లక్నో: కురులు ఆడవారికి మరింత అందాన్ని తీసుకొస్తాయి. అందుకే పొడవాటి కేశాల కోసం ప్రయత్నిస్తుంటారు. కానీ ఎలాంటి ప్రయత్నం చేయకుండానే యూపీలో ఓ మహిళ ఏకంగా 7 పీట్ల 9 ఇంచుల పొడవైన జుట్టును కలిగి ఉంది. ఇంతటి భారీ కేశాలతో ఏకంగా గిన్నీస్ రికార్డ్‌ను సాధించింది.
స్మితా శ్రీవాస్తవ(46) ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళ. ఆమె తన 14వ ఏట నుంచి జుట్టును కత్తిరించలేదు. అప్పటి నుంచి ఆమె జుట్టు క్రమంగా పెరగసాగింది. ప్రస్తుతం ఆమె జుట్టు 7 పీట్ల 9 ఇంచుల పొడవు ఉంది. ఇంతటి స్థాయిలో కేశాలను కలిగి ఉండటంతో ప్రపంచ రికార్డ్‌ను కైవసం చేసుకుంది.
"భారతీయ సంస్కృతిలో దేవతలకు చాలా పొడవాటి జుట్టు ఉంటుంది. మన సమాజంలో జుట్టు కత్తిరించడం అశుభం అని భావిస్తారు. అందుకే మహిళలు జుట్టును పెంచుకునేవారు. పొడవాటి జుట్టు మహిళల అందాన్ని పెంచుతుంది." అని స్మిత వివరించారు.
ఈ జుట్టుకు తాను ప్రతి వారం రెండు సార్లు శుభ్రం చేస్తానని స్మిత చెప్పారు. జుట్టును శుభ్రం చేసిన ప్రతిసారి దాదాపు మూడు గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు. తన పొడవాటి జుట్టును చూసి చాలా మంది సెల్ఫీ తీసుకుంటారని చెబుతోంది. ప్రస్తుతం గిన్నీస్ రికార్డ్ సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తోంది.
ఇదీ చదవండి: యూపీ అబ్బాయి.. డచ్ అమ్మాయి.. ఖండాంతరాలు దాటిన ప్రేమ
Comments
Please login to add a commentAdd a comment