Donald Trump Daughter Tiffany Trump Weds Michael Boulos Viral Pics - Sakshi
Sakshi News home page

బాయ్​ఫ్రెండ్​ను పెళ్లాడిన ట్రంప్ కూతురు.. ఫోటోలు వైరల్‌

Published Sun, Nov 13 2022 6:07 PM | Last Updated on Sun, Nov 13 2022 6:58 PM

Donald Trump Daughter Tiffany Trump Weds Michael Boulos Viral Pics - Sakshi

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు టిఫానీ ట్రంప్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో తన ప్రియుడు మైఖెల్ బౌలోస్‌ను(25) పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల ప్రేమాయాణం అనంతరం బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడింది. ట్రంప్‌కు చెందిన మార్‌ ఏ లాగో క్లబ్‌ ఈ వేడుకకు వేదికగా మారింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయత్రం 4.30 నిమిషాలకు వివాహం జరిగింది. 

పెళ్లిలో తెలుపు రంగు గౌను ధరించి మెరిసిపోయారు టిఫానీ. ట్రంప్‌ దగ్గరుండి ఈ పెళ్లిని జరిపించారు. కూతురుని అప్యాయంగా వివాహ వేదికకు తీసుకొచ్చారు. అనం‍తరం ఆమెకు ముద్దుపెట్టి..వరుడు చేతికి వధువు చేతిని అందించారు. ఈ వేడుకకు ట్రంప్‌ కుటుంబమంతా హాజరై నూతన వధువరూలను ఆశీర్వదించారు. వీరిలో ట్రంప్‌ భార్య మెలానియా, మరో కూతురు ఇవాంక, ఆమె భర్త జేర్డ్‌ కుష్నర్‌, జూనియర్‌ డొనాల్డ్‌ ట్రంప్‌, ఎరిక్‌ ట్రంప్‌, బారన్‌ ట్రంప్‌ ఉన్నారు.

2018లో టిఫానీ, మైఖెల్‌కు పరిచయం ఏర్పడగా.. ఏడాదికి 2019లో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తమ ప్రేమను ప్రపంచానికి పరిచయం చేశారు. 2021 జనవరిలో ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడి పదవి నుంచి తొలగిపోయే ముందు బాయ్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకన్నట్లు టిఫానీ ప్రకటించింది.


కాగా డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆయన రెండో భార్య, నటి మార్ల మాపుల్స్‌ ఏకైక కూతురే టిఫానీ. 1993లో మర్లను ట్రంప్‌ వివాహమాడగా 1999 వరకు వీరు భార్యభర్తలుగా కొనసాగారు. అనంతరం విడాకులు తీసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement