arm
-
ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఏది ఎందులో?
చాలారోజుల ఓటీటీలు కళకళలాడిపోతున్నాయి. ఎందుకంటే ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు హిట్ సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేశాయి. వీటిలో ఎన్టీఆర్, రజనీకాంత్, సమంత.. ఇలా స్టార్ హీరోహీరోయిన్లు నటించిన పలు చిత్రాలు ఉండటం విశేషం. ఇవన్నీ ఒకటి రెండు రోజుల్లో ఓటీటీల్లోకి రావడంతో మూవీ లవర్స్ ఉబ్బితబ్బిబయిపోతున్నారు. ఇంతకీ ఏది ఏ ఓటీటీలో ఉందంటే?దేవరఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ 'దేవర'.. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తీసిన ఈ సినిమాలో ఫైట్స్, సాంగ్స్ అదిరిపోయాయి. జాన్వీ కపూర్ అందాల గురించి చెప్పేదేముంది. సినిమా చూస్తే మీరే ఫిదా అయిపోతారు. అక్కడక్కడ చిన్న లోపాలు ఉన్నప్పటికీ తారక్-అనిరుధ్ తమదైన శైలిలో అదరగొట్టేశారు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్)వేట్టయన్రజనీకాంత్, అమితాబ్, రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియన్.. ఇలా బోలెడంత మంది స్టార్స్ నటించిన 'వేట్టయన్'.. అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. ఫేక్ ఎన్ కౌంటర్ అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా.. థియేటర్లలో తెలుగు వరకు అంతంత మాత్రంగానే ఆడింది. ఓటీటీలో కాబట్టి ఆడుతూపాడుతూ చూసేయొచ్చు.జనక అయితే గనకయంగ్ హీరో సుహాస్ లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. పిల్లలు వద్దనుకునే ఓ మధ్య తరగతి వ్యక్తి.. తండ్రి అయ్యాయని తెలిసి కండోమ్ కంపెనీపై కేసు పెడతాడు. ఏకంగా కోటి రూపాయల దావా వేస్తాడు. బోల్డ్ సబ్జెక్టే కానీ డైరెక్టర్ బాగానే డీల్ చేశారు. కాకపోతే కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఓటీటీలోనే కాబట్టి ఓ లుక్ వేయొచ్చు.(ఇదీ చదవండి: ‘జితేందర్ రెడ్డి’ మూవీ రివ్యూ)సిటాడెల్: హనీబన్నీసమంత నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ఇది. ఆరు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్.. అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సిరీస్‌పై మిశ్రమ స్పందన వచ్చింది. ఇందులో సమంత లిప్ లాక్ కూడా ఇచ్చేసింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.ఏఆర్ఎమ్ఇది మలయాళ డబ్బింగ్ సినిమా. పీరియాడికల్ కాన్సెప్ట్‌తో తీశారు. '2018' మూవీతో మనకు కాస్త పరిచయమైన టొవినో థామస్ హీరో. హాట్‌స్టార్‌లో ప్రస్తుతం తెలుగులోనే అందుబాటులో ఉంది. కాస్త టైముంది డిఫరెంట్‌గా ఏదైనా చూద్దామనుకుంటే దీన్ని ప్రయత్నించొచ్చు. ఇలా ఈ వీకెండ్లో ఐదు సినిమాలు డిఫరెంట్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు) -
ఓటీటీలో పాన్ ఇండియా సినిమా స్ట్రీమింగ్
మలయాళ నటుడు టొవినో థామస్- కృతిశెట్టి జోడీగా నటించిన కొత్త సినిమా 'ఏఆర్ఎం' (అజయంతే రంధం మోషణమ్) (ARM). సెప్టెంబర్ 12న పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది. జితిన్ లాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సురభి లక్ష్మి, ఐశ్వర్య రాజేష్, రోహిణి వంటి వారు నటించారు. మిన్నల్ మురళి, 2018 వంటి డబ్బింగ్ చిత్రాలతో టొవినో థామస్‌కు టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు ఉంది.టొవినో థామస్‌కు 50వ చిత్రంగా విడుదలైన 'ఏఆర్ఎం' భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్లకు పైగానే రాబట్టింది. ఇంతటి విజయాన్ని దక్కించుకున్న ఈ చిత్రం నవంబర్ 8న ఓటీటీలో విడుదల కానుందని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తెలిపింది. మలయాళంతో పాటు తెలుగు,తమిళ్,కన్నడ,హిందీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది.వేర్వేరు కాలాల్లో సాగే మూడు తరాల కథ ఇది. డైరెక్టర్ జితిన్‌లాల్‌కు ఇదే తొలి చిత్రమైనప్పటికీ తెరకెక్కించిన తీరు చాలా బాగుంటుంది. నిధి అన్వేషణతో కూడిన ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ను ప్రేక్షకులకు అద్భుతంగా చూపించాడు. ఈ మూవీకి ప్రధాన బలం కూడా ఇదే కావడం విశేషం. 90ల కాలం నాటి అమ్మాయిగా కృతిశెట్టి పాత్ర ఆకట్టుకుంటుంది. -
మా కెరీర్ కు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్
-
మూడు పాత్రలు సవాల్‌గా అనిపించింది: టోవినో థామస్
‘‘ఏఆర్ఎమ్’ సినిమా మొదలుపెట్టినప్పుడు నటుడిగా ఇది నా 50వ చిత్రం అవుతుందనుకోలేదు. ఎగ్జయిటింగ్ స్క్రిప్ట్ ఇది. ఈ చిత్రంలో మూడు వైవిధ్యమైన పాత్రలు చేయడం పెద్ద సవాల్‌గా అనిపించింది. అయితే ఈ మూడు పాత్రలు దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి’’ అని హీరో టోవినో థామస్ అన్నారు. జితిన్ లాల్ దర్శకత్వంలో టోవినో థామస్ హీరోగా కృతీ శెట్టి, ఐశ్వర్యా రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఏఆర్ఎమ్’. డా. జకారియా థామస్‌తో కలిసి లిస్టిన్ స్టీఫెన్ నిర్మించిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. తెలుగులో ఈ నెల 12న మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా టోవినో థామస్ మాట్లాడుతూ– ‘‘చిన్న నటుడిగా నా కెరీర్ ఆరంభించాను. సపోర్టింగ్, కామెడీ, విలన్ రోల్స్ చేశాను. 2016 నుంచి లీడ్ రోల్స్ చేస్తున్నా. నటుడు కావాలనేది నా కల... ఇప్పుడు ఆ కలలో జీవిస్తున్నాను. ‘అజాయంతే రందం మోషణం’ (ఏఆర్ ఎమ్) అంటే అజయన్ రెండో దొంగతనం అని అర్థం. మిగతా భాషల వారికి ఈ పేరు పలకడం ఇబ్బందిగా ఉంటుందని ‘ఏఆర్ఎమ్’గా పిలుస్తున్నాం. యూనివర్సల్‌గా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. మైత్రీ లాంటి టాప్ డిస్ట్రిబ్యూటర్స్ మా సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
వీధి కుక్క దాడిలో చేతిని కోల్పోయిన మహిళ..ట్విస్ట్ ఏంటంటే..?
ఒక్కోసారి మనం ఆశ్రయం కల్పించిన జంతువులే మనపై దాడి చేస్తాయి. అలా జరుగతుందన్న ఊహ కూడా రాదు. అలాంటి స్థితిలోనూ సంయమనం కోల్పోకుండా వ్యవహరించి సానూకూలదృక్పథంతో మాట్లాడటం కొందరికే సాధ్యం. అలాంటి కోవకు చెందింతే ఈ మహిళ. తాను ఆశ్రయకల్పిస్తున్న వీధికుక్కల్లో ఒక్క కుక్క ఆమె దారుణంగా దాడి చేసింది. ఎంతలా అంటే.. ఆ దారుణ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి కోమాలోకి కూడా వెళ్లిపోయింది. అసలేం జరిగిందంటే..అమెరికాకు చెందిన కాలిస్టా మునోజ్ అనే 25 ఏళ్ల మహిళ తన వద్ద ఆశ్రయం పొందుతున్న వీధికుక్కే ఆమెపై దాడి చేసి గాయపరిచింది. ఈ దిగ్బ్రాంతికర ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయింది. చివరకి తన చేతిని కూడా కోల్పోయింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ..తాను ఆ వీధి కుక్కను తీసుకొచ్చి షెల్టర్‌లో ఉంచేంతవరకు కూడా చాలా రోజుల వరకు నార్మల్‌గానే ఉందని. మరో కుక్కతో గొడవ పడవడంతో ఒక్కసారిగా కర్కశంగా మారి ఇలా తనపై దాడి చేసిందని చెప్పుకొచ్చారు మునోజ్. అయితే ఈ దాడిలో ఈ కుక్క తన చేతిపై ఘోరంగా దాడి చేయడంతో స్ప్రుహతప్పి పడిపోయానని తెలిపింది. ఆ తర్వాత తాను ఆస్పత్రిలోనే నెల రోజులపాటు ఉండాల్సి వచ్చిందని వెల్లడించింది. అంతేగాదు తాను చాల రోజుల వరకు కోమాలో ఉన్నట్లు పేర్కొంది. అయితే కుక్క దారుణంగా దాడి చేయండంతో తీవ్ర ఇన్ఫెక్షన్కి గురై తన కుడి చేతిని కూడా కోల్పోవాల్సి వచ్చిందని వెల్లడించిది. ఈ ఘటన వల్ల తాను ఇంతలా బాధ పడినప్పటికీ ఆ కుక్కను మాత్రం నిందించనని చెబుతోంది. ఇది విషాదంతో కూడిన గొప్ప అనుభవం, పైగా మరొకరికి తన అనుభవం పనికొస్తుందని చాలా సమన్వయ దృక్ఫథంతో మాట్లాడింది. కాగా, సదరు మహిళ ఎన్నో వీధికుక్కలకు, పిల్లులకు షెల్టర్లు ఏర్పాటు చేసి వాటి సంరక్షణ బాధ్యతలు చూస్తుంది. ప్రతి పైసా కూడా వాటి సంరక్షణ కోసం ఖర్చుపెడుతుందని గో ఫండ్ మీ అనే స్వచ్ఛంద వెబ్సైట్ పేర్కొంది. ఈ వెబ్సైట్లో అమానుషంగా గాయపడినవారు లేదా నయంకానీ వ్యాధితో బాధపడుతున్నవారికి సాయం అందించే స్వచ్ఛంధ వెబ్సైట్. ఇలాంటి ఘటనలు మనుషుల నుంచి కూడా ఎదురవ్వుతాయి. ఇక్కడ జంతువులకు విచక్షణ జ్ఞానం ఉండదు, పైగా వాటికున్న సహజగుణంతో దాడి చేయడం జరగుతుంది. కానీ అన్నీ తెలిసిన మనుషులు సైతం జంతువుల కన్న ఘోరంగా ప్రవర్తిస్తున్న ఘటనలు కోకొల్లలు. సాయం చేసిన వారికే వెన్నుపోటు పొడడవడం, ఇబ్బందులకు గురిచేయడం వంటివి చేస్తారు కొందరు దుర్మార్గులు. ఇలాంటి ఘటనల కారణంగా ఒక్కసారిగా మంచిగా ఉండేవారు సైతం చెడ్డగా మారిపోతుంటారు. ఇక్కడ సమన్వయంతో కూడిన సానుకూలద ృక్పథాన్ని పెంపొందించుకోవడానికి యత్నించాలి. అంతేగాదు హాని చేసే అలవాటు వారిదే గానీ నాది కాదు అని మనస్తతత్వాన్ని అవరచుకోవాలేగానీ ప్రతి ఘటనకు పాల్పడకూడదు. ఇలా వ్యవహరిస్తే ఏదో ఒక రోజు ఆయా మనుషుల్లో పశ్చాతాపంతో కూడిన మార్పు తప్పక వస్తుంది. ఆ చేదు ఘటనలతో మన వైఖరి మారిపోకూడదనే విషయం ఈ మహిళ వ్యవహరించిన తీరు చెప్పకనే చెబుతోంది కదూ!. (చదవండి: ఎవరీ ఉమ్ముల్ ఖేర్? ఏకంగా 16 ఫ్రాక్చర్లు 8 శస్త్ర చికిత్పలు అయినా..) -
పెళ్లికి ముందు భర్త చేసిన పనికి షాక్ అయిన హన్సిక
దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ హన్సిక. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ భామ ఆ తర్వాత తెలుగులో దేశముదురు, మస్కా, కందిరీగ ఇలా పలు సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న హన్సిక ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సోహెల్ కతూరియా అనే ఓ బిజినెస్ మెన్ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక వీరి పెళ్లి వేడుకను లవ్ షాదీ డ్రామా పేరుతో ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.తమ పెళ్లి జర్నీని డాక్యుమెంటరీగా తీసి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లికి ముందే సోహల్ హన్సిక పేరును తన చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. టాటూ వేసే సమయంలో ఆయన హన్సికకు వీడియో కాల్ చేయగా సోహెల్ చేసిన పనికి హన్సిక షాక్ అయ్యింది. ఓ ఇంజెక్షన్ తీసుకోవడానికే చాలా బాధపడతాను. అలాంటిది సోహెల్ నా పేరుమీద టాటూ వేయించుకున్నాడు అని చెబుతూ హన్సిక ఎమోషనల్ అయ్యింది. View this post on Instagram A post shared by StarPlus (@starplus) -
అన్ కండిషనల్ లవ్
మాఫియా దాడిలో తన వారందరినీ పోగొట్టుకుందా గొరిల్లా. రెండు నెలల పసికందుగా నేషనల్ పార్క్ రేంజర్‌కు దొరికింది. ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నాడు రేంజర్ ఆండ్రే బవుమా. 13 ఏళ్లపాటు కంటికిరెప్పలా కాపాడాడు. ఆ నిస్వార్థ ప్రేమకు ప్రతిరూ పం ఈ చిత్రం. అనారోగ్యంతో ఉన్న ఆ గొరిల్లా తన ఆఖరి గడియ ల్లోనూ రేంజర్‌ను వదిలిపెట్టలేదు. అతని ఒడిలోనే శాశ్వతంగా కన్ను మూసింది. కాంగోలోని విరుంగా నేషనల్ పార్క్‌లో ఫొటో జర్నలిస్ట్ బ్రెంట్ స్టిర్టన్ తీసిన ఈ చిత్రం... ఫొటో జర్నలిజం కేటగిరీలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్–2022 అవార్డును దక్కించుకుంది. -
వాట్! చేతిపై 'ముక్కు' పెరగడమా? దాంతో ట్రాన్స్‌ప్లాంట్!
శరీరంలో కొన్ని అవయవాలు కోల్పోతే ట్రాన్స్‌ప్లాంట్ చేయడం పరిపాటే. కొన్ని అవయవాలు ట్రాన్స్‌ప్లాంట్ చేయడమనేది కాస్త క్రిటికల్. కానీ క్యాన్సర్ కారణంగా ముక్కుని కోల్పోయిన ఒక మహిళకు అత్యంత అరుదైన శస్త్ర చికిత్సతో విజయవంతంగా ముక్కుని ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. వైద్య ప్రక్రియలోనే ఇదోక అద్భతమైన చికిత్స విధానమనే చెప్పాలి. వివరాల్లోకెళ్తే...ఫ్రాన్స్‌లోని టౌలౌస్‌కు చెందిన ఒక మహిళ 2013లో నాసిక కుహరం క్యాన్సర్ కారణంగా ముక్కున్ని కోల్పోయింది. దీంతో ఆమె అవయవం లేకుండానే కొన్ని ఏళ్లు గడిపింది. అయితే ఒక సరికొత్త వైద్య విధానం ద్వారా కొత్త ముక్కును పొందగలిగింది. అదీకూడా అమె చేతిపైనే పెరిగిన ముక్కుతో. అదేలా సాధ్యం అని సందేహం తలెత్తుంది కదా. కానీ సాధ్యమే అంటూ చేసి చూపించారు ఫ్రాన్స్ సర్జన్లు. ఈ మేరకు వైద్యులు మృదులాస్థి స్థానంలో త్రీడీ ప్రింటెడ్ బయోమెటీరియల్‌తో తయారు చేసిన ముక్కును ఆమె ముంజేయికి అమర్చి పరీక్షిస్తారు. ఏకంగా రెండు నెలలు పాటు వైద్య పరికరంతో కూడిన ముక్కును అలా ఉంచి పెరిగిన తర్వాత ముఖానికి ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. చేతిలోని రక్తనాళాలు ముఖంలోని రక్త నాళాలతో అనుసంధానం చేసి సర్జరీ చేశారు. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి సర్జరీని చేయలేదు. ఇది ఎముక పునర్నిర్మాణంలో ప్రత్యేకత కలిగిన బెల్జియన్ వైద్య పరికరాల తయారీదారు సెర్హమ్ వైద్య బృందాల సహకారంతో ఈ సర్జరీని విజయంతంగా చేసినట్లు వైద్యులు తెలిపారు. (చదవండి: నర్వ్ స్టిమ్యులేషన్‌తో... పక్షవాతానికి చెక్!) -
నమ్మలేని నిజం.. 10 ఏళ్లకుపైగా ఎత్తిన చేతిని దించలేదు..!
