భజన గీతాలు పాడుతున్న హేమ! | Hema Malini turns singer, to bring her own bhajan album | Sakshi
Sakshi News home page

భజన గీతాలు పాడుతున్న హేమ!

Published Wed, Jan 13 2016 6:18 PM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM

భజన గీతాలు పాడుతున్న హేమ!

భజన గీతాలు పాడుతున్న హేమ!

ముంబై:  అలనాటి బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ హేమామాలిని (67)  సింగర్ అవతారమెత్తారు. తాను స్వయంగా పాడిన భజన గీతాలతో ఓ ఆల్బంను రూపొందిస్తున్నట్టు ఆమె ట్విట్టర్‌లో వెల్లడించారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ స్టూడియోలో ఈ ఆల్బంను రికార్డు చేసినట్టు తెలిపారు.

తనలో ఇన్ని రోజులు దాగి ఉన్న మరో కొత్త కోణాన్ని ఈ ఆల్బం ద్వారా ఆవిష్కరిస్తున్నట్టు హేమ ఆనందంగా తెలిపారు. పండిట్ జైస్ రాజ్ సంగీత సారధ్యంలో నారాయణ అగర్వాల్ రచించిన భజన గీతాలను ఆల్బంగా రూపొందిస్తున్నట్టు చెప్పారు. దీన్ని అందరూ ఆదరించాలని కోరారు. గాయనిగా  మారడం, పాటలు పాడటం ఎంతో సంతోషాన్నిస్తోందని తెలిపారు. ఈ సరికొత్త అవతారాన్ని ఎంజాయ్ చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. 
 
అనేక సినిమాల్లో తన అభినయంతో బాలీవుడ్ డ్రీమ్ గర్ల్  ఇమేజ్ ను  సొంతం చేసుకున్న  హేమామాలిని రాజకీయాల్లోనూ తనదైన శైలిలో రాణిస్తున్న సంగతి తెలిసిందే.   మరి  తాజా ఆల్బంతో గాయనిగానూ నిరూపించుకుంటారా అన్నది చూడాలి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement