
ర్యాపర్-సింగర్ ట్రిపుల్‌ఎక్స్ టెంటాసియాన్
ఫ్లోరిడా : ప్రముఖ యువ ర్యాపర్-సింగర్ ట్రిపుల్‌ఎక్స్ టెంటాసియాన్‌ను సోమవారం ఫ్లోరిడాలో గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. దోడిపీయత్నంలో భాగంగా అతన్ని దుండగులు చంపి ఉంటారని భావిస్తున్నారు. వర్థమాన గాయకుడిగా అనతికాలంలో పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్న ఈ 20 ఏళ్ల కుర్రాడి అసలు పేరు జాసే ద్వేన్ ఆన్‌ఫ్రోయ్. సోమవారం డీర్‌ఫీల్డ్ బీచ్ మోటార్ సైకిల్ డీలర్‌షీప్ వద్ద అతను ఉన్న సమయంలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ అతన్ని సమీపంలోని ఫోర్ట్ లాడెర్డల్ ఏరియా ఆస్పత్రికి తరలించిగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
రివా మోటార్‌స్పోర్ట్స్‌కు సంబంధించిన పనిమీద ట్రిపుల్‌ఎక్స్ టెంటాసియాన్ అక్కడికి వచ్చాడని, అతను తన వాహనంలో తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇద్దరు సాయుధులు అతన్ని సమీపించగా, ఇంతలో ఒకడు కాల్పులు జరపడంతో సింగర్ గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. కాల్పుల అనంతరం సాయుధులు అక్కడినుంచి పరారయ్యారని చెప్పారు. ర్యాపర్ హత్య వెనుక కుట్రకోణం ఉండకపోవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.
రైజింగ్ స్టార్‌గా అందరి మన్ననలు అందుకుంటున్న ట్రిపుల్‌ఎక్స్‌టెంటాసియాన్ గత నెలలో తన నంబర్ వన్ ఆల్బంను విడుదల చేశాడు. ‘సాడ్’ ఆల్బంతో టాప్-10 హిట్స్‌లో చోటుసాధించాడు. సాడ్ ఆల్బంలోని పాటలను స్పోటిఫై మ్యూజిక్ వెబ్‌సైట్‌లో 27కోట్లకుపైగాసార్లు స్ట్రీమింగ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment