
వరుణ్‌ధావన్
కెమెరా..రోలింగ్..యాక్షన్.. అన్నారు డైరెక్టర్. అంతే.. వరుణ్‌ధావన్ కో–స్టార్‌పై డోర్‌ను విసిరారు. దెబ్బ తగిలింది మాత్రం వరుణ్‌కే. విసిరేటప్పుడు డోర్ అతని మోచేతికి తగలడంతో గాయపడ్డారట. హీరోగారికి దెబ్బ తగిలిందని తెలియగానే నిర్మాత కరణ్ జోహార్ సెట్స్‌కి వచ్చేశారట. ఇదంతా హిందీ మూవీ ‘కళంక్’ సెట్‌లో జరిగింది.
‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్‌వర్మన్ దర్శకత్వంలో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, ఆలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్, సోనాక్షి సిన్హా ముఖ్య తారలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘కళంక్’. ఈ సినిమా షూటింగ్ ముంబైలోని ఓ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. ప్రజెంట్ ఈ సినిమా కోసం స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారట. ఇది వరుణ్ ఇంట్రడక్షన్ సాంగ్ అని, ఈ పాటలోనే డోర్ విసురుతారని సమాచారం. సాంగ్‌లో యాక్షన్ అన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment