turns
-
పెళ్లికొడుకు గెటప్‌లో రణబీర్ కపూర్ సందడి (ఫొటోలు)
-
వెడ్డింగ్ ఫంక్షన్ కాస్త రెజ్లింగ్ అడ్డాగా మారింది..!
ఇస్లామాబాద్:పాకిస్థాన్‌లో ఓ వెడ్డింగ్ ఫంక్షన్ రెజ్లింగ్ అడ్డాగా మారింది. వేడుకకు వచ్చిన అతిథులు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. కుర్చీలు, ప్లేట్లను ఒకరిపై మరొకరు విసురుకున్నారు. తినుబండారాలు చెల్లాచెదురుగా విసిరారు. ఈ వీడియో ట్విట్టర్(ఎక్) లో ఓ యూజర్ షేర్ చేయగా వైరల్‌గా మారింది. వేడుకకు వచ్చిన అతిథులందరూ భోజనంలో పాల్గొన్నారు. మగవారికి ఓ వైపు మరొవైపు ఆడవారికి ఏర్పాట్లు చేశారు. బంధువులందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ డైనింగ్ టేబుళ్లపై ఉన్న ఆహారాన్ని ఆరగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి వచ్చి తింటున్న మరోవ్యక్తి టోపీని తిప్పాడు. అంతే.. గొడవ ప్రారంభమైంది. బంధువులు రెండు వర్గాలుగా వీడి పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ప్రశాంతంగా సాగుతున్న వేడుకలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. Kalesh during marriage ceremony in pakistan over mamu didn’t got Mutton pieces in biriyani pic.twitter.com/mYrIMbIVVx — Ghar Ke Kalesh (@gharkekalesh) August 29, 2023 ఈ వీడియోను ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట తెగ వైరల్‌గా మారింది. 3,33000 వ్యూస్ వచ్చాయి. ఫంక్షన్లో చికెన్ ముక్క సరిపోట్లేదా..? అని ఓ యూజర్ ఫన్నీగా ప్రశ్నించారు. పాపం ఆ పెళ్లి చేసుకున్న వరుడు-వధువు పరిస్థితి ఏంటో..? అంటూ మరొకరు స్పందించారు. వేలు ఖర్చు చేసి ఫంక్షన్ చేస్తే నాశనం చేశారు కదరా..? అని మరో యూజర్ ఫన్నీగా కామెంట్ పెట్టారు. ఇదీ చదవండి: ‘ఎక్స్’లో ఆడియో, వీడియో కాల్స్ -
దిగ్గజ స్టార్టప్‌కు ప్రేమ్‌జీ ఊతం
బెంగళూరు: ఐటీ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్‌జీ తోడ్పాటుతో ఒక స్టార్టప్ సంస్థ బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ స్థాయికి చేరింది. క్లౌడ్ ఆధారిత కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ సేవలు అందించే ఐసెర్టిస్ సంస్థలో అజీం ప్రేమ్‌జీ కుటుంబానికి చెందిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ ఫండ్, గ్రేక్రాఫ్ట్ పార్ట్నర్స్ తదితర సంస్థలు 115 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. వీటిలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన బి క్యాపిటల్ గ్రూప్, ఎయిట్ రోడ్స్ మొదలైనవి కూడా ఉన్నాయి. తాజా పెట్టుబడులతో ఐసెర్టిస్ సంస్థ మొత్తం 211 మిలియన్ డాలర్లు సమీకరించినట్లయింది. ఈ విడత నిధుల సమీకరణతో సంస్థ విలువ 1 బిలియన్ డాలర్ల స్థాయికి చేరినట్లవుతుందని ఐసెర్టిస్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ బోదాస్ తెలిపారు. నెలకొల్పింది మనోళ్లే.. 2009లో సమీర్, ఆయన మిత్రుడు మనీష్ దర్దా కలిసి ఐసెర్టిస్ను ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో 850 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 600 మంది పుణే కేంద్రంలో పనిచేస్తున్నారు. సరుకుల కొనుగోళ్ల నుంచి ఉద్యోగులతో ఒప్పందాలు దాకా ప్రపంచవ్యాప్తంగా పలువురు క్లయింట్లకు 57 లక్షల పైగా కాంట్రాక్టుల నిర్వహణకు సేవలు అందిస్తున్నట్లు సమీర్ వివరించారు. వీటి మొత్తం విలువ 1 లక్ష కోట్ల డాలర్ల పైగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ సేవలపై కంపెనీలు 2018–2022 మధ్య కాలంలో దాదాపు 20 బిలియన్ డాలర్ల దాకా వెచ్చించనున్నట్లు పరిశ్రమవర్గాల అంచనా. -
అనూహ్యంగా లాభాల్లోకి
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు అనూహ్యంగా లాభాల్లోకి మళ్లాయి. ఆరంభంలో 100 పాయింట్లకు పైగా క్షీణించిన ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో భారీగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం దాదాపు 200 పాయింట్లు ఎగిసింది. నిఫ్టీ కూడా అదే బాటలో పయనిస్తూ 10900స్థాయికి పైన ట్రేడ్ అవుతోంది. . ప్రధానంగా ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంక్స్ , మెటల్ సెక్టార్ కొనుగోళ్లు జోరందుకోవడంతో సెన్సెక్స్ లాభాల్లోకి మళ్లింది. అయితే రియల్టీ ప్రయివేట్ బ్యాంక్స్, ఆటో నష్టపోతున్నాయి. ఇన్ఫీబీమ్ 16 శాతం దూసుకెళ్లగా, నిట్ టెక్, మైండ్‌ట్రీ, టీసీఎస్, ఒరాకిల్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లాభపడుతున్నాయి. వీటితోపాటు యస్ బ్యాంక్, హిందాల్కో, ఐబీ హౌసింగ్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫ్రాటెల్, ఐసీఐసీఐ, ఎస్బీఐ లాభపడుతున్నాయి. ఇక రియల్టీ విషయానికి వస్తే యూనిటెక్, ఇండియాబుల్స్, సన్‌టెక్, డీఎల్ఎఫ్, ఫీనిక్స్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, శోభా, బ్రిగేడ్ 6-2 శాతం మధ్య పతనమయ్యాయి. ఇంకా హెచ్‌పీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్, ఇండస్ఇండ్, భారతీ ఎయిర్టెల్, ఎల్అండ్టీ, బజాజ్ ఫిన్సర్వ్, గ్రాసిమ్, బీపీసీఎల్, కొటక్ బ్యాంక్ తదితరాలు నష్టపోతున్నాయి. -
ఆదమరిస్తే అంతే..
కూసుమంచి : ఖమ్మం–సూర్యాపేట రహదారి పాలేరు రిర్వాయర్ పాత పార్కు వద్ద మూల మలుపులు ప్రమాదకరంగా ఉంది. రహదారి చివర భాగంలో మట్టికొట్టుకు పోయకపోవటంతో రహదారి ఎత్తుగా ఉండి వాహనాలు రోడ్డు దిగే క్రమంలో అదపుతప్పి పక్కకు దూసుకెళ్తున్నాయి. దీనికి తోడు పార్కుకు ఏర్పాటు చేసిన కంచె విరిగి ఉండటంతో వాహనాలు అందులోకి దూసుకెళ్లి గాయాల పాలవుతున్నారు. ఇటీవల ఒక ద్విచక్ర వాహనం ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి పార్కు లోనికి దూసుకువెళ్లి తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరాడు. నిత్యం ఈప్రాంతంలో ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరుగునే ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి క్షేత్రస్థాయిలో రహదారులను పరిశీలించి వాటికి మరమ్మతులు చేయాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు. -
ప్రపంచ తొలి బంగారు ఏటీఎం
లండన్: ప్రపంచంలోనే తొలి ఏటిఎం కేంద్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ తొలి బంగారు ఏటీఎంగా రూపాంతరం చెందింది. ఈ ఏటీఎం మిషీన్ ఆవర్భవించి అయిదు దశాబ్దాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ప్రపంచంలో తొలి బంగారు ఏటీఎంగా మరోసారి ఘనతను చాటుకుంది. ప్రతిష్టాత్మక తన తొలి ఏటీఏం కేంద్రాన్ని 50వ వార్షికోత్సవం సందర్భంగా బంగారు ఏటీఎంగా మార్చింది. దీంతోపాటు స్మారక ఫలకాన్ని జోడించి, వినియోగదారులకోసం రెడ్ కార్పెట్‌ను కూడ ఉంచడం విశేషం. 1967, జూన్ 27న షెపెర్డ్-బారన్ మొదటి ఎటిఎమ్ (ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్) రూపొందించారు. అనంతరం ఉత్తర లండన్‌లోని బార్క్లే బ్యాంక్ తన మొదటి ఏటీఏం కేంద్రాన్ని ప్రారంభించింది. బ్యాంకు ఆరంభించిన ఆరింటిలో ఇది మొదటిది. కాగా బ్రిటీష్ టీవీ కామెడీ షో "ఆన్ ది బసెస్" లో నటించిన హాలీవుడ్ రెగ్ వార్నీ నగదును ఉపసంహరించుకున్న మొట్టమొదటి వ్యక్తి. 2016 నాటికి బార్క్లే బ్యాంక్ కు చెందిన ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 లక్షల నగదు యంత్రాలు ఉండగా, ఒక్క బ్రిటన్‌లోనే 70వేల ఏటీఏం సెంటర్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నట్టు అంచనా. దాదాపు175 బిలియన్ పౌండ్లను పంపిణీ చేసింది. ఇటీవలి కాలంలో డిజిటల్ బ్యాంకింగ్, కార్డుల చెల్లింపులు భారీగా పెరిగినప్పటికీ చాలామంది ప్రజల రోజువారీ జీవితంలో నగదు చాలా కీలకమైనదని కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ చానెల్స్ అధిపతి రహేల్ అహ్మద్ చెప్పారు. -
ప్రమాదాల మలుపు
► ప్రమాదాలకు కారణమవుతున్న మూల మలుపులు ► పట్టించుకోని ఆర్అండ్బీ అధికారులు లక్ష్మణచాంద : మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారుల వెంట ఉన్న మూలమలుపులు మృత్యు మలుపులుగా మారుతున్నాయి. ఈ మలుపులు ప్రమాదకరంగా ఉండటంతో ఎప్పడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని మండల వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా మండలంలోని పీచర, లక్ష్మణచాంద, మల్లాపూర్, మునిపెల్లి, రాచాపూర్, పొట్టపెల్లి, న్యూవెల్మల్, పీచర గ్రామాలకు వెళ్లే రహదారులు చాలా మూల మలుపులు ఉన్నాయి. దీంతో ఆ రహదారుల వెంట ప్రయాణం చేసేటప్పుడు ముందు నుంచి ఏ వాహనం వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ మార్గాల్లో పలు ప్రమాదాలు సంభవించాయి. మూల మలుపుల వద్ద హెచ్చరిక సూచికలు ఉండాలని నిబంధనలు ఉన్నా చాలా మలుపుల వద్ద సూచికలు లేవు. ఈ విషయాన్ని సంబంధిత గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకునేవారే కరువయ్యారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే అనేక సార్లు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు కనిపించదు.. మూల మలుపుల వద్ద పిచ్చి మొక్కలు పెరిగి రోడ్డు మొత్తం కనిపించకుండా ఉంది. దీంతో రోడ్డుపై ప్రయాణించే ప్రయాణించే వాహనదారులు తరచు ఎదురుగా వచ్చే వాహనాలను ఢీ కొంటున్నారు. వేగంగా వస్తే ప్రమాదం ఖాయం. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదాలు జరిగినా.. మండలంలోని వివిధ రోడ్డు ప్రమాదాలు జరిగిన తీరును గమనిస్తే వాహనదారులు వెళ్లే సమయంలో ముందు నుంచి వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల బొప్పారం గ్రామం వద్ద ఇద్దరు వాహనాదారులు ఢీ కొనగా వారిలో ఒకరు అక్కడిక్కడే మరణించారు. మండలంలోని వడ్యాల్ గ్రామం సమీపంలో గల మూలములపు వద్ద ఇటీవల రెండు ఆటోలు ఢీ కొనగా అందులో ప్రయాణిస్తున్న లక్ష్మణచాంద మహిళ తన ఒక చేతును పూర్తిగా కోల్పోయింది. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మండలవాసులు కోరుతున్నారు. సూచికలు ఏర్పాటు చేయాలి మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే రహదారుల మూల మలుపుల వద్ద తప్పనిసరిగా ప్రమాద హెచ్చరికలను సూచించే బోర్డులనుదేర్పాటు చేయాలి. ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగాయి ఇకమీద నివారణకు చర్యలు తీసుకోవాలి. – రమేశ్ పిచ్చి మొక్కలు తొలగించాలి మండలంలోని ప్రధాన రహదారుల మూల మలుపుల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలి. దీంతో వాహనదారులకు ముందు నుంచి వచ్చే వాహనాలు కనిపించకపోవడం వల్లే ఎక్కవ ప్రమాదాలు జరుగుతున్నాయి. – జహీరోద్దిన్ బోర్డులను ఏర్పాటు చేస్తాం మండలంలోని ప్రధాన రహదారులపై ఉన్న మూల మలుపుల వద్ద ప్రమాద సూచిక బోర్డులను తొందరలోనే ఏర్పాటు చేస్తాం. అంతే గాకండా రహదారుల వెంట గల పిచ్చి మొక్కలను తొలగిస్తాం. ఇకపై ప్రమాదాల నివారణకు పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటాం. – ఎజ్దాని, ఏఈ, ఆర్అండ్బీ -
నోట్ల రద్దుతో 'రసగుల్ల' మల్లగుల్లాలు
కోలకత్తా: బెంగాల్ అంటే స్వీట్లకు పెట్టింది పేరు. కానీ డీమానిటేజేషన్ ప్రభావంతో బెంగాల్ తీపి వంటకాలు చేదెక్కుతున్నాయి. ప్రధానంగా బెంగాలీ స్వీట్ గా పేరొందిన రసగుల్లా అమ్మకాలపై వేటు పడింది. రూ.500 నుంచి రూ .1,000 కరెన్సీ నోట్లను నిషేధిస్తూ కేంద్ర నిర్ణయం తమ స్వీట్ల అమ్మకాలపై భారీగా పడిందని పశ్చిమ బెంగాల్ స్వీట్ వర్తకం దారులు వాపోతున్నారు. ముఖ్యంగా కార్తీక పూజ సందర్భంగా ఏడాదికి సరిపడా ఆదాయం వచ్చే స్వీట్ల అమ్మకాలు భారీగా పడిపోవడం తమ వ్యాపారాన్ని దెబ్బతీసిందన్నారు. స్థానిక వర్తకులు సమాచారం ప్రకారం ఇక్కడ ఏడాదికి లక్షకోట్ల రూపాయల స్వీట్ల వ్యాపారం జరుగుతుంది. పెద్ద నోట్ల రద్దుతో రోజుకి నాలుగు నుంచి పదివేలరూపాయల వరకు అమ్మకాలు పడిపోయాయని హౌరాకు చెందిన గంధేశ్వరీ స్వీట్స్ యజమాని ప్రదీప్ హాల్దర్ చెప్పారు. అలాగే రసగుల్లాను పరిచయం చేసిన ధిమాన్ దాస్ కంపెనీ కూడా ప్రస్తుతం తయారీని నిలిపివేసే స్థితికి వచ్చింది. ఎపుడూ భారీ డిమాండ్ ఉండే తమ రసగుల్లా , సందేష్ లకు ప్రస్తుతం డిమాండ్ 30శాతం పడిపోయందని కంపెనీ యజమాని కేసీ దాస్ తెలిపారు. దీంతో పురాతన స్వీట్ షాప్ లోఉత్పత్తిని ఒక రోజు నిలిపివేసినట్టు చెప్పారు. ముఖ్యంగా డెబిట్ కార్డు ఆప్షన్ లేని వీధి వ్యాపారులు భారీగా నష్టపోతున్నారన్నారు. దీనికి తోడు చక్కెర లాంటి ఇతర ముడి పదార్థాలు అందించే విక్రయదారులు పాత నోట్లను అంగీకరించమని తెగేసి చెప్పడం మరింత ఆందోళనకరంగా పరిణమించిందని తెలిపారు. ఇటు పాత నోట్ల చలామణిలేక, అటు కొత్త నోట్లు అందుబాటులోకి ఇబ్బందులు పడుతున్నామన్నారు. అయితే కొంతమంది నమ్మకస్తులైన కస్టమర్లకు తరువాత చెల్లించే పద్ధతిలో స్వీట్లను విక్రయిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు రూ.100 ల స్వీట్స్ కోసం రూ. 2 వేల నోటు ఇవ్వడంతో చిల్లర కష్టాలు తప్పడంలేదన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే .. తమ వ్యాపార నిర్వహణ ఎలాగో అర్థం కావడంలేదన్నారు. కొత్త నోట్ల కొరతతో సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నామని వ్యాపారులు చెప్పారు. అయితే క్రెడిట్ కార్డు అమ్మకాలు బాగా పెరిగినా.. అందరికీ డెబిట్ క్రెడిట్ కార్డు చెల్లింపుల అవకాశం లేకపోవడంతో ముఖ్యంగా వీధి వ్యాపారులు బాగా నష్టపోతున్నట్టు చెప్పారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన 'ఆపరేషన్ బ్లాక్ మనీ' ని రాష్ట్రంలోని స్వీట్ వ్యాపారులు కొంతమంది ప్రశంసిస్తున్నారు. కొంతకాలం తమకు ఈ కష్టలు తప్పవు అంటూ సరిపెట్టుకోవడం విశేషం. -
ఊగిసలాటలో మార్కెట్లు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులతో లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆరంభం ఫ్లాట్‌గా మొదలై లాభాలు పుంజుకున్నా.. ఊగిసలాటల మధ్య కొనసాగుతున్నాయి. కొనుగోళ్ల జోరుతో ఒక దశలో100పాయింట్లకు పైగా ఎగిసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 22 పాయింట్లు పెరిగి 26,321కువద్ద, నిఫ్టీ 2పాయింట్లు బలపడి 8,113 వద్ద కొన సాగుతున్నాయి. దేశీ స్టాక్స్‌లో ఎఫ్ఐఐల అమ్మకాలకు బ్రేక్ పడకపోవడంతో మార్కెట్లో సెంటిమెంట్ బలహీనంగా ఉందని విశ్లేషకుల అంచనా. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంకింగ్ సెక్టార్ జోరు కొనసాగుతోంది. అలాగే ఆటో, రియల్టీ రంగాలు లాభాల్లో ఉండగా మీడియా షేర్లు నష్టపోతున్నాయి. టాటా పవర్, భెల్, యాక్సిస్, టాటా మోటార్స్, బీవోబీ, గ్రాసిమ్, లుపిన్, భారతీ, గెయిల్ లాభపడుతుండగా, హెచ్‌సీఎల్ టెక్, ఐషర్, అంబుజా, విప్రో, ఏసీసీ, జీ, పవర్‌గ్రిడ్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ నష్టాలతో ట్రేడవుతున్నాయి. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి 14 పైసలు బలహీనపడి 67.89వద్ద, ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి 35 రూపాయలు బలపడి పది గ్రా. రూ.29.335 వద్ద ఉంది. -
మీ చేతి చర్మంపైనే ఆపరేట్ చేయ్యొచ్చు!
లండన్ : మీరు ధరించే స్మార్ట్ వాచ్ స్క్రీన్ చాలా చిన్నదిగా అనిపిస్తుందా..? మీరు దాన్ని పెద్దదిగా చేయాలనుకుంటున్నారా..? అయితే మీ చేతినే టచ్ ప్యాడ్ లాగా మార్చుకోవచ్చట. కార్నెగీ మిలాన్ యూనివర్సిటీకి చెందిన ఫ్యూచర్ ఇంటర్ ఫేస్ గ్రూప్ పరిశోధకులు మన చేతి చర్మాన్ని టచ్ సెన్సార్ గా మార్చుకునే సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం చాలా స్మార్ట్ వాచ్ లు, డిజిటల్ జ్యువెల్లరీ డిమాండ్ ఎక్కువగా ఉంది. అయితే ఇవి చిన్నవిగా ఉండటంతో, యూజర్లకు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఈ సమస్యలన్నింటినీ తొలగించి, యూజర్లను ఎక్కవగా ఆకర్షించేందుకు చర్మాన్ని టచ్ పాడ్ లాగా మార్చి.. ఈ చిన్ని డివైజ్ ల పరిమాణాన్ని పెంచామని పరిశోధకులు తెలిపారు. ఈ డివైజ్ లను 'స్కిన్ ట్రాక్' అని పిలుస్తారు. దీనిలో రెండు భాగాలుంటాయి. ఒకటి సిగ్నల్ ఎమిటింగ్ రింగ్, రెండోది సెన్సింగ్ వ్రిస్ట్ బ్యాండ్. రింగ్ పెట్టుకున్న చేతి వేలిని స్మార్ట్ వాచ్ డివైజ్ ధరించిన చేతిపై కదిలించడం ద్వారా ఎలక్ట్రోకోడ్లను ఉత్పత్తిచేసేలా దీన్ని రూపొందించారు. ఎప్పుడైతే రింగ్ ఉన్న వేలు స్కిన్ ను టచ్ చేస్తుందో, అప్పుడు ఎక్కువ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ యూజర్ చేతిలోకి వెళుతాయి. అప్పుడు స్కిన్ పై వేలిని కదిపిన ప్రతిసారీ, ఎలక్టోకోడ్ ల ఆధారంగా స్మార్ట్ వాచ్ ఆపరేట్ అవుతుంది. చేతిపై లేయర్ పొర లాంటి క్లాత్ ను వేసినా ఈ టెక్నాలజీకి ఎలాంటి ఆటంకం కలుగదు. నొక్కడం, రాయడం, ప్రత్యేక హావభావాలు వంటి ఈ టచ్ స్క్రీన్ సిగ్నల్ లన్నింటినీ స్కిన్ ట్రాక్ గుర్తిస్తుంది. -
క్యాబ్ ను లైబ్రరీగా మార్చేశాడు!
టెహ్రాన్ః మనిషి ఆలోచనల్ని క్రమబద్ధీకరించడానికి, వ్యక్తిలో ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి పుస్తక పఠనం ఎంతగానో దోహద పడుతుంది. అందుకే పుస్తక ప్రేమికులను ప్రోత్సహించేందుకు ఓ ఇరానియన్ క్యాబ్ డ్రైవర్ ప్రయత్నం ప్రారంభించాడు. ప్రయాణీకులను ఆకట్టుకోవడంతోపాటు.. పుస్తక ప్రియులకు అందుబాటులో ఉండేట్టుగా తన నూతన ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. ఇరాన్ లోని రాస్ట్ సిటీ లో నడిపే తన ట్యాక్సీలో పుస్తకాలను నింపేసి ప్రయాణీకులకు ఓ మినీ లైబ్రరీని అందుబాటులోకి తెచ్చాడు. తన షెటిల్ టాక్సీని ఓ మొబైల్ లైబ్రరీగా మార్చేశాడు ఇరాన్ కు చెందిన సాహెల్ ఫిల్ సూఫ్. పుస్తక పఠనంతో అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నమ్మిన అతడు... తన ప్యాసింజర్లను పఠనానికి ప్రోత్సహించాలన్న ఉద్యేశ్యంతో తన టాక్సీలో ప్రయాణించే వారికి లైబ్రరీని