varun dhavan
-
ట్రెండింగ్ బ్యూటీ వామికా గబ్బి.. ఇంతకీ ఎవరీమె? (ఫొటోలు)
-
‘తోడేలు’ను విడుదల చేస్తున్న ‘గీతా ఫిల్మ్’
వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం 'భేధియా'. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, అభిషేక్ బెనర్జీ కూడా కీలక పాత్రల్లో నటించాడు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు నేపథ్యంలో రూపొందించిన చిత్రమే 'భేదియా'. ఈ చిత్రాన్ని తెలుగులో ‘తోడేలు’ పేరిట ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో తోడేలు కాటుకు గురైన యువకుడిగా భాస్కర్ పాత్రలో వరుణ్ కనిపించనున్నాడు. డాక్టర్ అనిక పాత్రను కృతి పోషిస్తుంది. ఇటీవల గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ‘కాంతార’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. -
వివాదంలో కరణ్ జోహార్ లేటెస్ట్ మూవీ, నిర్మాతపై వరుస ఆరోపణలు
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ‘కరణ్ నా స్క్రిప్ట్ దొంగలించాడు’ అని ఓ రచయిత, ‘నా పాటను కాపీ కొంటాడు’ అని ఓ పాకిస్తాన్ సింగర్ ఆయనపై ఆరోపణలు చేశారు. కాగా కరణ్ జోహార్‌అప్‌కమింగ్ మూవీ ‘జగ్ జుగ్ జీయో’. ఇందులో వరుణ్ ధావన్, కియారా అద్వాని హీరోయిన్లు కాగా నీతూ కపూర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి దీనిపై సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అయ్యింది. చదవండి: సినీనటుడు ఆలీ సడన్ సర్ప్రైజ్.. ఎవరికీ చెప్పకుండా.. ఈ నేపథ్యంలో నిన్న(మే 22న) ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. అప్పటి నుంచి ఈ సినిమాను వివాదాలు చూట్టుముడుతున్నాయి. తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ తనది అంటూ విశాల్ సింగ్ అనే ఓ రచయిత వరుస ట్వీట్స్ చేశాడు. ‘కరణ్ తెరకెక్కిస్తున్న జగ్ జుగ్ జీయో కథను ‘బన్నీరాణి’ పేరుతో జనవరి 2020లో రిజిస్టర్ చేసుకున్నాను. ఫిబ్రవరి 2022లో ధర్మప్రోడక్షన్‌కు ఈ కథ మెయిల్ చేసి మీతో కలిసి ఈ సినిమాను నిర్మించాలనుకుంటున్నాను నాకు ఒక చాన్స్ ఇవ్వాలని కోరాను. దీనికి ధర్మ ప్రొడక్షన్ నుంచి కూడా నాకు సమాధానం వచ్చింది. కానీ, తీరా నా కథను జగ్ జుగ్ జీయో పేరుతో తెరకెక్కించారు. మాట ఇచ్చి ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదు కరణ్ జోహార్ గారు’ అంటూ అతడు మొదట ట్వీట్ చేశాడు. Screenshot of my mail to @DharmaMovies dated 17.02.2020. An official complaint will follow.@karanjohar @somenmishra0 @jun6lee #JugJuggJeeyo#BunnyRani@Varun_dvn @AnilKapoor @raj_a_mehta pic.twitter.com/k7WV4kvK2a — Vishal A. Singh (@Vishal_FilmBuff) May 22, 2022 చదవండి: క్యాన్సర్ చికిత్స అనుభవాన్ని పంచుకున్న నటి ఆ తర్వాత ధర్మ ప్రొడక్ష్‌న్‌కు అతడు చేసిన స్క్రిప్ట్ మెయిల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేశాడు. అనంతరం తనకు మద్దతు ఇవ్వాలని, ఏది నిజం ఏది అబద్ధమో తెలుసుకోవాలంటూ వరుస ట్వీట్ చేస్తూ కరణ్‌పై విమర్శలు గుప్పించాడు. ఈ సందర్భంగా కరణ్ జోహార్, అతని నిర్మాణ సంస్థ, ఇతర నిర్మాతలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని, వారిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని అతడు తెలిపాడు. మరోవైపు కరణ్ జోహార్ తన లేటెస్ట్ మూవీలో తన పాటకు కాపీ చేశారని పాకిస్తాన్ సింగర్ ఆరోపించాడు. సింగర్ అబ్రార్ ఊ హాకు గాయకుడు నిజానికి ‘జగ్ జుగ్ జీయో’లోని నాచ్ పంజాబన్ అనే పాట తనదని, ఈ పాటను ఆయన కాపీ చేశారని పేర్కొన్నాడు. కాగా చిత్రాన్ని రాజ్ మెహతా దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్, వయాడాట్ 18 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. If this would have been for publicity..would have given statements to all publications that contacted me today. Chose to lay down the facts in public and let you all decide what is right and what is wrong? सच और साहस हो जिसके मन में अंत में जीत उसी की रहे!https://t.co/n1f8MW3VqT — Vishal A. Singh (@Vishal_FilmBuff) May 22, 2022 Outcome of this matter will be a strong comment on the power of @swaindiaorg? If #HindiCinema industry has to flourish... @swaindiaorg has to be a strong body. Hope it's taking note of this matter..and ideally should act suo moto. Being a member..am bound to register a complaint. — Vishal A. Singh (@Vishal_FilmBuff) May 22, 2022 -
వరుణ్ ధావన్‌కి కరోనా పాజిటివ్.. జుగ్ జుగ్.. చిన్న బ్రేక్!
కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా హిందీ చిత్రం ‘జుగ్ జుగ్ జియో’ (కలకాలం జీవించు, ఆశీర్వాదం, దీవెన వంటి చాలా అర్థాలున్నాయి) చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ‘‘కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత మేం షూటింగ్ ఆరంభించాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మా సినిమా హీరో వరుణ్ ధావన్‌కు కరోనా సోకింది. వరుణ్‌తో పాటు మరికొందరు కరోనా బారిన పడ్డారు. ఎలాగోలా ఆ షెడ్యూల్‌ను పూర్తి చేశాం. కరోనా సెకండ్ వేవ్‌ను ఊహించని మేం మా సినిమా షూటింగ్‌ను ఈ నెలలో ముంబయ్‌లో ప్లాన్ చేశాం. ముందస్తుగా ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. కానీ ఇప్పుడు షూటింగ్ జరపలేని పరిస్థితి. ఈసారి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. పరిస్థితులు చక్కబడిన తర్వాతే చిత్రీకరణ ఆరంభిస్తాం. ఇప్పటికి నలభై శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అని ఈ చిత్రదర్శకుడు రాజ్ మెహతా పేర్కొన్నారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నీతూ కపూర్, అనిల్ కపూర్ కీలక పాత్రధారులు. -
డ్యాన్సర్లను ఆదుకున్న ప్రముఖ హీరో
ముంబై : కోవిడ్-19తో సినిమా షూటింగ్‌లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న టెక్నీషియన్లు. సిబ్బందికి బాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు తమకు తోచిన సాయం చేస్తున్నారు. తాజాగా కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో జీవనోపాథి కోల్పోయిన బాలీవుడ్ డ్యాన్సర్లకు అండగా నిలిచేందుకు స్టార్ హీరో వరుణ్ ధావన్ ముందుకొచ్చారు. గతంలో వరణ్ ధావన్ పీఎం కేర్స్ఫండ్తో పాటు వివిధ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు విరాళాలు అందచేశారు. సినీ పరిశ్రమలో పనిచేసే దినసరి వేతన కార్మికులనూ ఆదుకున్నారు. సినిమాల్లో తనతో పనిచేసిన బాలీవుడ్ డ్యాన్సర్లకు ఆర్థిక సాయం అందించాలని ఈసారి నిర్ణయించుకున్నారు. పని కోల్పోయిన డ్యాన్సర్ల బ్యాంకు ఖాతాలో కొంత నగదు జమచేశారు. ఏబీసీడీ 2, స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ వంటి సినిమాల్లో డ్యాన్సర్‌గా నటించిన వరుణ్ ధావన్ నిజజీవితంలో డ్యాన్సర్లను ఆదుకోవాలని నిర్ణయించడాన్ని పలువురు ప్రశంసించారు. చదవండి : ప్రముఖ నటుడు జగదీప్ కన్నుమూత -
కరణ్ న్యూలుక్.. హీరో కామెంట్!
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు, నటుడు కరణ్ జోహార్ న్యూలుక్‌పై ఆయన శ్రేయోభిలాషి, మిత్రుడు, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఫన్నీ కామెంట్ చేశారు. కరణ్ న్యూలుక్ ఓ హాలీవుడ్ సినిమాలోని విలన్‌ను తలపిస్తోందని వరుణ్ అన్నారు. శుక్రవారం( ఏప్రిల్ 24 ) నాడు వరుణ్ ధావణ్ పుట్టిన రోజు సందర్భంగా కరణ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయనను పలకరించారు. శుభాకాంక్షలు తెలుపుతూ వరుణ్‌తో కాసేపు ముచ్చటించారు. కరణ్ మాటల సందర్భంగా‘‘ నేను మొదటిసారి నెరిసిన జుట్టుతో ఇన్‌స్టాగ్రామ్‌లో నీతో చాట్ చేయటానికి వచ్చాను. అదీ నీ పుట్టిన రోజు కాబట్టి’’ అని అన్నారు. దీనిపై స్పందించిన వరుణ్ ధావన్‘‘ నువ్వు జేమ్స్ బాండ్ సినిమాలో విలన్‌లాగా కనిపిస్తున్నావు’’ అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. అనంతరం కలర్ ఎందుకు వేసుకోలేదని ప్రశ్నించగా.. ‘‘ మా పిల్లలు యశ్, రూహీలు నన్ను బుద్దా అని పిలుస్తున్నారు. అందుకే జుట్టుకు రంగువేసుకోకుండా వదిలేశా. దీనికి తోడు లాక్డౌన్ కారణంగా పిల్లలు, తల్లితో కలిసి ఇంట్లోనే ఉంటున్నాను. ఇక రసాయనాలనుంచి జుట్టుకు బ్రేక్ ఇద్దామని భావించా’’నని కరణ్ తెలిపారు. చదవండి : కరోనా కాలంలో షేక్ హ్యాండ్ ఇచ్చిన హీరో! -
నిన్ను విసిగించడం మిస్ అవుతా
వరుణ్ ధావన్, సారా అలీ ఖాన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కూలీ నెం.1’. 1995లో వచ్చిన ‘కూలీ నెం.1’ చిత్రానికి ఇది రీమేక్. పాత సినిమాకి దర్శకత్వం వహించిన డేవిడ్ ధావనే రీమేక్‌ని తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా సారా మాట్లాడుతూ – ‘‘కూలీ’ సినిమాని ముగించాం. మా బెస్ట్, కూలెస్ట్ కూలీగా ఉన్నందుకు వరుణ్ ధావన్‌కు స్పెషల్ థ్యాంక్స్. నా లగేజ్‌ని నాతో నువ్వు మోయించినట్టుగా ఎవ్వరూ మోయించి ఉండలేరు. నిన్ను విసిగించడం కచ్చితంగా మిస్ అవుతాను’’ అని అన్నారు. ‘కూలీ నెం.1’ చిత్రం మే 1న విడుదల కానుంది. అన్నట్లు.. వరుణ్ ధావన్.. డేవిడ్ ధావన్ కుమారుడు అనే సంగతి తెలిసిందే. -
అది మా అందరి వైఫల్యం
సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, ఆలియా భట్, సోనాక్షీ సిన్హా ముఖ్య పాత్రల్లో అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కళంక్’. ఎన్నో అంచనాలతో ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలయిన ఈ చిత్రం నిరాశపరచించి. ఈ చిత్ర వైఫల్యం గురించి వరుణ్ ధావన్ స్పందించారు. ‘‘కళంక్’ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదంటే అది బ్యాడ్ ఫిల్మ్ అని అర్థం. ఎక్కడో మా టీమ్ అందరూ ఫెయిల్ అయ్యాం. సినిమా అనేది టీమ్ అందరి కష్టం. కేవలం దర్శకుడినో, నిర్మాతనో తప్పుబట్టడం సరికాదు. టీమ్‌లో భాగమైనందుకు నేను కూడా నిందని తీసుకుంటున్నాను. ఫెయిల్యూర్ని మన కచ్చితంగా ప్రభావం చూపాలి. లేదంటే మనం చేస్తున్న పనిని ప్రేమతో చేస్తున్నట్టు కాదని నా ఉద్దేశం’’ అన్నారు. -
నంబర్ 1 కూలీ
కొత్త లైసెన్స్ తీసుకుని పని మొదలుపెట్టాడు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. కానీ వరుణ్ లైసెన్స్ తీసుకున్నది కూలి పని చేయడానికి. కొత్తగా కష్టం ఏం రాలేదు. కొత్త సినిమా ‘కూలీ నం 1’ను స్టార్ట్ చేశాడంతే. వరుణ్ ధావన్ హీరోగా డేవిడ్ ధావన్ దర్శకత్వంలో ‘కూలీ నం.1’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సారా అలీఖాన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాను మే 1 కార్మిక దినోత్సవం సందర్భంగా స్టార్ట్ చేశారు వరుణ్ ధావన్. ‘‘సరిగ్గా ఏడాది తర్వాత నం.1 కూలీ వస్తాడు. మస్త్ మజా చేస్తాడు’’ అని ఈ సందర్భంగా వరుణ్ పేర్కొన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కానుంది. డేవిడ్ థావన్ దర్శకత్వంలోనే 1995లో వచ్చిన ‘కూలీ నం.1’ చిత్రానికి ఈ 2019 ‘కూలీ నం.1’ రీమేక్ అని బీటౌన్ టాక్. -
కలాంక్ ఫస్ట్ లుక్.. జాఫర్‌గా వరుణ్
వరుణ్ ధావన్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న భారీ పీరియడ్డ్రామా కలాంక్. కరణ్ జోహర్, సాజిద్ నదియావాలా, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ వర్మన్ దర్శకుడు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాధురి దీక్షిత్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ హీరో వరుణ్ ధావన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో వరుణ్ భయంలేని ప్రేమికుడు జాఫర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ ఫస్ట్ లుక్‌పోస్టర్‌ను చిత్రయూనిట్ సోషల్ మీడియా పేజ్‌లో రిలీజ్ చేశారు. Fearless in love. Fearless for love. Super happy to present Zafar! #MenOfKalank #Kalank@Varun_dvn @MadhuriDixit @duttsanjay #AdityaRoyKapur @sonakshisinha @abhivarman @karanjohar #SajidNadiadwala @apoorvamehta18 @foxstarhindi @DharmaMovies @NGEMovies pic.twitter.com/YHYzfu77cq — Alia Bhatt (@aliaa08) 7 March 2019 -
శ్రీదేవి గర్వపడేలా చేయాలనుకున్నా
‘‘శ్రీదేవి చనిపోయి ఏడాది పూర్తయింది. కానీ శ్రీదేవి మన మధ్య లేరు అనే వాస్తవాన్ని అంగీకరించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం శ్రీదేవి చేయాల్సిన ఓ పాత్రను నేను చేయడం చాలా ఎమోషనల్‌గా అనిపిస్తోంది. శ్రీదేవి గర్వపడేలా చేస్తాననే అనుకుంటున్నాను’’ అని మాధురీ దీక్షిత్ అన్నారు. కరణ్ జోహార్ నిర్మాణంలో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, ఆలియా భట్, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రల్లో అభిషేక్ వర్మన్ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ చిత్రం ‘కళంక్’. ఇందులో మాధురి పోషిస్తున్న పాత్రను మొదట శ్రీదేవి చేయాలి. కానీ శ్రీదేవి అకాల మరణంతో ఆ పాత్ర మాధురికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి మాధురి మాట్లాడుతూ – ‘‘ఈ పాత్ర కోసం కరణ్ నన్ను సంప్రదించగానే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాను. శ్రీ, నేను చివరిసారిగా డిజైనర్ మనీష్ మల్హోత్రా బర్త్‌డే పార్టీలో కలుసు కున్నాం. ఆ పార్టీలో పిల్లలిద్దరితో (జాన్వీ, ఖుషీ) సంతోషంగా కనిపించింది. సడన్‌గా శ్రీదేవి చనిపోవడం బాధగా అనిపించింది. తన మరణంతో జీవితం చాలా చిన్నది అనే విషయాన్ని తెలుసుకున్నాను. ప్రతిరోజుని ఆస్వాదించాలి, ఆనందించాలి అని తెలుసుకున్నాను. ఎందుకంటే రేపు ఏమవుతుందో మనం ఎవ్వరం ఊహించలేం’’ అని అన్నారు. ‘కళంక్’ ఈ ఏడాది రిలీజ్ కానుంది. -
లాకింగ్ అండ్ పాపింగ్!
యూకేలో ఉండే ఆ పాకిస్థానీ అమ్మాయి, పంజాబ్ కుర్రాడు డ్యాన్స్‌లో పోటీపడాల్సి వచ్చింది. ఒకరు విజేతగా నిలుస్తారు. ఆ తర్వాత వీరిద్దరికీ పోటీగా మరో డ్యాన్సర్ సవాల్ విసిరాడు. ఫైనల్‌గా విజేత ఎవరు? అనే విషయం తెలుసుకోవాలంటే చాలా టైమ్ పడుతుంది. కానీ ఈ సినిమా లండన్ షెడ్యూల్ చిత్రీకరణ కోసం మాత్రం టైమ్ దగ్గర పడింది. రెమో డిసౌజా దర్శకత్వంలో వరుణ్ ధావన్, శ్రద్ధాకపూర్, నోరా ఫతేహీ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమాకు ‘స్ట్రీట్ డ్యాన్సర్స్ 3’ అనే టైటిల్ ఖరారు చేశారు. అలాగే ఈ సినిమాలో వరుణ్ ధావన్, శ్రద్ధాకపూర్లకు చెందిన లుక్స్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో పంజాబ్ కుర్రాడి పాత్రలో వరుణ్ ధావన్, పాకిస్థానీ అమ్మాయి పాత్రలో శ్రద్ధాకపూర్ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం శ్రద్ధా ఐదురకాల కొత్త డ్యాన్సులు నేర్చుకున్నారు. ‘అఫ్రో, లాకింగ్ అండ్ పాపింగ్, క్రంప్, టుట్టింగ్ అండ్ యానిమేషన్, అర్బన్’.. ఈ ఐదు రకాల నృత్యాలను యూకేలో ఉంటున్న భారతీయ నృత్యకారుడు ప్రశాంత్ షిండే, టానియా టోరియాల నుంచి నేర్చుకున్నారు. శ్రద్ధాకి డ్యాన్స్ నేర్పించడం కోసం ఈ ఇద్దరూ ఇండియా వచ్చారు. ఇక ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈ నెల 10న లండన్‌లో జరగనుంది. మార్చి 25 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఇంతకుముందు రెమో డిసౌజా దర్శకత్వంలోనే 2013లో ‘ఏబీసీడీ’ (ఏనీ బడీ కేన్ డ్యాన్స్), 2015లో ‘ఏబీసీడీ 2’ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘స్ట్రీట్ డ్యాన్సర్స్ 3’ చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్ 8న విడుదల చేయాలనుకుంటున్నారు. -
స్పెషల్ సాంగ్‌లో మహేష్ హీరోయిన్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన వన్ నేనొక్కడినే సినిమాతో వెండితెరకు పరిచయం అయిన భామ క్రితీ సనన్. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ భామ తరువాత బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. హీరోపంతి సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయి క్రితి తరువాత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ భామ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడిందని తెలుస్తోంది. కరణ్ జోహర్ నిర్మాణంలో వరుణ్ ధావన్, ఆదిత్య చోప్రా హీరోలుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా కలాంక్లో క్రితి స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇప్పటికే ఈ పాటకు సంబందించిన షూటింగ్ కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. క్రితి హీరోయిన్గా నటించిన లుకా చప్పీ త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతుండగా అర్జున్ పఠియాలా, హౌస్‌ఫుల్ 4, పానిపట్ సినిమాలు నిర్మాణదశలో ఉన్నాయి. -
అటు డ్యాన్స్... ఇటు ఫైట్
డ్యాన్స్ మూమెంట్స్‌ను బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత డైరెక్టర్ యాక్షన్ అనగానే ఫైట్ స్టార్ట్ చేస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. ఏంటి? ఆమె కన్ఫ్యూజ్ అయ్యారా? అని ఆలోచించకండి. ఎందుకంటే శ్రద్ధా ఫుల్ క్లారిటీతోనే అలా చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే... ప్రస్తుతం ‘సాహో’ మూవీ యాక్షన్ సీన్స్‌లో పాల్గొంటున్నారామె. ఈ సినిమా షాట్ గ్యాప్‌లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేది రీసెంట్గా సైన్ చేసిన ‘ఏబీసీడీ 3’ చిత్రం కోసమే. రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్‌ధావన్ కథానాయకుడు. నోరా ఫతేహి కీలక పాత్ర చేస్తారు. తొలుత ఈ సినిమాలో కత్రినా కైఫ్‌ను కథానాయికగా తీసుకున్నారు. కానీ, సల్మాన్‌తో కత్రినా చేస్తున్న ‘భారత్’ సినిమా డేట్స్ ‘ఏబీసీడీ 3’తో క్లాష్ అవడం.. కత్రినా తప్పుకోవడంతో శ్రద్ధా లైన్లోకి వచ్చారు. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ఎక్కువ టైమ్ లేకపోవడంతో ‘సాహో’ సెట్లోనే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారట శ్రద్ధా కపూర్. శ్రద్ధా మాత్రమే కాదు.. వరుణ్ ధావన్ కూడా డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తున్నారు. అయితే ఆయన ముంబైలో.. శ్రద్ధా మాత్రం ఏ షూటింగ్లో ఉంటే అక్కడే. ‘సాహో, ఏబీసీడీ 3’ సినిమాలే కాకుండా ‘చిఛోరే, సైనా’ చిత్రాలతో బిజీగా ఉన్నారామె. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. -
అవును.. లవ్‌లో ఉన్నారు
జంటగా పార్టీలకు, ఫంక్షన్లకు వెళుతున్నారు కానీ తమ మధ్య ఉన్నది ప్రేమ అని మాత్రం ఇన్నాళ్లు బయటకు చెప్పలేదు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్. ‘కాఫీ విత్ కరణ్’ అనే షోలో భాగంగా నటాషాను లవ్ చేస్తున్నట్లు వరుణ్ ఒప్పుకున్నారు. ‘‘నటాషాతో నేను డేటింగ్లో ఉన్నాను. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నటాషా సాధారణమైన అమ్మాయి. ఆమె గురించిన వ్యక్తిగత విషయాలను బయటపెట్టడం నాకు ఇష్టం లేదు. ఆమె బాధపడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నాదే’’ అని చెప్పుకొచ్చారు వరుణ్. ఈ ఏడాది 31వ∙వసంతంలోకి అడుగు పెట్టిన వరుణ్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని ఊహించవచ్చు. ప్రస్తుతం అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ‘కళంక్’ సినిమాతో బిజీగా ఉన్నారాయన. సంజయ్‌దత్, మాధురీ దిక్షీత్, సోనాక్షి సిన్హా, ఆలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
సల్మాన్‌కు అతిథిగా..
