పిల్లలు స్కూల్‌ నుంచి రాగానే..వారికి ఏం నేర్పిస్తున్నారు? | How To Build Moral Values In Preschoolers To Lead A Positive Life | Sakshi
Sakshi News home page

పిల్లలు స్కూల్‌ నుంచి రాగానే..వారికి ఏం నేర్పిస్తున్నారు?

Published Sat, Mar 29 2025 11:20 AM | Last Updated on Sat, Mar 29 2025 4:47 PM

How To Build Moral Values In Preschoolers To Lead A Positive Life

పిల్లలు జీవితంలో సక్సెస్‌ సాధించాలంటే.. వారికి చిన్న వయసులోనే మంచి విలువలు అందించాలి. బాల్యంలో నేర్పించిన విలువలు వారిని జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెడతాయి. స్కూల్‌ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకు కచ్చితంగా నేర్పించాల్సిన అలవాట్లు కొన్ని ఉన్నాయి. వాటిని నేర్పిస్తే పిల్లలు పెద్దయ్యాక కూడా మంచి విలువలతో బతుకుతారు. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.

పిల్లలు స్కూల్‌ నుంచి రాగానే వారి బ్యాగుల్ని, వస్తువుల్ని చక్కగా సర్దుకునే అలవాటు నేర్పించాలి. చక్కగా సర్దుకోవడం నేర్చుకుంటే వారి వస్తువుల్ని ఎక్కడ పెట్టారో అన్న క్లారిటీ వారికి ఉంటుంది. మార్నింగ్‌ స్కూల్‌ వెళ్లే టైమ్‌లో హడావిడి పడుకుండా తమ వస్తువుల్ని సులభంగా కనుగొంటారు. 

అంతేకాకుండా వారి పనుల్ని స్వయంగా చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. రేపు భవిష్యత్తులో దూర్రప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉండాల్సినప్పుడు ఈ అలవాటు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే పిల్లలు స్కూల్‌ నుంచి రాగానే బ్యాగు, వారి వస్తువులను సరైన స్థలంలో పెట్టేలా వారికి నేర్పండి.

కాళ్లు, చేతులు, ముఖం కడుక్కోవడం...
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యం. పిల్లలు స్కూల్‌ నుంచి వచ్చిన వెంటనే చేతులు, ముఖం కడుక్కోవడం గురించి చెప్పండి. ఇది వారిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా వ్యాధులను దూరంగా ఉంచుతుంది. 

పిల్లలు స్కూల్‌ నుంచి రాగానే వారి యూనిఫామ్‌ తీసివేయమని చెప్పండి. ఆ తర్వాత చేతులు, ముఖం వాష్‌ చేసుకోమని వారికి చెప్పండి. ఈ అలవాటు నేర్చుకోవడం వల్ల పరిశుభ్రత ఎంతో కీలకమని తెలుసుకుంటారు. ఈ అలవాటు వారిని భవిష్యత్తులో మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది.

సమయాన్ని తెలివిగా ఉపయోగించడం...
పిల్లలకు తమ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకునే అలవాటును నేర్పించండి. టైమ్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్‌ వారికి ఎంతగానో సాయపడుతుంది. సకాలంలో వారి పనులు చేసుకోవడం, ఆటలు ఆడుకోవడం, చదువు, హోం వర్క్‌ వంటి పనులు చేయడం నేర్పించండి. దానికి తగ్గ టైమ్‌ టేబుల్‌ వేసి దాని ఫాలో అయ్యేలా ప్లాన్‌ చేయండి. దీంతో.. వారు సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటారు.

చదువు, హోం వర్క్‌...
స్కూల్‌ నుంచి వచ్చిన తర్వాత కాసేపు పిల్లల్ని ఆడుకోనివ్వండి. ఆటల తర్వాత స్నానం చేసేలా ప్రోత్సహించండి. ఆ తర్వాత హోం వర్క్, చదువుకు టైం కేటాయించేలా వారికి అలవాటు చేయండి. ఆటలతోపాటు చదువు ప్రాముఖ్యత వారికి తెలపండి. సబ్జెక్ట్‌ల్లో ఏమైనా డౌట్లు ఉంటే దగ్గరుండి హెల్ప్‌ చేయండి. హోం వర్క్‌ పెండింగ్‌ పెట్టకుండా పూర్తిగా ఫినిష్‌ చేసేలా ప్లాన్‌ చేయండి. ఈ అలవాటు వల్ల వారు చదువుల్లో మెరుగ్గా రాణిస్తారు.  

(చదవండి: వృథాని జీరో చేద్దాం..వేస్ట్‌ని రీయూజ్‌ చేసేద్దాం..! ది బెస్ట్‌గా..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement