Hema Malini Comments On Afghanistan Taliban Crisis, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

అ‍ఫ్గానిస్తాన్‌లో ఏం జరుగుతోంది? అలనాటి హీరోయిన్‌ ఆందోళన

Aug 17 2021 9:19 PM | Updated on Aug 18 2021 1:05 PM

Hema Malini Recalls With Tweet On Afghanistan Consequences - Sakshi

అఫ్గానిస్తాన్‌లో ఒకప్పుడు ప్రశాంతంగా.. సంతోషంగా షూటింగ్‌ చేసుకున్నామని అలనాటి హీరోయిన్‌ తన సినిమా షూటింగ్‌ రోజులను గుర్తు చేసుకున్నారు. అఫ్గానిస్తాన్‌తో అనుబంధం పంచుకుంది.

ప్రస్తుతం ఎక్కడ విన్నా అఫ్గానిస్తాన్‌కు సంబంధించిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. సోషల్‌ మీడియాలతో అంతా అఫ్గాన్‌ ప్రజల గురించి ఆవేదన చెందుతూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అఫ్గన్‌ పరిణామాలు ప్రపంచాన్ని ఆవేదనకు గురి చేస్తోంది. తాజాగా ఈ పరిణామాలపై ప్రముఖ నటి, ఎంపీ హేమ మాలిని స్పందించారు. ‘అసలు అఫ్గనిస్తాన్‌లో ఏం జరుగుతోంది’? అని ఆందోళన చెందుతూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా తన సినిమాల షూటింగ్‌ అఫ్గానిస్తాన్‌లో జరిగిన రోజులను ఆమె గుర్తుచేసుకున్నారు.

‘ఒకప్పుడు ఎంతో సంతోషంగా.. శాంతియుతంగా ఉన్న అఫ్గానిస్తాన్‌లో అసలేం జరుగుతోంది? ఇది నిజంగా చాలా బాధకరమైన విషయం. ‘ధర్మాత్మ’ సినిమా షూటింగ్‌ సమయంలో అఫ్గన్‌లో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సినిమాలో నా పాత్ర మొత్తం ఆ దేశంలోనే షూటింగ్‌ పూర్తయ్యింది. ఆ సమయంలో నా కుటుంబసభ్యులు అక్కడే ఉన్నారు. సహ నటుడు ఫిరోజ్‌ ఖాన్‌ నా సంరక్షణ చూసుకున్నారు.’ అని హేమమాలిని ట్వీట్‌ చేశారు. అయితే ‘ధర్మాత్మ’ అఫ్గానిస్తాన్‌లో షూటింగ్‌ చేసుకున్న తొలి బాలీవుడ్‌ సినిమాగా నిలవడం విశేషం.

చదవండి: ‘బుల్లెట్టు బండి’ పాటకు వధువు సూపర్‌ డ్యాన్స్‌.. భర్త ఫిదా
చదవండి: ‘ట్విటర్‌ పక్షి’ని మాంచిగా వండి లాగించేసిన కాంగ్రెస్‌ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement