Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Illegal Cases Against Ysrcp Leaders In Nellore District1
వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటనపై మొదలైన అక్రమ కేసుల పర్వం

సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనపై అక్రమ కేసుల పర్వం మొదలైంది. వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. 30 పోలీసు యాక్ట్‌ అమల్లో ఉండగా నిబంధనలు అతిక్రమించి ఆందోళన చేశారని మాజీ మంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డితో పాటు మరికొందరిపై దర్గామిట్ట పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు.ప్రసన్న ఇంటికి సమీపంలో వైఎస్‌ జగన్‌ కోసం ఎదురుచూస్తున్న పార్టీ శేణ్రులపై పోలీసులు అకారణంగా లాఠీచార్జ్‌ చేశారు. దీంతో ప్రసన్న రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ మేరకు ఆయనపై మొదటి కేసు నమోదుగా కాగా.. అభిమానులను అడ్డుకునే క్రమంలో కావలి స్పెషల్‌ బ్రాంచ్‌ హెచ్‌సీ మాలకొండయ్య కిందపడడంతో ఆయన చేయి విరిగిందని.. ప్రసన్నకుమార్‌రెడ్డి, బి.శ్రీనివాస్‌యాదవ్, మరికొందరిపై మరో తప్పుడు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారంటూ కొందరు యువకులపైనా కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది.కాగా, వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటన సందర్భంగా ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి సమీ­పంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి వైఎస్‌ జగన్‌ వస్తా­రని తెలియడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులతో­పాటు అభిమానులు, ప్రజలు అక్కడికి చేరుకు­న్నారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఎలాంటి హడావుడి చేయకుండా వైఎస్‌ జగన్‌ను చూసేందుకు ప్రశాంతంగా నిరీక్షిస్తున్నారు.ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికేందుకు ప్రసన్నకుమార్‌రెడ్డి ఉద­యం 10.30 గంటలకు తన ఇంటికి వంద మీటర్ల దూ­రంలోని ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌ ప్రాంతానికి చేరుకున్నారు. అంతలో పోలీ­సులు జోక్యం చేసుకుంటూ.. అక్కడి నుంచి ముందుకెళ్లాలని చెప్పడంతో వారి మాటను గౌరవించి వారు చెప్పిన చోటు­కు వెళ్లారు. అదే సమయంలో దర్గామిట్ట సీఐ రోశయ్య, కొందరు పొలీస్‌ సిబ్బంది అకార­ణంగా ప్రసన్న­తో­పాటు పార్టీ కేడర్‌పై లాఠీచార్జ్‌ చేసి నెట్టే­శారు. దీంతో ప్రసన్నకుమార్‌రెడ్డి చేతికి గాయ­మైంది. పోలీసులు నెట్టేయడంతో ఆయన కిందప­డ­బోయారు. కార్య­కర్తలు పట్టుకోవడంతో ప్రమా­దం తప్పింది.పోలీ­సుల తీరుతో ప్రసన్నకు­మార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల దురుసు ప్రవర్తనకు ఎస్పీ వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘మా అధినేత వైఎస్‌ జగన్‌ వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటా.. పోలీసులు ఏం చేసుకుంటారో చేసుకోండి.. అరెస్ట్‌ చేస్తారా.. చేయండి’ అంటూ రోడ్డుపై బైఠా­యి­ంచారు. మధ్యా­హ్నం 1.15 గంటల (వైఎస్‌ జగన్‌ అక్కడికి చేరుకునే వరకు) వరకు మండుటెండలో నడిరోడ్డు­పైనే కూర్చున్నారు. పోలీసులు ఓ దశలో ఆయన్ను అక్కడి నుంచి తరలించేందుకు వ్యాన్‌ తీసుకొచ్చా­రు. పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉందని భావించి, ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

Marco Rubio Says India buying Russian oil Is Big Problem2
భారత్‌ కారణంగా పుతిన్‌ రెచ్చిపోతున్నారు.. రుబియో సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: భారత్‌, రష్యా చమురు కొనుగోలు విషయమై అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా దగ్గర భారత్‌ కొంటున్న చమురుతోనే పుతిన్‌.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే భారత్‌తో చర్చల్లో తమను ఇబ్బందిపెట్టే అంశమని వ్యాఖ్యలు చేశారు.అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో గురువారం ఫాక్స్‌ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘అన్ని దేశాల్లాగే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు చమురు, బొగ్గు, గ్యాస్‌ కొనగలిగే శక్తి భారత్‌కు ఉంది. అయితే, భారత్‌.. తమ అవసరాల దృష్ట్యా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. భారత్‌కు భారీగా ఇంధన అవసరాలున్నాయి. రష్యాపై పలు దేశాల ఆంక్షల వల్ల అక్కడ భారత్‌కు చమురు చౌకగా లభిస్తోంది. దురదృష్టవశాత్తూ భారత్‌ చమురు కొనుగోలు చేస్తున్న కారణంగానే రష్యాలను నిధులు సమకూరుతున్నాయి. వాటిని రష్యా.. ఉక్రెయిన్‌తో యుద్ధం చేయడంలో వాడుకుంటోంది. అదే యుద్ధంలో మనగలగడానికి రష్యాకు ఉపయోగపడుతోందన్నారు. అలాగే, ఇదే భారత్‌తో చర్చల్లో అమెరికాను ఇబ్బందిపెట్టే అంశం. ప్రపంచ వాణిజ్యంలో భారత్‌ వాటాదారు. వ్యూహాత్మక భాగస్వామి. అయితే అన్ని అంశాల్లో మాదిరిగా విదేశాంగ విధానంలోని ప్రతి విషయంలో 100 శాతం సమయం కేటాయించడం సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు.ఇక, అంతకుముందు.. భారత్, రష్యా బంధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విరుచుకుపడ్డారు. తనకేం సంబంధం లేదంటూనే శాపనార్థాలు పెట్టారు. ఇద్దరూ వారి మృత ఆర్థిక వ్యవస్థలను దిగజార్చుకోనీయండని, కలిసి మునగనీయండని వ్యాఖ్యానించారు. బుధవారం భారత్‌పై 25 శాతం సుంకాలతోపాటు పెనాల్టీ విధిస్తూ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాతో భారత్‌ ఏం చేస్తుందన్న విషయాన్ని అసలు పట్టించుకోబోమని, వారిద్దరూ మునిగిపోతుంటే మాకెందుకని, మిగిలిన అందరి గురించి పట్టించుకుంటామని స్పష్టం చేశారు. ‘మనకు భారత్‌ స్నేహితురాలే అయినా ఆ దేశంతో స్వల్ప లావాదేవీలే ఉన్నాయి. ఆ దేశం సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌లో దాడులు ఆపాలని ప్రపంచమంతా గొంతెత్తి అరుస్తుంటే.. భారత్‌ మాత్రం రష్యా నుంచి ఆయుధాలను, ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.#BREAKING | US Secretary of State Marco Rubio calls India a "strategic partner" while also expressing concern over its continued energy imports from Russia. "Look, global trade – India is an ally. It’s a strategic partner. Like anything in foreign policy, you’re not going to… pic.twitter.com/m8OfCpHUXQ— NewsMobile (@NewsMobileIndia) July 31, 2025

Sports Ministry to Maharashtra Online Rummy Minister: Video3
రమ్మీ ఎఫెక్ట్‌.. మాణిక్‌కు క్రీడా మంత్రిత్వ శాఖ

సీరియస్‌గా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతుండగా.. ఓ మంత్రి సీరియస్‌గా ఫోన్‌ వంకే చూస్తూ వేళ్లు కదిలిస్తున్నారు. ఏం చేస్తున్నారా? అని చూస్తే.. ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతూ కనిపించారు. ఆ వీడియో వైరల్‌ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ మంత్రిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించగా.. విపక్షాలు ఆ చర్యలపై విమర్శలు గుప్పిస్తున్నాయి.అసెంబ్లీలో రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన మాణిక్‌రావ్‌ కోకాటేపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆయనను వ్యవసాయ శాఖ నుంచి తొలగించింది. అదే సమయంలో ఆయనకు వేరే పోర్ట్‌ పోలియోలు అప్పగించింది. మాణిక్‌రావ్‌ కొకటేకు క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు యువజన సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖలను కేటాయించింది ఫడ్నవిస్‌ ప్రభుత్వం. సిన్నార్‌ ఎమ్మెల్యే అయిన కోకటే.. ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన వీడియోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలూ ఆ వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. “#जंगली_रमी_पे_आओ_ना_महाराज…!”सत्तेतल्या राष्ट्रवादी गटाला भाजपला विचारल्याशिवाय काहीच करता येत नाही म्हणूनच शेतीचे असंख्य प्रश्न प्रलंबित असताना, राज्यात रोज ८ शेतकरी आत्महत्या करत असताना सुद्धा काही कामच नसल्याने कृषिमंत्र्यांवर रमी खेळण्याची वेळ येत असावी.रस्ता भरकटलेल्या… pic.twitter.com/52jz7eTAtq— Rohit Pawar (@RRPSpeaks) July 20, 2025ఎన్‌సీపీ(పవార్‌ వర్గం) ఎమ్మెల్యే అయిన కోకటే చర్యపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ తరుణంలో ఆయన నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన అజిత్‌ పవార్‌ వివరణ తీసుకున్నారు. గురువారం ఆ నివేదికను సీఎం ఫడ్నవిస్‌కు పంపారు. ఆ వెంటనే ఆయనకు వేరే శాఖలను అప్పగించారు. అయితే.. మంత్రి వర్గం నుంచి తప్పించుకుండా శాఖను మార్చడంపై విపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి.మూడు నెలల్లో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. ఈ వ్యవసాయశాఖ మంత్రి తీరికగా చట్ట సభలో రమ్మీ ఆడుకుంటూ కూర్చున్నారు. అలాంటి వ్యక్తిని ఇంకా మంతత్రిగా కొనసాగించడం ఏంటి? అని ఫడ్నవిస్‌ ప్రభుత్వాన్నిఎన్సీపీ(శరద్‌ పవార్‌ వర్గం) ఎంపీ సుప్రియా సులే ప్రశ్నించారు.అయితే తాను ఫోన్‌ ఆపరేట్‌ చేస్తుండగా పాపప్‌ నోటిఫికేషన్‌ వచ్చిందని, ఉద్దేశపూర్వకంగా తాను దానిని తెరవలేదని కోకటే అంటున్నారు. ఇదిలా ఉంటే.. మరో ఎన్‌సీపీ ఎమ్మెల్యే దత్తాత్రేయ భరణేకి వ్యవసాయ శాఖను కేటాయించారు.

AP Police Constable Results Released4
ఏపీ కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల

సాక్షి, అమరావతి: ఏపీలో ఎట్టకేలకు పోలీసు కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను రాష్ట్ర హోం మంత్రి అనిత, ఏపీ డీజీపీ శుక్రవారం ఉదయం విడుదల చేశారు. ఈ మేరకు ఫలితాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. పోలీస్‌ శాఖలో ఉన్న తీవ్ర సిబ్బంది కొరతను అధిగమించేందుకు 2022లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 6,100 పోస్టులతో నోటిఫికేషన్‌ జారీ చేసింది. అక్టోబర్‌లో నోటిఫికేషన్‌, 2023లో ప్రిలిమినరీ పరీక్ష, 2024 డిసెంబర్‌లో ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించారు. అయితే.. రిజల్ట్‌ కోసం క్లిక్‌ చేయండి👉 https://slprb.ap.gov.in/PCFWTRES/FWEPCRESULTS.aspxPETలో అర్హత సాధించిన 37,600 మంది అభ్యర్థులకు ఈ ఏడాది జూన్‌ 1వ తేదీన మెయిన్స్‌ రాత పరీక్ష నిర్వహించారు. అటుపై ఓఎంఆర్‌ షీట్లు జూలై 12, 2025 వరకు డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంచారు. ఫలితాల విడుదల న్యాయపరమైన చిక్కులు ఎదురైనట్లు SLPRB చెబుతూ వచ్చింది. ఈ తరుణంలో జూలై 30న విడుదల చేయాల్సిన ఫలితాలు.. ఆలస్యంగా ఇవాళ(ఆగస్టు 1న) విడుదలయ్యాయి.

South Africa Champions win a thriller by 1 run5
ఉత్కంఠ పోరు.. ఒక్క ప‌రుగు తేడాతో సౌతాఫ్రికా విజ‌యం

ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీ ఫైనల్లో సౌతాఫ్రికా ఛాంపియన్స్‌ అడుగుపెట్టింది. గురువారం ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో ఒక్క పరుగు తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ను దక్షిణాఫ్రికా ఖారారు చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌(6) త్వరగా ఔటైనప్పటికి.. స్మట్స్‌(57), వాన్ వైక్(76) హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. ఆసీస్‌ బౌలర్లలో పీటర్‌ సిడల్‌ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. ఆర్చీ షార్ట్‌, బ్రెట్‌లీ, క్రిస్టియన్‌ తలా వికెట్‌ సాధించారు.పోరాడి ఓడిన ఆసీస్‌..అనంతరం లక్ష​​ చేధనలో ఆసీస్‌కు షాన్‌ మార్ష్‌(25), క్రిస్‌ లిన్‌(35) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత షార్ట్‌(33), క్రిస్టియన్‌(49) ఆసీస్‌ను గెలుపు దిశగా తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా విజయానికి 14 పరుగులు అవసరమయ్యాయి.వైన్‌ పార్నల్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి బంతికి క్వినీ సిక్స్‌ బాదగా.. రెండు బంతికి సింగిల్‌ తీసి క్రిస్టియన్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు. మూడో బంతికి రెండు, నాలుగు బంతికి ఒక పరుగు వచ్చింది. ఆ తర్వాత ఐదో బంతికి కూడా సింగిల్ రన్‌ మాత్రమే వచ్చింది. దీంతో చివరి బంతికి కంగారుల విజయానికి మూడు పరుగులు అవసరమవ్వగా.. డివిలియర్స్‌ అద్బుతమైన ఫీల్డింగ్‌తో ఒక్క రన్‌ మాత్రమే వచ్చింది.రెండో పరుగు తీసే క్రమంలో కౌల్టర్‌ నైల్‌ రనౌటయ్యాడు. ఒకవేళ రెండో పరుగు పూర్తి చేసి ఉంటే మ్యాచ్‌ టై అయ్యిండేది. ఇక శనివారం ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న ఫైనల్‌ పోరులో పాకిస్తాన్‌ ఛాంపియన్స్‌తో సౌతాఫ్రికా తలపడనుంది. కాగా ఇండియా ఛాంపియన్స్‌ సెమీఫైనల్‌కు ఆర్హత సాధించినప్పటికి, పాకిస్తాన్‌తో ఉద్రిక్తల కారణంగా టోర్నీ నుంచి వైదొలిగారు.చదవండి: IND vs ENG 5th Test: ఆధ‌ర్మసేన.. ఇంగ్లండ్‌కు ఫేవ‌ర్‌గా అంపైర్‌! ఫ్యాన్స్ ఫైర్‌

Tdp Leaders Cheated Hijras By Promising To Give Them House Site Pattas6
హిజ్రాలకు టీడీపీ నేతల టోకరా

సాక్షి, అనంతపురం: ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ టీడీపీ నేతలు హిజ్రాలను మోసం చేశారు. నగరంలోని లెక్చరర్స్‌ కాలనీ వెనుక ఉండే ప్రభుత్వ స్థలంలో ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ హిజ్రాలు, పలువురు బాధితులు మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న సదరు స్థలంలో ఇప్పటికే 120 మంది గుడిసెలు వేసుకుని నివాసముంటున్నామన్నారు.ఈ క్రమంలో తమకు పట్టాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల నుంచి రూ.1.50 లక్షల వరకూ బి.హనుమంతరాయుడు, బండారు చంద్ర, నీలకంఠ, సూరి, కిరణ్, మహబూబ్‌బాషా, బాబు వసూలు చేశారని, పట్టాలు ఇప్పించకపోగా, నగదు వెనక్కి ఇవ్వకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన డబ్బు వెనక్కు చెల్లించమంటే బతకలేరంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు.తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదంటూ త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, ఇంటి పట్టాలు ఇప్పిస్తామని మోసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో హిజ్రాలు నగ్న ప్రదర్శన చేస్తూ ఆందోళన చేశారు. దీంతో మోసం చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Oscar nominated actress Insures Rs 16 Crore For A Smile7
నవ్వుకు 16.5 కోట్ల ఇన్సూరెన్స్‌!

‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనేది మన సామెత. ‘నోరు ఆరోగ్యంగా ఉంటేనే నా కెరీర్‌ బాగుంటుంది. భవిష్యత్‌ బాగుంటుంది’ అనేది బ్రిటిష్‌ నటి, గాయని సింథియా ఎరివో మాట. ‘నవ్వే నా ఆస్తి.. నా గొంతే నా ఐశ్వర్యం’ అంటున్న సింథియా సుమారు 16.5 కోట్లకు తన గొంతును బీమా చేయించింది. మౌత్‌వాష్‌ బ్రాండ్‌ ‘లిస్టెరిన్‌’ ‘వాష్‌ యువర్‌ మౌత్‌’ క్యాంపెయిన్‌కు ఆమె ప్రచారకర్తగా ఉంది.‘వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నా అందమైన నవ్వు, శక్తిమంతమైన స్వరం నా గుర్తింపు’ అని చెప్పే సింథియా దంత శుభ్రత, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. వేదిక ఎక్కినప్పుడల్లా బ్రష్‌ చేసుకుంటుంది. నోటికి సంబంధించిన ఆరోగ్య జాగ్రత్తలు తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచినట్లు చెబుతుంది.శరీర భాగాలకు బీమా చేయించడం కొత్తేమీ, వింతేమీ కాదు. కాళ్లు, వీపు, స్వరపేటిక, నాలుక...ఇలా రకరకాల శరీర భాగాలకు బీమా చేసుకున్నవారు హాలీవుడ్‌లో చాలామందే ఉన్నారు. అక్కడ ఇదొక ట్రెండ్‌గా కొనసాగుతోంది. (చదవండి: నో ఫ్యాషన్‌ డైట్‌.. జస్ట్‌ ఆరు నెలల్లో 17 కిలోలు! స్లిమ్‌గా నటి దీప్తి సాధ్వానీ)

ED summoned Anil Ambani to appear for questioning on August 58
అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు

బ్యాంకు రుణాల ఎగవేత కేసులో రిలయన్స్ కమ్యునికేషన్స్‌ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5న ఈడీ ముందుకు హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే అనిల్‌ అంబానీకి సంబంధించిన కంపెనీల్లో సోదాలు నిర్వహించి పలుచోట్ల కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరిశీలించిన ఈడీ అనిల్‌ను ప్రశ్నించేందుకు తాజాగా సమన్లు జారీ చేయడం గమనార్హం.రూ.3,000 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించిన మనీలాండరింగ్ కేసుతో పాటు కొన్ని కంపెనీలు కోట్లాది రూపాయల ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో జులై 24న ఈడీ అనిల్‌ గ్రూప్‌ కంపెనీలపై దాడులు నిర్వహించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఢిల్లీ, ముంబైల్లో మూడు రోజుల పాటు అధికారులు సోదాలు నిర్వహించారు. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్‌లు సహా 50 ఇతర కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. మరో 25 మంది కీలక హోదాల్లో ఉన్నవారిని ప్రశ్నించారు. అంతకుముందు అనిల్‌ అంబానీ కంపెనీలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రెండు ఎఫ్ఐఆర్‌లను నమోదు చేసిన తరువాత ఈ దాడులు జరిగాయి.యస్ బ్యాంక్ రుణాలు2017 నుంచి 2019 వరకు యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3,000 కోట్ల రుణాలను అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ముందు బ్యాంకు ప్రమోటర్లతో సంబంధం ఉన్న సంస్థలకు నిధులు బదిలీ అయ్యాయని ఈడీ అధికారులు తెలిపారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌ఎఫ్ఎల్)కు సంబంధించిన విషయాలను ఈడీతో అధికారులు పంచుకున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,742.60 కోట్లుగా ఉన్న కార్పొరేట్ రుణ వితరణ 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.8,670.80 కోట్లకు పెరిగింది. యస్ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు సంబంధించిన లంచం కోణంలో కూడా విచారణ జరిపినట్లు ఈడీ తెలిపింది.ఇదీ చదవండి: రిటైర్‌ అవుతున్నారా? అద్దె ఆదాయం కొంత వరకే!‘ఫ్రాడ్‌’గా వర్గీకరణరిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనే రెండు కంపెనీలు జులై 26న స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఈమేరకు దాడులకు సంబంధించిన విషయాలను ధ్రువీకరించాయి. ఈ దాడులు తమ వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు, వాటాదారులు, ఉద్యోగులు లేదా మరే ఇతర వాటాదారులపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదని తెలిపాయి. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) సహా కొన్ని నియంత్రణ, ఆర్థిక సంస్థలు అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీలకు సంబంధించి తమ వద్ద ఉన్న ధ్రువపత్రాలను ఈడీతో పంచుకున్నాయి. అనిల్ అంబానీ, అంబానీల గ్రూప్ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కామ్)ను ‘ఫ్రాడ్‌’గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వర్గీకరించింది.

Trump increases tariffs Canada levies to 359
ట్రంప్‌ సుంకాల మోత.. అధికంగా 41 శాతం, పాకిస్తాన్‌పై ఎంతంటే?

వాష్టింగన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సుంకాలు బాంబు పేల్చాడు. దాదాపు 70 దేశాలపై తాజాగా సుంకాలను విధిస్తూ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీంతో, కొత్త టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి. కొత్తగా విధించిన వాటిలో అత్యధికంగా సిరియాపై 41 శాతం టారిఫ్‌లను ట్రంప్‌ ప్రకటించారు. కెనడాపై 35 శాతానికి సుంకాలను పెంచారు. ఇక, భారత్‌పై 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే.వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కొత్తగా టారిఫ్‌లను విధించారు. డజన్ల కొద్దీ వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలను విధించారు. సిరియాపై అత్యధికంగా 41 శాతం విధించగా.. కెనడాపై 25 శాతం నుంచి 35 శాతానికి సుంకాల పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 🇺🇸 NOW: President Trump signed an Executive Order to further modify reciprocal tariff rates. pic.twitter.com/e9rtOcf5Kq— Cointelegraph (@Cointelegraph) July 31, 2025అలాగే, లావోస్‌, మయన్మార్‌పై 40 శాతం, స్విట్జల్యాండ్‌పై 39 శాతం, ఇరాక్‌, సెర్బియాపై 35 శాతం పన్నులు విధించారు. భారత్‌పై 25 శాతం, పాకిస్తాన్‌పై 19 శాతం, బంగ్లాదేశ్‌పై 20శాతం, శ్రీలంకపై 20 శాతం టారిఫ్‌లు విధిస్తూ.. ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇదిలా ఉండగా.. బ్రిక్స్‌ దేశాలపై సుంకాల మోత మోగిస్తానన్న ట్రంప్‌ అన్నంత పని చేశారు. భారత్‌పై 25శాతం సుంకాలను విధించిన ఆయన.. బ్రెజిల్‌పై సుంకాలను ఏకంగా 50శాతానికి పెంచారు. శుక్రవారం నుంచే ఇవి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. మరోవైపు పొరుగుదేశం మెక్సికోపై కొంత కరుణ చూపారు. ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం కోసం 90 రోజుల సమయమిచ్చారు. అయితే ఈ సమయంలో 25శాతం సుంకం అమల్లో ఉంటుందని గురువారం ప్రకటించారు.🚨 BREAKING: President Trump just signed an order RAISING his reciprocal tariff on Canada from 25% to 35%, effective at midnightThis comes after Canadian PM Carney tried playing games on tradeFAFO, Canada! pic.twitter.com/a0caM6EgxY— Nick Sortor (@nicksortor) July 31, 2025భారత్‌పై 25 శాతం సుంకాలు పెనాల్టీతో కలిపి ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు చెప్పారు. ‘భారత్‌ మిత్రదేశమే అయినా.. సుంకాలు ఎక్కువగా ఉన్నందున వారితో పరిమిత స్థాయిలోనే వ్యాపారాలు చేస్తున్నాం. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్‌ ఒకటి. రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులు, చమురు కొనుగోలు చేస్తోంది. అందుకే 25 శాతం సుంకాలు, అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నాం. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి’ ప్రకటించారు.ఈ నేపథ్యంలో ట్రంప్‌ ప్రకటనపై భారత్‌ స్పందించింది. తాజాగా కేంద్రం ఓ ప్రకటనలో..‘ద్వైపాక్షిక వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటనను గమనించాం. సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నాం. రైతులు, వ్యాపారవేత్తలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. బ్రిటన్‌తో ఇటీవల కుదుర్చుకున్న ‘ఎఫ్‌టీఏ’ సహా ఇతరత్రా వాణిజ్య ఒప్పందాల మాదిరిగానే.. ఈ వ్యవహారంలోనూ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం’ అని తెలిపింది.

Nidhhi Agerwal Upcoming Movies Details10
'వీరమల్లు' పోయింది.. నిధి అగర్వాల్‌కు మిగిలిన ఒకే ఒక్క ఆశ ఇదే

అంతన్న డింతన్నడే గంగరాజు తరహాలో కొన్ని చిత్రాల ప్రచారం జరుగుతుంది. అయితే ఆ చిత్రాలు విడుదలైన తరువాత అంచనాలు తలకిందులవుతాయి. ఆప్రభావం హీరోహీరోయిన్లు సహా యూనిట్‌ అంతటిపైనా పడుతుంది. దాని నుంచి బయట పడడానికి చాలా పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నటి నిధిఅగర్వాల్‌ పరిస్థితి అలాగే తయారైంది. ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రం హిట్‌తో వెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ. ఆ తరువాత కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే ఏ ఒక్కటి ఆశించిన విజయాన్ని అందించలేదు. అలాంటి పరిస్థితుల్లో కోలీవుడ్‌ నుంచి పిలుపువచ్చింది. అలా ఇక్కడ రవిమోహన్‌కు జంటగా భూమి చిత్రంలో నటించే అవకాశం రావడంతో కోలీవుడ్‌లో ఒక రౌండ్‌ కొట్టవచ్చుననే అందరూ అనుకున్నారు. అయితే ఆ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల అవడంతో పెద్దగా నిధి అగర్వాల్‌కు ప్లస్‌ కాలేదు. ఆ తరువాత శింబుకు జంటగా ఈశ్వరన్‌ చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో నటిస్తున్న సమయంలో శింబుతో ప్రేమ అంటూ ప్రచారం వైరల్‌ అయ్యింది. అదే సమయంలో ఈశ్వరన్‌ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత ఉదయనిధి స్టాలిన్‌ సరసన ఒక చిత్రం చేశారు. అయినప్పటికీ నిధికి సరైన బ్రేక్‌ రాలేదు. ఆ తరువాత తెలుగులో పవన్‌ కళ్యాణ్‌ సరసన హరిహర వీరమల్లు వంటి భారీ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఈ సారి సక్సెస్‌ గ్యారంటీ అని ఈ అమ్మడు సంతోషపడి ఉండవచ్చు. అయితే ఈ చిత్రం విడుదల కోసం ఐదేళ్లు చూశారు. ఈ చిత్రం ఫలితం నిధి అగర్వాల్‌కు నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం ఈమెకు ఓకే ఒక్క ఆశ రాజాసాబ్‌. ప్రభాస్‌ సరసన నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో నిధి అగర్వాల్‌ మళ్లీ అవకాశాల కోసం పోరాటం మొదలు పెట్టారు. అందుకోసం ప్రత్యేకంగా తీయించుకున్న ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement