
సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతారనేది చెప్పలేం.

అలా ఓ బ్యూటీ ఓరకంట చూస్తున్న ఫొటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి.

ఆమె ఎవరా అని ఆరా తీస్తే.. తెలుగు సినిమాతో హీరోయిన్ అయిన వామికా గబ్బి అని తెలిసింది.

పంజాబీ, హిందీ, మలయాళ, తెలుగు సినిమాల్లో నటించింది వామికా గబ్బి. 2007లో ఇండస్ట్రీలోకి వచ్చింది కానీ ఇప్పటివరకు సరైన బ్రేక్ దక్కలేదు.

అలా ఈమె పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.

సుధీర్ బాబు 'భలే మంచి రోజు' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది.

ఈ మూవీ కమర్షియల్‌గా ఫెయిల్ కావడంతో వామిక మళ్లీ తెలుగులో కనిపించలేదు.

ఈమె ఒక హీరోయిన్‌గా నటించిన 'బేబీ జాన్' మూవీ తాజాగా థియేటర్లలోకి వచ్చింది.

ఇందులో వామికా.. టీచర్ పాత్రలో నటించింది. ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.

సినిమా రిజల్ట్ సంగతి పక్కనబెడితే సోషల్ మీడియాలో మాత్రం ట్రెండ్ అవుతోంది.