‘నా సినిమాకి నువ్వు.. నీ సినిమాకి నేను’ అతిథులం అన్నట్లు ఉంది సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్‌ల వైఖరి. గతేడాది వరుణ్ ధావన్ నటించిన ‘జుద్వా 2’ సినిమాలో సల్మాన్‌ఖాన్ గెస్ట్ రోల్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. 1997లో సల్మాన్‌ఖాన్ హీరోగా చేసిన ‘జుద్వా’ సినిమాకు ‘జుద్వా 2’ సీక్వెల్ అని తెలిసిందే. ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘భారత్’ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి వరుణ్ ధావన్ అబుదాబీ వెళ్లారని బాలీవుడ్ టాక్. అంటే వరుణ్, సల్మాన్‌కు బదులు తీర్చుతున్నారన్నమాట. ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. కత్రినా కైఫ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో దిశా పాట్నీ, జాకీ ష్రాఫ్, టబు, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు చేస్తున్నారు. కొరియన్ మూవీ ‘ఓడ్ టు మై ఫాదర్’కి ‘భారత్’ రీమేక్. ఈ సినిమా మూడో షెడ్యూల్ అబుదాబీలో జరుగుతోంది. మరి.. వరుణ్ ధావన్ అతిథి పాత్రలో కనిపించేది పాటలోనా? లేక సీన్‌లోనా? అన్న విషయాన్ని మాత్రం టీమ్ బయట పెట్టడం లేదు. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్స్ ఢిల్లీ, పంజాబ్‌లో జరగనున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్ కానుంది. -
మేడ్ ఇన్ ఇండియా కలను కుట్టిన సూయిధాగ
మధ్యతరగతి జీవితాల్లోని సమస్యలు, ఆశల ప్యాచులతో కలల క్లాత్‌ను కుట్టిన సినిమా సూయిధాగ. ఆ కలే ఎంట్రప్రెన్యూర్షిప్! సినిమాలో చూపించింది ఒక కుటుంబం కలగానే. కానీ అది దేశానికి అన్వయించుకోవాలనేది బాటమ్ లైన్. మేక్ ఇన్ ఇండియా కాదు.. మేడ్ ఇన్ ఇండియా కావాలని ప్రభుత్వానికీ పంచ్ ఇచ్చింది. విషయం కథ సింపులే. దేశంలో చాలా చాలా దిగువ మధ్యతరగతి కుటుంబాల్లాగే మౌజీ (వరుణ్ ధావన్) వాళ్లదీ సామాన్య కుటుంబం. తాతల వృత్తి నేత. టైలరింగ్ కూడా. మారిన కాలంలో అన్నం పెట్టని వృత్తిని ఈసడించుకుంటూ పట్నం వచ్చి చేతకాని పనిలో సర్దుకుపోతుంటాడు మౌజీ తండ్రి (రఘువీర్ యాదవ్). తన పిల్లలూ అలాంటి ఏదో పనిలో పడి నెలకు ఇంత నికరాదాయం సంపాదిస్తే చాలని తపన పడ్తుంటాడు. తండ్రి కోరికను చిన్న కొడుకు తీరుస్తాడు. ఆ ఇరుకు ఇంట్లో, ఉమ్మడి కుటుంబపు చాదస్తపు భావాలతో తమ సంపాదనను పంచుకోవడం ఇష్టంలేక వేరే వీధిలో కాపురం పెడ్తాడు మౌజీ తమ్ముడు. అతనికి ఒక కొడుకు. భార్య చిన్న ఉద్యోగం చేస్తుంటుంది. ఇక మన హీరో.. అదే మౌజీ.. చేతిలో స్కిల్.. ప్రవర్తనలో ఆకతాయితనం ఉన్నవాడు. తండ్రి నస పడలేక ఓ కుట్టుమిషన్ దుకాణంలో పనిచేస్తుంటాడు. యజమాని, అతని కొడుకు మౌజీని ఓ బఫూన్లా ట్రీట్ చేస్తుంటారు. బట్టలు కుట్టడంలో మౌజీ దిట్ట. డిజైనింగ్‌లో అద్భుతాలు చేస్తుంటాడు. అంతటి విద్య పెట్టుకొని ఎవడి దగ్గరో ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకోవడం అతని భార్య మమత (అనుష్కా శర్మ)కు అస్సలు నచ్చదు. కానీ ఆమె మాట చెల్లదు ఆ ఇంట్లో. కారణం.. పెద్ద కొడుకు అదే మమత భర్త మౌజీని ఆ ఇంట్లో పనికిరాని వాడుగానే పరిగణిస్తుంటారు. ఉమ్మడి కుటుంబాల్లో సంపాదన లేని కొడుకుకి దక్కే అవమానమే కోడలికీ అందుతుంటుంది కదా. ఆ జంటకు ఆ ఇంట్లో ప్రైవసీ కూడా కరువే. అందుకే తన తమ్ముడికి కొడుకు పుట్టినా తనకు ఇంకా సంతానం లేని స్థితి. కొడుకుతో మాట్లాడ్డానికి కోడలు వెళ్లగానే అత్తగారు పిలుస్తుంటారు ఏదో పని మీద. అదీ ఆ జంట పరిస్థితి. ఫ్యాషన్ వరల్డ్‌లో లోకల్ బ్రాండ్.. భర్తకున్న ప్రతిభతో అతన్ని ఒక ఎంట్రప్రెన్యూర్‌గా చూడాలని మమత ఆరాటం. ఓ సంఘటనతో భర్తతో ఆ పిచ్చి ఉద్యోగం మాన్పించేస్తుంది. చెట్టు కింద కుట్టు మిషన్ పెట్టయినా బతుకుదామనే ధైర్యాన్ని నూరిపోస్తుంది. మమత చెప్పినట్టే వింటాడు మౌజీ. ఈలోపు అతని తల్లికి గుండెనొప్పి వస్తుంది. స్టంట్ వేయాల్సి వస్తుంది. ఆమెకు సౌకర్యంగా ఉండడం కోసం ఓ మ్యాక్సీ కుడ్తాడు మౌజీ. అది ఆసుపత్రిలో ఉన్న మిగతా లేడీ పేషంట్లకూ నచ్చుతుంది. తమకూ కుట్టివ్వమని కొంత డబ్బు అడ్వాన్స్ ఇస్తారు. కుట్టిస్తాడు. ఆసుపత్రి మేనేజర్‌కు ఈ వ్యవహారం నచ్చదు. అందులో కమిషన్ కొట్టేయడానికి మౌజీని