మీ చేతి చర్మంపైనే ఆపరేట్ చేయ్యొచ్చు!
లండన్ : మీరు ధరించే స్మార్ట్ వాచ్ స్క్రీన్ చాలా చిన్నదిగా అనిపిస్తుందా..? మీరు దాన్ని పెద్దదిగా చేయాలనుకుంటున్నారా..? అయితే మీ చేతినే టచ్ ప్యాడ్ లాగా మార్చుకోవచ్చట. కార్నెగీ మిలాన్ యూనివర్సిటీకి చెందిన ఫ్యూచర్ ఇంటర్ ఫేస్ గ్రూప్ పరిశోధకులు మన చేతి చర్మాన్ని టచ్ సెన్సార్ గా మార్చుకునే సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం చాలా స్మార్ట్ వాచ్ లు, డిజిటల్ జ్యువెల్లరీ డిమాండ్ ఎక్కువగా ఉంది. అయితే ఇవి చిన్నవిగా ఉండటంతో, యూజర్లకు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఈ సమస్యలన్నింటినీ తొలగించి, యూజర్లను ఎక్కవగా ఆకర్షించేందుకు చర్మాన్ని టచ్ పాడ్ లాగా మార్చి.. ఈ చిన్ని డివైజ్ ల పరిమాణాన్ని పెంచామని పరిశోధకులు తెలిపారు.
ఈ డివైజ్ లను 'స్కిన్ ట్రాక్' అని పిలుస్తారు. దీనిలో రెండు భాగాలుంటాయి. ఒకటి సిగ్నల్ ఎమిటింగ్ రింగ్, రెండోది సెన్సింగ్ వ్రిస్ట్ బ్యాండ్. రింగ్ పెట్టుకున్న చేతి వేలిని స్మార్ట్ వాచ్ డివైజ్ ధరించిన చేతిపై కదిలించడం ద్వారా ఎలక్ట్రోకోడ్లను ఉత్పత్తిచేసేలా దీన్ని రూపొందించారు. ఎప్పుడైతే రింగ్ ఉన్న వేలు స్కిన్ ను టచ్ చేస్తుందో, అప్పుడు ఎక్కువ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ యూజర్ చేతిలోకి వెళుతాయి. అప్పుడు స్కిన్ పై వేలిని కదిపిన ప్రతిసారీ, ఎలక్టోకోడ్ ల ఆధారంగా స్మార్ట్ వాచ్ ఆపరేట్ అవుతుంది. చేతిపై లేయర్ పొర లాంటి క్లాత్ ను వేసినా ఈ టెక్నాలజీకి ఎలాంటి ఆటంకం కలుగదు. నొక్కడం, రాయడం, ప్రత్యేక హావభావాలు వంటి ఈ టచ్ స్క్రీన్ సిగ్నల్ లన్నింటినీ స్కిన్ ట్రాక్ గుర్తిస్తుంది.