ని చేరుకుంది. పదేళ్ల తరువాత తన బరువును చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. దృఢ సంకల్పం , పట్టుదల, సానుకూల దృక్పథం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేందుకు లిజ్జో ఉదాహరణ.తన సంతోషాన్ని గర్వంగా సోషల్‌మీడియాలో షేర్ చేసింది. తన ఫిగర్ ఫోటోను పోస్ట్ చేసింది. వెయిట్-ట్రాకింగ్ యాప్ స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకుంది. ‘‘ఈరోజు నేను నా బరువు తగ్గించుకునే లక్ష్యాన్ని చేరుకున్నాను. 2014 నుండి ఈ నెంబర్లు సంఖ్యను చూడలేదు!’’అని తెలిపింది. అలాగే అనుకున్న లక్ష్యం చేరేందుకు పట్టుదల ముఖ్యఅని గుర్తు పెట్టుకోండి అంటూ అభిమానులను ఉత్సాహపరుస్తూనే తన కొత్త లక్ష్యాలకు టైమ్ వచ్చింది అంటూ బరువు తగ్గే విషయంలో కొత్త టార్గెట్ పెట్టుకున్నట్టు చెప్పకనే చెప్పింది. ఈమె స్టోరీ ఇపుడు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. అద్భుతం అభినందనలు అంటూ ఫాలోయర్లు తెగ పొగిడేస్తున్నారు. (రూ. కోటి జాబ్ కాదని..తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : తండ్రి భావోద్వేగ క్షణాల్లో) View this post on Instagram A post shared by Lizzo (@lizzobeeating) లిజ్జో వివరాలను పోస్ట్ చేసింది. బరువు తగ్గించుకునే ప్రయాణాన్ని ప్రారంభించినప్పటినుంచి లిజ్జో బాడీ మాస్ ఇండెక్స్ (BMI)ని 10.5 తగ్గించుకోగలిగింది. బాడీలో ఫ్యాట్ 16శాతం తగ్గడం విశేషం.2024,సెప్టెంబరులో ఈ ప్రయాణం గురించి టిక్ టాక్ పోస్ట్‌లో చెప్పుకొచ్చింది. ఎవరెన్ని కమెంట్స్ చేసినా తాను మాత్రం లక్ష్యంపై దృష్టి సారించానని ఆమె వెల్లడించింది. అప్పటినుంచి అనేక అప్డేట్స్ ఇస్తూ వస్తోంది. అలాగే టైప్-2 డయాబెటిస్‌కు ఓజెంపిక్ వాడుతోందన్న ఆరోపణలను కూడా తోసిపుచ్చింది. కాగా యుఎస్ పాప్ స్టార్ లిజ్జోపై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి. తమను వేధిస్తోందని, ముగ్గురు మాజీ డ్యాన్సర్ల ఆరోపించారు. అయితే వీటిని తప్పుడు ఆరోపణలు అంటూ కొట్టిపారేసింది కూడా. -
సింగర్‌ను పెళ్లాడిన ర్యాపర్.. వెడ్డింగ్ లుక్ అదిరింది (ఫోటోలు)
-
డ్రగ్స్ కేసులో ప్రముఖ సింగర్ అరెస్ట్
అమెరికన్ ప్రముఖ ర్యాపర్, గాయని నిక్కీ మినాజ్(41) అరెస్ట్ అయింది. అయితే, కొన్ని గంటల తర్వాత మళ్లీ ఆమెను విడుదల చేశారు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో నిక్కీ మినాజ్‌కు ఈవెంట్ ఉంది. ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు ఆమ్స్టర్డామ్లోని షిపోల్ ఎయిర్పోర్ట్ వద్దకు నిక్కీ చేరుకుంది. తన బ్యాగ్‌లో డ్రగ్స్ తీసుకెళ్తున్నట్లు ఆమెపై ఆరోపణలు రావడంతో ఆమ్స్టర్డామ్ అధికారులు ఆమెను నిర్బంధించారు. దీంతో ఆమె షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన సంగీత్ కార్యక్రమం వాయిదా పడింది. ఆమె పాల్గొంటున్న ప్రోగ్రామ్ కోసం సుమారు ఇరువై వేల మంది టికెట్లు కొన్నారు. నిక్కీ వద్ద డ్రగ్స్ ఉన్నాయని సమాచారం రావడంతో తనిఖీల పేరుతో ఆమెను కొన్ని గంటల పాటు ఎయిర్‌పోర్టులోనే పోలీసులు ఉంచారు. ఫైనల్లీ తనవద్ద డ్రగ్స్ లేవని తేలడంతో ఆమెను పోలీసులు వదిలిపెట్టారు. అప్పటికే సమయం గడిచిపోవడంతో ఆమె పాల్గొనాలనుకున్న కార్యక్రమం వాయిదా పడింది. అయితే మరో కొత్త తేదీని ప్రకటిస్తామని అభిమానులకు నిక్కీ టీమ్ తెలిపింది. అయితే, పోలీసుల తీరుపట్ల నిక్కీ మినాజ్ అసహనం వ్యక్తం చేసింది. తన వద్ద డ్రగ్స్ లేకున్నా కావాలనే తన ప్రోగ్రామ్ చెడగొట్టేందుకు ఎవరో ఇలాంటి గేమ్ ప్లాన్ చేశారని ఆరోపించింది. అభిమానులు కూడా ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.కాగా 2010లో ‘పింక్ ఫ్రైడే’ అల్బమ్ తో నిక్కీ మినాజ్ పాప్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ది పింక్ ప్రింట్, క్వీన్, ప్లే టైమ్ ఈజ్ ఓవర్ వంటి ఆల్బమ్స్ తో మంచి పేరు తెచ్చుకుంది. మినాజ్ ఎప్పటికప్పుడు అత్యంత ప్రభావవంతమైన హిప్ హాప్ కళాకారులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. తన కెరీర్ మొత్తంలో 10 గ్రామీ నామినేషన్లు, తొమ్మిది అమెరికన్ మ్యూజిక్ అవార్డులు, 11బీఈటీ అవార్డులు , నాలుగు బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డులు, ఇతర పురస్కారాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురి సంగీత అభిమానుల ప్రశంసలను ఆమె సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by Barbie (@nickiminaj) -
ప్రముఖ సింగర్‌పై యువతుల అక్రమ రవాణా కేసు.. పోలీసుల రైడ్
అమెరికన్ ప్రముఖ ర్యాపర్ డిడ్డీ (54) అమ్మాయిల ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నాడని న్యూయార్క్‌లోని ఫెడరల్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ర్యాపర్ అసలు పేరు సీన్ కాంబ్స్.. కాగా డిడ్డీగా సుప్రసిద్ధుడు. పలువురు ఫిర్యాదులు చేయడంతో లాస్ ఏంజిల్స్, మయామిలోని ర్యాపర్ డిడ్డీకి చెందిన రెండు నివాసాలను ఫెడరల్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ ఏజెంట్లు శోధించారు. ఆ వివరాలను అక్కడి అధికారులు బహిరంగంగా చర్చించడానికి ముందుకు రాలేదు. తన ప్రతిభతో గ్రామీ అవార్డులను సొంతం చేసుకుని మ్యూజిక్ మొఘల్ గా కీర్తిని అందుకున్నాడు. కానీ కొన్ని నెలల క్రితం ఓ యువతి వేసిన దావాలో డిడ్డీపై అత్యాచారం, కిడ్నాప్, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, బహిరంగ అసభ్యత వంటి అభియోగాలు ఉన్నాయి. ఎవరు ఈ కేసు వేశారు? ఎవరు ఈ అభియోగాలు నమోదు చేశారు? అనే దానిపై అక్కడి ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీని వెనుక అతడి మాజీ ప్రియురాలు కాసాండ్రా వెంచురా ఉన్నట్లు సమాచారం. 54 ఏళ్ల రాపర్ డిడ్డీపై మరో ఐదుగురు మహిళలు కూడా తాజాగా అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి ఆరోపణలు చేశారు. శృంగారం సమయంలో అందుకు సంబంధించిన వీడియోలను తన స్నేహితులకు కూడా చూపించే వాడని వారు పేర్కొన్నారు. తన స్నేహితుల వద్దకు పలువురి అమ్మాయిలను కూడా పంపుతాడని అక్కడి అధికారులకు సమాచారం అందింది. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆయన ఇంట్లోనే జరుగుతాయని పలు ఫిర్యాదులు రావడంతో డిడ్డీ ఇంట్లో శోధించి పలువురిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో డిడ్డీ ఇంట్లో లేరని తెలుస్తోంది. 2016లో డిడ్డీ తన ప్రియురాలు కాసాండ్రా వెంచురా నుంచి బ్రేకప్ అయ్యాడు. కానీ ఆ సమయంలో ఆమె డిడ్డీపై పలు ఆరోపణలు చేసింది. తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. తనను తీవ్రంగా హింసించాడని పేర్కొంది. అత్యాచారం- దాడి -మానవ అక్రమ రవాణా సహా చాలా కేసులు కూడా ఆ సమయంలో పెట్టింది. పురుష వేశ్యలతో లైంగిక సంబంధం పెట్టుకోమని డిడ్డీ బలవంతం చేశాడని కూడా కాసాండ్రా ఆరోపించింది. BREAKING: Rapper Diddy's Los Angeles home has been raided by Homeland Security in connection to a federal s*x trafficking investigation. According to investigators, Diddy's Miami home was also raided. Multiple women have come forward accusing Diddy of beatings, s*xual assault… pic.twitter.com/pZeSuyqc5S — Collin Rugg (@CollinRugg) March 25, 2024 -
మొన్నే తూచ్ అన్నాడు.. ఇప్పుడేమో బాబుతో దర్శనం!
పంజాబ్ ర్యాపర్, దివంగత సింగర్ సిద్దు మూసేవాలా మరణం ఇప్పుడు గుర్తు చేసుకున్నా మనసు చివుక్కుమంటుంది. దేశవ్యాప్తంగా పేరు మోసిన ఈ సింగర్‌ను 2022లో దారుణంగా హత్య చేశారు. ఒక్కగానొక్క కొడుకు ఇక లేడన్న నిజాన్ని సిద్దూ పేరెంట్స్ జీర్ణించుకోలేకపోయారు. లెజెండ్స్‌కు చావు ఉండదని నమ్మారు. తన కొడుకును మళ్లీ చూసుకోవాలని మురిసిపోయారు. ఈ క్రమంలో 58 ఏళ్ల వయసులో సిద్దు తల్లి చరణ్ సింగ్ ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోందని వార్తలు వెలువడ్డాయి. దీనిపై సిద్దు తండ్రి బల్కౌర్ సింగ్ స్పందిస్తూ అదంతా ఏమీ లేదని, ఏ రూమర్స్‌నూ పట్టించుకోవద్దని చెప్పాడు. బాబుకు జన్మనిచ్చిన ర్యాపర్ తల్లి కట్ చేస్తే సిద్దూ మూసేవాలా పేరెంట్స్ మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఓ బాబుకు జన్మనిచ్చారు. బల్కౌర్ సింగ్ ఓ బాబును ఎత్తుకుని ఉన్న ఫోటోను ఆదివారం (మార్చి 17న) సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. 'శుభ్‌దీప్ (సిద్దు మూసేవాలా అసలు పేరు)ను ప్రేమించిన లక్షలాది మంది ఆశీర్వాదాలతో అతడికి ఓ తమ్ముడు పుట్టాడు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంది. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఙతలు తెలియజేస్తున్నాను' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు.. సిద్దు మూసేవాలా మళ్లీ పుట్టాడు అని కామెంట్లు చేస్తున్నారు. పుస్తకం.. ఇకపోతే సిద్దూ జీవిత కథ ఆధారంగా ‘హూ కిల్డ్ మూసేవాలా? ది స్పైరలింగ్ స్టోరీ ఆఫ్ వాయలెన్స్ ఇన్ పంజాబ్' అనే పుస్తకం కూడా వచ్చింది. జుపిందర్ జీత్ సింగ్ ఈ పుస్తకాన్ని రచ్చించారు. పంజాబ్‌లో గ్యాంగ్స్టర్ల ఆధిపత్యం, మాదకద్రవ్యాల వినియోగం, ఆ రాష్ట్రంలో సంగీత ప్రపంచం వెనుక దాగి ఉన్న చీకటి కోణాలను ఈ పుస్తకం చూపించింది. View this post on Instagram A post shared by Balkaur Singh (@sardarbalkaursidhu) చదవండి: ఒక్క సీన్ కోసం రూ. 5 కోట్లు అందుకున్న నయనతార -
విడాకులు తీసుకున్న స్టార్ సింగర్!
పంజాబ్ చెందిన రాపర్ సింగర్ యో యో హనీ సింగ్ తన భార్యతో విడాకులు తీసుకున్నారు. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత వివాహా బంధానికి ముగింపు పలికారు. తాజాగా యో యో హనీ సింగ్, అతని భార్య షాలిని తల్వార్లకు ఢిల్లీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. కాగా.. జనవరి 2011లో షాలిని తల్వార్‌ను హనీ సింగ్ వివాహం చేసుకున్నారు. (ఇది చదవండి: రష్మిక వీడియోలానే మరో స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!) కాగా.. 2021లో తన భర్త హనీ సింగ్‌పై షాలిని గృహ హింస కేసు పెట్టింది. అంతే కాకుండా అతనికి వివాహేతర సంబంధం ఉందని కూడా ఆమె ఆరోపించింది. దీంతో ఈ జంట విడాకులు కోసం కోర్టు మెట్లెక్కారు. తాజాగా ఢిల్లీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. దీంతో షాలినికి కోటి రూపాయల చెక్కును భరణంగా ఇచ్చాడు హనీ సింగ్. కాగా.. సింగర్ ప్రస్తుతం నటి, మోడల్ టీనా థడానీతో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. హనీ సింగ్ పంజాబీతో పాటు హిందీ, హాలీవుడ్ సినిమాలకు పాటలు పాడారు. అతని అసలు పేరు హిర్దేశ్ సింగ్ కాగా.. యో యో హనీ సింగ్ పేరుతో ఫేమస్ అయ్యారు. అతను 2003లో రికార్డింగ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభించాడు. ఆ తర్వాత పంజాబీ సంగీతంలో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. (ఇది చదవండి: అశ్వినిని ఏడిపించేసిన బిగ్ బాస్.. హౌస్‌లో ఏం జరిగిందంటే?) -
Blackpink Lisa: మోస్ట్ టాలెంటెడ్ రాపర్, సింగర్, డాన్సర్, బ్లాక్‌పింక్ లిసా (ఫోటోలు)
-
ఈమె ర్యాప్కి విదేశాల్లో కూడా రీసౌండ్.. తొలి సినిమాకే రెహమాన్‌తో
ప్యాషన్నే ప్రొఫెషన్‌గా మలుచుకుంటే అంతకు మించిన ఘన విజయం ఏముంటుంది?చిన్నప్పుడు సరదాగా కవిత్వం రాసిన, మన పాటలను ర్యాప్లోకి మార్చి సరదాగా పాడిన కలైవాణి నాగరాజ్ అలియాస్ లేడి కాష్ తొలి తమిళ్–ఇంగ్లీష్ ఫిమేల్ ర్యాపర్‌గా తనదైన గుర్తింపు సాధింంది. ఏఆర్ రెహమాన్ ఆమెకు పెట్టిన పేరు మినీ డైనమెట్. కాష్ తండ్రి ప్రొఫెషనల్ డ్యాన్సర్. తల్లికి చిత్రకళ ఆసక్తికరమైన సబ్జెక్ట్. ఇంతకు మించి కష్కు కళానేపథ్యం లేదు. ఇక సంగీతం తెలిసిన వారు ఎవరూ లేరు. కథలు చెప్పడం, కవిత్వం పోటీలలో చురుగ్గా పాల్గొనేది. రేడియోలో పాటలు వినడం ద్వారా, మ్యూజిక్ చానల్స్ చూడడం ద్వారా సంగీతంపై ఆసక్తి మొదలైంది. ‘మ్యూజికే నా కెరీర్’ అని కాష్ అన్నప్పుడు తల్లిదండ్రులు అభ్యంతరం పెట్టకపోగా చాలా ప్రోత్సహించారు. తాను విన్న పాటలను ర్యాప్ సాంగ్ స్టైల్లో పాడడం కాష్‌కు ఒక సరదా. కవిత్వం రాయడం మరో సరదా. అయితే ఈ సరదాలేవి వృథా పోలేదు. తన కెరీర్‌కు గట్టి పునాదిరాళ్లుగా ఉపయోగపడ్డాయి. భాషపై పట్టు కోసం లైబ్రరీ నుంచి ఇంగ్లీష్, తమిళ భాషల్లోని పుస్తకాలను తెచ్చుకొని చదివేది. ర్యాప్‌లో తనదైన టాలెంట్ చూపుతున్న కాష్‌కు ‘రోబో’ సినిమా సౌండ్‌ట్రాక్ కోసం ఏఆర్ రెహమాన్‌తో పనిచేసే అవకాశం వచ్చింది. ఇది తనకు మెయిన్ స్ట్రీమ్ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి లాంచ్‌ప్యాడ్‌గా ఉపయోగపడింది. ‘ఆ సౌండ్‌ట్రాక్ అనేది నా కెరీర్లో మైలుస్టోన్ మాత్రమే కాదు ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ల్యాండ్‌మార్క్‌గా నిలింది. యూఎస్, యూకే ఐట్యూన్ చార్ట్స్‌లో టాప్‌లో నిలింది. గతంలో ఏ ఆల్బమ్ ఇలాంటి ఘనతను సాధించలేదు. ఇదొక అద్భుతమైన, ఆనందకరమైన అనుభవం. మ్యూజిక్‌లో ఉండే పవర్ ఏమిటో తెలిసొచ్చింది. సంగీతం బాగుంటే సరిహద్దులు చెరిగిపోతాయి. అన్ని దేశాలు ఆ సంగీతాన్ని స్వంతం చేసుకుంటాయి’ అంటుంది లేడీ కాష్. -
హీరోయిన్‌తో సింగర్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ సింగర్, ర్యాపర్ యోయో హనీ సింగ్ గురించి బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ముంబయిలో జరిగిన ఓ గ్రాండ్ ఈవెంట్లో ఆయన ప్రదర్శన చేశారు. ఈ ప్రోగ్రామ్‌లో బీ టౌన్‌కు చెందిన పలువురు అగ్ర తారలు హాజరయ్యారు. అయితే ఈవెంట్లో బాలీవుడ్ నటి నుస్రత్ బరుచా అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే హనీ సింగ్ ఆమె చేతులు పట్టుకుని వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు. దీంతో వీరిద్దరి డేటింగ్లో ఉన్నారంటూ బీటౌన్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ జంట ఫోటోలకు కూడా ఫోజులిచ్చారు. ఓ నెటిజన్ రాస్తూ వారిద్దరు డేటింగ్లో ఉన్నారా? అని ప్రశ్నించారు. మరో నెటిజన్ వీరి మధ్య ఏదో జరుగుతోంది అంటూ కామెంట్ చేశాడు. కాగా.. హనీ సింగ్ ఇటీవలే తన కొత్త పాటను రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించింది. మరోవైపు నుస్రత్ ప్రస్తుతం 'చోరీ' సినిమా కోసం సిద్ధమవుతోంది. ఆమె చివరిసారిగా అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీలతో కలిసి 'సెల్ఫీ' చిత్రంలో కనిపించింది. రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ నటించిన 'తు ఝూతీ మైన్ మక్కార్'లో కూడా నుష్రత్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
‘మే నహి తో కౌన్ బే’ పాటతో సంచలనం.. ఎవరీ సృష్టి తవాడే?
ఆమె... ఒక్క మాటతో పొట్ట చెక్కలయ్యేలా చేయగలదు. ఒక్క పాటతో కళ్లు కన్నీటి చెరువయ్యేలా చేయగలదు. అదే పాటతో హుషారు ఉత్తుంగ తరంగమయ్యేలా చేయగలదు. ముంబైకి చెందిన 24 సంవత్సరాల సృష్టి తవాడే రైటర్, పోయెట్, ర్యాపర్, సెటైరిస్ట్‌గా తన ప్రత్యేకతను చాటుకుంటోంది... సృష్టి తవాడే తల్లికి కీర్తనలు అంటే ఎంతో ఇష్టం. పాడడమే కాదు రాసేది కూడా. డైరీల నిండా ఆమె రాసిన కీర్తనలే కనిపించేవి. ఒకసారి తల్లి రచనలో నిమగ్నమై ఉన్నప్పుడు... ‘ఇలా రాస్తే ఏం వస్తుంది?’ అని అడిగింది సృష్టి.‘నువ్వు రాస్తే తెలుస్తుంది’ అని చెప్పి తన రచనలో నిమగ్నమైపోయింది తల్లి. కోవిడ్ సమయంలో సృష్టికి బోలెడు తీరిక దొరికింది. ఇంగ్లీష్ సాహిత్యంలో పోస్ట్–గ్రాడ్యుయేషన్ చేసిన సృష్టి పాత పాఠ్యపుస్తకాలను పదే పదే తిరగేసింది. ఒకరోజు తనకు కూడా రాయాలనిపించింది. అంతే...అప్పుడు పట్టుకున్న కలాన్ని మళ్లీ వదలలేదు. రచన చేయడంలో ఉండే మజా ఏమిటో సృష్టికి స్వయంగా తెలిసి వచ్చింది.‘మనల్ని మనం వ్యక్తీకరించుకోవడానికి కవిత్వం, కథలు బలమైన సాధనాలు’ అనే వాస్తవం బోధపడింది. కవిత్వం, వచనం, పాట, సెటైర్... ఇలా ఎన్నో రాసింది. ఆమె మాటల్లో చెప్పాలంటే ‘ఏదీ వదలలేదు!’అయితే సృష్టి రాసిన పాటలు ఇంటి నాలుగు గోడలకే పరిమితం కాలేదు. చిల్లీ కిండా గై, మై నహీతో కౌన్... మొదలైన పాటలతో ఇంటర్నెట్ సెన్సేషనల్‌గా మారింది సృష్టి. మై నహీతో కౌన్... పాటను హిందీతో పాటు ఇంగ్లీష్, మరాఠీ, బెంగాలీ, హర్యాన్వీ భాషల్లోనూ పాడింది. ముంబైలోని నేషనల్ ఇంగ్లీష్ హైస్కూల్, ఎస్ఎన్డీటీ కాలేజీలో చదువుకున్న సృష్టికి ర్యాప్ అండ్ పాప్ కల్చర్ కొత్త కాదు. తన పాటలతో సృష్టి ఇంటర్నెట్లో ప్రాచుర్యం పొందడం ఒక ఎత్తయితే ఎంటీవీలో అవకాశం మరో ఎత్తు. మన దేశంలోని తొలి ర్యాప్, హిప్–హప్ రియాల్టి షో ఎంటీవీ హాజిల్తో సృష్టి తవాడే పేరు అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. ఇది తనకు ఊహించని గుర్తింపు! ‘ఆరోజుల్లో పాటలు ఎంత బాగుండేవో! అనే మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఆ రోజుల్లో రచన ప్రక్రియ అనేది ఒక యజ్ఞంలా సాగేది. ఇప్పుడు డెడ్లైన్లే పాటలు రాయిస్తున్నాయి. అందుకే ఆలస్యం అయినా సరే బాగా ఆలోచించాకే పాట రాయాలని నిర్ణయించుకున్నాను. అది సత్ఫలితాన్ని ఇస్తోంది’ అంటున్న సృష్టి దగ్గర పాటకు సంబంధించిన బోలెడు ఐడియాలు ఉన్నాయి. అయితే అన్ని ఐడియాలను తప్పనిసరిగా ర్యాప్ అండ్ పాప్లోనే జోడించాలనుకోవడం లేదు. ఫన్నీ ర్యాపర్‌గా ప్రయాణం మొదలు పెట్టిన సృష్టి సామాజిక అంశాలను కూడా పాటల్లోకి తీసుకువస్తోంది. మ్యూజిక్ ప్యారడీలలో కూడా పనికొచ్చే మాటలను జత చేస్తుంది. డ్యాన్స్ నుంచి ఉపన్యాసం వరకు... సృష్టి చిన్నప్పటి నుంచే స్టేజీ పర్సన్. స్టేజీ ఫియర్ అనేది ఆమె నిఘంటువులోనే లేదు. తన భయమల్లా...‘షో విఫలమైతే!’ అనేది. సృష్టికి అలాంటి సందర్భం ఇంతవరకు ఎదురు కాలేదు. సృష్టి పేరు వినిపిస్తే, స్టేజీ మీద కనిపిస్తే... సెల్ఫ్–టాట్ ర్యాపర్, కామెడిక్ గ్యాంగ్స్టర్లాంటి మెచ్చుకోళ్లు ప్రేక్షకుల నుంచి వినిపిస్తాయి. -
లైవ్ మ్యూజిక్ షోలో పాడుతూ కుప్పకూలిన సింగర్.. 27 ఏళ్లకే..
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాప్రికాకు చెందిన యువ ర్యాపర్, సాంగ్ రైటర్ కోస్టా టిచ్ లైవ్ మ్యూజిక్ షో చేస్తూ స్టేజీపైనే కుప్పకూలాడు. సెకన్ల వ్యవధిలో రెండుసార్లు పడిపోయాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయాడు. కోస్టా టిచ్ మరణవార్తను అతని కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. 27 ఏళ్లకే అతను చనిపోవడం తమ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టిందని కన్నీటిపర్యంతమయ్యారు. తాము అత్యంత విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు భారమైన హృదయంతో చెప్పారు. ఈ యువ ర్యాపర్ జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న 'అల్ట్రా సౌత్ ఆఫ్రికా మ్యూజిక్ ఫెస్టివల్'లో లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈక్రమంలోనే పాట పాడుతూనే సడన్‌గా స్టేడీపై పడిపోయాడు. వెంటనే లేచి నిల్చున్నా.. మళ్లీ క్షణాల్లోనే కుప్పకూలాడు. ఇతర సింగర్లు వెంటనే అతనికి సాయం అందించారు. కానీ అతడు స్పృహలోకి రాలేదు. కాసేపటికే చనిపోయాడు. RIP Costa Titch pic.twitter.com/zQN4pvl6hD — 𝐍𝐰𝐚𝐧𝐲𝐞 (@nwanyebinladen) March 11, 2023 అయితే కోస్టా టిచ్ మృతికి గల కారణాలపై మాత్రం స్పష్టత లేదు. ఆయన కుటుంబసభ్యులు కూడా ఇందుకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఎంబాంబెలాకు చెందిన కోస్టా టిచ్ సింగర్‌గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఇతని సాంగ్స్‌కు యూట్యూబ్‌లో 4.5కోట్లకు పైగా వీక్షణలు వచ్చాయి. అమెరికన్ ఆర్టిస్ట్ అకోన్తో కలిసి ఇటీవలే ఓ రీమిక్స్ కూడా చేశాడు. చదవండి: నూలుపోగు లేకుండా వీధుల్లో హల్చల్.. వేరే గ్రహం నుంచి.. -
రెస్టారెంట్లో కాల్పుల కలకలం.. ర్యాపర్ సహా 10 మందికి గాయాలు
వాషింగ్టన్: అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులమోత మోగింది. ఫ్లోరిడాలోని మియామి గార్డెన్స్ రెస్టారెంట్లో ఓ వ్యక్తి తుపాకీతో రెచ్చిపోయాడు. కన్పించినవారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ సమయంలో ఫ్రెంచ్ ర్యాపర్ మోంటనా, రాబ్49 అక్కడ మ్యూజిక్ వీడియో చిత్రీకరిస్తున్నారు. దుండగుడి కాల్పుల్లో ర్యాపర్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. రెస్టారెంట్‌లోని పార్కింగ్ ప్లేస్‌లో ఓ వ్యక్తి తుపాకీతో 15 రౌండ్ల కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. తూటాల శబ్దం విని జనం పరుగులు తీశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 10 మందికి తూటాలు తగిలినట్లు సమాచారం. అంతకుముందు 'ది లికింగ్ రెస్టారెంట్' బయట కూడా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలోనూ పలువురు గాయపడ్డారు. పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే నిందితులు దాడికి పాల్పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. చదవండి: 'నేను అమ్మనయ్యాను..' కూతుళ్ల కోసం లింగాన్ని మార్చుకున్న తండ్రి.. -
Sidhu Moose Wala: నిర్లక్ష్యమే సిద్దూ ప్రాణం తీసిందా?
పంజాబ్ ర్యాప్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసే వాలా ఆదివారం ఉదయం ఘోర హత్యకు గురయ్యాడు. వీఐపీ కల్చర్‌కు ముగింపే పలికే క్రమంలో భాగంగా.. భద్రతను ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ దారుణం జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో.. సిద్ధూ మూసే వాలా నిర్లక్ష్యమే అతని ప్రాణం తీసినట్లు తేలింది. పంజాబ్ మనసా జిల్లా మూసేవాలాకు చెందిన సిద్ధూ.. ఆదివారం గ్యాంగ్ వార్కి బలయ్యాడు. 29 ఏళ్ల ఈ యువ ర్యాపర్ గ్యాంగ్స్టర్లను ప్రొత్సహించేలా ర్యాప్‌లకు కడుతుంటాడు. అంతేకాదు మరణించే వరకు పలు వివాదాలు, కేసులతోనూ వార్తల్లో నిలిచాడు అతను. సిద్ధూ మూసే వాలాతో పాటు 424 మందికి పంజాబ్ ప్రభుత్వం శనివారం వీఐపీ భద్రతను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అయితే.. కొందరికి మాత్రం పూర్తిస్థాయిలో వెనక్కి తీసుకోలేదు. సిద్ధూకి నలుగురు భద్రతా సిబ్బంది ఉండగా.. ఇద్దరిని మాత్రమే వెనక్కి తీసుకుంది పంజాబ్ పోలీస్ శాఖ. అంతేకాదు అతనికి బుల్లెట్ వెహికిల్ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కానీ, సిద్ధూ సిబ్బందిని, బుల్లెట్‌ఫ్రూఫ్ బండిని ఉపయోగించుకుండా.. తన ఇద్దరు స్నేహితులతో సాధారణ వాహనంలో బయటకు వెళ్లాడు. అదే అతని ప్రాణం తీసింది. జహవర్కే గ్రామం వద్ద వాహనంపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు దుండగలు. దీంతో సిద్ధూ అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్.. ఈ దాడికి కారణమని పోలీసులు నిర్ధారించారు. లారెన్స్ బిష్ణోయ్ ఈ హత్య కుట్రలో భాగం అయ్యాడు అని పంజాబ్ డీజీపీ వీకే భర్వా మీడియాకు వెల్లడించాడు. బిష్ణోయ్ అనుచరుడు గ్యాంగ్‌స్టర్ గోల్డీ బార్ ఈ హత్యకు కారకుడయ్యి ఉంటాడని చెప్తున్నారు. కిందటి ఏడాది జరిగిన విక్కీ మిద్ధుఖేరా హత్యకు ప్రతీకారంగానే సిద్ధూ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. విక్కీ హత్య కేసులో మూసే వాలా మేనేజర్ షగన్‌ప్రీత్ పేరు ప్రముఖంగా వినిపించింది. #WATCH | Punjab: A CCTV video shows two cars trailing Sidhu Moose Wala's vehicle moments before he was shot dead in Mansa district. pic.twitter.com/SsJag33XHb — ANI (@ANI) May 30, 2022 ఇక సిద్ధూ మూసే వాలా హత్య కేసు దర్యాప్తునకు ఒక సిట్ బృందం ఏర్పాటు చేసినట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. సిద్ధూ మూసే వాలా అసలు పేరు సుభ్‌దీప్ సింగ్ సిద్ధూ. చిన్నవయసులోనే స్టార్ డమ్ దక్కింది అతనికి. అదే సమయంలో వివాదాలు, విమర్శలు సైతం ఎదుర్కొన్నాడు. గన్ కల్చర్‌తో పాటు గ్యాంగ్స్టర్లను హీరోలుగా అభివర్ణిస్తూ ర్యాప్ సాంగ్స్ కట్టాడు అతను. అంతేకాదు నాలుగు పంజాబీ సినిమాల్లోనూ నటించాడు. అతని ఆల్బమ్స్ మొత్తం హింసను ప్రేరేపించేవిగా ఉండేవి. అభ్యంతరకర కంటెంట్‌తోనూ విమర్శలు ఎదుర్కొన్నాడు అతను. సిక్కు తెగ వీరుల్ని అవమానించేలా ఉండడంతో క్షమాపణలు చెప్పాడు కూడా. ఇక లాక్డౌన్ టైంలో తన సెక్యూరిటీ సిబ్బంది దగ్గరి తుపాకులు తీసుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చినందుకు ఆర్మ్స్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం.. కేసులు నమోదు అయ్యాయి. ఆ టైంలో అరెస్ట్‌కు బయపడి కొన్నాళ్లపాటు పరారీలో ఉన్నాడు అతను. ఆపై బెయిల్ దొరికాక బయటకు రాగా.. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులోనే ఉంది ఇంకా. సిద్ధూపై ఇంకా నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయి. పంజాబ్ ఎన్నికల ముందు 2021లో కాంగ్రెస్‌లో చేరిన సిద్ధూ మూసే వాలా.. ఎన్నికల్లో సైతం పోటీ చేసి ఆప్ అభ్యర్థి డాక్టర్ విజయ్ సింగ్లా చేతిలో ఓడిపోయాడు. సిద్ధూ మృతి కాంగ్రెస్ కీలక నేతలతో పాటు అతని అభిమానులను దిగ్ర్భాంతికి గురి చేసింది. ఇదిలా ఉంటే.. సెక్యూరిటీ ఉపసంహరణే ఒక ప్రాణం బలి తీసుకుందంటూ ప్రత్యర్థులు ఆరోపిస్తుండగా.. దయచేసి సంయమనం పాటించాలని, దోషులు ఎంతటి వాళ్లైనా వదిలే ప్రసక్తే లేదని పిలుపు ఇచ్చాడు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. I am Shocked and Deeply saddened by the gruesome murder of Siddhu Moosewala. Nobody involved will be spared. My thoughts and prayers are with his family and his fans across the world. I appeal everyone to stay calm. — Bhagwant Mann (@BhagwantMann) May 29, 2022 -
అన్నిచోట్లా నిరాశ అనే చేదు టేస్ట్ చేశా.. కానీ
యుఎస్–ఇండియా 75 ఏళ్ల సంబంధాలను గుర్తుచేసుకోవడానికి హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ హిప్–హాప్ కాన్సెర్ట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా నగరంలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజీలో గత శనివారం హిప్–హాప్ గ్రూప్ ‘ది ఇన్విజిబుల్స్’ తమ బీట్స్‌తో యువతని ఉర్రూతలూగించింది. వారిలో అమెరికన్ ర్యాపర్, ఫొటోగ్రాఫర్, యాక్టివిస్ట్ మిజ్ కొరోనా ఒకరు. ఈ సందర్భంగా ఆమెతో జరిపిన సంభాషణ. భవిష్యత్తు ఆలోచనలు? సాహిత్యాన్ని, సంగీతాన్ని అమితంగా ఇష్టపడతాను. నా సంగీతంతో నేను కూడా ఊహించనంత ఎత్తుకు చేరుకోవాలన్నది నా కల. అందుకోసం ప్రతి క్షణం తపిస్తూనే ఉంటాను. ఏ దేశమైనా మహిళల్లో చాలా ప్రతిభ ఉంటుంది. దానిని ఎవరికివారు వెలికి తీసుకురావడంలోనే హెచ్చుతగ్గులు ఉంటాయి. నాపైన నాకు అపారమైన నమ్మకం ఉంది. అది ఎలాంటిదంటే.. నేను ఈ లోకం వదిలేలోపు నాదైన ముద్రను వదిలి వెళ్లాలనేది నా కోరిక. ఈ సంగీత అభిరుచి ఎప్పుడు మొదలైంది? మా నాన్న పాటలు పాడేవారు. నేనూ పాటలు పాడాలని కోరుకున్నారు. (నవ్వుతూ) మా చుట్టుపక్కల వాళ్లు ఎలా భరించేవారో కానీ, గల్లీ బేబీలా గలగలమంటూ ఎప్పుడూ ఏదో ఒకటి పాడుతూనే ఉండేదాన్ని. మా ఇంట్లో చాలా వస్తువులు నా చేతులతో వేసే తాళాలకు బలయ్యేవి. 12 ఏళ్ల వయసులో ఇచ్చిన ప్రదర్శన నా జీవితంలో అత్యంత కీలకమైంది. చిన్నదాన్ని కావడం, పురుషాధిక్య పరిశ్రమ కావడంతో ప్రతిసారి చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. అయినా ‘వెళ్లాల్సిందే’ ప్రతీ అవకాశాన్ని కల్పించుకుంటూ, దూసుకెళ్లాల్సిందే అనుకున్నాను. ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన ఉండేది? ప్రదర్శనలు, ఆల్బమ్స్ రిలీజ్ తర్వాత ర్యాప్‌లో ‘అబ్బాయిల్లా కనిపించాలి’ అనే లెటర్స్, మెసేజ్‌లు వచ్చేవి. ఇది కొంచెం కష్టం కలిగించేదే అయినా పెద్దగా పట్టించుకోలేదు. నేను, నాలాగే ఉండాలి అనుకున్నాను. అలాగే ఉన్నాను. (నవ్వుతూ). కళాకారిణిగా ఈ రంగంలో సమస్యలను ఎలా అర్థం చేసుకున్నారు? యునైటెడ్ స్టేట్స్, ఆఫ్రికా, ఫ్రాన్స్, నార్వే, ఇప్పుడు ఇండియా.. ప్రపంచంలోని హిప్–హాప్ ఆర్టిస్టులను కలుసుకోవడానికి, ప్రదర్శనలు ఇవ్వడానికి వెళుతూనే ఉంటాను. సింగిల్‌గానూ ఆల్బమ్స్ రిలీజ్ చేస్తుంటాను. నిజానికి, నేను చాలా కష్టపడుతున్న కళాకారిణిని. ఈ విషయం నాకు తెలుసు. కానీ, ఎదిగే దశలో నాలాంటివారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి చాలామంది అభూత కల్పనలను జోడిస్తారని తెలుసుకున్నాను. అంతేకాదు, వాటిని అంతగా పట్టించుకోకూడదు అని కూడా అర్థం చేసుకున్నాను. స్త్రీ అనే కారణంగా అన్నిచోట్లా నిరాశ అనే చేదును టేస్ట్ చేయడం అత్యంత సాధారణమైపోయింది. కానీ, నా హిప్–హాప్ టీమ్స్‌తో నాకలాంటి సమస్యలు లేవు. సంగీతాన్ని ఎక్కడైనా ఆస్వాదిస్తారు. దీనికి జెండర్ అనేది లేదని నా నమ్మకం. కరోనా టైమ్‌లో సంగీతంలో మీరు చేసిన సృజన? (నవ్వుతూ)నా పేరు, కోవిడ్–19 పేరు (కరోనా)కు దగ్గరగా ఉండటంతో చాలామంది దీనికి తగిన మ్యూజిక్‌ని క్రియేట్ చేయమని అడిగారు. ముఖ్యంగా నా ఫ్రెండ్స్ మరీ మరీ అడిగారు. అందరూ అడుగుతున్నారు కదా అని రెండు వారాల్లో ‘ది వైరస్’ పేరుతో రాసి, మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ చేశాను. గత నాలుగేళ్లలోనూ ఇది మంచి క్రియేటివ్ వర్క్ అని చెప్పవచ్చు. – నిర్మలారెడ్డి ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల -
Viral Video: అభిమానికి బలవంతంగా ముద్దు పెట్టబోయిన ర్యాపర్
రాజకీయ నాయకులు, సినీ తారలు, స్పోర్ట్స్ స్టార్స్‌కు ఫాలోవర్స్ ఉండటం సహజమే.. సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా అభిమానులు వారిని ఫాలో అవుతూనే ఉంటారు. సెల్ఫీలు, వీడియోలు ఉంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తుంటారు. దీంతో సెలబ్రిటీలు బయట తిరిగే సమయంలో ఫోటోగ్రాఫర్ల కంట పడకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీకొంత మంది మాత్రం ఎంతమంది అభిమానులు ఎదురైనా వారందరికీ ఒప్పిగ్గా ఆటోగ్రాఫ్, సెల్ఫీలు ఇస్తారు. తాజాగా ఓ అమెరికన్ ర్యాపర్ అభిమానుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. నార్త్ కరోలినాకు చెందిన రాపర్ డాబాబీ ఓ కార్యక్రమం నుంచి బయటకు రాగా.. అతన్ని అభిమానులు చుట్టుముట్టారు. ఇందులో మహిళా అభిమానులు కూడ ఉన్నారు. అయితే వారు సెల్ఫీలు తీసుకుంటుండా బాబీ అభిమానుల గుంపు వద్దకు వెళ్లి వారిని కౌగిలించుకున్నాడు. అంతేగాక ఓ మహిళా అభిమాని వద్దకు వెళ్లి ఆమె ముఖాన్ని తన చేతులతో దగ్గరకు తీసుకేందుకు ప్రయత్నించాడు. చదవండి: ఏం ఐడియా సామీ! పెళ్లిలో వధూవరులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన స్నేహితులు #DaBaby getting curved by fans 😂 pic.twitter.com/EiiP7NMfsX — No Jumper (@nojumper) April 7, 2022 అయితే సదరు అభిమాని అతనికి దూరంగా జరుగుతున్నప్పటికీ ర్యాపర్ ఆమెను ముద్దు పెట్టుకోడానికి బలవంతం చేయడంతో వెంటనే ముఖాన్ని వెనక్కి తిప్పుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ర్యాపర్ ప్రవర్దనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తున్నారు. ఈ వీడియోకు 10 మిలియన్లకు పైగా వ్యూవ్స్వచ్చాయి. చదవండి: ఊహించని అదృష్టం.. పొరపాటున లాటరీ టికెట్ కొంటే.. కోటీశ్వరురాలిని చేసింది -
అతి చిన్న వయసులో ర్యాపర్ మృతి.. ఇదే చివరి వీడియో
Gully Boy Fame Rapper MC Tod Fod Dies At Age 24 This Is The Last Video: బాలీవుడ్ ర్యాపర్ ధర్మేష్ పర్మార్ అకాల మరణం చెందాడు. ఎంసీ టాడ్ ఫాడ్గా పాపులారిటీ సంపాదించుకున్న ధర్మేష్ 24 ఏళ్ల వయసులో మరణించాడు. అయితే ఎంసీ టాడ్ ఫాడ్ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. యంగ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'గల్లీ బాయ్'లో ఇండియా 91 ట్రాక్ కోసం ర్యాప్ చేశాడు ధర్మేష్. ర్యాపర్ టాడ్ ఫాడ్ మృతిపట్ల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అతని అకాల మరణం పట్ల చింతిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో గల్లీ బాయ్ మూవీలో నటించిన రణ్వీర్ సింగ్, సిద్ధాంత్ చతుర్వేది ర్యాపర్ దర్మేష్ పర్మార్‌కు నివాళులు అర్పించారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ర్యాపర్ టాడ్ ఫాడ్ ఫొటో షేర్ చేస్తూ హార్ట్ బ్రోకెన్ ఎమోజీని యాడ్ చేశాడు రణ్వీర్ సింగ్. అలాగే ర్యాపర్‌తో జరిగిన సంభాషణ స్క్రీన్ షాట్‌ను పంచుకుంటూ 'రెస్ట్ ఇన్ పీస్ భాయ్' అని రాసుకొచ్చాడు సిద్ధాంత్ చతుర్వేది. 'మీరు చాలా త్వరగా వెళ్లిపోయారు. మన మార్గాలు వేరయ్యాయి. కానీ మీరు చేసినదానికి కృతజ్ఞతతో ఉండగలను. రెస్ట్ ఇన్ పీస్ బంటాయి.' అని గల్లీ బాయ్ మూవీ డైరెక్టర్ జోయా అక్తర్ పోస్ట్ చేశారు. జోయా అక్తర్ నిర్మాణ సంస్థ టైగర్ బేబీ ఫిల్మ్స్ నివాళులు తెలిపింది. View this post on Instagram A post shared by Zoya Akhtar (@zoieakhtar) ఎంసీ టాడ్ ఫాడ్ సభ్యుడిగా ఉన్న 'స్వదేశీ బ్యాండ్' తన అధికార పేజీలో అతని త్రోబ్యాక్ ప్రదర్శన వీడియోను షేర్ చేసింది. 'ఈ రాత్రే టాడ్ ఫాడ్ స్వదేశీ మేళాలో తన చివరి ప్రదర్శన ఇచ్చారు. అతని లైవ్ మ్యూజిక్ థ్రిల్, ప్యాషన్‌ను అనుభూతి చెందాలంటే మీరు అక్కడ ఉండాల్సింది. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేరు. మీరు ఎల్లప్పుడూ మీ సంగీతంతో జీవిస్తారు.' అంటూ రాసుకొచ్చింది స్వదేశీ బ్యాండ్. View this post on Instagram A post shared by Swadesi (@swadesimovement) -
22 ఏళ్ల యూట్యూబ్ స్టార్ మృతి.. తండ్రి భావోద్వేగపు పోస్ట్
Australian Rapper YouTube Star Lil Bo Weep Dies At 22: ప్రముఖ ఆస్ట్రేలియిన్ ర్యాపర్, యూట్యూబ్ స్టార్ లిల్ బో వీప్ అకాల మరణం చెందింది. 22 ఏళ్ల ఈ గాయని మార్చి 3న తుది శ్వాస విడిచింది. ఈ విషయాన్ని ఆమె తండ్రి మాథ్క్యూ స్కోఫీల్డ్ సోషల్ మీడియా వేదికైన ఫేస్బుక్లో తెలిపారు. ఈ పోస్ట్‌లో 'డిప్రెషన్, బాధ, పీటీఎస్డీ, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా మా కుమార్తె కోసం ఈ వారమంతా పోరాడుతూనే ఉన్నాం. ఆమెను అమెరికా నుంచి ఇక్కడికీ తీసుకువచ్చినప్పటినుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. మేము పక్కనే ఉన్నప్పుడు ఆమె తన రాక్షసులతో తీవ్రంగా పోరాడింది. కానీ మేము ఆమెను కోల్పోయాం. మేము కూడా ఓడిపోయాం' అంటూ రాసుకొచ్చారు. అయితే ఆమె మృతికి గల సరైన కారణాలను ఇంకా వెల్లడించలేదు. గాయని లిల్ బో వీప్ మృతిపట్ల ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేశారు. 'ఐ లవ్ యూ. ఐయామ్ సారీ బేబీ గర్ల్. మరో జీవితం', 'రెస్ట్ ఇన్ పీస్ వినోనా, నా కష్టతరమైన సమయంలో మీ సంగీతం నాకు సాంత్వన కలిగించింది.' అంటూ కామెంట్స్ పెట్టారు. లిల్ అభిమానుల ప్రేమను చూసి ఆమె తండ్రి మళ్లీ 'ఆమె తండ్రిగా నేను చాలా గర్వపడుతున్నాను. తను నా హీరో, నా కూతురు, నా బెస్ట్ ఫ్రెండ్. తనను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పలేను. ఆమె మళ్లీ తిరిగి వస్తుంది.' అంటూ రాసుకొచ్చారు. లిల్ బో వీప్ అసలు పేరు 'వినోనా బ్రూక్స్'. 2015సో సౌండ్క్లౌడ్లో తన సంగీతం కెరీర్‌ను ప్రారంభించింది. తర్వాత అనేక మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. 'పీటీఎస్డీ' పేరుతో ఒక నిమిషంన్నర నిడివి గల పాటను ఆమె చివరిగా పోస్ట్ చేసింది. -
రెండే రెండు నిమిషాల్లో బాద్షా సాంగ్, స్పందించిన ర్యాపర్
హ్యూమర్ అంటే ఇష్టం లేనిది ఎవరికి? ఆ మాటకొస్తే మ్యూజిక్ అంటే కూడా! ఈ రెండిటినీ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుందిగానీ, ఆ కళ కాస్త గట్టిగా తెలిసుండాలి. సరిగ్గా ఈ కోవకు చెందిన మ్యూజిషియన్ అన్ష్మన్ శర్మ. ‘హౌ టూ మేక్ ఏ బాద్షా సాంగ్ ఇన్ 2 మినిట్స్’ పేరుతో ఆయన ఒక వీడియో రూపొందించాడు. సాంగ్ మేకింగ్ గురించి ఎనిమిది స్టెప్స్‌తో జనవరి 10న పోస్టు చేసిన ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 9 లక్షల పైనా వ్యూవ్స్ వచ్చాయి. ఇలాంటి వీడియోనే గతంలో రిత్విక్, ప్రతీక్ పాటల గురించి చేసి శబ్భాష్ అనిపించుకున్నాడు శర్మ. అయితే ఈ వైరల్ వీడియో చివరికి రాపర్ దృష్టిని ఆకర్షించింది. దీనిపై స్పందిస్తూ ‘అతను దాదాపు కొల్లగొట్టాడని ప్రమాణం చేస్తున్నాను" అంటూ బాద్షా నవ్వుతున్న ఎమోజీ షేర్ చేశారు. How to make a Badshah song in 2 minutes! pic.twitter.com/MtpILEwgvi — Anshuman Sharma (@anshumonsharma) January 10, 2022 -
ప్రియురాలిని చంపి సింగర్ ఆత్మహత్య
కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పాల్సింది పోయి జీవితానికే ముగింపు పలికాడో సింగర్. ఆవేశంలో తన ప్రియురాలిని గన్‌తో కాల్చడమే కాక తను సైతం ఆత్మహత్య చేసుకుని పిల్లలను ఎవరూ లేని అనాథలను చేశాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికన్ ర్యాపర్ జె స్టాష్(అసలు పేరు జస్టిన్ జోసెఫ్), జెనటీ గాలెగోస్ గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నారు. జనవరి ఒకటవ తేదీ ఉదయాన వీరిద్దరూ గొడవ పడినట్లు తెలుస్తోంది. దీంతో స్టాష్ ప్రేయసిని మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకెళ్లి గన్‌తో కాల్చి చంపాడు. తర్వాత తనూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల శబ్ధం విన్న గాలెగోస్ తనయులు వారి నాయనమ్మతో పాటు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్టాష్, గాలెగోస్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పిల్లల శరీరంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో వారిపై దాడి జరగలేదని నిర్ధారించారు. -
Sania Mistry: స్లమ్ సెన్సేషన్... ర్యాపర్ సానియా.. ఒక్కసారి వింటే!
Sania Mistry : ఆకలికి పేద, గొప్ప తేడా ఎలా ఉండదో...ప్రతిభకూ అదే వర్తిస్తుందని నిరూపిస్తోంది సానియా. పుట్టింది నిరుపేద కుటుంబం. కానీ తన కల చాలా పెద్దది. ఒక్కసారి చూసినా, విన్నా చటుక్కున పట్టేసే నైపుణ్యం ఉండడంతో ఏకంగా ర్యాపర్‌గా మారింది సానియా. పదిహేనేళ్ల వయసులోనే ఆమె రాసి, పాడిన ర్యాప్ సాంగ్ అందరినీ అలరించింది. పెద్ద అనుభవం లేకపోయినా ర్యాప్ సాంగ్స్ రచించి తనే స్వయంగా ఆలపిస్తూ శ్రోతలను అలరిస్తోంది. తూర్పు ముంబైలో గోవండి మురికివాడలో పూట గడవడమే కష్టంగా రోజులు దొర్లించే ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది ‘సానియా మిస్త్రీ ఖైయుముద్దీన్’. తండ్రి ఆటో నడుపుతూ, తల్లి కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సానియా ఎనిమిదో తరగతిలో ఉండగా ఒకసారి ఇండియాలోనే పాపులర్ ర్యాపర్లు అయిన ఎమివే బంటాయ్, వివియన్ ఫెర్నాండెజ్‌ల ర్యాప్ సాంగ్స్ అనుకోకుండా ఆమె చెవిన పడ్డాయి. ఆ పాటలు ఆమెకు బాగా నచ్చడంతో పాటలలోని పదాలను నిశితంగా చూసింది. అవి తనకి ఎంతో ముచ్చటగా అనిపించాయి. తాను కూడా ఇలా చిన్న చిన్న పదాలతో పాటలు రాసి పాడాలని నిర్ణయించుకుంది. సమయం దొరికినప్పుడల్లా ర్యాప్ పాటలు రాయడానికి ప్రయత్నించేది. అలా రాస్తూ రాస్తూ బాగా రాశాననిపించిన పాటను తన స్నేహితుల ముందు పాడి వినిపించింది. ‘‘చాలా బావుంది’’ అని వారు చెప్పడంతో మరింత సీరియస్‌గా పాటలు రాయడానికి ప్రయత్నించేది. ఫోన్ కూడా లేదు... ర్యాప్‌సాంగ్స్ రాయడం, పాడడం వచ్చినప్పటికీ నిరుపేద కుటుంబం కావడంతో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి కనీసం తన దగ్గర స్మార్ట్ ఫోన్ కూడా లేదు. దీంతో ఎలాగైనా తన పాటలను అప్లోడ్ చేయాలనుకుని ఎవరినో బతిమాలి ఫోన్ తీసుకుని, ఆరోతరగతి చదువుతున్న తమ్ముడు ఆరీఫ్ని వీడియో తీయమని చెప్పి...ర్యాప్ సాంగ్‌ను పాడింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అది చూసిన వారందరూ చాలా బావుందని మెచ్చుకోవడంతో మరిన్ని వీడియోలు రూపొందించాలన్న కోరిక కలిగింది. అయితే వీడియో షూట్ ఎలా చేయాలి? వాటిని ఆకర్షణీయంగా కనిపించేలా ఎడిటింగ్ ఎలా చేయాలి వంటి విషయాలేమీ సానియాకు తెలియదు. అయినా తన స్నేహితుల సాయంతో ఎలాగో ఒకలాగా వీడియోలు రూపొందించి వాటినే పోస్టు చేసేది. అవి పాపులర్ అవుతుండడంతో మరింత ఉత్సాహంతో పాటలు రాస్తూ పాడుతూ ముంబై ‘హిప్ అప్’ సర్కిల్లో చేరి ర్యాపర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలిసాంగ్.. తొలి ర్యాప్ సాంగ్‌ను స్థానికంగా ఉన్న ఎన్జీవోపై రాసింది. తరువాత కోవిడ్–19 మీద రాసుకున్న పాట పాడింది. ఈ రెండింటికి మంచి స్పందన లభించడంతో ఇక ఆమె వెనక్కు తిరిగి చూసుకోలేదు. అప్పటినుంచి ఇప్పటిదాకా పాటలు పాడుతూనే ఉంది. రోజూ కూలి పనిచేసి బతికే కుటుంబం కావడంతో లాక్ డౌన్ సమయంలో..చాలా ఇబ్బందులకు గురయ్యారు. వాటన్నింటిని ప్రత్యక్షంగా అనుభవించిన సానియా... ఈ లాక్డౌన్ ఎప్పుడు ఆగిపోతుంది? సమాధానాలు చెప్పడంలో మీరు ఎప్పుడూ ఫెయిల్ అవుతున్నారు? సమాధానాలు ఎందుకు చెప్పరు? అని ప్రభుత్వాలను నిలదీస్తూ ర్యాప్ సాంగ్ పాడింది. సానియా పాడిన వాటిలో ‘‘ఫ్యూచర్ కా క్యా’’, జనతా హై కౌన్’’, ‘‘భ్రమ్’’ ‘‘బహోత్ ధీట్’’ వంటి పాటలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సానియా ఎమ్క్యూ యూట్యూబ్ చానల్‌కు దాదాపు మూడున్నర వేలకు పైగా, ఇన్‌స్టా గ్రామ్‌లో పదమూడువందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న సానియా, చదువుతోబాటు మంచి ర్యాపర్‌గా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. ‘‘అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టాను. కొన్నిసార్లు పస్తులతో పడుకోవాల్సి వచ్చేది. అయినా ఎప్పుడూ బాధపడలేదు. ర్యాప్ సాంగ్స్ నచ్చడంతో రాయడం మొదలు పెట్టాను. స్కూల్లో టీచర్స్ కూడా నాకు మద్దతుగా నిలవడంతో ర్యాపర్‌గా రాణించగలుగుతున్నాను. భవిష్యత్‌లో మరెన్నో సాధిస్తాను’’ అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్న సానియా ముందు ముందు మరెన్నో విజయాలు సాధించగలదని నమ్మకంగా చెప్పవచ్చు. చదవండి: Acid Attack Survivor Yasmeen: దేశంలోనే తొలి యాసిడ్ సర్వైర్ నర్స్ Jayanthi Narayanan Life Story: ఒక అమ్మ .. 1000 మంది పిల్లలు View this post on Instagram A post shared by S A N I Y A 🌠ثانیہ ☄️ (@saniya_mq) -
Moneytalks: ‘లిజన్ టు మై మనీ టాక్’ సాంగ్ విన్నారా?
