varun dhawan
-
అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన మొదటి హీరో!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ స్పందించారు. ఇలాంటి ఘటనలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం దురదృష్టకరమని అన్నారు. యాక్టర్ ఒక్కరే అన్ని విషయాలు చూసుకోలేరు కదా?అని ప్రశ్నించారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ను బాధ్యుడిని చేయడం సరికాదని వరుణ్ ధావన్ మద్దతుగా నిలిచారు.(ఇది చదవండి: Allu Arjun Arrest: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్)ప్రస్తుతం బేబీ జాన్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు వరుణ్ ధావన్. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. జైపూర్‌లో నిర్వహించిన ఈవెంట్లో వరుణ్ ధావన్ మాట్లాడారు. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక వ్యక్తిని మాత్రమే టార్గెట్ చేయడం సరైంది కాదన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు.అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి#VarunDhawan On #AlluArjun Arrest:'Actor Can't Take Everything On Himself. This Is Unfortunate'#BabyJohn #AlluArjunArrest pic.twitter.com/ofik8BhdNH— Ashwani kumar (@BorntobeAshwani) December 13, 2024 -
నిర్మాతగా స్టార్ డైరెక్టర్ భార్య.. ట్రైలర్ చూశారా?
వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'బేబీ జాన్'. ఈ చిత్రాన్ని కలీస్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ అట్లీ భార్య ప్రియా అట్లీ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో విడుదల చేశారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ మూవీగానే బేబీ జాన్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ యాక్షన్ సీన్స్, ఫైట్స్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, వామికా గబ్బి రాజ్‌పాల్ యాదవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతమందించడం మరో విశేషం. -
పబ్‌లో వాళ్లతో కలిసి పార్టీ చేసుకున్న సమంత (ఫొటోలు)
-
కీర్తి సురేశ్ గ్లామర్ డోస్.. ట్రెండింగ్ లో 'బేబీ జాన్' సాంగ్ (ఫొటోలు)
-
'బేబీ జాన్' కోసం కీర్తి సురేశ్ గ్లామర్ డోస్.. పూర్తి సాంగ్ విడుదల
వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జోడీగా నటించిన చిత్రం ‘బేబీ జాన్’. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి తాజాగా గ్లామరస్ సాంగ్ విడుదలైంది. కోలీవుడ్‌లో సూపర్ హిట్ సినిమా 'తెరి'కి రీమేక్‌గా బేబీ జాన్ రానుంది. కీర్తీ సురేశ్, వామికా గబ్బి హీరోయిన్లుగా ఇందులో నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్‌పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న రిలీజ్ కానుంది.బేబీ జాన్ నుంచి విడుదలైన తాజా సాంగ్‌లో కీర్తి సురేష్ కాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఇప్పటి వరకు డీసెంట్ రోల్స్ చేస్తూ.. ఎక్కడా హద్దులు దాటకుండా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు వాటిని క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తను లిప్‌లాక్ సీన్లో కూడా నటించినట్లు సమాచారం. దీనంతటికి కారణం ఈ చిత్రంతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమేనని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. -
సమంత కష్టాలు చిన్నవి కావు.. ఒకరోజు ఆక్సిజన్ ట్యాంక్..
బాలీవుడ్ హీరో వరుణ్‌ధావన్, టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీ. ఈ థ్రిల్లర్ షోకి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా వరుణ్ ధావన్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.సమంత కోసం ఆక్సిజన్ ట్యాంక్అతడు మాట్లాడుతూ.. సమంతతో కలిసి నటిస్తున్నప్పుడు కొంచెం టెన్షన్పడేవాడిని. ఎందుకంటే ఒక రోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమె కళ్లు మూసుకుని ఇది మళ్లీ అలాంటి రోజే అని చెప్పింది. అప్పటికే మేము రెండు గంటలుగా షూట్ చేస్తున్నాం. తర్వాత కాస్త బ్రేక్ చెప్పారు. వెంటనే ఒక ఆక్సిజన్ ట్యాంక్ వచ్చింది. అది సమంత కోసమే! తన పరిస్థితి చూసి భయమేసింది.ఉన్నట్లుండి పడిపోయిందిఆరోగ్యం సహకరించడం లేదని చెప్పి లీవ్ తీసుకోవచ్చు.. కానీ ఆమె అలా చేయలేదు. పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. మరోసారి ఏమైందంటే.. సెర్బియాలోని ఓ రైల్వే స్టేషన్లో షూటింగ్.. తను నా వెనక పరిగెత్తాలి. నేను పరిగెత్తుతున్నా.. తనూ నా వెనకే వేగంగా వస్తోంది. ఇంతలో ఉన్నట్లుండి కుప్పకూలింది. నేను వెంటనే తనను పట్టుకుని ప్యాకప్ చెప్పాను.తనొక ఇన్స్పిరేషన్అయితే రాజ్ అండ్ డీకే టెన్షన్ పడొద్దన్నారు. కాసేపటికి తనే మళ్లీ సాధారణ స్థితికి వస్తుందన్నారు. అలాంటి కండీషన్లోనూ తను సత్తువ కూడదీసుకుని యాక్ట్ చేస్తుందంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే.. సమంత కష్టాల ముందు నావి చాలా చిన్నవి. ఆమె నిజంగా ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చాడు.మయోసైటిస్కాగా మయోసైటిస్ వ్యాధివల్ల సిటాడెల్ సిరీస్ చేయడానికి మొదట సమంత ఒప్పుకోలేదు. తనకు బదులుగా వేరే హీరోయిన్లను సంప్రదించమని అడిగింది. అయినా దర్శకులు సమంతే కావాలని పట్టుపట్టడంతో చివరికి ఒప్పుకోక తప్పలేదు.చదవండి: నా కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదించేది: సూర్య -
నా కూతురి జోలికొస్తే చంపేస్తా: బాలీవుడ్ హీరో
కూతురి కంటే తండ్రికి ఏదీ ఎక్కువ కాదు. తన గారాలపట్టి కోసం ఆకాశంలోని చందమామను తీసుకురావడానికైనా వెనుకాడడు. తండ్రీకూతుళ్ల అనుబంధం అలాంటిది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా ఇలాంటి ప్రేమబంధంలోనే మునిగితేలుతున్నాడు. వరుణ్-నటాషా దలాల్ జంటకు ఈ ఏడాది జూన్‌లో పండంటి కూతురు పుట్టింది. ఆమెకు లారా అని నామకరణం చేశారు.చంపేయాలన్నంత కోపంకూతురు పుట్టాక తనలో వచ్చిన మార్పు గురించి వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. ఏ మనిషైనా పేరెంట్ అయ్యాక కచ్చితంగా మారతాడు. అలా మగవాడు తండ్రయ్యాక.. కూతురికి ఏమీ కానివ్వకుండా ఎక్కువ రక్షణ కల్పిస్తాడు. ఎవరైనా తనను కాస్త బాధపెట్టినా, చేయి చేసుకున్నా సరే వాళ్లను చంపేయాలన్నంత కోపం వస్తుంది. సీరియస్‌గా చెప్తున్నా.. నిజంగానే వాళ్లను చంపేయాలనిపిస్తుంది.ఈయన బాధేంటి? అనుకున్నాతండ్రయ్యాకే మా నాన్నను మరింత అర్థం చేసుకోగలుగుతున్నాను. ఎంత పనున్నా సరే సమయానికి ఇంటికి వచ్చేవాడు. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించేవాడు. అప్పుడు నాకస్సలు అర్థమయ్యేది కాదు. ఈయన బాధేంటి? అనుకునేవాడిని. నేనేమీ చిన్నపిల్లాడిని కాదు.. ఎందుకు ఎప్పుడూ అతడితో ఉండాలంటాడు? అని విసుక్కునేవాడిని. ఇప్పుడు నాకు కూతురు పుట్టాక అన్నీ అర్థమవుతున్నాయి అని చెప్పుకొచ్చాడు.చదవండి: గంగవ్వ ఎలిమినేట్.. ఆ కోరిక నెరవేరకుండానే.. -
సమంత కిల్లింగ్ లుక్స్.. ఘాటు పోజులిస్తూ ఆ హీరోతో ఫొటోషూట్ (ఫొటోలు)
-
నేను ఇప్పుడే వచ్చాను!
వరుణ్ ధావన్ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘బేబీ జాన్’. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్‌పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న రిలీజ్ కానుంది. తాజాగా ‘బేబీ జాన్’ టెస్టర్ కట్ పేరుతో ఈ సినిమా కొత్త వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ‘బేబీ వాళ్లకు అర్థమయ్యే భాషలోనే చెప్పొచ్చుగా..’, ‘నాలాంటివాళ్లు గతంలో చాలామంది వచ్చి ఉండొచ్చు.. కానీ నేను తొలిసారిగా ఇప్పుడే వచ్చాను’ వంటి డైలాగ్స్‌తో పాటు ‘హో.. బేబీజాన్’ సాంగ్ వీడియోలో ఉంది. -
'తెరి' హిందీ రీమేక్ మూవీ టీజర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో విజయ్ హిట్ సినిమాల్లో 'తెరి' ఒకటి. దీన్నే 'పోలీసోడు' పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా హిట్ అయింది. ఆల్రెడీ తెలుగు వచ్చిన మూవీ పవన్ కల్యాణ్ రీమేక్ చేస్తున్నాడు. అదే 'ఉస్తాద్ భగత్ సింగ్' అని టాక్. చాలా ఏళ్ల క్రితమే ఇది మొదలైంది కానీ ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. మరోవైపు 'తెరి'ని హిందీలోనూ రీమేక్ చేశారు. 'బేబీ జాన్' పేరుతో దీన్ని తీస్తున్నారు. తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)ఒరిజినల్లో విజయ్, సమంత, అమీ జాక్సన్ చేయగా.. అదే పాత్రల్లో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్, వామికా గబ్బి నటించారు. టీజర్ చూస్తే చూచాయగా అదే కథ అని అర్థమైపోయింది. కాకపోతే అప్పట్లో ఓ మాదిరి మాస్ చూపిస్తే ఇప్పుడు ఎలివేషన్స్ కోసమా అన్నట్లు మూవీ తీసినట్లు కనిపిస్తుంది. సంగీతమందించిన తమన్ అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో హోరెత్తించాడు. టీజర్ చూస్తుంటే హిట్ కొట్టేలానే ఉంది.డిసెంబరు 25న 'బేబీ జాన్' థియేటర్లలోకి రానుంది. 'తెరి' దర్శకుడు అట్లీ దగ్గర సహాయకుడిగా చేసిన కలీస్.. ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. నిర్మాతల్లో అట్లీ భార్య కూడా ఒకరు. చాలా రోజుల నుంచి బాలీవుడ్లో సరైన మాస్ మూవీ రాలేదు. మరి ఆ లోటుని 'బేబీ జాన్' తీరుస్తుందేమో చూడాలి.(ఇదీ చదవండి: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేదిక అక్కడేనా..?) -
అమితాబ్ బచ్చన్ 'గోల్డెన్ రూల్ ఆఫ్ పేరెంటింగ్'!
బాలీవుడ్ నటుడు, బిగ్ బీ అమితా బచ్చన్ ఎన్నో వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకుల మన్నలను అందుకున్న గొప్ప నటుడు. ఇప్పటికీ పలు టీవి షోల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అందరి ప్రశంసలందుకుంటున్నారు. ఆయన్ను ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసిన టీవీ షో "కౌన్ బనేగా కరోడ్‌పతి"గా చెప్పొచ్చు. ఆ కార్యక్రమం ఆయనకు ఎంతో పేరునే గాక లక్షలాది మంది అభిమానులను తెచ్చిపెట్టింది. ఇటీవల ఆయన కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 16లో, క్రికెటర్ వరుణ్ ధావన్‌తో కాసేపు సరదాగా ముచ్చటించారు. వారిద్దరి మధ్య సాగిన ఆసక్తికర సంభాషణ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఆ కార్యక్రమంలో అమితాబ్ కాబోయే తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అమూల్యమైన విషయాలను గురించి కూడా చెప్పారు. ఈ గోల్డెన్ రూల్స్‌ని పాటిస్తే మంచి తల్లిదండ్రులుగా పిల్లల మనుసును గెలుచుకోగలరని అన్నారు. ఇంతకీ అవేంటి?. 'గోల్డెన్ రూల్ ఆఫ్ పేరెంటింగ్' అంటే..ఇటీవల జరిగిన కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 16లో అమితాబ్ క్రికెటర్ వరణ్ ధావన్ తండ్రిగా నీ కొత్త జర్నీ ఎలా ఉందని ప్రశ్నించారు. ఇటీవలే వరుణ ధావన్ నటాషా దంపతులకు కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. అయితే ధావన్ తన కుమార్తెతో కనెక్ట్ అవుతున్నానని, ఆమె వచ్చాక తన జీవితం మొత్తం మారిపోయిందని నవ్వుతూ బదులిచ్చాడు. అప్పుడు అమితాబ్ ఈ దీపావళి నీకెంతో ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ పండుగకి నీ ఇంట్లోకి లక్ష్మీ దేవి వచ్చేసిందని అన్నారు. దానికి ప్రతిస్పందనగా ధావన్ "ఆమె రాకతో ప్రతిదీ మారిపోవడం మొదలైంది. ఇప్పటికీ తనకు ఎలా దగ్గర అవ్వాలా అనే విషయం గురించి నేర్చకుంటూనే ఉంటున్నా అని భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు." ధావన్. ఆ తర్వాత అమితాబ్‌తో నాన్న విధులు గురించి మాట్లాడుతూ..ఆ రోజుల్లో రాత్రిపూట మీ నిద్రకు ఇబ్బంది ఏర్పడేదా అని ధావన్ ప్రశ్నించగా..అందుకు అమితాబ్ బదులిస్తూ.. "తాను రాత్రిపూట హాయిగా నిద్రపోయేవాడినని, కాకపోతే కాస్త ఆందోళనగా ఉండేదని అన్నారు. అంతేగాదు అప్పటికి ఒక కొత్త గాడ్జెట్ వచ్చిందని దాన్ని శిశువు బెడ్ పక్కన పెడితే వారి చిన్న శబ్దం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుందంటూ.. నాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు." అమితాబ్. ఇక వరుణ్ తన పాప పడుకునే సమయం గురించి మాట్లాడుతూ..తన కూతురు కోసం లాలి పాట కూడా పాడుతున్నట్లు తెలిపారు. అంతేగాదు ఆ పాటను కూడా ఆ షోలో పాడి వినిపించారు ధావన్. ఆ కార్యక్రమంలో చివరగా ధావన్ అమితాబ్‌ని నటుడిగా కుటుంబ బాధ్యతలను ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు అని అడిగారు. అందుకు ఆయన ఒక సలహ సూచించారు. అది అత్యంత అమూల్యమైన రూల్ అని కూడా చెప్పారు. "ఎప్పుడూ మీ భార్యను సంతోషంగా ఉండేలా చూసుకోండి. ఆమె సంతృప్తిగా ఉంటే అన్ని బాధ్యతలు సునాయాసంగా నెరవేరిపోతాయి. ఆమె సంతోషంగా ఉంటే కుమార్తె కూడా హ్యాపీగా ఉంటుంది. దీన్ని సదా గుర్తించుకోండి. కుటుంబానికి మూల స్థంభం భార్యే. ఆమె సంతోషంగా ఉంటే అన్ని పనులు వాటంతట అవే సులభంగా అయిపోతాయి. దీన్ని పాటిస్తే ప్రతి కుటుంబం సంతోషంగా ఉండటమే గాక పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా ఉండగలుగుతారని అన్నారు." అమితాబ్.(చదవండి: విద్యాబాలన్ వెయిట్ లాస్ సీక్రెట్..కానీ వర్కౌట్లు మాత్రం..!) -
'సిటాడెల్' రెండో ట్రైలర్.. 'సమంత' కోసమే అనేలా ఉందే
వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీబన్నీ’. ‘ది ఫ్యామిలీమేన్’ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ భారీ అంచనాలను పెంచేసింది. అయితే, తాజాగా రెండో ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో సమంత భారీ యాక్షన్ సిన్స్‌తో దుమ్మురేపిందని చెప్పవచ్చు. అమెరికన్ సిరీస్ ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’ పేరుతో నవంబర్ 7న రానుంది.చాలారోజుల తర్వాత సమంత ఒక యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సిటాడెల్ ట్రైలర్లో సమంత యాక్షన్ సీక్వెన్స్ లో స్టంట్స్ చేసింది. ఇందులో హనీగా సమంత, బన్నీగా వరుణ్ ధావన్ అదరగొట్టేశారు. ముఖ్యంగా రెండో ట్రైలర్లో ప్రధానంగా సమంతను హైలైట్ చేస్తూ చూపించారు. సిటడెల్ స్పై యూనివర్స్ ఫ్రాంఛైజీలో భాగంగా వస్తున్న ఇండియన్ వెర్షన్ భారీగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. నవంబర్ 7న హిందీ, తెలుగు,తమిళ్, కన్నడ,మలయాళంలో స్ట్రీమింగ్ కానుంది. -
శ్రీలీల తప్పుకొంది.. పూజా హెగ్డేకి ఛాన్స్
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చేస్తున్న మూవీ 'హే జవానీతో ఇష్క్ హోనా హై'. రమేష్ తురానీ దర్శకుడు. మెయిన్ హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ చేస్తోంది. మరో హీరోయిన్గా శ్రీలీల నటించనున్నారనే టాక్ బాలీవుడ్లో వినిపించింది. కానీ శ్రీలీల ప్లేస్‌లో పూజా హెగ్డే నటించనున్నారనే టాక్ బీటౌన్‌లో తెరపైకి వచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో)ఇతర సినిమాలతో బిజీగా ఉంటూ ఈ సినిమా షూటింగ్‌కు కాల్షీట్స్ కేటాయించలేని కారణంగా శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా మొదలవడంతో శ్రీలీల ఎగ్జిట్ అయ్యారని బాలీవుడ్ భోగట్టా. దాంతో పూజా హెగ్డే ఎంట్రీ అయ్యారట. ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబరులో విడుదల చేయాలనుకుంటున్నారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) -
ఓ సీక్రెట్ చెప్పనా..!
వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీబన్నీ’. ‘ది ఫ్యామిలీమేన్’ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌ను రూపొందించారు. అమెరికన్ సిరీస్ ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’ రానుంది. ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ‘ప్రతి రోజూ ఓ ప్రమాదం ముంచుకొస్తుంది.ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటుంది. సవాల్ ఏంటంటే... ఈ ప్రమాదాలను మనం అంతం చేస్తామా? లేక అవి మనల్ని అంతం చేస్తాయా? అన్నది, నాడియా... నీకొక సీక్రెట్ చెప్పనా.. నేనొక ఏజెంట్’ వంటి డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఈ సిరీస్‌లో సినీ నటి హనీగా సమంత, స్టంట్ కొరియోగ్రాఫర్ బన్నీగా వరుణ్ ధావన్ కనిపిస్తారు. కానీ ఈ ఇద్దరూ ఏజెంట్స్. ఈ ఇద్దరూ ఓ మిషన్ కోసం ఎలాంటి పోరాటాలు చేశారన్నది సిరీస్‌లో ఆసక్తికరమైన అంశం. అమెజాన్ ఓటీటీలో నవంబరు 7 నుంచి ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. -
సమంత గ్లామరస్ లుక్.. 'సిటాడెల్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'సిటాడెల్' ట్రైలర్.. ఫైట్స్ అదరగొట్టేసిన సమంత
సమంత సినిమా వచ్చి చాలా కాలమైపోయింది. చివరగా 'ఖుషి' మూవీ చేసింది. అనారోగ్య సమస్యల కారణంగా యాక్టింగ్ కొన్నాళ్లు పక్కనబెట్టేసింది. కొత్త మూవీస్ కూడా పెద్దగా ఒప్పుకోలేదు. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తీసిన దర్శకులు.. 'సిటాడెల్: హనీ-బన్నీ' పేరుతో ఓ సిరీస్ తీస్తున్నారు. ఇందులో సమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ లీడ్ రోల్స్ చేశారు. ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'పుష్ప2' ప్రతి సీన్ ఇంటర్వెల్లా ఉంటుంది: దేవిశ్రీ ప్రసాద్)ట్రైలర్ చూస్తే సిరీస్ అంతా ఫుల్ యాక్షన్ ఉండటం గ్యారంటీ అనిపిస్తుంది. ఇందులో సమంత ఓ సీక్రెట్ ఏజెంట్. ఈమెకు ఓ కూతురు కూడా ఉంటుంది. మరోవైపు వరుణ్ కూడా సీక్రెట్ ఏజెంట్. వీళ్లిద్దరూ ఎలా కలిశారు? ఏ మిషన్స్ పూర్తి చేశారు అనేదే స్టోరీ అని తెలుస్తోంది. ట్రైలర్లోనే ఫుల్ యాక్షన్ దట్టించారు. గన్ ఫైరింగ్, ఫైటింగ్.. ఇలా సమంత అదరగొట్టేసింది.అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నవంబరు 7 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ట్రైలర్‌తోనే బజ్ వచ్చిందంటే మాత్రం సిరీస్‌పై కచ్చితంగా ఆసక్తి పెరుగుతుంది. సమంత కొత్త ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు) -
బేబీ జాన్‌లో అతిథిగా సల్మాన్ ఖాన్
‘బేబీ జాన్’కు అతిథి అయ్యారు సల్మాన్ ఖాన్. వరుణ్ ధావన్ హీరోగా తమిళ దర్శకుడు కాలీస్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘బేబీ జాన్’. హిందీలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ తొలి చిత్రంలో నటి వామికా గబ్బి మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. కాగా ‘బేబీ జాన్’లో సల్మాన్ ఖాన్ అతిథిపాత్రలో నటిస్తున్నారని, ప్రస్తుతం సల్మాన్–వరుణ్ ధావన్ కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని బాలీవుడ్ సమాచారం.అంతేకాదు... సల్మాన్ ఖాన్–వరుణ్ ధావన్‌లపై వచ్చే యాక్షన్ సీన్స్‌ని మాత్రం ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన దర్శకుడు అట్లీ తీస్తున్నారట. ఇక తమిళంలో విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన హిట్ మూవీ ‘తేరీ’కి హిందీ రీమేక్‌గా ‘బేబీ జాన్’ రూపొందుతోందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘సికందర్’ చిత్రం వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా విడుదల కానుంది. -
తారలు మెరిసే... ఫ్యాన్స్ మురిసే...
ప్రియాంకా చో్ప్రా, సమంత ఒకే వేదికపై మెరిశారు. ముచ్చట్లు చెప్పుకుంటూ, చిరు నవ్వులు చిందిస్తూ వీరు ఫొటోలకు ΄ోజులివ్వగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారి ఫ్యాన్స్ ఆనందంతో మురిసి΄ోతున్నారు. ఇంతకీ సమంత, ప్రియాంకా చో్ప్రా ఎక్కడ కలిశారనే విషయానికి వస్తే... వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో రూ΄÷ందిన స్పై యాక్షన్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ మాధ్యమంలో నవంబరు 7 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. కాగా లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్ ప్రీమియర్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు ప్రపంచవ్యాప్త సినీ తారలతో ΄ాటు సమంత, ప్రియాంకా చో్ప్రాలు కూడా ఈ వేడుకలో సందడి చేశారు. ఇక రిచర్డ్ మాడెన్, ప్రియాంకా చో్ప్రా లీడ్ రోల్స్‌లో దర్శక ద్వయం న్యూటన్ థామస్– జెస్సికా రూ΄÷ందించిన అమెరికన్ స్పై యాక్షన్ సిరీస్ ‘సిటాడెల్’కు ఇండియన్ వెర్షన్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’ రూ΄÷ందింది. అమెరికన్ ‘సిటాడెల్’ తొలి సీజన్ 2023 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ‘సిటాడెల్’కు సెకండ్ సీజన్ కూడా రూ΄÷ందుతోందని, ఈ సీజన్లో కూడా ప్రియాంకా చో్ప్రా ఓ లీడ్ రోల్ చేస్తున్నారని సమాచారం. -
బన్నీ... హనీ... భారీ ఫైట్
పేరు హనీ... అంత మాత్రాన స్వీట్ గాళ్ అనుకుంటే పొరపాటే. శత్రువులను రఫ్ఫాడించేటప్పుడు గరమ్ గాళ్ అయిపోతుంది. ఈ పవర్ఫుల్ రోల్లో సమంత కనిపించనున్న సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ. బన్నీగా వరుణ్, హనీ పాత్రలో సమంత కనిపిస్తారు. గురువారం ఈ సిరీస్ టీజర్ విడుదలైంది. ఒకవైపు వరుణ్ ధావన్... మరోవైపు సమంత.... ఇద్దరూ పోటాపోటీగా విలన్లను రఫ్ఫాడిన దృశ్యాలు ఈ టీజర్లో కనిపించాయి.ఈ భారీ ఫైట్‌ని సమంత అవలీలగా చేసినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. హాలీవుడ్ టీవీ సిరీస్ ‘సిటాడెల్’కి ఇండియన్ వెర్షన్ ఇది. సమంత ఓ లీడ్ రోల్లో ‘ది ఫ్యామిలీ మేన్ 2’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన రాజ్– డీకే ‘సిటాడెల్’కి దర్శకులు. ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
సమంత ‘సిటాడెల్: హనీ-బన్నీ’ టీజర్ రిలీజ్ (ఫొటోలు)
-
సమంత ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 'సిటాడెల్' రిలీజ్‌పై ప్రకటన
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ వచ్చేసింది. భారీ బడ్జెట్‌తో రుస్సో బ్రదర్స్ దీనిని నిర్మిస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ లాంటి విజయవంతమైన సిరీస్‌లను అందించిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇందులో సమంతతో పాటుగా వరుణ్‌ధావన్ నటిస్తున్నారు. తాజాగా సిటాడెల్ స్ట్రీమింగ్ తేదీని అమెజాన్ ప్రేమ్ ప్రకటించింది.స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుందని అమెజాన్ ప్రకటించింది. ఈమేరకు టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంత నటించిన బాలీవుడ్ వెబ్‌సిరీస్ సిటాడెల్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. ఈ సిరీస్‌లో సమంత స్పై పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సీన్స్‌లలో సమంత దుమ్మురేపిందని టాక్. హాలీవుడ్లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ సిటాడెల్ వెబ్‌సిరీస్‌లో నటించారు. ఇప్పుడు బాలీవుడ్లో సమంత, వరుణ్ ధావన్‌లతో తెరకెక్కించారు. అయితే, ఈ సిరీస్ కోసం ఎలాంటి డూప్ లేకుండానే యాక్షన్ సీన్స్‌లలో సమంత నటించినట్లు తెలుస్తోంది. -
హీరో ఇంటిని రెంట్‌కు తీసుకోనున్న స్టార్ జంట!
బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, నటాషా దలాల్ ఇటీవలే తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. ఆయన భార్య నటాషా దలాల్ ఈ ఏడాది జూన్ 3న బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా వీరికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బాలీవుడ్లో తెగ వైరలవుతోంది. త్వరలోనే ఈ జంట కొత్త బంగ్లాకు మారుతున్నట్లు తెలుస్తోంది.ముంబయిలోని జుహులో హృతిక్ రోషన్‌కు చెందిన విలాసవంతమైన ఫ్లాట్‌కు షిఫ్ట్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీని విలువ రూ. 50 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో హృతిక్ తన కుటుంబంతో కలిసి ఇక్కడే నివసించాడు. కానీ ప్రస్తుతం ఆయన రూ.100 కోట్ల విలువైన లగ్జరీ ఫ్లాట్‌కు మారిపోయారు.దీంతో వరుణ్ ధావన్ ఆ ఇంటిని రెంట్‌కు తీసుకోబోతున్నట్లు సమాచారం. సముద్రం పక్కనే ఉండే ఇల్లు అక్షయ్ కుమార్ లాంటి ప్రముఖుల ఇళ్ల పక్కనే ఈ ఫ్లాట్ ఉంది. ప్రస్తుతం వరుణ్ తన కుటుంబంతో కలిసి 2017లో కొనుగోలు చేసిన జుహు అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. సినిమాల విషయానికొస్తే వరుణ్ ధావన్ అట్లీ తెరకెక్కిస్తోన్న బేబీ జాన్‌లో కనిపించనున్నారు. -
తండ్రయిన స్టార్ హీరో.. మహాలక్ష్మి పుట్టిందని వీడియో పోస్ట్
మరో హీరో తండ్రయ్యాడు. తాజాగా తమిళ హీరో శివకార్తికేయన్ భార్య పండంటి బిడ్డకు జన్మనివ్వగా, ఇప్పుడు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా తండ్రి హోదాలోకి వచ్చేశాడు. ఇతడి భార్య నటాషా.. సోమవారం రాత్రి ఆడపిల్లని ప్రసవించింది. ప్రస్తుతం తల్లిబిడ్డా ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. ఈ విషయాన్ని వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ ధ్రువీకరించారు.(ఇదీ చదవండి: మూడోసారి తండ్రయిన స్టార్ హీరో శివకార్తికేయన్)తండ్రి డేవిడ్ ధావన్ 2012లో 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆ తర్వాత బద్లాపూర్, అక్టోబర్, స్ట్రీట్ డ్యాన్సర్ త్రీడీ, బేడియా తదితర చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం 'బేబీ జాన్', 'సన్నీ సంస్కారీ కీ తుల్సీ కుమారి' అనే మూవీస్ చేస్తున్నాడు.వరుణ్ ఫ్యామిలీ విషయానికొస్తే 2021లో నటాషా దలాల్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అంటే దాదాపు మూడేళ్ల తర్వాత ఈమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే వరుణ్‌కి పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2' సినిమా) View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
ప్రేమకథ ఆరంభం
వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ల కొత్త ప్రేమకథ మొదలైంది. ‘బవాల్’ సినిమా తర్వాత వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ కలిసి ‘సన్నీ సంస్కారీకి తులసీ కుమారి’ అనే ప్రేమకథా చిత్రంలో జోడీగా నటిస్తున్నారు. సన్నీ పాత్రలో వరుణ్, తులసీ కుమారి పాత్రలో జాన్వీ కపూర్ కనిపిస్తారని ఊహించవచ్చు.శశాంక్ కేతన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శనివారం మొదలైంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వరుణ్ ధావన్‌తో పాటు ఈ సినిమా కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల కానుంది. -
బాలీవుడ్ ఎంట్రీ.. రెచ్చిపోతున్న కీర్తిసురేశ్!
ఇదు ఎన్న మాయం చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు కీర్తి సురేశ్. కెరీర్ ప్రారంభం నుంచే పక్కింటి అమ్మాయి ఇమేజ్ను మెయింటెన్ చేస్తూ వచ్చారు. అలా ఇక్కడ రజనీమురుగన్, రెమో, భైరవా, సామి 2 చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ల లిస్టులో చేరారు. ఈ మధ్య నటించిన మామన్నన్, సైరన్ చిత్రాల వరకూ గ్లామర్‌కు దూరంగానే ఉంటూ వచ్చారు.బాలీవుడ్లో ఎంట్రీతెలుగులో మహానటి చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డునే గెలుచుకున్నారు. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో గ్లామర్‌గా కనిపించినా శ్రుతిమించి పోలేదు. అలాంటిది ఎప్పుడైతే బాలీవుడ్‌లోకి అడుగు పెట్టారో పూర్తిగా గ్లామర్‌కు ఓటేస్తున్నారు. హిందీ చిత్రాల్లో నటించడం మొదలెడితే అందాల ఆరబోత తప్పదేమో అనిపిస్తోంది కీర్తీసురేష్‌ను చూస్తుంటే! తెలుగు, తమిళంలో సక్సెస్‌లు ఉన్నా, అవకాశాలు తగ్గాయన్నది వాస్తవం.వరుణ్ ధావన్ బర్త్డేబేబీజాన్ చిత్రం ద్వారా కీర్తి బాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్నారు. ఇది తమిళంలో హిట్ అయిన తేరి చిత్రానికి రీమేక్. ఈ మూవీని తమిళ టాప్ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్నారు. బేబీజాన్ షూటింగ్ దశలో ఉంది. బుధవారం (ఏప్రిల్ 24) ఈ మూవీ హీరో వరుణ్ ధావన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ చిత్ర యూనిట్ మధ్య జరిగాయి. ఇందులో కీర్తీసురేష్ డీప్ నెక్ ఉన్న లెహంగాలో కనిపించింది. వరుణ్ ధావన్‌కు కేక్ తినిపించి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇంతలా మారిపోయారేమిటి? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. #KeerthySuresh from the sets of #Babyjohn ( Hindi remake of THERI) 🎬⭐️😎#VarunDhawan | #Atleepic.twitter.com/u3IkBELUtW— Tharani ᖇᵗк (@iam_Tharani) April 24, 2024 చదవండి: వీకెండ్ స్పెషల్.. ఈ సినిమాలు మిస్ కావొద్దు