అందుబాటులోకి తెచ్చాడు. కొంతకాలం క్రితమే తనకు లైబ్రరీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చిందని, అందుకు తన క్యాబ్ ను వినియోగించి ప్రజలకు చేరువవ్వచ్చునన్న ఆలోచనను ఆచరణలో పెట్టానని సాహెల్ చెప్తున్నాడు. ఆధునిక కాలంలో అనేక ఒత్తిళ్ళతో సతమతమౌతున్న ప్రజలకు పుస్తక పఠనం ఎంతగానో ఉపకరిస్తుందని, ఉపశమనం కలిగిస్తుందని భావించానని, అందుకే ఈ మొబైల్ లైబ్రరీ ని ఏర్పాటు చేశానని సాహెల్ చెప్తున్నాడు. తన క్యాబ్ ట్యాక్సీలో సాహెల్ వివిధ రకాల పుస్తకాలను సుమారు 50 వరకూ పాఠకులకు అందుబాటులో ఉంచాడు. మనస్తత్వ శాస్త్రం, పిల్లల పుస్తకాలు, చరిత్ర వంటి ఎన్నో గ్రంథాలతో ఇప్పుడు సాహెల్ క్యాబ్ లైబ్రరీ పుస్తాకాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పైగా తన లైబ్రరీకి ఫ్యాన్స్ గా మారిన ప్యాసింజర్లు ఎక్కువగా మహిళలు, యువకులేనని సాహెల్ చెప్తున్నాడు. గిలాన్ ఉత్తర ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ గ్రంథాలయాల అధికారులను అనుమతి కోరానని, వారు తన మొబైల్ లైబ్రరీ నాణ్యత పెరిగే పుస్తకాలను సూచించి సహకరించారని సాహెల్ వివరించాడు. నా కారులో ప్రయాణించే వారు చదివేందుకు మంచి పుస్తకం ఇమ్మని అడిగినప్పుడు నాకెంతో ఆనందంగా ఉంటుందని, నేను మంచి పని చేశానన్న సంతోషం కలుగుతుందని సాహెల్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. -
భజన గీతాలు పాడుతున్న హేమ!
ముంబై: అలనాటి బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ హేమామాలిని (67) సింగర్ అవతారమెత్తారు. తాను స్వయంగా పాడిన భజన గీతాలతో ఓ ఆల్బంను రూపొందిస్తున్నట్టు ఆమె ట్విట్టర్లో వెల్లడించారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ స్టూడియోలో ఈ ఆల్బంను రికార్డు చేసినట్టు తెలిపారు. తనలో ఇన్ని రోజులు దాగి ఉన్న మరో కొత్త కోణాన్ని ఈ ఆల్బం ద్వారా ఆవిష్కరిస్తున్నట్టు హేమ ఆనందంగా తెలిపారు. పండిట్ జైస్ రాజ్ సంగీత సారధ్యంలో నారాయణ అగర్వాల్ రచించిన భజన గీతాలను ఆల్బంగా రూపొందిస్తున్నట్టు చెప్పారు. దీన్ని అందరూ ఆదరించాలని కోరారు. గాయనిగా మారడం, పాటలు పాడటం ఎంతో సంతోషాన్నిస్తోందని తెలిపారు. ఈ సరికొత్త అవతారాన్ని ఎంజాయ్ చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. అనేక సినిమాల్లో తన అభినయంతో బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న హేమామాలిని రాజకీయాల్లోనూ తనదైన శైలిలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. మరి తాజా ఆల్బంతో గాయనిగానూ నిరూపించుకుంటారా అన్నది చూడాలి. -
డైమండ్ 'చిన్నది'... పెళ్ళి వద్దంది!
పెళ్ళి నిశ్చితార్థానికి గుర్తుగా ఉంగరాలు మార్చుకుంటారు. అలాగే ఓ యువతిని పెళ్ళికి ప్రపోజ్ చేసిన యువకుడు ఉంగరం చేయిస్తానని మాటిచ్చాడు. అన్నట్టుగానే చేయించాడు కూడా. కానీ ఉంగరంలోని డైమండ్ చిన్నదైందంటూ ఏకంగా పెళ్ళికే ససేమిరా అందా మగువ. ఎంగేజ్ మెంట్ రింగ్ లో డైమండ్ చిన్నదైనందుకు పెళ్ళినే నిరాకరించింది. చైనా సిచువాన్ ప్రావిన్స్ లో చోటు చేసుకున్న ఘటన అందరినీ షాక్ కు గురిచేసింది. పాపం ఆ ప్రేమికుడు... ప్రేయసిని ఉంగరంతో ఆశ్చర్యపరచాలనుకున్నాడు. పార్టీకి పిలిచి డైమండ్ రింగ్ బహూకరించి పెళ్ళి చేసుకుందామన్న ప్రపోజల్ తో సిద్ధంగా వచ్చాడు. తీరా ఆమె ఉంగరంలో చిన్న డైమండ్ ఉందంటూ పెళ్ళినే నిరాకరించడంతో వందలమంది డ్యాన్సర్లు ముందే మోకరిల్లాడు. ఎంతగానో బతిమలాడాడు. అయితేనేం వజ్రంలాంటి కుర్రాడికన్నా ఉంగరంలోని వజ్రానికే ఆ చిన్నది ప్రాముఖ్యతనిచ్చింది. పెళ్ళి గిళ్ళి జాంతానై.. అంటూ అక్కడినుంచీ వెళ్ళిపోయింది. నైరుతి చైనా రాజధాని, సుచియాన్ ప్రావిన్స్ నగరంలో ఆమె చేస్తున్న చెంగ్డూ నృత్యాన్ని చూసి ఆ ప్రేమికుడు ఫిదా అయిపోయాడు. ఆమె వెంటపడి తన ప్రేమను తెలిపాడు. అలాగే పెళ్ళికి కూడ ప్రపోజ్ చేశాడు. వజ్రం ఉంగరం ఇస్తామని ప్రామిస్ చేశాడు. అన్నట్లుగానే తన బాయ్ ఫ్రెడ్ వజ్రం ఉంగరాన్ని తెచ్చివ్వడాన్ని చూసి ఆమె ఎంతో సంతోషపడిపోయింది. అతడు తన ప్రేమను వ్యక్తం చేస్తూ.. బాక్స్ నుంచి ఉంగరం బయటకు తీశాడు. అంతే.. ఆమె ముఖం మాడిపోయింది. ఏంటీ ఇంత చిన్న వజ్రమా అంటూ ఉంగరంతోపాటు అతడి ప్రపోజల్ నూ తిప్పి కొట్టింది. అతడితో మరో మాట మాట్లాడకుండా అక్కడినుంచీ వెళ్ళిపోయింది. జరిగిన తతంగంపై ఆ ప్రియురాలు 'వియ్ ఛాట్' లో తన స్నేహితురాలితో సంభాషించింది. ఆ తర్వాత ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ గా మారి... ఆన్ లైన్ లో లీకయింది. ఓ కథలా పబ్లిష్ అయ్యింది. తనకు ప్రపోజ్ చేసినప్పుడు వన్ కేరెట్ వజ్రంతో ఉంగరం చేయిస్తానన్నాడని, తీరా నిశ్చితార్థానికి అంత చిన్న వజ్రం ఉంగరం ఇవ్వడంలో అతని ఉద్యేశ్యం ఏమిటంటూ ఆమె తన అభద్రతా భావాన్ని మెసేజ్ లో వ్యక్త పరిచింది. అతడు తనగురించి ఎప్పుడూ ఆలోచించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆమె ఫ్రెండ్ ''బాధపడకు నీకోసం మరో పెద్ద రింగ్ ఎదురు చూస్తూ ఉండి ఉంటుందిలే'' అంటూ ఆమెకు సర్ది చెప్పింది. ఇలా మెసేజ్ ల ద్వారా విషయం లీక్ అవడంతో ఆ ప్రేమికుల కథ బట్టబయలైంది. సో అబ్బాయిలూ ప్రపోజ్ చేసేంముందు కాస్ల ఆలోచించి మరీ వాగ్దానాలు చేయాలని మర్చిపోకండి. -
బ్రహ్మీ సైతాన్‌రాజ్ అవతారం
-
రాష్ట్ర విభజన అంశాన్ని కాంగ్రెస్ తేల్చేసినట్టేనా?