Baby John Movie
-
Keerthy Suresh: అటు సంతోషం.. ఇటు డెడికేషన్..
మహానటి కీర్తి సురేశ్ ఈ మధ్యే పెళ్లి బంధంలో అడుగుపెట్టింది. డిసెంబర్ 12న అతడితో ఏడడుగులు వేసింది. తొలుత గోవాలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోగా తర్వాత క్రిస్టియన్ పద్ధతిలోనూ ఉంగరాలు మార్చుకుని వెడ్డింగ్ సెల్రేషన్స్ జరుపుకున్నారు. పెళ్లయి వారం కూడా కాలేదు, అప్పుడే తన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంది. అంతేకాదు, మెడలో పసుపు తాడుతోనే ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం.బేబి జాన్కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ బేబి జాన్. వరుణ్ ధావన్, వామికా గబ్బి, జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రల్లో నటించారు. కలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. డిసెంబర్ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తికి హిందీలో ఇదే తొలి సినిమా కావడం విశేషం! ఈ క్రమంలో ముంబైలో ఏర్పాటు చేసిన ప్రమోషనల్ ఈవెంట్‌కు కీర్తి హాజరైంది.సంతోషంలో కీర్తివివాహ బంధంపై ఎనలేని గౌరవంతో తాళిని అలాగే ఉంచుకుని ఈవెంట్‌కు రావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు పెళ్లిలో హీరో విజయ్ ఆశీర్వదించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మా డ్రీమ్ ఐకాన్ విజయ్ సర్ మా పెళ్లికి హాజరై మమ్మల్ని ఆశీర్వదించాడు అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) చదవండి: సర్జరీ కోసం వెళ్తున్నా.. కాస్త ఆందోళనగానే ఉంది: శివరాజ్ కుమార్ -
భాష మారింది.. కీర్తి సురేశ్ రెమ్యునరేషన్ డబుల్?
'మహానటి' కీర్తి సురేశ్ తెలుగు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయిపోయింది. పేరుకే మలయాళీ గానీ టాలీవుడ్లోనే స్టార్ హీరోలతో వరస సినిమాలు చేసింది. రీసెంట్గా ఆంటోని తట్టిళ్ అనే బిజినెస్‌మ్యాన్ పెళ్లి చేసుకుంది. మరోవైపు ఈమె నటించిన తొలి హిందీ సినిమా 'బేబీ జాన్'.. వచ్చే వారం క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కానుంది. ఇప్పుడు ఈ మూవీ కోసం డబుల్ రెమ్యునరేషన్ తీసుకుందనే టాక్ నడుస్తోంది.ప్రముఖ నిర్మాత సురేశ్, ఒకప్పటి హీరోయిన్ మేనక కూతురైన కీర్తి సురేశ్.. 'నేను శైలజ' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఈ ఏడాది రిలీజైన ప్రభాస్ 'కల్కి'లో కారుకి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎంటర్టైన్ చేసింది. ఈమె నటించిన 'బేబీ జాన్' అనే హిందీ మూవీలో నటించింది. తమిళ సినిమా 'తెరి' రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: రూ.10 టికెట్లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త)ఒరిజినల్ సినిమాలో సమంత కనిపించిన పాత్రలో ఇప్పుడు కీర్తి సురేశ్ నటించింది. సౌత్‌లో నటిస్తే రూ.2 కోట్లు ఈమెకు ఇస్తారు. కానీ 'బేబీ జాన్'లో నటించినందుకుగానూ రూ.4 కోట్లు పైనే పారితోషికం ఇచ్చారట. బహుశా అందుకేనేమో గ్లామర్ విషయంలోనూ తగ్గేదే లే అన్నట్లు పాటల్లో కనిపించింది!ఇదే సినిమాలో నటించిన మిగతా నటీనటులు రెమ్యునరేషన్ విషయానికొస్తే హీరో వరుణ్ ధావన్‌కి రూ.15 కోట్లు పైనే ఇచ్చారట. విలన్‌గా చేసిన జాకీ ష్రాఫ్‌కి కోటిన్నర, మరో హీరోయిన్గా చేసిన వామికా గబ్బికి కోటి రూపాయలు, కీలక పాత్ర చేసిన సన్యా మల్హోత్రాకు రూ.40 లక్షల పారితోషికం ఇచ్చారట. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఇతడి శిష్యుడు కలీస్ దర్శకత్వం వహించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
నిర్మాతగా స్టార్ డైరెక్టర్ భార్య.. ట్రైలర్ చూశారా?
వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'బేబీ జాన్'. ఈ చిత్రాన్ని కలీస్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ అట్లీ భార్య ప్రియా అట్లీ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో విడుదల చేశారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ మూవీగానే బేబీ జాన్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ యాక్షన్ సీన్స్, ఫైట్స్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, వామికా గబ్బి రాజ్‌పాల్ యాదవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతమందించడం మరో విశేషం. -
క్రిస్మస్ కాదు టాలీవుడ్‌కి మినీ సంక్రాంతి
మరో నాలుగు రోజుల్లో 'పుష్ప 2' రిలీజ్ కానుంది. దీంతో ఈ వారం.. రిలీజైన తర్వాత వారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. కానీ క్రిస్మస్కి మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కుప్పలతెప్పలుగా మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఏకంగా డజను సినిమాలు క్రిస్మస్ వీకెండ్లో రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ అవేంటి వాటి సంగతేంటి?తెలుగు సినిమాల విషయానికొస్తే డిసెంబరు 20న అల్లరి నరేశ్ 'బచ్చలమల్లి' వస్తుంది. రీసెంట్గా రిలీజైన రా అండ్ రస్టిక్ టీజర్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నిజ జీవిత కథ ఆధారంగా తీశారు. దీనిపై అల్లరి నరేశ్ అంచనాలు పెట్టుకున్నారు. ప్రియదర్శి 'సారంగపాణి' కూడా ఇదే రోజున రిలీజ్ కానుంది. సున్నితమైన కామెడీ సినిమాలు తీస్తాడనే పేరున్న మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. ఇది హిట్ అవ్వడం వీళ్ల కెరీర్‌కి కీలకం.(ఇదీ చదవండి: నాన్న ఇంటికి రావొద్దన్నారు.. చచ్చిపోదామనుకున్నా: రాజేంద్ర ప్రసాద్)20నే 'మ్యాజిక్' అనే తెలుగు సినిమా కూడా రాబోతుంది. 'జెర్సీ' దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దీన్ని తీశారు. అనిరుధ్ మ్యూజిక్. ఇప్పటికైతే ఎలాంటి అంచనాల్లేవు. అదే రోజున విజయ్ సేతుపతి-వెట్రిమారన్ తమిళ డబ్బింగ్ మూవీ 'విడుదల 2' కూడా రానుంది. దీనికి సెపరేట్ ఆడియెన్స్ ఉన్నారు. అలానే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర 'యూఐ' కూడా ఇదే రోజున థియేటర్లలోకి రానుంది.హాలీవుడ్ నుంచి 'ముఫాసా' అనే కార్టూన్ మూవీ కూడా 20వ తేదీనే థియేటర్లలోకి రానుంది. సిటీల్లో మాత్రం పెద్ద చిత్రాలకు ఇది కాంపిటీషన్ అని చెప్పొచ్చు. మహేశ్ బాబు, షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు.. దీనికి ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చెప్పారు. ఇది ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.(ఇదీ చదవండి: అఫీషియల్: చరణ్ సినిమాలో 'మీర్జాపుర్' మున్నా భయ్యా)డిసెంబరు 25న అంటే క్రిస్మస్ రోజున రాబోతున్న తెలుగులో సినిమాల్లో కాస్త చెప్పుకోదగింది నితిన్ 'రాబిన్ హుడ్'. శ్రీలీల హీరోయిన్, 'భీష్మ' లాంటి హిట్ తర్వాత నితిన్-వెంకీ చేసిన మూవీ కావడంతో ఓ మాదిరి అంచనాలున్నాయి. ఈ రోజున రిలీజయ్యే వాటిలో ఇదొక్కటే తెలుగు మూవీ. ఇది కాకుండా మ్యాక్స్ (కన్నడ డబ్బింగ్), మార్కో (మలయాళ డబ్బింగ్), బరోజ్ (మలయాళ డబ్బింగ్), బేబీ జాన్ (హిందీ) చిత్రాలు కూడా లైన్లో ఉన్నాయి. డిసెంబరు 27న 'పతంగ్' అనే తెలుగు సినిమా కూడా ఉందండోయ్.ఇలా క్రిస్మస్ వీకెండ్లో ఏకంగా 12 వరకు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓ రకంగా చూసుకుంటే 'పుష్ప 2' తర్వాత, సంక్రాంతికి ముందు ఇన్ని మూవీస్ రావడం సాహసమనే చెప్పాలి. మినీ సంక్రాంతికి అని చెప్పొచ్చేమో!(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
కీర్తి సురేశ్ గ్లామర్ డోస్.. ట్రెండింగ్ లో 'బేబీ జాన్' సాంగ్ (ఫొటోలు)
-
'బేబీ జాన్' కోసం కీర్తి సురేశ్ గ్లామర్ డోస్.. పూర్తి సాంగ్ విడుదల
వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జోడీగా నటించిన చిత్రం ‘బేబీ జాన్’. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి తాజాగా గ్లామరస్ సాంగ్ విడుదలైంది. కోలీవుడ్‌లో సూపర్ హిట్ సినిమా 'తెరి'కి రీమేక్‌గా బేబీ జాన్ రానుంది. కీర్తీ సురేశ్, వామికా గబ్బి హీరోయిన్లుగా ఇందులో నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్‌పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న రిలీజ్ కానుంది.బేబీ జాన్ నుంచి విడుదలైన తాజా సాంగ్‌లో కీర్తి సురేష్ కాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఇప్పటి వరకు డీసెంట్ రోల్స్ చేస్తూ.. ఎక్కడా హద్దులు దాటకుండా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు వాటిని క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తను లిప్‌లాక్ సీన్లో కూడా నటించినట్లు సమాచారం. దీనంతటికి కారణం ఈ చిత్రంతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమేనని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. -
నేను ఇప్పుడే వచ్చాను!
వరుణ్ ధావన్ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘బేబీ జాన్’. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్‌పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న రిలీజ్ కానుంది. తాజాగా ‘బేబీ జాన్’ టెస్టర్ కట్ పేరుతో ఈ సినిమా కొత్త వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ‘బేబీ వాళ్లకు అర్థమయ్యే భాషలోనే చెప్పొచ్చుగా..’, ‘నాలాంటివాళ్లు గతంలో చాలామంది వచ్చి ఉండొచ్చు.. కానీ నేను తొలిసారిగా ఇప్పుడే వచ్చాను’ వంటి డైలాగ్స్‌తో పాటు ‘హో.. బేబీజాన్’ సాంగ్ వీడియోలో ఉంది. -
'తెరి' హిందీ రీమేక్ మూవీ టీజర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో విజయ్ హిట్ సినిమాల్లో 'తెరి' ఒకటి. దీన్నే 'పోలీసోడు' పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా హిట్ అయింది. ఆల్రెడీ తెలుగు వచ్చిన మూవీ పవన్ కల్యాణ్ రీమేక్ చేస్తున్నాడు. అదే 'ఉస్తాద్ భగత్ సింగ్' అని టాక్. చాలా ఏళ్ల క్రితమే ఇది మొదలైంది కానీ ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. మరోవైపు 'తెరి'ని హిందీలోనూ రీమేక్ చేశారు. 'బేబీ జాన్' పేరుతో దీన్ని తీస్తున్నారు. తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)ఒరిజినల్లో విజయ్, సమంత, అమీ జాక్సన్ చేయగా.. అదే పాత్రల్లో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్, వామికా గబ్బి నటించారు. టీజర్ చూస్తే చూచాయగా అదే కథ అని అర్థమైపోయింది. కాకపోతే అప్పట్లో ఓ మాదిరి మాస్ చూపిస్తే ఇప్పుడు ఎలివేషన్స్ కోసమా అన్నట్లు మూవీ తీసినట్లు కనిపిస్తుంది. సంగీతమందించిన తమన్ అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో హోరెత్తించాడు. టీజర్ చూస్తుంటే హిట్ కొట్టేలానే ఉంది.డిసెంబరు 25న 'బేబీ జాన్' థియేటర్లలోకి రానుంది. 'తెరి' దర్శకుడు అట్లీ దగ్గర సహాయకుడిగా చేసిన కలీస్.. ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. నిర్మాతల్లో అట్లీ భార్య కూడా ఒకరు. చాలా రోజుల నుంచి బాలీవుడ్లో సరైన మాస్ మూవీ రాలేదు. మరి ఆ లోటుని 'బేబీ జాన్' తీరుస్తుందేమో చూడాలి.(ఇదీ చదవండి: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేదిక అక్కడేనా..?) -
మరో అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్
అతిథి పాత్రలపై సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నట్లున్నారు. ఆల్రెడీ వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న హిందీ చిత్రం ‘బేబీ జాన్’లో సల్మాన్ ఖాన్ ఓ అతిథి పాత్ర చేస్తున్నారు. అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్న ‘సింగమ్ ఎగైన్’ సినిమాలోనూ సల్మాన్ ఓ గెస్ట్ రోల్ చేశారనే టాక్ బాలీవుడ్లో వినిపించింది. తాజాగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్న హిందీ మూవీ ‘వార్ 2’లో కూడా సల్మాన్ ఖాన్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారనే టాక్ బాలీవుడ్లో తెరపైకి వచ్చింది. వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా ‘వార్ 2’ చిత్రం తెరకెక్కుతోంది. ఆల్రెడీ ఈ స్పై యూనివర్స్‌లోని ‘టైగర్’ ఫ్రాంచైజీ చిత్రాల్లో సల్మాన్ ఖాన్ నటించారు. దీంతో ‘వార్ 2’లో సల్మాన్ ఖాన్ స్పైగా ఓ అతిథి ΄ాత్రను ΄ోషించేలా ఈ చిత్రదర్శకుడు అయాన్ ముఖర్జీ కథలో చిన్న మార్పు చేశారట. మరి... ‘వార్ 2’లో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఒకే సీన్లో కనిపిస్తే సినిమా ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు. ఇది నిజం అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆదిత్యా చో్ర΄ా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.