ఫొటో చూశారా? ఆమె ముందు పరిచి ఉన్న జుట్టు పొడవెంతో తెలుసా... 110 అడుగులు. అత్యంత పొడవైన డ్రెడ్‌లాక్స్ (చిక్కులు పడిన జుట్టు) కలిగిన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది ఫ్లోరిడాకు చెందిన ఆశా మండేలా. 40 ఏళ్లుగా ఈ జుట్టు పెంచుతున్న ఆమె... 19 అడుగుల ఆరున్నర అంగుళాల పొడవు డ్రెడ్‌లాక్స్ ఉన్న మహిళగా 2009 నవంబర్ 11లోనే గిన్నిస్ రికార్డు సాధించింది.
14 ఏళ్ల తరువాత 110 అడుగుల పొడవైన జుట్టుతో తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ఆధ్యాత్మిక శోధనలో భాగంగానే ఈ జుట్టు పెంచానని, అది తన జీవితాన్నే మార్చేసిందంటుంది ఆశా మండేలా. ఆ ముడులను డ్రెడ్‌గా పిలవడానికి ఇష్టపడదు.. అది తన కిరీటమని చెబుతుంది. అంత పొడవైన జుట్టు.. మెయింటెనెన్స్ కష్టం కదా! అంటే? కిందపడకుండా సిల్క్ క్లాత్‌లో చుట్టేసుకుంటుంది. ఆ హెయిర్‌ను ఒక్కసారి వాష్ చేయాలంటే ఆరు షాంపూ బాటిల్స్ అయిపోతాయి. ఇక ఆరడానికి పట్టే సమయం రెండు రోజులు!
Comments
Please login to add a commentAdd a comment