
‘డియర్ పేరెంట్స్.. ఇది పరీక్షల సమయం! మీ పిల్లల కన్నా మీరే ఎక్కువ ఆందోళనగా ఉండుంటారు.. వాళ్లు పరీక్షలు ఎలా రాస్తారో.. వందకు వంద మార్కులు తెచ్చుకుంటారో లేదో.. ఇంజినీరింగ్, మెడిసిన్‌కి ఎలిజిబుల్‌గా నిలబడతారో లేదో అని! రేపు పరీక్షలు రాయబోయే పిల్లల్లో ఒక మ్యుజీషియన్ ఉండొచ్చు.. వాడు కెమిస్ట్రీని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఒక అథ్లెట్ ఉండొచ్చు.. ఆ అమ్మాయికి ఫిజిక్స్ కన్నా ఫిజికల్ ఫిట్‌నెస్ ముఖ్యం కావచ్చు. ఆర్టిస్ట్ ఉండొచ్చు.. ఆ స్టూడెంట్‌కి మ్యాథ్స్‌ని అర్థంచేసుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు.
ఆంట్రప్రెన్యూర్స్ ఉండొచ్చు.. వాళ్లకు హిస్టరీ, ఇంగ్లిష్ లిటరేచర్‌తో పనిలేకపోవచ్చు. మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటే చాలా సంతోషం. ఒకవేళ తెచ్చుకోకపోతే.. వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకండి. ‘పర్లేదు..మళ్లీ పరీక్ష రాసుకోవచ్చులే’ అంటూ అనునయించండి.
ఆ ప్రేమతో వాళ్ల కలలను సాకారం చేసుకుంటారు. ఆ ధైర్యంతో వాళ్లు జీవితాన్ని గెలుస్తారు. ప్రపంచంలో కేవలం డాక్టర్లు, ఇంజినీర్లు మాత్రమే సంతోషంగా ఉంటారనే మైండ్‌సెట్‌ను మార్చుకోండి. మార్కులను కాకుండా పిల్లలను ప్రేమించండి.’ ఇది ఒక ప్రిన్సిపల్ పేరెంట్స్‌కి రాసిన ఉత్తరం.