శరీరంలో కొన్ని అవయవాలు కోల్పోతే ట్రాన్స్‌ప్లాంట్ చేయడం పరిపాటే. కొన్ని అవయవాలు ట్రాన్స్‌ప్లాంట్ చేయడమనేది కాస్త క్రిటికల్. కానీ క్యాన్సర్ కారణంగా ముక్కుని కోల్పోయిన ఒక మహిళకు అత్యంత అరుదైన శస్త్ర చికిత్సతో విజయవంతంగా ముక్కుని ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. వైద్య ప్రక్రియలోనే ఇదోక అద్భతమైన చికిత్స విధానమనే చెప్పాలి.
వివరాల్లోకెళ్తే...ఫ్రాన్స్‌లోని టౌలౌస్‌కు చెందిన ఒక మహిళ 2013లో నాసిక కుహరం క్యాన్సర్ కారణంగా ముక్కున్ని కోల్పోయింది. దీంతో ఆమె అవయవం లేకుండానే కొన్ని ఏళ్లు గడిపింది. అయితే ఒక సరికొత్త వైద్య విధానం ద్వారా కొత్త ముక్కును పొందగలిగింది. అదీకూడా అమె చేతిపైనే పెరిగిన ముక్కుతో. అదేలా సాధ్యం అని సందేహం తలెత్తుంది కదా. కానీ సాధ్యమే అంటూ చేసి చూపించారు ఫ్రాన్స్ సర్జన్లు.
ఈ మేరకు వైద్యులు మృదులాస్థి స్థానంలో త్రీడీ ప్రింటెడ్ బయోమెటీరియల్‌తో తయారు చేసిన ముక్కును ఆమె ముంజేయికి అమర్చి పరీక్షిస్తారు. ఏకంగా రెండు నెలలు పాటు వైద్య పరికరంతో కూడిన ముక్కును అలా ఉంచి పెరిగిన తర్వాత ముఖానికి ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. చేతిలోని రక్తనాళాలు ముఖంలోని రక్త నాళాలతో అనుసంధానం చేసి సర్జరీ చేశారు. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి సర్జరీని చేయలేదు. ఇది ఎముక పునర్నిర్మాణంలో ప్రత్యేకత కలిగిన బెల్జియన్ వైద్య పరికరాల తయారీదారు సెర్హమ్ వైద్య బృందాల సహకారంతో ఈ సర్జరీని విజయంతంగా చేసినట్లు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment