
సెల్‌ఫోన్‌లో రికార్డయిన దృశ్యాలు
ఫ్లోరిడా : గ్రామీ అవార్డు నామినేటెడ్ ర్యాపర్ డాబేబీ ఓ లేడీ ఫ్యాన్ చెంప చెళ్లుమనిపించాడు. శనివారం రాత్రి ఫ్లోరిడా, తాంపాలోని ఓ నైట్‌క్లబ్‌లో ప్రదర్శన ఇవ్వటానికి వెళ్లిన ఆయన ఈ దారుణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ర్యాపర్ డాబేబీ శనివారం రాత్రి తాంపాలోని ‘విష్కీ నార్త్’ అనే నైట్‌క్లబ్‌లో ప్రదర్శన ఇవ్వటానికి వెళ్లాడు. స్టేజి మీదకు వెళుతుండగా ఓ లేడీ ఫ్యాన్ అతడితో ఫొటో దిగటానికి ఉత్సాహపడింది. సెల్‌ఫోన్‌ను అతడి ముఖం వద్ద ఉంచసాగింది. దీంతో చిర్రెత్తిపోయిన అతడు ఆమె చెంప ఛెళ్లుమనిపించాడు. రెండు సార్లు ముఖంపై కొట్టాడు. ఆ దెబ్బలతో లేడీ ఫ్యాన్ సొమ్మసిల్లి కిందపడిపోయింది.
డాబేబీ(ఫైల్)
అనంతరం అతడు ప్రదర్శన ఇవ్వకుండానే అక్కడినుంచి వెనుదిరిగాడు. డాబేబీ తీరుపై అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఘటనపై డాబేబీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించాడు. సదరు లేడీ ఫ్యాన్ తనను కంటిపై సెల్‌ఫోన్‌తో కొట్టిందని తెలిపాడు. ఆ దృశ్యాలు ఉన్న వీడియో పంపిన వారికి పదివేల డాలర్లు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. కాగా, ఈ సంవత్సరం అతడికి బొత్తిగా అచ్చిరావటం లేదు. ఎప్పుడు చూసినా గొడవలతో కాలం వెళ్లదీస్తున్నాడు. కొన్ని నెలలక్రితం మ్యూజిక్ ప్రమోటర్లతో జరిగిన గొడవ కారణంగా అతడు జైలు పాలయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment