బాలీవుడ్ నటుడు, బిగ్ బీ అమితా బచ్చన్ ఎన్నో వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకుల మన్నలను అందుకున్న గొప్ప నటుడు. ఇప్పటికీ పలు టీవి షోల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అందరి ప్రశంసలందుకుంటున్నారు. ఆయన్ను ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసిన టీవీ షో "కౌన్ బనేగా కరోడ్‌పతి"గా చెప్పొచ్చు. ఆ కార్యక్రమం ఆయనకు ఎంతో పేరునే గాక లక్షలాది మంది అభిమానులను తెచ్చిపెట్టింది.
ఇటీవల ఆయన కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 16లో, క్రికెటర్ వరుణ్ ధావన్‌తో కాసేపు సరదాగా ముచ్చటించారు. వారిద్దరి మధ్య సాగిన ఆసక్తికర సంభాషణ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఆ కార్యక్రమంలో అమితాబ్ కాబోయే తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అమూల్యమైన విషయాలను గురించి కూడా చెప్పారు. ఈ గోల్డెన్ రూల్స్‌ని పాటిస్తే మంచి తల్లిదండ్రులుగా పిల్లల మనుసును గెలుచుకోగలరని అన్నారు. ఇంతకీ అవేంటి?. 'గోల్డెన్ రూల్ ఆఫ్ పేరెంటింగ్' అంటే..
ఇటీవల జరిగిన కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 16లో అమితాబ్ క్రికెటర్ వరణ్ ధావన్ తండ్రిగా నీ కొత్త జర్నీ ఎలా ఉందని ప్రశ్నించారు. ఇటీవలే వరుణ ధావన్ నటాషా దంపతులకు కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. అయితే ధావన్ తన కుమార్తెతో కనెక్ట్ అవుతున్నానని, ఆమె వచ్చాక తన జీవితం మొత్తం మారిపోయిందని నవ్వుతూ బదులిచ్చాడు. అప్పుడు అమితాబ్ ఈ దీపావళి నీకెంతో ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ పండుగకి నీ ఇంట్లోకి లక్ష్మీ దేవి వచ్చేసిందని అన్నారు. దానికి ప్రతిస్పందనగా ధావన్ "ఆమె రాకతో ప్రతిదీ మారిపోవడం మొదలైంది. ఇప్పటికీ తనకు ఎలా దగ్గర అవ్వాలా అనే విషయం గురించి నేర్చకుంటూనే ఉంటున్నా అని భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు." ధావన్.
ఆ తర్వాత అమితాబ్‌తో నాన్న విధులు గురించి మాట్లాడుతూ..ఆ రోజుల్లో రాత్రిపూట మీ నిద్రకు ఇబ్బంది ఏర్పడేదా అని ధావన్ ప్రశ్నించగా..అందుకు అమితాబ్ బదులిస్తూ.. "తాను రాత్రిపూట హాయిగా నిద్రపోయేవాడినని, కాకపోతే కాస్త ఆందోళనగా ఉండేదని అన్నారు. అంతేగాదు అప్పటికి ఒక కొత్త గాడ్జెట్ వచ్చిందని దాన్ని శిశువు బెడ్ పక్కన పెడితే వారి చిన్న శబ్దం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుందంటూ.. నాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు." అమితాబ్.
ఇక వరుణ్ తన పాప పడుకునే సమయం గురించి మాట్లాడుతూ..తన కూతురు కోసం లాలి పాట కూడా పాడుతున్నట్లు తెలిపారు. అంతేగాదు ఆ పాటను కూడా ఆ షోలో పాడి వినిపించారు ధావన్. ఆ కార్యక్రమంలో చివరగా ధావన్ అమితాబ్‌ని నటుడిగా కుటుంబ బాధ్యతలను ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు అని అడిగారు. అందుకు ఆయన ఒక సలహ సూచించారు. అది అత్యంత అమూల్యమైన రూల్ అని కూడా చెప్పారు. "ఎప్పుడూ మీ భార్యను సంతోషంగా ఉండేలా చూసుకోండి.
ఆమె సంతృప్తిగా ఉంటే అన్ని బాధ్యతలు సునాయాసంగా నెరవేరిపోతాయి. ఆమె సంతోషంగా ఉంటే కుమార్తె కూడా హ్యాపీగా ఉంటుంది. దీన్ని సదా గుర్తించుకోండి. కుటుంబానికి మూల స్థంభం భార్యే. ఆమె సంతోషంగా ఉంటే అన్ని పనులు వాటంతట అవే సులభంగా అయిపోతాయి. దీన్ని పాటిస్తే ప్రతి కుటుంబం సంతోషంగా ఉండటమే గాక పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా ఉండగలుగుతారని అన్నారు." అమితాబ్.
(చదవండి: విద్యాబాలన్ వెయిట్ లాస్ సీక్రెట్..కానీ వర్కౌట్‌లు మాత్రం..!)
Comments
Please login to add a commentAdd a comment