మీ చేతిని పైకి ఎత్తి ఎంత సమయం వరకు ఉండగలరు? మహా అయితే ఓ 10-20 నిమిషాలు అతి కష్టంతో పైకి ఎత్తి ఉంచగలరేమో. కానీ, గంటలు కాదు, రోజులు కాదు.. ఏళ్ల తరబడి ఎత్తిన చేతిన దించకుండా ఉండటం అంటే నమ్మశక్యంగా లేదు కదా. అయితే, అది నిజం. ఓ సాధువు దానిని గతంలోనే చేసి చూపించారు. 70 ఏళ్ల సాధువు అమర్ భర్తీ.. సుమారు 50 ఏళ్లకుపైగా తన కుడి చేతిని పైకే ఎత్తి ఉంచినట్లు అప్పట్లో తెగవైరల్గా మారింది. తొలి రెండేళ్లు తీవ్రంగా నొప్పి ఉండేదటా! కానీ అది క్రమంగా తగ్గిపోయిందని, ఆ తర్వాత ఎలాంటి నొప్పిలేదని సాధువు అమర్ భర్తీ వెల్లడించారు. మరోవైపు.. ఆ చేతికి రక్త ప్రసరణ పూర్తిగా నిలిచిపోవటం వల్లే ఎలాంటి నొప్పి కలగటం లేదని, ఇకపై ఆ చేతిని కిందకు దించలేదని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. 1973 వరకు అమర్ భర్తీ ఒక సాధారణ వ్యక్తే. అందరిలా వివాహం చేసుకుని పిల్లాపాలతో జీవించేవారు. ఆ తర్వాత తన జీవితాన్ని శివుడికి అంకితం చేయాలని నిశ్చయించుకుని సాధువుగా మారారు. తనలోని శివుడిపట్ల ఉన్న నిబద్ధతను చాటుకునేందుకు కుడి చేతిని పైకి ఎత్తి ఉంచటం మొదలు పెట్టారు. భర్తీ అంశం 2020లోనే వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే భర్తీ లాగే మరో వ్యక్తి చేతిని పైకి ఎత్తి ఉంచుతుండటం వెలుగులోకి వచ్చింది. అమర్ భర్తీ 50 ఏళ్ల రికార్డును బ్రేక్ చేయలేకపోయినా.. తనకు సాధ్యమైనంత మేరకు చేతిని పైకి ఎత్తే ఉంచుతానని చెబుతున్నారు. గత 10 ఏళ్లుగా చేతిని పైకి ఎత్తే ఉంచానని వెల్లడించారు. ఓ రిపోర్టర్ సాధువుతో మాట్లాడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఎన్ని రోజుల పాటు ఇలా చేతిని పైకి ఎత్తి ఉంచుతారని విలేకరి ప్రశ్నించగా.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. చేతిని పైకి ఉంచే నిద్రపోతానని, ఆ సమయంలోనూ ఎలాంటి ఇబ్బంది కలిగినట్లు అనిపించదని తెలిపారు. Guy from India hasen't put his arm down for 10 Years to honor his God 😱#amazing #india #pandit #guru #sacrifice #ENGvIND @unexpected_new pic.twitter.com/ldAVoXpMJi — Next Level (@NextInteresting) September 24, 2022 ఇదీ చదవండి: Viral Video: హీరో లెవల్లో యువకుడి బైక్ స్టంట్.. ఝలక్ ఇచ్చిన పోలీసులు -
ఆర్టీసీ బస్సులో నిద్రలోకి జారుకున్న మహిళ.. తెగిపడిన చేయి..
వీరఘట్టం(పార్వతీపురం మన్యం జిల్లా): అతివేగంతో వస్తున్న ఆటో బస్సును రాసుకుంటూ వెళ్లిపోవడంతో ఓ ప్రయాణికురాలి చేయి తెగి పడిపోయిన సంఘటన వీరఘట్టంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వీరఘట్టం మండలం నడిమికెల్లకు చెందిన పేలూరి పైడితల్లి శనివారం ఉదయం శ్రీకాకుళంలోని ఆస్పత్రికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం నుంచి పాలకొండ వరకు త్రీ స్టాప్ బస్సులో వచ్చింది. చదవండి: ఎస్ఐ మృతిపైనా ‘పచ్చ’ రాజకీయమే! అక్కడ నుంచి పార్వతీపురం వెళ్తున్న పల్లెవెలుగు బస్సు ఎక్కి డ్రైవర్ వెనుక ఉండే మూడో సీట్లో విండో పక్కన కూర్చుంది. బస్సు వీరఘట్టం వట్టిగెడ్డ వంతెన దాటిన తర్వాత పైడితల్లి చేయిని బయటకు పెట్టి నిద్రలోకి జారుకుంది. అక్కడకు కొద్దిసేపటికి బస్సు జిల్లా పరిషత్ హైసూ్కల్‌కు చేరుకునే సరికి ఎదురుగా అతివేగంతో వస్తున్న ఆటో.. బస్సును రాసుకుంటూ పోవడంతో ఆటో పైనుండే రాడ్ తగిలి పైడితల్లి చేయి తెగి పడిపోయింది. వెంటనే బాధితురాలు కేకలు వేయడంతో బస్సుని నిలిపివేశా రు. సహచర ప్రయాణికులు బాధితురాలిని వీరఘట్టం సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అ నంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. -
ఉక్రెయిన్ వార్: తండ్రిని కోల్పోయినా నిందించని గొప్పగుణం
Russian Invasion Girl Lost Her Father and Arm: ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న రోజుల తరబడి పోరులో వేలాదిమంది ఉక్రెయిన్ పౌరులు, చిన్నారులు మరణిస్తున్నారు. లక్షలాదిమంది ఉక్రెయిన్‌ని విడిచి వలస వెళ్తున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది ఉక్రెయిన్ వాసులు.. మిలటరీలో చేరి తమ దేశాన్ని కాపాడుకుంటామంటూ ముందుకువచ్చారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులనే భేదం లేకుండా తమ భూభాగంలో జరుగుతున్న పోరులో పాల్గొనేందుకు ఉత్సుకతను కనబర్చారు. అంతేకాదు ఉక్రెయిన్‌వాసుల దేశభక్తి స్ఫూర్తి ప్రపంచ దేశాల ప్రశంసలను అందుకుంటుంది. ఇందంతా ఒక ఎత్తు అయితే రష్యా దాడిలో సాషా అనే 9 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడటమే కాక తండ్రిని కోల్పోయింది. అయినా ఇదంతా అనుకోకుండా జరిగిందని చెప్పిందే తప్ప రష్యన్లు ఒక మాట కూడా అనలేదు. ఆ దాడిలో ఆమె చేతికి ఒక బుల్లెట్ దిగింది. ఆ చిన్నారి కుటుంబం హాస్టమెల్ నుంచి బయలుదేరుతున్నప్పుడూ రష్యన్ దళాల కాల్పుల్లో చిక్కుకుంది. ఆ కాల్పుల్లో చిన్నారి తండ్రి అక్కడకక్కడే మరణించాడు. దీంతో చిన్నారి తల్లి, సోదరి సెల్లార్లోకి పారిపోతుండగా.. ఆ చిన్నారి ఎడమ చేతికి బుల్లెట్ దిగింది. దీంతో ఉక్రెయిన్ సైన్యం వారిని రక్షించి ఆ చిన్నారిని ఆసుపత్రిలో జాయిన్ చేసింది. అయితే వైద్యుల శస్త్ర చికిత్సలో భాగంగా ఆమె చేతిని తొలగించాల్సి వచ్చింది. కానీ ఆ చిన్నారి మాత్రం రష్యా దళలు మాపై కావాలని దాడి చేశారని అనుకోవడం లేదని చెప్పింది. పైగా ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని చెప్పిందే తప్ప రష్యా బలగాలను నిందించలేదు. ఉక్రెయిన్ వాసుల మనసు చాలా విశాలమైనది అని నిరూపించింది. (చదవండి: విద్యార్థిని మెడపై మోకాలితో నొక్కి, చేతులను కట్టి.. వీడియో వైరల్) -
బర్త్‌డే పార్టీలో ఇంజక్షన్.. చేయి తొలగించిన వైద్యులు
బెంగళూరు: వాలీబాల్ కోచ్ పుట్టిన రోజు వేడుకలు హాజరయ్యాడు ఓ మైనర్ కుర్రాడు. ఫ్రెండ్స్ అంతా బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఎవరింటికి వారు వెళ్లిపోయారు. కొద్ది రోజుల వరకు బాగానే ఉంది. ఆ తర్వాత యువకుడి చేయి బాగా వాయడంతో ఆస్పత్రికి వెళ్లాడు. అతడిని పరీక్షించిన వైద్యులు అతడి చేయి తొలగించారు. ఇంతకు ఆ పుట్టిన రోజు వేడుకల్లో ఏం జరిగింది.. ఎందుకు చేయి తొలగించాల్సి వచ్చింది వంటి వివరాలు తెలియాలంటే.. బెంగళూరుకు చెందిన ఓ మైనర్ కుర్రాడు కొద్ది రోజుల క్రితం వాలీబాల్ కోచ్ పుట్టిన రోజు సందర్భంగా చంపరాజేట్ ప్రాంతంలో జరిగిన బర్త్‌డే పార్టీకి హాజరయ్యాడు. నాలుగు రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత చేయి బాగా వాచింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు మైనర్ కుర్రాడిని సంజయ్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాధితుడిని పరీక్షించిన వైద్యులు.. బాలుడి శరీరంలో డ్రగ్స్, విష పదర్ధాలు ఉన్నాయని.. అందువల్లే చేయి వాచిందని తెలిపారు. వెంటనే ఆపరేషన్ చేసి చేయి తొలగించకపోతే మైనర్ కుర్రాడి ప్రాణాలకే ప్రమాదం అని సూచించడంతో తల్లిదండ్రులు అందుకు అంగీకరించారు. ఆస్సత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత బాధితుడిని అసలు ఏం జరిగిందని ప్రశ్నించగా.. పుట్టినరోజు వేడుకలకు హాజరైన తనకు కోచ్ ఏదో ఇంజక్షన్ చేశాడని తెలిపాడు. కొన్ని మాత్రలను నూరి.. ఆ పొడిని నీటిలో కలిపి.. తనకు ఇంజెక్ట్ చేసినట్లు బాధితుడు వెల్లడించాడు. ఈ క్రమంలో బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: షాకింగ్ న్యూస్: దుష్టశక్తులకు బలివ్వడానికి బాలిక కిడ్నాప్ -
విద్యార్థి చేయి విరగొట్టిన హెడ్మాస్టర్
జ్యోతినగర్: ఓ విద్యార్థి తప్పు చేశాడని హెచ్ఎం కొట్టడంతో సదరు విద్యార్థి చేరుు విరిగిన ఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్‌షిప్‌లోని జిల్లా ప్రజాపరిషత్ పాఠశాలలో జరిగింది. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న రాచర్ల సారుుకృష్ణ అమ్మారుులను అల్లరి చేశాడని ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదుచేశారు. ఈ క్రమంలో ప్రధానోపాధ్యాయుడు కొమురయ్య విద్యార్థిని పిలిపించి మందలించాడు. ఈక్రమంలో కర్రతో కొట్టడంతో ప్రమాదవశాత్తు సారుుకృష్ణ చేరుువిరిగింది. విద్యార్థి తల్లిదండ్రులు పేదవాళ్లు కావడంతో చికిత్స చేరుుంచుకోవడానికి డబ్బులు లేక.. ఓ చిన్న వైద్యుడి వద్ద కట్టుకట్టించుకున్నారు. కాగా ప్రధానోపాధ్యాయులు కొమురయ్య వివరణ కోరగా.. ‘సారుుకృష్ణ పాఠశాలలోని అమ్మారుులను అల్లరి చేస్తున్నట్లు ఫిర్యాదు అందింది. దానిలో భాగంగా విద్యార్థిని పిలిచి మందలించాను. చిన్నగా కొట్టిన మాట వాస్తవమే. చికిత్స అవసరం అరుుతే చేరుుస్తాను. కొంతమంది కావాలని నాపై ఆరోపణలు చేరుుస్తున్నారు. వారిపై ఉన్నతాధికారులకు వివరిస్తాను’అని తెలిపారు. -
సాప్ట్ బ్యాంకు చేతికి యూకే చిప్ డిజైనర్
బ్రిటీష్ చిప్ డిజైనర్ ఏఆర్ఎమ్ హోల్డింగ్స్ ను జపనీస్ మల్టీనేషనల్ టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ ఆపరేషన్ల దిగ్గజం సాప్ట్ బ్యాంకు గ్రూప్ కార్పొరేషన్ కొనుగోలు చేయనుంది. దాదాపు 32 బిలియన్ డాలర్లకు (రెండు లక్షల కోట్లకు పైగా) ఈ డీల్ కుదిరినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఈ డీల్ కుదిరితే, యూరోపియన్ టెక్నాలజీలో ఇదే అదిపెద్ద డీల్ అని అధికార వర్గాలు చెబుతున్నాయి.. 2013లో వైర్ లెస్ ఆపరేటర్ స్ప్రింట్ నుంచి కంట్రోలింగ్ స్టేక్ ను 22 బిలియన్ డాలర్లకు(దాదాపు రూ.1,50,000కోట్లకు) సాప్ట్ బ్యాంకు కొనుగోలు చేసింది. అయితే ఈ డీల్ పై సాప్ట్ బ్యాంకు వెంటనే స్పందించలేదు. ఏఆర్ఎమ్ అధికారులు సైతం మార్కెట్ అవర్స్ లో దీన్ని ధృవీకరించలేదు. ఏఆర్ఎమ్.. లండన్ లో అత్యంత విలువైన టెక్ కంపెనీ. మొబైల్ ప్రాసెసింగ్ లో ఎక్కువగా తన కార్యకలాపాలు సాగిస్తుంటోంది. శాంసంగ్, హ్యువాయ్, యాపిల్ వంటి స్మార్ట్ ఫోన్ సంస్థలు, తమ ఇన్ హోస్ డిజైన్డ్ మైక్రోచిప్స్ లో ఈ కంపెనీ ప్రాసెసర్ ను, గ్రాఫిక్స్ వాడుతుంటాయి. సాప్ట్ బ్యాంకు తన ఆస్తులను అమ్ముతూ 14 బిలియన్ డాలర్లను(రూ.93,934 కోట్లకు పైగా) సమీకరించే యోచనలో ఉన్నట్టు గత కొన్ని వారాలుగా ప్రకటిస్తూ వస్తోంది. ఈ ఆస్తులో చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా షేర్లు కూడా ఉన్నట్టు తెలిపింది. అయితే ఇలా సమీకరించిన నగదును రుణసామర్థ్యాన్ని తగ్గించుకోవడానికి వాడతారని మార్కెట్ విశ్లేషకులు అంచనావేశారు. లేదా తన సొంత షేర్లను తిరిగి కొనుగోలు(బైబ్యాక్) చేయడానికి ఉపయోగిస్తుందని భావించారు. వీరి అంచనాలకు తారుమారుగా ఈ జపనీస్ దిగ్గజం, బ్రిటీష్ చిప్ డిజైనర్ ను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటన వెలువడింది. ఈ డీల్ కింద ఒక్క ఏఆర్ఎమ్ షేరుకు సాప్ట్ బ్యాంకు 17 పౌండ్లను నగదు రూపంలో అందించనుందని ఫైనాన్సియల్ టైమ్స్ నివేదించింది. ఇది శుక్రవారం ట్రేడింగ్ కు 40శాతం ప్రీమియమని తెలిపింది. మరోవైపు సోమవారం జపాన్ మార్కెట్ కు సెలవు. -
బీచ్‌లో స్నానం చేద్దామని మహిళ వెళ్లగానే..
ఫ్లోరిడా: ఫ్లోరిడాలో అనూహ్య సంఘటన జరిగింది. బోకా రాటోన్ సముద్ర తీరంలోని బీచ్‌లో సరదాగా స్నానం చేసేందుకు వెళ్లిన ఓ యువతిని ఓ రెండడుగుల షార్క్ చేప అమాంతం కరిచేసింది. దాని పళ్లను పూర్తిగా ఆమె కుడి చేతి మోచేయి, మణికట్టు మధ్య భాగంలో దించి అలాగే కరిచిపట్టుకొని ఉండిపోయింది. దాంతో ఆమె భయంతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పైగా చుట్టుపక్కల వారు ఆమెను సమీపించి ఆ షార్క్‌ను ఎంత విడిపించాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో అక్కడి అత్యవసరం విభాగం 911కు ఫోన్ కాల్ చేయడంతో అగ్నిమాపక సిబ్బంది ఆ బీచ్‌కు చేరుకున్నారు. ఆమె చేతిని అలాగే కరిచిపట్టుకొని ఉన్న ఆ షార్క్ చేపను కొట్టి చంపారు. అయినప్పటికీ అప్పటికే దాని పళ్లు పూర్తిగా ఆమె చేతిలోకి దిగిపోయి ఉండటంతో ఆ షార్క్‌తో సహా ఆస్పత్రికి తీసుకెళ్లారు. 23 ఏళ్ల మహిళకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటనతో అక్కడ బీచ్‌లో సరదాగా గడిపే వారంతా బిత్తరపోయారు. -
మీ చేతి చర్మంపైనే ఆపరేట్ చేయ్యొచ్చు!
లండన్ : మీరు ధరించే స్మార్ట్ వాచ్ స్క్రీన్ చాలా చిన్నదిగా అనిపిస్తుందా..? మీరు దాన్ని పెద్దదిగా చేయాలనుకుంటున్నారా..? అయితే మీ చేతినే టచ్ ప్యాడ్ లాగా మార్చుకోవచ్చట. కార్నెగీ మిలాన్ యూనివర్సిటీకి చెందిన ఫ్యూచర్ ఇంటర్ ఫేస్ గ్రూప్ పరిశోధకులు మన చేతి చర్మాన్ని టచ్ సెన్సార్ గా మార్చుకునే సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం చాలా స్మార్ట్ వాచ్ లు, డిజిటల్ జ్యువెల్లరీ డిమాండ్ ఎక్కువగా ఉంది. అయితే ఇవి చిన్నవిగా ఉండటంతో, యూజర్లకు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఈ సమస్యలన్నింటినీ తొలగించి, యూజర్లను ఎక్కవగా ఆకర్షించేందుకు చర్మాన్ని టచ్ పాడ్ లాగా మార్చి.. ఈ చిన్ని డివైజ్ ల పరిమాణాన్ని పెంచామని పరిశోధకులు తెలిపారు. ఈ డివైజ్ లను 'స్కిన్ ట్రాక్' అని పిలుస్తారు. దీనిలో రెండు భాగాలుంటాయి. ఒకటి సిగ్నల్ ఎమిటింగ్ రింగ్, రెండోది సెన్సింగ్ వ్రిస్ట్ బ్యాండ్. రింగ్ పెట్టుకున్న చేతి వేలిని స్మార్ట్ వాచ్ డివైజ్ ధరించిన చేతిపై కదిలించడం ద్వారా ఎలక్ట్రోకోడ్లను ఉత్పత్తిచేసేలా దీన్ని రూపొందించారు. ఎప్పుడైతే రింగ్ ఉన్న వేలు స్కిన్ ను టచ్ చేస్తుందో, అప్పుడు ఎక్కువ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ యూజర్ చేతిలోకి వెళుతాయి. అప్పుడు స్కిన్ పై వేలిని కదిపిన ప్రతిసారీ, ఎలక్టోకోడ్ ల ఆధారంగా స్మార్ట్ వాచ్ ఆపరేట్ అవుతుంది. చేతిపై లేయర్ పొర లాంటి క్లాత్ ను వేసినా ఈ టెక్నాలజీకి ఎలాంటి ఆటంకం కలుగదు. నొక్కడం, రాయడం, ప్రత్యేక హావభావాలు వంటి ఈ టచ్ స్క్రీన్ సిగ్నల్ లన్నింటినీ స్కిన్ ట్రాక్ గుర్తిస్తుంది. -
కానుకలో చేతివాటం!
