ఓటీటీలో కీర్తీ సురేష్ భారీ డిజాస్టర్‌ సినిమా | Keerthy Suresh Baby John Movie Likely To Release In OTT On This Date, Check Interesting Details | Sakshi
Sakshi News home page

Baby John OTT Release: ఓటీటీలో కీర్తీ సురేష్ భారీ డిజాస్టర్‌ సినిమా.. ముందే స్ట్రీమింగ్‌

Published Tue, Dec 31 2024 9:54 AM | Last Updated on Tue, Dec 31 2024 10:42 AM

Keerthy Suresh Baby John Movie OTT Streaming Will Be This Date

బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ నటించిన తాజా హిందీ చిత్రం ‘బేబీ జాన్‌’. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. కాలీస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్‌ యాపిల్‌ పతాకాలపై జ్యోతీ దేశ్‌పాండే, మురాద్‌ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 25న రిలీజ్‌ అయింది. అయితే బాక్సాఫీస్‌ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది.

బేబీ జాన్‌తో కీర్తి సురేష్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. అందువల్ల ఈ మూవీపై ఆమే చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్‌ కాలేదు. దీంతో తన ఫస్ట్‌ సినిమానే డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయితే, ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. వాస్తవంగా సినిమా విడుదలైన సమయం నుంచి సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని మొదట అనుకున్నారట. అయితే, సినిమా ఫలితం అనుకూలంగా రాకపోవడంతో జనవరి చివరి వారంలో బేబీ జాన్‌ ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఓటీటీలో తెలుగు, తమిళ్‌ భాషలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం.

2016లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' సినిమాలో విజయ్ దళపతి, సమంత నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే కథతో బేబీ జాన్‌ రీమేక్‌ అయింది. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి తమన్‌ మ్యూజిక్  అందించారు.  ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 60 కోట్ల గ్రాస్‌ మాత్రమే రాబట్టింది. నెట్‌ పరంగా రూ. 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో భారీ డిజాస్టర్‌ లిస్ట్‌లో బేబీ జాన్‌ చేరిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement