Florida
-
చరిత్రలో లేని గెలుపు: ఫలితాలపై స్పందించిన ట్రంప్
ఫ్లోరిడా: అమెరికా ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించలేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ దూసుకుపోతున్న సందర్భంగా ఫ్లోరిడాలో బుధవారం(నవంబర్ 6) ట్రంప్ తన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ట్రంప్ మాట్లాడుతుండగా ఆయన అభిమానులు ట్రంప్..ట్రంప్ నినాదాలతో హోరెత్తించారు. తన గెలుపు అమెరికాకు ఉపయోగమని ఈ సందర్భంగా ట్రంప్ చెప్పారు. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికన్లకు సువర్ణయుగం రాబోతోందన్నారు. రిపబ్లికన్లకు 300కుపైగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. పాపులర్ ఓట్లు కూడా మాకే ఎక్కువ వచ్చాయి. ఇక అమెరికాలోకి అక్రమ వలసలు ఉండవు. అందరూ చట్టబద్ధంగానే రావాల్సి ఉంటుంది. సరిహద్దులు మూసివేస్తా. అక్రమ వలసలు అడ్డుకుంటాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తా.‘నా విజయంలో నా వెన్నంటి ఉన్న నా కుటుంబానికి కృతజ్ఞతలు. ఇది మొత్తం అమెరికన్లు గర్వించే విజయం. వైఎస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా చిలుకూరి బాగా పనిచేశారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా వాన్స్ ఎంపిక సరైనదేనని తేలింది. తొలుత వాన్స్ ఎంపికపై వ్యతిరేకత వచ్చింది.’అని ట్రంప్ గుర్తు చేశారు. ట్రంప్ ప్రసంగించిన వేదికపైనే ట్రంప్ కుటుంబ సభ్యులతో పాటు ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ కూడా ఉన్నారు.#WATCH | West Palm Beach, Florida | Republican presidential candidate #DonaldTrump says, "...This is a movement that nobody has ever seen before. Frankly, this was, I believe, the greatest political movement of all time. There has never been anything like this in this country and… pic.twitter.com/MEcRDSAI72— ANI (@ANI) November 6, 2024 ఇదీ చదవండి: అమెరికా ఎన్నికల ఫలితాల అప్డేట్స్ -
టాంపలో ఘనంగా సంబరాల గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఘనంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు టాంప లో శంఖారావం పూరించింది. గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ ఏవీ ద్వారా సంబరాలు ఎలా జరగనున్నాయనేది చాటిచెప్పింది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు, స్థానిక తెలుగు కళాకారులతో నృత్య ప్రదర్శనలు.. మ్యూజిక్ షోలతో టంపాలో తెలుగువారికి గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ మంచి కిక్ ఇచ్చింది. వచ్చే జులై 4, 5, 6 తేదీల్లో జరగనున్న అమెరికా తెలుగు సంబరాలకు ట్రైలర్‌లా కిక్ ఆఫ్ ఈవెంట్ జరిగింది. దాదాపు 1500 మంది తెలుగువారు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. టాంప లో జరగనున్న అతి పెద్ద తెలుగు సంబరానికి అమెరికాలో ఉండే ప్రతి కుటుంబం తరలిరావాలని నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ పిలుపు నిచ్చారు. తెలుగువారందరిని కలిపే వేదిక.. తెలుగువారికి సంతోషాలు పంచే వేదిక అమెరికా తెలుగు సంబరాలు అని ఈ అవకాశాన్ని ప్రతి తెలుగు కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని కోరారు. తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథ మహారథులు, సినీ స్టార్లు, సంగీత, సాహిత్య ఉద్దండులు, కళాకారులు పాల్గొనే సంబరాల్లో అమెరికాలో ఉండే తెలుగువారంతా పాల్గొనాలని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి పిలుపునిచ్చారు. టాంప సంబరాల గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్‌కు నాట్స్ జాతీయ నాయకులు కూడా తరలివచ్చారు.స్థానిక డ్యాన్స్ స్కూల్స్ సబ్రిన (గణేశస్తోత్రం, కౌత్వం) , సరయు, లీలా టాలీవుడ్ లేడీస్ డాన్స్, మాధురి (తిల్లానా), శివం గర్ల్స్, సరయు(తమన్ మెడ్లీ), సబ్రిన(అన్నమయ్య కీర్తన),శివం(మస్తీ) చేసిన డ్యాన్స్ అందరిలో ఉత్సాహం నింపింది. సాకేత్ కొమాండూరి, మనీషా ఈరబత్తిని, శృతి రంజనీలు తమ గాన మాధుర్యంతో చక్కటి తెలుగుపాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. సాహిత్య వింజమూరి తన యాంకరింగ్ తో ఈ ఈవెంట్లో మెప్పించారు. ఈ సారి టాంపాలో జరిగే సంబరాల ప్రత్యేకత ఏమిటీ అనే దానిపై రూపొందించిన ట్రైలర్ ని ముఖ్యఅతిథిగా విచ్చేసిన తమన్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అందరిని ఆకట్టుకుని సంబరాలపై అంచనాలను పెంచింది. చక్కటి తెలుగు ఇంటి భోజనం కూడా గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్‌కు వచ్చిన తెలుగువారి చేత ఆహా అనిపించింది. అనంతరం, నాట్స్ బోర్డ్ సెక్రటరీ మధు బోడపాటి, నాట్స్ గౌరవ సభ్యులను, గత అధ్యక్షులను, డైరెక్టర్స్ ను వేదికపైకి ఆహ్వానించారు.టాంప నాట్స్ నాయకులు రాజేశ్ కాండ్రు నాట్స్ చాప్టర్ల నాయకులను, కార్యవర్గ సభ్యులను వేదిక మీదకు ఆహ్వానించారు. అలాగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో పాలుపంచుకునే టాంప స్థానిక తెలుగు సంఘలైన టీఏఎఫ్, మాటా, టీజీఎల్ఎఫ్, టీటీఏ, ఎఫ్ఐఏ, హెచ్టీఎఫ్ఎల్, సస్త, ఐటీ సర్వ్ సంస్థల ప్రతినిధులను గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ వేదికపై పరిచయం చేశారు. గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్లో ముఖ్యగా టాంప లో స్థానిక కళాకారుల డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ వేదికపై థమన్‌తో పాటు ఈవెంట్‌కు వచ్చిన ప్రముఖులను నాట్స్ సత్కరించింది. నాట్స్ సభ్యులు, దాతల నుంచి అమెరికా తెలుగు సంబరాలకు 2.5 మిలియన్ డాలర్ల విరాళాలు ఇచ్చేందుకు హామీ లభించింది.(చదవండి: మానసిక ఆరోగ్యం పై నాట్స్ అవగాహన సదస్సు) -
భర్తను సూట్‌కేసులో దాక్కోమని చెప్పి ఊపిరి తీసింది..!
కొన్నిగంటలపాటు భర్తను సూట్‌కేసులో కుక్కి ఆయన చనిపోయేందుకు కారణమైన ఓ ఫ్లోరిడా మహిళను కోర్టు దోషిగా తేల్చింది. ఫ్లోరిడాలోని వింటర్పార్క్ అపార్ట్మెంట్లో సారా బూన్, భర్త జార్జ్ టోరెస్‌తో కలిసి ఉంటున్నారు. 2020లో టోరెస్ ఓ సూట్‌కేస్‌లో శవమై కనిపించాడు. అతని భార్య బూన్‌ను అనుమానించిన పోలీసులు ప్రశ్నించగా.. ‘ఇద్దరం మద్యం తాగి ఉన్నాం. ఆటలో భాగంగా అతను సూట్‌కేసులో దాక్కున్నాడు. అతని వేళ్లు బయటికి ఉన్న కారణంగా జిప్ తీసుకోగలడని భావించాను. నేను మేడపైకి వెళ్లి పడుకున్నా. నిద్రలేచి చూసే సరికి అతను ఇంకా సూట్‌కేసులోనే ఉన్నాడు. అప్పటికే అతని ఊపిరి ఆగిపోయింది’ అని వెల్లడించింది. కేసు విచారణ నాలుగేళ్లపాటు కొనసాగింది. చివరికి బూన్ ఫోనే ఆమెను పట్టించింది. తనను సూట్‌కేసులోంచి తీయాలని టోరెస్ వేడుకుంటుండగా, తాను నవి్వన దృశ్యాలను బూన్ తన ఫోన్లో బంధించింది. అంతేకాదు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని, బయటికి తీయాలని టోరెస్ బతిమాలుతుండగా ‘నీకు దక్కాల్సింది అదే.. నన్ను మోసం చేసినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. నేను కూడా గట్టిగా ఊపిరి పీల్చుకోలేకపోయాను’ అంటూ బూన్ సమాధానం ఇవ్వడం వీడియోలో రికార్డు అయ్యింది. దీంతో కోర్టు బూన్‌ను దోషిగా తేల్చింది. డిసెంబర్లో శిక్ష ఖరారు చేయనుంది. – వాషింగ్టన్ -
చేపలు మాత్రమే తింటు..ఏకంగా 15 కిలోల బరువు తగ్గిన మహిళ..!
చేపలు ఆరోగ్యానికి మంచిదే గానీ అతిగా తింటే మాత్రం ప్రమాదమే. అలా తినమని సాధారణంగా వైద్యులు కూడా సూచించరు. కానీ ఈ మహిళ మూడు నెలల పాటు చేపలు మాత్రమే తిని ఏకంగా 15 కిలోల బరువు తగ్గింది. అది చూసి వైద్యులే కంగుతిన్నారు. వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాకి చెందిన 62 ఏళ్ల జేన్ క్రమ్మెట్ బరువు 109 కిలోలు ఉండేది. నడవలేని స్థితిలో మంచానికే పరిమితమై ఉంది. వైద్యులు బరువు తగ్గేలా ఆహారాలు, పానీయాలపై పలు నిబంధనలు పాటించాలని సూచించారు. కానీ అలా చేసినా ఆమె బరువు పరంగా ఎలాంటి మార్పు కనిపించలేదు.పైగా అలా మంచపైనే ఉండటంతో కాళ్లు బాగా వాచిపోయి, విపరీతమైన ఆకలితో బాధపడేది. ఇక ఎన్ని ప్రయత్నాలు చేసిన లాభం లేదని భావంచి స్నేహితుల సూచన మేరుకు వైద్యుడు బోజ్ని సంప్రదించింది. ఆయన ఆమెకు 'ఫిష్ ఫాస్ట్'ని సూచించారు. మూడు నెలల పాటు సార్డినెస్ అనే చేపలను మాత్రమే తినమని సూచించారు. ఇలా చేస్తే బరువు తగ్గుతారని అనడంతో జేన్ విస్తుపోయింది. ఏదో వింతగా ఉన్న ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఏమో..చూడాలని ట్రై చేసి చూసింది. ఆయన చెప్పినట్లుగా మూడు నెలల పాటు సార్డిన్ చేపలు మాత్రమే తినడం ప్రారంభించింది. ఇలా చేసిన రెండు నెలల్లోనే మంచి మార్పు కనిపించింది. ఏకంగా ఆరు కిలోలు వరకు తగ్గింది. ఇక మూడు నెలలు పూర్తి అయ్యేటప్పటికీ ఏకంగా 15 కిలోల వరకు తగ్గిపోయింది. జోన్ ఇంత స్పీడ్‌గా బరువు తగ్గడం చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఇది ఒక రకమైన జిడ్డుకరమైన చేప. పైగా ఇందులో మంచి పోషక విలువలు ఉంటాయి. అనారోగ్యంతో ఉన్నవారిని దీన్ని తినమని వైద్యులు సూచిస్తారు. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్, విటమిన్ డి, క్యాల్షియం ఉంటాయి. ఇలా చేపలతో బరువు తగ్గడం అత్యంత అరుదు కదూ..!.(చదవండి: వెన్ను నొప్పి కేన్సర్‌కు దారితీస్తుందా..?) -
మంచు లోకంలో మహా సముద్రం!
‘‘ప్రాణం... ఎపుడు మొదలైందో... తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా?’’ అని ప్రశి్నస్తారొక సినీ కవి. నిజమే. ప్రాణం ఎప్పుడు మొదలైంది? ఎలా మొదలైంది? భూమి కాకుండా అనంత విశ్వంలో ఇంకెక్కడైనా జీవులున్నాయా? కోట్లాది గెలాక్సీలు, తారాతీరాలు, గ్రహాలు, ఆస్టరాయిడ్లు, తోకచుక్కలు... సుదూరాన ఎన్నో కొత్త లోకాలు, మరెన్నో ప్రపంచాలు! వీటిలో ఎక్కడైనా ప్రాణికోటి వర్ధిల్లుతోందా? ఆ జీవరాశి జాడ తెలిసేదెలా? భూమి మినహా విశ్వంలో జీవులకు ఆవాసయోగ్యమైన ప్ర దేశాలను కనిపెట్టేదెలా? వాతావరణం, పరిస్థితుల పరంగా జీవుల మనుగడకు ఆలంబనగా నిలిచే సానుకూల ప్ర దేశాలు మన సౌరవ్యవస్థలో ఉన్నాయా? జవాబులు తెలియాలంటే గ్రహాంతర జీవం కోసం అన్వేíÙంచాలి. మరి ఎలా వెదకాలి? ఎక్కడని వెదకాలి? శోధించేందుకు సరైన, అత్యుత్తమ జగత్తు ఏదైనా ఉందా? అంటే... ఉంది! దాని పేరు యూరోపా. బృహస్పతిగా పిలిచే గురు గ్రహానికి అది ఒక చందమామ. యూరోపాపై పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9:49 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ‘యూరోపా క్లిప్పర్’అంతరిక్ష నౌకను ప్రయోగిస్తోంది. ‘స్పేస్ ఎక్స్’సంస్థకు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ దాన్ని నింగికి మోసుకెళ్లనుంది. నీరు–రసాయనాలు–శక్తి ఈ మూడు వనరుల నెలవు! జీవావిర్భావంలో కీలక పాత్ర పోషించే మూడు అంశాలు... ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి. ‘జలం ఎక్కడో జీవం అక్కడ’అనేది నానుడి. జీవులు ఆహారంగా స్వీకరించే పోషకాలను నీరు కరిగిస్తుంది. కణాంతర్గత జీవక్రియల్లో రసాయనాల రవాణాకు, అలాగే కణాలు వ్యర్థాలను తొలగించుకోవడానికి నీరు కీలకం. ఈ కోణంలో చూస్తే యూరోపాపై ఓ భారీ సముద్రమే ఉంది! జీవం పుట్టుకకు కర్బనం, ఉదజని, ఆమ్లజని, నత్రజని, గంధకం, భాస్వరం తదితర రసాయనిక పదార్థాలు అత్యావశ్యకం. అవి యూరోపా ఆవిర్భావ సమయంలోనే దానిపై ఉండి ఉండొచ్చు. ఇక తోకచుక్కలు, గ్రహశకలాలు యూరోపాను ఢీకొని మరిన్ని సేంద్రియ అణువులను దానిపై వదిలి ఉంటాయని భావిస్తున్నారు. భూమ్మీద శక్తికి సూర్యుడే మూలాధారం. కిరణజన్యసంయోగ క్రియ సాయంతో మొక్కలు ఆహారం తయారుచేసుకుంటాయి. మొక్కలను తినడం వల్ల మానవులు, జంతువులకు శక్తి బదిలీ అవుతుంది. కానీ యూరోపాలోని మహాసంద్రంలో జీవులు ఉంటే వాటి శక్తికి కిరణజన్యసంయోగక్రియ ఆధారం కాకపోవచ్చని, రసాయన చర్యల శక్తి మాత్రమే వాటికి లభిస్తుందని ఊహిస్తున్నారు. యూరోపాలోని మహాసముద్ర అడుగు భాగం రాతిపొరతో నిర్మితమైంది. ప్రాణుల మనుగడకు కావాల్సిన రసాయన పోషకాలను అక్కడి హైడ్రోథర్మల్ యాక్టివిటీ అందించగలదని అంచనా. భూమ్మీది సముద్రాల్లో మాదిరిగా యూరోపాలోని సముద్రంలోనూ రసాయన క్రియల వల్ల హైడ్రోథర్మల్ వెంట్స్ ఏర్పడే అవకాశముంది. భూమిపై మాదిరిగానే ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ యూరోపా మీద కూడా పర్యావరణ వ్యవస్థలకు ఊతమిస్తాయని భావిస్తున్నారు. ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి... ఇవన్నీ ఉన్నా జీవావిర్భావానికి సమయం పడుతుంది. అలాంటి కాలం గడిచిపోయి ఇక జీవం పుట్టబోతున్న సమయం ఆసన్నమైన ప్రపంచాల కోసం మనం అన్వేíÙంచాలి. అదిగో... సరిగ్గా ఇక్కడే శాస్త్రవేత్తల కళ్లు మన సౌరకుటుంబంలోని యూరోపాపై పడ్డాయి. గ్రహాంతర జీవాన్వేషణ దిశగా మనకు గట్టి హామీ ఇస్తున్న మరో ప్రపంచం యూరోపానే! క్లిప్పర్... అంతరిక్ష నౌకలకు పెద్దన్న! గ్రహాంతర అన్వేషణలో ‘నాసా’ఇప్పటిదాకా రూపొందించిన అంతరిక్ష నౌకల్లో అతి పెద్దది ‘యూరోపా క్లిప్పర్’. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.42 వేల కోట్లు. క్లిప్పర్ నౌక మొత్తం బరువు 6 టన్నులు. నౌక బరువు 3,241 కిలోలు కాగా ఇంధనం బరువు 2,759 కిలోలు. దాదాపు సగం బరువు ఇంధనానిదే. నౌకలో యూరోపా ఇమేజింగ్ సిస్టమ్, థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్, మ్యాపింగ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, అ్రల్టావయొలెట్ స్పెక్ట్రోగ్రాఫ్, మాస్ స్పెక్ట్రోమీటర్, సర్ఫేస్ డస్ట్ మాస్ అనలైజర్, మాగ్నెటోమీటర్ తదితర 9 శాస్త్రీయ పరికరాలున్నాయి. ‘యూరోపా క్లిప్పర్’ఎత్తు 16 అడుగులు. 24 ఇంజిన్లు, 3 మీటర్ల వ్యాసంతో హై గెయిన్ యాంటెన్నా అమర్చారు. సౌరఫలకాలు అన్నీ విచ్చుకుంటే వాటి పొడవు అటు చివర నుంచి ఇటు చివరకు 100 అడుగుల పైనే. బాస్కెట్ బాల్ కోర్టు పొడవు ఎంతో ఆ సోలార్ ప్యానెల్స్ పొడవు అంత! సూర్యుడు–భూమి మధ్య గల దూరంతో పోలిస్తే భూమి–గురుడుల మధ్య దూరం 5 రెట్లు ఎక్కువ (77 కోట్ల కిలోమీటర్లు). సూర్యుడు–గురుడుల నడుమ దూరం ఎక్కువ కనుక గురుడి చెంత సూర్యకాంతి తక్కువగా, సూర్యకిరణాలు బలహీనంగా ఉంటాయి. భారీ అంతరిక్ష నౌక అయిన క్లిప్పర్ పరిశోధనలు చేయాలన్నా, సేకరించిన డేటాను భూమికి ప్రసారం చేయాలన్నా అధిక శక్తి అవసరం. అందుకే అంత పెద్ద సోలార్ ప్యానెల్స్ పెట్టారు. ఇంధనం పొదుపు నిమిత్తం ‘యూరోపా క్లిప్పర్’తన ప్రయాణంలో భూమి, అంగారకుడుల గురుత్వశక్తిని వాడుకుంటుంది. అలా ఐదున్నరేళ్లలో అది సుమారు 290 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గురుగ్రహపు మరో చంద్రుడు ‘గానిమీడ్’గురుత్వ శక్తిని వాడుకుంటూ ‘యూరోపా క్లిప్పర్’తన వేగాన్ని తగ్గించుకుని 2030 ఏప్రిల్ నెలలో గురుగ్రహం కక్ష్యలోకి చేరుతుంది. అనంతరం పలు సర్దుబాట్లతో గురుడి కక్ష్యలో కుదురుకుని చంద్రుడైన యూరోపా చెంతకు వెళ్ళేందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఇందుకు ఓ ఏడాది పడుతుంది. అనంతరం మూడేళ్లపాటు గురుడి కక్ష్యలోనే క్లిప్పర్ నౌక పరిభ్రమిస్తూ 49 సార్లు యూరోపా దగ్గరకెళ్లి అధ్యయనం చేస్తుంది. 21 రోజులకోసారి గురుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తిచేస్తూ యూరోపా ఉపరితలానికి బాగా సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలోకి క్లిప్పర్ నౌక వెళ్లొస్తుంటుంది. రేడియేషన్ ముప్పు దృష్ట్యా క్లిప్పర్ అంతరిక్ష నౌకను నేరుగా యూరోపా కక్ష్యలో ప్రవేశపెట్టబోవడం లేదు. గురుడి కక్ష్యలోనూ రేడియేషన్ తీవ్రత అధికం. ఆ ప్రమాదాన్ని తప్పించడం కోసం క్లిప్పర్ నౌకను గురుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. రేడియేషన్ బారి నుంచి నౌకలోని ఎల్రక్టానిక్ వ్యవస్థలను కాపాడటానికి 9 మిల్లీమీటర్ల మందం గల అల్యూమినియం గోడలతో ‘వాల్ట్’ఏర్పాటుచేశారు. యూరోపా జియాలజీ, మూలకాల కూర్పు, ఉష్ణోగ్రతలను క్లిప్పర్ నౌక పరిశీలిస్తుంది. మహాసముద్రం లోతును, లవణీయతను కొలుస్తుంది. యూరోపా గురుత్వక్షేత్రాన్ని, దాని ప్రేరేపిత అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తుంది. యూరోపా ఉపరితలంపై ఎరుపు–ఆరెంజ్ కలబోత రంగులో కనిపించే సేంద్రియ పదార్థాన్ని విశ్లేషిస్తుంది. అది మహాసముద్రం నుంచి ఉద్భవించిందో లేక సమీపంలోని చంద్రుళ్ళ శిథిలాలతో తయారైందో పరిశీలిస్తుంది. గురుగ్రహం, దాని చంద్రుళ్ళు గానిమీడ్, యూరోపా, కలిస్టోలను పరిశోధించడానికి యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) 2023లో ప్రయోగించిన ‘జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్సŠోప్లరర్’(జ్యూస్) అంతరిక్ష నౌక కూడా 2031 జులైలో గురుడి కక్ష్యలో ప్రవేశిస్తుంది. యూరోపా... మరో జల ప్రపంచం! జీవాన్వేషణలో యూరోపాను ‘నాసా’ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కారణాలు లేకపోలేదు. గురుగ్రహానికి 95 ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. వీటిలో పెద్దవైన నాలుగు చంద్రుళ్లను ఇటలీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ 1610లో కనుగొన్నారు. ఆ చంద్రుళ్ల పేర్లు... అయో, యూరోపా, గానిమీడ్, కలిస్టో. వీటిలో ‘ఐసీ మూన్’యూరోపా సైజులో మన చంద్రుడి కంటే కొంచె చిన్నదిగా ఉంటుంది. యూరోపా ఉపరితలం గడ్డకట్టిన మంచుతో నిండివుంది. ఆ మంచు పొర మందం 15–25 కిలోమీటర్లు. మంచు పొర కింద 60–150 కిలోమీటర్ల లోతున సువిశాల ఉప్పునీటి మహాసముద్రం ఒకటి ఉందట. గతంలో పయనీర్–10, పయనీర్–11, వోయేజర్–1, వోయేజర్–2, గెలీలియో, కేసిని, జునో మిషన్స్ ఆ మహా సముద్రం ఆనవాళ్లను గుర్తించాయి. భూమ్మీద అన్ని సముద్రాల్లో ఉన్న నీటి కంటే రెట్టింపు నీరు యూరోపాలోని మహాసంద్రంలో ఉండొచ్చని విశ్వసిస్తున్నారు. యూరోపాపై పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్న పగుళ్లు, కొద్దిపాటి బిలాల ఆధారంగా చూస్తే దాని ఉపరితలం ‘యుక్త వయసు’లోనే ఉందని, భౌగోళికంగా క్రియాశీలకంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘నాసా’యూరోపా క్లిప్పర్ మిషన్ ప్రధాన లక్ష్యం... యూరోపాపై ప్రస్తుతం జీవం ఉందో, లేదో నిర్ధారించడం కాదు. అంటే... యూరోపా ఉపరితలపు మంచు పొరను క్లిప్పర్ నౌక తవ్వదు (డ్రిల్ చేయదు). అలాగే అక్కడి సముద్రంలోకి చొచ్చుకెళ్లి పరిశీలించదు. యూరోపా మంచు పొర కింద గల మహాసముద్రంలో జీవం మనుగడ సాగించడానికి దోహదపడే సానుకూల పరిస్థితులున్నాయా? జీవులకు ఆవాసం కలి్పంచే సామర్థ్యం యూరోపాకు ఉందా? అసలక్కడ జీవం మనుగడ సాధ్యమేనా? వంటి అంశాలు తెలుసుకోవడానికే నాసా ఈ ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ మిషన్లకు కావాల్సిన కీలక సమాచారాన్ని ‘యూరోపా క్లిప్పర్’సంపాదిస్తుంది. శని గ్రహపు చంద్రుడైన ఎన్సెలాడస్ ఉపరితలం నుంచి గీజర్ల మాదిరిగా నీటి ఆవిర్లు రోదసిలోకి విడుదలవుతున్నట్టు గతంలో గుర్తించారు. యూరోపా ఉపరితలం నుంచి పైకి లేస్తున్న నీటి ఆవిర్లు కూడా అలాంటివేనా అనే అంశాన్ని ‘యూరోపా క్లిప్పర్’పరిశోధిస్తుంది. – జమ్ముల శ్రీకాంత్ -
Hurricane Milton: మిల్టన్ ధాటికి ఫ్లోరిడా అతలాకుతలం
మిల్టన్ తుఫాను ఫ్లోరిడాలో బీభత్సం సృష్టించింది. భయంకరమైన గాలులు, వర్షంతో నగరాలను అతలాకుతలం చేసింది. సెయింట్ లూసీ కౌంటీలో టోర్నడోల ధాటికి ఐదుగురు మరణించారు. విద్యుత్ లేక 30 లక్షల మంది అంధకారంలో ఉండిపోయారు. బుధవారం రాత్రి 3 కేటగిరీగా తీరం దాటిన తుఫాను తరువాత ఒకటో కేటగిరీకి బలహీనపడింది. అయినా ముప్పు ఇంకా పొంచి ఉందని అధికారులు పునరుద్ఘాటించారు. టంపా: మిల్టన్ ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు ఫ్లోరిడా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. గంటకు 205 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. బుధవారం ఉదయం దక్షిణ ఫ్లోరిడాలోని కొన్ని ప్రాంతాల్లో టోర్నడోలు సంభవించాయి. సెయింట్ లూసీ కౌంటీలో టోర్నడోల ధాటికి ఐదుగురు మృతి చెందారు. ఫ్లోరిడా అట్లాంటిక్ తీరంలోని ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఫోర్ట్ మైయర్స్లో మరో టోర్నడో ధాటికి చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్థంభాలు నేలకొరగడంతో రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షల మంది అంధకారంలో ఉండిపోయారు. హార్డీ కౌంటీ, హైలాండ్స్ కౌంటీతో సహా పలు ప్రదేశాల్లో 90% మందికి విద్యుత్ అంతరాయం కలిగింది. సానిబెల్ నగరంలో రోడ్లన్నీ వరదతో ముంచెత్తాయి. రహదారులపై 3 అడుగుల మేర నీరు చేరింది. వరదలతో టంపా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. నేపుల్స్లో రికార్డు స్థాయిలో నీరు నిలిచింది. తుఫాను ధాటికి తీవ్ర ప్రాణ నష్టం జరిగి ఉంటుందని, అయితే ఎంత మంది చనిపోయారనేది చెప్పలేమని అధికారులు వెల్లడించారు. అత్యధిక వర్షపాతం... సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 41 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వెయ్యేళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం. ఈదురు గాలులు ట్రోపికానా ఫీల్డ్ పైకప్పును చీల్చాయి. తుపాను ధాటికి పలు క్రేన్లు కూడా కూలిపోయాయి. మంచి నీటి సరఫరాను సైతం నిలిపేశారు. సుదీర్ఘ విద్యుత్ అంతరాయాలు, మురుగునీటి పారుదల వ్యవస్థ సైతం మూతపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓర్లాండోలో వాల్ డిస్నీ వరల్డ్, యూనివర్సల్ ఓర్లాండో, సీ వరల్డ్ సంస్థలు గురువారం మూతపడ్డాయి. పలు ఫ్లోరిడా విమానాశ్రయాలను నిరవధికంగా మూసివేశారు. హరికేన్ కలిగించిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. పొంచి ఉన్న ముప్పు.. హెలెన్ హరికేన్‌తో ఇప్పటికే దెబ్బతిన్న ఫ్లోరిడాను మిల్టన్ మరింత దుస్థితిలోకి తీసుకెళ్లింది. ఈ ఏడాది అమెరికాను తాకిన ఐదో హరికేన్ ఇది. ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీరానికి 75 మైళ్ల దూరంలో మిల్టన్ కేంద్రీకృతమై ఉందని నేషనల్ హరికేన్ సెంటర్ (ఎన్‌హెచ్‌సీ)తెలిపింది. దీని ప్రభావంతో తూర్పు మధ్య, ఈశాన్య ఫ్లోరిడాలో ఈదురుగాలులు వీస్తాయని, ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ కరోలినా తూర్పు తీరం వెంబడి తుఫాను ముప్పు ఇంకా ఉందని వెల్లడించింది. అధికారులు ఫ్లోరిడా, ఇతర రాష్ట్రాలకు చెందిన 9,000 మంది నేషనల్ గార్డ్ సభ్యులతో సహాయక చర్యలు చేపట్టారు. కాలిఫోరి్నయా వరకు 50,000 మందికి పైగా యుటిలిటీ కారి్మకులను అందుబాటులో ఉంచారు. టంపా, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని 60 శాతానికి పైగా గ్యాస్ స్టేషన్లలో బుధవారం రాత్రే గ్యాస్ నిండుకోవడంతో గ్యాసోలిన్ ట్యాంకర్లను తరలించడానికి సైరన్లతో హైవే పెట్రోలింగ్ కార్లు పనిచేస్తున్నాయి. -
Hurricane Milton: ముంచుకొస్తున్న మిల్టన్
టంపా(అమెరికా): అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర పశి్చమతీరంపై మిల్టన్ తుపాను విరుచుకుపడనుంది. బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం ఉదయం తీరాన్ని దాటి జనావాసాలను అతలాకుతం చేయనుందన్న వార్త అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. గంటకు 260 కి.మీ.ల వేగంతో వీస్తున్న పెనుగాలులకుతోడు జాతీయ హరికేన్ కేంద్రం హెచ్చరికలతో అప్రమత్తమైన లక్షలాది మంది స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని టంపా, సారాసోటా, సెయింట్ పీటర్స్బర్గ్ నగరాల ప్రజలు కొందరు సొంతిళ్లను విడిచి వెళ్లలేక, తుపానును ఎలా తట్టుకోవాలో తెలీక బిక్కుబిక్కుమంటున్నారు. దాదాపు 33 లక్షల మంది నివసించే టంపా బే ప్రాంతంలో హరికేన్ దారుణంగా విరుచుకుపడి వినాశనం సృష్టించనుందని వాతావరణశాఖ అంచనావేసింది. ఈ ప్రాంతంపై ఐదో కేటగిరీ హరికేన్ ఇంతటి భారీ స్థాయిలో విరుచుకుపడుతుండటం ఈ శతాబ్దంలోనే తొలిసారి అనే విశ్లేషణలు వెలువడ్డాయి. బుధవారం సాయంత్రానికి టంపా నగరానికి 485 కిలోమీటర్ల దూరంలో సముద్రంపై కేంద్రీకృతమైన హరికేన్ గంటకు కేవలం 22 కిలోమీటర్ల వేగంతో ఈశాన్యం దిశగా కదులుతోందని, తీరాన్ని తాకే సమయానికి కాస్తంత బలహీనపడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కుండపోత వర్షాలు హరికేన్ కారణంగా వెస్ట్ సెంట్రల్ ఫ్లోరిడా ప్రాంతమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం 18 అంగుళాల మేర వర్షపాతం నమోదుకావచ్చని తెలుస్తోంది. ద్వీపకల్పంలా ఉండే ఫ్లోరిడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జాగ్రత్తలు చెప్పింది. ఫ్లోరిడా నేషనల్ సెర్చ్, అండ్ రెసూ్క్క బృందాలు పెద్దమొత్తంలో జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫ్లోరిడా రాష్ట్ర చరిత్రలో ఇంతటి భారీ ఆపరేషన్ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. హరికేన్ తీరాన్ని తాకితే దాదాపు 5,00,000 ఇళ్లు నాశనమవుతాయని ఓ అంచాన. జనం ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని టంపా సిటీ మేయర్ జన్ కాస్టర్ విన్నవించుకున్నారు. ‘‘మొండిపట్టుదలతో ఇంట్లోనే కూర్చుంటే అదే మీకు శవపేటికగా మారుతుంది’’అని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే హెలెన్ హరికేన్ సృష్టించిన విలయం నుంచి సమీప పుంటా గోర్డా సిటీ ఇంకా కోలుకోలేదు. నగర వీధుల్లో ఎక్కడా చూసినా పాడైన ఫరీ్నచర్లు, దుస్తులు, పుస్తకాలు, వస్తువులు కనిపిస్తున్నాయి. ‘‘మొన్నటి హెలెన్ హరికేన్ ధాటికే వీధుల్లోకి బుల్ షార్క్‌లు కొట్టుకొచ్చాయి. ఇప్పుడేం జరుగుతుందో’’అని స్థానిక అకౌంటెంట్ స్కౌట్ జానర్ ఆందోళన వ్యక్తంచేశారు. -
అమెరికాను భయపెడుతోన్న మరో తుఫాను: భయం గుప్పిట్లో ఫ్లోరిడా
ఫ్లోరిడా : హెలెన్ తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి బయటపడకముందే అమెరికాను మరో తుఫాను భయపెడుతోంది. ఫ్లోరిడా తీరం వైపు మిల్టన్ హరికేన్ దూసుకొస్తోంది. మిల్టన్ ఐదో కేటగిరీ హరికేన్‌గా బలపడిందని, అత్యంత శక్తిమంతమైన ఈ తుఫాను వల్ల ప్రాణహాని ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫ్లోరిడా పశి్చమ తీరం వైపు కదులుతున్న మిల్టన్.. బుధవారం తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను ఉధృతితో బుధవారం తెల్లవారుజామునుంచే తీవ్రమైన గాలులు వీస్తాయని ఎన్‌హెచ్‌సీ హెచ్చరించింది. మిల్టన్ ఐదో కేటగిరీ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను సురక్షిత స్థానాలకు తరలిస్తున్నారు. ఈ అతిపెద్ద తరలింపు ప్రయత్నానికి సిద్ధం కావాలని గవర్నర్ రాన్ డిసాంటిస్ ప్రజలను కోరారు. మిల్టన్ మార్గంలోని విమానాశ్రయాలు మూసివేశారు. తుఫాను హెచ్చరికలతో ప్రజలు తమ ఇళ్ల నుంచి ఒకేసారి బయటకు రావడంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. మిల్టన్ తుఫాను.. హరికేన్లను వర్గీకరించడానికి ఉపయోగించే సాఫిర్–సింప్సన్ స్కేలుపై మిల్టన్ ఐదో కేటగిరీగా నమోదైనది. ఈ తుఫాను సమయంలో గాలులు గంటకు 285 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని నేషనల్ హరికేన్ సెంటర్ (ఎన్‌హెచ్‌సీ) తెలిపింది. మొదట రెండో కేటగిరీలో ఉన్న తుఫాను కొన్ని గంటల్లోనే 5వ కేటగిరీకి మారింది. ఇంత వేగంగా తుఫాను బలపడటం నమ్మశక్యంగా లేదని ఫ్లోరిడా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతా ఈ హరికేన్ బలపడిందంటున్నారు. ఒక శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని తాకిన అత్యంత తీవ్రమైన తుఫాను ఇదే కావచ్చని చెబుతున్నారు. హరికేన్లు మూడో కేటగిరీ దాటితేనే తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. గత నెలలో ఫ్లోరిడాను తాకిన హెలెన్ తుఫాను నాలుగో కేటగిరీకి చెందింది. గంటకు 225 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో ఆస్తి నష్టం జరిగింది. దీని ధాటికి నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా, టేనస్సీ, వర్జీనియాలో దాదాపు 230 మంది మరణించారు. ఇంకా మృతదేహాలను వెలికి తీస్తూనే ఉన్నారు. సాధారణం కంటే 2024 హరికేన్ సీజన్ తీవ్రంగా ఉందని నేషనల్ ఓషియానిక్ అటా్మస్ఫియరిక్ అసోసియేషన్ (ఎన్ఓఏఏ) అంచనా వేసింది. మానవుల వల్ల ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్ట ఉష్ణోగ్రతలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. -
USA: హెలెన్ విధ్వంసం
ఫ్లోరిడా: అమెరికాను తాకిన భీకర హెలెన్ తుపాను ఫ్లోరిడాతో పాటు ఆగ్నేయ అమెరికాలో అపారమైన విధ్వంసం సృష్టించింది. జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియాల్లో వరదలు, ఇళ్లు కూలిన ఘటనల్లో 72 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగేలా ఉంది. వరద నష్టం 15 నుంచి 26 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. టెన్నెసీలోని యునికోయ్ కౌంటీ హాస్పిటల్లోకి వరద చేరడంతో మొత్తం 54 మంది భవనంపైకి చేరారు. వారిని హెలికాప్టర్ ద్వారా కాపాడారు. న్యూపోర్టు సమీపంలో జలాశయం పొంగిపొర్లుతుండటంతో 7 వేల మందిని తరలించారు. నార్త్ కరోలినాలో వందేళ్లలోనే రికార్డు స్థాయిలో వరదలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. అట్లాంటాలో 48 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 28.24 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇక్కడ 1878 తర్వాత ఈ స్థాయి వర్షం ఇదే మొదటిసారని జార్జియా వాతావరణ విభాగం ప్రకటించింది. వరదల ధాటికి పార్కు చేసిన కార్లన్నీ మునిగిపోయాయి. ఈ ప్రాంతాన్ని ముంచెత్తాయి. ఫ్లోరిడాలో పలు ప్రాంతాలకు చేరేందుకు పడవలే దిక్కయ్యాయి. ఫ్లోరిడా, జార్జియా, కరోలినాల్లో 30 లక్షల ఇళ్లు, వ్యాపారసంస్థలకు కరెంటు నిలిచిపోయింది. ఇటీవలి ఇడాలియా, డెబ్బీ తుపాన్లను మించిన నష్టం కలిగిందని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీ శాంటిస్ తెలిపారు. తుపాను తీవ్రత తగ్గినా కుండపోత కొనసాగుతుందని వాతావరణ విభాగం హెచ్చరించింది. -
అమెరికాను వణికిస్తున్న హరికేన్ హెలెన్
వాషింగ్టన్: అమెరికాను హరికేన్ హెలెనా వణికిస్తోంది. మెక్సికో తీరం నుంచి అమెరికాలోని ఫ్లోరిడా దిశగా అతి తీవ్ర హరికేన్ హెలెన్ దూసుకెళ్తోందని యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్(ఎన్‌హెచ్‌సీ) వెల్లడించింది. హెలెన్ హరికేన్ కేటగిరి-3 లేదా కేటగిరి-4 హరికేన్‌గా బలపడే అవకాశం ఉందని ఎన్‌హెచ్‌సీ అధికారులు చెబుతున్నారు.హరికేన్ హెలెన్ ఫ్లోరిడా సిటీపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫ్లోరిడాలోకి దాదాపు పది కౌంటీలపై హరికేన్ ప్రభావం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక, ఇప్పటికే హరికేన్ ప్రభావంతో సిటీలో తీవ్రమైన గాలులతో కూడా వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో వరద నీటిలో కార్లు మునిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక, హెలెన్ ప్రభావంతో పెనుగాలులు, కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందని అమెరికా వాతారణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. 🚨Storm surges up to 20 feet in Florida. #HurricaneHelene This is absolutely catastrophic…Prayers to anyone involved🙏pic.twitter.com/tD1LtlFFEd— WOLF News (@WOLF_News_) September 26, 2024 🚨🇲🇽HURRICANE HELENE UPDATEQuintana Roo, Mexico:- Massive flood and Material damage reported- Cancun hotel area severely affectedNo loss of life reportedAssessment and recovery efforts underway#HurricaneHelene #QuintanaRoo #Cancun #Hurricane #mexico pic.twitter.com/6vmlMY0qaV— Berkan Yılmaz (@Berk04790) September 26, 2024 🚨🇺🇲 UNC Asheville Flood Alert (University of North #Carolina at Asheville, 1 University Heights, #Asheville, NC - Flash flooding reported on campus- Students and staff advised to seek higher groundSTAY SAFE: Avoid flooded areas#UNCA #FlashFlood #Helene #HurricaneHelene… https://t.co/J0RtuUKJSR pic.twitter.com/R8wnLhUm2P— Weather monitor (@Weathermonitors) September 26, 2024ఇది కూడా చదవండి: న్యూక్లియర్ వార్‌కు సిద్ధం.. పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ -
వ్యాక్సిన్స్ వికటించి బొమ్మలా ఉండే అమ్మాయి, దారుణంగా! వీడియో వైరల్
అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒక యువతి చికిత్స తీసుకుందామని వెళ్లి ఇపుడు మరింత ప్రమాదంలో పడిపోయింది. చికిత్సలో భాగంగా ఆమె తీసుకున్న వ్యాక్సీన్లు వికటించడంతో మృత్యువుతో పోరాడుతోంది. అంతేకాదు దీనికి సంబంధించిన ఖర్చులు భారీగా ఉండటంతో వైద్య నిధుల సమీకరణకు నానా బాధలుపడుతోంది. విషయం ఏమిటంటే..ఫ్లోరిడాకు చెందిన 23 ఏళ్ల అలెక్సిస్ లోరెంజ్ పరోక్సిస్మల్ నాక్టర్నల్ హిమోగ్లోబినూరియా (PNH)తో భాపడుతోంది. దీనికి చికిత్స కోసం కాలిఫోర్నియాలోని UCI మెడికల్ సెంటర్లో చేరింది.నివేదికల ప్రకారం, ఆమె చికిత్సను కొనసాగించే ముందు టెటనస్, మెనింజైటిస్ ,న్యుమోనియాకు టీకాలు వేయించుకోవాలిన ఆసుపత్రి వైద్యులు కోరారు. అయితే టీకాలు ఏకకాలంలో ఇవ్వడంతో భయంకరమైన రియాక్షన్ వచ్చింది. టీకాలు వేసిన పది నిమిషాల్లోనే ఆమె పరిస్థితి దారుణంగా క్షీణించింది. తాత్కాలిక అంధత్వం,దవడలు బిగుసుకుపోయాయి. ఒళ్లంతా రక్తం పేరుకుపోయిన మచ్చలు. ఒక దశలో తల పగిలిపోతుందా అన్నంత బాధ. దీనికి తోడు వాంతులతో ఇబ్బంది పడుతోంది. ఫలితంగా ఆమెను ప్రత్యేక చికిత్స కోసం లాస్ ఏంజిల్స్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. లోరెంజ్కి కాలిఫోర్నియాలో ఆరోగ్య బీమా లేకపోవడం నిధులను సేకరించే పనిలో ఉన్నారు ఆమె బంధువులు, స్నేహితులు. Alexis Lorenze suffering reactions from 3 vaccines administered to her: meningitis, pneumonia, and tetanus at UCI Medical Center (Anaheim California). I'd give this woman a lot of C to begin with. #VaccineSideEffects https://t.co/whOja2HeGs pic.twitter.com/Hwy1wVuVir— Robert, C.N., Pharm Tech. (@Robertvegan7) September 17, 2024తన పరిస్థితిపై లోరెంజ్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మె మొదట రక్త రుగ్మత కోసం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. రక్త మార్పిడి చేయించుకుంది. రక్తమార్పిడి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, పూర్తిగా తగ్గలేదని ఆమె వాపోయింది. టీకాలు వేసుకోవాల్సిందిగా వైద్యులు సలహా ఇచ్చారని, బలవంతంగా తీసుకున్న మూడు వ్యాక్సిన్ల కారణంగా తన పరిస్థితి దారుణంగా తయారైందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు టీకాలు తీసుకున్న తర్వాత, ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించటానికి దారితీసిందనికుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం లోరెంజ్ నెమ్మదిగాకోలుకుంటోందని ఆమెకోసం కేటాయించిన స్పెషల్ నర్సు వెల్లడించారు. -
ఆ రెండు స్కూళ్లలో వాళ్లని కాల్చి చంపేస్తా!
ఫ్లోరిడా: రెండు స్కూళ్లలో కాల్పులు జరిపి, చంపాల్సిన ‘కిల్ లిస్ట్‌ను తయారు చేసుకున్నాడు. అందుకు రకరకాల రైఫిళ్లు, పిస్టళ్లతోపాటు, కత్తులను సైతం సిద్ధం చేసుకున్నాడు. కిల్ లిస్ట్‌తోపాటు ఆయుధ సామగ్రి ఫొటోలను ఆన్లైన్లో తన క్లాస్మేట్లకు గొప్పగా చూపించుకున్నాడు. అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన 11 ఏళ్ల బాలుడి ఘన కార్యమిది. .! అసలే స్కూళ్లలో కాల్పుల ఘటనలతో జనం గగ్గోలు పెడుతున్న సమయం. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. దీంతో, వారు ‘కార్లో కింగ్స్టన్’ డొరెల్లి’ కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్లారు. అతడు పోగేసిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ‘క్రీక్ సైడ్ మిడిల్ స్కూల్లో చదువుకుంటున్న కార్లో అనే బాలుడు క్రీక్ సైడ్, సిల్వర్ శాండ్ మిడిల్ స్కూళ్లలో వాళ్లను కాల్చి చంపేందుకు పథకం వేశాడు. పేర్లు, లక్ష్యాలతో జాబితాను సైతం సిద్ధం చేసుకున్నాడు. వీటిని ఆన్లైన్లో పెట్టాడు. ఇదేమని అడిగితే ఒట్టి జోక్ మాత్రమే అంటున్నాడు’ అని ఒలూసియా కౌంటీ షరీఫ్ మైక్ చిట్వూడ్ తెలిపారు. అధికారులు బాలుడికి సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్తున్న వీడియోను ఆయన ‘థ్రెడ్’లో షేర్ చేశారు. అతడిపై శిక్షార్హమైన నేరం కింద కేసు నమోదు చేశామన్నారు. ‘ఉత్తుత్తిగా లేదా నిజంగానే బెదిరింపులకు గురిచేసే పిల్లల ఫొటోలతో వివరాలను బహిర్గతం చేస్తాం. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి’అని తల్లిదండ్రులను హెచ్చరించారు. -
ఫ్లోరిడాలో కాల్పుల కలకలం .. ట్రంప్ సురక్షితం
-
Polaris Dawn: తిరిగొచ్చిన స్పేస్‌వాకర్లు
స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రైవేట్ స్పేస్‌వాక్ ప్రాజెక్టు ‘పొలారిస్ డాన్’ విజయవంతమైంది. అందులో భాగంగా ఐదు రోజుల క్రితం అంతరిక్షానికి వెళ్లడమే గాక వ్యోమగామిగా అనుభవం లేకున్నా స్పేస్‌వాక్ చేసిన తొలి వ్యక్తిగా చరిత్రకెక్కిన కుబేరుడు జరేద్ ఇసాక్‌మాన్ ఆదివారం సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. ఆయన, మరో ముగ్గురు సిబ్బందితో కూడిన స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ అమెరికాలో ఫ్లోరిడాలోని డై టార్టగస్ బీచ్ సమీప సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. ఇసాక్మాన్తోపాటు ఇద్దరు స్పేస్ఎక్స్ ఇంజనీర్లు, ఒక మాజీ ఎయిర్‌ఫోర్స్ థండర్బర్డ్ పైలట్ కూడా ఈ క్యాప్సూల్‌లో అంతరిక్షంలోకి వెళ్లడం తెల్సిందే. భూమి నుంచి 740 కి.మీ. ఎత్తులో తొలుత ఇసాక్‌మాన్, తర్వాత స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిలిస్ స్పేస్‌వాక్ చేశారు. అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ గరిష్టంగా భూమి నుంచి ఏకంగా 875 మైళ్ల ఎత్తుకు వెళ్లి మరో రికార్డు సృష్టించింది. చంద్రుడిపైకి నాసా అపోలో మిషన్ల తర్వాత మానవులు ఇంత ఎత్తుకు వెళ్లడం ఇదే తొలిసారి! ప్రైవేట్ రంగంలో స్పేస్‌వాక్ చేసిన తొలి వ్యక్తిగా, మొత్తమ్మీద 264వ వ్యక్తిగా ఇస్సాక్‌మాన్ నిలిచారు. ఆయన, గిలిస్ దాదాపు రెండు గంటల పాటు క్యాప్సూల్ నుంచి బయటికొచ్చి స్పేస్ఎక్స్ నూతన స్పేస్‌సూట్‌ను పరీక్షించారు. గిలిస్ అంతరిక్షం నుంచే సూపర్‌హిట్ హాలీవుడ్ సినిమా స్టార్‌వార్స్ థీమ్ సాంగ్‌కు వయోలిన్ వాయించి రికార్డు సృష్టించడం తెలిసిందే. – కేప్ కనావరెల్ -
ఒకరు ధర్మాసనంపై.. మరొకరు బోనులో... ఇద్దరు మిత్రుల కథ!
అది 2015. అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన ఆర్థర్ నథానియల్ బూత్ దొంగతనం ఆరోపణలపై అరెస్టయ్యాడు. మియామీ–డేడ్ జడ్జి మిండీ గ్లేజర్ ముందు విచారణకు హాజరయ్యాడు. అతన్ని తేరిపార చూసిన జడ్జి, నువ్వు నౌటిలస్ మిడిల్ స్కూల్లో చదివావు కదా ప్రశ్నించారు. దాంతో ఆమెను గుర్తు పట్టిన బూత్ ఒక్కసారిగా భావోద్వేగంతో రోదించాడు. వాళ్లిద్దరూ చిన్ననాటి మిత్రులు మరి! స్కూలు రోజుల్లో బెస్ట్ ఫ్రెండ్స్. కలిసి ఫుట్ బాల్ ఆడేవాళ్లమని, బూత్ తమ స్కూళ్లోకెల్లా ఉత్తమ బాలుడని మిండీ గుర్తు చేసుకున్నారు. ‘బూత్, నిన్నిక్కడ చూడాల్సి వచ్చినందుకు బాధగా ఉంది’ అంటూ విచారం వ్యక్తం చేశారు. ఇకపై మంచి జీవితం గడుపుతాడని ఆశాభావం వెలిబుచ్చారు. కానీ అలా జరగలేదు. బూత్ చోర జీవితమే కొనసాగిస్తూ వచ్చాడు. నగరమంతటా వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు. ప్లంబర్ వేషంలో ఓ వృద్ధుడి ఇంట్లో దూరి బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. వాటర్ ఇన్స్పెక్టర్గా నటించి ఓ ఇంట్లోంచి నగల పెట్టె దొంగిలించాడు. టైరు మారుస్తున్న మహిళ బంగారు గొలుసు లాక్కున్నాడు. ఇవన్నీ చేస్తూ సీసీ కెమెరాలకు దొరికిపోయాడు. ఎట్టకేలకు అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈసారి కోర్టులో జడ్జిగా చిన్నప్పటి నేస్తం కని్పంచలేదు గానీ అతని అరెస్టుతో నాటి ఉదంతం మరోసారి తెరపైకి వచి్చంది. 2015 నాటి కోర్టు ప్రొసీడింగ్స్ వీడియో వైరల్‌గా మారింది. – వాషింగ్టన్ -
Miami: వేకేషన్లో బ్యూటీ.. లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసిన ఐశ్వర్య రాజేశ్ (ఫోటోలు)
-
తుమ్మితే పేగులు బయటికొచ్చాయి!
వాషింగ్టన్: ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఇటీవల మూత్రకోశం ఆపరేషన్ చేయించుకున్న 63 ఏళ్ల రోగి అనూహ్యమైన మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొన్నారు. గట్టిగా తుమ్మి, దగ్గడంతో పేగులు బయటికొచ్చాయి. దీంతో ఆయనను అత్యవసరంగా ఆస్పత్రిలో చేర్పించి ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకుండా కాపాడారు. ఫ్లోరిడావాసికి జరిగిన ఈ విచిత్ర ఘటన వివరాలు ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ కేస్ రిపోర్ట్స్’లో ప్రచురితమయ్యాయి. యూరినరీ బ్లాడర్ ఆపరేషన్ తర్వాత కోలుకున్న ఆ వ్యక్తికి ఇటీవల ఆస్పత్రికి వెళ్లారు. ఆపరేషన్ సమయంలో పై నుంచి వేసిన కుట్లను విప్పేశారు. ఆపరేషన్, కుట్లు విప్పడం అంతా సవ్యంగా జరగడంతో చిన్న పార్టీ చేసుకుందామనుకుని ఆ దంపతులు తర్వాతి రోజు ఉదయాన్నే దగ్గర్లోని రెస్టారెంట్‌కు వెళ్లి అల్పాహారం తినేందుకు కూర్చున్నారు. ఆ సమయంలో ఆ వ్యక్తి బిగ్గరగా తుమ్మడంతోపాటు దగ్గారు. దీంతో ఆపరేషన్ కోసం గతంలో కోత పెట్టిన ప్రాంతం నుంచి పేగుల్లో కొంతభాగం బయటికొచ్చింది. హుతాశుడైన వ్యక్తి వెంటనే ధైర్యం తెచ్చుకుని సొంతంగా డ్రైవింగ్ చేస్తూ ఆస్పత్రికి వెళ్దామనుకున్నాడు. భార్య వద్దని వారించడంతో అంబులెన్సులో ఆస్పత్రికి వెళ్లారు. పరిస్థితి చూసి అవాక్కవడం వైద్యుల వంతయింది. ముగ్గురు నిష్ణాతులైన యూరాలజీ సర్జన్లు జాగ్రత్తగా వాటిని మళ్లీ యథాస్థానంలోకి వెనక్కి నెట్టారు. ఇలాంటి ఘటన జరగడం మాకు తెలిసి ఇదే తొలిసారి అని అక్కడి వైద్యులు వ్యాఖ్యానించారు. -
నా ఫేవరెట్ క్రికెటర్ కోహ్లి.. ఎందుకంటే: కెనడా కెప్టెన్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆటంటే తనకెంతో ఇష్టమని కెనడా క్రికెట్ జట్టు కెప్టెన్ సాద్ బిన్ జఫర్ అన్నాడు. తన ఆల్‌టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అతడే అని తెలిపాడు.కోహ్లి సేవలు కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదని.. ప్రపంచ క్రికెట్‌పై తనదైన ముద్ర వేసిన గొప్ప ఆటగాడని సాద్ బిన్ జఫర్ ప్రశంసలు కురిపించాడు. టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్, అమెరికా, ఐర్లాండ్‌లతో పాటు కెనడా గ్రూప్-ఏలో ఉంది.ఈ గ్రూపు నుంచి ఇప్పటికే భారత్, అమెరికా సూపర్-8కు చేరగా.. పాక్, ఐర్లాండ్, కెనడా ఎలిమినేట్ అయ్యాయి. ఇక ఈ మెగా టోర్నీలో కెనడా ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒకటి మాత్రమే గెలిచింది.లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో భాగంగా పటిష్ట టీమిండియాతో తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఫ్లోరిడా వేదికగా శనివారం రాత్రి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కెనడా కెప్టెన్ సాద్ బిన్ జఫర్ ఈ పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.మాకంటూ మంచి గుర్తింపు వస్తుందిస్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘విరాట్ కోహ్లి నాకు అత్యంత ఇష్టమైన క్రికెటర్. అతడు కేవలం టీమిండియాకే కాదు.. క్రికెట్ ప్రపంచానికి ఎంతో చేశాడు.ఇక టీమిండియా ప్రస్తుతం పొట్టి ఫార్మాట్లో అగ్రస్థానంలో ఉన్న జట్టు. అలాంటి టీమ్‌తో మేము కలిసి ఒకే గ్రౌండ్లో ప్రత్యర్థులుగా ఆడటం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది.పాక్‌లో జన్మించిన సాద్ బిన్ జఫర్ఒకవేళ ఈ మ్యాచ్‌లో మేము గనుక రాణిస్తే కచ్చితంగా క్రికెటింగ్ సర్క్యూట్లో మాకంటూ మంచి గుర్తింపు వస్తుంది’’ అని సాద్ బిన్ జఫర్ చెప్పుకొచ్చాడు. కాగా పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో జన్మించిన సాద్ బిన్ జఫర్ తర్వాత కెనడాకు మకాం మార్చాడు.లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన జఫర్.. లెఫ్టాండ్ బ్యాటర్ కూడా. 37 ఏళ్ల ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ ప్రస్తుతం కెనడా జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. కెనడా తరఫున ఇప్పటి వరకు 12 వన్డేలు, 41 టీ20 మ్యాచ్‌లు ఆడి ఆయా ఫార్మాట్లలో 16, 44 వికెట్లు తీశాడు.ఐర్లాండ్‌పై గెలిచిఇక వరల్డ్‌కప్-2024లో సాద్ బిన్ జఫర్ కెప్టెన్సీలో కెనడా తమ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడింది. అనంతరం.. ఐర్లాండ్‌పై 12 పరుగుల తేడాతో గెలిచింది.అయితే, సూపర్-8 రేసులో నిలవాలంటే పాకిస్తాన్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. చివరగా టీమిండియాతో మ్యాచ్ ఆడి ఇంటిబాట పట్టనుంది.చదవండి: పాక్ చెత్త ప్రదర్శన.. సెలక్టర్లపై మాజీ కెప్టెన్ ఫైర్With #TeamIndia already advancing in the Super 8 stage, Canada players share their favourite players to watch out for on the biggest stage! 🔥Will @ImRo45 & Co. go into the Super 8 with a win against Canada? 🤨#INDvCAN | TODAY, 6 PM | #T20WorldCupOnStar pic.twitter.com/88cOlwURWU— Star Sports (@StarSportsIndia) June 15, 2024 -
IND vs CAN: భారత తుదిజట్టు నుంచి ఆ ఇద్దరు అవుట్?!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో ఇప్పటికే సూపర్-8కు చేరుకున్న టీమిండియా.. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్‌కు సిద్దమైంది. గ్రూప్-ఏలో తమకు మిగిలి ఉన్న నామమాత్రపు మ్యాచ్‌లో కెనడాతో ఫ్లోరిడా వేదికగా శనివారం రాత్రి తలపడనుంది.కాగా ఫ్లోరిడాలోని లాడెర్హిల్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాటి అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ రద్దైంది. ఫలితంగా పాయింట్ల పరంగా మెరుగైన స్థితిలో ఉన్న అమెరికా సూపర్-8కు చేరగా.. పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఇక టీమిండియా- కెనడా మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దైపోయినా రోహిత్ సేనకు ఎలాంటి నష్టం లేదు. అదే విధంగా.. ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించిన కెనడాపై కూడా ఇంకెలాంటి ప్రభావం ఉండదు.ఆ ఇద్దరు అవుట్!ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ జరిగితే మాత్రం టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రవీంద్ర జడేజా స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుదిజట్టులో ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.అదే విధంగా.. శివం దూబే స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా అమెరికాలో జరుగుతున్న టీమిండియా లీగ్ దశ మ్యాచ్‌లలో జడ్డూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.గత మ్యాచ్(అమెరికాతో)లో అతడికి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. మరోవైపు.. వికెట్ కీపర్ కోటాలో మూడు మ్యాచ్‌లు ఆడే ఛాన్స్ కొట్టేసిన రిషభ్ పంత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని జట్టులో తన స్థానం పదిలం చేసుకున్నాడు.ఈ నేపథ్యంలో.. మరో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూకు ఒక్క అవకాశం కూడా రాలేదు. అయితే, సూపర్-8కు ముందు అతడికి కెనడాతో మ్యాచ్‌లో ఛాన్స్ ఇస్తే.. ప్రాక్టీస్ దొరుకుతుందని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో శివం దూబే స్థానంలో సంజూను ఆడించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే విధంగా.. వెస్టిండీస్‌లో సూపర్-8 మ్యాచ్‌ల నేపథ్యంలో.. కుల్దీప్ యాదవ్‌కు కూడా అమెరికాలో తొలి ఛాన్స్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.కాగా ఈ మ్యాచ్‌లోనైనా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి బ్యాట్ ఝులిపిస్తే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఇప్పటి వరకు టీమిండియా ఆడిన మూడు మ్యాచ్‌లు న్యూయార్క్‌లోనే జరిగాయి.అక్కడి నసావూ కౌంటీ డ్రాప్ ఇన్- పిచ్ బౌలర్ల పాలిట స్వర్గధామంలా మారి బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఈ క్రమంలో కోహ్లి మూడు మ్యాచ్‌లలో కలిపి కేవలం ఐదు పరుగులే చేశాడు.అయితే, కెనడాతో మ్యాచ్ జరిగే వేదిక ఫ్లోరిడాలో పరుగులకు ఆస్కారం ఉన్న వికెట్ ఉంటుంది. కాబట్టి ఈసారైనా కింగ్ భారీగా రన్స్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఇండియా వర్సెస్ కెనడాతో నామమాత్రపు మ్యాచ్‌కు తుదిజట్ల అంచనా భారత తుదిజట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.కెనడా తుదిజట్టు(అంచనా)ఆరోన్ జాన్సన్, నవనీత్ ధాలివాల్, పర్గత్ సింగ్, దిల్‌ప్రీత్ బజ్వా, నికోలస్ కిర్టన్, శ్రేయస్ మొవ్వ (వికెట్ కీపర్), డిల్లాన్ హెయిలిగర్, సాద్ బిన్ జాఫర్ (కెప్టెన్), కలీమ్ సనా, జునైద్ సిద్ధిఖీ, జెరెమీ గోర్డాన్.చదవండి: పాక్ చెత్త ప్రదర్శన.. సెలక్టర్లపై మాజీ కెప్టెన్ ఫైర్New York ✅#TeamIndia arrive in Florida 🛬 for their last group-stage match of the #T20WorldCup! 👍 pic.twitter.com/vstsaBbAQx— BCCI (@BCCI) June 14, 2024 -
T20 World Cup 2024: టీమిండియా తదుపరి మ్యాచ్ వర్షార్పణం..?
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా భారత్ ఆడబోయే తదుపరి మ్యాచ్ భారీ వర్షాల కారణంగా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 15న భారత్.. కెనడాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు వేదిక అయిన ఫ్లోరిడాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ అమల్లో ఉంది. మరో నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.ఫ్లోరిడాలో భారత్-కెనడా మ్యాచ్‌తో పాటు మరో రెండు కీలక మ్యాచ్‌లు జరుగనున్నాయి. జూన్ 14న యూఎస్ఏ-ఐర్లాండ్.. జూన్ 16న ఐర్లాండ్-పాకిస్తాన్ జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్-ఏ నుంచి సూపర్-8కు చేరే క్రమంలో యూఎస్ఏ, పాకిస్తాన్లకు ఈ మ్యాచ్‌లు చాలా కీలకం.The conditions in Florida is reallyBad right now.- India vs Canada.- Pakistan vs Ireland.- USA vs Ireland.- All 3 games will be played in Florida in this T20 World Cup 2024.pic.twitter.com/0g1zhWOzEZ— Tanuj Singh (@ImTanujSingh) June 13, 2024ఇలా జరిగినా పాక్ ఇంటికే..జూన్ 14న యూఎస్ఏ-ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే పాకిస్తాన్ అధికారికంగా గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఎందుకంటే.. అమెరికా ఖాతాలో ఇప్పటికే నాలుగు పాయింట్లు ఉన్నాయి. ఐర్లాండ్‌తో మ్యాచ్ రద్దైతే ఆ జట్టు ఖాతాలో మరో పాయింట్ చేరి మొత్తంగా ఐదు పాయింట్లు అవుతాయి. మరోవైపు.. పాక్ ఖాతాలో ప్రస్తుతం రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ రద్దైతే.. పాక్ తదుపరి ఆడబోయే మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఓడించినా ఫలితం ఉండదు. ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉంటాయి. అప్పుడు యూఎస్ఏ.. భారత్‌తో పాటు గ్రూప్-ఏ నుంచి సూపర్-8కు అర్హత సాధిస్తుంది. భారత్ ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి సూపర్-8కు క్వాలిఫై అయ్యింది. -
అన్యాయంగా 37 ఏళ్లు ఖైదు : రూ. 116 కోట్లు పరిహారం
వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది ఒక ధర్మ సూత్రం. కానీ ఫ్లోరిడాకు చెందిన ఒక వ్యక్తి చేయని నేరానికి ఏకంగా 37 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు. తాను తప్పు చేయలేదని ఎంత మొత్తుకున్నా ఎవరూ అతని మాటలు పట్టించుకోలేదు. ఫలితంగా విలువైన జీవితంలో విలువైన సమయంలో జైలులో మగ్గిపోవాల్సి వచ్చింది. చివరికి న్యాయమే గెలచింది. ఒక కేసులో దొరికిన ఓ సాక్ష్యం ఆధారంగా అతణిని నిర్దోషిగా తేల్చింది. ఈ తప్పిందం దొర్లినందుకు గాను అతనికి రూ. 116 కోట్ల రూపాయలు భారీ పరిహారాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది.అసలేమైందంటే..లైంగికదాడి, హత్య వంటి ఆరోపణలపై ఫ్లోరిడాకు చెందిన రాబర్ట్ డుబోయిస్‌ను 1982లో పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికి అతని వయసు 18 ఏళ్లు మాత్రమే. 19 ఏళ్ల బార్బరా గ్రామ్ను అత్యాచారం చేసి, చంపేశాడంటూ అభియోగాలు నమోదైనాయి. ఈ కేసులో విచారణ అనంతరం అమెరికాలోని ఒక కోర్టు తొలుత అతడికి కోర్టు మరణశిక్ష విధించింది. ఇన్నోసెన్స్ ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్ సహాయంతో అతని శిక్షను 2018లో దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది. చివరకు తప్పుడు నేరారోపణ కేసులను వాదించడంలో అపారమైన అనుభవం ఉన్న చికాగోకు చెందిన పౌర హక్కుల సంస్థ లోవీ & లోవీ ఈ కేసులో జోక్యం చేసుకుని, ఈ కేసులో బాధితుడి ప్రమేయం లేదని నిరూపించడంలో అతినికి విముక్తి లభించింది. 1980లలో అందబాటులోని, ఆధునిక కాలంలో అందుబాటులోకి వచ్చిన డీఎన్ఏ టెస్ట్‌ద్వారా నిర్దోషిగా తేలాడు. 2020 ఆగష్టులో ఫ్లోరిడా జైలు నుండి విడుదలయ్యాడు.కొంతకాలం తర్వాత, రాబర్ట్ డుబోయిస్ తనకు జరిగిన నష్టానికి న్యాయం కావాలంటూ పోరాటానికి దిగాడు. టంపా నగరం అధికారులు, విచారణలో పాల్గొన్న పోలీసు అధికారులు , ఫోరెన్సిక్ దంతవైద్యుడిపై (బార్బరా మృతదేహంపై ఉన్న పంటి గాట్లను సరిపోలాయని సర్టిఫై చేసిన) కోర్టును ఆశ్రయించాడు. దీన్ని విచారించిన అమెరికా కోర్టు అతని వాదనను సమర్ధించింది. బాధితుడికి 1.4 మిలియన్ డాలర్ల (రూ. 116 కోట్లు) పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది. విడతలవారీగా డుబోయిస్‌ను ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ సంవత్సరం 90 లక్షల డాలర్లు, వచ్చే ఏడాది 30 లక్షల డాలర్లు, చివరిగా 2026లో 20 లక్షల డాలర్లు డుబోయిస్ అందుకుంటాడు. -
అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా తెలుగు విద్యార్థి
అగ్రరాజ్యం అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ 'స్పెల్లింగ్ బీ' పోటీల్లో ఈ ఏడాది కూడా భారత సంతతి విద్యార్థుల హవానే కొనసాగింది. ఈ ఏడాది జరిగిన 96వ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో ఏడుగురు ఫైనలిస్టులను ఓడించి విజేతగా నిలిచాడు భారత సంతతి విద్యార్థి బృహత్ సోమ. కేవలం 90 సెకన్లలో అబ్సెయిల్ సహా 29 పదాలను అలవోకగా తప్పుల్లేకుండా చెప్పి..కప్ తోపాటు 50 వేల డాల నగదు బహుమతిని కూడా గెలుచుకున్నాడు. ఫ్లోరిడాకు చెందిన 12 ఏళ్ల బృహత్ సోమ ప్రస్తుతం ఏడో గ్రేడ్ చదువుతున్నాడు. అతడి తండ్రి శ్రీనివాస్ సోమ నల్గొండకు చెందినవారు. ఈ ఏడాది స్పెల్లింగ్ బీ పోటీల్లో దాదాపు 240 మందికి పైగా పాల్గొన్నారు. అందులో ఏడుగురు గురువారం రాత్రికి ఫైనల్‌కు చేరుకున్నారు. ఇక వారిలో బృహత్ సోమకి, టెక్సాస్‌కు చెందిన పైజాన్ జాకీ మధ్య టై ఏర్పడింది. దీంతో ఇద్దరికీ మరో రౌండ్ పోటీ నిర్వహించి 90 సెకన్ల సమయాన్ని కేటాయించారు నిర్వాహకులు. ఈ పోటీలో జాకీ 90 సెకన్లలో 20 పదాలు చెప్పగా, బృహత్ ఏకంగా 29 పదాలు చెప్పి టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు. 2022లో జరిగిన పోటీల్లో భారత సంతతికి చెందిన హరిణి లోగాన్ 90 సెకన్లలో 22 పదాల స్పెల్లింగ్‌లు చెప్పగా, ఆ రికార్డును బృహత్ బ్రేక్ చేశాడని నిర్వాహకులు తెలిపారు. అంతేగాదు బృహత్ గతంలో 2022లో స్పెల్లింగ్ బీలో 163వ స్థానానికి చేరురోగా, 2023లో 74వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. కానీ ఈ ఏడాది మాత్రం బృహత్ టైటిల్‌తో సత్తా చాటాడు. ఇక రన్నరప్‌గా నిలిచిన జాకీ 25 వేల డాలర్ల ప్రైజ్‌మనీని అందుకున్నాడు. ఇక ఈ పోటీల్లో శ్రేయ్ పరీఖ్ రెండోవ స్థానంలో నిలవగా, అనన్య రావు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక అమెరికా ఈ స్పెల్లింగ్ బీ పోటీలను 1925 నుంచి నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఈ పోటీల్లో 29 మంది భారత సంతతి విద్యార్థులు ఛాంపియన్లుగా నిలిచారు. (చదవండి: US: పోర్ట్ ఆఫ్ ఎంట్రీ.. ఒక విషమ పరీక్షే!) -
USA: ఫ్లోరిడాలో కాల్పుల కలకలం
ఫ్లోరిడా: అమెరికా ఫ్లోరిడాలోని జాక్సెన్ విల్లా బీచ్ నగరం డౌన్ టౌన్ ప్రాంతంలో ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. కాల్పులు జరిపిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాల్పులు జరిగిన డౌన్‌టౌన్ ప్రాంతంలో ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. జాక్సన్ విల్లే బీచ్‌లో 24వేల మంది జనాభా ఉంటారు. కాగా, అమెరికాలో చిన్న చిన్న గొడవలకు కాల్పులు జరపడం సర్వసాధారణంగా మారింది. ఇటీవలి కాలంలో కాల్పుల ఘటనల్లో పలువురు మృతి చెందారు. దేశంలో వేళ్లూనుకుపోయిన గన్ కల్చర్ ప్రస్తుతం జరుగుతున్న అమెరికా అధ్యక్షల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి.. అమెరికాకు స్పేస్ ఎక్స్ నిఘా ఉపగ్రహాలు -
ఫ్లోరిడాలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలోని ఫ్లోరిడాలో ఘనంగా జరిగాయి. టెంపుల్ టెర్రేస్ నగరంలో భారతీయులు ఈ వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్- మాట, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సంబురాలు అంబరాన్నంటాయి. మాట, నాట్స్‌తో పాటు పలు తెలుగు సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. ఇక భారతీయులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మాతృభూమిపై వారికున్న ప్రేమాభిమానాలను చాటిచెప్పారు. ఈ సందర్భంగా ఒకరికొకరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని, ప్రసంగించారు. 75 ఏళ్ళ చరిత్రలో భారతదేశం సాధించిన పురోగతిని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇండియన్ రిపబ్లిక్ థీమ్ తో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు దేశభక్తి గీతాలు ఆలపిస్తూ, నృత్యాలు చేస్తూ అలరించారు.ఇక జాతీయ జెండాలను చేతబూని వందేమాతరం, భారతమాతకి జై అంటూ నినాదాలు చేశారు. చిన్నారులు భారతమాత వేషాధరణలో.. స్వాత్రంత్య యోధుల గెటప్పులలో ఆకట్టుకున్నారు. ఇక భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని పలువురిని మెమెంటోలతో సన్మానించారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుడ్ మరియు వెండర్ స్టాల్స్‌కి విశేష స్పందన వచ్చింది. ఇక ఈ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల నిర్వహకులతో పాటు ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్‌కు సహాయసహాకారాలు అందించిన ప్రతిఒక్కరికీ నిర్వహకులు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: డాలస్ లో ఘనంగా 75 వ గణతంత్ర వేడుకలు!) -
America: ఫ్లోరిడాలో టోర్నడో బీభత్సం
ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఫోర్ట్లాడర్డేల్ నగరంలో శనివారం టోర్నడో బీభత్సం సృష్టించింది. భారీ విధ్వంసం సృష్టించిన ఈ టోర్నడో చివరకు ఫోర్ట్ లాడర్డేల్లోనే ముగిసింది. టోర్నడో దాటికి పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. కరెంటు స్తంభాలు, వైర్లు దెబ్బతిన్నాయి. వీధుల నిండా చెత్త నిండిపోయింది. టోర్నడో విధ్వంసంలో స్థానికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎవరూ గాయపడలేదు. టోర్నడో బీభత్సాన్ని పలువురు స్థానికులు తమ సెల్ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియలో పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రారంభమైన టోర్నడో వేగంగా బలం పుంజుకొని పలు భవనాలను, విద్యుత్ వైర్లను, తీరంలో నిలిచి ఉన్న నౌకలను ఢీ కొట్టిందని ఫోర్ట్ లాడర్డేల్ అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు. 🚨#UPDATE: Here is additional footage as the City of Fort Lauderdale reports that there are currently no injuries and only minor damage after a tornado touched down. They are urging citizens to be cautious of downed power lines. pic.twitter.com/wno3qonwxP — R A W S A L E R T S (@rawsalerts) January 7, 2024 ఇదీచదవండి..అమెరికా రక్షణ మంత్రికి అనారోగ్యం