అనంతపురం సెంట్రల్ : ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ పంపిణీ కార్యక్రమం గందరగోళంగా తయారైంది. ప్రభుత్వం ముందు చూపులేకుండా ఎవరికో లబ్ధి చేకూర్చేందుకు హడావిడిగా తీసుకున్న నిర్ణయం విమర్శలపాలవుతోంది. చౌక ధాన్యపు కేంద్రాల ద్వారా తెల్లరేషన్ కార్డుదారులందరికీ రూ.241 విలువైన ఆరు రకాల సరుకులు పండుగను పురస్కరించుకుని అందించాలని నిర్ణయించింది. ఇందులో కేజీ శనగలు, కేజీ గోధుమ పిండి, అరకిలో కంది పప్పు, అరకిలో పామాయిల్, అరకిలో బెల్లం, 100 గ్రాముల నెయ్యి అందిస్తున్నారు. జిల్లాలో 10.22 లక్షల మంది తెల్లరేషన్‌కార్డు దారులు ఉన్నారు. వీరికి 2286 చౌకదాన్యపు డిపో కేంద్రాల ద్వారా ఈ ఆరు రకాల వస్తువులు అందజేయాల్సి ఉంది. అయితే పండుగకు కేవలం రెండు రోజులే సమయం ఉన్నా పూర్తి స్థాయిలో సరుకులు చేర్చడంలో రాష్ట్ర వ్యాప్తంగా టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరు చేర్చలేకపోతున్నారు. గోదుమ పిండి 825 మెట్రిక్ టన్నులు(80.74 శాతం), కంది పప్పు 511 మెట్రిక్ టన్నులు (100శాతం), పామాయిల్ 1013 మెట్రిక్ టన్నులు (99 శాతం), శనగలు 1022 మెట్రిక్ టన్నులు (99 శాతం), బెల్లం 516 మెట్రిక్ టన్నులు(100శాతం), నెయ్యి 100 మిల్లీలీటర్ల ప్యాకెట్లు 8.42 లక్షలు (ఇంకా 1.79 లక్షల ప్యాకెట్లు రావాలి) జిల్లా కేంద్రానికి చేరారుు. అరుుతే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. వీటిలో సగం కూడా మండల కేంద్రాలు.. అట్నుంచి గ్రామాలకు వెళ్లలేదు. దీంతో ఏం చేయూలో తోచక అధికారులు ఆందోళనపడుతున్నారు. సరుకులను తెప్పించుకునేందుకు వారం రోజుల నుంచి సివిల్సప్లై డీఎం కార్యాలయ అధికారులు అర్ధరాత్రి వరకై సమీక్షలు జరుపుతున్నా పురోగతి కనిపించడం లేదు. ప్రజాప్రతినిధులు మాత్రం అక్కడక్కడ సరుకులను పంపిణీ చేస్తూ.. అంతా సవ్యంగా పంపిణీ సాగుతోందంటూ ఆర్భాటంగా ప్రకటనలిస్తున్నారు. అర్ధరాత్రి వరకూ తిప్పలు తప్పవా..? జిల్లా వ్యాప్తంగా తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి మంగళవారంలోగా నిత్యవసర సరుకులు అందించాలని ఉత్తర్వులు వచ్చాయి. అవసరమైతే రాత్రివేళల్లో కూడా పంపిణీ చేయాలని మంత్రులు ఆదేశిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న రూ. 241 వస్తువుల కోసం ప్రజలు అర్ధరాత్రి వరకూ ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒక కేంద్రం నడుస్తోంది. దీంతో సరుకులు తీసుకోవడానికి కొన్ని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తూకాల్లో మోసం పేదలకు ఉచితంగా అందిస్తున్న సరుకులను డీలర్లు పక్కదారి పట్టిస్తున్నారనే అరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మండల స్టాకు పాయింట్ల నుంచి బస్తాల్లో వచ్చిన సరుకులను కేజీ, అర కేజీల్లోకి డీలర్లు మారుస్తున్నారు. ఈ సమయంలో ఒక్కో ప్యాకెట్లో 100, 200 గ్రాముల వరకు నొక్కేస్తున్నట్లు తెలుస్తోంది. కళ్యాణదుర్గంలో సోమవారం పంపిణీ చేసిన సరుకుల్లో కొన్నింటిని ‘సాక్షి’ తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. బెల్లం అర కిలో ఇవ్వాల్సి ఉండగా రూ. 350 గ్రాములున్న ఒకే అచ్చు ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో మరో 50, 100 గ్రాముల వరకూ జోడిస్తున్నారు. జిల్లాలోని చాలా ప్రాంతాలకు గోధుమ పిండి, పామాయిల్ చేరలేదు. తాడిపత్రి రూరల్, యాడికి మండలాలకు ఒక కిలో కూడా చేరలేదు. దీంతో మంగళవారం పంపిణీ ప్రక్రియ ఏ విధంగా చేపడతారో తేలాల్సి ఉంది. కొన్ని సరుకులు మళ్లీ ఇస్తాం అని చెప్పి పంపిణీ చేసే అవకాశాలున్నాయని తెలిసింది. సరుకులను కిట్స్ రూపంలో అందించడానికి ప్రత్యేకంగా బ్యాగులను ముద్రించారు. అయితే ఈ బ్యాగులు ఇప్పటి వరకూ కేవలం 2 లక్షలు మాత్రమే జిల్లాకు వచ్చాయి. మరో 3 లక్షల వర కు పసుపు కలర్ కవర్లు అందించారు. మిగిలిన వారు ఇళ్ల నుంచే బ్యాగులు తెచ్చుకోవాల్సి ఉంది. అయితే పండుగ తర్వాత ప్రతి ఇంటికీ బ్యాగులు అందిస్తామని స్వయాన పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది. సరుకులు ఇచ్చేటప్పుడు కాకుండా మళ్లీ ప్రత్యేకంగా బ్యాగుల పంపిణీ అవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టరు ముసుగులో ఉన్న తెలుగు తమ్ముళ్లకు లబ్ధి చేకూర్చేందుకే ఈ నిర్ణయమనే భావన వ్యక్తమవుతోంది. పండుగకు ప్రతి ఒక్కరికీ సరుకులు అందిస్తాం : చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో ప్రభుత్వం ఇస్తున్న ఆరు రకాల నిత్యవసర సరుకులను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తాం. సోమవారం నాటికి 75 శాతం సరుకులు అన్ని కేంద్రాలకు చేరాయి. మిగిలిన వస్తువులు మంగళవారం ఉదయమే వెళతాయి. జిల్లాకు కేవలం గోధుమ పిండి మాత్రం 120 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది. ఇది కూడా మంగళవారం వస్తుంది. కావున ప్రతి ఒక్కరికీ సరుకులు అందజేస్తాం. - వెంకటేశం, జిల్లా మేనేజర్, సివిల్సప్లై