
సెలబ్రిటీలకు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా కామన్. అలా అని పొరపాటు చేస్తే అభిమానించే వాళ్లు కూడా తిడతారు. నోటికొచ్చింది మాట్లాడుతారు. ఇప్పుడు ఇలాంటి అనుభవమే ఇండియన్ స్టార్ సింగర్ కి ఎదురైంది. ఆస్ట్రేలియాలో ఈమెని ఏడిపించేశారు. ఇంతకీ ఏమైందంటే?
(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు కన్నుమూత)
హిందీ సాంగ్స్ పాడి గుర్తింపు తెచ్చుకున్న నేహా కక్కర్ (Neha Kakkar).. 'ఇండియన్ ఐడల్' షోకి జడ్జిగా ఇంకా ఫేమస్. జడ్జిమెంట్ ఇస్తూ అప‍్పుడప్పుడు కన్నీళ్లు పెడుతూ ఉంటుంది. ఇదంతా డ్రామా అని కొందరు ట్రోల్ చేస్తుంటారు. ఇక అసలు విషయానికొస్తే తాజాగా ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లో ఈమె స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది.
కాకపోతే సాయంత్రం ఏడున్నరకు ప్రోగ్రాంకి రావాల్సి ఉండగా.. దాదాపు మూడు గంటలు ఆలస్యంగా వచ్చి పాటలు పాడింది. అది కూడా గంట మాత్రమే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. దీంతో టికెట్ కొని షో చూసేందుకు వచ్చిన కొందరు ఈమెని 'గో బ్యాక్' (తిరిగి హోటల్ కి వెళ్లిపో) అని కామెంట్ చేశారు. దీంతో ఏం చేయాలో తెలీక స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
Neha Kakkar crying for being 3 hrs late at a Melbourne show
She also performed for less than 1 hour #NehaKakkar pic.twitter.com/TGyhaeCjpu— Redditbollywood (@redditbollywood) March 24, 2025
Comments
Please login to add a commentAdd a comment