బెదిరిస్తాడు. మౌజీ మరదలు అన్న ఓ బ్రోకర్. ఆయన, ఆసుపత్రి మేనేజర్ కుమ్మక్కయ్యి మౌజీ మ్యాక్సీ డిజైన్‌ను ఓ ఫ్యాషన్ బ్రాండ్‌కు అమ్మేస్తారు... మౌజీని మభ్యపెట్టి. పైగా మౌజీని, మమతను ఆ ఫ్యాషన్ బ్రాండ్ ఫ్యాక్టరీలో కుట్టుకూలీలుగా మారుస్తారు. ఈ మోసం తెలుసుకున్న మౌజీ తిరగబడ్తాడు. దెబ్బలు తింటాడు. ఇంట్లో వాళ్ల చేత పని చేతకాని వాడిగా ముద్ర వేయించుకుంటాడు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోడు. భర్త టాలెంట్ మీద నమ్మకాన్నీ కోల్పోదు మమత. ఆ ఇద్దరు ఆ యేటి రేమండ్స్ ఫ్యాషన్ ఫండ్ పోటీలకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. రెండు డిజైన్లు తయారు చేసి డెమో ఇస్తారు. కాంపిటీషన్లో పాల్గొనే అర్హత సంపాదించుకుంటారు. కానీ తర్వాత కుట్టు సాగాలి కదా.. ఎలా? వాళ్లుండే వీధిలో వాళ్లంతా తమ లాగే చేనేత, కుట్టు కార్మికులే. వృత్తి మీద నమ్మకం సన్నగిల్లి చిన్నాచితకా పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్లందరినీ పోగేస్తారు. సంగతి చెవిన వేస్తారు. ఎవరూ సుముఖంగా ఉండరు. అయినా పట్టువదలరు. తమ డిజైన్స్ సెలెక్ట్ అయితే జీవితాలు మారిపోతాయని ఆశలు రేపుతారు. కలల సూదిలోకి ఆకాంక్షల దారం ఎక్కించి ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను డిజైన్ చేయడం మొదలుపెడ్తారు. సూయిధాగ బ్రాండ్‌ను ర్యాంప్ మీద ప్రదర్శిస్తారు. డిజైన్స్ అద్భుతం.. కానీ ప్రొఫిషియెన్సీ ఉంటే నెగ్గేవారు అన్న మాట వినపడుతుంది జడ్జీల నోట. ఓడిపోయామని అర్థమవుతుంది. కానీ కుంగిపోరు. ఫ్యాషన్ వరల్డ్‌లో లోకల్ టాలెంట్ కూడా పోటీలో ఉందని చూపించామని సముదాయించుకుంటారు. ‘గెలవడం కాదు బరిలో ఉన్నామని చూపించాం. నిరాశతో వృత్తి మానేయడం కాదు.. పోటీతో పదును తేలాలి.. మనమే యజమానులు కావాలి’’ అని ఉత్సాహంతో ఇంటికి బయలుదేరుతుంటే.. రీ ఓటింగ్ జరిగి.. సూయిధాగానే ఫండ్ గెలుచుకుంది అనే మాట వింటారు. తర్వాత సూయిధాగా.. మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్‌లైన్‌తో టాప్ బ్రాండ్ అవుతుంది. ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కడా సినిమాటిక్ ట్విస్ట్‌లు లేకుండా అత్యంత సహజంగా రోల్ చేసిన సినిమా ఇది. దేశానికి ఎంట్రప్రెన్యూర్షిప్ అవసరాన్ని తెలియజెప్పిన మూవీ. గ్లోబలైజేషన్‌తో మన వృత్తికారులను కూలీలుగా మార్చొద్దు.. ఊతమిచ్చి ఎంట్రప్రెన్యూర్స్‌గా నిలబెట్టాలని కోరుతున్న చిత్రం. కాలం కన్నా ముందు పరిగెత్తగల ఆలోచన ఉంది.. ట్రెండ్‌ను క్రియేట్ చేయగల టాలెంట్ ఉంది.. కావల్సింది ప్లాట్‌ఫామ్.. అది ప్రభుత్వం కల్పించాలి. ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించాలి. ఆత్మహత్యలు ఉండవు.. ఏ రంగంలో కూడా! ఈ ఆశావహ ఫ్రేమే సూయిధాగ! – శరాది -
‘మమత’ మనసును దోచేసింది : విరాట్ కోహ్లి
అనుష్క శర్మ, వరుణ్ ధావన్ జంటగా నటించిన ‘సూయీ ధాగా’ నేడు విడుదలైన సంగతి తెలిసిందే. గత రాత్రి ప్రదర్శించిన ప్రత్యేక షోను వీక్షించిన బాలీవుడ్ ప్రముఖులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాను వీక్షించిన టీమిండియా సారథి విరాట్ కోహ్లి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘‘సుయీ ధాగా’ సినిమాను గురువారం రాత్రి చూసినప్పుడు నచ్చింది. మళ్లీ రెండోసారి చూసినప్పుడు మరింత నచ్చింది. ఈ చిత్రం భావోద్వేగంతో కూడుకున్న రోలర్‌కోస్టర్ లాంటిది. సినిమాలోని ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా నటించారు. మౌజీ(వరుణ్ ధావన్) సూపర్‌గా నటించాడు. కానీ మమత(అనుష్క శర్మ) పాత్ర నా మనసును దోచుకుంది. సినిమాలో ఆమెది చాలా నిదానమైన పాత్ర అయినప్పటికీ.. శక్తిమంతమైన, ప్రభావవంతమైన పాత్ర. మమత మీ మనసులు కూడా దోచుకుంటుంది. నా ప్రేమను(అనుష్క) చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. సినిమాను మిస్ కావొద్ద’ని ట్వీట్ చేశాడు. -
మాధురీతో పోటీ
ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ సినిమా కోసం బల్గేరియాలో ఉన్నారు కథానాయిక ఆలియా భట్. ఈ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే ఆమె ఏం చేస్తారంటే ‘కళంక్’ సినిమా సెట్లో జాయిన్ అవుతారు. ‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ‘కళంక్’. సంజయ్‌దత్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, ఆదిత్యారాయ్ కపూర్, సోనాక్షీ సిన్హా ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ పీరియాడికల్ మూవీలో మాధురీ దీక్షిత్, ఆలియా భట్ కాంబినేషన్లో కథక్ డ్యాన్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సాంగ్ ఉందట. ఆల్రెడీ పండిట్ బిర్జు మహారాజ్ వద్ద మాధురి కథక్ నేర్చుకున్నారు. ఇక ఆలియా భట్ కూడా ఈ సాంగ్ కోసం ఎప్పటి నుంచో కథక్ నేర్చుకుంటున్నారట. అంతేకాదు సాంగ్ షూట్ టైమ్ దగ్గర పడుతుండటంతో రెండు నెలలుగా కఠోర సాధన చేస్తున్నారట ఆలియా. ఏమైనా డౌట్స్ వస్తే మాధురి దగ్గర క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నారట. సీనియర్‌తో ఈ పోటీలో ధీటుగా నిలవాలనుకుంటున్నారట. మరి.. ఈ సాంగ్ ఏ రేంజ్లో ఉంటుందనేది వెండితెరపై చూడాల్సిందే. ‘కళంక్’ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అలాగే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జున, డింపుల్ కపాడియా ముఖ్య తారలుగా నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుంది. -
చెల్లెలి కోసం చేనేత బహుమతులు
‘‘ఏదోటి కొనిచ్చే దానికంటే మన సమయాన్ని వెచ్చించి మన వాళ్లకు ఏది నచ్చుతుందో అది సెలెక్ట్ చేసి ఇచ్చిన బహుమతుల్లో ప్రేమ ఎక్కువుంటుంది అనే విషయాన్ని నమ్ముతాను’’ అంటున్నారు వరుణ్ ధావన్. రక్షా బంధన్ సందర్భంగా ప్రతి సంవత్సరం తన చెల్లెలకు ఏదో బహుమతి ప్రెజెంట్ చేయడం వరుణ్‌కు అలవాటట. ఈ సంవత్సరం తనే కొన్ని చేనేత చీరలు, దుప్పట్టాలు, డైరీలు.. ఇలా అన్నీ చేత్తో చేసిన సామాన్లను స్వయంగా సెలెక్ట్ చేసి, గిఫ్ట్‌గా బహూకరించదలిచారట. ‘‘ప్రతి సంవత్సరం రాఖీ పండగకి మా చెల్లెలకు గుర్తుండిపోయే గిఫ్ట్స్ ఇవ్వడం చాలా ఇష్టం. ‘సూయి ధాగా’ సినిమా చేస్తున్నప్పుడు మేడ్ ఇన్ ఇండియా ప్రాడక్ట్స్ గురించి తెలుసుకున్నాను. వాటినే గిఫ్ట్‌గా ఇవ్వదలిచాను. నా చెల్లికి నచ్చుతాయనే అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. -
తనయుడు దర్జీ.. తండ్రి దర్జా
సినిమాలోని పాత్రల కోసం రకరకాల వృత్తుల్లో ట్రైనింగ్ తీసుకుంటారు యాక్టర్స్. ఆ సినిమా పూర్తయ్యాక అది ఉపయోగపడొచ్చు, పడకపోవచ్చు. కానీ బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ నేర్చుకున్న కళతో తండ్రి డేవిడ్ ధావన్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చాడు. ‘సూయి ధాగా’లో వరుణ్ దర్జీగా కనిపించనున్నారాయన. దాని కొసం టైలర్‌గా ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. అప్పుడు తీసుకున్న ట్రైనింగ్‌తోనే తండ్రి కోసం షర్ట్ కుట్టిపెట్టారట. ఆగస్ట్ 16న డేవిడ్ ధావన్ బర్త్‌డే. ఈ సందర్భంగా స్పెషల్‌గా తనే ఓ చొక్కా కుట్టి గిఫ్ట్ చేసి, తండ్రిని సర్ప్రైజ్ చేశాడట వరుణ్. ‘‘నేను ఫుల్‌టైమ్ టైలరింగ్ నేర్చుకోలేదు. సినిమా కోసం కొని టెక్నిక్స్ తెలుసుకున్నాను. మా డాడ్ ఇప్పటికీ నన్ను ఏమీ తెలియని యాక్టర్ అనుకుంటుంటారు. ఈ సినిమాతో కొంచెం ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ అని ఒప్పుకుంటారని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు వరుణ్. సో.. కుమారుడు దర్జీగా బర్త్‌డే ప్రజెంట్ ఇస్తే డేవిడ్ ధవన్ దర్జాగా చొక్కా వేసుకొనుంటారని ఊహించవచ్చు. -
మౌజీ.. మమతల కహానీ
ఇక్కడున్న ఫొటో చూశారుగా! అనుష్కా శర్మను వరుణ్ ధావన్ ఏదో విషయమై నిలదీస్తున్నట్లుగా ఉంది కదూ! మరి వరుణ్ అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? అనే విషయం తెలుసుకోవాలంటే మాత్రం కాస్త టైమ్ పడుతుంది. శరత్ కటారియా దర్శకత్వంలో వరుణ్ ధావన్, అనుష్కా శర్మ జంటగా రూపొందిన చిత్రం ‘సూయిధాగా’. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ‘మేడిన్ ఇండియా’ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో టైలర్ మౌజీ పాత్రలో వరుణ్, మమత పాత్రలో అనుష్క నటించారు. మరి.. మౌజీ, మమత దంపతుల కథ ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఏడాది సెప్టెంబర్ 28 వరకు ఆగాల్సిందే. -
అయ్యో..గాయపడ్డాడు!
కెమెరా..రోలింగ్..యాక్షన్.. అన్నారు డైరెక్టర్. అంతే.. వరుణ్‌ధావన్ కో–స్టార్‌పై డోర్‌ను విసిరారు. దెబ్బ తగిలింది మాత్రం వరుణ్‌కే. విసిరేటప్పుడు డోర్ అతని మోచేతికి తగలడంతో గాయపడ్డారట. హీరోగారికి దెబ్బ తగిలిందని తెలియగానే నిర్మాత కరణ్ జోహార్ సెట్స్‌కి వచ్చేశారట. ఇదంతా హిందీ మూవీ ‘కళంక్’ సెట్లో జరిగింది. ‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్‌వర్మన్ దర్శకత్వంలో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, ఆలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్, సోనాక్షి సిన్హా ముఖ్య తారలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘కళంక్’. ఈ సినిమా షూటింగ్ ముంబైలోని ఓ స్టూడియోలో వేసిన భారీ సెట్లో జరుగుతోంది. ప్రజెంట్ ఈ సినిమా కోసం స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారట. ఇది వరుణ్ ఇంట్రడక్షన్ సాంగ్ అని, ఈ పాటలోనే డోర్ విసురుతారని సమాచారం. సాంగ్‌లో యాక్షన్ అన్నమాట. -
ఇక నో సీక్రెట్
తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ నటాషా దలాల్‌తో వరుణ్ ధావన్ లవ్‌లో ఉన్నారని ఎప్పట్నుంచో బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. వరుణ్, నటాషా కెమెరా కంట పడకుండా అప్పుడప్పుడు రెస్టారెంట్స్, థియేటర్స్‌కు సీక్రెట్‌గా వెళుతున్నారని కూడా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇప్పుడు సీక్రెట్ మీటింగ్స్‌కి ఫుల్స్టాప్ పెట్టిందీ జంట. సోనమ్ కపూర్, ఆనంద్ అహూజా రిసెప్షన్ వేడుకకు వీరిద్దరూ జోడీగా హాజరయ్యారు. దీంతో ఇక నో సీక్రెట్స్ అని చెప్పకనే చెప్పారు వరుణ్ అండ్ నటాషా. ఇలా జంటగా నలుగురికీ కనిపించడంతో వరుణ్, నటాషా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబో తున్నారన్న కొత్త రాగం బాలీవుడ్లో మొద లైంది. రీసెంట్గా తాను హీరోగా నటించిన ‘అక్టోబర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఏడాదిలో వివాహం చేసుకుంటానేమోనని వరుణ్ చెప్పడం విశేషం. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రస్తుతం అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో ‘కళంక్’ సినిమాలో నటిస్తున్నారు వరుణ్«. ఈ సినిమాలో న్యూ లుక్ కోసం ఆయన స్పెషల్ వర్కౌట్స్ చేస్తున్నారు. -
ముంబైలో ఢిల్లీ!
ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లడానికి దాదాపు 1400 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఫ్లైట్‌లో వెళ్లినా రెండుగంటల టైమ్ పడుతుంది. కానీ ‘కళంక్’ టీమ్ మెంబర్స్ మాత్రం అరగంటలోపే వెళ్లగలరు. అందుకోసం దాదాపు 17 కోట్లు ఖర్చుపెట్టారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. మేటర్ కంటిన్యూ చేస్తే క్లారిటీ దొరుకుతుంది. హిందీ మూవీ ‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్, ఆలియా భట్, సంజయ్‌దత్, మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా, అదిత్యా రాయ్ కపూర్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘కళంక్’. ఈ నెల 18న మూవీని స్టార్ట్ చేశారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల కోసం ముంబైలోని ఓ స్టూడియోలో ఢిల్లీ సెట్ వేశారు. అదీ అసలు విషయం. ఢిల్లీ వెళ్లకుండా ముంబైలోనే ఢిల్లీని చూస్తోంది ఈ యూనిట్. శుక్రవారం నుంచి మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, ఆలియా భట్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ‘‘కళంక్’ సినిమా సెట్లో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ‘బక్కెట్ లిస్ట్’ మూవీ తర్వాత కరణ్ జోహార్‌తో అసోసియేట్ అయిన రెండో చిత్రమిది’’ అన్నారు మాధురీ దీక్షిత్. ఆమె లీడ్ రోల్ చేసిన మరాఠి సినిమా ‘బక్కెట్ లిస్ట్’ వచ్చే నెల 25న రిలీజ్ కానుంది. అంతేకాదు మరాఠీలో ఒక చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారామె. ‘కళంక్’ సినిమాతో పాటు ‘టోటల్ ధమాల్’ అనే హిందీ చిత్రంలోనూ నటిస్తున్నారు మాధురీ. ‘టోటల్ ధమాల్’ ఈ ఏడాది డిసెంబర్లో, ‘కళంక్’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానున్నాయి.