ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమ్ అవుతోన్న ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’కు విశేష ఆదరణ లభిస్తోంది. కంటెస్టెంట్లు తమ మధురగానంతో ప్రేక్షకుల మదిని దోచుకుంటున్నారు. సామన్య ప్రేక్షుకులే కాక ఎంతో మంది సినీ సంగీత ప్రముఖులు వీరి గానానికి మంత్రముగ్ధులవుతున్నారు.శ్రేయా ఘోషల్, విశాల్ దడ్లానీ, హిమేష్ రేష్మియా, జీవీ ప్రకాష్, దేవిశ్రీ ప్రసాద్.. ఇలా పలువురు ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా ఈ లిస్టులో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా చేరారు. ఇండియన్ ఐడల్2 కంటెస్టెంట్ లాస్యప్రియ గానంపై ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించారాయన. 'ఆహాలో జరుగుతున్న ఇండియన్ ఐడల్ సీజన్ 2 సింగింగ్ కాంపిటీషన్లో అద్భుతంగా పాటలు పాడుతూ అందర్నీ మెప్పిస్తున్న సిద్దిపేట ముద్దుబిడ్డ లాస్య ప్రియకు హృదయపూర్వక అభినందనలు.
నీ సంగీత ప్రస్థానాన్ని ఇలాగే కొనసాగించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు.మధురమైన పాటతో సంగీతప్రియుల అభిమానాన్ని అందుకుంటోంది లాస్యప్రియ. ప్రస్తుతం టాప్-7 కంటెస్టెంట్లలో ఆమె కూడా ఒకరు. కాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 కార్యక్రమం ప్రతి శక్ర, శని వారాల్లో రెండు ఎపిసోడ్లుగా రాత్రి 7 గంటల నుంచి ఆహాలో ప్రసారం అవుతుంది.
ఆహా లో జరుగుతున్న ఇండియన్ ఐడల్ సీజన్ 2 సింగింగ్ కాంపిటీషన్లో అద్భుతంగా పాటలు పాడుతూ అందర్నీ మెప్పిస్తున్న సిద్దిపేట ముద్దుబిడ్డ లాస్య ప్రియకు హృదయపూర్వక అభినందనలు. నీ సంగీత ప్రస్థానాన్ని ఇలాగే కొనసాగించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. pic.twitter.com/BT9c3GQKjl
— Harish Rao Thanneeru (@BRSHarish) April 20, 2023
Comments
Please login to add a commentAdd a comment