Everyone silent Listen to my money talk ... లాలిస మనోబాల్, ప్రాణ్ ప్రియా ఎవరు? అని అడిగితే చెప్పడం కష్టం కావచ్చుగానీ ‘ర్యాపర్ లీసా’ అంటే మాత్రం జవాబు చెప్పడం సూపర్ ఈజీ. థాయ్‌లాండ్‌లోని బురిరమ్ ప్రావిన్స్‌లో పుట్టిన లీసా సౌత్ కొరియన్ గర్ల్ గ్రూప్ ‘బ్లాక్‌పింక్’లో సింగర్,ర్యాపర్, డ్యాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా వచ్చిన సింగిల్ ఆల్బమ్ ‘లాలిసా’ ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. బిల్బోర్డ్ చార్ట్‌లో ఫిమేల్ సోలోయిస్ట్ బెస్ట్–సెల్లింగ్ ఆల్బమ్‌గా హల్చల్ చేస్తుంది. ఈ ఆల్బమ్‌లో ‘మనీ’ పాట పాప్లర్ అయింది. మనీ గురించి మనకు తెలియనిదేముంది! ఎక్కడా స్థిరంగా ఉండదు. కదులుతూనే ఉంటుంది. ఎప్పుడూ మౌనంగా ఉండదు. మాట్లాడుతూనే ఉంటుంది. చాలా రకాలుగా శాసిస్తూనే ఉంటుంది. ‘ఎవ్రీ వన్ సైలెంట్/ లిజన్ టు మై మనీ టాక్/ స్పెండ్ హౌ ఐ లైక్ ఇట్’ అని స్వీటు స్వీటుగా పాడుకుంటుంది లీసా. చదవండి: Saree Styles With Sweater: చలికాలంలో ఫ్యాషనబుల్‌గా వెచ్చని స్టైల్! -
Gold hair: అతని జుట్టు పీకితేచాలు లైఫ్ సెట్!!
పడమటి దేశాల్లో కొందరు బంగారంలాంటి జుట్టు అంటే మోజుపడతారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం బంగారంతోనే జుట్టు ఉండాలని అనుకున్నాడు. అనుకోవడమే కాదు. దానిని నిజం కూడా చేసుకున్నాడు కూడా. సుమారు రెండు మిలియన్ డాలర్స్ అంటే మన కరెన్సీలో రూ.14 కోట్లు ఖర్చు చేసి తన తలపైభాగం మొత్తం వివిధ బంగారు గొలుసులతో అమర్చుకున్నాడు. అయితే, వీటిని శాశ్వతంగా లేక తాత్కాలికంగా అమర్చుకున్నాడో చెప్పలేదు. కానీ, తన బంగారు జుట్టు కలను మాత్రం నిజం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఈ మధ్యనే సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు. ఇంతటి విచిత్ర సాహసాన్ని చేసిన అతడెవరో కాదు. ప్రముఖ మెక్సికన్ ర్యాపర్ డాన్ సుర్. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. కొంతమంది నెటిజన్లు ‘అతని జుట్టు పీకితేచాలు లైఫ్ సెట్’, ‘గోల్డన్ స్కల్’ అంటూ ఫన్నీ కామెంట్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. చదవండి: ఈ దోమ ఎగురుతుంటే సీతాకోకచిలుకలా.. మోస్ట్ బ్యూటిఫుల్..! -
ప్రముఖ ర్యాపర్ మృతి, న్యూయార్క్ మేయర్ సంతాపం
న్యూయార్క్: ప్రముఖ ర్యాపర్ బిజ్ మార్కీ (57) అనారోగ్యంతో కన్నుమూశారు. న్యూయార్క్‌లో జన్మించిన బిజ్ మార్కీ "క్లౌన్ ప్రిన్స్ ఆఫ్ హిప్-హాప్" అనే నిక్‌నేమ్‌తో సంగీత ప్రపంచంలో మంచి పేరును సంపాదించాడు. బిజ్ ఆకస్మిక మరణంపై న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో తన సంతాపాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. అలాగే పలువురు ర్యాప్ సంగీతాభిమానులు, ఇతర గాయకులు బిజ్ మృతిపై సోషల్ మీడియా ద్వారా సంతాపం వెలిబుచ్చారు. తన భార్య తార, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆయన మరణించారని రోలింగ్ స్టోన్ పత్రిక నివేదించింది. అయితే బిజ్మరణానికి గల కారణాలను స్పష్టంగా ప్రకటించ లేదు. కానీ టైప్ 2 డయాబెటిస్తో గత కొంతకాలంగా బాధపడుతున్న ర్యాపీ సంబంధిత ఆరోగ్య సమస్యలతోనే కన్నుమూసినట్టు సమాచారం. కాగా ఇన్నోవేటివ్ అమెరికన్ రాపర్, డీజే, నిర్మాత కూడా అయిన బిజ్ మార్కీ 1989లో "జస్ట్ ఎ ఫ్రెండ్"తో బాగా పాపులర్ అయ్యాడు. "పికిన్ బూగర్స్" "చైనీస్ ఫుడ్" వంటి పాటలు ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. We lost another Rap legend Mr. Biz Markie, an American rapper, singer, DJ, record producer, actor, comedian, and writer. He's best known for his 1989 single "Just a Friend"! To a lot of us he was more than Just a Friend. R.I.P. Prayers going out to the family & friends. Bootsy🤩 pic.twitter.com/URnUMKIQdB — Bootsy Collins (@Bootsy_Collins) July 17, 2021 Tragic loss of such an incredible artist and creator. Blessings to you and your family always. #LegendsNeverDie https://t.co/EuWsDrKwUE — Rosario Dawson (@rosariodawson) July 17, 2021 -
అవార్డుల ఫంక్షన్లో డ్యాన్సర్‌ను ముద్దాడిన గాయకుడు!
లాస్ ఏంజిల్స్: ద బెట్ అవార్డుల ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ర్యాపర్, సింగర్ లిల్ నాస్ ఎక్స్ తన పర్ఫామెన్స్తో అదరగొట్టాడు. 'కాల్ మీ బై యువర్ నేమ్' ఆల్బమ్ నుంచి 'మాంటెరో' పాటకు తోటి డ్యాన్సర్లతో కలిసి స్టెప్పులేశాడు. పాట పూర్తయ్యే చివరలో మాత్రం తోటి మేల్ డ్యాన్సర్‌కు గాఢంగా ముద్దు పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ఇది కూడా పర్ఫామెన్స్లో భాగమేనని కొందరు ప్రేక్షకులు చప్పట్లు కొట్టి అభినందించారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు అతడి తీరును దుమ్మెత్తిపోస్తున్నారు. ఆఫ్రికన్ సంస్కృతిని అవమానించాడంటూ సదరు ర్యాపర్‌ను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా తనపై వస్తున్న విమర్శలకు ధీటుగా బదులిచ్చాడు లిల్ నాస్ ఎక్స్. "ఆఫ్రికన్ కల్చర్‌లో స్వలింగ సంపర్కం ఉనికిలో లేదని చాటిచెప్పాలని ఎందుకంత కష్టపడుతున్నారో.." అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. కాగా లిల్ నాస్ ఎక్స్ 2019లో తాను గే అని వెల్లడించాడు. చదవండి: నటికి తీవ్రగాయాలు.. ఐసీయూలో చికిత్స ప్రియుడితో నాలుగేళ్లుగా డేటింగ్, గర్భం దాల్చిన హీరోయిన్! -
చిరకాల కోరిక నెరవేర్చుకున్న టాప్ సింగర్
అమెరికన్ ర్యాపర్, సింగర్, సాంగ్‌రైటర్ పోలో జీ ‘ర్యాప్‌స్టార్’ సాంగ్ బిల్బోర్డ్ హాట్ 100 సాంగ్స్ చార్ట్‌లో నెంబర్‌వన్ ఘనతను సాధించింది. ఫైనర్ థింగ్స్(2018) సింగిల్‌తో వెలుగులోకి వచ్చాడు పోలో జీ. ఇది బిల్‌బోర్డ్‌లో ‘11’వ స్థానంలో నిలిచింది. ఆ తరువాత వచ్చిన డై ఏ లెజెండ్ (2019) ‘6’వ స్థానంలో నిలిచింది. ఇక ‘ది గోట్’ రెండో స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం ట్రాప్ జానర్లో వచ్చిన ‘ర్యాప్‌స్టార్’తో మొదటిస్థానంలో నిలిచి తన చిరకాల కోరిక నెరవేర్చుకున్నాడు పోలో జీ. ఈ నెల 9న కొలంబియా రికార్డ్స్ ద్వారా విడుదలైన ర్యాప్‌స్టార్ సాంగ్ ‘ప్రతిరోజూ ఒక యుద్ధమే’ అంటోంది. మన ఆలోచనల నుంచి అలవాట్ల వరకు ఎన్నో యుద్ధాలు అవి! ‘మోడ్రన్ మ్యూజిక్‌లో పోలో జీ స్ట్రాంగెస్ట్ స్టోరీ టెల్లర్’ అంటున్నారు సంగీతకారులు. చదవండి: 'రాజా రవి వర్మ'..వాళ్లను ఊహించుకొని పెయింటింగ్స్ వేసేవారట -
ర్యాప్ అండ్ రాకెట్ లవ్ స్టోరీ
ఇష్టం లేని పనుల్ని కూడా కూర్చోబెట్టి మరీ చేయిస్తుంది ప్రేమ! తాజా గ్రాండ్ స్లామ్ టెన్నిస్‌లో విజేత అయిన నయోమీకి.. కార్డీ అని ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. ఆమె కోసం ఆమె ఆటని ప్రతిసారీ ఏడ్చుకుంటూ చూస్తుంటాడు. నయోమీ గెలుపు, ఓటమి లెక్క కాదు అతడికి. ఆటను త్వరగా ముగించేస్తే ఇద్దరూ వెళ్లి ఎక్కడైనా డిన్నర్ చేస్తూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ మాట్లాడుకోవడం అతడికి ఇష్టం. రెండేళ్ల నుంచీ రిలేషన్లో ఉన్నారు. ఆమెలో అతడికి నచ్చింది ఆమే. ఆమె ఆట కాదు. అతడిలో ఆమెకు నచ్చింది అతడొక్కడే కాదు. అతడి ‘ర్యాప్’ కూడా. ఎలా కుదిరింది? ఎలా కుదురుతుంది? నయోమీ ఒసాకా.. టెన్నిస్ స్టార్. కార్డే అమరీ.. ర్యాప్ స్టార్. ఆమె నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్. అతడు గ్రామీ–నామినేటెడ్ ర్యాపర్. ఇద్దరూ యూఎస్‌లోనే ఉంటారు. అయితే ఇద్దరివీ వేర్వేరు ప్రపంచాలు. ఆమెకు ‘ర్యాప్’ పనిగట్టుకునేమీ ఇష్టం లేదు. అతడికి ఈ లోకంలో టెన్నిస్ అనే ఆట ఒకటుందనే స్పృహే లేదు. అలాంటి ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వీళ్లు పడ్డారు సరే. వీళ్ల ప్రేమ నిలబడుతుందా? అది మన సందేహం మాత్రమే. వాళ్ల సమాధానం వేరుగా ఉంది. ‘‘నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామంటే మన ప్రేమకు కాళ్లలో శక్తి లేదనే’’ అని నవ్వుతూ అనేస్తారు. ఆమె రాకెట్ శక్తి, అతడి ర్యాప్ శక్తి కలిపి ఎప్పటికప్పుడు పునఃస్థాపించుకోవలసిన స్థితిలోనైతే వారి ప్రేమ లేదనే అనిపిస్తోంది. దానిక్కారణం ఉంది. ఇద్దరి లో ఒకరు ఇంకొకరి కోసం ‘ట్రై’ చేస్తే జనించిన ప్రేమ కాదు వాళ్లది. తనకై తను ఆవిర్భవించిన ప్రేమ! ∙∙ మొదట నయోమీ దృష్టే కార్డే మీద పడింది. అప్పటికే ఆమె తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ (యు.ఎస్. ఓపెన్) సాధించి ఉన్న టెన్నిస్ ప్లేయర్. లాస్ ఏంజెలిస్ క్లిప్పర్స్ బాస్కెట్ బాల్ గేమ్ చూడ్డానికి వెళ్లింది. అక్కడే కార్డే కూడా ఉన్నాడు. అతడూ ఆట చూడ్డానికే వచ్చాడు. అతడిని గుర్తుపట్టిన కొందరు ఫొటోల కోసం చుట్టుముట్టడం, కార్డే పసి పిల్లాడిలా నవ్వుతూ అడిగిన వారందరితో ఫొటోలకు ఫోజులు ఇవ్వడం నయోమీ దూరాన్నుంచి చూసింది. వెళ్లి పలకరించింది. ‘హాయ్’ అన్నాడు. ‘నేను నయోమీ. టెన్నిస్ ప్లేయర్’ అంది. ‘నువ్వు టెన్నిస్ ప్లేయర్ ఎలా అవుతావు? సెరెనా సిస్టర్స్ కదా టెన్నిస్ ప్లేయర్స్’ అన్నట్లు చూసి.. ‘‘టెన్నిస్ గురించి నాకేమీ తెలీదు’’ అన్నాడు. ‘‘నాకు కార్డే ర్యాప్ గురించి కొంచెం తెలుసు’’ అని నవ్వింది. కార్డే మాత్రం ఇప్పటికీ అదే మాట చెబుతుంటాడు. ‘‘నయోమీ మాత్రమే నాకు తెలుసు. నయోమీ ఆట గురించి తెలీదు. కానీ ఆమె కోసం ఆమె ఆటను చూస్తూ కూర్చుంటాను’’ అంటాడు. జంటగా నయోమీ, కార్డే ; జీక్యూ మ్యాగజీన్ తాజా సంచికపై నయోమీ, కార్డే మొన్నటితో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచింది నయోమీ. 2018లో యూ.ఎస్. ఓపెన్. అప్పటికి ఇద్దరికీ పరిచయం లేదు. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్. అదే తొలిసారి టెన్నిస్ ఆటను చూడటం కార్డే. ‘కూర్చొని చూడు’ అని నయోమీ అంటే కూర్చొని చూశాడు. 2020లో యు.ఎస్. ఓపెన్. కరోనా టైమ్‌లో డిప్రెషన్లోకి వెళ్లిపోయిన నయోమీ.. ‘‘నువ్వుంటే నాకు ధైర్యంగా ఉంటుంది’’ అని ఫోన్ చేస్తే న్యూయార్క్ నుంచి ఫ్లయిట్లో దిగి ఆమె మ్యాచ్‌కి గ్యాలరీలో కూర్చొని గెలిపించాడు. ‘అవును. కార్డే వచ్చినందు వల్లనే నేను గెలిచాను’ అంటుంది నయోమీ. ఆ మ్యాచ్ జరుగుతున్నపుడే.. ‘ఇది నా ప్లేస్ కాదు. కానీ నయోమీ కోసం నాది కాని ప్లేస్‌లోకి వచ్చాను’ అన్నాడు కార్డే. మొన్న శనివారం నయోమీ 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవగానే యూఎస్ పత్రికలన్నీ ఈ జంటను చుట్టేశాయి.. పెళ్లెప్పుడని. ఇద్దరూ ఈడూ జోడు. ఒకే ఏడాది పుట్టినవారు. వయసు 23. ∙∙ పెళ్లా! అసలు ఈ రెండేళ్లుగానే నయోమీ, కార్డే కాస్త దగ్గరగా ఉండటం. ప్రారంభంలో వాళ్లిద్దరి మధ్యా కుదురుకోడానికి వాళ్ల ప్రేమ చాలా తిప్పలు పడింది. ఆమె ఉండటం కాలిఫోర్నియాలో. అతడు ఉండటం నార్త్ కరోలినాలో. కలుసుకోడానికి పెద్ద దూరం ఏమీ కాదు. కలుసుకున్నాక మాట్లాడుకోడానికే టైమ్ ఉండదు. చీకటింకా పోక ముందే రాకెట్ పట్టుకుని ప్రాక్టీస్‌కి వెళ్లిపోతుంది నయోమీ. ఆ ప్రాక్టీస్ మధ్యాహ్నం దాటిపోయేవరకు, కొన్నిసార్లు చిన్న చిన్న బ్రేకులతో సాయంత్రం వరకు సాగుతుంది. కార్డేదీ సాయంత్రం నుంచి, కొన్నిసార్లు మధ్యాహ్నం నుంచే రాత్రంతా సాగే కచేరీ కార్యక్రమం. ఒకరిది పగటి ప్రపంచం. ఇంకొకరిది రాత్రి ప్రపంచం. అయినా చంద్రుడు, సూర్యుడు అప్పుడపుడు ఉదయం, సాయంత్రం ఆకాశంలో ఒకే సమయం లో కనిపించినట్లు వీళ్లు భూమ్మీద సంధ్యా సమయాల్లో కలుసుకుంటూనే ఉన్నారు. కలిసి డిన్నర్ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా.. ‘నిన్ను చూడాలని ఉంది’ అంటే వచ్చి వాలిపోతాడు కార్డే. అతడికి చూడాలనిపిస్తే చెప్పాపెట్టకుండా వచ్చి, కళ్ల నిండా చూసుకుని వెళ్లిపోతాడు. మొన్నటి ఆస్ట్రేలియన్ ఓపెన్ మొదలవడానికి ముందు జీక్యూ మ్యాగజీన్ వీళ్లను జంటగా చేసిన ఇంటర్వ్యూ వల్ల ఈ మాత్రమైనా వీళ్ల ప్రేమ గురించి ప్రపంచానికి తెలిసింది. లేకుంటే ఇప్పటికీ గుట్టుగా ఉండిపోయేవాళ్లే. ‘కార్డేలో మీకు ఏం నచ్చింది?’ అంటే.. ‘క్వయిట్ రొమాంటిక్ డూడ్’ అంటుంది నయోమీ. ‘నయోమీలో మీకేం నచ్చింది’ అంటే.. ‘నయోమీలో కాదు, నయోమీ మొత్తం నచ్చింది’ అని తన హిప్హాప్ స్టెయిల్లో ధ్వనిహాసం చేస్తాడు కార్డే. -
నుదుటిపై పింక్ డైమండ్.. విలువెంతో తెలుసా!
వాషింగ్టన్: సాధారణంగా ర్యాప్ సింగర్స్ అంటేనే భిన్నమైన వస్త్రధారణ, హేయిర్కట్స్తో వింత పోకడలకు పోతుంటారు. ఇక హాలీవుడ్ ర్యాపర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రొటీన్‌కు భిన్నంగా ఉండేందుకు శరీరంపై కొత్తకొత్త ప్రయోగాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ అమెరికా ర్యాప్ సింగర్ లిల్ ఉజీ వెర్ట్ కూడా వెరైటీగా ఆలోచించాడు. అందుకే కోట్ల రూపాయలు విలువ చేసే పింక్ డైమండ్‌ను ఏకంగా నుదుటిపైనే అమర్చుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతర్జాతీయ ర్యాప్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న లిల్ ఇటీవల ఓ వీడియో షేర్ చేశాడు. ‘బ్యూటీ ఈజ్ పెయిన్’ అంటూ షేర్ చేసిన ఈ వీడియోలో లిల్ నుదుటిపై పింక్ డైమండ్ ధరించి కనిపించాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. అవెంజర్స్ సిరీస్‌లో మార్వెల్ సూపర్ హరో పవర్‌లా ఉందంటూ అభిమానులు లిల్ గురించే చర్చించుకుంటున్నారు. (చదవండి: హత్యాయత్నం: మృతి చెందిన వ్యక్తిపై కేసు) కాగా అతడి నుదుటిపై అమర్చుకున్న ఈ పింక్ డైమండ్ ఖరీదు రూ. 175 కోట్లు అంట. అది తెలిసి నెటిజన్లంతా కోట్లు విలువ చేసే డైమండ్‌ను మెడలో చైన్‌గా కానీ, ఉంగరంలా ధరించకుండా అలా నుదుటి ధరించడమేంటని అవాక్కవుతున్నారు. ఇక దీనిపై లిల్ స్పందిస్తూ... తన దగ్గర ఉన్న ఖరీదైన కార్లు, వాచ్‌లు, డిజైనింగ్ క్లాత్స్ కంటే ఇది అంత్యంత ఖరీదైందని, ఇది కొనేందుకు తన నాలుగేళ్ల సంపాదనను వెచ్చించినట్లు చెప్పాడు. ఈ డైమండ్ 10 నుంచి 11 క్యారెట్లు ఉంటుందని, ఇది తన ఖరీదైన ప్యాలెస్ కంటే ఎక్కువ అని తెలిపాడు. దీనిని మేడలో ధరించోచ్చు కదా అని నెటిజన్ పెట్టిన కామెంట్‌కు లిల్ ఒకవేళ అది ఎక్కడైన పడిపోతే అంటూ సరదాగా సమాధానం ఇచ్చాడు. ఇక ఇది చూసిన నెటిజన్లు అతడిపై విమర్శలు చేస్తుంటే మరికొందరు ఆ డైమండ్ కోసం లిల్కు ఎవరైనా హాని చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Marni Life( NO STYLIST)1600 (@liluzivert) -
పాతిపెట్టిన పిల్లిని తీసి కూర వండేసింది!
వాషింగ్టన్: పెంపుడు జంతువులను సొంత బిడ్డల్లా చూసుకునే యజమానులు చాలా మందే ఉంటారు. ముద్దుపేర్లతో పిలుచుకుంటూ చంటిపాపల్లా సాకుతూ వాటికి సపర్యలు కూడా చేస్తారు. ఇక ఏకంగా పెట్స్ పేరిట కోట్ల విలువ చేసే ఆస్తులు రాసిన వాళ్ల గురించి కూడా గతంలో ఎన్నో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మూగ జీవాలపై వారికి ఉన్న ప్రేమ అలాంటిది మరి. కానీ అమెరికన్ రాపర్ అజీలియా బ్యాంక్స్ మాత్రం ఇలాంటి వారికి పూర్తి విరుద్ధం. చనిపోయిన తన పెంపుడు జంతువు పట్ల ఆమె అత్యంత అమానుషంగా ప్రవర్తించింది. విగతజీవిని వండుకుని తినేందుకు సిద్ధపడింది. (చదవండి: నువ్వు కొరికితే నేను కూడా కొరుకుతా) అంతేగాక ఈ నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి ట్రోలింగ్‌కు గురవుతోంది. వివరాలు.. అజీలియా రాపర్ అయినప్పటికీ తన సంచలన వ్యాఖ్యలు, చేష్టలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరున్నర లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్న ఆమె.. తాను మంత్రగత్తెనని, తన తల్లి నుంచి ఈ విద్య నేర్చుకున్నట్లు 2015లో ప్రకటించింది. జంతువుల పట్ల ఆమె ప్రవర్తించే తీరు కూడా విచిత్రంగా ఉండేది. ఈ క్రమంలో మంగళవారం ఆమె షేర్ చేసిన వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ‘‘మీలో చాలా మందికి తెలియదు కదా. లూసిఫర్(2009-2020). నా పెంపుడు పిల్లి. మూడు నెలల క్రితం చనిపోయింది. దానిని పాతిపెట్టాం. ఇదిగో ఇప్పుడే మళ్లీ బయటకు తీయడం. తనకు జీవం పోశాం. డియర్ కిట్టీ థాంక్యూ. నువ్వొక లెజెండ్. ఐకాన్. సర్వ్ చేయడానికి సిద్ధం చేస్తా’’అంటూ మట్టిలో పాతిపెట్టిన ఓ కవర్‌ను బయటకు తీయడం ఇందులో కనబడింది. ఆ తర్వాత దానిని ఉడకించినట్లు కనిపించింది. ఈ వీడియోపై జంతుప్రేమికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘‘మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తారా. అసలు మీరు మనిషేనా. చచ్చిపోయిన పిల్లిని కూడా వదలరా. ఛీఛీ.. ఇంతటి ఘోరాన్ని మేం చూడలేం’’ అంటూ బ్యాంక్స్‌కు చురకలు అంటించారు. ఈ క్రమంలో ఆమె వీడియోను డిలీట్ చేసింది. -
కరోనా పాజిటివ్.. తప్పుడు రిపోర్ట్ అనుకుంటా
ముంబై: ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్, రాపర్ రాఫ్తార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా అతనే ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. అయితే తనకు కరోనా రాలేదేమోనని, ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల తప్పుడు రిపోర్ట్ వచ్చిందేమో అని సందేహం వ్యక్తం చేశాడు. ఓ టీవీ రియాలిటీ షో కోసం షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే కరోనా పరీక్షలు నిర్వహించారు. రెండు సార్లు రాఫ్తార్‌కు నెగిటివ్ అనే వచ్చింది. అయితే మూడోసారి నిర్వహించిన కరోనా పరీక్షలో మాత్రం పాజిటివ్‌గా తేలింది. దీంతో అతన్ని క్వారంటైన్‌లోనే ఉండాల్సిందిగా షో నిర్వాహకులు తెలిపారు. తమంచె పే డిస్కో, తు మేరా భాయ్ నహీ హై, స్వాగ్ మేరా దేశీ వంటి పాటలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాఫ్తార్..ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. (బలవంతంగా ఒప్పించారు: రియా) తనకు అనారోగ్యం కానీ, కరోనా లక్షణాలు ఏమీ లేవని పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపాడు. ఏదో సాంకేతిక లోపం వల్లే ఎక్కడో తప్పు జరిగి ఉండొచ్చేమోనని సందేహపడ్డాడు. తదుపరి కరోనా పరీక్షల కోసం ఎదురుచూస్తున్నట్లు ఓ వీడియో ద్వారా ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నాడు. ఇక ప్రిన్స్ నరులా, నిఖిల్ చినపా, నేహా దుపియాతో పాటు రాఫ్తార్ కూడా ఓ కొత్త మ్యూజిక్ ఫోలో జడ్జీలుగా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో రాఫ్తార్‌కు ముందే కరోనా నిర్ధారణ కావడంతో ఇంకొన్ని రోజులు షోను వాయిదా వేస్తారా? రాఫ్తార్ స్థానంలో ఇంకొక వ్యక్తిని రిప్లేస్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. (టచ్‌లో బడాబాబులు) View this post on Instagram New update SAD NEWS FOR RAFTAAR FANS Raftaar tested positive for corona virus . . ●Follow us for more updates Follow @hindustanihiphopclub Follow @hindustanihiphopclub Follow @hindustanihiphopclub . . #raftaarmusic #raftaar #raftaar😎 #raftaarfanclub #raftaarrapper #kalamkaar #kalam #coronavirus #corona #delhirapper #delhihiphop #delhi #getwellsoon #mumbai #raa #rapeculture#positivity #indianrappers #indianrapculture #india A post shared by HINDUSTANI HIP HOP CLUB (@hindustanihiphopclub) on Sep 9, 2020 at 6:51am PDT -
డబ్బులిచ్చి వ్యూస్ కొనుక్కున్న ర్యాపర్!
సామాజిక మాధ్యమాల్లో సినీ తారలను ఎంతమంది అనుసరిస్తున్నారనేది ఇప్పుడు అత్యంత ప్రాధాన్యంగా మారింది. ఎవరికి ఎక్కువ ఫాలోవర్లు ఉంటే వారే పాపులర్. మొన్నామధ్య ట్విటర్ నకిలీ ఖాతాలను తొలగించినప్పుడు సెలబ్రిటీలను ఫాలో అయ్యేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనివల్ల అత్యధికంగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ 4,23,966 మంది ఫాలోవర్లను పోగొట్టుకున్నారు. ఆ తర్వాత షారుక్ ఖాతాలో 3,62,382 మంది ఫాలోవర్లు తగ్గిపోయారు. ఈ విషయంపై అమితాబ్ ట్విటర్‌పై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారనేది తెలిసిన విషయమే. అయితే ఇప్పుడో కొత్త ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కొందరు కావాలనే నకిలీ ఫాలోవర్లను సృష్టిస్తున్నారా? వారి పాపులారిటీ పెంచేందుకు దొంగచాటు మార్గాలను ఎంచుకుంటున్నారా? ఏమో? ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే అవుననే అంటారేమో! బాలీవుడ్ ర్యాపర్ బాద్షా నకిలీ ఫాలోవర్స్ స్కామ్‌లో ఇరుక్కున్నాడు. ఆయన తన వీడియోలకు ఎక్కువ వ్యూస్ వచ్చేందుకు డబ్బులిచ్చి మరీ వ్యూస్‌ను కొనుగోలు చేశారని ముంబై పోలీసులు అంటున్నారు. దీనిపై అతనికి సమన్లు కూడా జారీ చేశారు. నిజానికి యూట్యూబ్‌లో తన వీడియో రిలీజ్ చేసిన తొలి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సంపాదించి ప్రపంచ రికార్డ్ బద్ధలు కొడుదామనుకున్నాడు బాద్షా. అనుకున్నట్టుగానే అతని "పాగల్ హై" సాంగ్ వీడియోకు తొలి రోజే అత్యధికంగా 75 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. (ఆ కళాకారుడికి బాలీవుడ్ సింగర్ సాయం..) దీంతో తొలి 24 గంటల్లో అత్యధిక వీక్షణలు సంపాదించిన కొరియన్ బ్యాండ్ బీటీఎస్ వీడియో రికార్డును తుడిచిపెట్టుకుపోయిందని ర్యాపర్ చెప్పుకొచ్చారు. కానీ ఈ వార్తను గూగుల్ ఖండించడం గమనార్హం. మరోవైపు డీసీపీ నందకుమార్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. "యూట్యూబ్‌లో తన వీడియో ద్వారా ప్రపంచ రికార్డులు బద్ధలు కొట్టాలనుకున్నాడు. 7.2 కోట్ల వ్యూస్‌కు గానూ సదరు కంపెనీకి రూ.72 లక్షలు చెల్లించాడు. ఇప్పుడు అతని మిగతా పాటలను, దాని వ్యూస్‌ను కూడా పరిశీలిస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు. అయితే వీటన్నింటినీ బాద్షా తోసిపుచ్చారు. తను ఎప్పుడూ ఇలాంటి పనులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. (నేను ఉరేసుకుని కనిపిస్తే: హీరోయిన్) -
కానిస్టేబుల్ ర్యాప్ సాంగ్..
-
కానిస్టేబుల్ ర్యాప్ సాంగ్.. నెటిజన్లు ఫిదా!
శ్రీనగర్ : కోరుకున్న లక్ష్యాలను సాధించాలనే తపన అందరికీ ఉంటుంది. అయితే అందులో కొంతమంది మాత్రమే వాటిని అందుకోగలరు. చాలామంది తాము అనుకున్నవి సాధించలేక అందివచ్చిన అవకాశాలతోనే సర్దిచెప్పుకుంటారు. తాజాగా జమ్మూ కశ్మీర్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ కూడా ఈ జాబితాలో చేరాడు. ర్యాపర్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న అతడు... అనుకోని కారణాల వల్ల పోలీస్ ఉద్యోగం చేయాల్సివచ్చింది. అయితే ఉద్యోగంలో చేరినప్పటికీ తన ఆశను వదులుకోలేకపోయాడు. (వైరల్ వీడియో: నీకంటే నేనే బాగా పాడుతున్నా..) ఈ క్రమంలో... తన విధులను సక్రమంగా నిర్వహిస్తూనే తనకున్న టాలెంట్‌తో ఓ పాటను ర్యాప్ చేసి పాడాడు. 30 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో... ‘‘జనాలు నిద్రలో కలలు కంటారు. కానీ నేను కలలతోనే నిద్ర పోయేవాడిని. ఇంటి బాధ్యత అంతా భుజాన వేసుకున్నప్పటికీ ధైర్యం కోల్పోలేదు. ఒక సైనికుడి బాధ్యతను నేరవేరుస్తూనే.. ఇప్పటికీ ర్యాప్ చేస్తూనే ఉన్నాను’’ అంటూ తను కన్న కలల గురించి వివరిస్తూ పాటగా ఆలపించాడు. దీన్ని ముఖేష్ సింగ్ అనే పోలీస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తన ర్యాపింగ్ నైపుణ్యాలతో నెటిజన్ల మనసు దోచుకున్నాడు. ‘‘చాలా కష్టం.. మనలోని టాలెంట్‌ను దాచిపెట్టుకోలేం’’ అంటూ కానిస్టేబుల్‌ను ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (వైరల్: కరోనాను పాటతో వెళ్లగొడుతున్న మహిళలు) -
ఫ్యాన్ చెంప ఛెళ్లుమనిపించిన ర్యాపర్
-
లేడీ ఫ్యాన్ చెంప చెళ్లుమనిపించిన ర్యాపర్
ఫ్లోరిడా : గ్రామీ అవార్డు నామినేటెడ్ ర్యాపర్ డాబేబీ ఓ లేడీ ఫ్యాన్ చెంప చెళ్లుమనిపించాడు. శనివారం రాత్రి ఫ్లోరిడా, తాంపాలోని ఓ నైట్‌క్లబ్‌లో ప్రదర్శన ఇవ్వటానికి వెళ్లిన ఆయన ఈ దారుణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ర్యాపర్ డాబేబీ శనివారం రాత్రి తాంపాలోని ‘విష్కీ నార్త్’ అనే నైట్‌క్లబ్‌లో ప్రదర్శన ఇవ్వటానికి వెళ్లాడు. స్టేజి మీదకు వెళుతుండగా ఓ లేడీ ఫ్యాన్ అతడితో ఫొటో దిగటానికి ఉత్సాహపడింది. సెల్‌ఫోన్‌ను అతడి ముఖం వద్ద ఉంచసాగింది. దీంతో చిర్రెత్తిపోయిన అతడు ఆమె చెంప ఛెళ్లుమనిపించాడు. రెండు సార్లు ముఖంపై కొట్టాడు. ఆ దెబ్బలతో లేడీ ఫ్యాన్ సొమ్మసిల్లి కిందపడిపోయింది. డాబేబీ(ఫైల్) అనంతరం అతడు ప్రదర్శన ఇవ్వకుండానే అక్కడినుంచి వెనుదిరిగాడు. డాబేబీ తీరుపై అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఘటనపై డాబేబీ ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించాడు. సదరు లేడీ ఫ్యాన్ తనను కంటిపై సెల్‌ఫోన్‌తో కొట్టిందని తెలిపాడు. ఆ దృశ్యాలు ఉన్న వీడియో పంపిన వారికి పదివేల డాలర్లు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. కాగా, ఈ సంవత్సరం అతడికి బొత్తిగా అచ్చిరావటం లేదు. ఎప్పుడు చూసినా గొడవలతో కాలం వెళ్లదీస్తున్నాడు. కొన్ని నెలలక్రితం మ్యూజిక్ ప్రమోటర్లతో జరిగిన గొడవ కారణంగా అతడు జైలు పాలయ్యాడు. -
అభిమానులకు షాకిచ్చిన గాయని
ప్రముఖ అమెరికన్ ర్యాపర్, గాయని నిక్కీ మినాజ్(36) తన అభిమానులకు షాకిచ్చింది. ఇంకపై సంగీత ప్రపంచం నుంచి దూరంగా వుంటాలనుకుంటున్నానని వెల్లడించారు. నిక్కీ ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించగానే కోట్లాది మంది ఫ్యాన్స్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇక పై తాను కుటుంబ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు నిక్కీ తెలిపారు. సంగీత పరిశ్రమ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. ఇకపై తాను కుటుంబ జీవితం గడపాలని అనుకుంటున్నా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె వెల్లడించారు. అయితే తన తాను చనిపోయేంతవరకు అభిమానులు తనను అభిమానిస్తూనే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. 2 కోట్ల అభిమానులను సంపాదించుకున్న నిక్కీ మినాజ్ తన బాయ్ ఫ్రెండ్ జూ పెటీని రహస్యంగా పెళ్లాడినట్టు తెలుస్తోంది. అంతేకాదు తన ట్విటర్ అకౌంట్ పేరును మిసెస్ పెటీగా మార్చుకోవడం విశేషం. పెటీని పెళ్లాడబోతున్నట్టుగా ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా 2010లో ‘పింక్ ఫ్రైడే’ అల్బమ్ తో నిక్కీ మినాజ్ పాప్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ది పింక్ ప్రింట్, క్వీన్, ప్లే టైమ్ ఈజ్ ఓవర్ వంటి ఆల్బమ్స్ తో మంచి పేరు తెచ్చుకున్నారు. మినాజ్ ఎప్పటికప్పుడు అత్యంత ప్రభావవంతమైన హిప్ హాప్ కళాకారులలో ఒకరిగా గుర్తింపు పొందారు. తన కెరీర్ మొత్తంలో 10 గ్రామీ నామినేషన్లు, ఆరు అమెరికన్ మ్యూజిక్ అవార్డులు, 11బీఈటీ అవార్డులు , నాలుగు బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డులు, ఇతర పురస్కారాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురి సంగీత అభిమానుల ప్రశంసలను ఆమె సొంతం చేసుకున్నారు. I’ve decided to retire & have my family. I know you guys are happy now. To my fans, keep reppin me, do it til da death of me, ❌ in the box- cuz ain’t nobody checkin me. ✅ Love you for LIFE 😘♥️🦄 — Mrs. Petty (@NICKIMINAJ) September 5, 2019 -
పీఎంతో పెట్టుకుంది.. అకౌంట్ ఊడిపోయింది!
చండీఘర్: ప్రముఖ పంజాబీ పాప్ సింగర్ హార్ద్ కౌర్ తన దూకుడుతో మరోసారి వార్తల్లోకెక్కింది. గతంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయగా.. ఆమెపై దేశద్రోహంతో పాటు పలు కేసులు కూడా నమోదైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆమె తన పద్ధతి మార్చుకోనట్లుగా అనిపిస్తోంది. ఈసారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలపై పాట రూపంలో హార్ద్ కౌర్ విరుచుకుపడింది. పంజాబ్ నుంచి విడిపోయి ప్రత్యేక దేశం ఖలిస్తాన్ కావాలని కోరుకుంటున్న సిక్కులకు మద్దతుగా ఈ పాట సాగుతుంది. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ పాటలో ఖలిస్తాన్ మద్దతుదారులతో కలిసి మోదీ, అమిత్ షాలకు ఘాటుగా సవాలు విసురుతుంది. అంతటితో ఆగక వారిద్దరిపై అభ్యంతరకర పదజాలాన్ని ప్రయోగించింది. ఈ వీడియోను కౌర్ ట్విటర్లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన ట్విటర్ హార్ద్ కౌర్ అకౌంట్‌ను తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. యూకేకు చెందిన గాయని తరన్ కౌర్ ధిల్లాన్ (హర్ద్ కౌర్) గతంలోనూ సంచలన వ్యాఖ్యలు చేయగా అవి పెద్ద దుమారాన్నే రాజేశాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై వారణాసిలో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. బాలీవుడ్ గాయని హర్ద్ కౌర్‌పై సెక్షన్ 124 ఏ, 153 ఏ, 500 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఏకంగా రేప్‌మేన్ అని పిలవాలంటూ సోషల్ మీడియాలో కమెంట్ చేశారు. అంతేకాదు.. మోహన్ భగవత్ ఉగ్రవాదిగా పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్బుక్లో తన అభిప్రాయాలను పోస్ట్ చేశారు. దీంతో వివాదం రాజుకుంది. పలువురు నెటిజర్లు ఆమెకు మద్దతివ్వగా, మరికొందరు ఆమె వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రధానంగా వారణాసికి చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, న్యాయవాది శశాంక్ శేఖర్ ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టామని పోలీసు అధికారి అమర్ ఉజాలా తెలిపారు. -
సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు : గాయని బుక్
యూకేకు చెందిన గాయని తరన్ కౌర్ ధిల్లాన్ (హర్ద్ కౌర్) వ్యాఖ్యలు దుమారాన్నే రాజేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై వారణాసిలో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలీవుడ్ గాయని హర్ద్ కౌర్‌పై సెక్షన్ 124 ఏ, 153 ఏ, 500 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఏకంగా రేప్‌మేన్ అని పిలవాలంటూ సోషల్ మీడియాలో కమెంట్ చేశారు. అంతేకాదు మోహన్ భగవత్ ఉగ్రవాదిగా పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్బుక్లో తన అభిప్రాయాలను పోస్ట్ చేశారు. దీంతో వివాదం రాజుకుంది. పలువురు నెటిజర్లు ఆమెకు మద్దతిస్తుండగా, మరికొందరు ఆమె వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ప్రధానంగా వారణాసికి చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, న్యాయవాది శశాంక్ శేఖర్ ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టామని పోలీసు అధికారి అమర్ ఉజాలా తెలిపారు. FIR registered under sections 124A (Sedition), 153A, 500 ,505 of the Indian Penal Code and 66 IT Act against singer Hard Kaur for her comments against Uttar Pradesh CM Yogi Adityanath and RSS Chief Mohan Bhagwat. https://t.co/3XABzwKOJ6 — ANI (@ANI) June 20, 2019 -
విమానం రెక్క మీద షూటింగ్.. రాపర్ మృతి
ఒట్టావా : ఓ వీడియో షూట్లో భాగంగా ఆకాశంలో ఎగురుతున్న విమానం రెక్క మీద చిత్రీకరణ జరుపుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రముఖ కెనడా రాపర్ జాన్ జేమ్స్(33) అక్కడికక్కడే మృతి చెందాడు. బ్రిటీష్ కొలంబియా వెర్నాన్లో జరిగిన ఈ మ్యూజిక్ వీడియో షూటింగ్లో ఈ ప్రమాదం చోటు చోసుకుంది. ఈ విషయం గురించి జాన్ మేనెజర్ ‘ఈ వీడియో షూట్ కోసం జాన్ జేమ్స్ ముందుగానే శిక్షణ తీసుకున్నాడు. అన్ని విధాలుగా తయారయ్యాకే విమానం రెక్కపైకి వచ్చాడు. కానీ విమానం రెక్క కిందకు వంగి ఉండటం వల్ల పట్టు తప్పాడు. ప్రమాదాన్ని గ్రహించిన జాన్ పారాచూట్ ఒపెన్ చేసే లోపే కింద పడి మరణించాడ’ని తెలిపారు. ఇలాంటి స్టంట్లు చేయడం జాన్‌కి చాలా ఇష్టమని వెల్లడించాడు. -
డ్రగ్స్ ఓవర్ డోస్.. సింగర్ మృతి
లాస్ ఏంజెల్స్ : అమెరికన్ ఫేమస్ ర్యాప్ సింగర్ మ్యాక్ మిల్లర్(26) మృతి చెందాడు. లాస్ ఏంజెల్స్‌లోని తన నివాసంలో అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించాడని వైద్యులు పేర్కొన్నారు. డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతో గుండెపోటు వచ్చిందని, దీంతోనే మ్యాక్ ప్రాణాలు విడిచాడని సన్నిహిత వర్గాలు తెలిపాయి. గత కొద్ది రోజులుగా తీవ్ర డిప్రెషన్లో ఉన్న ఈ ర్యాపర్‌ను వరుస సమస్యలు ఇబ్బంది పెట్టాయి. ప్రియురాలు అరియాన గ్రాండేతో బ్రేకప్.. హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ కావడంతో మ్యాక్ తీవ్ర డిప్రేషన్‌లోకి వెళ్లాడు. అంతేకాకుండా జూన్‌లో తన ప్రియురాలు గ్రాండే అమెరికా కమెడియన్ పిటె డెవిడ్సన్‌తో నిశ్చితార్థం చేసుకోవడం మ్యాక్ తట్టుకోలేకపోయాడని అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 2012 నుంచి గ్రాండేను ప్రేమిస్తున్న మ్యాక్ 2017లో ఆమెతో విడిపోయాడు. వీరిద్దరు కలిసి ఎన్నో ఆల్బమ్స్ చేశారు. మ్యాక్స్ తన చివరి ఇంటర్వ్యూలో.. వచ్చిన ఫేమ్‌తో ఒత్తిడి నెలకొందని, దీంతోనే డిప్రెషన్లోకి వెళ్లినట్లు స్పష్టం చేశాడు. ఇక చనిపోయే 12 గంటల ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. అతని అకాల మరణం పట్ల అమెరికా సింగర్స్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. -
ప్రముఖ యువగాయకుడి కాల్చివేత
ఫ్లోరిడా : ప్రముఖ యువ ర్యాపర్-సింగర్ ట్రిపుల్ఎక్స్ టెంటాసియాన్‌ను సోమవారం ఫ్లోరిడాలో గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. దోడిపీయత్నంలో భాగంగా అతన్ని దుండగులు చంపి ఉంటారని భావిస్తున్నారు. వర్థమాన గాయకుడిగా అనతికాలంలో పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్న ఈ 20 ఏళ్ల కుర్రాడి అసలు పేరు జాసే ద్వేన్ ఆన్ఫ్రోయ్. సోమవారం డీర్ఫీల్డ్ బీచ్ మోటార్ సైకిల్ డీలర్‌షీప్ వద్ద అతను ఉన్న సమయంలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ అతన్ని సమీపంలోని ఫోర్ట్ లాడెర్డల్ ఏరియా ఆస్పత్రికి తరలించిగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. రివా మోటార్‌స్పోర్ట్స్‌కు సంబంధించిన పనిమీద ట్రిపుల్ఎక్స్ టెంటాసియాన్ అక్కడికి వచ్చాడని, అతను తన వాహనంలో తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇద్దరు సాయుధులు అతన్ని సమీపించగా, ఇంతలో ఒకడు కాల్పులు జరపడంతో సింగర్ గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. కాల్పుల అనంతరం సాయుధులు అక్కడినుంచి పరారయ్యారని చెప్పారు. ర్యాపర్ హత్య వెనుక కుట్రకోణం ఉండకపోవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. రైజింగ్ స్టార్‌గా అందరి మన్ననలు అందుకుంటున్న ట్రిపుల్ఎక్స్టెంటాసియాన్ గత నెలలో తన నంబర్ వన్ ఆల్బంను విడుదల చేశాడు. ‘సాడ్’ ఆల్బంతో టాప్-10 హిట్స్‌లో చోటుసాధించాడు. సాడ్ ఆల్బంలోని పాటలను స్పోటిఫై మ్యూజిక్ వెబ్సైట్లో 27కోట్లకుపైగాసార్లు స్ట్రీమింగ్ చేశారు. -
మాతా అమృతానందమయిపై వివాదాస్పద ట్వీట్లు
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద అమెరికన్ ర్యాప్ సింగర్ కాన్యే వెస్ట్ మరోసారి వార్తల్లో నిలిచారు. భారతీయ ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయిపై అసభ్య పదజాలంతో ట్వీట్లు చేశారు. ‘మాతా అమృతానందమయి మాకు కౌగిలింతలు కావాలి. ఇప్పటి వరకూ 32 మిలియన్ల కౌగిలింతలు ఇచ్చారు’ అంటూ ట్వీట్ చేశారు. గత ఏడాదిగా ట్వీటర్కు దూరంగా ఉంటున్న కాన్యే ఇటీవల తన ఖాతాను రీఓపెన్ చేసి మాతా అమృతానందమయిపై ఈ విధంగా ట్వీట్ చేశారు. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ట్వీట్లు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. కేరళకు చెందిన ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి తన వద్దకు వచ్చిన భక్తులకు కౌగిలింతలు ద్వారా వారిని ఆశీర్వదిస్తారు. దీనిపై ఆమె స్పందిస్తూ... తన వద్దకు వచ్చే భక్తులు చాలా విషాదంతో వస్తుంటారని, వారి సమస్యలతో తన వద్ద కన్నీరు పెట్టుకుంటారిని భక్తులను వారి సమస్యల నుంచి దారి మళ్లించుటకు తాను ప్రేమతో కౌగిలించుకుంటానని తెలిపారు. అదే భక్తులకు తనపై ఉన్న నమ్మకంగా పేర్కొన్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా మాతా అమృతానందమయికి 3.4 కోట్ల మంది భక్తులు ఉన్నారని చెప్పుకుంటారు. -
పాట పాడాడు.. జైలుశిక్ష తగ్గించారు!
న్యూయార్క్ : శిక్ష నుంచి తప్పించుకోవడానికి నేరస్తులు వివిధ మార్గాలు అనుసరిస్తారు. కొందరు అబద్ధాలు చెప్తారు. మరికొందరు సాక్ష్యాలు మాయం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అమెరికన్ ర్యాప్ సింగర్ తన పాటతో జడ్జిని మెస్మరైజ్ చేసి శిక్ష నుంచి తప్పించుకోవాలని చూశాడు. ర్యాపర్ డీఎమ్ఎక్స్ గా ప్రసిద్ధి చెందిన ఎర్ల్ సిమ్మన్స్ పన్ను ఎగవేత కేసులో కోర్టు ముందు హాజరయ్యాడు. 1.7 మిలియన్ డాలర్ల పన్ను ఎగ్గొట్టిన సిమ్మన్స్‌ను రక్షించేందుకు అతని లాయర్ ముర్రే రిచ్మన్ కూడా సిమ్మన్స్ మాదిరిగానే కోర్టులో విచిత్రంగా ప్రవర్తించాడు. సిమ్మన్స్ జీవితంలోని కష్టనష్టాలు, అతను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి తెలిపే ‘స్లిప్పిన్’ అనే హిట్ సాంగ్‌ను ప్లే చేస్తూ జడ్జిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. ‘సిమ్మన్స్ జీవితం గురించి నేను విన్నాను. అతను చాలా కష్టాలు అనుభవించాడు. జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొని ధైర్యంగా నిలదొక్కుకున్నాడు. సిమ్మన్స్ ఇప్పటికే సుమారు 30సార్లు అరెస్టయ్యాడు. కానీ గత ఐదు సంవత్సరాల నుంచి అతనిలో మార్పు వచ్చింది. పశ్చాత్తాపంతో అతను కుంగిపోయాడు. తన 15 మంది పిల్లలకు అతడి అవసరం ఉంది. కాబట్టి అతనికి ఒక అవకాశం ఇవ్వాల్సిందే’ అంటూ వాదించాడు. ప్రాసిక్యూటర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. పన్ను ఎగవేత కేసులో సిమ్మన్స్ ఐదు సంవత్సరాల శిక్ష ఎదుర్కోక తప్పదు అని వాదించాడు. వాద ప్రతివాదనలు విన్న జడ్జి ఇచ్చిన తీర్పు అక్కడ ఉన్నవారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘సిమ్మన్స్ చాలా మంచివాడు. తన పాటతో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చాడు. కానీ తనకు తానే పెద్ద శత్రువు’ అని పేర్కొంటూ.. ఏడాదిపాటు జైలు శిక్ష, 2.3 మిలియన్ డాలర్ల(రూ. 15 కోట్లు) జరిమానాతో సరిపెట్టాడు. -
తలలో బుల్లెట్‌తో ఫేస్బుక్లో వీడియో!
ఫేస్బుక్లో ఎన్నో పోస్టులు చూస్తుంటాం. ఎంతోమంది యూజర్లు తమ నిత్యజీవితంలో జరిగిన సంఘటనల తాలుకు పోస్టులు, ఫొటోలు, వీడియోలు పెడుతారు. అదేవిధంగా ఓ వ్యక్తి తన తలలో బుల్లెట్ దిగి.. రక్తం చిందుతున్న వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేసి.. ఒకింత భయభ్రాంతులకు గురిచేశాడు. అమెరికా కాలిఫోర్నియాలోని కాంప్టన్ నగరానికి చెందిన ర్యాపర్ తెరిక్ రాయల్ అనే యువకుడు తన తలలోకి ఏకే 47 బుల్లెట్లు దూసుకుపోయాయంటూ.. రక్తం చిందుతున్న తన ముఖం దృశ్యాలను ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. 'దేవుడా.. ఈ ఏకే 47 తూటాల నుంచి నన్ను, నా సోదరుడిని తప్పించు. ఆ దేవుడి దయవల్లే నేను మరో రోజు చూడగలుగుతున్నాను. దీని గురించి పాడగలుగుతున్నాను' అని అంటూ ఈ వీడియో గురించి రాశాడు. ఆ వీడియోలో పెట్రోల్ బంకు సమీపంలో తొక్కిసలాట జరిగినట్టు కనిపిస్తున్నది. వీడియోలో ర్యాపర్ 'ఇప్పుడే నన్ను తుపాకీతో కాల్చేశారు' అని పేర్కొంటూ కనిపించాడు. తనకు బుల్లెట్ దిగినప్పటికీ, తీవ్రగాయం కాకుండా ఎలా తప్పిపోయిందో తెలియజేస్తూ ఓ ఎక్స్‌రేను కూడా అతను తన ఫేస్బుక్లో పోస్టు చేశాడు.