
ఈల పాటలు వినే ఉంటారు. కానీ ఇలాంటి ఈల పాట విని ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే? ఇలా ఎవ్వరూ ట్రై చేసి ఉండి ఉండరు కూడా. వింటే ఇలా కూడా ఈల వేస్తారా అని ఆశ్చర్యోవడం ఖాయం.!
ఈలపాట పాడటం అంత ఈజీ కాదు. చాలామంది హుషారుగా ఉన్నప్పుడు ఏదో కొద్ది క్షణాల సేపు ఈలతో కూనిరాగాలు తీస్తుంటారు గాని, పూర్తిపాటను శ్రుతిలయలు తప్పకుండా పాడలేరు. అలా పాడగలిగే వారు చాలా అరుదు. అందుకే ఈలపాట కచేరీలు చేసేవారిని అంతా అబ్బురంగా చూస్తారు. ఆరితేరిన ఈలపాట గాయకులు సైతం నోటితో ఈలవేసే బాపతే గాని, వారెవరూ ముక్కుతో ప్రయత్నించలేదు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న కెనడియన్ యువతి మాత్రం ఇంచక్కా ముక్కుతో ఈలపాటలను ఇట్టే పాడేస్తోంది. ఈమె పేరు లులు లోటస్. కెనడాలోని ఒంటారీయోకు చెందిన ఈమె ముక్కు దగ్గర మైకుపెట్టుకుని పాడుతుంటే జనాలు ఉర్రూతలూగుతారు. ముక్కు ద్వారా 44.1 డెసిబల్స్ ధ్వనితో ఈలపాటలు పాడగలగడమే ఈమె ప్రత్యేకత. ఈ ప్రత్యేకతే ఈమెను గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించింది.
(చదవండి: ఆ కవలలు పుట్టగానే వేరయ్యారు! మళ్లీ 19 ఏళ్ల తర్వాత..)
Comments
Please login to add a commentAdd a comment