రూ. 15 కోసం మహిళ ముక్కును తెగనరికి.. | Miscreants Attack on Woman and Cut Her Nose | Sakshi
Sakshi News home page

రూ. 15 కోసం మహిళ ముక్కును తెగనరికి..

Published Sat, Nov 2 2024 12:33 PM | Last Updated on Sat, Nov 2 2024 1:19 PM

Miscreants Attack on Woman and Cut Her Nose

అరారియా: ఒక్కోసారి చిన్నపాటి వివాదాలే దారుణాలకు దారి తీస్తుంటాయి. ఇటువంటి ఉందంతం బీహార్‌లోని అరారియాలో చోటుచేసుకుంది. కేవలం రూ. 15 కోసం ఒక ప్రబుద్ధుడు ఒక మహిళ ముక్కును తెగనరికాడు.  

మీడియాకు అందిన వివరాల ప్రకారం బాధితురాలి పిల్లలు ఏదో ఒక దుకాణానికి వెళ్లి అక్కడ చిప్స్ వగైరా కొనుగోలు చేశారు. అయితే ఆ మహిళ వద్ద చిల్లర డబ్బులు లేవని, బకాయి ఉన్న మొత్తాన్ని తర్వాత చెల్లిస్తానని దుకాణదారునికి హామీ ఇచ్చింది. ఈ విషయమై ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలై కొద్దిసేపటికే పెద్ద గొడవకు దారితీసింది. ఇంతలో  ఆ దుకాణం యజమాని ఆ మహిళపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె ముక్కు కోసుకుపోయింది. ఈ ఘటన ఫోర్బ్స్‌గంజ్ బ్లాక్‌లోని వార్డు నంబర్ ఆరులో చోటుచేసుకుంది.

హలీమా ఖాతూన్, రోష్ని, సోనీతో పాటు నిందితుడి కుటుంబ సభ్యులు తన కుమార్తెపై దాడి చేశారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో తన కుమార్తె ముక్కుకు తీవ్ర గాయమయ్యిదని తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. తన కుమార్తెకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లి పోలీసులను కోరుతున్నారు. 

ఇది కూడా చదవండి: 1,101 మంది మహిళలు.. ఒకే రంగు చీరతో కాళీ పూజలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement