Shooting Time
-
వైజాగ్‌లో అడుగుపెట్టిన పుష్ప.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్
సాక్షి, విశాఖపట్నం: పాన్ ఇండియా మూవీ ‘పుష్ప–2 ది రూల్’ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త లుక్‌తో గురువారం విశాఖ చేరుకున్నారు. రాత్రి 10 గంటలకు ఇండిగో ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న బన్నీకి విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. అల్లు అర్జున్ను చూసేందుకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ తరలివచ్చారు. ఐకాన్ స్టార్ విశాఖ వస్తున్నారనే సమాచారంతో పోలీసులు సైతం ఆయనకు రక్షణ కల్పించేందుకు ఎయిర్ పోర్టు బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అల్లు అర్జున్ విశాఖ ఎయిర్ పోర్టు నుంచి బయటకు రావడంతోనే అభిమానులు ఆయన్ను చుట్టుముట్టి సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఇదిలా ఉండగా ఇటీవలే పుష్ప 2 సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో కొన్నిరోజుల పాటు చిత్రీకరణ జరిగింది. తాజా షెడ్యూల్‌ను వైజాగ్‌లో చిత్రీకరించబోతున్నారు. అందులో భాగంగా హీరో అల్లు అర్జున్‌పై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి సెట్స్ లోకి రష్మిక మందన్న అడుగు పెట్టనుంది. #Pushpa Ante Fireuuu 🔥🔥#AlluArjun gets a grand welcome from his fan at Vizag. #PushpaTheRule shoot resumes from today. pic.twitter.com/gepZjfy2LI — Venkatramanan (@VenkatRamanan_) January 19, 2023 సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రూపొందిన ‘పుష్ప-1’ ప్యాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో పుష్ప-2పై అంచనాలు మరింత పెరిగాయి. సినిమాలో మెయిన్ విలన్ భన్వర్ సింగ్ షెకావత్‌గా మెప్పించిన మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ పాత్రకు, పుస్పరాజ్ పాత్రకు ఎలాంటి గొడవ జరిగిందనేది పార్ట్ 2లో తెలియనుంది. Thanks to each and every member of #AlluArjunArmy … just mundhu roju night confirm chesina participate chesaru 👍🏻🙏🏻 pic.twitter.com/GalIz8ZEjG — Allu Arjun Fan™ (@IamVenkateshRam) January 20, 2023 -
అఫ్గానిస్తాన్‌లో ఏం జరుగుతోంది? అలనాటి హీరోయిన్ ఆందోళన
ప్రస్తుతం ఎక్కడ విన్నా అఫ్గానిస్తాన్‌కు సంబంధించిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలతో అంతా అఫ్గాన్ ప్రజల గురించి ఆవేదన చెందుతూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అఫ్గన్ పరిణామాలు ప్రపంచాన్ని ఆవేదనకు గురి చేస్తోంది. తాజాగా ఈ పరిణామాలపై ప్రముఖ నటి, ఎంపీ హేమ మాలిని స్పందించారు. ‘అసలు అఫ్గనిస్తాన్‌లో ఏం జరుగుతోంది’? అని ఆందోళన చెందుతూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా తన సినిమాల షూటింగ్ అఫ్గానిస్తాన్‌లో జరిగిన రోజులను ఆమె గుర్తుచేసుకున్నారు. ‘ఒకప్పుడు ఎంతో సంతోషంగా.. శాంతియుతంగా ఉన్న అఫ్గానిస్తాన్‌లో అసలేం జరుగుతోంది? ఇది నిజంగా చాలా బాధకరమైన విషయం. ‘ధర్మాత్మ’ సినిమా షూటింగ్ సమయంలో అఫ్గన్‌లో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సినిమాలో నా పాత్ర మొత్తం ఆ దేశంలోనే షూటింగ్ పూర్తయ్యింది. ఆ సమయంలో నా కుటుంబసభ్యులు అక్కడే ఉన్నారు. సహ నటుడు ఫిరోజ్ ఖాన్ నా సంరక్షణ చూసుకున్నారు.’ అని హేమమాలిని ట్వీట్ చేశారు. అయితే ‘ధర్మాత్మ’ అఫ్గానిస్తాన్‌లో షూటింగ్ చేసుకున్న తొలి బాలీవుడ్ సినిమాగా నిలవడం విశేషం. చదవండి: ‘బుల్లెట్టు బండి’ పాటకు వధువు సూపర్ డ్యాన్స్.. భర్త ఫిదా చదవండి: ‘ట్విటర్ పక్షి’ని మాంచిగా వండి లాగించేసిన కాంగ్రెస్ నాయకులు What is happening to a happy, once peaceful nation, Afghanistan, is truly sad. My great memories of Afghanistan date back to ‘Dharmatma’- I play a gypsy girl & my portion was shot entirely there. Had a great time as my parents were with me and Feroz Khan took good care of us pic.twitter.com/2jrsZJpvQd — Hema Malini (@dreamgirlhema) August 17, 2021 -
అయ్యో..గాయపడ్డాడు!
కెమెరా..రోలింగ్..యాక్షన్.. అన్నారు డైరెక్టర్. అంతే.. వరుణ్‌ధావన్ కో–స్టార్‌పై డోర్‌ను విసిరారు. దెబ్బ తగిలింది మాత్రం వరుణ్‌కే. విసిరేటప్పుడు డోర్ అతని మోచేతికి తగలడంతో గాయపడ్డారట. హీరోగారికి దెబ్బ తగిలిందని తెలియగానే నిర్మాత కరణ్ జోహార్ సెట్స్‌కి వచ్చేశారట. ఇదంతా హిందీ మూవీ ‘కళంక్’ సెట్లో జరిగింది. ‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్‌వర్మన్ దర్శకత్వంలో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, ఆలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్, సోనాక్షి సిన్హా ముఖ్య తారలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘కళంక్’. ఈ సినిమా షూటింగ్ ముంబైలోని ఓ స్టూడియోలో వేసిన భారీ సెట్లో జరుగుతోంది. ప్రజెంట్ ఈ సినిమా కోసం స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారట. ఇది వరుణ్ ఇంట్రడక్షన్ సాంగ్ అని, ఈ పాటలోనే డోర్ విసురుతారని సమాచారం. సాంగ్‌లో యాక్షన్ అన్నమాట. -
పులికి భయపడి వచ్చేశా!
టీనగర్: షూటింగ్ సమయంలో పులిని చూసి భయపడి హీరోయిన్ అంజనారాజ్ అదృశ్యమైనట్లు దర్శకుడు పావన్నన్ తెలిపారు. ఆయన కథ, దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం ‘సొల్’. ఆయన మాట్లాడుతూ స్త్రీ, పురుషుడు స్నేహంగా మెలిగితే ప్రేమ ఏర్పడుతుందనే విషయం ఇంతవరకు సినిమాలో చెప్పబడిందని, అయితే ఇరువురూ కలిసి తిరిగితే ప్రేమ రాదనేది ఈ కథ ముఖ్యాంశమన్నారు. కడలూరు అటవీ ప్రాంతంలో చిత్రం షూటింగ్ జరిగిందని, ఇందులో హీరోయిన్గా అంజనారాజ్ నటించారన్నారు. షూటింగ్ సమయంలో పులి చంపడంతో ఒక మహిళ మృతిచెందిందనే వార్త తెలిసిందని, అయినప్పటికీ షూటింగ్ జరిపేందుకు సిద్ధమయ్యామన్నారు. ఈ లోపున హీరోయిన్ కోసం వెదికి చూడగా ఆమె కనిపించలేదని, దీంతో ఎంతో భీతి చెందామన్నారు. ఆమె ఇంటికి ఫోన్ చేయగా ఆమె ఇంట్లో ఉన్నట్లు తెలిసిందన్నారు. ఆమె పులి గురించిన సమాచారం వినగానే ఎవరికీ చెప్పకుండా ఇంటికి వెళ్లిందని, ఈ చిత్రం ముగించేలోపున తాను పలువురి వద్ద మాటలు పడ్డానని, దీంతో ఈ చిత్రానికి సొల్ (మాట) అనే పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి మోహనరామన్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారని, విజయా సమర్పణలో చరణ్కృష్ణ పిక్చర్స్ సహనిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. చిత్రానికి గజేంద్రన్ సంగీతం సమకూరుస్తున్నట్లు తెలిపారు.