children
-
చై-శోభితల మనసు బంగారం.. ఎంత మంచి పని చేశారో! (ఫోటోలు)
-
బడి బయటే బాల్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతోపాటు గురుకులాలు, ఇతర హాస్టల్ వసతి ఉన్న స్కూళ్లు కావాల్సినన్ని ఉన్నా.. బడి మధ్యలోనే మానేస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రాథమిక స్థాయిలో కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఉన్నత పాఠశాల స్థాయికి వచ్చేసరికి చాలామంది విద్యార్థులు బడి మానేస్తున్నారు. ప్రాథమికోన్నత స్థాయిలో 0.34 శాతం, ఉన్నత పాఠశాలల్లో 11.92 శాతం డ్రాపౌట్స్ నమోదయ్యాయి.ప్రాథమిక స్థాయిలో ఇది మైనస్ 2.23 శాతంగా ఉంది. ప్రధానంగా పల్లెల్లోనే డ్రాపౌట్లు ఎక్కువగా ఉన్నాయి. సోమవారం రాష్ట్ర ప్రణాళికా విభాగం విడుదల చేసిన ‘తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్–2024’లో ఈ వివరాలను పొందుపర్చింది. హనుమకొండ, కరీంనగర్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాల్లో డ్రాపౌట్లు తక్కువగా ఉన్నాయి.నివేదికలోని ప్రధానాంశాలు⇒ రాష్ట్రంలో 40,975 స్కూళ్లున్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 20,539, ప్రాథమికోన్నత పాఠశాలలు 7,482, ఉన్నత పాఠశాలలు 11,561, హయ్యర్ సెకండరీ 1,393 స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 65,41,085 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో పాఠశాలకు సగటున 160 మంది విద్యార్థులు ఉన్నారు. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 533 స్కూళ్లు ఉండగా.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 2,907 ఉన్నాయి.⇒ హైస్కూల్ పరిధిలో 39,92,429 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 8,98,588, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 9,16,869, హయ్యర్ సెకండరీలో 7,33,199 మంది పిల్లలున్నారు. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 9,02,674 మంది విద్యార్థులుండగా.. అతి తక్కువగా ములుగు జిల్లాలో 41,061 మంది మాత్రమే ఉన్నారు.⇒ 6 నుంచి 10 ఏళ్లలోపు చిన్నారులు రాష్ట్రంలో 26,62,200 మంది ఉండగా, పాఠ శాలల్లో నమోదైనవారు 29,28,678 ఉన్నా రు. ప్రాథమిక పాఠశాలల్లో గ్రాస్ ఎన్రో ల్మెంట్ రేషియో(స్థూల నమోదు నిష్పత్తి) 110 శాతంగా ఉంది. ఇది అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 175 శాతం ఉండగా, అతి తక్కువగా జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో 70 శాతం ఉంది.⇒ ప్రాథమికోన్నత పాఠశాలల్లో జీఈఆర్ 107 శాతం ఉంది. రాష్ట్రంలో 11 నుంచి 13 సంవత్సరాల వయసున్న పిల్లలు 16,53,800 మంది ఉండగా, ఆరోతరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు స్కూళ్లలో నమోదైన పిల్లలు 17,73,298 (కుటుంబాల వలస ఇతరత్రా కారణాల వల్ల) ఉన్నారు. అతి తక్కువగా జయశంకర్ భూపా లపల్లి జిల్లాలో 59 శాతం ఉండగా, ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలో 173 శాతంగా ఉంది.⇒ ఉన్నత పాఠశాలల్లో జీఈఆర్ 95 శాతంగా ఉంది. రాష్ట్రంలో 14 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు 11,44,600 మంది ఉండగా, ఉన్నత పాఠశాలల్లో నమోదైన పిల్లలు 10,82,551 మంది మాత్రమే. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 55 శాతం, అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 149 శాతం నమోదైంది.⇒ రాష్ట్రంలో సగటున 19 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. ప్రాథమిక స్థాయిలో 18 మందికి, ప్రాథమికోన్నత స్థాయిలో 14 మందికి, ఉన్నత పాఠశాల స్థాయిలో 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. హయ్యర్ సెకండరీ స్థాయిలో 17 మందికి ఒక టీచర్ ఉన్నారు. టీచర్–స్టూడెంట్ నిష్పత్తి 22 జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉంది. ప్రాథమికోన్నత స్థాయిలో 21 జిల్లాల్లో, ఉన్నత స్థాయిలో 23 జిల్లాలు, హయ్యర్ సెకండరీ స్థాయిలో 13 జిల్లాల్లో ఇది రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉంది. మెదక్, రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి, హైదరాబాద్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో టీచర్–స్టూడెంట్ నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా ఉంది.⇒ రాష్ట్రంలో లింగనిష్పత్తి 988గా ఉంది. ప్రతి వెయ్యి మంది పురుషులకు 988 మహిళలు ఉన్నారు. అత్యంత తక్కువ లింగనిష్పత్తి ఉన్న జిల్లా రంగారెడ్డి. ఆ తర్వాత స్థానాల్లో హైదరాబాద్, మేడ్చల్– మల్కాజిగిరి, వనపర్తి జిల్లాలున్నాయి. పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఉన్న జిల్లాలు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి. -
Jagtial: మొన్న తల్లి.. నేడు పిల్లలు
పెగడపల్లి (జగిత్యాల జిల్లా) : ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన తల్లి.. తానూ తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన విషాదాంతంగా ముగిసింది. ఈ ఘటనలో చికిత్స పొందుతూ తల్లి శుక్రవారం మృతిచెందగా.. పిల్లలు కృష్ణంత్ (10), మయాంతలక్ష్మి (8) ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో కన్నుమూశారు. పిల్లల మృతదేహాలను స్వగ్రామమైన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లికి తరలించారు. కాగా, తమ అల్లుడు తిరుపతి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోపాటు అదనంగా కట్నం తేవాలని వేధించినందుకే తమ కూతురు ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుందని హారిక తల్లిదండ్రులు అల్లెం మల్లయ్య, పోచవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఆందోళన..పిల్లల మృతదేహాలను ఆదివారం మధ్యాహ్నం మద్దులపల్లికి తీసుకొచ్చారు. అప్పటికే హారిక కుటుంబ సభ్యులు, బంధువులు మద్దులపల్లికి తరలివచ్చారు. హారికతోపాటు పిల్లల మృతికి తిరుపతే కారణమని, అతడిని కఠినంగా శిక్షించాలని హారిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. అప్పటివరకు పిల్లల మృతదేహాలకు అంత్యక్రియలు చేయమని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అక్కడికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రవి హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య పిల్లల మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తానూ తాగి.. -
జేడీ వాన్స్ పిల్లలకు ‘మోదీ మార్క్’ గిఫ్ట్‌లు
ప్రధాని నరేంద్ర మోదీ ఏఐ యాక్షన్ సమ్మిట్ కోసం ఫ్రాన్స్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికాలో అడుగుబెట్టారు. అలాగే మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుమారుని పుట్టిన రోజు వేడుకలకు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్ పిల్లలకు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఇచ్చిన బహుమతులు హాట్‌టాపిక్‌గా మారాయి. మోదీ మన భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా, పర్యావరణ హితమైనవి బహుమతులగా వారికి ఇవ్వడం విశేషం. మరీ ఆ గిఫ్ట్‌ల విశిష్టత ఏంటో చూద్దామా..!.టాయ్ ట్రైన్, ఆల్ఫాబెట్ సెట్‌ని అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్ పిల్లలకు ఇచ్చారు మోదీ. ఇక ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు డోక్రా ఆర్ట్‌వర్క్ - రాతి పనితో కూడిన సంగీతకారులను బహుమతిగా ఇచ్చారు. మోదీ పర్యావరణ అనుకూలంగా.. చెక్కతో చేసిన వర్ణమాల సెట్‌ని జేడీ వ్యాన్స్ కుమార్తె మిరాబెల్ రోజ్ వాన్స్‌కు బహుమతిగా ఇచ్చారు. ఇది పిల్లలకు మంచిగా అక్షరాలను గుర్తుపట్టేలా చేసి తొందరగా నేర్చుకునేందుకు దోహదపడుతుంది. ఇది ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా, హానికరమైన రసాయనాలు లేని బహుమతి. అంతేగాదు పర్యావరణ పరిరక్షణకు తాము పెద్ద పీట వేస్తాం అనేలా పరోక్షంగా చెప్పినట్లుగా ఉన్నాయి ఆ బహుమతులు. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కి ఇచ్చిన డోక్రా ఆర్ట్ వర్క్‌ని గిఫ్ట్‌గా ఇచ్చి మా దేశ సంస్కృతి, హస్త కళా నైపుణ్యం ఎట్టిదో తెలియజేస్తున్నట్లుగా ఉంది. చేతల ద్వారా తామెంటన్నది చెప్పడమే మన నాయకులు గొప్పతనం కాబోలు. కాగా ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు మోదీ మూడు రోజులు ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఇక అక్కడ ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వాణిజ్యం, శక్తి, సాంస్కృతిక సంబంధాలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రపంచ నాయకులు, ప్రపంచ టెక్ CEOల సమావేశం అయిన AI యాక్షన్ సమ్మిట్‌కు ఆయన సహ అధ్యక్షత వహించారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం బుధవారం సాయంత్రం అమెరికాలో పర్యటించారు. డోనాల్డ్ ట్రంప్ రెండొవసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ అమెరికాలో చేసిన తొలి పర్యటన ఇది. అక్కడ మోదీకి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. ఈ నెల 12 నుంచి 13 వరకు మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. అక్కడ బ్లెయిర్ హౌస్‌లోనే బస చేయనున్నట్లు సమాచారం. (చదవండి: ప్రేమకు ప్రతిరూపమైన అమ్మను ప్రేమిద్దామిలా..!) -
పిల్లలు పుట్టి చనిపోతుండటం మనస్తాపానికి లోనైన దేవి
కుత్బుల్లాపూర్ : పిల్లలు పుట్టి చనిపోతుండటం, భర్త మద్యానికి బానిస కావడంతో మనస్తాపానికి లోనైన ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.. ఎస్సై పరమేశ్వర్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దేవి (28) కోదండరామ్ దంపతులు సుభాష్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టి పది నెలల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు.అప్పటి నుంచి డిప్రెషన్‌తో బాధపడుతున్న దేవి తరచూ భర్తతో గొడవ పడేది. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్తతో మరోసారి గొడవ పెట్టుకోవడంతో అతను ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపానికి లోనైన దేవి ఇంట్లో ఐరన్ రాడ్డుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లవారుజామున ఇంటికి వచ్చిన కోదండరామ్ దీనిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతురాలి సోదరుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పల్లె పిల్లలూ ‘స్మార్టే’!
సాక్షి, అమరావతి: గ్రామీణ భారతంలో పిల్లలు కూడా ‘స్మార్ట్’గా తయారవుతున్నారు. స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడంలో ఆరితేరిపోతున్నారని యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్(ఏఎస్ఈఆర్) వెల్లడించింది. గ్రామీణ గృహాల సర్వేలో భాగంగా ఇటీవల నిర్వహించిన ఏఎస్‌ఈఆర్‌లో పిల్లలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను గుర్తించారు. దేశంలోని 605 జిల్లాల్లో 17,997 గ్రామాల్లోని 14 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు ఉన్న 6,49,491 మంది నుంచి వివరాలు సేకరించారు. అందుబాటులో స్మార్ట్ ఫోన్లు, సొంతంగా స్మార్ట్ ఫోను కలిగి ఉండటం, వాటి ఉపయోగం, డిజిటల్ పరిజ్ఞానం తదితర అంశాలపై ప్రశ్నావళితో ఈ సర్వే నిర్వహించారు. ఏఎస్ఈఆర్ సర్వేలోని ప్రధాన అంశాలు» గ్రామీణ ప్రాంతాల్లో 14 నుంచి 16ఏళ్ల వయసులో ఉన్నవారిలో 90 శాతం మందికి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వారిలో 82 శాతం మందికి స్మార్ట్ ఫోన్లను ఎలా వాడాలో పూర్తిగా తెలుసు. » ఇక 14ఏళ్ల వయసు వారిలో 27 శాతం మందికి, 16ఏళ్ల వయసు వారిలో 37.8 శాతం మందికి సొంతంగా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మిగిలిన వారు తమ కుటుంబ సభ్యుల స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. » అమ్మాయిల కంటే అబ్బాయిలకు కాస్త ఎక్కువగా సొంతంగా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. 36.2 శాతం మంది అబ్బాయిలకు సొంతంగా స్మార్ట్ ఫోన్లు ఉండగా... 26.9% అమ్మాయిలకే సొంత స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. » సోషల్ మీడియా ఖాతాలను ఫాలో కావడానికి 78.8% మంది అబ్బాయిలు, 73.4శాతం మంది అమ్మాయిలు స్మార్ట్ఫోన్లను వాడుతున్నారు. » విద్యా సంబంధమైన విషయాల కోసం 57 శాతం మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఈ విషయంలో కేరళ రాష్ట్రం మెరుగ్గా ఉంది. ఆ రాష్ట్రంలో 90 శాతం మంది సోషల్ మీడియా ఖాతాల కోసం స్మార్ట్ ఫోన్లను వాడుతుండగా... 80 శాతం మంది విద్యా సంబంధమైన విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగిస్తున్నారు. » డిజిటల్ భద్రతపై కూడా గ్రామీణ పిల్లలకు సరైన అవగాహన ఉంది. 62 శాతం మంది పిల్లలకు ఖాతాలను బ్లాక్ చేయడం, ఫేక్ ప్రొఫైల్‌లను రిపోర్ట్ కొట్టడం తెలుసు. ఇక 55.2 శాతం మందికి తమ ప్రొఫైల్‌ను ప్రైవేటుగా ఉంచడం గురించి పూర్తి అవగాహన ఉంది. 57.7 శాతం మందికి పాస్‌వర్డ్‌లను మార్చడం తెలుసు. » పూర్తి డిజిటల్ టాస్్కల గురించి కూడా గ్రామీణ విద్యార్థులకు సరైన అవగాహన ఉంది. అలార్మ్ సెట్ చేయడం, సమాచారం కోసం అన్వేషించడం, యూ ట్యూబ్ చానళ్లను లొకేట్ చేయడం గురించి 70.2 శాతం మంది అబ్బాయిలకు, 62.2% మంది అమ్మాయిలకు పూర్తి పరిజ్ఞానం ఉంది. » స్మార్ట్ ఫోన్ల పరిజ్ఞానంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు కాస్త వెనుకబడి ఉన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మాత్రం అబ్బాయిలతో సమానంగా, కొన్ని అంశాల్లో ఎక్కువగానే అమ్మాయిలకు స్మార్ట్ ఫోన్ల పరిజ్ఞానం ఉండటం విశేషం. గణనీయంగా పెరిగిన చదువుకున్న తల్లిదండ్రులు» ఏఎస్‌ఈఆర్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 నుంచి 8 ఏళ్ల పిల్లల తల్లిదండ్రులపై చేసిన అధ్యయనంలోనూ పలు ఆసక్తికర అంశాలు గుర్తించారు. » చదువుకున్న తల్లిదండ్రుల శాతం పదేళ్లలో గణనీయంగా పెరిగింది. » కనీసం ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన తల్లుల శాతం 2014లో 43 శాతం ఉండగా... 2024 నాటికి 64 శాతానికి పెరిగింది. ఇక ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన తండ్రులు 2014లో 61 శాతం ఉండగా, 2024 నాటికి 72శాతానికి పెరిగింది. » గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుశాతం కూడా మెరుగుపడుతోంది. 2018లో విద్యార్థుల హాజరుశాతం 72.4శాతం ఉండగా, 2024 నాటికి 75.9 శాతానికి పెరిగింది. » ఉపాధ్యాయుల హాజరు శాతం 2018లో 85.1 శాతం ఉండగా, అది 2024 నాటికి 87.5 శాతానికి పెరిగింది. చదవండి: అప్పులే సరి.. సంపద ఎక్కడమరి?90% గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్న పిల్లలు74% సోషల్ మీడియా కోసమే స్మార్ట్ ఫోన్లు వాడుతున్నవారు75% చదువు కోసం స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారు82% గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం తెలిసిన పిల్లలు -
‘అమ్మా’నవీయం!
జంగారెడ్డిగూడెం: బిడ్డ కాలికి ముల్లు గుచ్చుకుంటేనే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. బిడ్డకు చిన్న దెబ్బ తగిలినా తల్లికి ప్రాణం పోయినంత పనవుతుంది. అలాంటిది.. ఓ తల్లి తన బిడ్డల పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించింది. ప్రియుడితో కలిసి వారిని చిత్రహింసలకు గురిచేస్తూ పైశాచికానందం పొందింది. ప్రియుడు రోజూ సెల్ ఫోన్ చార్జింగ్ వైరుతో చిన్నారుల ఒంటిని ఛిద్రం చేస్తున్నా.. ఆ అమ్మ మనసు కరగలేదు. పైగా ఆ పచ్చి గాయాలపై కారం పోసి.. ఆ బిడ్డల నోట్లో మిరపకాయలు కుక్కింది. బిడ్డలు అల్లాడిపోతుంటే.. ప్రియుడితో కలిసి వికృతానందం పొందింది! పోలీసులతో పాటు ఆ బిడ్డలకు వైద్యం చేసిన డాక్టర్లు కూడా చిన్నారుల ఒంటి మీది గాయాలు చూసి కన్నీళ్లు పెట్టారంటే.. ఆ చిన్నారులను ఆ తల్లి ఎంత చిత్రవధకు గురిచేసిందో అర్థం చేసుకోవచ్చు. తల్లి శాడిజం.. పిల్లలకు చిత్రవధ ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తాడిచర్లకు చెందిన గానాల శారద కొంతకాలంగా భర్తతో విడిపోయి తన తొమ్మిదేళ్ల కుమారుడు ఉదయ్‌రాహుల్, ఐదేళ్ల కుమార్తె రేణుకతో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు స్థానికుడు, అవివాహితుడు నల్లవెలుగుల పవన్‌కుమార్‌తో పరిచయమేర్పడింది. ఆ పరిచయం కాస్తా.. వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో శారద, పవన్‌కుమార్‌లు జంగారెడ్డిగూడేనికి మకాం మార్చి సహజీవనం చేస్తున్నారు. అక్కడే హోటళ్లలో పనిచేసుకుంటున్నారు.ఇదిలా ఉండగా.. పవన్‌కుమార్ రోజూ మద్యం తాగొచ్చి శారద పిల్లలైన ఉదయ్‌రాహుల్, రేణుకలను సెల్‌ఫోన్ చార్జింగ్ వైర్‌తో తీవ్రంగా కొట్టేవాడు. దీనికి శారద అడ్డు చెప్పక పోగా ప్రియుడికి వంతపాడేది. ఇలా పవన్‌కుమార్, శారదలు చిన్నారులను వైరుతో కొట్టడంతో వారి శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. అలా అవుతున్న గాయాలపై వారు కారం పోసేవారు. మంటను భరించలేక చిన్నారులు అల్లాడిపోతుంటే.. వారి నోట్లో కారంతో పాటు మిరపకాయలు కుక్కి రాక్షసానందం పొందేవారు. వీరు పెడుతున్న హింసలకు ఉదయ్రాహుల్కు పళ్లు ఊడిపోగా, రేణుక కంటికి తీవ్ర గాయమైంది. నా ప్రియుడిపై దెబ్బ పడితే ఊరుకోను.. ఎప్పటిలాగానే శనివారం అర్ధరాత్రి చిన్నారులను మళ్లీ చిత్రహింసలకు గురిచేశారు. ప్రియుడితో కలిసి తల్లిపెడుతున్న బాధలను తట్టుకోలేక చిన్నారులు ఇద్దరూ భయంతో బయటకు పరుగులుదీశారు. దీంతో చుట్టుపక్కల వారు జోక్యం చేసుకుని.. పవన్‌కుమార్‌కు దేహశుద్ధి చేసే ప్రయత్నం చేశారు. అయితే తన ప్రియుడిని కొడితే ఊరుకోనంటూ శారద అడ్డుకుంది. దీంతో వారు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఎస్ఐ షేక్ జబీర్, సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒంటి నిండా గాయాలతో నిండిపోయిన చిన్నారులను చూసి చలించిపోయారు. వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చిన్నారులను డీఎస్పీ రవిచంద్ర, సీఐ కృష్ణబాబు పరామర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ బేబీ కమలతో పాటు వైద్యులు, పోలీసులు కూడా చిన్నారుల దుస్థితిని చూసి కంటతడి పెట్టారు. ఈ ఘటనను కలెక్టర్ కె.వెట్రిసెల్వి తీవ్రంగా పరిగణించి బాధ్యులపై చర్యలకు ఆదేశించారు. -
బాబు పరీక్షలు మాకు పరీక్ష పెడుతున్నాయి
మా అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు. స్వతహాగా మంచి తెలివైనవాడే. కానీ ఇటీవల పరీక్షలకు సరిగా ప్రిపేర్ కావడంలేదు. మొదటినుండి చదవకుండా పరీక్షలకు ముందు, తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నాడు. దాంతో మార్కులు బాగా తగ్గుతున్నాయి. బాబు పరీక్షలు మాకు ఒక గండంలాగా అనిపిస్తున్నాయి. బాబు విషయంలో నాకు, మా ఆయనకు మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య నలిగిపోతున్నాను. ఈ విషయంలో ఏం చేయమంటారో సలహా ఇవ్వండి. – రాజ్యలక్ష్మి, హైదరాబాద్‌బాబు విషయంలో మీరెంత టెన్షన్‌కు గురవుతున్నారో అర్థమవుతోంది. చదువు, పరీక్షల విషయంలో మీ బాబు ఎదుర్కొంటున్న సమస్య చాలా సాధారణమైనదే. ఎంత బ్రిలియంట్ స్టూడెంట్స్ అయినా, పరీక్షల ముందర కొంత ఒత్తిడిని తప్పకుండా ఎదుర్కొంటారు. ఈ ఒత్తిడి వల్ల మంచి తెలివితేటలు గల విద్యార్థులు కూడా పరీక్షలు సరిగా రాయలేక ర్యాంకు తగ్గి΄ోతుంది. ఇలాంటి విషయంలో, మీరు ఓపికతో బాబును దారిలో పెట్టే ప్రయత్నం చేయాలి. దీనికి మీవారి సహకారం కూడా చాలా అవసరం. టైమ్ మేనేజ్మెంట్, నోట్స్ సరిగా రాసుకోవడం, మెమరీ టెక్నిక్స్ లాంటివి ఇలాంటి విద్యార్థులకు చాలా అవసరం. బాబు చదువుకోవడానికి రోజూవారి ఒక టైమ్ టేబిల్ తయారు చేసి, చదవవలసిన సబ్జెక్ట్స్‌ను చిన్న చిన్న పోర్షన్స్‌గా విభజించి, వాటిని క్రమంగా పెంచుతూపోవడం లాంటివి బాగా పనిచేస్తాయి. అతని ఏకాగ్రతకు భంగం కలగకుండా ఇంట్లో టి.వి. పెట్టడం, ఫంక్షన్స్ పెట్టుకోవడం, ఇతరుల ఇళ్లలో జరిగే ఫంక్షన్స్‌కు వెళ్లడం లాంటివి లేకుండా చేయండి. వీలైతే బాబుకు తోడుగా మీరు కూడా పక్కన ఉండి ధైర్యం చెప్పండి. ధ్యానం, జాకబ్ సన్స్ రిలాక్సేషన్ అనే టెక్నిక్, ఈ పరీక్షల భయాన్ని బాగా తగ్గిస్తాయి. ఫలితంపై కాకుండా అతని ప్రయత్నం పైన దృష్టి పెట్టమని చెప్పండి. ఇంకా అవసరమైతే మంచి సైకియాట్రిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్ట్‌కు చూపించి, కౌన్సిలింగ్ ఇప్పించండి. మీ బాబు భవిష్యత్తు కోసం, మీరు మీ వారు చక్కగా చర్చించుకొని, ఒక టీమ్ లాగా ముగ్గురూ కలిసి పని చేయండి. ఆశావాదంతో మీరు, మీ అబ్బాయి ముందుకెళితే, బాబు తన పరీక్షల భయాన్ని పూర్తిగా అధిగమించగలడు. ఆల్ ది బెస్ట్! ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: సింగిల్ పేరెంటింగ్ సవాలుని సులభంగా అధిగమించండిలా..!) -
స్పెషల్ షోలపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో స్పెషల్ షోల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 11గం. తర్వాత వేసే షోలకు ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను అనుమతించొద్దని ఆంక్షలు విధించింది.సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతిపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా.. థియేటర్లలో పదహారేళ్లలోపు పిల్లల అనుమతిపై హైకోర్టు ఆంక్షలు విధించింది. రాత్రి 11 నుంచి ఉదయం 11 వరకు చిన్నారులను థియేటర్లలోకి అనుమతించవద్దని పేర్కొంది.వేళాపాళా లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పై ప్రభావం పడుతుందని పిటిషన్ తరపు న్యాయవాది ాదించగా.. ఆ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక తల్లి మరణించడంతో పాటు ఒక చిన్నారి తీవ్ర గాయాల పాలైన నేపథ్యంలో ఇక చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేసింది. ఈ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే దాకా పిల్లలను స్పెషల్ షోలకు అనుమతించొద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 22వ తేదీకి వాయిదా వేసింది. -
పదహారేళ్లలోపు పిల్లలను అనుమతించొద్దు
సాక్షి, హైదరాబాద్: పదహారేళ్లలోపు పిల్లలను ఉదయం 11 గంటల్లోపు, రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లలో సినిమాల ప్రత్యేక ప్రదర్శనకు అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వేళాపాళా లేని రాత్రి ప్రదర్శనలు పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని స్పష్టం చేసింది. దీనిపై అన్ని వర్గాలతో చర్చించి చట్ట ప్రకారం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.ప్రభుత్వ నిర్ణయం తీసుకునే వరకు థియేటర్ల యజమానులు 16 ఏళ్లలోపు పిల్లలను ఆయా వేళల్లో సినిమా ప్రదర్శలనకు అనుమతించొద్దని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ‘గేమ్ చేంజర్’ సినిమా ప్రత్యేక షోలకు వేకువజామున 4 గంటల నుంచి మొదలుకుని 6 షోలకు అనుమతివ్వడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కూరగాయల వ్యాపారి గొర్ల భరత్‌రాజ్ లంచ్ మోషన్ రూపంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం మరోసారి విచారణ చేపట్టి.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 22కు వాయిదా వేశారు. -
చిన్నారులపై టీడీపీ నేత దాష్టీకం
కంభం: ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తన కుమార్తె పుస్తకంలోని పేజీలు చింపారంటూ ఓ టీడీపీ నేత తమ పిల్లలను తీవ్రంగా కొట్టాడంటూ పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కంభం మండలం ఎల్కోట పంచాయతీకి టీడీపీ నేత గని చిన్నవెంకటేశ్వర్లు కుమార్తె ఎల్కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. శనివారం తన కూతురి పుస్తంలోని కొన్ని పేజీలను ఎవరో చించారు.అదే తరగతిలో చదువుకుంటున్న పిల్లలే చించారన్న అనుమానంతో శనివారం సాయంత్రం మరో ఇద్దరితో పాఠశాలలోకి వచ్చి తమ పిల్లలను తీవ్రంగా కొట్టారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ నేత జయరాజ్, ఓ బాధిత విద్యార్థి తండ్రి దుగ్గెపోగు బాబురావు మీడియాతో మాట్లాడారు. ఘటనపై హెచ్ఎం, ఎంఈవోకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఈ విషయమై కంభం సీఐ మల్లికార్జునను వివరణ కోరగా ఘటనపై విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. -
ఆ టైమ్‌లోనూ ఐరన్ యువతిలా...
భారతదేశంలోని మహిళల్లో రక్తహీనత (అనీమియా) చాలా ఎక్కువ. కొన్నేళ్ల కిందట దాదాపు 85 శాతం మంది మహిళలు అనిమిక్‌గా ఉండేవారు. క్రమంగా మహిళల్లోనూ చైతన్యం పెరుగుతుండటంతో ఇటీవల అది 57 శాతానికి చేరింది. ఇంతగా చైతన్యం పెరిగాక కూడా దేశంలోని సగానికి పైగా మహిళలు అనీమియాతో బాధపడుతున్నారు. ఇక ఇటీవలే పీరియడ్స్ మొదలైన టీనేజీ అమ్మాయిల్లో రక్తహీనతతో బాధపడుతుండేవారు ఇంకా ఎక్కువ.నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019–21 ప్రకారం 15 నుంచి 19 ఏళ్ల వయసుండే కౌమార బాలికల్లో అనీమియాతో బాధపడేవారు 59.1 శాతం! రుతుస్రావంలో రక్తం కోల్పోతుండటం, అది భర్తీ అవుతుండగానే నెలసరితో రక్తం కోల్పోతుండటంతో యువతుల్లో రక్తహీనత కనిపిస్తోంది. కొత్తగా పీరియడ్స్ మొదలైన టీనేజ్ అమ్మాయిలు అనీమియాకు లోనుకాకుండా ఉండాలంటే ఆహారంలో ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. అవేమిటో చూద్దాం. ఆహారంలో ఎక్కువగా తీసుకోవాల్సినవి... శాకాహారులు తమ ఆహారంలో తాజాగా ఉండే ఆకుకూరలు, ఎండు ఖర్జూరం, నువ్వులు, బెల్లం (బెల్లం, నువ్వులు ఉండే నువ్వుల జీడీలు, బెల్లం, వేయించిన వేరుశనగలు ఉండే పల్లీపట్టీలు తీసుకోవడం మేలు), గసగసాలు, అటుకులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఒకవేళ మాంసాహారులైతే ఆహారంలో వేటమాంసం, చేపలు, చికెన్‌తోపాటు... మటన్, చికెన్ లివర్‌ను ప్రత్యేకంగా తీసుకోవడం మంచిది. మాంసాహారం, శాకాహారం ఈ రెండింటిలోనూ ఐరన్ ఉంటుంది. అయితే మాంసాహారంలో హీమ్ ఐరన్ ఉంటుంది. హీమ్ ఐరన్ అంటే... తిన్న వెంటనే అది ఒంటికి పట్టే రూపంలో ఉంటుంది. అదే శాకాహార పదార్థాల్లో ఉండే నాన్‌హీమ్ ఐరన్ ఒంటికి పట్టేలా చేయడానికి విటమిన్–సి కావాలి. కాబట్టి శాకాహారులు తమ ఆహారాల్లో ఐరన్ ఉండేవి తినేటప్పుడు వాటితోపాటు విటమిన్–సి ఉండే తాజా పండ్లైన జామ, నిమ్మ, నారింజ వంటివి ఎక్కువగా తీసుకోవాలి లేదా వంటకాల్లో విటమిన్–సీ ఎక్కువగా ఉండే ఉసిరి వంటివి తీసుకుంటూ ఉండాలి. మాంసాహారులైనా, శాకాహారులైనా కోడిగుడ్డు, పాలు తప్పనిసరిగా రోజూ తీసుకోవాలి. కోడిగుడ్డులో పచ్చసొన తీసుకోకూడదనే అభిపప్రాయాన్ని వదిలించుకోవాలి. ఎందుకంటే పచ్చసొనతో వచ్చే హానికరమైన కొలెస్ట్రాల్ కంటే, అది తీసుకోకపోతే కోల్పోయే పోషకాలే ఎక్కువ. రుతుస్రావం అవుతున్న సమయంలో ద్రవాహారం సమృద్ధిగా లభించేలా ఎక్కువ నీళ్లు తాగుతూ, కొబ్బరినీళ్లు తీసుకోవడం కూడా మంచిదే. మరికొన్ని సూచనలురుతుస్రావం సమయంలో అమ్మాయిలు రక్తాన్ని ఎక్కువగా కోల్పోతుంటారు కాబట్టి ఎక్కువ మోతాదులో ఆహారం ఇవ్వాలంటూ పొరుగువారు, ఫ్రెండ్స్ చెబుతుంటారు. అది వాస్తవం కాదు. ఈ టీనేజ్లోనే అమ్మాయిలు తాము తీసుకునే క్యాలరీల వల్ల బరువు పెరుగుతుంటారు. అందుకే ఆహారం ఎక్కువగా తీసుకోవడం కంటే... ఆహారాన్ని ఎప్పటిలాగే తీసుకుంటూ ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలూ తీసుకోవాలి. కొత్తగా రుతుస్రావం మొదలైన అమ్మాయిలకు కొబ్బరి, బెల్లం పెట్టాలంటారు. సంప్రదాయకంగా పెద్దలు చెప్పే ఆ ఆహారం పెట్టినా పరవాలేదు. అయితే కొబ్బరిలో, నువ్వుల్లో కొవ్వు పదార్థాలు ఎక్కువ. కాబట్టి వాటిని కాస్త పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. నెయ్యికి బదులు వెన్న వాడటం మేలు. ఎందుకంటే వెన్నకాచి నెయ్యి చేశాక అందులో కొన్ని పోషకాలు తగ్గుతాయి. అయితే వెన్న తీసుకుంటే అందులోని కొవ్వులు... ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్‌ను బాగా ఒంటబట్టేలా చేస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా పీరియడ్స్ సమయంలోనూ తేలికపాటి వ్యాయామం చేయడం అవసరమని తెలుసుకోవాలి. క్రమం తప్పకుండా రోజుకు 45 నిమిషాల చొప్పున కనీసం వారానికి ఐదు రోజుల పాటైనా వ్యాయామం చేస్తే హార్మోన్లు క్రమబద్ధంగా విడుదల కావడం జరుగుతోంది. అయితే కొంతమంది విషయంలో మాత్రం పీరియడ్స్ సమయంలో వ్యాయామం కుదరక΄ోవచ్చు. వాళ్లు మినహా మిగతా యువతులంతా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అస్సలు తీసుకోకూడనివి... బేకరీ ఐటమ్స్, కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు. చాలా పరిమితంగా తీసుకోవాల్సినవి...ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలు వంటి వాటినీ, కొవ్వులు ఉండే ఆహారాలను చాలా పరిమితంగా తీసుకోవాలి. కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ చాలా తక్కువగా తీసుకోవాలి. డా. పూజితాదేవి సూరనేని, సీనియర్ హైరిస్క్ ఆబ్స్టెట్రీషియన్ –రోబోటిక్ సర్జన్ (చదవండి: ఐవీఎఫ్ జర్నీ.. రోజుకు ఐదు ఇంజక్షన్స్.. అంత ఈజీ కాదు: కొరియోగ్రాఫర్) -
చిన్నపిల్లల చేతికి ఫోన్ ఇవ్వడం నిషేధం!
పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్.. ఈ కాలంలో ఇదొక యూనివర్సల్ సమస్య. నెలల పసికందు నుంచి బడులకు వెళ్లే పిల్లల దాకా సెల్‌ఫోన్ వ్యసనానికి బానిసలైపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. తల్లీదండ్రుల సమక్షంలోనే పోను పోను ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. అయితే.. ఈ పరిస్థితులను మార్చేందుకు ఇక్కడ ఓ దేశం నడుం బిగించింది.ఎక్కువసేపు స్క్రీన్ టైం(అది సెల్ఫోన్లు, టీవీలు, ఇతరత్రా స్మార్ట్ గాడ్జెట్స్ కావొచ్చు) వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. మరీ చిన్నపిల్లల్లో కంటిచూపు మొదలు.. మాట్లాడడం సహా చాలా అంశాలపై ఆ ప్రభావం కనిపిస్తోంది. అలాగే బడీడు పిల్లలపైనా ప్రతికూల ప్రభావం చూపెడుతోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యవంతమైన జీవనశైలిని పిల్లలకు అలవర్చే ఉద్దేశంతో సింగపూర్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.స్కూళ్లలోనే కాదు ఇంటి పట్టున ఉంటున్న పిల్లల స్క్రీన్ టైం విషయంలో కఠినంగా వ్యవహరించాలని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి.దీనిప్రకారం..18 నెలల వయసున్న పిల్లల విషయంలో ఫోన్ వాడకం నిషేధం18 నెలల నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు పరిమితంగా స్క్రీన్ టైం ఉండాలిఅది కూడా పాఠాలు బోధించడం, నేర్చుకోవడం మాత్రమే!.తినేటప్పుడు నో సెల్‌ఫోన్స్, నో టీవీలుఆఖరికి బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ టైంకు కూడా అనుమతి లేదు. అంటే.. ఖాళీగా టీవీని ఆన్ చేసి కూడా వదిలేయకూడదుమూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు రోజులో గరిష్టంగా గంటసేపు మాత్రమే స్క్రీన్ టైం ఉండాలి(స్కూల్వర్క్ మినహాయించి)ఏడు నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు గరిష్టంగా రెండు గంటలు ఉండొచ్చు(స్కూల్వర్క్ మినహాయించి)శిక్ష ఉంటుందా?అవును.. ఒకవేళ పరిమిత సమయానికి మించి పిల్లలు ఫోన్లు వాడినట్లు కనిపిస్తే.. అధికారులు వాటిని స్వాధీనపర్చుకుంటారు. పదే పదే అలా జరిగితే ఎక్కువ రోజులు తమ స్వాధీనంలో ఉంచుకుంటారు. అది శ్రుతి మించితే శాశ్వతంగా సీజ్ చేసేస్తారు. కాబట్టి, స్క్రీన్ టైం విషయంలో పిల్లలను అప్రమత్తంగా ఉంచాల్సిన అవసరం తల్లిదండ్రులకే ఉంది.పిల్లల చేతిలో స్మార్ట్ఫోన్లు, అందునా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వాడకాన్ని నియంత్రించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, విద్యా శాఖ, సామాజిక & కుటుంబ సంక్షేమాభివృద్ధి శాఖ సంయుక్తంగా ఈ ఆదేశాలను జారీ చేశాయి. Grow Well SG ప్రణాళికలో భాగంగా ఈ ఆలోచన అమలు చేయబోతోంది. చదువుతో పాటు ఫిజికల్ యాక్టివిటీస్, కుటుంబ సభ్యులతో ఇంటెరాక్షన్ లాంటి యాక్టివిటీస్‌ను పెంపొందించేందుకే ఈ ప్లాన్‌ను తెరపైకి తీసుకొచ్చారు. చిన్నపిల్లలకే కాదు.. ప్రాథమిక, ఉన్నత విద్య అభ్యసించే పిల్లలకూ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అయితే.. తరగతి గదులకు ఫోన్లను అనుమతించకూడదు. వాళ్ల ఫోన్లను స్కూల్ నిర్వాహకులు తమ ఆధీనంలో ఉంచుకోవాలి. తద్వారా ఫోన్ల వినియోగాన్ని తగ్గించడంతో పాటు తరగతి గదిలో వాళ్ల దృష్టి కేవలం పాఠాల మీద, నేర్చుకోవడం మీదే ఉంటుంది.ప్రస్తుతానికి 12 ఏళ్ల లోపు పిల్లల విషయంలో ఈ మార్గదర్శకాలకు ప్రవేశపెడుతున్నప్పటికీ.. భవిష్యత్తులో టీనేజర్లకు విస్తరించే ఆలోచనలో ఉందట. తద్వారా స్మార్ట్ఫోన్ల అతి వినియోగం వల్ల కలిగే దుషప్రభావాల నుంచి భావితరాలను బయటపడేసే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
Uttar Pradesh: ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవ దహనం
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లోని ప్రాంతంలోని ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు పిల్లలతో పాటు ఒక మహిళ సజీవదహనమయ్యింది.ఒక కుటుంబంలోని నలుగురు మృతిచెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ ఘటన కాంచన్ పార్క్ కాలనీలో జరిగింది.ఈరోజు (ఆదివారం) ఉదయం 7 గంటల సమయంలో పీఆర్వీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎనిమిది మంది ఉన్నారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు పిల్లలతో పాటు ఒక మహిళ సజీవ దహనమయ్యింది. వారు తీవ్రంగా కాలిపోవడంతో పాటు ఊపిరాడక విలవిలలాడిపోతూ ప్రాణాలొదిలారు.అగ్నిమాపక దళం బృందం మంటలను అదుపు చేసింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. మంటలను ఆర్ఫిన అగ్నిమాపక దళం ఇంటి గోడను పగలగొట్టి, ఇంట్లో చిక్కుకున్న ఒక మహిళ ముగ్గురు పిల్లలను రక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ నలుగురి పరిస్థితి మరింత విషమంగా ఉందని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: దీక్ష విరమించను.. వైద్య చికిత్సకు ఓకే: రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్ -
బట్టీ వద్దే బడి..
డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్ల చర్ల గ్రామ స్టేజీ సమీపంలోని ఇటుక బట్టీ వద్ద ఒడిశా బడి ఏ ర్పాటు చేశారు. ఇక్కడి ఇటుక బట్టీలో ఒడిశా రాష్ట్రానికి చెందిన 50 కుటుంబాలు పనులు చేస్తున్నాయి. వీరి కుటుంబాల్లో సు మారు 35 మంది ఏడేళ్లలోపు పిల్లలు ఉండటంతో బట్టీ యజ మాని జహంగీర్.. వారి కోసం ప్రత్యేకంగా ఒడిశా పాఠశాలను ఏర్పాటు చేశారు.35 మంది పిల్లలకు ప్రాథమికస్థాయి విద్యను బోధించేందుకు ఒడిశాకు చెందిన సునీల్ అనే యువకుడిని నియమించారు. పాఠశాల కోసం ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు సునీల్ ఒడిశా భాషలో అక్షరాలతో పాటు పాఠాలు నేర్పుతు న్నారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ, బట్టీలో పనిచేస్తున్న వారి పిల్లలకు వారి భాషలోనే విద్యను నేర్పించాలనే ఉద్దేశంతో ఈ బడి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
కుర్రాడిగా అదృశ్యమై.. 23 ఏళ్ల తర్వాత ఫ్యామిలీతో ప్రత్యక్షమై.. వింత ఘటన
సరిగ్గా 23 ఏళ్ల క్రితం మాయమైన కుర్రాడు ఇప్పుడు వివాహితునిగా భార్య, ఇద్దరు పిల్లలతో పాటు ఇంటికి తిరిగివస్తే, ఆ కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉంటుంది? అది ఊహకు అందదు. ఇటువంటి ఘటన గురించి విన్నవారు తెగ ఆశ్చర్యపోతారు. సరిగ్గా ఇటువంటి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.యూపీలోని సీతాపూర్(Sitapur)లో 23 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఒక కుర్రాడిని అతని జ్ఞాపకాలు ఇంటికి తిరిగివచ్చేలా చేశాయి. ఆ కుర్రాడు వివాహితునిగా మారి భార్య, ఇద్దరు పిల్లలలో పాటు గ్రామానికి తిరిగిరావడంతో అందరూ ఆశ్యర్యపోయారు. అతనిని చూసిన తల్లి షాక్‌నకు గురయ్యింది. అతనిని చూసేందుకు గ్రామస్తులు క్యూ కడుతున్నారు. బాల్యంలో అతని తలకు తగిలిన గాయం ఆధారంగా ఆ తల్లి అతను తన కుమారుడేనని గుర్తించింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యువకుడిని గుర్తించారు. 23 ఏళ్ల క్రితం ఆ బాలుని తల్లి తన కుమారుడు కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇన్నాళ్లకు కుమారుడిని కలుసుకున్న ఆ తల్లి భావోద్వేగానికి గురయ్యింది. ఈ ఉదంతం రెయుసా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం రేవాన్ గ్రామానికి చెందిన అరవింద్ మౌర్య(Arvind Maurya) 2002లో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. అప్పుడు అరవింద్ వయసు దాదాపు 18 ఏళ్లు. ఆ సమయంలో అరవింద్.. సోంపు విక్రయించేవాడు. కొడుకు అదృశ్యం కావడంతో తల్లి చంపకళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు తెలిసిన అన్నిచోట్లా వెదికింది. పలుదేవాలయాల చుట్టూ తిరుగుతూ, తన కుమారుడు క్షేమంగా తిరిగిరావాలని కోరుతూ పూజలు చేసింది.ఇప్పుడు ఇంటికి తిరిగివచ్చిన అరవింద్.. పోలీసులకు తాను ఇన్నాళ్లూ ఎక్కడున్నదీ, ఏం చేసినదీ తెలిపాడు. తాను ఇంటి నుంచి వెళ్లిపోయిన తరువాత పంజాబ్, హర్యానా తదితర ప్రాంతాలలో ఉంటూ, ఏవో పనులు చేసుకుంటూ కాలం గడిపానని తెలిపాడు. అదేసమయంలో తనకు వివాహం జరిగిందని, ఇద్దరు పిల్లలు కూడా పుట్టారని తెలిపాడు. ఇప్పుడు తన భార్య, పిల్లల కోరిక మేరకు పంజాబ్ నుంచి తన ఇంటికి తిరిగివచ్చానని తెలిపాడు. అరవింద్‌ను, అతని కుటుంబ సభ్యులను విచారించిన తర్వాత పోలీసులు ఈ మిస్సింగ్ కేసు(Missing case)ను ముగించారు. అరవింద్ భార్య పూనమ్ మాట్లాడుతూ తన అత్తమామలను కలుసుకున్నానని, ఇప్పుడు చాలా ఆనందంగా ఉందని అన్నారు. తనకంటూ ఒక ఉమ్మడి కుటుంబం ఉన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. కాగా అరవింద్, పూనమ్‌లు 2014లో పంజాబ్‌లో వివాహం చేసుకున్నారు. ఇది కూడా చదవండి: ఆరేళ్ల బుడతడు.. వెయ్యి కిలోమీటర్లు పరిగెడుతూ అయోధ్యకు.. -
పేరెంట్స్ అనుమతి ఉంటేనే ‘సోషల్’ ఖాతా
సాక్షి, హైదరాబాద్: సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలపై ఇకపై మైనర్లు ఇష్టంవచ్చినట్లు ఖాతాలు తెరిచేందుకు వీలు పడదు. వారి తల్లిదండ్రుల అనుమతి (వెరిఫయబుల్ కన్సెంట్) ఉంటేనే ఖాతా తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర సమాచార శాఖ విడుదల చేసిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్ట ముసాయిదాలో నిబంధన చేర్చా రు. 18 ఏళ్లలోపు పిల్లలకు ఈ నిబంధన వర్తిస్తుంద ని పేర్కొన్నారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే తల్లి దండ్రులు లేదా గార్డియన్ అనుమతి ఇచ్చిన తర్వాతే మైనర్లు సోషల్ మీడియా ఖాతాలు, ఈ–కామర్స్, గేమింగ్ యాప్‌లు వాడాల్సి ఉంటుంది.ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో కొందరు తమ పుట్టిన తేదీ, వయస్సును తప్పుగా నమోదు చేసి సోషల్‌మీడియా ఖాతాలు తెరుస్తున్నారు. ఇకపై అది కూడా కుదరదు. పిల్లలకు తల్లిదండ్రులుగా సమ్మతి తెలిపేవారు కూడా తప్పకుండా పెద్దవాళ్లే అని నిర్ధారించాల్సి ఉంటుందని ముసాయిదాలో పేర్కొన్నారు. దివ్యాంగులకు సైతం వారి చట్టబద్ధమైన గార్డియన్ ద్వారా సమ్మతి ఉంటేనే సోషల్ మీడియా వాడేలా నిబంధనలు తీసుకొచ్చారు. మన డేటా మనదేశంలోనే డీపీడీపీ ముసాయిదాలో మరో కీలక నిబంధన కూడా చేర్చారు. మనదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సోషల్‌మీడియా సంస్థలు.. వారివద్ద ఉన్న భారతీయుల డేటాను ఇక్కడే నిల్వచేయాలని ముసాయిదాలో పేర్కొన్నారు. దేశం బయటకు తరలించేందుకు వీలుండదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ముసాయిదాలో నిబంధనలు చేర్చింది. ,యితే ఈ కొత్త నిబంధనలు మెటా, గూగుల్, యాపిల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి టాప్ సోషల్ మీడియా, ఇంటర్నెట్ కంపెనీలకు చికాకు కల్గించే అవకాశం ఉంది. ఈ ముసాయిదాపై అభిప్రాయాలు తెలిపేందుకు ఫిబ్రవరి 18 వరకు కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. అందువల్ల సదరు కంపెనీలు ఈ నిబంధనలు వ్యతిరేకించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి -
సోషల్ మీడియా DPDP నిబంధనలు : 18 ఏళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిరి
సామాజిక మాధ్యమాల వినియోగంలో 18 ఏళ్ల లోపు పిల్లలకు సంబంధించి కీలక చట్టం రాబోతోంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) యాక్ట్ డ్రాప్ట్ రూల్స్ ప్రకారం ఇకపై 18 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడానికి ముందు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సమ్మతి అవసరమని స్పష్టం చేస్తోంది. భారతదేశం వెలుపల వ్యక్తిగత డేటాను బదిలీ చేయడానికి కంపెనీలకు ప్రభుత్వ అనుమతి అవసరమని కూడా పేర్కొంది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (జనవరి 3న) డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023 (DPDP) కోసం డ్రాఫ్ట్ నియమాలను నోటిఫై చేసింది. నిబంధనలపై అభిప్రాయాన్ని/కామెంట్లను పంచుకోవడానికి మంత్రిత్వ శాఖ వాటాదారులను కూడా ఆహ్వానించింది. ముఖ్యంగా స్కూల్ పిల్లలను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచడం దేశ ప్రయోజనాలకు మంచిదన్న అభిప్రాయం, సోషల్ మీడియా వినియోగానికి కనీసం 21 ఏళ్లు లేదంటే ఓటు హక్కుకు అమలు చేస్తున్నట్టుగా 18 ఏళ్ల వయోపరిమితి ఉండాలన్న వాదనల మధ్య ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది.The Ministry of Electronics and Information Technology has published the draft rules for the Digital Personal Data Protection (DPDP) Act for public consultation. Suggestions and objections regarding the draft rules can be submitted through the MyGov portal until February 18,… pic.twitter.com/a5X4uPeFyW— Bar and Bench (@barandbench) January 3, 2025 పిల్లల డేటా ప్రాసెసింగ్‌పై DPDP రూల్స్ ప్రకారం చైల్డ్ (C) వినియోగదారు సోషల్‌మీడియా ఖాతాను సృష్టించాలనుకుంటే, డేటా ఫిడ్యూషియరీ (DF) తప్పనిసరిగా తల్లిదండ్రుల సమ్మతిని ధృవీకరించాలి. ఈ సందర్భంలో, తల్లిదండ్రులు (P) తనను తాను గుర్తించి, DFతో ఇప్పటికే అందుబాటులో ఉన్న ధృవీకరించిన గుర్తింపు, వయస్సు వివరాలతో రిజిస్టర్డ్ యూజర్ అని నిర్ధారిస్తారు. పిల్లల డేటాను ప్రాసెస్ చేయడానికి ముందు, డీఎఫ్ తప్పనిసరి. అలాగే తల్లిదండ్రుల గుర్తింపు , వయస్సు రికార్డుల విశ్వసనీయతను కూడా నిర్ధారించాల్సి ఉంటుంది.ఫిబ్రవరి 18 వరకు ప్రజాభిప్రాయాల సేకరణకుద్దేశించిన ముసాయిదా నిబంధనల ప్రకారం, ప్రభుత్వం నిర్దేశించిన IDని ధృవీకరించి, డిజిటల్ లాకర్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా అందుబాటులో ఉంచడానికి పిల్లల వయస్సును ధృవీకరించాలి. వివాదంDPDP చట్టంలో పిల్లల డేటా ప్రాసెసింగ్‌కు సంబంధించిన నిబంధనలు వివాదాస్పదంగా ఉన్నాయి. పౌర సమాజం, పరిశ్రమ వర్గాలతో పాటు, మెటా, గూగుల్ (Meta, Google) లాంటి బిగ్ టెక్ సంస్థలు కూడా ప్రభుత్వాన్ని పిల్లలు, డేటా వినియోగం నిబంధనలపై మార్పులను కోరుతున్నాయి. ప్రధాంగా ఈ నిబంధనలోని వయస్సును 18 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల కంటే తక్కువకు తగ్గించాలంటున్నాయి.ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని మినహాయింపులను కూడా ఇచ్చింది. ఫిబ్రవరి 18 తరువాత, ప్రజలనుంచి వచ్చిన సూచనలు, సలహాల మేరకు మరికొన్ని మినహాయింపులుండవచ్చని భావిస్తున్నారు.పిల్లల డేటాను ప్రాసెస్‌పై పరిమితులు, మినహాయింపులు మానసిక ఆరోగ్య సంస్థ లేదా ఆరోగ్య సంరక్షణ నిపుణులుఅనుబంధ ఆరోగ్య సంరక్షణ నిపుణులువిద్యా సంస్థచైల్డ్ డే కేర్ సెంటర్విద్యా సంస్థకాగా 2023 ఆగస్టులో పార్లమెంటులో ఆమోదించిన DPDP బిల్లు ఈ నిబంధనను నిర్దేశించింది. దేశ పౌరుల డిజిటల్ హక్కులకు రక్షణ కల్పించేందుకు కేంద్రం ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన సంగతి తెలిసిందే. -
సరైన బట్టల్లేక.. దుప్పట్లు లేక..
యుద్ధంతో అతలాకుతమైన గాజాను ఇప్పుడు చలి పులి చంపేస్తోంది. ముఖ్యంగా చలి నుంచి దాచుకోవడానికి వెచ్చని దుస్తులు లేక, కప్పుకోవడానికి దుప్పట్లు లేక గాజా స్ట్రిప్‌లో చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఆహారం, ఇంధనం, మందులు, మౌలిక సదుపాయాలు లేక గాజాలోని కుటుంబాలు వణికిపోతున్నాయి. కళ్లముందే పిల్లలు ప్రాణాలు కోల్పోతుండటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. డెయిర్ అల్–బలాహ్: ఓవైపు యుద్ధంతో విధ్వంసమైన గాజాను ఇప్పుడు చలి వణికిస్తోంది. చలి తీవ్రత బాగా పెరగడంతో రక్షించుకోవడానికి సరైన బట్టలు, దుప్పట్లు లేకపోవడంతో వారం రోజుల వ్యవధిలో ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు. బాంబు దాడుల నుంచి తప్పించుకుని వచ్చామని, ఇక్కడ చలికి పిల్లల ప్రాణాలు పోతున్నాయని తన నవజాత శివువును పోగొట్టుకున్న యహ్యా అల్–బత్రాన్ రోదిస్తున్నాడు. కొద్దిరోజుల కిందే చనిపోయిన తన చిన్నారి దుస్తులను చూపిస్తూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం కారణంగా పూర్తిగా నిరాశ్రయులైన బత్రాన్ కుటుంబం పదేపదే కొత్త ప్రాంతాలకు వలసపోతూ చివరకు డేర్ ఎల్–బాలాహ్లోని చిరిగిపోయిన దుప్పట్లు, బట్టలతో చేసిన తాత్కాలిక గుడారానికి చేరింది. అతని భార్య నెలలు నిండకుండానే కవల పిల్లలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒకరు జుమా దక్షిణ గాజాలోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతుండగా.. అలీ కొంత ఆరోగ్యంగా ఉండటంతో ఇంక్యుబేటర్ నుంచి బయటకు తీశారు. ప్రస్తుతం ఖర్జూరం తోటలో నివసిస్తున్న వందలాది మంది మాదిరిగానే, వారు భారీ వర్షాలు, ఎనిమిది డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతల మధ్య పిల్లలను వెచ్చగా ఉంచడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా దుప్పట్లు లేవు. తగిన దుస్తులు లేవు. ‘‘చలికి తట్టుకోలేక నా బిడ్డ శరీరం మొత్తం గడ్డకట్టడం, అతని చర్మం నీలం రంగులోకి మారింది. నా కళ్లముందే చలిపులి అతని ప్రాణాలుతీసింది’’అంటూ ఆ తల్లి కంటతడి పెట్టుకుంది. వర్షంలో తడిసిన చాపపై కూర్చొని చిరిగిపోయిన దుప్పట్లును కప్పి దగ్గరకు పట్టుకుని తన ఇద్దరు పిల్లలను కాపాడుకుంటున్నాడు బత్రాన్. ఎండిపోయిన రొట్టె, స్టవ్ మీద చిన్న కుండలో ఉన్న వేడి నీళ్లు. ఒక రోజుకు వాళ్లకవే ఆహారం. 20 లక్షల మంది భద్రతకు ముప్పు గాజా స్ట్రిప్‌లో వేలాది ఇతర కుటుంబాల ఆహారం, ఇంధనం, ఔషధాల తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఉంటున్న మహమూద్ అల్–ఫాసిహ్ మూడు వారాల వయసున్న తన కూతురును కోల్పోయాడు. వారి కుటుంబం అల్–మవాసి బీచ్ సమీపంలోని చిన్న గుడారంలో ఉంటుండగా చలికి శిశువు గడ్డకట్టుకుపోయింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు చెప్పారు. తీవ్రమైన హైపోథెరి్మయా వల్ల చిన్నారి గుండె హఠాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయిందని నాజర్ ఆసుపత్రి అత్యవసర, పిల్లల విభాగం డైరెక్టర్ అహ్మద్ అల్ ఫరా తెలిపారు. చలితో మరో 20 రోజుల పసికందు ఆయేషా అల్ ఖాస్సాస్ మృతి చెందింది. ‘‘మీరు ఇంకా గాజా స్ట్రిప్‌లో ఉన్నారంటే ఇజ్రాయెల్ బాంబుదాడులతో మరణించాలి లేదంటే ఆకలితోనో, చలికో చచ్చిపోతారు’’అంటూ దుఃఖిస్తున్నారు ఆయేషా తల్లిదండ్రులు. రాబోయే రోజుల్లో మరింత కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సిన దారుణ పరిస్థితి దాపురిస్తుందని గాజాలోని హమాస్ ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇది నిర్వాసితులైన 20 లక్షల మంది భద్రతకు ముప్పు. ఈ వాతావరణ తీవ్రతకు శిశువులు, వృద్ధులు మరణించే అవకాశం ఉందని డాక్టర్ ఫరా హెచ్చరించారు. -
అమెరికన్లు పిల్లల్ని తప్పుడు మార్గంలో పెంచుతున్నారు: వివేక్ రామస్వామి
వాషింగ్టన్: భారత్ వంటి దేశాల నుంచి నిపుణులైన సిబ్బందిని నియమించుకోవడాన్ని పూర్తిగా ఆపేయాలంటూ మాగా (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) వేదిక మళ్లీ డిమాండ్ చేస్తున్న వేళ.. భారతీయ అమెరికన్ వ్యాపార వేత్త, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసిన వివేక్ రామస్వామి చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. అమెరికా అధ్యక్షుడిగా మరికొద్ది రోజుల్లో పగ్గాలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ భారతీయ అమెరికన్ వెంచర్ కేపిటలిస్ట్ శ్రీరాం కృష్ణన్‌ను కృత్రిమ మేథ సీనియర్ విధాన సలహాదారుగా ఇటీవల నియమించడం తెలిసిందే. ఈ నియామకంపై మాగా వేదిక విమర్శలు గుప్పిస్తోంది. ఇలాంటి చర్యలు అమెరికా ఫస్ట్ లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తాయని అంటోంది. ఇమిగ్రేషన్ విధానాల వల్లే అమెరికన్లకు అవకాశాల్లేకుండా పోతున్నాయని మరి కొందరు వాదిస్తున్నారు. అయితే, వివేక్ రామస్వామి మరో కోణంలో చేస్తున్న వాదించారు. అసలు సమస్య ఇమిగ్రేషన్ విధానాల్లో లేదని, అమెరికా సంస్కృతిలో పిల్లల పెంపకంలో లోపమే కారణమంటూ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. అమెరికన్ యువతలో సహజంగానే నైపుణ్యం ఉందని, అయితే దానిని పెంపొందించడంలో వ్యవస్థాగతంగా విఫలమైందన్నారు. గణిత మేధావులు, ఉన్నత విద్యావంతులను వదిలేసి అలంకార పదవుల్లో ఉన్న వారిని పొగుడుతుండటమనే సంస్కృతే ఇందుకు కారణమన్నారు. అదే సమయంలో, వలసదారుల కుటుంబాలు తమ పిల్లలను విద్యారంగంలో నిష్ణాతులుగా మార్చి, క్రమశిక్షణతో పెంచుతున్నాయని తెలిపారు. సామాజిక కార్యక్రమాలు, టీవీ వీక్షణం వంటివాటిపైనా ఆంక్షలు పెడుతుంటాయన్నారు. ఫలితంగా ఈ కుటుంబాల నుంచి నాయకులు తయారవడం మామూలేనన్నారు. ఈ వ్యాఖ్యలపై మాగా వేదిక భగ్గుమంది. వలసదారులకు, హెచ్–1బీ వీసాదారులకు అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ వివేక్ రామస్వామిపై ఎదురుదాడికి దిగింది. -
కూటమి పాలనలో చెదిరిన చదువులు
ఐక్యరాజ్య సమితి వరకు వినిపించిన ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రగతి ఆర్నెల్లలోనే గాడి తప్పింది! గత ఐదేళ్లూ మహోన్నతంగా విలసిల్లిన సర్కారు స్కూళ్లు మళ్లీ అద్వానంగా మారాయి. పిల్లల మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరీక్షించే నాథుడే లేరు. సదుపాయాలు, ప్రమాణాలు దిగజారి దయనీయంగా కనిపిస్తున్నాయి. ‘మెగా పేరెంట్స్ డే’ పేరుతో కూటమి ప్రభుత్వం ఈ నెల 7వ తేదీన ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులతో ఓ సమావేశాన్ని నిర్వహించి ఒక్క రోజు హడావుడి చేసింది. ఈ కార్యక్రమం ‘గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు’లో లిఖించదగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మరి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో నిజంగా బోధన ఎలా ఉంది? ఎలాంటి సదుపాయాలున్నాయి? మన విద్యా వ్యవస్థ నాడు – నేడు ఎలా ఉంది? విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రతినిధుల బృందం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించింది.మొగిలి రవివర్మ – సాక్షి ప్రతినిధి కర్నూలుకూటమి అధికారంలోకి వచి్చన తర్వాత కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వానంగా మారింది.⇒ కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం ముడుమాల జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులు చెట్ల కిందే కూర్చుని పాఠాలువింటున్నారు. కొంత మంది అసంపూర్తిగా నిలిచిపోయిన గదుల్లో ఇసుక, మట్టిపై కూర్చుని కనిపించారు. బ్లాక్ బోర్డును ఇటుకలపై అమర్చి బోధిస్తున్నారు. 12 తరగతి గదుల నిర్మాణాన్ని మధ్యలో నిలిపేశారు. రూ.46.99 లక్షలు నిధులున్నా, వాటిని పూర్తి చేసే వారు లేరు. సంగాల ఉన్నత పాఠశాల భవనాలను మధ్యలోనే నిలిపేశారు. నాగులదిన్నె, నందవరంతో పాటు జడ్పీ హైస్కూలు భవనాల నిర్మాణం ఆగిపోయింది. ప్రభుత్వం మారడంతో పనులు నిలిపివేసింది.⇒ నందవరం మండలం నాగులదిన్నె స్కూలులో తాగేందుకు మంచినీరు లేక ట్యాంకుల్లో నింపిన నీటినే పిల్లలు తాగుతున్నారు.⇒ కర్నూలులో స్టాంటన్‌పురం నుంచి ఎమ్మిగనూరు వరకు ఏ స్కూల్లో చూసినా మరుగుదొడ్లలో దుర్గంధమే.⇒ చాలా స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంది. చాలా మంది పిల్లలకు బూట్లు లేవు. చెప్పులు, ఒట్టి కాళ్లతో బడికి వచ్చారు.⇒ కర్నూలు రూరల్ మండలం కోడుమూరు నియోజకవర్గం సుంకేసుల ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల భవనాలు, ప్రహరీ, కిచెన్ నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేశారు. కాలనీలో నిరుపేద మహిళలను పలుకరించగా.. ‘సార్! మాలాంటోళ్లకు అమ్మ ఒడితో ఎంతో మేలు జరిగింది. ఇప్పుడు ‘తల్లికి వందనం’ అంటూ ఎంతమంది ఉంటే అంతమందికి రూ.15 వేలు ఇస్తామన్నారు. మరి ఎక్కడిచ్చారు?’ అంటూ మహిళలు శిరోమణి, స్వరూప, మహేశ్వరి నిర్వేదం వ్యక్తం చేశారు.అమ్మ ఒడి లేదు.. నీడనిచ్చే హాస్టళ్లూ లేవు..!కర్నూలు జిల్లా కోసిగి మండలం పల్లెపాడు హైస్కూలులో 608 మంది విద్యార్థులు చదువుతుండగా 160 మంది మాత్రమే బడికి వస్తున్నారు. మిగిలిన వారంతా తల్లిదండ్రులతో కలసి ఉపాధి కోసం వలస వెళ్లారు. గతంలో తల్లిదండ్రులు వలస వెళ్లినా పిల్లలు సీజనల్ హాస్టళ్లలో ఉంటూ చదువుకునేవారు. ఇప్పుడు డిసెంబర్ వచ్చినా సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేయకపోవడంతో తల్లిదండ్రులతో కలసి పనుల కోసం పిల్లలు ఊరు విడిచి వెళ్లారు. అమ్మ ఒడి కూడా అందకపోవడంతో కష్టజీవులు తమ పిల్లలను చదివించుకునే పరిస్థితి లేకుండా పోయింది.బడి వదిలి.. పొలం బాట .. సి.బెళగల్ మండలం ఈర్లదిన్నెలో శేఖర్ అనే విద్యార్థి స్కూలుకు వెళ్లకుండా తండ్రి ఈశ్వర్‌తో కలిసి పొలంలో గడ్డివామి వేస్తున్నాడు. అదే గ్రామంలో సందేశ్, జీవన్ అనే మరో ఇద్దరు చిన్నారులు కూడా తల్లి ప్రవీణతో కలసి మొక్కజొన్నకు మందు పిచికారీ చేస్తున్నారు. ‘అమ్మ ఒడి డబ్బులు వస్తే పిల్లల ఖర్చులకు ఉపయోగప డేవి. ఇప్పుడు ఇవ్వట్లేదు కదా సార్! ఏదో వీళ్లు పనికి వస్తే కూలీ డబ్బులైనా మిగులుతాయి’ అని తల్లిదండ్రులు చెబుతున్నారు.అమ్మ ఒడి లేక డ్రాపౌట్స్!బిజివేముల రమణారెడ్డి – సాక్షి ప్రతినిధి, బాపట్లబాపట్ల జిల్లాలోని తీర ప్రాంతంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందక పేద పిల్లలు పాఠశాలలకు దూరమవుతున్నారు. డ్రాపౌట్స్ పెరిగిపోతున్నారు. ఈ ఏడాది ఇంకా చాలా మందికి యూనిఫాం, బూట్లు, ఇతర వస్తువులు అందలేదు... అని చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం అక్కాయిపాలెం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చెప్పారు. అమ్మ ఒడి అందకపోవడంతో ఈ పాఠశాలలో 23 మంది విద్యార్థులు తగ్గిపోయినట్లు ఓ ఉపాధ్యాయుడు తెలిపారు. ⇒ చంద్రబాబు ప్రభుత్వం అమ్మ ఒడి ఇవ్వక పోవడంతో ఇద్దరు పిల్లలను చదివించడం భారంగా ఉందని సముద్ర తీర ప్రాంతం వాడరేవుకు చెందిన మత్స్యకారుడు శ్రీను ఆవేదన వ్యక్తం చేశాడు. అమ్మ ఒడి రాక తమ పిల్లలను బడి మానిపించినట్లు మహిళలు సురేఖ, కుమారి తెలిపారు. అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం చదువులు లేనప్పుడు ఇక పిల్లలను బడికి పంపడం ఎందుకు సారూ.. అని మత్స్యకార మహిళ అక్ష ప్రశ్నించింది. ఓడరేవు ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వ హయాంలో మొదలైన భవన నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో విద్యార్థులు ఆరు బయట ఇసుకలో చదువుకుంటూ కనిపించారు. ⇒ చినగంజాం మండలం అడవి వీధిపాలెం ఉన్నత పాఠశాలను పరిశీలించేందుకు ఉపాధ్యాయులు అనుమతి నిరాకరించి గేటుకు తాళం వేశారు. నాసిరకం బియ్యం, టమాటా చారుతో పెడుతున్న మధ్యాహ్న భోజనాన్ని పిల్లలు తినడం లేదని, చాలామంది ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నారని అనూష అనే మహిళ తెలిపింది. తాగడానికి మంచినీళ్లు కూడా అందుబాటులో లేవని, మరుగుదొడ్లు శుభ్రంగా లేవని విద్యార్థులు చెప్పారు. జిల్లాలో సుమారు రూ.350 కోట్ల విలువైన నాడు–నేడు పనులు మధ్యలోనే ఆగిపోవడంతో నిర్మాణాలు నిలిచిపోయాయి.తడికెల బడి.. కర్నూలులోని స్టాంటన్‌పురం జడ్పీ హైస్కూల్లో అంగన్వాడీ నుంచి పదో తరగతి వరకూ ఒకటే బడి. ‘నాడు–నేడు’ కింద మంజూరైన నిధులున్నా భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో టీచర్లు చందాలు వేసుకుని తడికెలు సమకూర్చుకుని అందులోనే పిల్లలకు చదువు చెబుతున్నారు. ఆర్నెల్లలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయిందో చెప్పేందుకు ఇవి సరిపోవా?శ్రీకాకుళం జిల్లా ఆనందపురం యూపీ స్కూల్లో నిరూపయోగంగా మారిన వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ నిర్వహణ అస్తవ్యస్తంకందుల శివశంకర్ – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మూత్రశాలలు, మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ లేక విద్యార్థులు అవస్థ పడుతున్నారు. రణస్థలం మండలం పైడి భీమవరం హైస్కూల్లో వాష్బేసిన్లు, మూత్రశాలలు నీటి సదుపాయం లేక వెక్కిరిస్తున్నాయి. టెక్కలి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక చాలా చోట్ల పాఠశాలల భవనాలు ప్రారంభించేందుకు సిద్ధమైనా వాటిని పట్టించుకునే నాధుడు లేరు. భవనాల్లో అమర్చాల్సిన తలుపులు, కిటికీలు, ఇతర సామగ్రిని పాఠశాలల్లోని స్టోర్ రూమ్‌లో పడేశారు. ఈ పనుల కోసం ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని రణస్థలం మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.⇒ పాఠశాలల్లో తాగునీటి ఆర్వో ప్లాంట్లు నిర్వహణ లోపంతో పని చేయడం లేదు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెట్టడం లేదు. చాలా చోట్ల ఆరు బయట అపరిశుభ్ర వాతావరణంలో వండటం కనిపించింది. రణస్థలం మండలం పాతర్లపల్లి హైస్కూల్లో విద్యార్థులకు సిద్ధం చేసిన వంటల్లో పక్షుల విసర్జితాలు నేరుగా పడుతున్న దుస్థితి ‘సాక్షి’ పరిశీలనలో కంటబడింది. పక్కా భవనం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఉపాధ్యాయులు, వంట కార్మికులు చెబుతున్నారు.నాడు–నేడు కింద చేపట్టిన భవనాల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని, అవి పూర్తయితే వంటగదిని కేటాయించవచ్చని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. నాడు–నేడుతో తమ పాఠశాల రూపురేఖలు మారాయని, చుట్టూ రక్షణ గోడ నిర్మించడంతోఎన్నో ఏళ్లుగా వేధించిన వరద నీటి ముంపు సమస్య తొలగిందని శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం ఆనందపురం యూపీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఏ.ఆదినారాయణ చెప్పారు.కలలో కూడా అనుకోలేదు..‘ఎప్పుడు ఏది కూలుతుందో తెలియని దుస్థితి నుంచి కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే రీతిలో మా స్కూళ్లు మారతాయని ఎన్నడూ ఊహించలేదు. నా సర్వీస్‌లో ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు..’ – డిజిటల్ బోర్డు వైపు చూస్తూ శ్రీకాకుళం జిల్లా దేశవానిపేట యూపీ స్కూల్ టీచర్ ఉత్తముడి మాట!ఈ మార్పులు ఎవరి చలువ?‘ఇటీవల పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ కోసం పాఠశాలకు వెళ్లాం. అక్కడ ఉన్నవన్నీ ఎవరు ఏర్పాటు చేసిన వసతులు? ఎవరి హయాంలో వచ్చిన మార్పులు అవి? వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే వ్యక్తి లేకపోతే మా ఊరి బడి పరిస్థితి మారేదా..?’ – శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 8వ తరగతి విద్యార్థి తండ్రి ఎస్.రామారావు మనోగతం!జగన్ మా బాధలు తీర్చారు..‘పాఠశాలకు వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు ఒకటే టెన్షన్. చుట్టూ మురుగునీరు.. తీవ్ర దుర్గంధం! చినుకు పడితే పాముల బెడద. ఎప్పుడూ జలమయంగా ఉండే పాఠశాల ప్రాంగణం.. జగన్ నాడు–నేడులో భాగంగా చేపట్టిన ప్రహరీ నిర్మాణంతో మా బాధలు తీరాయి’ – డోల చంద్రుడు, విద్యార్థి ఆనందపురం, శ్రీకాకుళం జిల్లాఆర్నెల్లుగా జీతాలులేకున్నా..‘పిల్లల బాగోగులే మాకు కావాలి బాబూ..! జగన్ బాబు ఉన్నప్పుడు ప్రతి నెలా జీతం వచ్చేది. ఇప్పుడు జీతం ముఖం చూసి ఆరు నెలలైంది. అయినా సరే పని చేస్తున్నాం. పిల్లల ఆరోగ్యమే మా జీవితం. మా ఆకలి బాధలు తీరకున్నా మరుగుదొడ్లు నిత్యం పరిశుభ్రంగానే ఉంచుతున్నాం. మాకు చేతనైంది ఇదే పని బాబూ.. జీతాలిప్పించండి..’ అంటూ పాతర్లపల్లి, పైడి భీమవరంలో ఆయా రాములమ్మతో పాటు మరికొందరు వేడుకున్నారు. -
‘మురిపాల’మూరు చిన్నారులు
‘నాకూ నా కుటుంబం ఉంది’ అనేది గుండె నిండా ధైర్యాన్ని ఇచ్చే మాట. ‘నాకు నా కుటుంబం ఉంది’ అనేది చీకట్లో వెన్నెలై పలకరించే మధురమైన మాట. ఆ ధైర్యాన్ని ఇచ్చే మాట, మధురమైన మాటకు నోచుకోని శిశువులు అక్కడ కనిపిస్తారు. అయితే వారి దురదృష్టాన్ని చూసి ‘పాలమూరు శిశుగృహ’ కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఉండదు. వెన్నెల రాత్రులలో చందమామ కథలు చెబుతున్నట్లు ఉంటుంది...‘చిన్నీ... నువ్వేమీ బాధ పడవద్దు. నిన్ను వెదుక్కుంటూ ఒక అమ్మ తప్పనిసరిగా వస్తుంది’ అని ఆభయమిస్తున్నట్లుగా ఉంటుంది. నిజమే, దత్తత తీసుకోవడానికి దేశవిదేశాల నుంచి ఎంతోమంది తల్లులు ఈ శిశుగృహకు వస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డలో 2010లో శిశుగృహ ఏర్పాటు అయింది. 2011 నుంచి దత్తత ప్రక్రియ మొదలైంది. సంతానలేమితో బాధపడుతున్న దంపతులు రోజుల వయసున్న పసికందు నుంచి అంతకంటే పెద్ద వయసు ఉన్న పిల్లల వరకు దత్తత తీసుకునే అవకాశాన్ని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కల్పించింది. ‘శిశుగృహ’ నుంచి 230 మంది చిన్నారులు దత్తతకు వెళ్లారు. ఇలా దత్తతకు వెళ్లిన వారిలో ఆడ శిశువులు, బాలికలే అధికంగా ఉండడం విశేషం.ప్రేమకు ఊరితో పనేమిటి? దేశంతో పనేమిటి?‘నాకు ఒక బిడ్డ కావాలి’ అంటూ అమెరికా నుంచి రెక్కలు కట్టుకొని వాలింది క్రిస్టినా నోయ. క్రిస్టినా–మాథ్యూ థామస్ దంపతులు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.వారికి ఇద్దరు సంతానం. ఇద్దరూ మగపిల్లలే కావడంతో ఆడబిడ్డను దత్తత తీసుకున్నారు. ఆ పాపను ఎత్తుకుంటూ క్రిస్టినా నోయల్ మురిసిపోయింది.‘నా బిడ్డలతో సమానంగా చూసుకుంటాను. ఎలాంటి కష్టం రానివ్వను...’ ఇలా తన చుట్టూ ఉన్న వారితో చెప్పుకుంటూ పోతూనే ఉంది ఆ తల్లి. తనను వెదుక్కుంటూ వచ్చిన తల్లిని చూసిన మొదటి క్షణంలో ఆ పాప కళ్లలో ఎలాంటి భావం లేదు. ఆ తరువాత మాత్రం నవ్వింది. ‘ఇప్పుడు నాకు కూడా ఒక అమ్మ ఉంది’ అని తెగ సంబరపడుతున్నట్లుగా ఉంది ఆ నవ్వు. ఆ నవ్వు చూసి అక్కడున్న వాళ్లందరూ నవ్వారు... ఇలాంటి ఆత్మీయ పరిమళాలు వెదజల్లడం పాలమూరు శిశుగృహలో కొత్త కాదు.అమ్మను మించిన అమ్మలుపిల్లలు దత్తతకు వెళ్లినప్పుడు అందరి కంటే ఎక్కువ సంతోషించేదీ, బాధ పడేదీ శిశుగృహలో పని చేసే ఆయాలు. సంతోషం ఎందుకంటే...‘మా పిల్లలకు అమ్మ దొరికింది’ అనుకోవడం వల్ల. బాధ ఎందుకంటే...‘అయ్యో! నా సొంత బిడ్డలా చూసుకున్న పిల్ల ఇక నాకు కనిపించదా!’ అనుకోవడం వల్ల. ఇక్కడ ఆయాగా పనిచేస్తున్న చెన్నమ్మ తాను చేస్తున్నది ఉద్యోగం మాత్రమే అనుకోవడం లేదు.ఆడ శిశువులే ఎక్కువ‘శిశుగృహ’లో నుంచి ఇప్పటివరకు 28 మంది శిశువులను విదేశీయులు దత్తత తీసుకున్నారు. ఇందులో ఆడశిశువులు ఇరవైరెండు మంది. మగ శిశువులు ఆరుగురు. అమెరికాకు పద్నాలుగు మంది, స్పెయిన్ కు ఐదుగురు, ఇటలీకి ముగ్గురు, మాల్టా, స్వీడన్ కు ఇద్దరు, ఫిన్ లాండ్, కెనడాకు ఒక్కొక్కరు దత్తతకు వెళ్లినట్లు రికార్డులు చెబుతున్నాయి. – కిషోర్ కుమార్ పెరుమాండ్ల, సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్దేవుడు నాకు ఇచ్చిన అవకాశం‘శిశుగృహ’లోని వారు ఎక్కడెక్కడి వారో కాదు... నా పిల్లలే. ‘వారి భవిష్యత్ బాగుండాలనే ఎప్పుడూ కోరుకుంటున్నాను. ఎక్కడ ఉన్నా వారు చల్లగా ఉండాలి. – చెన్నమ్మ, ఆయాఅల్లారుముద్దుగాశిశుగృహకు వచ్చిన చిన్నారులను చూస్తే జాలి కలగని వారు ఉండరు. బుడిబుడి నడకల వయసులోనే వారికెన్ని కష్టాలు అనిపిస్తుంది. వారిని మా సొంత పిల్లల మాదిరిగా చూసుకుంటాం. అల్లారుముద్దుగా పెంచుతాం. వారు వెళితే బాధగా ఉన్నప్పటికీ వారికి ఆసరా ఉండాలి కదా. – వెంకటమ్మ, ఆయావిదేశాల్లో మా పిల్లలు... గర్వంగా ఉందిమేము పెంచి పెద్దచేసిన పిల్లలు విదేశాలకు దత్తత వెళ్లి అక్కడే ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది. మేము కష్టపడి పెంచినందున ఆ కష్టానికి తగిన ఫలితం దొరికింది అని సంతోషపడతాం. ఏదో ఒకరోజు మా దగ్గరికి వచ్చి పలకరిస్తారనే ఆశ ఉంది. – విజయలక్ష్మి, ఆయాఅప్పుడు బాధగా అనిపిస్తుందివివిధ కారణాలతో శిశుగృహకు వచ్చే పిల్లలకు మేమే అమ్మలమవుతాం. కడుపున పుట్టకపోయినా అన్ని రకాల ప్రేమలు అందిస్తాం. దత్తత వెళ్లేవరకు ఆ పిల్లలకు తల్లిదండ్రులం మేమే. దత్తత వెళ్లిన పిల్లలు గుర్తుకు వచ్చినప్పుడు చాలా బాధగా ఉంటుంది. అయితే వారు ఎక్కడున్నా మంచిగా ఉండాలన్నదే మా కోరిక. – మణెమ్మ, ఆయా -
చిట్టి రచయితలు.. అందమైన కథలతో అలరిస్తున్నారు..
పెద్దల కోసం పిల్లలు రచయితలుగా మారి కథలు రాస్తున్నారు. ‘ఆహా’ అనిపించేలా వినసొంపుగా వినిపిస్తున్నారు. పేదింట్లో పుట్టిన చెన్నై శివారులోని కన్నగినగర్ విద్యార్థులు రచయితలుగా, వెంట్రిలాక్విస్ట్లుగా మారి పెద్దలకు కథలు చెబుతున్నారు. వినోదాన్ని పంచుతున్నారు. యూట్యూబ్ నుంచి ఎఫ్ఎం రేడియో వరకు రకరకాల వేదికలపై తమ ప్రతిభను చాటుకుంటున్నారు...‘ఈ ఘనతకు కారణం ఎవరు?’ అనే ప్రశ్నకు జవాబు....చెన్నైకి చెందిన వెంట్రిలాక్విస్ట్ ఎల్ థామస్. ‘క్యారీ విత్ లవ్’ ట్రస్ట్ నిర్వాహకుడైన థామస్ వన్నత్తు పూచ్చిగల్ (సీతాకోక చిలుకలు) పేరుతో పిల్లలలోని సృజనాత్మక ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నాడు. కన్నగిరినగర్లో ఉండే శ్రీ అనే బాలుడు లాస్ట్ బెంచ్ స్టూడెంట్. అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. ఇక చదవడం తన వల్ల కాదు అనుకుంటున్న సమయంలో ‘వన్నత్తు పూచ్చిగల్’ వాట్సాప్ గ్రూప్ తన నిర్ణయాన్ని మార్చేలా చేయడమేకాదు రచయితగా మార్చింది. జంతువులు ప్రధాన పాత్రలుగా ‘బొమ్మలాటం’ అనే నాటకం రాశాడు. స్వీయ ఆలోచన అవసరం గురించి ఈ కథలో చెప్పాడు.ఇదే ప్రాంతానికి చెందిన సంజన స్టోరీ క్రియేటర్‌గా ప్రశంసలు అందుకుంటుంది. పొట్టలం(గంజాయి) అనర్థాలను కళ్లకు కడుతూ రాసిన కథ అందరినీ ఆకట్టుకుంది. జ్యోతిశ్రీ అనే అమ్మాయి రాస్తే... ఎన్నో అక్షర దోషాలు కనిపించేవి. ఇప్పుడు అలా కాదు. చక్కని భాషలో రాస్తుంది. కథలతో మెప్పిస్తోంది. జ్యోతిశ్రీ చిన్న అక్క దివ్యదర్శిని కూడా రచనలు చేస్తోంది. ఆటో డ్రైవర్‌గా తండ్రి పడుతున్న కష్టాలు, గృహిణిగా తల్లి వేదనకు కథా రూపం ఇచ్చింది. ఈ కథలకు జ్యోతిశ్రీ పెద్ద అక్క నర్మద బొమ్మలు వేసింది. వీరు మచ్చుకు కొద్దిమంది మాత్రమే. ఇంకా ఎంతోమంది ఉన్నారు.కథలు రాయడమే కాదు తమ వాక్చాతుర్యంతో ‘వన్నత్తు పూచ్చిగల్’ పేరుతో డిజిటల్ వేదికలపై కూడా సందడి చేస్తున్పారు. తమ అనుభవాలు, స్నేహితుల అనుభవాలు, ఎక్కడెక్కడో విన్న కథలను వినసొంపుగా చెబుతున్నారు. వారి మాటల్లో వినోదమే కాదు విజ్ఞానం, సామాజిక స్పృహ కూడా ఉంటాయి.కళల వెలుగులో..కళ అనేది కేవలం వినోదం కాదని భవిష్యత్ తరాలకు దిక్సూచి అని నిరూపిస్తున్నాడు ఎల్ థామస్. ‘వన్నత్తు పూచ్చిగల్’ ప్రభావంతో చదువులో వెనకబడిన పిల్లల్లో ‘బాగా చదువుకోవాలి’ అనే పట్టుదల పెరిగింది. తమకు ఇష్టమైన కళలో అక్షరాభ్యాసం చేసి ప్రతిభ చాటుకుంటున్నారు. – అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై(చదవండి: మేకప్ వేసుకుంటున్నారా..? ఈ పొరపాట్లు చెయ్యకండి..) -
టీనేజ్ అకౌంట్' కు తాళం
సామాజిక మాధ్యమంలో అకౌంట్ లేదని ఎవరైనా చెబితే వెంటనే.. ‘ఇంకా ఏ కాలంలో ఉన్నారండీ.. నాకైతే రెండు మూడు ఖాతాలున్నాయి. ఒక్కో దాంట్లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు’ అంటూ గొప్పలు చెప్పుకునే వారు కోకొల్లలు. సోషల్ మీడియాను కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త పరిచయాల వరకూ పరిమితమైతేనో, వ్యాపార అవసరాలకు వినియోగించుకుంటేనో పర్లేదు. కానీ.. అదుపు తప్పి అనర్థాలు తెచ్చుకుంటున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగు చూస్తున్నాయి. ఎంతోమంది జీవితాలు కేవలం సోషల్ మీడియా ప్రభావం వల్ల నాశనమవుతున్నాయి.పిల్లలు, యుక్తవయసు వారు (టీనేజర్లు) సోషల్ మీడియాకు బానిసలుగా మారుతుండటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. దీంతో పలు దేశాలు కొన్ని వయసుల వారు సామాజిక మాధ్యమాన్ని వినియోగించడంపై ఆంక్షలు పెడుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్, యూట్యూబ్ వంటి సంస్థలు తమ ఖాతాదారుల వ్యక్తిగత సమాచార భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. – సాక్షి, అమరావతిఖాతా కోసం వయసు ఎక్కువని అబద్ధాలుపిల్లలు, టీనేజర్స్, పెద్దలు అనే తేడా లేకుండా రోజుకి సగటున మూడు గంటల కంటే ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే గడుపుతున్నారని, దీనివల్ల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అనేక పరిశోధనలు తేల్చాయి. సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఆ యూజర్‌కు 13 ఏళ్ల వయసు ఉండాలి. తప్పుడు సమాచారంతో ఈ–మెయిల్ ఐడీలు తయారు చేసుకుని, 8 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు కూడా ఖాతాలు తెరుస్తున్నారు.8 నుంచి 17 సంవత్సరాల వయసు వారిలో 22% మంది సోషల్ మీడియా యాప్‌లలో తమకు 18 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నట్టు అబద్ధం చెబుతున్నారని అమెరికా సంస్థ ‘ఆఫ్కామ్’ అధ్యయనంలో తేలింది. 15 నుంచి 18 ఏళ్ల వయసులో శారీరక, మానసిక మార్పులు జరుగుతాయి. అటువంటి సమయంలో సోషల్ మీడియాకు అలవాటు పడితే వారి ఆలోచనల్లోనూ మార్పులు వస్తాయని, రకరకాల వింత, వికృత ప్రవర్తనలను నేర్చుకుంటారని వైద్యులు చెబుతున్నారు. రానున్న 2025 సంవత్సరంలో ‘ఆన్లైన్ భద్రతలో నిజమైన మార్పు’ రావాలని టెక్ నిపుణులు సోషల్ మీడియా సంస్థలను కోరుతున్నారు.వారి ఖాతాలకు ఆటోమేటిక్ ప్రైవసీ సోషల్ మీడియా వేదికల్ని నిర్వహిస్తున్న సంస్థలు ఇటీవల ఖాతాదారుల భద్రతపై దృష్టి సారించాయి. అనేక సాంకేతికతలను అభివృద్ధి చేశాయి. యువతకు సోషల్ మీడియాను సురక్షితమైనదిగా ఉంచడానికి ఇన్‌స్ర్ట్రాగామ్ ‘టీన్ అకౌంట్’లను తీసుకువచి్చంది. అలాగే రోజూ వేల సంఖ్యలో వయసు తప్పుగా నమోదు చేసిన వారి ఖాతాలను కొన్ని సంస్థలు తొలగిస్తున్నాయి. అలాగే టీనేజర్ల ఖాతాలకు ఆటోమేటిక్‌గా లాక్ (ప్రైవసీ) వేసేస్తున్నాయి.అంటే వారి ఖాతాను వారు అనుమతించిన స్నేహితులు మాత్రమే చూడగలరు. ఇతరులకు వారి వివరాలు కనిపించవు. మెషిన్ లెరి్నంగ్ టెక్నాలజీ ఇందుకు సహకరిస్తోంది. ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్‌ను పటిష్టం చేయాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఆస్ట్రేలియా ఓ అడుగు ముందుకు వేసి, 16 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలను వినియోగించడాన్ని నిషేధించింది.మార్చాల్సింది తల్లిదండ్రులే సోషల్ మీడియాలో సన్నిహితులతో, అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. అది సైబర్ కేటుగాళ్లు దొంగిలించి, వాటిద్వారా బెదిరిస్తూ.. డబ్బులు గుంజుతారు. వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నట్టు నివేదికలు వెల్లడించాయి. అందుకే పదేళ్లు నుంచి 20 ఏళ్లలోపు వయసు పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేలా చేయాలి. ఇంటి పనుల్లోనూ భాగం చేయాలి. తల్లిందండ్రులు పిల్లలతో ముచ్చటిస్తుండాలి. ప్రతి చిన్న ఘటనను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మాన్పించాలి. చదువుపై దృష్టి కేంద్రీకరించేలా అలవాటు చేయాలి. -
చిన్నారులపై రెచ్చిపోయిన మృగాళ్లు
పుట్టపర్తి అర్బన్/డాబాగార్డెన్స్: రాష్ట్రంలోని రెండు వేర్వేరు జిల్లాల్లో చిన్నారులపై మృగాళ్లు రెచ్చిపోయారు. శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి మండలంలోని ఓ టీడీపీ నేత చిన్నారిపై లైంగికదాడికి యత్నించగా, విశాఖపట్నంలోని డాబా గార్డెన్స్ పరిధిలో ఓ దివ్యాంగురాలిపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి చేశాడు. శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి మండలం, బత్తలపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఓ బాలిక ఐదోతరగతి చదువుతోంది. బుధవారం పాఠశాల అనంతరం ఇంటికి వచ్చిన బాలిక మరుగుదొడ్డి లేక బహిర్భూమి కోసం బయటకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న గ్రామానికి చెందిన టీడీపీ నేత సూర్యనారాయణ అనే వ్యక్తి రోడ్డు పక్కన ఉన్న బాత్రూంలోకి బాలికను ఎత్తుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు. ఇష్టానుసారం చిన్నారిని కొరుకుతూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు.భయంతో బాలిక పెద్ద పెట్టున కేకలు వేయగా.. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక వెంటనే ఇంటికి వెళ్లి విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు పరువుపోతుందని సమీప గ్రామం పెడవల్లిలోని ఓ ప్రైవేటు వైద్యుడి వద్దకు బాలికను తీసుకెళ్లి గుట్టుచప్పుడు కాకుండా వైద్యం చేయించినట్లు తెలిసింది.బాధిత కుటుంబానికి ‘టీడీపీ’ బెదిరింపులునిందితుడు సూర్యనారాయణ స్థానిక టీడీపీ నేత. ఆయన సోదరి మాజీ ఎమ్మెల్యే పల్లె రాఘునాథరెడ్డి అనుచరురాలు. దీంతో టీడీపీ నేతలు నిందితుడికి అండగా నిలిచారు. బాధితురాలి కుటుంబాన్ని భయపెట్టారు. అయితే ఈ నోటా... ఆ నోటా... ఈ ఘటన పోలీసుల వరకూ వెళ్లడంతో బుధవారం రాత్రి పొద్దుపోయాక పోలీసులే బాధితురాలి ఇంటికి వచ్చిన విచారణ జరిపారు. ఎవరికీ భయపడాల్సిన పనిలేదని చెప్పడంతో గురువారం బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు సూర్యనారాయణపై పోక్సో కేసు నమోదైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న సూర్యనారాయణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా నిందితుడికి భార్య, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విశాఖలో మానసిక దివ్యాంగురాలిపై లైంగికదాడివిశాఖపట్నం వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని అఫీషియల్ కాలనీ మూడోలేన్ దరి గొల్లవీధి ప్రాంతంలో 12 ఏళ్ల మానసిక దివ్యాంగురాలు తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఇదే వీధిలో వాడమదుల జోగారావు (45) కూడా నివసిస్తున్నాడు. అతనికి వివాహం కాలేదు. బాధితురాలు తరచూ జోగారావు ఇంటికి ఆడుకోవడానికి వెళ్తుంటుంది. ఎప్పటి నుంచో బాలికపై కన్నేసిన జోగారావు రెండు రోజుల కిందట ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం బాలిక తీవ్ర మంటతో బాధపడుతుంటే తల్లిదండ్రులు కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించి వైద్యులు లైంగిక దాడికి గురైనట్టు నిర్ధారించారు. ఈ విషయాన్ని వన్‌టౌన్ పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటి నుంచి ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీశారు. బాధితురాలికి నిందితుడి ఫొటో చూపగా గుర్తించింది. దీంతో విచారణ చేపట్టారు. ఘటన జరిగి రెండు రోజులైనా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. దీనికి సంబంధించి పోలీసులను వివరాలు అడగ్గా ఎలాంటి స్పందన లేదు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. -
'గ్రానీస్ పర్స్ సిండ్రోమ్': ప్రతి పేరెంట్‌కి అవగాహన ఉండాలి!
ఎన్నో రకాల వ్యాధుల గురించి విని ఉన్నాం. కానీ ఇలాంటి సిండ్రోమ్ గురించి మాత్రం విని ఉండుండరు. ప్రతి తల్లిదండ్రులు ఈ సిండ్రోమ్ గురించి తప్పక తెలుసుకోవాలని చెబుతోంది పీడియాట్రిక్ వైద్యురాలు. పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేసే దీనిపై అవగాహన ఉండాలని అన్నారు. లేదంటే పిల్లల ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏంటీ సిండ్రోమ్ అంటే..చిన్నారులకు నడక, మాటలు వచ్చాయంటే.. వారిని ఓ కంటకనిపెడుతూనే ఉండాలి. ఏ క్షణంలో ఏం పనిచేస్తారో చెప్పాలేం. సైలెంట్‌గా ఉన్నారంటే దేన్నో పాడుచేయడం లేదా ప్రమాదం కొని తెచ్చుకునే పనులేవో చేస్తున్నారని అర్థం. ఇలాంటి పిల్లలను కనిపెట్టుకుని ఉండటం, తల్లిదండ్రులకు, పెద్దలకు ఓ సవాలుగా ఉంటుంది. ఇలా కనిపెట్టుకుని ఉండలేక తల్లిదండ్రులు అమ్మమ్మలు లేదా నానమ్మల ఇంటికి పంపించేస్తారు.అక్కడ వాళ్లు అప్పటి వరకు ఇల్లంతా సందడి లేకుండా ఉంటుంది. ఈ చిచ్చర పిడుగుల రాకతో ఎక్కడ లేని సందడి వచ్చేస్తుంది. అదీగాక నానమ్మ/అమ్మమ్మ తాతయ్యలు కూడా తామిద్దరమే అని ఇంట్లో పర్సులు, వాళ్లకు సంబంధించిన మందులు అందుబాటులోనే పెట్టుకుంటారు. వయసు రీత్యా వచ్చే మతిమరపు సమస్యతో ఆ వస్తువులను సమీపంలోనే ఉంచుకుంటారు. అయితే ఈ చిచ్చర పిడుగులు ఈ వస్తువులను తీసి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఇంటిల్లపాది ఇలా అయ్యిందేంటని బోరుమంటారు. ఇలా అమ్మమ్మలు లేదా నానమ్మల పర్సలు లేదా మందులతో వైద్య పరిస్థితిని కొని తెచ్చుకోవడాన్ని గ్రానీస్ పర్స్ సిండ్రోమ్‌గా పిలుస్తారని శిశు వైద్యులు చెబుతున్నారు. కొందరు పర్సులో ఉండే నాణేలను నోటిలో పెట్టుకోవడం, అలాగే పెద్దల మందులు వేసుకోవడం తదితరాలతో ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు. ఒక్కోసారి అది సీరియస్ అయ్యి ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారులెందరో ఉన్నారని చెబుతున్నారు శిశు వైద్యులు. ముఖ్యంగా పెద్దలు వేసుకునే దీర్ఘకాలికి వ్యాధులకు సంబంధించిన మందులు కారణంగా అనారోగ్యం పాలై బాధపడుతున్న చిన్నారులు కూడా చాలామంది ఉన్నారని హెచ్చరిస్తున్నారు. అందువల్ల దయచేసి తాతయ్యలు అమ్మమల ఇంటికి పంపిచేటప్పడూ పెద్దవాళ్ల వస్తువులను తీయకూడదని చెప్పడం తోపాటు పెద్దలు కూడా తమ పర్సులు, మందులు డబ్బాలు వారికి అందుబాటులో ఉండకుండా జాగ్రత్త పడటం మంచిదని శిశు వైద్యురాలు టిక్‌టాక్ వీడియోలో పేర్కొంది. అంతేగాదు యూఎస్‌లో అనేక మంది చిన్నారులు గ్రానీస్ పర్స్ సిండ్రోమ్‌గా పిలిచే ఈ వైద్య పరిస్థితి బారిన పడి అనారోగ్యం లేదా గాయాల పాలైనట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ ఆస్టియోపతిక్ మెడిసిన్‌లో ప్రచురితమయ్యింది.(చదవండి: భవిష్యత్తులో ఆరోగ్యం, దీర్ఘాయువు ఎలా ఉండనుంది?) -
అదిలోనే అలర్ట్ అవ్వండి
సాక్షి, హైదరాబాద్: చిన్నపిల్లల్లో గుండెజబ్బుల ముప్పు పెరుగుతోంది. ఇటీవలి కాలంలో చిన్నపిల్లలతో పాటు యుక్త వయసు వారు కూడా హఠాత్ గుండెపోటుతో మరణిస్తున్నారు. ముఖ్యంగా అప్పటివరకు ఆడుకుంటూ సందడి చేసిన ఐదు, పదేళ్ల లోపు పిల్లలు హఠాత్తుగా కుప్ప కూలిపోతున్నారు. క్షణాల్లోనే మృత్యువాత పడుతున్నారు. గుండెపోటు వల్ల తమ బిడ్డలు మరణించారని తెలుసుకుంటున్న తల్లిదండ్రులు, బంధువులు విస్తుపోతున్నారు. తమకెందుకీ శాపం అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. రాష్ట్రంలో సైతం ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఈ తరహా మరణాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.అయితే అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగానే వారు మరణించినప్పటికీ, పుట్టినప్పటి నుంచే..జన్యుపరమైన కారణాలు, ఇతరత్రా కారణాలతో గుండె జబ్బులకు సంబంధించిన లక్షణాలు వారిలో ఉంటాయని, వాటిని గుర్తించడం ద్వారా, గుర్తించిన తర్వాత నిర్లక్ష్యం చేయకుండా ఉండటం ద్వారా ఈ ప్రాణాంతక ముప్పును తప్పించవచ్చని వైద్య నిపుణులు సూచిçస్తున్నారు. ముందుగానే ఆయా జబ్బులతో ముడిపడిన చిన్న చిన్న లక్షణాలను గుర్తించి సరైన వైద్యం చేయిస్తే ప్రమాదం ఉండదని చెబుతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులలోనే పరీక్షలు, వైద్యం చేయించాల్సిన పనిలేదని, పేద కుటుంబాల వారు నిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ‘పీడియాట్రిక్ ఐసీయూ’, ఇతర రూపాల్లో ఉత్తమ సేవలు పొందవచ్చునని వివరిస్తున్నారు.ఇటీవలే బ్రిటన్‌కు చెందిన నిపుణులైన వైద్యుల బృందం పేద పిల్లలకు ఆపరేషన్లు చేయడంతో పాటు ఇతర రూపాల్లో వైద్య సేవలు అందించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఈ అంశంపై, హృద్రోగ సంబంధిత సమస్యలపై.. నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ హెడ్ డాక్టర్ అమరేష్ రావు మాలెంపాటì, æఉస్మానియా మెడికల్ కాలేజీ కార్డియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హరీ‹Ùలు తమ అభిప్రాయాలు, సూచనలను ‘సాక్షి’తో పంచుకున్నారు.⇒ ఇటీవల ఖమ్మం జిల్లాలో అప్పటివరకు తల్లిదండ్రులతో కలిసి ఆట పాటలతో సందడి చేసిన ప్రహర్షిక అనే నాలుగేళ్ల చిన్నారి గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది.⇒ మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఏడో తరగతి చదువుతున్న నివృతి హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణించింది. ⇒ జగిత్యాల జిల్లాలో సంజీవ్ అనే యువకుడు పెళ్లి బారాత్‌లో నృత్యం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలాడు.గమనించడం ముఖ్యం గుండె జబ్బుకు సంబంధించి లక్షణాలను ముందే గమనించవచ్చు. వారి శరీరరంగు ముఖ్యంగా పెదవు లు, చేతులు నీలం రంగులోకి మారుతుంటే జాగ్రత్తపడాలి. ఏడుస్తూ మారాం చేస్తున్నపుడు ఏదైనా మార్పు కనిపించినా, కొంచెం సేపే ఆటలు ఆడినా ఎక్కువగా ఆయాసపడుతున్నా, పాలు తాగుతున్న సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతు న్నా, చెమటలు పడుతున్నా, పాలు వదిలేయడం వంటివి చేస్తున్నా తేలిగ్గా తీసుకోకూడదు. సాధారణంగా పసిపిల్లలుగా ఉన్నపుడే 3,4 పర్యాయాలు శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు సోకుతాయి.అంతకు మించిన సంఖ్యలో అంటే నెలనెలకు ఇన్ఫెక్షన్లు వస్తున్నాయంటే తల్లిదండ్రులు అలర్ట్ కావాలి. వయసుకు తగ్గట్టుగా బరువు పెరగకపోవడం, ఏడాది వయసు పూర్తయ్యేలోగా తొలి అడుగు వేయకపోవడం లాంటివి బాగా ఆలస్యమైతే ఏదైనా సమస్య ఉండొచ్చునని భావించాలి. ఇలాంటి లక్షణాలు కని్పస్తే వారికి కచ్చితంగా గుండెజబ్బు ఉందని కానీ వస్తుందని కానీ చెప్పలేం. వీటిని కేవలం కొన్ని సూచికలుగానే పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తపడాలి.తగిన పరీక్షలు, వైద్యం చేయించాలి. పిల్లల్లో చిన్నప్పుడే గుండెలో చిన్న రంధ్రం బయటపడినా, వారు పెద్దయ్యేటప్పటికి అది పూడుకుపోతుందని కొందరు తల్లిదండ్రులు భావిస్తుంటారు. అయితే దీనికి సంబంధించిన లక్షణాలు క్రమంగా తగ్గొచ్చుకానీ సమస్య అలాగే ఉండే అవకాశాలున్నాయి. అందువల్ల వైద్యులను సంప్రదించాలి. మొన్నీమధ్యే ఏడేళ్ల పిల్లవాడికి నిమ్స్‌లో కాంప్లికేటెడ్ ‘రాస్ ప్రొసీజర్’తో విజయవంతంగా సర్జరీ చేశాం. – డాక్టర్ అమరేష్ రావు మామెంపాటి, కార్డియో థొరాసిక్ సర్జరీ హెడ్ , నిమ్స్, హైదరాబాద్గర్భస్థ శిశువులో సమస్యను కూడా గుర్తించవచ్చు హఠాత్ గుండెపోటును చాలా మటుకు నివారించే అవకాశాలున్నాయి. గుండెకు చిల్లులున్నా గుండెపోటుకు గురికాకుండా జాగ్రత్త పడవచ్చు. శస్త్రచికిత్సలతో వాటిని ఆపొచ్చు. చిన్నపిల్లల్లో రక్తనాళాలు ఉండాల్సిన స్థితిలో సవ్యంగా లేకుండా తేడాగా ఉంటే గుండెపోటు వచ్చే అవకాశాలుంటాయి. ఏదైనా అంశంపై వారు భావోద్వేగానికి గురైనా, ఎగ్జైట్మెంట్ పెరిగినా వారి గుండె కదలికల్లో మార్పులు సంభవిస్తాయి. ఎక్కువగా ఆయాసపడుతున్నా, తరచుగా మూర్ఛ (ఫిట్స్) పోవడం జరుగుతున్నా గుండె సమస్యలున్నట్టుగా అనుమానించాలి.మైకాండ్రియా సెల్స్‌లో పొటాíÙయం, కాల్షియం, సోడియం సమతూకం దెబ్బతింటే రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చి కుప్పకూలే అవకాశాలుంటాయి. పుట్టినప్పటి నుంచే గుండె పనితీరుకు సంబంధించి ఏవైనా లోపాలుంటే ప్రాథమికంగా ఈసీజీ, 2 డీ ఎకో పరీక్షల ద్వారా కనిపెట్టవచ్చు. ప్రస్తుతం వైద్య చికిత్సలో అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి వచి్చనందున గుండె సమస్యలున్న చిన్నారులకు తగిన చికిత్స అందించేందుకు అవకాశం ఉంది. గర్భస్త శిశువుగా ఉన్నపుడు కూడా గుండె సంబంధిత సమస్యలను గుర్తించి సరిచేయవచ్చు. బిడ్డ పుట్టాక ఫాలో అప్ చేయడం ద్వారా కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. – డాక్టర్ హరీష్ తంగెళ్లపల్లి, డీఎం కార్డియాలజీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్, హైదరాబాద్ -
పిల్లలకు వె'డర్'!
సాక్షి, అమరావతి: వాతావరణంలో తీవ్రంగా పెరుగుతున్న గాలి కాలుష్యంతోపాటు ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు పిల్లల జనాభాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్(యునిసెఫ్) వెల్లడించింది. మన దేశంలో 2050 నాటికి పిల్లల సంఖ్య 10.60 కోట్ల మేర తగ్గుతుందని హెచ్చరించింది. వాతావరణంలో మార్పుల వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలతోపాటు తక్కువ ఆదాయ వర్గాల జీవనోపాధులపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపింది. అదేవిధంగా వరదలు వంటి ప్రకృతి విపత్తుల ముప్పు కూడా పెరుగుతుందని పేర్కొంది. వీటివల్ల పిల్లల సంఖ్య తగ్గుతుందని, 2050 నాటికి దేశ జనాభాలో సుమారు 45.6 కోట్లు ఉండాల్సిన బాలలు... కేవలం 35 కోట్లు మాత్రమే ఉంటారని వివరించింది. అయినా 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉండే మొత్తం పిల్లల జనాభాలో భారతదేశ వాటా 15శాతం ఉంటుందని అంచనా వేసింది. యునిసెఫ్ ఫ్లాగ్షిప్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ చిల్డ్రన్–2024 నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది పిల్లలు ఉంటారని, వారిలో మూడో వంతు భారత్, చైనా, నైజీరియా, పాకిస్తాన్ దేశాల్లోనే ఉంటారని ప్రకటించింది. కొన్ని దేశాల్లో ప్రతి పది మందిలో ఒక్కరు కూడా పిల్లలు ఉండని ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2050–59 మధ్య పర్యావరణ సంక్షోభాలు మరింత ఎక్కువగా తలెత్తే అవకాశం ఉందని, ఇవి పిల్లల జనాభాపై అత్యంత తీవ్రంగా ప్రభావం చూపుతాయని యునిసెఫ్ ఆందోళన వ్యక్తంచేసింది.యునిసెఫ్ నివేదికలోని ముఖ్యాంశాలు..» ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఆదాయం కలిగిన 28 దేశాల్లో కుటుంబ ఆదాయాల పరంగా పిల్లల జనాభాలో మార్పులను అంచనా వేశారు. 2000 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం పిల్లల జనాభాలో 11 శాతం మంది తక్కువ ఆదాయం కలిగిన 28 దేశాల్లోనే ఉండగా... 2024 నాటికి 23 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఉన్నత, మధ్యస్థ ఆదాయాలు కలిగిన దేశాల్లో పిల్లల జనాభా తగ్గింది.» ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల్లో 2000వ సంవత్సరంలో 24 కోట్ల మంది పిల్లలు ఉండగా, ఆ సంఖ్య 2050 నాటికి 54.40 కోట్లకు పెరుగుతుందని అంచనా. దిగువ మధ్య తరగతి ఆదాయ కుటుంబాల్లో 100.09 కోట్ల మంది ఉండగా, 2050 నాటికి స్పల్పంగా పెరిగి 118.70 కోట్లకు చేరుతుంది. » ఉన్నత, మధ్య ఆదాయ కుటుంబాల్లో 2000లో 65 కోట్ల మంది పిల్లల జనాభా ఉండగా, 2050 నాటికి ఆ సంఖ్య బాగా తగ్గి 38.70 కోట్లకు పరిమితమవుతుంది. ధనిక కుటుంబాల్లో 2000 నాటికి 24.40 కోట్ల మంది పిల్లల జనాభా ఉండగా, ఆ సంఖ్య 2050 నాటికి 21.60 కోట్లకు పరిమితమవుతుంది. » అదేవిధంగా పర్యావరణ సమస్యలను అధిగమించేందుకు 57 అంశాల అమలుపై 163 దేశాల్లో యునిసెఫ్ అధ్యయనం చేసి ప్రకటించిన చిల్డ్రన్ క్లెయిమెట్ రిస్క్ ఇండెక్స్‌లో భారత్ 26వ స్థానంలో ఉంది. -
నాడు బెదిరింపులు, నిషేధానికి గురైన అమ్మాయి..నేడు ప్రపంచమే..!
‘నువ్వు మాట్లాడకూడదు’ అని బెదిరింపులు ఎదుర్కొన్న అమ్మాయి గురించి ఇప్పుడు ప్రపంచం గొప్పగా మాట్లాడుకుంటోంది. ‘నువ్వు ఇంటికే పరిమితం కావాలి’ అనే అప్రకటిత నిషేధానికి గురైన అమ్మాయి గురించి..‘నీలాంటి అమ్మాయి ప్రతి ఇంట్లో ఉండాలి’ అంటున్నారు. అఫ్గానిస్థాన్‌కు చెందిన పదిహేడేళ్ల నీలా ఇబ్రహీమి ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్ (కిడ్స్ రైట్స్ ప్రైజ్) గెలుచుకుంది. మహిళలు, బాలికల హక్కుల కోసం బలంగా తన గొంతు వినిపించినందుకు నీలా ‘కిడ్స్ రైట్స్ ప్రైజ్’కు ఎంపికైంది....‘కిడ్స్ రైట్స్’ ఫౌండేషన్ అందించే అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి మానవహక్కులు, సామాజిక న్యాయానికి సంబంధించి గణనీయమైన కృషిచేసిన వారికి ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా 47 దేశాల నుంచి 165 మంది నామినీల నుంచి గట్టి పోటీని అధిగమించి ఈ బహుమతికి ఎంపికైంది నీలా ఇబ్రహీమి.‘నీలా ధైర్యసాహసాలకు ముగ్ధులం అయ్యాం’ అన్నారు ‘కిడ్స్ రైట్స్ ఫౌండేషన్’ ఫౌండర్ మార్క్ డల్లార్ట్.లింగ సమానత్వం, అఫ్గాన్ మహిళల హక్కుల పట్ల నీలా పాట, మాట ఆమె అంకితభావం, ప్రతిఘటనకు ప్రతీకలుగా మారాయి. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఊహించినట్లుగానే మహిళల హక్కులను కాలరాయడం మొదలుపెట్టారు. ఆడపిల్లలు ప్రాథమిక పాఠశాలకు మించి చదువుకోకూడదు. మహిళలు మార్కులు, జిమ్, బ్యూటీ సెలూన్లకు వెళ్లడాన్ని నిషేధించారు. మహిళలు ఇల్లు దాటి బయటికి రావాలంటే పక్కన ఒక పురుషుడు తప్పనిసరిగా ఉండాల్సిందే. దీనికితోడు కొత్త నైతిక చట్టం మహిళల బహిరంగ ప్రసంగాలపై నిషేధం విధించింది. ఈ పరిస్థితినిఐక్యరాజ్యసమితి ‘లింగ వివక్ష’గా అభివర్ణించింది. తాలిబన్ ప్రభుత్వం మాత్రం ఇది నిరాధారమని, దుష్ప్రచారం అని కొట్టి పారేసింది. మహిళల హక్కులపై తాలిబన్ల ఉక్కుపాదం గురించి నీలా పాడిన శక్తిమంతమైన నిరసన పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పాట అఫ్గాన్ సమాజంపై చూపిన ప్రభావం ఇంతా అంతా కాదు. నీలా ‘ఐయామ్ మైసాంగ్’ మూవ్మెంట్ మహిళల హక్కులపై గొంతు విప్పడానికి ఎంతోమందికి స్ఫూర్తినీ, ధైర్యాన్ని ఇచ్చింది.‘నేను చేసిన పని రిస్క్‌తో కూడుకున్నది. అది అత్యంత ప్రమాదకరమైనదని కూడా. అయితే ఆ సమయంలో నాకు అదేమీ తెలియదు. ఎందుకంటే అప్పుడు నా వయసు పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది నీలా. ‘అంతర్జాతీయ బాలల శాంతి బహుమతిని గెలుచుకోవడం అంటే అఫ్గాన్ మహిళలు, బాలికల గొంతు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించడం. తాలిబన్ల ΄పాలనలో అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళల హక్కుల కోసం పోరాడాను. పోరాడుతూనే ఉంటాను’ అంటూ పురస్కార ప్రదానోత్సవంలో మాట్లాడింది నీలా.నీలా పట్ల అభిమానం ఇప్పుడు అఫ్గాన్ సరిహద్దులు దాటింది. అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు అభిమానులు ఉన్నారు. అఫ్గాన్‌ను విడిచిన నీలా ఇబ్రహీమి ‘30 బర్డ్స్ ఫౌండేషన్’ సహాయంతో కుటుంబంతో కలిసి కెనడాలో నివసిస్తుంది. ‘నేను నా కొత్త ఇంట్లో సురక్షితంగా ఉన్నాను. అయితే అఫ్గానిస్తాన్‌లో ఉన్న అమ్మాయిల గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. ప్రపంచంలో ఏ ్ర΄ాంతంలో మహిళల హక్కులు దెబ్బతిన్నా అది యావత్ ప్రపంచంపై ఏదో ఒకరకంగా ప్రభావం చూపుతుంది’ అంటుంది నీలా. ‘హర్ స్టోరీ’ కో–ఫౌండర్‌గా అఫ్గానిస్థాన్‌లోని అమ్మాయిలు తమ గొంతు ధైర్యంగా వినిపించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తోంది.అఫ్గాన్‌లో మహిళా విద్య, హక్కులకు సంబంధించి జెనీవా సమ్మిట్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ డెమోక్రసీ. యూకే హౌజ్ ఆఫ్ లార్డ్స్, కెనడియన్ ఉమెన్ ఫర్ ఉమెన్ ఆఫ్ అఫ్గానిస్థాన్ మాంట్రియల్ సమ్మిట్, టెడ్ వాంకూవర్లాంటి వివిధ కార్యక్రమాలలో తన గళాన్ని వినిపించిన నీలా ఇబ్రహీమీ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలాతో కలిసి పనిచేస్తోంది. -
పిల్లలు చెప్పిన బుర్రకథ..
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ‘ఇతిహాసమ్: తెలంగాణ వారసత్వ సంపద ప్రతిధ్వని’ థీమ్‌తో సుచిత్ర అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. సుచిత్ర అకాడమీ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా ‘సుచిత్ర ఇన్నోవేషన్ సెంటర్’ను మంగళవారం ప్రారంభించారు.ఇందులో భాగంగా బ్రహ్మం గారి బుర్ర కథ ప్రదర్శన, తెలంగాణ సంస్కృతిలోని ప్రత్యేక ప్రజా తిరుగుబాట్లను ప్రతిబింబించే ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు రష్యాలో భారత దేశ మాజీ అంబాసిడర్ అయిన బలా వెంకటేశ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. అకాడమీ వ్యవస్థాపక చైర్మన్ కృష్ణం రాజు మాట్లాడుతూ.. విద్యార్థులు తెలంగాణలోని సుసంపన్న సంపదను ప్రదర్శనల ద్వారా ప్రాణం పోశారని అన్నారు. (చదవండి: తల్లీ.. నీకు సెల్యూట్!) -
ఎంత మంది పిల్లలున్నా పోటీ చేయొచ్చు
సాక్షి, అమరావతి: ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సవరణ బిల్లుకు రాష్ట్ర శాసన సభ సోమవారం ఆమోదం తెలిపింది. దీంతోపాటు మరో నాలుగు బిల్లులను కూడా ఆమోదించింది. ఒక బిల్లు వాయిదా పడింది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పించే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాల సవరణ బిల్లు 2024 బిల్లును పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లును మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. గతంలో జరిగిన చట్ట సవరణల ప్రకారం ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని చెప్పారు. అయితే, గత మూడు దశాబ్దాలలో జనాభా నియంత్రణ చర్యలతో సంతానోత్పత్తి సామర్ధ్యం రేటు బాగా తగ్గిపోయిందన్నారు. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జనాభాను పెంపొందించాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతోనే చట్టంలో సవరణలు చేసినట్లు వివరించారు. గతంలో ఆ చట్టాల్లో చేసిన సవరణలకు సంబంధించిన సెక్షన్లను తొలగిస్తూ చేసిన చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.జనాభా పెరగదుఈ బిల్లుపై అధికార కూటమి శాసన సభ్యులే పలువురు పెదవి విరిచారు. చట్ట సవరణ చేసినప్పటికీ, ప్రస్తుత కుటుంబ పరిస్థితుల దృష్ట్యా సంతానోత్పత్తి పెరగకపోవచ్చునని, పైగా సంక్షేమ పథకాలు ఆ కుటుంబాలకు అందవని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ పరంగా ఆలోచిస్తే ఈ సవరణ సంతానోత్పత్తి రేటు వృద్ధికి దోహద పడదని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అభిప్రాయపడ్డారు. జననీ సురక్ష పథకం ఒక్కరికే వర్తిస్తుందని, ఇద్దరు పుడితే ఆ పథకం వర్తించదని చెప్పారు. ఇటువంటి నిబంధనలు ఉన్నన్ని రోజులూ సంతానోత్పత్తి రేటు పెరగదని స్పష్టం చేశారు. కుటుంబాలను ఆదుకునే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలైన రోజే సంతానోత్పత్తి రేటు పెరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో యువత పెరగడానికి ఈ సవరణ తోడ్పడుతుందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి అన్నారు.మరి కొన్ని బిల్లులకూ ఆమోదంవైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రవేశపెట్టిన మూడు బిల్లులను శాసన సభ ఆమోదించింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సిఫార్సు మేరకు మూగ, చెవిటి, కుష్టు పదాలను తొలగిస్తూ ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ బిల్లు–2024ను సభ ఆమోదించింది. ఆయా సమస్యలున్న వారికి విశ్వవిద్యాలయం ఈసీ సభ్యులుగా అవకాశం కల్పించేలా చట్ట సవరణ చేసినట్లు మంత్రి చెప్పారు. అదే విధంగా ఈ మూడు పదాలను తొలగిస్తూ ఏపీ ఆయుష్, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్, ఏపీ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లులనూ సభ ఆమోదించింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన ఏపీ కో–ఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు –2024కు కూడా సభ ఆమోదం తెలిపింది. రెవెన్యూ శాఖ మంత్రి అభ్యర్థన మేరకు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ బిల్–2024ను మరో రోజుకు వాయిదా వేసినట్టు స్పీకర్ ప్రకటించారు. -
పాఠాలు పక్కన పెట్టి పనిలో పిల్లలు
-
ప్రభుత్వ పాఠశాలలో పదేళ్ల చిన్నారులతో పనులు
-
ఇంట్లోనే క్రిస్పీగా, టేస్టీగా ఫ్రెంచ్ ఫ్రైస్ : అదిరిపోయే కిచెన్ టిప్స్!
ఎంతో కష్టపడి, ఎంతో రుచిగా ఇంట్లోనే వండిపెట్టినా, రెస్టారెంట్లో చేసినట్టుగా రాలేదు, క్రంచీగా లేవు, క్రిస్పీగా రాలేదు అంటూ రక రకాలవంకలు పెడుతూ ఉంటారు పిల్లలు. దీనికి అవును...అంటూ వారికి వంత పాడతారు శ్రీవారు.. కదా.. అందుకే అదిరిపోయే కిచెన్ టిప్స్ మీకోసం..!పొటాటోతో ఇంట్లో ఫ్రెంచ్ ఫ్రై చేసినప్పుడు రెస్టారెంట్లో ఉన్నట్లు కరకరలాడవు. రెస్టారెంట్ రుచి రావాలంటే పొటాటో స్టిక్స్‌ని నూనెలో ఒక మోస్తరుగా వేయించి తీయాలి. వేడి తగ్గిన తరవాత వాటిని పాలిథిన్ కవర్లో పెట్టి రబ్బర్ బ్యాండ్‌తో బిగుతుగా కట్టి ఫ్రీజర్‌లో పెట్టాలి. నాలుగైదు గంటల తర్వాత తీసి మరోసారి వేయించి వేడిగా ఉండగానే వడ్డించాలి. కొత్త బియ్యాన్ని వండినప్పుడు అన్నం ముద్దగా అవుతుంది. అన్నం ఉడికేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం పిండితే ముద్ద కాకుండా అన్నం మెతుకులు విడివిడిగా ఉంటాయి. తినడానికి బావుంటుంది.ఈ సీజన్లో లభించే చిలగడ దుంపలను ఉడికించి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, కాస్తంత ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి చల్లి ఇస్తే ఇష్టంగా తింటారు పిల్లలు.పప్పుతో పాటు, ఇంట్లోనే చేసిన సగ్గుబియ్యం వడియాలు, మినప వడియాలు నంజుకు పెడితే మారాం చేయకుండా పప్పు నెయ్యి అన్నంతో పాటు తినేస్తారు. ఆరోగ్యానికి ఆరోగ్యంకూడా పరాఠాలకు పిండి కలిపేటప్పుడు అందులో స్వీట్ కార్న్ (చిదిమి కలపాలి), ఉడికించిన పాలకూర, తురిమిన క్యాబేజ్, తురిమిన ముల్లంగి, మెంతి ఆకు కలిపితే పిల్లలు ఇష్టపడతారు. ఇది హెల్దీ బ్రేక్‌ఫాస్ట్. చపాతీలు మృదువుగా రావాలంటే పిండి కలిపిన తర్వాత తడి బట్టను కప్పి అరగంట సేపు నాననిస్తే మంచిది.కూరల్లో ఉప్పు ఎక్కువైతే వెంటనే బంగాళాదుంపను తొక్క తీసి, చిన్న ముక్కలు చేసి కూరలో కలపాలి. అదనంగా ఉన్న ఉప్పు బంగాళదుంప పీల్చుకుంటుంది. ఇదీ చదవండి: దోస ప్రింటింగ్ మెషీన్ : వైరల్ వీడియో -
రిలయన్స్ ఫౌండేషన్ : పిల్లలకోసం మళ్లీ ‘కహానీ కాలా ఖుషీ’
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రిలయన్స్ ఫౌండేషన్ తన వార్షిక పథకాన్ని తిరిగి లాంచ్ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న బాలలకుసాయం అందించేలా ‘ కహానీ కాలా ఖుషీ’ తిరిగిలాంచ్ చేసింది. ఇందులో భాగంగా రాబోయే కొద్ది వారాలలో భారతదేశం అంతటా కథలు చెప్పడం, ఇతర కార్యకలాపాల ద్వారా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా దాదాపు 22వేలమంది పిల్లలకు లబ్ది చేకూరనుంది.ఈ కార్యక్రమంలో రిలయన్స్ వ్యాపారాల్లోని ఉద్యోగి వాలంటీర్లు, భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు, సంఘాలు వెనుకబడిన నేపథ్యాల పిల్లలతో నిమగ్నమై ఉంటారు. గురువారం ముంబైలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 400 మంది రిలయన్స్ ఉద్యోగులు స్వచ్ఛందంగా 3,800 మంది పిల్లలను కథలు, కళలు, అవుట్డోర్ , ఇండోర్ గేమ్‌లు నిర్వహించి పిల్లలతో గడిపారు. రాబోయే రోజుల్లో, దేశవ్యాప్తంగా వందలాది మంది వాలంటీర్లు పిల్లలతో పాలుపంచుకుంటారు. మహారాష్ట్ర, తెలంగాణలో, ప్రీ-స్కూల్ పిల్లల కోసం 63 అంగన్వాడీలలో ఈ కార్యక్రమం ప్రారంభమైందని వెల్లడించిందినవంబర్ 14-16 మధ్య 1,100 కంటే ఎక్కువ అంగన్వాడీలలో 18 వేల మంది పిల్లలను చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. కహానీ కలా ఖుషి కార్యక్రమం పిల్లలలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు , విశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. గత సంవత్సరం 25 నగరాల్లో 17,000 మంది పిల్లలకు చేరువైందని రిలయన్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. -
మాక్ అసెంబ్లీలో చిన్నారులతో రేవంత్
-
చిల్డ్రన్స్ డే స్పెషల్- లిటిల్ స్టార్స్ సందడి చేసిన చైల్డ్ ఆర్టిస్టులు
-
ఫ్యామిలీ ఫార్మింగ్ : విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణ
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను హైస్కూలు నుంచి యూనవర్సిటీ స్థాయి వరకు విద్యార్థులకు అలవాటు చేయటం ఎంతో అవసరమనే విషయంతో ఇప్పుడు ఏకీభవించని వారు బహుశా ఎవరూ ఉండరు. రసాయనిక అవవేషాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తి ద్వారానే మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. అయితే, ఈ బృహత్ కార్యక్రమాన్ని వ్యాప్తిలోకి తేవటానికి విద్యాసంస్థలతో కలసి పనిచేస్తూ స్ఫూర్తిని నింపుతూ విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ పనులను అలవాటు చేయటంలో ప్రత్యక్ష కృషి చేస్తున్న వారిని వేళ్లపై లెక్కించవచ్చు. ఈ కోవలో మొదటి పేరు డాక్టర్ గంగాధరం. దాదాపు రెండు దశాబ్దాలుగా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ విజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక శిక్షణ ద్వారా విశేష కృషి చేస్తున్న ప్రకృతి సేద్య ప్రేమికుడు డాక్టర్ వర్డ్ గంగాధర్. ఇప్పటికే వేలాది మంది రైతులకు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఘనత వర్డ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తిరుపతికి చెందిన డాక్టర్ ఎం గంగాధర్‌కే దక్కుతుంది. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే పద్ధతులను ఆయన గత కొన్ని నెలలుగా నేర్పిస్తున్నారు. 20 అడుగుల వెడల్పు “ 20 అడుగుల ΄÷డవు విస్తీర్ణంలో చిన్న చిన్న ఎత్తుమడులు ఏర్పాటు చేసి విద్యార్థుల చేత 15 రకాల ఆకుకూరలు, 4 రకాల కూరగాయల సాగు చేయిస్తున్నారు. ఈ నమూనాకు కుటుంబ వ్యవసాయం (ఫ్యామిలీ ఫార్మింగ్) అని పేరు పెట్టారు. డాక్టర్ గంగాధరం యూనవర్సిటీలో కొందరికి ముందుగానే శిక్షణ ఇచ్చి ‘గ్రీన్ టీమ్’లను ఏర్పాటు చేశారు. డా. గంగాధరం మార్గదర్శకత్వంలో ఈ గ్రీన్ టీమ్‌ల ఈ కుటుంబ వ్యవసాయాన్ని పర్యవేక్షిస్తున్నారు. గ్రీన్ టీం సభ్యులు ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులను ఇంటింటల కుటుంబ వ్యవసాయ నమూనా మడుల దగ్గరకు ఆహ్వానించి వారికి అవగాహన కల్పిస్తున్నారు.ప్రకృతి సేద్య వ్యాప్తికి దోహదంఈ ఫ్యామిలీ ఫార్మింగ్ నమూనా ముఖ్య ఉద్దేశం గురించి వివరిస్తూ డా. గంగాధరం (98490 59573) ఇలా అన్నారు.. ‘ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆరోగ్యకరమైన 15 రకాల కూరగాయలను ఏ విధంగా సాగు చేయవచ్చో నేర్పిస్తున్నాం. ఈ నమూనా ద్వారా విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ పూర్తిస్థాయిలో నమూనాపై అవగాహన తెచ్చుకోగలుగుతారు. వివిధ ప్రాంతాలలో వారి సొంత పొలాల్లో కూడా కొంచెం విస్తీర్ణంలో అయినా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అమలు చేయటం ప్రాంరంభిస్తారు. ఆ విధంగా గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం ప్రాంచుర్యానికి ఎంతో దోహదపడుతుంది. అట్లే తిరుపతి పట్టణంలో ప్రజలందరికీ ఉపయోగపడుతుందని ఆశాభావం..’ అన్నారు. (గార్బేజ్ ఎంజైమ్ : పండ్లు, కూరగాయ మొక్కలకు ఈ ద్రవం ఇచ్చారంటే!)తిరుపతి పట్టణంలోని ప్రజలు కూడా సాయంత్రం 4–5 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనవచ్చని, తమ ఇంటి వద్ద తక్కువ స్థలంలో వివిధ రకాల కూరగాయలు సాగుచేసే పద్ధతులను తెలుసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో యువత విశ్వవిద్యాలయం నుంచి హైస్కూల్ వరకు ఈ నమూనా వ్యాప్తి చెంది రాష్ట్రమంతా యువత ప్రకృతి వ్యవసాయంపై పట్టు సాధించగలరని భావిస్తున్నానన్నారు. ఈ కృషి ఫలించాలని ఆశిద్దాం. డా. గంగాధరం -
శతకాలు : చూడచూడ రుచుల జాడ వేరు
పద్యం తెలుగువారి ఆస్తి. మరో భాషలో లేని ఈ సాహితీశిల్పాన్ని తెలుగువారు తరాలుగా కాపాడుకుంటూ వచ్చారు. పండితుల కోసం, శిష్ట పాఠకుల కోసం ఛందోబద్ధ పద్యాలు ఉంటే పిల్లలూ పామరులూ చెప్పుకోవడానికి శతకాలు ఉపయోగపడ్డాయి. సులభంగా, సరళంగా ఉండే శతక పద్యాలు కాలక్రమంలో ఇంటింటి పద్యాలుగా మారి జీవన మార్గదర్శకాలు అయ్యాయి. వేమన పద్యం రాని తెలుగువాడు లేడన్నది నిన్నటి వరకూ నిత్యసత్యం.‘శతకం’ అంటే వంద అనే అర్థం. అలాగని శతకంలో కచ్చితంగా వంద పద్యాలే ఉండాలని లేదు. అంతకు మించి కూడా రాశారు. పద్యం చివర్లో ‘మకుటం’ ఉండడమే శతకాల విశిష్టత. ‘మకుటం’ అంటే కిరీటం. శతక పద్యంలో దీని స్థానం శిఖరాయమానం. పూర్వ మహాకవులే కాదు, ఇప్పటికీ ఎందరెందరో శతకాలు రాస్తూనే వున్నారు. తమ జీవితంలోని అనుభవాల నుంచి, అనుభూతుల నుంచి, ఇష్టదైవాల గురించి, ప్రియమైన వ్యక్తుల గురించి, భావోద్వేగాల నుంచి వందల కొద్దీ శతకాలు పుట్టిస్తున్నారు.శతక పద్యాలకు నన్నయ ఆద్యుడంటారు. ‘బహువన పాదపాబ్ది... అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్’ అనే పద్యాలు నన్నయగారి భారతంలోని ‘ఉదంకోపాఖ్యానం’లో ఉంటాయి. ‘అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్’ అనే మకుటంతో నాలుగు పద్యాలు ముగుస్తాయి. ఈ పద్యాలన్నీ వరుసగా ఉంటాయి. అలా పద్యంలో ‘మకుటం’ పురుడు పోసుకుందని చెబుతారు. శతక పద్యాలకు ఎవరు ఆద్యులు అనేది పక్కనపెడితే నన్నయ నుంచి నేటి వరకూ వందల సంవత్సరాల నుంచి శతకాలు బతుకుతూనే ఉన్నాయి, బతికిస్తూనే ఉన్నాయి.తెలుగు నేలపై ఎన్నో శతక పద్యాలు వ్యాప్తిలో ఉన్నప్పటికీ వేమన పద్యాలే మకుటాయమానంగా నిలుస్తున్నాయి. బద్దెన కూడా అంతే ప్రసిద్ధుడు. ఆయన రాసిన సుమతీ శతకం తెలుగువారికి సుపరిచయం. అలాగే భర్తృహరి సుభాషితాలు సుప్రసిద్ధం. ‘సుభాషితాలు’ అంటే మంచి వాక్కులు అని అర్థం. ఇవన్నీ సంస్కృతంలో ఉంటాయి. వీటిని తెనిగించి మనకు అందించిన మహనీయులు ముగ్గురు. వారు ఏనుగు లక్ష్మణకవి, ఏలకూచి బాల సరస్వతి, పుష్పగిరి తిమ్మన. ఇక భక్త రామదాసు రాసిన దాశరథీ శతకం, మారన కవి రాసిన భాస్కర శతకం, ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం, నృసింహకవి కలం నుంచి జాలువారిన శ్రీకృష్ణ శతకం, శేషప్పకవి రాసిన నరసింహ శతకం, కుమార శతకం, కాసుల పురుషోత్తమకవి విరచితమైన ఆంధ్ర నాయక శతకం... ఇలా ఎన్నెన్నో శతకాలను, శతకకారులను చెప్పుకోవచ్చు. అన్నీ మణిమాణిక్యాలే, జీవితాలను చక్కదిద్దే రసగుళికలే.శతకాలు ఎందుకు నిలబడ్డాయి? అలతి అలతి పదాలతో లోకహితమైన సాహిత్య సృష్టి వాటిలో జరిగింది కనుక. సమాజంలోని దురాచారాలను, చాదస్తాలను, మూఢవిశ్వాసాలను మూకుమ్మడిగా ఖండిస్తూ జనానికి వాటిలో జ్ఞానబోధ జరిగింది కనుక. మానవ నైజంలోని విభిన్న రూపాల ఆవిష్కరణ జరిగి తద్వారా మేలుకొల్పు కలిగింది కనుక. ఫలితంగా సద్భక్తి భావనలు కలిగి, తల్లిదండ్రులు, గురువులు, పెద్దల యెడ మనుషులకు గౌరవ మర్యాదలు పెరిగాయి కనుక. నీతులు, లోకరీతులు తెలిశాయి కనుక. అందువల్లే జనులు వాటిని చేరదీశారు. తోడు చేసుకున్నారు. ఇలాంటి పద్యాలు మానసికంగా, శారీరకంగా వికసించే బాల్యంలో పిల్లలకు ఎంతో అవసరమని పెద్దలు భావించారు కాబట్టి శతకాలు నాటి కాలంలో బట్టీ వేయించేవారు. ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు చూడ చూడ రుచుల జాడ వేరుపురుషులందు పుణ్య వేరయావిశ్వదాభిరామ వినుర వేమ – (వేమన )తాత్పర్యం : చూడడానికి ఉప్పు, కర్పూరం ఒకేలా కనిపిస్తాయి. కానీ వాటి రుచులు వేరు. అట్లే, మనుషులంతా ఒకేరకంగా వున్నా, అందులో పుణ్యపురుషులు అంటే గొప్పవారు వేరు.అడిగిన జీతం బియ్యనిమిడిమేలపు దొరను కొల్చి మిడుగుట కంటెన్వడి గల యెద్దుల కట్టుక మడి దున్నుక బ్రతకవచ్చు మహిలో సుమతీ– (బద్దెన)తాత్పర్యం: మంచి జీతం ఇవ్వని యజమానిని నమ్ముకొని కష్టాలు పడేకంటే మంచి ఎద్దులను నమ్ముకొని పొలం దున్నుకుంటూ, సొంతంగా వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బతుకవచ్చు.ఇలా ఎన్నో పద్యాలను తలచుకోవచ్చు. వ్యక్తిత్వ వికాసం జరగాలంటే శతక పద్యాలు చదువుకోవాలి. శతకాలను బతికించుకుంటే అవి మనల్ని బతికిస్తాయి.– మా శర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
వీపు ‘మోత’ మోగుతోంది
దాదర్: విద్యార్ధులు మోస్తున్న బరువైన స్కూలు బ్యాగుల వల్ల వారికి భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదముందని ఆర్థోపెడిక్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చాలా సందర్భాల్లో విద్యార్ధుల కంటే వారి సంచీ బరువే ఎక్కువగా ఉంటోందని ఇది వారి ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రముఖ ఆర్థోపెడిక్, స్పైన్ సర్జన్ డాక్టర్ సమీర్ రూపరేల్ పేర్కొన్నారు. పది మంది విద్యార్ధుల్లో ఎనిమిది మంది భుజం, వెన్ను, నడుము నొప్పులతో బాధపడుతున్నారని, ప్రతీరోజు అన్ని సబ్జెక్టుల అచ్చు, నోటు పుస్తకాలు స్కూలుకు తీసుకెళ్లడం, తిరిగి ఇంటికి తీసుకురావడమే ఈ సమస్యలకు ప్రధాన కారణమని ఓ అధ్యయనంలో తేలిందని, కాబట్టి సాధ్యమైనంత వరకు సంచీ బరువు తగ్గించే ప్రయత్నం చేయాలని పాఠశాలల యాజమాన్యాలకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు... విద్యార్ధుల బ్యాగుల బరువు తగ్గించే విషయంపై అనేక సంవత్సరాల నుంచి చర్చలు జరుగుతున్నాయి. స్కూలు సంచీల బరువు మోయలేక విద్యార్ధుల వెన్ను వెనక్కు వాలిపోతోంది. వెన్ను నొప్పితో సతమతమవుతూ చికిత్స చేయాల్సిన పరిస్థితులు కూడా చోటుచేసుకుంటుండటంతో ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకుంది. బ్యాగు బరువు తగ్గించే విషయంపై అన్ని పాఠశాలల యాజమాన్యాలు స్పందించాలని సూచించింది. టైం టేబుల్ ప్రకారం పుస్తకాలు తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందించాలని హోంవర్క్ మినహా ఇతర నోటు పుస్తకాలు తరగతి గదిలోనే భద్రపరచుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని గతంలోనే ఆదేశించినప్పటికీ అన్ని తరగతి గదుల్లో ర్యాక్‌లు నిరి్మంచడం లేదా అందుబాటులో ఉండేలా చూడాల్సిరావడం ఒకింత భారం కావడంతో అనేక పాఠశాలల యాజమాన్యాలు ఈ ఆదేశాలను అటకెక్కించాయి. దీంతో గత్యంతరం లేక విద్యార్ధులు అన్ని నోటు, అచ్చు పుస్తకాలను మోసుకెళ్లడంవల్ల బ్యాగు బరువు ఎక్కువవుతోంది. దీనికి తోడు ఒక్కో సబ్జెక్టుకు ఒక అచ్చు పుస్తకం, రెండు నోటు పుస్తకాలు, ఒక వ్యాసం లేదా గ్రామర్ పుస్తకం, ఇలా కనీసం నాలుగైదు పుస్తకాలుంటున్నాయి. మొత్తం ఆరు సబ్జెక్టులకు కలిపి సుమారు 20–25 పుస్తకాలను రోజూ మోయాల్సి రావడం వల్ల విద్యార్ధులు వెన్ను, నడుం భుజాల నొప్పితో బాధపడుతున్నారు. నిబంధనల ప్రకారం స్కూల్ బ్యాగ్ బరువు పిల్లల శరీర బరువుకంటే 15 శాతం తక్కువగా ఉండాలి. ఒకటి, రెండో తరగతి విద్యార్ధుల బ్యాగు బరువు సుమారు కేజీ, మూడు నుంచి ఐదో తరగతి విద్యార్ధుల బ్యాగు బరువు రెండున్నర నుంచి మూడు కేజీల మధ్య, ఆరు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్ధుల బరువు మూడు నుంచి నాలుగు కేజీల మధ్య ఉండాలి. ఇక తొమ్మిది, పదో తరగతి విద్యార్ధుల బ్యాగు బరువు సుమారు ఐదు కేజీల కంటే ఎక్కువ ఉండరాదని సమీర్ రూపరేల్ తెలిపారు. కానీ అనేక కారణాల వల్ల పరిమితిని మించి విద్యార్థులు స్కూ లు బ్యాగుల బరువును మోస్తున్నారని దీనివల్ల వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విపరీతమైన బరువు కారణంగా విద్యార్ధులు పూర్తిగా ఎదగలేక పోతున్నారని ఈ కారణంగా వారు నిలుచునే భంగిమలో కూడా మార్పు వస్తోందని ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో వారికి మరింత ఇబ్బంది కలిగే ప్రమాదముందని రూపరేల్ ఆందోళన వ్యక్తం చేశారు. -
పిల్లల్లో ఏకాగ్రతలేదా? ఒక్క చోట నిలవడం లేదా?
పిల్లలకు ఏకాగ్రత ఉండటం లేదు, ఎదుగుదల సరిగా లేదు.. అని పెద్దల నుంచి కంప్లైంట్స్ తరచూ వింటూ ఉంటాం. పిల్లల్లో ఆందోళన, చికాకు తగ్గడానికి యోగాభ్యాసం ఎంతగానో ఉపయోగపడుతుంది. పెద్దలు చేసే విధంగా పిల్లలకు యోగా సాధన కుదరదు. చిన్న చిన్న మార్పులు చేసి, పిల్లలచే సాధన చేయిస్తే వారి ఉన్నతికి యోగా ఒక బలమైన పునాదిగా ఉంటుంది. ముందు ఓ పది నిమిషాలు పిల్లలతో చిన్న చిన్న స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయించాలి. దీనివల్ల వారి శరీరం యోగాభ్యాసానికి సిద్ధం అవుతుంది. ఆ తర్వాత 12 సూర్యనమస్కారాలు చేయించాలి. పిల్లలకు ఏకాగ్రత, ఎదుగుదలకు సహకరించేవి..ఆక్సీజన్ గా..ముందు నిటారుగా నిల్చోవాలి. రెండు కాళ్లలో ఒక కాలిని మోకాళ్ల వద్ద వంచుతూ, ΄ాదాన్ని నిలుచుని ఉన్న కాలు తొడ భాగంలో ఉంచాలి. హృదయం దగ్గర నమస్కార భంగిమ లో చేతులను ఉంచి, రెండు శ్వాసలు తీసుకుని వదిలాక, చేతులు రెండూ పైకి ఎత్తి నిల్చోవాలి. ఈ ఆసనం ద్వారా శరీరాన్ని బ్యాలెన్డ్స్‌గా ఎలా ఉంచాలో తెలుస్తుంది. ఒక చెట్టు ఆక్సిజన్‌ను ఎలా ఉత్పత్తి చేస్తుందో అలాంటి భంగిమ కాబట్టి పిల్లల శ్వాసక్రియ కూడా బాగా పనిచేస్తుంది. ఈ ఆసనం ద్వారా వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. – జి. అనూ షారాకేష్యోగ గురు -
Children Eye Care Week బాల్య శుక్లాలపై నిర్లక్ష్యం వద్దు..
బంజారాహిల్స్: ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకూ నిర్వహించే బాలల నేత్ర సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం అవగాహనా వాక్‌ను నిర్వహించారు. ‘బాల్య శుక్లాలు–పిల్లల చూపుపై వాటి ప్రభావం–త్వరిత గుర్తింపు–చికిత్స ప్రాధాన్యత’ థీమ్‌తో ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కల్లం అంజిరెడ్డి ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన వాక్‌ను సినీ సంగీత దర్శకుడు తమన్ ఎస్, నటుడు విశ్వ కార్తికేయలు ప్రారంభించారు. దాదాపు 300 మంది చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఫ్లకార్డులు చేతబూని బాల్యశుక్లాలపై అవగాహన క్పలించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ ఈ వాక్‌లో పాల్గొనడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అయితే పిల్లల కంటి సమస్యలను త్వరితగతిన గుర్తించగలిగితే వారి సమస్యలను దూరం చేయవచ్చని, ఆ దిశగా తల్లిదండ్రులు అవగాహన పొందాలని కోరారు. ఎల్వీ ప్రసాద్ చైల్డ్ సైట్ ఇన్స్టిట్యూట్ అధిపతి డాక్టర్ రమేష్ కెకున్నయ్య మాట్లాడుతూ రోగ నిర్ధారణను త్వరితగతిన గుర్తించి చికిత్స అందించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు ఉంటాయన్నారు. బాల్య కంటి శుక్లం చికిత్స చేయకుండా వదిలేస్తే, చివరకు పునరుద్ధరించలేని విధంగా హాని చేయవచ్చన్నారు. ఈ నెల 14 వరకూ ఎల్వీప్రసాద్ ఆస్పత్రి ఆవరణలో చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రెస్, వక్తృత్వ, క్లే మౌల్డింగ్, బ్రెయిలీ చదవడం, పోటరీ సెషన్లు నిర్వహించి బాలల దినోత్సవం రోజున బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
Copenhagen: చికుబుకు చికుబుకు బకనే!
డెన్మార్క్ రాజధాని కోపన్హేగన్కు చేరువలో ఉన్న పిల్లల వినోద కేంద్రం బకన్. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన అమ్యూజ్మెంట్ పార్కు. నాలుగు శతాబ్దాలకు పైగా ఇది కొనసాగుతోంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ అమ్యూజ్మెంట్ పార్కులో పిల్లల వినోదానికి అన్ని రకాల ఏర్పాట్లూ ఉన్నాయి. పచ్చని చెట్లు చేమలతో కళకళలాడుతూ కనిపించే ఈ పార్కు విస్తీర్ణం 75 వేల చదరపు మీటర్లు. ఇందులో ఐదు రోలర్ కోస్టర్లు, నాలుగు లిటిల్ ట్రెయిన్స్, ఒక వాటర్ రైడ్ సహా పిల్లల కోసం 33 క్రీడాకర్షణలు ఉన్నాయి. సుదీర్ఘ చరిత్ర కారణంగా దీనిని చూడటానికి విదేశీ పర్యాటకులు కూడా పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఏటా ఈ పార్కుకు దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మంది వస్తుంటారు. ఇందులోకి ప్రవేశం పూర్తిగా ఉచితం. రకరకాల రైడ్స్, ఇతర వినోద క్రీడా సాధనాలను ఉపయోగించుకోవాలనుకుంటే మాత్రం విడి విడిగా కూపన్లను కొనుక్కోవాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో పలురకాల క్రీడాసాధనాల కోసం డిస్కౌంట్ కూపన్లు అందుబాటులో ఉంటాయి. అలాగే తరచుగా ఇక్కడకు వచ్చే కోపన్హేగెన్ వాసులకు సీజన్ పాస్‌లు కూడా తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయి.నీటిబుగ్గతో మొదలైంది..ప్రస్తుతం ఈ పార్కు ఉన్న ప్రాంతానికి అతి చేరువగా ఒక నీటిబుగ్గ ఉంది. పదహారో శతాబ్దిలో కిర్‌స్టెన్ పీల్ అనే స్థానికుడు ఒకరు ఈ నీటిబుగ్గను గుర్తించాడు. కోపన్హేగెన్ శివార్లలో పచ్చని అడవి మధ్యనున్న ఈ నీటిబుగ్గ అనతి కాలంలోనే జనాలను ఆకర్షించింది. కోపన్హేగెన్ నగరంలో సరఫరా అయ్యే నీటి నాణ్యత అప్పట్లో బాగుండేది కాదు. అందువల్ల ఎక్కువమంది జనాలు ఈ నీటిబుగ్గ నుంచి నీరు తీసుకుపోవడానికి ఇక్కడకు వచ్చేవారు. పిల్లలు ఆడుకోవడానికి ఈ ప్రదేశం అనుకూలంగా ఉండటంతో 1583లో నీటిబుగ్గకు చేరువగా అడవిలోని కొంతభాగాన్ని శుభ్రం చేసి, పార్కుగా మార్చారు. ఆ తర్వాత డెన్మార్క్, నార్వే ప్రాంతాలను పరిపాలించిన రాజు ఫ్రెడెరిక్–ఐఐఐ 1669లో ఇక్కడి అడవిలో జంతువుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత ఆయన కొడుకు క్రిస్టియన్–V ఈ పార్కును దాదాపు నాలుగు రెట్లు విస్తరించి, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా రూపొందించాడు. అప్పట్లో ఇక్కడ రాచవంశీకులు, కులీనుల పిల్లలు మాత్రమే ఆడుకునేవారు. ఫ్రెడెరిక్–V కాలంలో 1756 నుంచి ఇందులోకి సాధారణ ప్రజలకు కూడా అనుమతి కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పార్కు కాలానుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు చేసుకుంటూ వస్తున్నా, ఏనాడూ దీని తలుపులు మూసుకోలేదు. ‘కోవిడ్–19’ కాలంలో కలిగిన తాత్కాలిక అంతరాయం మినహా ఇది నేటికీ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది. -
పసితనంలో చక్కెరకు చెక్ పెడితే.. చక్కని ఆరోగ్యంq
మధుమేహం, రక్తపోటు రెండు జంట జబ్బులు ప్రస్తుతం మానవాళిని పట్టి పీడిస్తున్నాయి. వీటి బారినపడకుండా ఉండాలంటే చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార అలవాట్లు అలవరుచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిరుప్రాయం నుంచి తినే ఆహారం పట్ల నియంత్రణ ఉంటే పెద్దయ్యాక వ్యాధుల ముప్పు తగ్గుతుందని పలు అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో తొలి వెయ్యి రోజులు చిన్నారులకు అందించే ఆహారంలో చక్కెరను నియంత్రిస్తే పెద్దయ్యాక 35 శాతం టైప్–2 డయాబెటిస్, 25 శాతం రక్తపోటు ముప్పు తగ్గుతుందని అమెరికాలోని సౌత్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి జన్మనిచ్చాక, ఆ శిశువుకు రెండేళ్లు వచ్చే వరకు... అంటే వెయ్యి రోజుల పాటు చక్కెర తీసుకోవడాన్ని తగ్గిస్తే పెద్దయ్యాక రక్తపోటు, మధుమేహం ముప్పు గణనీయంగా తగ్గించవచ్చని నిర్ధారించారు. యూకే బయో బ్యాంక్‌లోని 1951 నుంచి 1956 మధ్య జన్మించిన 60 వేల మంది చిన్నారుల ఆరోగ్య వివరాలపై జరిపిన అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. రేషన్‌లో చక్కెర తీసుకున్న వారు, తీసుకోని వారు ఇలా రెండు వర్గాలుగా చిన్నారులను విభజించి అధ్యయనం నిర్వహించారు. ఈ నేపథ్యంలో చక్కెర తీసుకున్న వారితో పోలిస్తే తీసుకోని వారు యుక్త వయస్సులో దీర్ఘకాలిక జబ్బుల బారినపడే ప్రమాదం తక్కువగా ఉన్నట్టు తేలింది. – సాక్షి, అమరావతి -
బెయిల్‌పై బయటకొచ్చి.. భార్య, ముగ్గురు పిల్లలపై కాల్పులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హత్య కేసులో బెయిల్ బయటకు వచ్చిన ఓ వ్యక్తి.. తన భార్య, ముగ్గురు పిల్లలను అతి కిరాతకంగా కాల్చి చంపాడు. ఈ ఘోరం వారణాసిలోని భైదానీ ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి వెలుగుచూసింది.పోలీసుల వివరాల ప్రకారం.. రాజేంద్ర గుప్తా అనే వ్యక్తి 1997కు సంబంధించి ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాయడు. సోమవారం రాత్రి తన ఇంట్లోకి ప్రవేశించి గాఢ నిద్రలో ఉన్న భార్య నీతూ గుప్తా(45), కుమారులు నవేంద్ర(25), సుబేంద్ర(15), కూతురు గౌరంగి(16)పై కాల్పులు జరిపాడు. వారు మరణించారని ధృవవీకరించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.కుటుంబం హత్యపై సమాచారం అందుకున్న వారణాసి పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడు సైతం వారణాసిలోని రోహనియా ప్రాంతంలో శవమై కనపించాడు. తన భార్య, పిల్లలను చంపిన తర్వాత నిందితుడు హత్య చేసుకొని మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా కొన్ని రోజులుగా బార్యభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయని రాజేంద్ర గుప్తా తల్లి పోలీసులకు తెలిపారు.ఈ సంఘటనపై వారణాసి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవ్ బన్స్వాల్ మాట్లాడుతూ. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని కాల్చి చంపినట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. కుటుంబ కలహాలు, చేతబడి వంటి అనేక కోణాల్లో మేము కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాజేంద్ర గుప్తా మృతదేహాన్ని కూడా వారణాసి నుంచి స్వాధీనం చేసుకున్నామని, అతను హత్యకు గురయ్యాడా లేదా ఆత్మహత్య చేసుకొని మరణించాడా అని తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. -
మెగా మ్యూజియం గురించి తెలుసా?
మ్యూజియం అంటే కళాఖండాలు, పురాతన వస్తువులు ఉంటాయని తెలుసు. అయితే చిన్నపిల్లల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజియం గురించి మీకు తెలుసా? అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఇండియానా పోలిస్ అనే ప్రాంతంలో ’The Children’s Museum of Indianapolis.’ ఉంది. ప్రపంచంలో పిల్లల కోసం ఏర్పాటు చేసిన అతి పెద్ద మ్యూజియం ఇది. 1925లో మేరీ స్టీవర్ట్ కారీ అనే ఆయన దీన్ని ప్రారంభించారు. మొదట చిన్నగా మొదలైన ఈ మ్యూజియం అనంతరం విస్తరిస్తూ 1976లో అతి పెద్ద మ్యూజియంగా మారింది. 4,72,900 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మ్యూజియంలో ఐదు అంతస్తులున్నాయి. ఇక్కడ దాదాపు 1,30,000కు పైగా రకరకాల వస్తువులు, కళాఖండాలు ఉన్నాయి. ఏటా పది లక్షలమందికి పైగా ఈ మ్యూజియాన్ని సందర్శిస్తుంటారు. వారికి సేవలందించేందుకు నాలుగు వందల మంది ఉద్యోగులు, 1500 మంది వాలంటీర్లు ఉంటారు.చిన్నారుల్లో సైన్స్ పట్ల, సామాజిక అంశాల పట్ల ఆసక్తి, అవగాహన పెంచడం ఈ మ్యూజియం ప్రధాన ఉద్దేశం. ఇందులో సైన్స్, చరిత్ర, జంతువులు, వైద్యం, సామాజిక, ఆర్థిక అంశాలను సూచించే అనేక వస్తువులున్నాయి. అవన్నీ పిల్లలకు చూపించడం ద్వారా వారిలో ఆ అంశాలపై అవగాహన పెంచుతారు. ఒక్కో ఫ్లోర్లో ఒక్కో అంశానికి సంబంధించిన వస్తువులు ఉంటాయి. డైనోసార్ల జీవితం, వాటి మరణం వంటి అంశాలను వివరించేందుకు ఇక్కడ ప్రత్యేక విభాగం ఉంది. అది చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటుంది.కేవలం వస్తువులు చూసి వెళ్లిపోయేలా కాకుండా ఈ మ్యూజియంలో పలు క్రీడా కోర్టులు ఏర్పాటు చేశారు. చిన్నారులు అక్కడికి వెళ్లి వారికి నచ్చిన ఆటలు ఆడుకోవచ్చు. మ్యూజియంలో ‘లిల్లీ థియేటర్’ కూడా ఉంది. అక్కడ చిన్నారుల కోసం ప్రత్యేకంగా నాటకాలు, షోలు ఏర్పాటు చేస్తుంటారు. -
ఎఫ్–టామ్ ఆధ్వర్యంలో గిరిజన పిల్లల దీపావళి
ముంబై: ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా ఎఫ్–టామ్ ఆధ్వర్యంలో గ్రామీణ, గిరిజన పిల్లలతో దీపావళి పండుగ స్నాక్స్, గిఫ్ట్స్ టపాకాయలతో ఘనంగా జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర అధ్యక్షుడు గంజి జగన్‌బాబు ఆధ్వర్యంలో బృందావనం ఫారమ్స్, ఖోపోలిలో ఈ వేడుకలను నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామ పంచాయతీ, గిరిజన ప్రాంతాల పేద విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్నారు. వారికి ఆటలు, పర్యావరణం, మంచి అలవాట్ల గురించి పూజ పలు సూచనలిచ్చారు. కార్యక్రమానికి విఠల్, రమాకాంత్, ప్రశాంత్, గణేశ్, దిలీప్, అర్చన తదితరులు సేవలందించారు. కపిల్ పాటిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ భివండీ: కపిల్ పాటిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీపావళి పండుగ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కల్యాణ్‌లోని సాయి చౌక్ వద్ద నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బీజేపీ మాజీ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్ నేతృత్వంలో నవంబర్ 2వ తేదీన ఉదయం 5 గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని నిర్వాహకులు తెలిపారు. హిందీ–మరాఠీ చలనచిత్ర గీతాలు, ప్రసిద్ధి గాంచిన వెండితెర, బుల్లి తెర కళాకారులు హాస్యనటుల ప్రదర్శనలు, భారతీయ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ముఖ్యంగా బంజారా బృందం, బెల్లీ డ్యాన్స్, భరతనాట్యం తదితర నృత్యాల ప్రదర్శనలు కొనసాగుతాయని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇండియన్ ఐడల్ విన్నర్, బిగ్‌బాస్ ఫేమ్ సింగర్ అభిజిత్ సావంత్, ప్రజక్తా శుక్రే, భూమి త్రివేది, జూలీ జోగ్లేకర్‌తో పాటు పాతిక మంది కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకలను అలరించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. . -
పిల్లల్లో పేనుకొరుకుడు!
కొందరు చిన్నారులకు తలపైన వెంట్రుకలు కొంతమేర రాలిపోతుంటాయి. కొందరు పెద్దల్లోనూ ఇలా జరుగుతుంటుంది. ఇలా జుట్టురాలిపోయి ప్యాచ్‌లా రూపోందే కండిషన్‌ను ‘అలొపేషియా ఏరేటా’ అంటారు. కారణాలు: అలొపేషియాకు పలానా అంశమే కారణం అంటూ చెప్పడం సాధ్యం కాదు. అయితే సాధారణంగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఈ కండిషన్‌కు ప్రధాన కారణం. ఇలాంటి కండిషన్ ఉన్న పిల్లల్లో మాడు ఎర్రబారడం, ఆప్రాంతంలో పొట్టులా రాలడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. వీళ్లలో అలర్జీకి సంబంధించిన సమస్యలు, ఆస్థమా, అటోపిక్ డెర్మటైటిస్, చేతివేళ్ల గోళ్లలో కూడా సమస్యలూ కనిపించవచ్చు. ఇలాంటి పిల్లల్లో థైరాయిడ్ సమస్యలు (హైపోథైరాయిడిజం), కడుపుకు సంబంధించిన సమస్యలు, కళ్ల సమస్యలు, ఇతర ఆటో ఇమ్యూన్ సమస్యలు కూడా కనిపించవచ్చు. ఆ కండిషన్ కనిపించే పిల్లల్లో దాదాపు 10% నుంచి 20% మందిలో ఇదే జబ్బుకు సంబంధించిన Mఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటుంది. కాబట్టి ఇది జన్యుపరమైన కారణాల వల్ల కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో పిల్లల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడులు, మానసికమైన ఉద్వేగాల వంటి అంశాలు కూడా ఈ సమస్యను ప్రేరేపించవచ్చు. మానసికమైన అంశాలతో ΄ాటు... ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అలర్జీకి సంబంధించిన సమస్యలు, సెబోరిక్ డెర్మటైటిస్ అనే కండిషన్లలో సైతం వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. ఇలా జుట్టురాలిపోయే పిల్లల్లో సాధారణంగా ఆర్నెల్ల నుంచి ఏడాదిలోపు మళ్లీ వెంట్రుకలు వాటంతట అవే వచ్చే అవకాశం ఉంది. ఈ అలొపేషియా ఏరేటా కండిషన్ చిన్న చిన్న ప్యాచెస్‌లా కనిపిస్తుంటే త్వరగా తగ్గే అవకాశం ఉంది. చికిత్స: జట్టు రాలిపోతున్నందు వల్ల ఇలాంటి పిల్లలు ఆత్మన్యూనతకూ, మానసిక ఒత్తిడికీ గురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు, సంరక్షకులు వారికి తగిన మానసిక స్థైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పైగా తమ తోటివారు ఎగతాళి చేస్తారన్న ఆందోళన పిల్లల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా జుట్టు రాలిపోయేచోట్ల టాపికల్ స్టెరాయిడ్స్, స్టెరాయిడ్ క్రీమ్స్ రాయడం, ఆప్రాంతాల్లో చర్మంలోకి (సబ్ క్యూటేనియస్) ఇంజెక్షన్లు ఇవ్వడం, అల్ట్రా వయొలెట్ థెరపీ వంటి వాటివల్ల ప్రయోజనం ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో హెయిర్ గ్రోత్ ప్రమోటింగ్ ఏజెంట్స్ వంటి మందుల్ని వాడాలి. అయితే వాటితో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా డర్మటాలజిస్ట్ల పర్యవేక్షణలోనే వాటిని వాడాల్సి ఉంటుంది. -
‘మా అమ్మాయికి బుద్ధి చెప్పండి స్వామీ’
Moral Story: చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి రోజంతా గాలి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది. ఇక్కడ మాట అక్కడా, అక్కడి మాట ఇక్కడా చెబుతూ వుంటే చూసి వాళ్ళమ్మ చాలా బాధ పడేది. ఇలా గాలి కబుర్లు చెప్పడం తప్పని ఎంత చెప్పినా ఆ అమ్మాయి మట్టుకు పట్టించుకునేది కాదు. ఈ గాలి కబుర్ల వల్ల లేనిపోని తగాదాలు కూడా వచ్చేవి.ఒక రోజు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆయన దర్శనానికి వెళ్లిన ఆ అమ్మాయి వాళ్ల అమ్మ తన బాధ చెప్పుకుంది. ‘మా అమ్మాయికి బుద్ధి చెప్పండి స్వామీ’ అని కోరుకుంది. సాధువు మర్నాడు అమ్మాయిని తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు.మర్నాడు పొద్దున్నే అమ్మ తన కూతురుని సాధువు వద్దకు తీసుకుని వెళ్ళింది. సాధువు చారుమతికి ఒక కోడిని చూపించి ‘రోజంతా ఆ కోడి ఈకలు తీసి వూరు మొత్తం చల్లమ్మా’ అని చెప్పాడు.ఎక్కడ తిడతాడో అని భయపడుతూ వచ్చిన అమ్మాయి ‘ఇంతేనా?’ అనుకుంటూ కోడి ఈకలతో వూరంతా తిరుగుతూ కనిపించిన వారందరికి కబుర్లు చెపుతూ ఇక్కడో ఈక, అక్కడో ఈక విసిరేసింది. సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంటే ఆ అమ్మాయిని తల్లి మళ్ళీ ఆ సాధువు దగ్గిరకు తీసుకెళ్లింది.‘ఈ రాత్రి నిద్రపోయి మళ్ళి తెల్లవారగానే రండి’ అని పంపాడు సాధువు.మర్నాడు పొద్దున్నే వాళ్లు వెళితే సాధువు అమ్మాయితో, ‘నిన్న రోజంతా విసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకు రామ్మా’ అన్నాడు.అమ్మాయి సరేనని ఊరంతా వెతకడం మొదలెట్టింది. సాయంత్రం దాక ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఈక కనిపించలేదు. దిగాలుగా సాయంత్రానికి ఆ సాధువు దగ్గరకు వెళ్ళి ‘స్వామి, నన్ను క్షమిచండి. నాకు ఒక్క ఈక కూడ దొరకలేదు’ అని చెప్పింది.చదవండి: ‘నలుగురు కూతుళ్లేనా..’ కాదు డాక్టర్ డాటర్స్..!అప్పుడు సాధువు ‘చూశావా... మన మాటలు కూడా ఆ ఈకల లాంటివే. ఒక్క సారి నోరు జారితే ఆ మాటలను మనం యెన్నటికీ తిరిగి తీసుకోలేము’ అని చెప్పాడు. ‘నోరు అదుపులో ఉంటే సమయం వృధా కాదు. చేయవలసిన పనులు పూర్తవుతాయి. జీవితంలో పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు’ అన్నాడు.ఆ రోజు నుంచి ఆ అమ్మాయి గాలి కబుర్లు మానేసి చక్కగా చదువుకుని వాళ్ల అమ్మను సంతోషపెట్టింది. -
చిన్నారులను బావిలోకి తోసి తండ్రి ఆత్మహత్య
తాడ్వాయి: ‘డబ్బులు ఇవ్వకపోతే ఇద్దరు పిల్లలను లేకుండా చేసి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా.. ’ అని బెదిరించిన ఆ కసాయి అన్నంత పని చేశాడు. భార్య, అత్తింటి వారిపై కోపం పెంచుకుని కన్న బిడ్డలను బావిలో తోసేసి తనూ ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ ఘటనతో మండలంలోని నందివాడలో వి షాదఛాయలు అలుముకున్నాయి. శనివారం దస రా సందర్భంగా గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి(30) తన ఇద్దరు కొడుకులు వి ఘ్నేశ్(6), అనిరుధ్‌రెడ్డి(4)కి కొత్త డ్రెస్‌లు వేయించి తన బైక్‌పై శమీ పూజకు తీసుకెళ్లాడు. అతడి భార్య అపర్ణ ఇంటి వద్దే ఉన్నది. రాత్రయినా వారు తిరిగిరాకపోయేసరికి కుటుంబ సభ్యులు, గ్రా మస్తులు చుట్టుపక్కల వెతికారు. ఆదివారం ఉదయం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద శ్రీనివాస్‌రెడ్డి ఫోన్, చెప్పులు కనిపించడంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బావిలో నుంచి ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బయటికి తీయించారు. మోటార్లు వేసి నీటిని ఖాళీ చేయడంతో బావిలో శ్రీనివాస్ రెడ్డి మృతదేహం లభించింది. తండ్రీకొడుకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తన కొడుకులు, భర్త మృతదేహాన్ని చూసి అపర్ణ రోదన మిన్నంటింది. తన బిడ్డల మృతదేహాలను గుండెలకు హత్తుకుని ఆమె రోదించడం అక్కడి వారిని కంటతడిపెట్టించింది. శరన్నవరాత్రుల సందర్భంగా చిన్నారులు విఘ్నేశ్, అనిరుధ్‌రెడ్డి ప్రతి రోజూ అమ్మవా రి మండపానికి వచ్చి పూజల్లో పాల్గొన్నారని గ్రామస్తులు రోది స్తూ తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నాయ్‌గావ్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి పదేళ్ల క్రితం ఇల్ల రికం వచ్చాడు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. -
పండగపూట విషాదం.. ఇద్దరు పిల్లలను బావిలోకి నెట్టి..
సాక్షి, కామారెడ్డి జిల్లా: తాడ్వాయి మండలం నందివాడలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలో పడేసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు పిల్లలు, తండ్రి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు, స్థానికులు వివరాలు ప్రకారం శనివారం రాత్రి దుర్గమ్మ నిమజ్జనానికి పిల్లలను తండ్రి శ్రీనివాస్‌రెడ్డి తీసుకెళ్లగా, రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య ఆయనకు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు చేసినా కాల్ లిప్ట్ చేయలేదు. మళ్లీ అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా, ఆదివారం ఉదయం గ్రామశివారులోని ఓ వ్యవసాయ బావిలో పిల్లలు, తండ్రి మృతదేహాలు కనిపించాయి. తండ్రీకొడుకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.ఇదీ చదవండి: వారే లేని.. నేనెందుకని.. -
'గారం' భారంగా.. మన మధ్య పిల్లలెందుకు?!
భార్యాభర్తలకు పిల్లలు భారమవుతున్నారు. అందుకే పలు జంటలు పిల్లల్ని వద్దనుకుంటున్నాయి. ఇద్దరూ కష్టపడి సంపాదించినా బతకడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో పిల్లలను కనీ పెంచి.. వారిని ప్రయోజకుల్ని చేయడం పెనుభారంగా మారుతోంది. లక్షలకు లక్షలు పోసి వారిని చదివించాలంటేనే వెన్నులో వణుకుపుడుతోంది. ఇక వారి ఆలనా పాలనా చూడటంతోనే తమ జీవితమంతా కరిగిపోతోందని జంటలు భయపడుతున్నాయి. అందుకే పలువురు భార్యాభర్తలు అసలు పిల్లలే వద్దనుకుంటున్నారు.పూర్వకాలంలో పిల్లల్ని కనడానికి ఎలాంటి నిబంధనలూ ఉండేవి కావు. భార్యాభర్తలు ఎంతమందినైనా కనొచ్చు. పది, పదిహేను మంది పిల్లల్ని కనేవారు. ముగ్గురు, నలుగురు పిల్లలుండటం అనేది సర్వసాధారణం ఆ రోజుల్లో. అంతెందుకు షాజహాన్ ప్రేమతో తాజ్‌మహల్ కట్టేలా చేసిన ముంతాజ్‌కు పద్నాలుగు మంది పిల్లలు. భారతంలో కుంతీదేవికి ఆరుగురు కుమారులు, రామాయణంలో దశరధుడికి నలుగురు సంతానం. ఇక ఎన్టీ రామారావుకి 12 మంది పిల్లలు. ఇక ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కన్న వారి సంఖ్య లెక్కే లేదు. అలాంటి మన కుటుంబ వ్యవస్థలోకి ఇప్పుడు డ్యుయల్ ఇన్‌కం నో కిడ్స్(డింక్) సంస్కృతి చొచ్చుకొచి్చంది. భార్యాభర్తలు ఉద్యోగం చేసి వచి్చన డబ్బుతో జీవితంలో స్థిరపడాలనుకుంటున్నారు. పిల్లలు వద్దనుకుంటున్నారు. దీనినే డింక్ విధానంగా పిలుస్తున్నారు. ఇప్పుడిది దేశంలోనూ వేగంగా విస్తరిస్తోందని ఇటీవల విడుదలైన ‘లాన్సెట్ నివేదిక’ స్పష్టం చేసింది. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే బాగా ఇది విస్తరించింది. ఇక మన దేశంలో నగరాలు, పట్టణాలు దాటి గ్రామాల్లోనూ వేగంగా చొచ్చుకొస్తోంది. ఈ డింక్స్ కల్చర్ వలన 2050 నాటికి 90 దేశాల్లో జనాభా తగ్గిపోయే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమితి పాపులేషన్ డేటా విశ్లేషణ ఆధారంగా ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకటించింది.కోరికలను చంపుకొని..పిల్లల్ని పెంచడం కోసం రుణాలు తీసుకోవడం, ఈఎంఐలు కట్టడమే భార్యభర్తలకు సరిపోతుంది. దీంతో చాలా మంది తమ వ్యక్తిగత స్వేచ్ఛకు దూరం కావాల్సి వస్తోంది. ఫలితంగా ఒత్తిడికి లోనై, మానసిక ఆందోళనలు, కోరికలు చంపుకొని నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. బ్రూకింగ్స్ అనే సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం.. ఒక బిడ్డను 17 ఏళ్ల వయసు వచ్చే వరకు పెంచాలంటే దాదాపు 3 లక్షల డాలర్లకు పైగా ఖర్చవుతుంది. పిల్లల చదువులు, వైద్య ఖర్చులకే డబ్బంతా ఖర్చయితే తమ పరిస్థితేంటని నేటి తరంలో దాదాపు 61 శాతం మంది భార్యాభర్తలు ఆలోచిస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన సర్వే ప్రకారం.. 18 నుంచి 49 ఏళ్ల వయస్సు ఉన్న డింక్ జంటల్లో 44 శాతం మంది పెరుగుతున్న జనాభా వాతావరణ సమస్యగా మారకూడదనే ఉద్దేశంతో పిల్లలను కనడం లేదని వెల్లడించారు.మనదేశంలోనూ వేగంగా..మన దేశంలోనూ డింక్ కల్చర్ వేగంగా పెరుగుతోంది. ఉత్తరాదితో పోలి్చతే దక్షిణాదిలోనే ఇది ఎక్కువగా ఉంది. లాన్సెట్ నివేదిక ప్రకారం..1950లో భారత్‌లో సంతానోత్పత్తి రేటు 6.18 శాతంగా ఉండగా, ఇది 1980 నాటికి 4.60కు చేరింది. 2021లో 1.91 శాతానికి పడిపోయింది. మన దేశంలో 30 శాతం మంది డింక్ సంస్కృతిని అవలంబిస్తున్నారు. ఇందులో మరో ఆశ్చర్యమేంటంటే.. పట్టణాల్లో 22 శాతం మంది డింక్‌లుగా మారితే, గ్రామాల్లో 42 శాతం మంది ఉన్నారు. యుక్త వయసులో బానే ఉంటుంది గానీ.. సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చి విస్తరిస్తున్న డింక్ సంస్కృతి వల్ల పిల్లలు లేకుండా జీవించడం యుక్త వయసులో బానే ఉంటుంది.. కానీ కొన్నేళ్ల తర్వాత అందరూ ముసలివాళ్లే మిగులుతారు. వారి ఆలనా పాలనా చూసేందుకు ఎవరూ ఉండరు. దంపతుల్లో ఒకరు మరణిస్తే మరొకరు ఒంటరిగానే బతకాలి. అది వారికి నరకంగా మారుతుంది. అలాగే కుటుంబం, సమాజంలోనూ సహజత్వంలో మార్పు వస్తుంది. ఇది సమాజంలోని విలువలు, సంప్రదాయాలను కూడా ప్రభావితం చేస్తుంది. -
చిన్నారులపై జచింత నెత్తుటేరుల అవార్డ్ నాకొద్దు
తన ఆదివాసీల సామాజిక, సాంస్కృతిక జీవితం గురించి లోతుగా రాయడమే కాదు పిల్లల ప్రపంచం గురించి కూడా రాస్తోంది కవయిత్రి జసింతా కెర్కెట్టా. ఎక్కడ చూస్తే అక్కడ వారై – విశ్వరూపమున విహరిస్తున్న ఈ కాలంలో పిల్లల కోసం జసింత రాసిన ‘జిర్హుల్’ అనే పుస్తకానికి ‘రూమ్ టు రీడ్ యంగ్ రైటర్–2024’ అవార్డ్ ప్రకటించారు. పాలస్తీనాలో బాంబు దాడుల్లో మరణించిన, హింసకు గురవుతున్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డ్‌ను జసింత తిరస్కరించింది.‘రూమ్ టు రీడ్ ఇండియా’ అనేది అక్షరాస్యత, లింగసమానత్వం... మొదలైన వాటిపై పనిచేసే స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థకు ఏరోస్పేస్ దిగ్గజం ‘బోయింగ్’తో సంబంధం ఉంది అని ఆరోపిస్తూ తనకు ప్రకటించిన అవార్డ్‌ను జసింత కెర్కెట్టా తిరస్కరించింది. ‘బోయింగ్‌కు ఇజ్రాయెల్ సైన్యంతో 75 ఏళ్లుగా సంబంధం ఉంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్)కు ఆయుధాలను సరాఫరా చేసే కీలక సంస్థ అయిన బోయింగ్ ‘రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్’కు నిధులు అందజేస్తుంది’ అని జసింత తన తిరస్కరణ కారణాలపై ఆ ట్రస్ట్‌కు లేఖ రాసింది.‘ఆయుధాలతో పిల్లల ప్రపంచం నాశనం అవుతున్నప్పుడు ఆయుధాల వ్యాపారం, పిల్లల సంరక్షణ ఏకకాలంలో ఎలా కొనసాగుతాయి?’ అని ఆ లేఖలో ప్రశ్నించింది జసింత.‘సాహిత్యంలో వైవిధ్యమైన, పిల్లల కోసం రాస్తే పుస్తకాలు తక్కువగా వస్తున్నాయి. బాల సాహిత్యానికి సంబంధించిన జిర్హుల్ పుస్తకానికి అవార్డ్ రావడం సరిౖయెనదే అయినా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ అవార్డ్‌ను స్వీకరించలేను’ అని చెప్పింది.ఈ తిరస్కరణ మాట ఎలా ఉన్నా ‘సాహిత్యానికి జసింత కెర్కెట్టా చేసిన కృషి విలువైనదిగా భావిస్తున్నాం’ అని స్పందించింది ‘రూమ్ టు రీడ్ ఇండియా’ ట్రస్ట్. ఇప్పుడు మాత్రమే కాదు సామాజిక కారణాలతో తనకు వచ్చిన కొన్ని అవార్డ్‌లను గతంలోనూ తిరస్కరించింది జసింత.ఉద్యమ నేపథ్యం...ఝార్ఖండ్‌లోని ఖుద΄ోష్ గ్రామంలో ఆదివాసీ కుటుంబంలో పుట్టిన జసింత మాస్ కమ్యూనికేషన్, వీడియో ్ర΄పొడక్షన్లో డిగ్రీ చేసింది. రాంచీలోని ఒక ప్రముఖ దినపత్రికలో పని చేసింది. కెరీర్ పరంగా ఎంత ముందుకు వెళ్లినా తన మూలాలను మాత్రం మరవలేదు. ‘ఆదివాసీ అండ్ మైనింగ్ ఇన్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఝార్ఖండ్’ పేరుతో అధ్యయన పత్రాన్ని వెలువరించింది.‘ఇండిజినస్ వాయిస్ ఆఫ్ ఆసియా’ అనే పరిశోధన పత్రానికి ఇండిజినస్ పీపుల్స్ ఫ్యాక్ట్ అవార్డు లభించింది. జర్నలిస్ట్‌గానే కాదు కవిత్వానికి సంబంధించి సృజనాత్మక రచనలతోనూ ఎన్నో అవార్డ్లు అందుకుంది. తన కవిత్వం విషయానికి వస్తే అది ఆకాశపల్లకిలో ఊరేగదు. జ్ఞాపకాలను నెమరు వేసుకునేలా ఉంటుంది. గాయాలను గుర్తు తెచ్చుకునేలా ఉంటుంది. బూటకపు అభివృద్ధిని ప్రశ్నించేలా ఉంటుంది.జసింత మనోహర్‌పూర్‌లోని మిషినరీ బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న రోజుల్లో తల్లి పుష్ప అనిమ తండ్రి చేతిలో తరచు హింసకు గురయ్యేది. మరచి΄ోలేని ఆ హింసాత్మక దృశ్యాలు తన కవిత్వంలో కనిపిస్తాయి. వ్యక్తిగత చేదు అనుభవాలే కాదు అభివృద్ధి పేరుతో ఆదివాసీ గ్రామాల్లో జరుగుతున్న విధ్వంసం కూడా జసింత కవిత్వంలో కనిపిస్తుంది.జసింత కెర్కెట్టా జర్నలిస్ట్ మాత్రమే కాదు సోషల్ యాక్టివిస్ట్ కూడా. బాలికల విద్యకు సంబంధించి ఎన్నో ఆదివాíసీ గ్రామాల్లో పనిచేసింది. ఫోర్బ్స్ ఇండియా ‘టాప్ 20 సెల్ప్మేడ్ ఉమెన్’లో ఒకరిగా ఎంపిక అయింది.పిల్లల్లో సామాజిక చైతన్యం‘పిల్లలూ... మీరు ఎన్ని పువ్వుల గురించి విన్నారు? పూలన్నింటి గురించి తెలియనప్పుడు, కొన్ని పువ్వుల గురించి మాత్రమే తెలిసినప్పుడు... అవి మాత్రమే గొప్ప పుష్పాలూ, ప్రత్యేకమైన పుష్పాలూ ఎలా అవుతాయి? ఇవి మాత్రమే కాదు జిరాహుల్, జతంగి, సోనార్టి, సరాయ్, కోయినార్, సనాయ్ లాంటి ఎన్నో పూలు ఉన్నాయి’ అంటూ పది పువ్వుల గురించి జసింత కవిత్వం రాసింది. ఈ పువ్వుల గురించి ఎప్పుడూ వినని, ఎప్పుడూ చూడని పిల్లలు కూడా జసింత రాసిన కవిత్వం చదివి, పక్కన ఉన్న బొమ్మలు చూస్తే ఎక్కడ ఏ పువ్వు కనిపించినా ఇట్టే గుర్తు పట్టేస్తారు.ఈశ్వర్ ఔర్ బజార్, జసింతా కీ డైరీ, ల్యాండ్ ఆఫ్ ది రూట్స్‌తో సహా ఏడు పుస్తకాలు రాసింది. ‘జిర్హుల్’లో పువ్వుల ప్రపంచం కనిపించిన్పటికీ అది అణగారిన వర్గాల కోసం ప్రతీకాత్మకంగా రాసిన పుస్తకం. ఆదివాసీ సంస్కృతి ఆధారంగా చేసుకొని పిల్లల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని పెం΄పొందించడమే ఈ పుస్తక లక్ష్యం. గాజాలో పదహారువేల మందికి పైగా చిన్నారులు మరణించారు. నెత్తుటేరులు పారాయి. ఈ నేపథ్యంలో ‘రూమ్ టు రీడ్ యంగ్ రైటర్’ అవార్డ్‌ను జసింత తిరస్కరించింది. -
పిల్లల అరచేతులు, అరికాళ్లలో దురదలా..ప్రమాదకరమా?
సాధారణంగా పిల్లల్లో ఏవైనా ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు... మరీ ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చాక కొందరు చిన్నారుల్లో ఈ విధమైన లక్షణాలు కనిపి స్తుంటాయి. మొదట్లో అవి చాలా తీవ్రంగా కనిపించినా క్రమేపీ తగ్గిపోతాయి. ఇది చాలా సాధారణం. అలాగే ఎగ్జిమా వంటి మామూలు సమస్యలతో పాటు హైపర్కెరటోటిక్ పాల్మార్ ఎగ్జిమా, కెరటోలైసిస్ ఎక్స్ఫోలియేటా, ఎస్.ఎస్.ఎస్. సిండ్రోమ్, స్ట్రెస్ వంటి కొన్ని సిస్టమిక్ వ్యాధులు ఉన్నప్పుడూ, ఇక సోరియాసిస్, స్కార్లెట్ ఫీవర్లతోపాటు, కొన్నిసార్లు విటమిన్ లోపాలు... ఇలాంటి కారణాల వల్ల అరచేతుల్లో, అరికాళ్లలో దురదలు రావడంతో పాటు చర్మం పగలడం, ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.అంత ప్రమాదకరం కాదు గానీ... పైన పేర్కొన్న సోరియాసిస్ వంటివి మినహాయిస్తే ఇలా చర్మం ఉడి΄ోతూ కొత్త చర్మం వచ్చే ఎగ్జిమా వంటి వాటితపాటు... కొంతమంది చిన్నారుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక ఇలా అరచేతులు, అరికాళ్లలో సెకండరీ ఇన్ఫెక్షన్లాగా కూడా వచ్చే ‘పోస్ట్ వైరల్ ఎగ్జింథిమా’ అనే కండిషన్లు సాధారణంగా రెండు నుంచి మూడు వారాల్లో వాటంతట అవే పూర్తిగా తగ్గి΄ోతాయి. దాదాపుగా ఏమాత్రం ప్రమాదకరం కాదనే చెప్పవచ్చు.ఈ జాగ్రత్తలు పాటించాలి... ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు చేతులు తేమగా ఉంచుకోవడం (వెట్ సోక్స్), మాయిçశ్చరైజింగ్ క్రీమ్స్ రాయడం వంటివి చేయాలి. జింక్ బేస్డ్ క్రీమ్స్ రాయడం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. లక్షణాల తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ మోతాదు స్టెరాయిడ్స్ (మైల్డ్ స్టెరాయిడ్స్) వల్ల ఉపశమనం ΄÷ందవచ్చు. ఒకవేళ పైన పేర్కొన్న జాగ్రత్తల తర్వాత కూడా తగ్గక΄ోయినా, చేతులు, కాళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చినా, లక్షణాలు మరీ తీవ్రతరమవుతున్నా పీడియాట్రీషియన్ లేదా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. ∙ చిన్నారుల అరచేతులు, అరికాళ్లలో దురదలా? -
ట్రామ్ పోలిన్ పిల్లలాటతో ఫిట్‌గా..
కొన్నిపార్కుల్లోనూ, మాల్స్‌లోనూ పిల్లలకోసం కేటాయించిన వలయాకారపు ట్రామ్ పోలిన్లు చూసే ఉంటారు. ‘మనమూ అలా గెంతితే ఎంత బాగుంటుంది’ అనుకుంటారు పెద్దవాళ్లు. కానీ, శరీరం సహకరించదేమోనని సందేహిస్తారు. ఇప్పుడు పెద్దవాళ్ల కోసం గెంతుతూ సరదాగా వ్యాయామం చేసే ట్రాంపోలిన్ వాక్ అందుబాటులోకి వచ్చింది.పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ నగరాల్లోని ఫిట్నెస్ కేంద్రాలు వినోదానికి– వ్యాయామాలకు మధ్య ఉన్న విభజన రేఖను తొలగిస్తూ ఈ ట్రామ్ పోలిన్ పరికరాలను పరిచయం చేస్తున్నాయి. జిమ్‌లో రొటీన్‌గా వ్యాయామాలు చేయడం బోర్ అనిపిస్తే, ఈ వ్యాయామాలను ప్రయత్నించవచ్చు.అనేక ప్రయోజనాలు...⇒ ట్రామ్ పోలిన్పై గెంతడం వల్ల గంటకు 9 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తేంత ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ట్రామ్ పోలిన్ వర్కౌట్లు హృదయనాళాల పనితీరును బాగుచేయడంతోపాటు ఒత్తిడిని త్వరగా నివారిస్తాయి. ⇒ ‘ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది’అని ఢిల్లీకి చెందిన జుంబా శిక్షకుడు, ట్రామ్ పోలిన్ ఫిట్నెస్ కోచ్ ఆరుషి పస్రిజా తెలియజేస్తున్నారు.⇒ ట్రామ్ పోలిన్ మృదువైన ఉపరితలం రన్నింగ్ లేదా ఇతర భారీ వ్యాయామాలతోపోలిస్తే కీళ్లపై భారాన్ని తగ్గిస్తుందని వైద్యులు గమనించారు, ఇది తేలికపాటి కీళ్ల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ట్రామ్ పోలిన్ వ్యాయామాలు ఎముక ఆరోగ్యానికి, కండరాల బలోపేతానికి, సమతుల్యతకు సహకరిస్తాయి. ⇒ కదలికలు బాగా ఉండటం వల్ల త్వరగా కేలరీలు ఖర్చవుతాయి, బరువు తగ్గుతారు. హృదయ స్పందన రేటు పెరగడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.⇒ ‘జంపింగ్ ఎముక సాంద్రతను ప్రేరేపిస్తుంది, ఇది బోలు ఎముకల వ్యాధిని నిరోధించడంలో సహాయపడుతుంది‘ అని ఆర్థోపెడిక్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ యుగల్ తెలియజేశారు.మొదట్లోనే జంపింగ్‌లు వద్దు...ట్రామ్ పోలిన్ వర్కౌట్లలో స్క్వాట్ జంప్‌లు, జంపింగ్ జాక్స్, టక్ జంప్‌లు వంటి కఠినమైన కదలికలు కూడా ఉంటాయి. కానీ అదంతాప్రారంభ దశలో కాదు. పూర్తి శరీర వ్యాయామాలుగా మార్చడానికి వర్కౌట్స్, యోగా వంటి అనుకూలమైన వ్యాయామాలతో కలపాలి. ఈ వ్యాయామాలు చేయడానికి రెసిస్టెన్ ్స బ్యాండ్లను కూడా ఉపయోగించవచ్చు.ప్రమాదం.. నివారణఫిట్నెస్లో ట్రామ్ పోలిన్ను చేర్చాలనే ఆలోచన ఉత్తేజకరమైనదిగా అనిపించవచ్చు. అయితే గాయాలను నివారించడానికి జాగ్రత్త అవసరం. నేలపైన సరిగా సెట్ కాకపోతే ట్రామ్ పోలిన్ పడిపోవడం,పాదాలు బెణకడం, గాయాలకు దారితీయడం వంటివి. అందుకని నిపుణుల సూచనలు తీసుకొని, వీటి కొనుగోలులోనూ, ఉపయోగించడంలోనూ మెలకువలు తెలుసుకోవాలి. ⇒ ట్రామ్ పోలిన్పై ఉన్నప్పుడు ముందుగా మోకాళ్లను వంచి, శరీర బ్యాలెన్స్ చూసుకోవాలి. ⇒పరధ్యానంగా ఉండకూడదు. ట్రామ్ పోలిన్ పైకి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టీని గట్టిగా పట్టుకోవాలి. ⇒ ట్రామ్ పోలిన్ వ్యాయామాలు చేస్తున్నప్పుడు మంచి గ్రిప్ సాక్స్ లేదా షూ ధరించాలి. ⇒ నెమ్మదిగాప్రారంభించి, క్రమంగా తీవ్రతను పెంచాలి. ⇒ వారానికి 2–3 సార్లు చేసి, శరీర అనుకూలతను బట్టి వ్యవధిని పెంచుకోవచ్చు. సమస్యలు ఉంటే.. ఆస్టియోపొరోసిస్, కీళ్లనొప్పులు, వెన్ను లేదా మోకాలి సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్న వారు ఈ వ్యాయామాలను చేయకూడదు. గర్భిణులు, గుండె జబ్బులు ఉన్నవారు కూడా ముందుగా తమ వైద్యుడిని సంప్రదించాలి. తరచుగా కింద పడిపోయే వ్యక్తులు కూడా ఆలోచించాలి. వృద్ధులయితే తప్పకుండా ఇతరుల సాయం తీసుకోవాలి.డెస్క్ ఉద్యోగులకు మరింత ప్రయోజనండెస్క్ జాబ్‌లు చేసేవారికి ట్రాఅందరికీ ధన్యవాదాలు డెస్క్ జాబ్‌లు చేసేవారికి ట్రామ్ పోలిన్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ అద్భుతమైనది. ఈ వ్యాయామం వల్ల కడుపు, దిగువ శరీర కదలికలు మెరుగ్గా ఉంటాయి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే సమస్యలను అధిగమించడంలో ఈ వ్యాయామం సహాయపడుతుంది. అనేక కార్పొరేట్ కార్యాలయాలు తమ ఉద్యోగుల కోసం ట్రామ్ పోలిన్ వర్కౌట్ సెష¯న్లను నిర్వహించడం ప్రారంభించాయి. అయితే, పిల్లల పార్కుల్లో చూసే వాటికి పెద్దవారి ఫిట్నెస్ ట్రామ్ పోలిన్ భిన్నంగా ఉంటుంది. ఇంట్లోనే పెద్దవాళ్లు ఉపయోగించే ట్రామ్ పోన్లు సాధారణంగా చిన్నవిగా, దృఢంగా ఉంటాయి. ఇవి క్రీడా పరికరాలు దొరికే చోట, ఆన్లైన్ మార్కెట్లోనూ లభిస్తున్నాయి. అయితే, బరువును మోయగలిగే దృఢమైన ట్రామ్ పోన్లను ఎంచుకోవాలి. అదేవిధంగా ఫిట్నెస్ నిపుణుల సూచనలు ΄ాటించాలి. ఇందుకు ఆ¯న్‌లైన్ ట్రైనర్స్ సాయం కూడా తీసుకోవచ్చు. – ఆరుషి, ఫిట్నెస్ ట్రైనర్ -
‘హ్యాండ్ ఫుట్ మౌత్’తో చిన్నారులు ఉక్కిరిబిక్కిరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్నారులను సీజనల్ వ్యాధులైన జలుబు, జ్వరం, దగ్గు, డెంగీ, మలేరియా వంటివి అల్లాడిస్తున్నాయి. ఇప్పుడు వాటికి తోడు హ్యాండ్ ఫుట్ మౌత్ అనే వ్యాధి పిల్లలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాక్సీకీ అనే వైరస్ ద్వారా నెలల శిశువుల నుంచి ఆరేళ్ల వయసు గల చిన్నారుల వరకు ఎక్కువగా ఈ వ్యాధి వ్యాపిస్తోంది. చేతులు, కాళ్లు, నోటి మీద దద్దుర్లు, పొక్కులు, పుండ్లు వంటి వాటితో ఇబ్బంది పెడుతుంది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఈ వైరస్ ఔట్ బ్రేక్ ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. విజయవాడ, గుంటూరు, విశాఖ నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లోని చిన్నపిల్లల ఆస్పత్రులకు రోజూ కనీసం నాలుగు కేసులు ఇలాంటివి వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే, ఇది ప్రాణాంతక వ్యాధి కాదని, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు. ఇవీ వ్యాధి లక్షణాలు..» వ్యాధి సోకిన పిల్లల్లో చేతులు, కాళ్లు, ముఖం, నోటిలో ర్యాషస్, పుండ్లు, పొక్కులు రావడం వంటి లక్షణాలు ఉంటాయి. వీటితోపాటు కొందరిలో జ్వరం, జలుబు, గొంతు నొప్పి, నోటిలో మంట ఉంటుంది. » ఒకటి, రెండు రోజులకు కురుపులు మోకాళ్లు, మోచేతులు, పిరుదులపై కూడా కనిపిస్తాయి. » ర్యాషస్, పుండ్లు, పొక్కుల వల్ల దురద, మంటతోపాటు ఆహారం తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడతారు. » వైద్యులను సంప్రదించి మందులు వాడితే నాలుగు, ఐదు రోజుల్లో వ్యాధి అదుపులోకి వస్తుంది. కొన్ని సందర్భాల్లో వారం రోజులపాటు వ్యాధి లక్షణాలు ఉంటాయి.» వ్యాధిగ్రస్తుల మలం, లాలాజలం, దగ్గు, తుమ్ముల వల్ల వచ్చే తుంపర్లలోని వైరస్ నోటి ద్వారా కడుపులోకి ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అయితే, కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించలేక అలాగే పాఠశాలలకు పంపుతుండటంతో వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. లక్షణాలు ఉన్న పిల్లలను బయటకు పంపొద్దుహ్యాండ్ ఫుట్ మౌత్ ప్రాణాంతకమైన వ్యాధి కాదు. అయినప్పటికీ తల్లిదండ్రులు కొంత జాగ్రత్తగా ఉండాలి. నోటి తుంపర్ల ద్వారా వ్యాధి ఇతరులకు సోకుతుంది. వ్యాధి లక్షణాలు ఉన్న పిల్లలను తల్లిదండ్రులు పాఠశాలలకు పంపకుండా, వైద్యులను సంప్రదించి మందులు వాడాలి. జ్వరం, దగ్గు, జలుబు తగ్గడానికి పారాసెటమాల్ వంటి సాధారణ మందులు సరిపోతాయి. పొక్కులు, పుండ్లు మానడానికి ఆయింట్మెంట్స్ వాడాలి. చాలా అరుదుగా నిమోనియా పాంక్రియాటైటిస్, మెదడువాపు, జ్వరం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలా లక్షల్లో ఒకరికి వస్తుంది. – డాక్టర్ బి.రమేశ్‌కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, చిన్నపిల్లల విభాగం, గుంటూరు జీజీహెచ్ -
Video: కింగ్ కోబ్రాను చంపి పిల్లలను రక్షించిన పిట్ బుల్
పిట్‌బుల్ జాతికి చెందిన కుక్కలను ప్రమాదకరమైనవి పేర్కొంటారు. అనేకసార్లు మానవులపై ఇవి దాడికి పాల్పడటమే ఇందుకు కారణం. పెంచుతున్న యజమానులతో పాటు ఇతరులపై సైతం ఉన్నట్టుండి దాడి చేసి గాయపర్చుతుండటంతో వీటిని పెంచుకోవడంపై భారత్‌లో నిషేధం కూడా విధించారు. అయితే తాజాగా ఓ పిట్ బుల్ కుక్క.. అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా దాడి నుంచి చిన్నారుల ప్రాణాలను కాపాడింది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాన్సీలో జరిగింది. శివగణేష్ కాలనీలో ఇంటి ముందు తోటలో పనిమనిషి పిల్లలు ఆడుకుంటుండా ఒక్కసారిగా పాము ప్రవేశించింది. కోబ్రాను గుర్తించిన పిల్లలు సాయం కోసం కేకలు వేయడం ప్రారంభించారు. చిన్నారుల అరుపులు విన్న పిట్ బుల్ జెన్నీ.. వెంటనే దాన్ని కట్టేసిన తాడును తెంచుకొని వారిని రక్షించేందుకు వచ్చింది.కుక్క దాని దవడల మధ్య కింగ్ కోబ్రాను బంధించి ముప్పుతిప్పలు పెట్టింది. తలతో వేగంగా తప్పుతూ దాన్ని చంపేందుకు ప్రయత్నించింది. దాదాపు అయిదు నిమిషాలపాటు పాముతో పోరాడింది. చివరికి పామును వేగంగా కొట్టడం ద్వారా అది చనిపోయింది. पिटबुल ने बचाई बच्चों की जान: झाँसी के एक घर के गार्डन में बच्चे खेल रहे थे, तभी एक साँप आ गया और देखते ही देखते पिटबुल डॉग साँप से भिड़ गया। पिटबुल ने साँप को पटक पटक कर मार डाला।#Pitbull #Jhansi pic.twitter.com/fqB77XW3Q6— Aviral Singh (@aviralsingh15) September 25, 2024ఇక ఈ ఘటనపై జెన్నీ యజమాని పంజాబ్ సింగ్ మాట్లాడుతూ.. తమ పిట్ బుల్ పామును చంపి ప్రాణాలను రక్షించడం ఇది మొదటిసారి కాదని తెలిపారు. తమ ఇల్లు పొలాల మధ్య ఉండటం వల్ల తరచుగా పాములు వస్తుంటాయిని, అయితే జెన్నీ ఇప్పటివరకు ఎనిమిది నుంచి, పది పాములను చంపినట్లు ఆయన తెలిపారు. -
జన్మదాతా సుఖీభవ... కనిపెంచినవారిని కడుపులో పెట్టుకుని
వృద్ధాప్యం వచ్చాక తల్లిదండ్రులు పిల్లలు అవుతారు.కాని వారి కడుపున పుట్టిన పిల్లలు వారికి పూర్తిగా తల్లిదండ్రులుగా మారడంలో ఫలమవుతున్నారు.మనల్ని కని పెంచిన వారికి తల్లిదండ్రులుగా మారాల్సిన సందర్భం వచ్చాక పూర్తి సమయం, శ్రద్ధ ఇవ్వడంలో చాలామంది విఫలం అవుతున్నారు. కాని పెద్దల సంరక్షణ గొప్ప బాధ్యత. దాని గురించి మనల్ని మనం తీర్చిదిద్దుకోవాల్సిందే.ఏం చేయాలి?చిన్నప్పుడు మనం ‘అమ్మా.. యూనిఫామ్ ఎక్కడా’ అనడిగితే వృద్ధులయ్యాక మన తల్లిదండ్రులు ‘నాన్నా.. నా కళ్లద్దాలు ఎక్కడున్నాయో చూడు’ అంటారు. చిన్నప్పుడు మనం ‘అప్పచ్చి కావాలి’ అని మారాం చేస్తే వృద్ధులయ్యాక తల్లిదండ్రులు ‘కొన్ని అరటి పండ్లు తెచ్చి పెట్టు’ అని అడుగుతారు. మనం చిన్నగా ఉన్నప్పుడు వాళ్లు బజారుకు వెళ్లి మనకు కావలసినవన్నీ తెచ్చి పెడతారు. మనం పెద్దవాళ్లయ్యాక వాళ్లకు కావలసిన వాటిని తేవడానికి ‘టైమ్ లేదంటాం’, ‘వచ్చే నెల చూద్దాం’ అంటాం... ‘ఉన్నవాటితో సర్దుకో’ అంటాం. ఎన్నో అంటాం. ఎన్నో అంటే పడాల్సిన వారా వారు? తల్లిదండ్రులు. వయసు మళ్లిన మన జన్మదాతలు.రెండు రకాల పిల్లలువృద్ధులైన తల్లిదండ్రులను చూసుకునే పిల్లలు రెండు రకాలు. తమతో ఉంచుకుని చూసుకునేవారు, వేరే ఏరియా/ ఊరు/దేశంలో ఉంటూ చూసుకునేవారు. ఈ రెండు విధాల పిల్లలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినా సరే తల్లిదండ్రుల విషయంలో ఆ ఇబ్బందులను స్వీకరించి ముందుకు సాగాల్సిందే.ముందు చేయాల్సిన పని తల్లిదండ్రులను చూసుకోవాల్సిన వయసుకు వారు వచ్చి, నిస్సహాయస్థితికి చేరుకున్నాక పిల్లలు చేయాల్సిన పని వారి గత తప్పులు, ΄పొరపాట్లు అన్నీ మన్నించి ఇక వీరి అంతిమక్షణాల వరకు మనదే బాధ్యత అని సంకల్పం చెప్పుకోవడం. మనం చిన్నగా ఉన్నప్పుడు వారు అది చేయకపోవచ్చు, ఇది చేయకపోవచ్చు, మన కలలను భగ్నం చేసి ఉండొచ్చు... కాని ఇప్పుడు ఆపాత బాకీలు గుర్తు చేసి పేచీ పెట్టే సమయం కాదు. ఇక వారు చిన్నపిల్లలు అయిపోయారు. వారి మీద ప్రేమ మాత్రమే చూపగలం.దూరంగా ఉండి చూసుకోవాల్సిన వారు మొదట తమలో ఆ గిల్ట్‌ను తీసేయాలి. మీ భృతి కోసమో మరో కారణం కోసమో మీరు తల్లిదండ్రులతో ఉండే వీలు లేదు. ఆల్రైట్. కాని వారిని చూసుకోవడంలో మీకు నిజాయితీ ఉంటే చాలు. మీరు నిజాయితీగా ఏ మేరకు చూసుకోగలరో ఆ మేరకు చూసుకుంటున్నారని మీ తల్లిదండ్రులకు అర్థమైతే వారు ఇక ఫిర్యాదులు ఏమీ చేయరు.బంధాలు నిలబెట్టుకోవాలిదగ్గర ఉండి చూసుకుంటున్నా దూరంగా ఉన్నా రోజూ తల్లిదండ్రులతో మాట్లాడటం తప్పనిసరి. ఈ బంధం ఏమీ మారలేదు అనే భరోసా వారికి సగం బలాన్ని ఇస్తుంది. వీడియో కాల్స్ చేయడం, రోజువారీ ఫొటోలేమైనా పంపడం, మనవలు, మనవరాళ్లతో మాట్లాడించడం, కోడలు/అల్లుడు తప్పకుండా పలకరించేలా చూడటం... ఇవన్నీ పెద్దలకు బెంగ తీరుస్తాయి.వినోదంపెద్దలకు బోర్ కొట్టకుండా మంచి ఫోన్లు ఇచ్చి అవి ఎలా ఆపరేట్ చేయాలో నేర్పిస్తే వారు కాలక్షేపం చేస్తారు. టీవీలో ఓటీటీ చానల్స్ సబ్స్క్రయిబ్ చేసి వాటిని ఎలా చూడాలో నేర్పాలి. అంతే కాదు వారు ఉంటున్న ఏరియాలో వారి వయసు వారు నడిపే వాట్సప్ గ్రూపుల్లో చేరేలా చూడటం, వారి వయసు వారు ఎక్కడైనా కలుస్తూ ఉంటే వెళ్లి వచ్చే ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం.ఆ సమస్య వద్దుఒకరి కంటే ఎక్కువ సంతానం ఉంటే ఆ సంతానం మధ్య ΄పొర΄పొచ్చాలు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉన్నా తల్లిదండ్రుల దృష్టికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. తాము జీవించి ఉండగా తమ సంతానం కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండటం తల్లిదండ్రులకు క్షోభ. వారిని వీలైనంత సంతోషం పెట్టాలి. ముఖ్యమైన పండగలకు అందరూ కలుస్తూ ఉంటే అదే పెద్ద పెన్నిధి. పెద్దలు వారి జీవితంలో ఎన్నో మాటలు పడి ఉంటారు. ఇక పిల్లల నుంచి మాటలు పడే శక్తి ఉండదు. పెద్దలను మాటలతో బాధించ రాదు.పెద్దలు ఉండగా వారి విలువ తెలియదు. వారు లేనప్పుడు అదెంత పెద్ద లోటో తెలుస్తుంది. అందుకే వృద్ధులైన తల్లిదండ్రులకు ప్రతి సంతానం తల్లిదండ్రులుగా మారాలి. ఆ పసివాళ్లను ప్రేమగా చూసుకోవాలి.తల్లిదండ్రులతో ఉన్నవారైనా, తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చూసుకునేవారైనా తప్పనిసరిగా చేయాల్సిన పనులు⇒ వారికి హెల్త్ ఇన్సూరెన్సులు చేసి పెట్టడం ⇒ వ్యక్తిగత సహాయానికి, వైద్య సహాయానికి మనుషుల్ని ఏర్పాటు చేయడం ⇒ వారికి ఇష్టమైన వంటలు, ఆహారం తినే ఏర్పాటు చేయడం ⇒ రి ఎమర్జెన్సీ అవసరాలకు కాల్ చేయదగ్గ మనుషులున్నారని చెప్పడం⇒ ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా తగినన్ని డబ్బులు వారి ఆధీనంలో కూడా పెట్టడం⇒ ఆస్తి పత్రాలు, ఇతర డాక్యుమెంట్ల వంటివి వారి అనుమతితో సంరక్షించడం -
కోవిడ్ కక్కిన విషం.. స్వీట్ లిటిల్స్లో చేదు చక్కెర
కోవిడ్ తర్వాత పిల్లల్లో టైప్– 1 డయాబెటిస్ పెరిగే అవకాశం ఉందేమోనని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి పెద్దగా లక్షణాలు కనిపించకపోయినా ఇది జరిగేందుకు అవకాశముందనే పరిశోధకుల రిపోర్టులు ప్రముఖ మెడికల్ జర్నల్ ‘జామా’ (జర్నల్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్)లో ప్రచురితమయ్యాయి.పరిశోధకుల అధ్యయన ఫలితాల వివరాలివి... వైరస్ తాలూకు ప్రభావంతో చిన్నారుల సొంత వ్యాధి నిరోధక వ్యవస్థలోని కణాలు.. వారి క్లోమ (ప్యాంక్రియాస్) గ్రంథిలోని బీటా కణాలు దెబ్బతీయడం వల్ల పిల్లల్లో టైప్–1 డయాబెటిస్ వచ్చే ముప్పుందని పేర్కొంటున్నారు.అధ్యయన ఫలితాలు చెప్పేదేమిటంటే... జర్మనీలో ఫిబ్రవరి 2015 నుంచి అక్టోబరు 2023 వరకు అంటే దాదాపు ఎనిమిదేళ్ల పాటు పరిశోధకులు 509 మంది చిన్నారులపై ఓ సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. ఏడాది మొదలుకొని పదహారేళ్ల వయసున్న పిల్లల్లో మల్టిపుల్ ఐలెట్ యాంటీబాడీలనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తూ ఈ అధ్యయనం సాగింది. ఈ ‘మల్టిపుల్ ఐలెట్ యాంటీబాడీస్’ అనేవి ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను దెబ్బతీసే ్రపోటీన్లు. ప్యాంక్రియాస్‌ను అవి అలా దెబ్బతీయడంలో చిన్నారుల్లో అది టైప్–1 డయాబెటిస్‌కు కారణమవుతుంది. ఐలెట్ ఆటో యాంటీబాడీస్... ప్యాంక్రియాస్‌ను దెబ్బతీయడం జరిగితే ముందు లక్షణాలు కనిపించకపోయినప్పటికీ... తుదకు అది టైప్–1 డయాబెటిస్‌కు దారితీస్తుంది. ఈ తరహా పరిశోధనల అవసరమెందుకంటే... డయాబెటిస్ వ్యాధిలో రక్తంలో చక్కెరను నియంత్రించాల్సిన ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా జరగదు. లేదా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ దేహం దాన్ని సమర్థంగా ఉపయోగించుకోకపోవచ్చు. దాంతో రక్తంలో చక్కెర ఎక్కువవ్వడంతో తొలిదశల్లో బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించకుండా నిశ్శబ్దంగా దెబ్బతీసే చక్కెర వ్యాధిని ‘సైలెంట్ కిల్లర్’గా నిపుణులు చెబుతుంటారు. జీవనశైలి సమస్యల్లో ఒకటైన ఈ వ్యాధిని దురదృష్టవశాత్తూ పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. దాంతో అది దేహంలోని కీలకమైన అవయాలను... మరీ ముఖ్యంగా గుండె, రక్తనాళాలు, కళ్లు, మూత్రపిండాలు, నరాలను దెబ్బతీస్తుంది. అందువల్ల చిన్నపిల్లల్లో కనిపించే చక్కెరవ్యాధి (జువెనైల్ డయాబెటిస్) అని పిలిచిన ఈ వ్యాధి... ఇప్పుడు యువత పెద్దయ్యాకా వారిని ప్రభావితం చేస్తుండటంతో మనదేశ నిపుణులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూనే, పరిశోధనలపై ప్రత్యేకంగా దృష్టి్టపెడుతున్నారు.గట్ మైక్రోబియమ్ అసమతౌల్యత వల్ల... జీర్ణవ్యవస్థలో కోటానుకోట్ల మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుందనీ, ఈ సూక్ష్మజీవుల సమూహాన్నే ‘గట్ బ్యాక్టీరియా’ లేదా ‘గట్ మైక్రోబియమ్’ అంటారనీ, దీనివల్లనే ప్రతి ఒక్కరిలోని వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందన్నది చాలామందికి తెలిసిన విషయమే. ఏదైనా వైరస్ సోకాక... ఈ గట్ మైక్రోబియమ్లో మేలు చేసే బ్యాక్టీరియా సంఖ్య తగ్గి, కీడు చేసేవి పెరగడం వల్ల గట్ మైక్రోబియమ్ సమతౌల్యతలో మార్పుల వల్ల వ్యాధినిరోధక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని, బలహీనమవుతుంది. ఈ పరిణామం డయాబెటిస్, గుండెజబ్బుల వంటి అనేక దీర్ఘకాలిక (క్రానిక్) వ్యాధులకు కారణమవుతుంది.యాంటిజెన్స్కు ఎక్స్పోజ్ కానివ్వపోవడంతో... మునపటి తరంతో పోలిస్తే ఇటీవల పిల్లలను స్వాభావికమైన వాతావరణానికి ఎక్స్పోజ్ కానివ్వకుండా అత్యంత రక్షణాత్మకమైన రీతిలో తల్లిదండ్రులు వ్యవహరిస్తున్నారు. పిల్లలు ఆరుబయట ఆడుతూ, ్రపాకృతిక పర్యావరణానికీ, అందులోని కొన్ని వ్యాధికారకాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు చిన్నారుల్లో ఆ వ్యాధికారకాలను ఎదుర్కొనే యాంటిజెన్స్ ఉత్పన్నం అవుతాయి. కానీ తల్లిదండ్రుల అతిజాగ్రత్త కారణంగా వారు నేచురల్ ఎన్విరాన్మెంట్లో ఉండటం తగ్గిపోవడంతో కొన్ని రకాల హానికారక అంశాలకు యాంటిజెన్స్ ఉత్పాదన లేకుండా పోయి, సహజ రక్షణ కవచం ఏర్పడకుండా పోయింది. ఈ అంశం కూడా పిల్లల్లో సహజ రక్షణ వ్యవస్థను బలహీనం చేసిందనే అభి్రపాయం కూడా ఇంకొందరు నిపుణులనుంచి వ్యక్తమవుతోంది. అప్రమత్తంగా ఉండాల్సిందే... కనబడుతున్న తార్కాణాలను బట్టి, ప్రస్తుతానికి టైప్–1 డయాబెటిస్‌కు మందులేదనే వాస్తవానికి బట్టి రాబోయే భావితరాలను వ్యాధిగ్రస్తం కాకుండా చూసుకునేందుకు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. డయాబెటిస్ ఉన్న పిల్లల్లో కనిపించే కొన్ని లక్షణాలు ... 👉చాలా ఎక్కువ నీరు తాగుతూ ఉండటం; మాటిమాటికీ మూత్ర విసర్జనకు వెళ్తుండటం. 👉రాత్రిళ్లు నిద్రలో పక్కతడిపే అలవాటును మానేసిన పిల్లలు అకస్మాత్తుగా మళ్లీ పక్క తడపటం మొదలుపెట్టడం ∙బాగా ఆకలితో ఉండటం; మంచి ఆహారం తీసుకుంటున్నప్పటికీ బరువు తగ్గుతుండటం ∙చాలా తేలిగ్గా అలసిపోతుండటం, చాలా నిస్సత్తువగా, నీరసంగా ఉండటం ∙కొందరిలో చూపు మసగ్గా కనిపిస్తుండటం (బ్లర్డ్ విజన్) ∙జననేంద్రియాల దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్లు (క్యాండిడియాస్) వంటివి వస్తుండటం. ఈ లక్షణాలు కనిపించినప్పుడు పిల్లల్లో డయాబెటిస్‌ను వెంటనే గుర్తించి, వెంటనే ఇన్సులిన్‌తో వైద్యం మొదలుపెట్టకపోతే కొన్ని ప్రమాదకరమైన పరిణామాలు సంభవించవచ్చు.టైప్–1 డయాబెటిస్‌ను ఎదుర్కొనే తీరు(మేనేజింగ్ టైప్–1 డయాబెటిస్) పిల్లల్లో టైప్–1 డయాబెటిస్ కనిపించినప్పుడు కింద పేర్కొన్న ఆరు అంశాల ద్వారా దాన్ని మేనేజ్ చేయాలి. అవి... 1. ఇన్సులిన్ : డయాబెటిస్తో బాధపడే పిల్లల విషయంలో ప్రస్తుతానికి ఇన్సులిన్ ఇవ్వడం మాత్రమే అందుబాటులో ఉన్న చికిత్స. 2. పర్యవేక్షణ (మానిటరింగ్) : పిల్లల్లో కేవలం ఇన్సులిన్ ఇస్తుండటం మాత్రమే సరిపోదు. వారు తిన్న దాన్ని బట్టి ఎంత మోతాదులో ఇన్సులిన్ ఇస్తుండాలన్న అంశాన్ని నిత్యం పర్యవేక్షించుకుంటూ ఉండాలి. ఈ అంశాన్ని పిల్లలు ఎంత తిన్నారు, ఎలాంటి ఆహారం తీసుకున్నారు, దాని వల్ల రక్తంలో ఎంత గ్లూకోజ్ వెలువడుతుంది... వంటి అనేక అంశాలను పర్యవేక్షించుకుంటూ ఇన్సులిన్ ఇస్తుండాలి. 3. ఆహారం : కేవలం రక్తంలోని గ్లూకోజ్ పాళ్లను చూసుకుంటూ యాంత్రికంగా ఇన్సులిన్ ఇవ్వడం కాకుండా... పిల్లలు ఎదిగే వయసులో ఉంటారు కాబట్టి వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అనుగుణంగా ఆహారం ఉండేలా చూపుకోవాలి. ఆహారంలో తగిన పాళ్లలో పిండిపదార్ధాలను (కార్బోహైడ్రేట్స్) సమకూర్చే కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్), మాంసకృత్తులు (్రపోటీన్లు), ఆరోగ్యకరమైన కొవ్వుపదార్థాలు ఇస్తుండాలి. వీటిని పిల్లల వయసు, బరువు, రోజంతా చేసే శ్రమ వంటి అంశాల ఆధారంగా ఓ ప్రణాళిక రూ΄÷ందించి, దానికి అనుగుణంగా అవసరమైన మోతాదుల్లో ఇవ్వాలి. 4. శారీరక శ్రమ : ఈ రోజుల్లో చిన్నారులు ఆరుబయట ఆడుకోవడం చాలా తక్కువ. పిల్లలు ఒళ్లు అలిసేలా ఆడుకోవడం వల్ల వారి ఒంట్లోని చక్కెర మోతాదులు స్వాభావికంగానే నియంత్రితమయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పిల్లల్లో ఒళ్లు అలిసేలా ఆడుకోవడం చాలా అవసరం.5. గ్లూకోజ్‌ను పరీక్షించడం : పిల్లల రక్తంలో గ్లూకోజ్ మోతాదుల్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి. 6. కీటోన్ మోతాదుల కోసం మూత్రపరీక్ష : మూత్రంలో కీటోన్ మోతాదులను పరీక్షించడం కోసం తరచూ మూత్రపరీక్షలు చేయిస్తూ ఉండాలి. చిన్నారుల్లో పెరుగుతున్న కేసులు... కోవిడ్–19 ఇన్ఫెక్షన్ అన్నది ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్‌ను పెంచడం వల్ల ఆ అంశం ఈ వ్యాధిని ప్రేరేపిస్తోందంటున్నారు మరికొందరు నిపుణులు. ఇక జామా రిపోర్టును అనుసరించి, కోవిడ్–19 బారిన పడ్డ పిల్లల్లో ఇన్ఫెక్షన్ వచ్చిన ఆర్నెల్ల నుంచి ఏడాది కాలంలోనే టైప్–1 డయాబెటిస్ వచ్చే అవకాశాలు మామూలు పిల్లల కంటే 16% ఎక్కువ. మన దేశంలో నిర్దిష్టమైన గణాంకాలు లేకపోయినప్పటికీ... పాశ్చాత్య దేశాల అధ్యయనాల ప్రకారం చూస్తే కోవిడ్ (సార్స్–సీవోవీ2) ఇన్ఫెక్షన్ తర్వాత టైప్–1 డయాబెటిస్ కేసులు విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఎంటరోవైరస్, సైటో మెగాలో వైరస్, రుబెల్లా వైరస్లు ఎటాక్ అయ్యా కూడా టైప్–1 డయాబెటిస్ రావడం జరిగినట్లే... కోవిడ్19 విషయంలోనూ జరుగుతోందని మరికొందరు నిపుణుల అభి్రపాయం.కారణాలుటైప్–1 డయాబెటిస్‌కు జన్యుపరమైన కారణాలను ముఖ్యంగా చెప్పవచ్చు. దాంతోపాటు బాధితులు కొన్ని వైరస్‌లకు గురికావడం కూడా మరో ముఖ్యమైన అంశం. కోవిడ్–19 కూడా ఒక రకం వైరల్ ఇన్ఫెక్షన్ కావడం కూడా ఈ ముప్పును పెంచుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్మార్), 2022 నివేదిక ప్రకారం మన దేశంలో టైప్–1 డయాబెటిస్తో బాధపడుతున్న పిల్లల్లో దాదాపు 95,600 మంది 14 ఏళ్లలోపు చిన్నారులని తేలింది. -
‘అమ్మ’ అనే అబద్ధాన్ని నవ మాసాలు మోసింది
జనగామ: ఆమెకు పెళ్లయి మూడేళ్లు అయ్యింది. ఎంతకూ పిల్లలు పుట్టడం లేదు. అంతా ఏమనుకుంటారోనని తనలో తానే కుమిలిపోయింది. మానసికంగా కుంగిపోయింది. ఎలాగైనా ఈ అపవాదు నుంచి తప్పించుకోవాలనుకుంది. ఓ రోజు తాను గర్భం దాల్చినట్లు ఇంట్లో వారికి చెప్పింది. నమ్మకం కుదిరేలా కొద్దిరోజుల తర్వాత కడుపు చుట్టూ బట్టలు కట్టుకోవడం ప్రారంభించింది. నెలకోసారి ఆస్పత్రిలో చూపించుకుంటున్నట్టు కుటుంబసభ్యుల్ని నమ్మించింది. తొమ్మిది నెలలు అలాగే నెట్టుకొచ్చింది. చివరికి ప్రసవం కోసం అంటూ ఆస్పత్రికి వచ్చి శిశువు టాయ్లెట్లో జారి పోయిందని విలపిస్తూ చెప్పింది. అలా బయట పడదామని అనుకుంది. కానీ అంతా పరిశీలించిన వైద్యులు, సిబ్బంది చివరకు అదంతా ఉత్తదేనని తేల్చారు. ఈ విచిత్ర ఘటన బుధవారం జనగామ ఎంసీహెచ్‌లో జరిగింది. నెలనెలా ఆస్పత్రికెళుతున్నానంటూ.. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని ఓ తండాకు చెందిన మహిళ.. గత ఏడాది డిసెంబర్లో జనగామ చంపక్ హిల్స్ మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి (ఎంసీహెచ్) ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం అంటూ వచ్చింది. వైద్యులు పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. తర్వాత గత జూలైలో మరోసారి ఆస్పత్రికి వచి్చంది. గర్భవతినని చెప్పడంతో గైనిక్ వైద్యులు హార్ట్ బీట్, స్కానింగ్ తదితర పరీక్షలు చేసుకుని రావాలని సూచించగా వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. కానీ ఇంట్లో వారికి నెలనెలా పరీక్షల కోసం ఎంసీహెచ్‌కు వెళుతున్నట్టు చెప్పేది. బుధవారం డెలివరీ డేట్ అని చెప్పి కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రికి వచ్చింది. గైనిక్ డాక్టర్ ఆమెను పరీక్షించే సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లొస్తానని చెప్పి వెళ్లింది. ఇరవై నిమిషాల తర్వాత బోరున విలపిస్తూ బయటకు వచ్చింది. మూత్ర విసర్జన చేస్తుండగా శిశువు టాయ్లెట్లోకి జారి పోయిందని చెప్పింది. వెంటనే వైద్యులు, సిబ్బంది అప్రమత్తమై టాయ్‌లెట్‌ను పరిశీలించారు. ఎలాంటి రక్తపు మరకలు కన్పించలేదు. దీంతో టాయ్‌లెట్‌కు అనుబంధంగా ఉన్న డ్రైనేజీ పైపులైన్లను పరిశీలించారు.శిశువు జాడ లేకపోవడంతో అనుమానం వచ్చిన డాక్టర్లు మహిళను ప్రశ్నించారు. స్కానింగ్ రిపోర్టు ఏదంటూ గట్టిగా నిలదీశారు. దీంతో తనకు గర్భం రాలేదని, ఎంతకూ పిల్లలు పుట్టకపోవడంతో ఇలా చేశానంటూ ఆ మహిళ చెప్పింది. అయితే అప్పటికే ఆ మహిళ కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి రావడంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. అన్ని పరీక్షలూ చేసి ఆమె గర్భం ధరించలేదని, అంతా ఉత్తదేనని నిర్ధారించారు. సదరు మహిళతో పాటు భర్తను సఖి కేంద్రానికి తరలించగా సిబ్బంది కౌన్సెలింగ్ ఇచ్చారు. దీనిపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని సీఐ దామోదర్‌రెడ్డి తెలిపారు. పిల్లలు పుట్టడం లేదనే బాధతో, అమాయకత్వంతో ఆ మహిళ అలా చేసిందని వైద్యులు వ్యాఖ్యానించారు. -
విడాకుల తరువాత పిల్లలకు తండ్రి ఆస్తిలో వాటా వస్తుందా?
పెళ్లయినప్పటినుంచి భర్త వేధింపులు తప్పడం లేదు. పిల్లలు పుట్టి వాళ్లు కాస్త పెద్దవాళ్లయినా మారలేదు సరి కదా, ఇంకా ఎక్కువైంది. ఇంక భరించలేక విడిపోతున్నాను. నాకు, నా పిల్లలకు ఆస్తిలో వాటా వస్తుందా? – పి. అనిత, నెల్లూరుసాధారణంగా స్థిరాస్తులు ఎవరి పేరుతో అయితే ఉంటాయో వారికి మాత్రమే చెందుతాయి వారి స్వార్జితం కిందనే పరిగణించ బడతాయి. కానీ అన్నివేళలా అదే నియమం వర్తించదు. భార్యకు భర్త ఆస్తిలో హక్కు ఉందా లేదా అనే అంశం భర్త మతాచారంపై ఆధారపడి ఉంటుంది. హిందువులకు వర్తించే చట్టాల ప్రకారం మీ భర్త పేరిట ఉన్న ఆస్తి వారసత్వం ద్వారా సంక్రమించింది అయితే గనక అందులో మీ పిల్లలకు పూర్తి హక్కు ఉంటుంది. మీ పిల్లలు మైనర్లు అయితే వారి తరఫున మీరు సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు. మీ పిల్లలకి వారి వాటా వారికి దక్కుతుంది. అదే మీ భర్త స్వార్జితం అయితే మాత్రం తన తదనంతరం వీలునామా ప్రకారం, వీలునామా లేని పక్షంలో హిందూ వారసత్వ చట్టం ప్రకారం లేదా భర్త జీవితకాలంలో స్వయంగా ఇవ్వాలి అని తలిస్తే మాత్రమే భార్యకి హక్కులు ఉంటాయి.మరో విషయం... భార్యకు తన జీవితకాలం మొత్తం భర్త ఇంట్లో ఉండే హక్కు ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్ లేదా విడాకులు తీసుకునే సమయంలో భర్త ఆస్తిలో భార్యకు వాటా వచ్చే అవకాశం ఉంది. ఎంత శాతం వాటా ఇవ్వాలి అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. హిందూ లా, ముస్లిం లా, క్రిష్టియన్ లా, ఇలా వేర్వేరు మతస్తులకు వేరే విధమైన హక్కులు ఉంటాయి.మీరు భర్త వేధింపులు తట్టుకోలేక విడి΄ోతున్నాను అని చె΄్పారు కాబట్టి, డీ.వీ.సీ. చట్టం (గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం, 2005) కింద కేసు వేసినట్లయితే, అందులో అనేక రకాల హక్కులను, ఉపశమనాలను పొందవచ్చు. కేసు తేలేంతవరకు మీ భర్త ఆస్తులను అమ్మకుండా కోర్టు వారు స్టే విధించే అవకాశం కూడా ఉంది. డీ.వీ.సీ. చట్టం సెక్షన్ 22 ప్రకారం అదనపు దరఖాస్తు చేసుకుంటే, మీరు కోరిన ఉపశమనాలతో పాటు మానసిక హింస, మానసిక క్షోభతో సహా మీకు కలిగిన గాయాలకు కూడా నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించవచ్చు. డీ.వీ.సీ. చట్టం ప్రకారం భర్త ఆస్తి పై కేసు వేసే వీలుందా లేదా అన్నది ప్రతి కేసులోనూ విభిన్నంగా ఉంటుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న లాయర్ని సంప్రదిస్తే మంచిది.– శ్రీకాంత్ చింతల , హైకోర్టు న్యాయవాది -
16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బంద్ !
మెల్బోర్న్: 16 ఏళ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాల వినియోగంపై నిషేధం విధిస్తామని ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. పిల్లలను ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి వేరు చేసి మైదానాల్లోకి తీసుకొస్తామని వ్యాఖ్యానించారు. పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడానికి ఫెడరల్ చట్టాన్ని ఈ సంవత్సరం ప్రవేశపెడతామని చెప్పారు. వచ్చే మేలోపు తాము గెలిస్తే 16 ఏళ్లలోపు చిన్నారులు సోషల్‌మీడియా వాడకుండా నిషేధం విధిస్తామని విపక్షపార్టీ వాగ్దానం చేయడంతో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. యువతపై వెబ్సైట్ల ప్రభావాన్ని ‘విపత్తు’గా ప్రధాని అభివర్ణించారు. ‘‘ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, టిక్‌టాక్ వంటి సామాజిక మాధ్యమాల్లోకి లాగిన్ కావడానికి పిల్లలకు ప్రస్తుతానికైతే ఎలాంటి వయసు పరిమితి లేకపోయినప్పటికీ త్వరలోనే 16 ఏళ్లను పరిమితిగా విధించే వీలుంది. 16 ఏళ్లలోపు యూజర్లను బ్లాక్ చేస్తాం. త్వరలో వయస్సు నిర్ధారణ ట్రయల్స్ నిర్వహిస్తాం. గాడ్జెట్లు వదిలి పిల్లలు క్రీడా ప్రాంగణాల్లో పరుగులు తీయాలి. ఈతకొలనుల్లో ఈత కొట్టాలి. టెన్నిస్ కోర్టులకు వెళ్లాలి. వారు వర్చువల్‌గా కాకుండా నిజమైన వ్యక్తులతో నిజమైన అనుబంధాలను కలిగి ఉండాలి. సోషల్ మీడియా వల్ల వస్తున్న ఆన్లైన్ బెదిరింపులు, హానికరమైన విషయాల నుంచి పిల్లలను దూరం చేయొచ్చని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. సోషల్ మీడియా సంస్థలు తాము అందరికన్నా అతీతులమని భావిస్తున్నాయి. వారికి సామాజిక బాధ్యతను గుర్తుచేస్తాం’’అని ప్రధాని అన్నా రు. ప్రభుత్వం ప్రతిపాదించిన వయోపరిమితికి తాము మద్దతిస్తామని ఆస్ట్రేలియా కన్జర్వేటివ్ ప్రతిపక్ష నేత పీటర్ డాటన్ తెలిపారు. సరైన పరిష్కారం కాదంటున్న నిపుణులు.. సామాజిక మాధ్యమాల్లో వయో పరిమితి విధించడం సమస్యకు పరిష్కారం కాదేమోనంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వ ప్రణాళిక నిర్లక్ష్యపూరితంగా ఉందని క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ డేనియల్ ఆంగస్ అన్నారు. ‘‘ఈ చర్య ప్రజాస్వామ్య మూల సూత్రాలను బలహీనపరుస్తుంది. డిజిటల్ ప్రపంచంలో కొత్తతరం అర్థవంతమైన, ఆరోగ్యకరమైన భాగస్వామ్యాన్ని హరించడం హానికరం. వారిని సమాజంతో సంబంధాల నుంచి దూరం చేస్తుంది’’అని అన్నారు. ఇలాంటి నిషేధాలను పూర్తి పారదర్శకంగా అమలు చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉందో లేదో స్పష్టంగా తెలియదని మెల్బోర్న్ విశ్వవిద్యాలయం కంప్యూటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ టోబీ ముర్రే అన్నారు. -
అద్దె ఇల్లు.. ఆరుబయటనే శవం
ఇబ్రహీంపట్నం: మూఢనమ్మకాలు ఇప్పటికీ ప్రజల మెదళ్లను శాసిస్తూనే ఉన్నాయి. నిన్నమొన్నటి వరకూ ఆ ఇంటి పరిసరాల్లోనే ఆడుకుంటూ ఉన్న ఆ బాలుడు.. మాయదారి వరద కారణంగా విషజ్వరానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబం అద్దెకుంటున్న ఇంటి యజమాని ఆ బాలుడి మృతదేహాన్ని ఇంట్లోకి రానీయకుండా అడ్డుకున్నాడు. దీంతో బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు చేసేది లేక జాతీయ రహదారి పక్కనే ఓ టెంటు వేసి ఆ బాలుడి మృతదేహాన్ని ఉంచాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన ఇబ్రహీంపట్నం మండలంలోని ప్రసాద్‌నగర్‌లో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. విషజ్వరంతో.. కూలి చేసుకునే పాలపర్తి రాజేష్, రూతు దంపతులకు ఇద్దరు కుమారులు. జెడ్పీ పాఠశాలలో పెద్ద కుమారుడు ఏడో తరగతి, చిన్న కుమారుడు జాన్ వెస్లీ(12) ఆరో తరగతి చదువుతున్నాడు. ఇటీవల కాలంలో ప్రసాద్‌నగర్ వరద ముంపునకు గురికావడంతో పారిశుద్ధ్యలేమి, కలుషిత తాగునీరు, అందుబాటులో లేని వైద్య సదుపాయం వల్ల కొద్ది రోజుల క్రితం బాలుడు జాన్‌వెస్లీ జ్వరం బారిన పడ్డాడు. స్థానిక ఆర్ఎంపీ వైద్యుడితో వైద్యం చేయించారు. మరలా కడుపులో నొప్పి రావడంతో రెండురోజుల క్రితం మరో ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. వారు మెడికల్ టెస్ట్‌లు రాయగా.. తల్లిదండ్రుల వద్ద డబ్బులు లేక చేయించలేదు. దీంతో కడుపులో నొప్పి భరించలేక బాలుడు మృత్యువాత పడ్డాడని తల్లిదంద్రులు చెబుతున్నారు. మంటగలసిన మానవత్వం.. వారు ఉంటున్నది అద్దె ఇల్లు కావడంతో ఆ యజమాని బాలుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని చెప్పారు. దీంతో 65వ నంబర్ జాతీయ రహదారి పక్కనే టెంట్‌వేసి బంధువుల కడసారి చూపుకోసం ఉంచారు. ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ బాలుడి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అరి్పంచారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. -
మళ్లీ తోడేలు దాడి.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
బహ్రయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్ జిల్లాలోని 35 గ్రామాలు నరమాంస భక్షక తోడేళ్ల దాడులతో వణికిపోతున్నాయి. ప్రతిరోజూ తోడేళ్ల దాడులకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి ఇద్దరు చిన్నారులపై నరమాంస భక్షక తోడేలు దాడి చేసింది.ఈ ఘటన బహ్రయిచ్‌లోని మహసీ ప్రాంతంలోని గిర్ధర్ పూర్వా గ్రామంలో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి నరమాంస భక్షక తోడేలు ఇద్దరు పిల్లలపై దాడి చేసింది. ఈ ఘటనలో ఒక చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. మరో బాలిక గాయపడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతోంది.ఐదేళ్ల బాలిక తన అమ్మమ్మతో కలిసి ఇంట్లో మంచంపై నిద్రిస్తోంది. రాత్రి 12 గంటల సమయంలో తోడేలు ఆమెపై దాడి చేయడంతో ఆమె కేకలు వేసింది. దీంతో ఆ తోడేలు అక్కడి నుంచి పారిపోయి, మరో ఇంట్లోని చిన్నారిపై దాడి చేసింది. ఆ చిన్నారి కూడా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ఘటన మహసీ తహసీల్ ప్రాంతంలోని పాంధుయా గ్రామంలో చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా రాత్రివేళ నరమాంస భక్షక తోడేళ్లు దాడులకు దిగుతున్నాయి. -
హైదరాబాద్: ఇద్దరు పిల్లలను చంపి.. దంపతుల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్లలో విషాదం చోటుచేసుకుంది. గాజుల రామారంలోని ఓ అపార్ట్మెంట్లో ఇద్దరు పిల్లలను చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.మృతులను భార్యాభర్తలు వెంకటేష్, వర్షిణి, వారి పిల్లలు విహంత్, రిషికాంత్లుగా గుర్తించారు. వీరి స్వస్థలం మంచిర్యాల. ఆర్థిక ఇబ్బందులతోనే దంపతులు తమ పిల్లలను చంపి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు నిర్థారించారు. -
పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతోంటే ఏం చేయాలి?
చిన్నారులు నిద్రలో పళ్లు కొరుకుతున్నారంటే అది వారిలో అంతర్గతంగా ఉన్న ఆందోళన, టెన్షన్, ఒత్తిడి కారణం వల్ల కావచ్చు. ఇలా నిద్రలో పళ్లు కొరికే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘బ్రక్సిజమ్’ అంటారు. పిల్లల్లో ఇది చాలా సాధారణంగా కనిపించడంతో పాటు వారి మెుదటి ఐదేళ్ల వ్యవధిలో మెుదలయ్యే సమస్య ఇది. సాధారణంగా చిన్నారుల్లో ఆందోళన, కోపం, వ్యాకులత, కంగారు, తొందరపాటుతో ఉండటం, పోటీ తత్వంతో వ్యవహరించడం వంటివి ఉన్నప్పుడు ఈ బ్రక్సిజమ్ సమస్య వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ సమస్యను అధిగమించాలంటే ముందుగా వాళ్లలో ఆందోళన, వ్యాకులతకు కారణమయ్యే అంశాలేమిటో తెలుసుకుని, దాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి. నిద్రకు వుుందు వాళ్లు సంతోషంగా, ఆహ్లాదంగా ఉండేలా తల్లిదండ్రులు చూడాలి. పిల్లలతో మాట్లాడుతూ వారి మనసుల్లో ఉన్న భయాలు, శంకలు తొలగించేలా వ్యవహరించాలి. అలాగే పిల్లలు నిద్రకుపక్రమించే సమయంలో కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు (కాఫీ, చాక్లెట్లు వంటివి) ఇవ్వకూడదు. సమస్య మరీ ఎక్కువగా ఉంటే నోట్లో అమర్చే మౌత్గార్డ్స్, మౌత్పీసెస్తో కొంత ఉపయోగం ఉంటుంది. ఈ సమస్య వల్ల కొన్నిసార్లు డెంటల్ సమస్యలు – మాల్ అక్లూజన్, పళ్లు వదులు కావడం (లూజెనింగ్), పళ్లు ఊడిపోవడం, దవడ ఎముక జాయింట్ (టెంపోరో మాంబడి బులార్ జాయింట్) సమస్యలు కూడా రావచ్చు. అలాంటి సందర్భాల్లో దంతవైద్య నిపుణులను సంప్రదించాలి. -
చిన్నారుల్లో కోపం స్మార్ట్ గాడ్జెట్స్ ప్రభావం..
సాక్షి, అమరావతి: స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ వాడకం చిన్నారుల్లో ప్రతికూల భావోద్వేగాలను పెంచుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఎల్రక్టానిక్ పరికరాలు వాడే ప్రీ స్కూల్ చిన్నారుల్లో చిరాకు, కోపం ఎక్కువగా కనిపిస్తోందని గుర్తించారు. కెనడా లోని షెర్‌బ్రూక్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం.. స్మార్ట్ ఫోన్ వాడకం చిన్నారుల్లో స్వీయ నియంత్రణ, నైపుణ్యాల అభివృద్ధికి అవరోధం ఏర్పడుతోంది. మూడున్నరేళ్లు, నాలుగున్నరేళ్ల వయసు నుంచి టాబ్లెట్‌కు అలవాటుపడ్డ చిన్నారుల భావోద్వేగాలను పరిశీలించారు. ఇలాంటి చిన్నారుల్లో ఏడాది తర్వాత కోపం, నిరాశ విపరీతంగా పెరిగినట్టు గుర్తించారు. చిన్నారులు సొంత ప్రతికూల భావోద్వేగాలను నేర్చుకునే విధానం సాంకేతిక పరికరాల ద్వారా జరుగుతుండటం శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సంరక్షకుల పర్యవేక్షణలో బాల్య వికాసం జరిగితేనే.. సరైన భావోద్వేగం ప్రదర్శిస్తారని చెబుతున్నారు. ప్రతి ఇంట్లో చిన్నారుల అల్లరిని కట్టడి చేసేందుకు, ఏడుపును అదుపు చేసేందుకు స్మార్ట్ ఫోన్ అలవాటు చేయడం సరైన పద్ధతి కాదని అధ్యయనం చెబుతోంది. ఇది బాల్యం, యుక్తవయసులో చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందంటున్నారు. యునిసెఫ్ సైతం యునిసెఫ్ సైతం చిన్నారుల స్క్రీనింగ్ అలవాట్లను తీవ్రంగా తప్పుపడుతోంది. ఏడాది కంటే తక్కువ వయసున్న పిల్లలు ఎటువంటి సాంకేతిక పరికరాల నుంచి ఏమీ నేర్చుకోలేరని చెబుతోంది. వారికి స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు చూపించడం ద్వారా మెదడుపై ప్రతికూల ప్రభావం గురించి యునిసెఫ్ వైద్య బృందం సైతం హెచ్చరిస్తోంది. ఆఫ్–్రస్కీన్ అనుభవాలను అందించడం ద్వారా క్లిష్టమైన వాటిని కూడా చిన్నారులు నేర్చుకోవడంతో పాటు సామాజిక, అభిజ్ఞా నైపుణ్యాలు మెరుగుపడతాయని చెబుతున్నారు. చిన్నారుల్లో మెదడు బాహ్య ప్రపంచం నుంచి గ్రహించిన వాటితోనే అభివృద్ధి చెందుతుందని, కథలు వినడం, పుస్తకాలను బిగ్గరగా చదవడం, చిత్రాలను గుర్తించడం ద్వారా ప్రేరణ పెరుగుతోందని వైద్యులు నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు స్క్రీన్ సమయం ఇవ్వకూడదని, నాలుగేళ్ల లోపు చిన్నారులకు పాఠ్యాంశాల పరమైన వాటికి, గంటలోపు మాత్రమే స్క్రీనింగ్‌కు కేటాయించాలని సూచిస్తోంది. తాజా పరిశోధనలో 75 నిమిషాలు, అంతకంటే ఎక్కువ రోజువారీ స్క్రీన్ సమయం ఉండటం గమనార్హం. స్క్రీనింగ్‌తో అనారోగ్యం మన ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ల స్క్రీన్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. స్క్రీన్ సమయంలో కదలకుండా ఒకేచోట కూర్చోవడంతో బరువు పెరగడం, ఊబకాయం సమస్యలు తలెత్తున్నాయి. ఇది యుక్త వయసు వచ్చేసరికి మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్, చిత్త వైకల్యానికి దారితీస్తున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలతో పాటు మాట్లాడే పదాలను తక్కువగా నేర్చుకోవడంతో పాటు డిప్రెషన్ ప్రమాదాన్ని మూడు రెట్లు పెంచుతాయని అధ్యయనంలో పాల్గొన్న వైద్యులు చెబుతున్నారు. -
Pakistan: బాంబు పేలి ఇద్దరు చిన్నారులు మృతి
పాకిస్తాన్లో నిత్యం ఏదో ఒక అలజడి చోటుచేసుకున్నదనే వార్లలను వింటుంటాం. తాజాగా పాక్‌లోని బలూచిస్థాన్ బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. పిషిన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాంబు పేలుడుకు స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు పోలీసులతో సహా 16 మంది గాయపడ్డారు.పిషిన్ జిల్లాలోని సుర్ఖబ్ చౌక్ సమీపంలోని ప్రధాన మార్కెట్లో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఇటీవల బలూచిస్థాన్‌లోని పోలీసు స్టేషన్లపై దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మూడు పోలీసు వాహనాలు దెబ్బతిన్నాయి. యాంటీ టెర్రరిజం డిపార్ట్మెంట్, బాంబ్ స్క్వాడ్ విచారణ జరిపి కొన్ని ముఖ్యమైన ఆధారాలను సేకరించింది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని సీలు చేశారు.తాజా ఘటనలో గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన గురించి తెలుసుకున్న పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ దీనిని ఖండించారు. చిన్నారులు, అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
రాష్ట్రాన్ని చుట్టుముట్టిన రోగాలు రాలిపోతున్న ప్రాణాలు
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం అచ్చబా గ్రామానికి చెందిన గిరిజన బాలిక బిడ్డిక రషి్మత(8) మలేరియాతో గత నెల 6వతేదీన మృత్యువాత పడింది. జూన్ 22న సరుబుజ్జిలి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చేరిన ఈ చిన్నారి నాలుగు రోజుల అనంతరం జ్వరం బారిన పడింది. పీహెచ్సీలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో మలేరియా పాజిటివ్‌గా తేలడంతో శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. రషి్మతతో పాటు మరికొందరు బాలికలు కూడా మలేరియా బారినపడ్డారు. గత నెలలో సీతంపేట ఏరియా ఆస్పత్రికి రెండు రోజుల వ్యవధిలో 30 మంది పిల్లలు జ్వరాలతో రాగా 15 మందికి మలేరియా నిర్ధారణ అయింది. పాడేరు మండలం దేవాపురంలో కె.రత్నామణి(37) గత నెల పాడేరు ప్రభుత్వాస్పత్రిలో మలేరియాకు చికిత్స పొందుతూ మృతి చెందింది. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్యం అధ్వానంగా మారడంతోపాటు అంటురోగాలు, విష జ్వరాలు విలయ తాండవం చేస్తున్నా సర్కారు మొద్దునిద్ర వీడటం లేదు. ప్రజారోగ్య విభాగం పడకేసింది. తాగునీటిని సరిగా క్లోరినేషన్ చేయకపోవడంతో జూన్, జూలైలో డయేరియా ప్రబలగా, ఇప్పుడు డెంగీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఉత్తరాంధ్ర, గిరిజన ప్రాంతాల్లో ఏ ఇంట్లో చూసినా మంచం పట్టినవారే కనిపిస్తున్నారు. అనారోగ్య పీడితులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. మలేరియా, డెంగీ, డయేరియా, విష జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధులను నియంత్రించి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఇక జ్వరాల బాధితుల్లో వింత లక్షణాలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. డెంగీ నెగిటివ్ అని వచి్చనప్పటికీ కొంతమందిలో ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. యంత్రాంగం ద్వారా ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వేలు నిర్వహించి కొత్త రకం వైరల్ జ్వరాలు, వైరస్ల వ్యాప్తిౖò³ ప్రజలను జాగృతం చేయాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మృత్యు ఘంటిక మోగిస్తున్న డెంగీ ఈ ఏడాది ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకుపైగా మలేరియా కేసులు, 2 వేలకుపైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకున్నాయి. గత సోమవారం విశాఖ కేజీహెచ్‌లో ఎనిమిదేళ్ల బాలిక డెంగీతో మరణించింది. గుంటూరు జిల్లా సిరిపురం గ్రామానికి చెందిన 28 ఏళ్ల మహిళ డెంగీకి చికిత్స పొందుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో మృత్యువాత పడింది. గత వారం బాపట్ల జిల్లా ముత్తాయపాలెంలో డెంగీ లక్షణాలతో ఓ అంగన్వాడీ కార్యకర్త చనిపోగా చిత్తూరు జిల్లా మేలుపట్ల గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఏడో తరగతి బాలిక ఈ నెలలోనే కన్ను మూసింది. ఇక రాష్ట్రంలో నమోదైన మలేరియా కేసుల్లో అధిక శాతం ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోనే ఉన్నాయి. గత నెల 15వతేదీ నుంచి 28 మధ్య రెండు వారాల్లో ఏఎస్ఆర్ జిల్లాలో అత్యధికంగా 260, పార్వతీపురం మన్యంలో 178 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా బాధితుల్లో చిన్నారులే ఎక్కువగా ఉంటున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో జనరల్ ఓపీల్లో మూడో వంతు జ్వర బాధితులే ఉన్నారు. పాడేరు ప్రభుత్వాస్పత్రి కిక్కిరిసిపోతోంది. రోజుకు 400 వరకూ ఓపీలు నమోదవుతుండగా మలేరియా, డెంగీ, విష జ్వరాల కేసులు అధికంగా ఉంటున్నాయి. కొత్త రకం వైరస్ వ్యాప్తి వైరల్ జ్వరాల్లో కొత్త లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. బాధితుల శరీర ఉష్ణోగ్రత 103, 104 వరకూ వెళుతోంది. వికారం, కీళ్లు, ఒంటి నొప్పులు, నీరసం, ఆకలి మందగించడం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, కాళ్లు, చేతులు వాపులు, ఒంటిపై ఎర్రటి దద్దుర్లు, కళ్ల మంట లాంటి లక్షణాలు వారం నుంచి 10 రోజులు ఉంటున్నాయి. ప్లేట్లెట్స్ 30 వేల వరకూ పడిపోతున్నాయి. బాధితులు తీవ్ర నొప్పులతో మంచం నుంచి లేవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. డెంగీ అనుమానంతో పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ కనిపిస్తోంది. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే మిగిలిన కుటుంబ సభ్యులకు సోకుతోంది. దీంతో కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. డయేరియా విలయతాండవం గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. తాగునీటిని సరిగా క్లోరినేషన్ చేయడం లేదు. దీంతో జూన్, జూలైలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 56 చోట్ల డయేరియా ప్రబలింది. ఈ ఏడాది జూన్‌లో జగ్గయ్యపేట నుంచి డయేరియా విజృంభణ మొదలైంది. జగ్గయ్యపేట, వత్సవాయి ప్రాంతాల్లో 107 మంది డయేరియా బారినపడగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. అదే నెలలో తిరుపతి జిల్లా కాట్రపల్లిలో డయేరియాతో రెండేళ్ల చిన్నారి కన్నుమూయగా గత నెలలో కర్నూలు జిల్లా సుంకేశ్వరిలో నాలుగేళ్ల చిన్నారిని మత్యువు కబళించింది. ఇక పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో కలుషిత నీటి సరఫరా కారణంగా ఏకంగా 250 మందికి డయేరియా సోకగా ఏడుగురు మృతి చెందారు. మంత్రి నారాయణ సమీక్షలు నిర్వహించినా పారిశుద్ధ్య నిర్వహణలో మాత్రం మార్పు రాలేదు. ‘దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను డ్రోన్ల ద్వారా గుర్తించి డ్రోన్ల ద్వారానే మందు పిచికారీ చేసి వాటిని చంపేసే వ్యవస్థను తెస్తాం. సీజనల్ వ్యాధులను సున్నాకు కట్టడి చేస్తాం..’ అని వైద్య శాఖపై నిర్వహించిన తొలి సమావేశంలో సీఎం చంద్రబాబు గంభీరంగా ప్రకటించారు. అయితే ప్రభుత్వం డ్రోన్లను ఎగరేసి దోమలను చంపే లోపే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఫీవర్ సర్వే ఊసే లేదు సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా ప్రాథమిక దశలోనే వ్యాధిగ్రస్తులను గుర్తించడం, వారి కాంటాక్ట్‌లను నిర్ధారించి పరీక్షలు చేయడం, అవసరమైన చికిత్సలు అందించడం ఎంతో కీలకం. ఇందుకోసం సీజనల్ వ్యాధుల కట్టడికి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గత ప్రభుత్వం క్రమం తప్పకుండా ఫీవర్ సర్వే నిర్వహించేది. ఆశా, ఏఎన్ఎంలు ప్రతి ఇంటిని సందర్శించి జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరోచనాలు, ఇతర లక్షణాలున్న వారిని గుర్తించేవారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళ్లే పీహెచ్సీ వైద్యులు స్థానికంగా వ్యాధులు ప్రబలుతున్న తీరును గమనించి ప్రజలకు జాగ్రత్తలు సూచించేవారు. ఫీవర్ సర్వేలో అవసరం మేరకు కిట్ల ద్వారా గ్రామాల్లోనే పరీక్షలు నిర్వహించి ప్రాథమికంగా వ్యాధిని నిర్ధారించేవారు. స్వల్ప లక్షణాలున్న వారికి ఇంటి వద్దే మందులు అందించేవారు. అవసరం మేరకు ఆస్పత్రులకు రెఫర్ చేసి వైద్యం అందేలా సమన్వయం చేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలను గాలికి వదిలేసింది. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించడం కోసం ఇంటింటి సర్వే ఇప్పటి వరకూ నిర్వహించనే లేదు. దీంతో మలేరియా, డెంగీ బారిన పడ్డ బాధితులు ఆస్పత్రులకు వెళ్లడంలో జాప్యం కారణంగా ప్రాణాలు విడుస్తున్నారు. సీజనల్ వ్యాధుల కట్టడిలో పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణ, రక్షిత నీటి సరఫరా, ముందస్తు జాగ్రత్తలు చాలా కీలకం. మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మూడు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారి మురికి కూపాలు దోమలకు ఆవాసాలుగా మారాయి. ⇒శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పలాస, ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నంలో జ్వరాల కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 63,932 మంది జ్వర పీడితులున్నట్లు ప్రకటించారు. డెంగీ కేసులు 25 నమోదు కాగా, మలేరియా 30, టైఫాయిడ్ 196, డయేరియా 3,113 కేసులున్నాయి. ⇒విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు 110 డెంగీ కేసులు నమోదయ్యాయి. మలేరియా కేసులు 491 నమోదయ్యాయి. జిల్లాలో 2.45 లక్షల మంది విషజ్వరాల బారిన పడ్డారు.⇒విశాఖ జిల్లాలో 329 డెంగీ కేసులు, 114 మలేరియా కేసులు నమోదు అయినట్టు జిల్లా మలేరియా అధికారి తులసి తెలిపారు. ⇒పార్వతీపురం మన్యం జిల్లాలో గత నెలలో 24 డెంగీ కేసులు, 345 మలేరియా, 911 వైరల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. èఅల్లూరి సీతారామరాజు జిల్లాలో జ్వరాలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.èఅనకాపల్లి జిల్లాలో ఇప్పటివరకు 20,100 జ్వరాల కేసులు నమోదయ్యాయి. 52 డెంగీ కేసులు నిర్ధారణ అయ్యాయి.⇒విజయవాడ ప్రభుత్వాస్పత్రితో పాటు జిల్లాలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి పది మంది అనారోగ్య పీడితుల్లో ఐదుగురు విష జ్వరాలతో బాధపడుతుండగా ఇద్దరు డెంగీ బాధితులు ఉంటున్నారు. డెంగ్యూ ఎన్ఎస్ 1 పాజిటివ్ కేసులు విజయవాడలో ఎక్కువగా నమోదవుతున్నాయి. ⇒ప్రకాశం జిల్లాలో డెంగీ కేసులు 56 నమోదయ్యాయి. ఈ నెల 3వ తేదీన కంభం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలుడు డెంగీతో మృతి చెందాడు. టైఫాయిడ్ కేసులు సుమారు 800, విషజ్వరాలు 1,100 నమోదయ్యాయి.⇒ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైరల్ జ్వరాలు చెలరేగుతున్నాయి. గత రెండు నెలలుగా రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో 150 మంది వైరల్ జ్వరాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. 17 డెంగీ కేసులు నమోదయ్యాయి. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, ఉండి, ఆచంట నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు.⇒డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కొంకాపల్లిలో 60 మంది విష జ్వరాలతో బాధపడుతున్నారు. ఆరుగురు డెంగీ బారినపడ్డారు. కొత్తపేట మండలం వానపల్లి, అవిడి పీహెచ్‌సీల పరిధిలో ఈ నెలలో సుమారు 800 జ్వరాలు కేసులు రాగా 100 టైఫాయిడ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఐదు వరకు డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో సుమారు 32 డెంగీ కేసులు నమోదయ్యాయి.èశ్రీసత్యసాయి జిల్లా హిందూపురం, ధర్మవరం, కదిరి ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మడకశిరలో అతిసారం ఆందోళన కలిగిస్తోంది. ధర్మవరంలో డెంగీ ప్రభావం ఎక్కువగా ఉంది. జిల్లాలో ఇప్పటివరకు 60 డెంగీ కేసులు నమోదయ్యాయి. ⇒వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా అధికారికంగా జనవరి నుంచి ఇప్పటివరకు డెంగీ కేసులు 244, మలేరియా కేసులు 11 నమోదయ్యాయి. ⇒కర్నూలు జిల్లాలో డెంగీ కేసులు అధికంగా పట్టణ ప్రాంతాల్లో 63 నమోదయ్యాయి. ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాల్టీ, గూడురు నగర పంచాయతీలో అపరిశుభ్రత తాండవిస్తోంది. నంద్యాల జిల్లాలో ఇంటికొకరు జ్వరాల బారిన పడుతున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 77 డెంగీ కేసులు నమోదయ్యాయి. గత జూన్ 21న జూపాడు బంగ్లా మండలం చాబోలులో అతిసార ప్రబలి 20 మంది ఆసుపత్రి పాలు కాగా నడిపి నాగన్న మృతి చెందాడు.⇒అన్నమయ్య జిల్లాలో ఇప్పటివరకు 132 వరకు డెంగీ కేసులు నమోదయ్యాయి. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో ఈ నెలలో 45 డెంగీ, 30 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. రాయచోటిలోని వంద పడకల ఆస్పత్రిలో 69 డెంగీతోపాటు 104 మలేరియా కేసులు నమోదయ్యాయి. ⇒అనంతపురం జిల్లాలోని అనంతపురం అర్బన్, రూరల్, కళ్యాణదుర్గం, గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ తదితర ప్రాంతాల్లో డెంగీ కేసులు వందకు పైగా నమోదైనట్లు సమాచారం.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఇంటి ఆవరణ, పరిసరాల్లో పనికిరాని వస్తువులు,టైర్లు, వాడిన కొబ్బరి చిప్పలు ఉంచరాదు. ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీటిని నిల్వ చేసే పాత్రలను శుభ్రపరచి వాటిపై మూతలు ఉంచాలి. ఆర్వో నీటిని లేదా కాచి వడగట్టిన నీటిని తాగాలి. తాజా కాయగూరలు, వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దోమల నుంచి రక్షణ కోసం దోమ తెరలు వాడాలి. గర్భిణులు, చిన్న పిల్లలు తప్పనిసరిగా దోమతెరల రక్షణలో నిద్రించాలి. సీజనల్ వ్యాధులు.. లక్షణాలు వ్యాధి లక్షణాలుమలేరియా: చలి, జ్వరం, తలనొప్పి, దగ్గు, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు, నీరసం డయేరియా: విరేచనాలు, కడుపు నొప్పి, వికారంటైఫాయిడ్: జ్వరం, నీరసం, కడుపులో నొప్పికలరా: నీళ్ల విరేచనాలు, వాంతులు, కాళ్లు లాగడండెంగ్యూ: హఠాత్తుగా జ్వరం, భరించలేని తల, కండరాలు, కీళ్లు నొప్పులు, ఆకలి మందగించడం, వాంతులు, ఒంటిపై ఎర్రటి మచ్చలుకామెర్లు: జ్వరం, అలసట, కడుపునొప్పి, మూత్రం పచ్చగా రావడం, వికారం, కళ్లు పచ్చబడటం -
బద్లాపూర్ భగభగ!
థానె/ముంబై: మహారాష్ట్రలోని థానె జిల్లా బద్లాపూర్‌లో అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. స్థానిక కిండర్‌గార్టెన్ స్కూల్లో రెండేళ్లు, నాలుగేళ్ల చిన్నారులపై అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడటం కలకలం రేపింది. ఘటనపై పోలీసులు సకాలంలో స్పందించలేదంటూ మంగళవారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులు వందలాదిగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై బైఠాయించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో, ఆ మార్గంలో 8 గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.బద్లాపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు బాధితుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు 11 గంటలపాటు జాప్యం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వేధింపుల ఘటన చోటుచేసుకున్న స్కూల్ ప్రిన్సిపాల్‌తోపాటు ఇద్దరు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. బాధిత చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, ఈ నెల 17న అటెండర్‌ను అరెస్ట్ చేశారు. ఘటనకు బాధ్యులుగా చేస్తూ సోమవారం రాత్రి పాఠశాల యాజమాన్యం çస్కూల్ ప్రిన్సిపల్, క్లాస్ టీచర్, మహిళా అటెండర్‌ను సస్పెండ్ చేసింది.వేధింపుల ఘటనపై పాఠశాల యాజమాన్యం క్షమాపణ చెప్పింది. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదుపై స్పందించలేదంటూ స్థానిక పోలీస్‌స్టేషన్ ఇన్చార్జిని ప్రభుత్వం బదిలీ చేసింది. సీనియర్ ఇన్స్పెక్టర్తోపాటు అసిస్టెంట్ ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. దర్యాప్తునకు ఐజీ స్థాయి అధికారి సారథ్యంలో సిట్‌ను ఏర్పాటు చేశామన్నారు. కేసుపై సత్వర విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆ ఆరోపణలు అవాస్తవం కేసు నమోదు చేసేందుకు పోలీసులు 12 గంటలపాటు ఆలస్యం చేశారంటూ వచి్చన ఆరోపణలను డీసీపీ సుధాకర్ పఠారే చెప్పారు. కేసు నమోదు ప్రక్రియ రాత్రి 11.30 గంటలకు మొదలుకాగా, నిందితుడిని మూడున్నర గంటల్లోపే 3.30 గంటలకు అరెస్ట్ చేశామన్నారు. అభంశుభం తెలియని బాధిత చిన్నారుల నుంచి సమాచారం రాబట్టడం క్లిష్టమైన, సున్నితమైన వ్యవహారమని, ఈ ప్రక్రియ వల్లే కేసు నమోదు ఆలస్యమైందని వివరించారు. ఒక మహిళా అధికారి సహా మొత్తం ముగ్గురు అధికారులు దర్యాప్తు ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారన్నారు. మంత్రి చెప్పినా ససేమిరా.. వేధింపుల ఘటనకు నిరసనగా కొన్ని సంస్థలు మంగళవారం బద్లాపూర్ బంద్‌నకు పిలుపునిచ్చాయి. ఉదయం భారీ సంఖ్యలో కిండర్‌గార్టెన్ విద్యార్థుల తల్లిదండ్రులు, ముఖ్యంగా మహిళలు తరలివచ్చి పాఠశాల గేట్లు విరగ్గొట్టారు. ఫర్నిచర్, తలుపులు, కిటికీలు ధ్వంసం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానిక రైల్వే స్టేషన్‌పైకి రాళ్లు రువ్వారు. బ్యానర్లు, ప్లకార్డులు చేతబూని పట్టాలపై బైఠాయించారు. రాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ అక్కడికి చేరుకుని నచ్చజెప్పినా వారు ససేమిరా అన్నారు. బాధిత బాలికలకు న్యాయం చేయాలని, దోషులకు ఉరివేయాలని పట్టుబట్టారు.చివరికి సాయంత్రం పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జితో ఆందోళనకారులను చెదరగొట్టారు. రాత్రి 6 గంటల సమయానికి రైళ్ల రాకపోకలకు లైన్ క్లియర్ చేశారు. ఉదయం 8.30 గంటల నుంచి పట్టాలపైనే తిష్ట వేయడంతో సబర్బన్ సహా పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బద్లాపూర్‌లో రైల్ రోకో కారణంగా అంబర్నాథ్–కజ్రట్ మార్గంలో 30 వరకు సబర్బన్ రైళ్లను రైల్వే శాఖ పాక్షికంగా రద్దు చేసింది. మరో 12దూరప్రాంత రైళ్లను దారి మళ్లించింది. మార్గమధ్యంలో చిక్కుకుపోయిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు 55 బస్సులను ఏర్పాటు చేసింది. -
గొప్పమనసు చాటుకున్న అతియా శెట్టి- కేఎల్ రాహుల్ దంపతులు!
బాలీవుడ్ భామ, హీరోయిన్ అతియా శెట్టి బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్లో కొద్ది సినిమాలే చేసినా.. గతేడాది క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో పెళ్లి తర్వాత మరింత ఫేమస్ అయింది. అయితే తాజాగా తన భర్తతో కలిసి ఓ ఛారిటీని స్థాపించింది ముద్దుగుమ్మ. విప్లా ఫౌండేషన్ కోసం నిధులను సేకరించేందుకు 'క్రికెట్ ఫర్ ఎ కాజ్' పేరుతో ఛారిటీని ప్రకటించారు. కాగా... ముంబయిలో సేవ్ ది చిల్డ్రన్ ఇండియాగా పిలువబడే సంస్థను ఆ తర్వాత విప్లా ఫౌండేషన్‌గా మార్చారు. మరికొందరు క్రికెటర్లతో కలిసి ఛారిటీ తరఫున నిధులు సమీకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వేలం పాట నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అతియా మాట్లాడుతూ.. 'విప్లా ఫౌండేషన్ నా చిన్నతనంలోనే ఓ ముఖ్యమైన భాగం. నేను స్కూల్ అయిపోయిన తర్వాత చాలా రోజుల పాటు ఇక్కడ పిల్లలకు పాఠాలు బోధిస్తూ వారితో గడిపేదాన్ని. మేము నిర్వహించే వేలం ద్వారా వినికిడి లోపం, వైకల్యం ఉన్న పిల్లల అవసరాలను తీర్చాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టాం. విప్లా ఫౌండేషన్‌ను ప్రారంభించిన నాని వారసత్వాన్ని కొనసాగించాలనేదే నా ఆశయం'అని తెలిపారు.కేఎల్ రాహుల్ మాట్లాడుతూ..' ఇలాంటి పాఠశాలకు మొదటిసారి రావడం చాలా ఉద్వేగభరితంగా అనిపించింది. అతియా కుటుంబం భాగమైన ఈ గొప్ప పనికి సహకరించడానికి ఈ పిల్లలే నన్ను ప్రేరేపించారు. వీరికి అన్ని రకాలుగా తోడ్పాటు అందించడంలో విప్లా ఫౌండేషన్ చేస్తున్న అద్భుతమైన పనికి మద్దతు ఇవ్వడానికి వేలం నిర్వహిస్తున్నాం. నేను నాతోటి క్రికెట్ సోదరులను సంప్రదించినప్పుడు.. వారు తమ విలువైన క్రికెట్ వస్తువులను వేలం ద్వారా వచ్చే డబ్బును విరాళం ఇచ్చేందుకు సహకరించారు. వేలంలో పాల్గొని ప్రత్యేకమైన ఈ పిల్లల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం మాతో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.' అని అన్నారు.కాగా.. అతియా శెట్టి, కేఎల్ రాహుల్ జనవరి 23, 2023న వివాహం చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే అతియా చివరిసారిగా 2019 చిత్రం 'మోతీచూర్ చక్నాచూర్'లో కనిపించింది. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటించింది. ఆమె 2015లో వచ్చిన 'హీరో'లో మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అంతేకాకుండా అర్జున్ కపూర్ నటించిన 'ముబారకన్' చిత్రంలోనూ నటించింది. -
తల్లిదండ్రుల అనుమతి లేకుండా పిల్లల డేటా సేకరణ!
ప్రముఖ సోషల్‌మీడియా యాప్ టిక్‌టాక్‌పై యూఎస్ ప్రభుత్వం కోర్టులో దావా వేసింది. పదమూడేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల సమాచార గోప్యతను పాటించడంలో కంపెనీ యాజమాన్యం విఫలమైందని ఆరోపించింది. పిల్లల తల్లిదండ్రుల అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా సమాచారాన్ని సేకరించిందని చెప్పింది. ఈ మేరకు బైడెన్ ప్రభుత్వం టిక్‌టాక్, దాని మాతృసంస్థ బైట్‌డాన్స్‌పై కోర్టులో దావా వేసింది.యూఎస్ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం..చైనా ఆధారిత సోషల్‌మీడియా యాప్ టిక్‌టాక్ యూఎస్‌లో 13 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించింది. అందుకు వారి తల్లిదండ్రుల సమ్మతిని పొందాల్సి ఉంటుంది. కానీ కంపెనీ యాజమాన్యం ఎలాంటి నిబంధనలు పాటించలేదు. పిల్లల ఆన్లైన్ గోప్యతా రక్షణ చట్టాన్ని టిక్‌టాక్ ఉల్లంఘించింది. ఇది భవిష్యత్తులో అమెరికన్ల సమాచార భద్రతకు హాని కలిగించే ప్రమాదం ఉంది.ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీలోని డెమొక్రాట్ ప్రతినిధి ఫ్రాంక్ పల్లోన్ మాట్లాడుతూ..‘చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నియంత్రణలోని టిక్‌టాక్‌ను ఉపసంహరించుకోవాలి. పిల్లల తల్లిదండ్రులకు తెలియకుండానే కుంటుంబ సభ్యుల సమాచారాన్ని సేకరించడం సరికాదు. అమెరికన్ల సమాచార గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది’ అన్నారు. ఈ నేపథ్యంలో పిల్లల నుంచి డేటా సేకరించినందుకుగాను టిక్‌టాక్‌పై రోజూ ఒక్కో ఉల్లంఘనకు 51,744 డాలర్లు(రూ.43 లక్షలు) జరిమానా విధించాలని ఫెడరల్ ట్రేడ్ కమిషన్(ఎఫ్‌టీసీ) ప్రతిపాదించింది. ఇదే జరిగితే కంపెనీ కోట్ల రూపాయలు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: బ్యాంకు సర్వీసులను అప్డేట్ చేయట్లేదుఈమేరకు టిక్‌టాక్ స్పందిస్తూ..యూఎస్ ప్రభుత్వం కోర్టులో వేసిన దావాను తీవ్రంగా ఖండించింది. అందులోని వివరాలు పూర్తిగా అబద్ధమని చెప్పింది. కొన్ని సంఘటనలు గతంలో జరిగినా అవి చాలాకాలం కిందటే పరిష్కరించామని పేర్కొంది. పిల్లల భద్రతకు కంపెనీ యాజమాన్యం పూర్తి మద్దతు ఇస్తోందని స్పష్టం చేసింది. టిక్‌టాక్‌ను మరింత మెరుగుపరిచేందుకు చేస్తున్న సన్నాహాలు ఆపమని తేల్చి చెప్పింది. ఇదిలాఉండగా, చైనీస్ యాజమాన్యంలోని టిక్‌టాక్ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌ను యూఎస్‌లో దాదాపు 170 మిలియన్ల(17 కోట్లు) మంది వినియోగిస్తున్నారు. పిల్లల డేటా నిర్వహణకు సంబంధించి సరైన నిబంధనలు పాటించకపోవడంతో సంస్థపై గతేడాది యూరోపియన్ యూనియన్, యూకే ప్రభుత్యాలు జరిమానా విధించాయి. -
London: డ్యాన్స్ క్లాస్‌లో కత్తితో దాడి.. ఇద్దరు చిన్నారులు మృతి
బ్రిటన్‌లోని నార్త్-వెస్ట్ ఇంగ్లండ్‌లో దారుణం చోటుచేసుకుంది. చిన్నారుల కోసం నిర్వహిస్తున్న డ్యాన్స్ క్లాస్‌లో ఒక యువకుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, మరో తొమ్మిదిమంది గాయపడ్డారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం దాడికి పాల్పడ్డ యువకుడిని టేలర్ స్విఫ్ట్(17)గా గుర్తించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, అతని నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని మెర్సీసైడ్ పోలీస్ చీఫ్ కానిస్టేబుల్ సెరెనా కెన్నెడీ తెలిపారు. దాడికి పాల్పడిన యువకుడు మారణాయుధంతో డాన్స్ క్లాస్ జరుగుతున్న ప్రాంగణంలోకి వచ్చాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న మెర్సీసైడ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్ఆర్ఐలకు చేదువార్త : పిల్లల భవిష్యత్తేంటి?
అమెరికాలో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులకు మరో చేదు వార్త. చట్టబద్ధమైన వలసదారుల పిల్లలు, దాదాపు 2.50 లక్షలమంది అమెరికాను వీడే పరిస్థితి కనిపిస్తోంది.'డాక్యుమెంటెడ్ డ్రీమర్స్' గా పిలిచే ఈ పిల్లలు తాత్కాలిక ఉద్యోగ వీసాలపై వారి తల్లిదండ్రులతో అమెరికా వచ్చారు. కానీ ఇప్పుడు 21 ఏళ్లు నిండిన (ఏజింగ్ ఔట్) కారణంగా ఆ పిల్లలు తమ డిపెండెంట్ స్థితిని కోల్పోయే ప్రమాదం ఉందన్న అంచనాలు ఆందోళన రేపుతున్నాయి.శాసన ప్రతిష్టంభనకు రిపబ్లికన్లను వైట్ హౌస్ ఆరోపించింది. డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌కు సహాయం చేసేందుకు తాము ఒక ప్రక్రియను ప్రతిపాదించామని దాన్ని రిపబ్లికన్లు రెండుసార్లు తిరస్కరించాని అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ చెప్పారు. చట్టసభ సభ్యులు, న్యాయవాదులు అమెరికాలో పెరిగిన పిల్లలను రక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు. హెచ్ 1బీ కేటగిరీ కింద అమెరికాలో ఉండే విదేశీయుల పిల్లలకు హెచ్4 వీసా ఇస్తారు. ఇది పిల్లలకు 21 ఏళ్లు వచ్చేంతవరకు చెల్లుతుంది. భారతీయ పిల్లలు కనీసం 2.50 లక్షల మంది 21 ఏళ్లు నిండగానే అమెరికా వీడాల్సి ఉంటుంది. వారక్కడే ఉండాలంటే స్టూడెంట్ (ఎఫ్) వీసా సంపాదించాలి. లేదా కొత్త తాత్కాలిక స్థితికి మారాలి లేదా భారత్‌కు తిరిగి వచ్చేయాలి. లేదంటే యుఎస్‌లో ఉండటానికి చట్టపరమైన హోదా కోల్పోతే, అమెరికా చట్టాల ప్రకారం చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ద్వారా అమెరికా పౌరసత్వం మరియు వలస సేవల (USCIS) డేటా విశ్లేషణ ప్రకారం, ఆధారపడిన వారితో సహా 1.2 మిలియన్లకు పైగా భారతీయులు మొదటి, రెండవ, మూడవ ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ కేటగిరీలలో వేచి ఉన్నారు. కాగా జూన్ 13న, ఇమ్మిగ్రేషన్, పౌరసత్వం మరియు సరిహద్దు భద్రతపై సెనేట్ జ్యుడిషియరీ సబ్‌కమిటీ చైర్‌గా ఉన్న సెనేటర్ అలెక్స్ పాడిల్లా నేతృత్వంలోని 43 మంది చట్టసభ సభ్యుల బృందం, ప్రతినిధి డెబోరా రాస్, వీరిని రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని బైడెన్ ప్రభుత్వాన్ని కోరారు. -
‘‘మేముండగా నువ్వు పిల్లలు లేనిదానివెలా’’: జేడీ వ్యాన్స్‌కు ఇచ్చిపడేసిన ‘ఎల్లా’
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో కమలా హారిస్ దూసుకుపోతున్నారు. మరోవైపు అమెరికా సెనేటర్, రిపబ్లిక్ ఉపాధ్యక్ష పదవికి బరిలో ఉన్న జేడీ వ్యాన్స్ గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై తాజాగా దుమారం రేగుతోంది. దీనిపై కమలా భర్త మొదటి భార్య కూతురు ఎల్లా ఎమ్హాఫ్ ఘాటుగా స్పందించారు. అంతేకాదు ఎల్లా తల్లికూడా కమలకు మద్దతుగా నిలిచారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌పై చైల్డ్‌లెస్ క్యాట్ అంటూ గతంలో జేడీ వ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కమల భర్త మొదటి భార్య కెర్స్టిన్ ఎమ్హాఫ్ కమలకు మద్దతుగా నిలిచారు. గత పదేళ్లుగా తన పిల్లలైన కోల్, ఎల్లా ఎమ్హాఫ్కు ఆమె తల్లిగా ప్రేమించారని, తమ కుటుంబానికి ఆమె ఎంతో అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తగవంటూ ఆమె మండిపడ్డారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై కమలా సవతి కుమార్తె (డగ్లస్ ఎమ్హాఫ్ ,కెర్స్టిన్ ఎమ్హాఫ్) ఇన్‌స్టాలో కౌంటర్ ఇచ్చారు. నేను, కోల్ (ఎల్లా సోదరుడు) ఉండగా నువ్వు పిల్లలు లేని దానివి ఎలా అవుతావంటూ కమలపై తన ప్రేమను చాటుకున్నారు. తద్వారా జేడీ వ్యాన్స్‌కు సమాధానం చెప్పారు.2021లో జేడీ వ్యాన్స్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పిల్లలు లేనివారు పాలించేందుకు తగరంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పిల్లలు లేని స్త్రీల జీవితం దయనీయం. అలాంటి వారు దేశాన్ని కూడా దయనీయంగా మార్చాలనుకుంటారు. కమల లాంటి పిల్లలు లేని వ్యక్తుల చేతిలో అధికారాన్ని పెట్టడంలో అర్థం లేదంటూ వాన్స్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నిఫర్ అనిస్టన్ కూడా తీవ్రంగా ఖండించారు.కాగా కమలా హారిస్ భర్త డగ్లస్ ఎమ్హాఫ్ మొదటి భార్య కెర్స్టిన్ ఎమ్హాఫ్. ఈ దంపతులు పిల్లలే కోల్, ఎల్లా ఎమ్హాఫ్. వీరు కమలా హారిస్‌ను మోమలా అని ప్రేమగా పిలుచుకుంటారు. ఎల్లా మోడల్, ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తోంది. అల్లికలద్వారా మంచి కళాఖండాలను తయారు చేయడంలో ఆమె దిట్ట. -
సుధామూర్తి పేరెంటింగ్ చిట్కాలు..పిల్లలను ప్రయోజకులుగా చేయడం ఎలా..?
డిజిటల్ యుగంలో పేరెంటింగ్ సవాళ్లతో కూడికున్నది. సుధామూర్తి నవతరం తల్లిదండ్రులకు ఉపయోగపడే తన పేరెంటింగ్ అనుభవాలు, చిట్కాలు షేర్ చేసుకున్నారు. ఇవి పిల్లలను మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాడానికి ఉపయోగపడతాయి. సామాజిక సేవ చేస్తూ గృహిణిగా, తల్లిగా సమర్థవంతంగా తన బాధ్యతలను నెరవేర్చారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను మంచిగా ఎలా పెంచాలి అని సతమతమవుతుంటారు. అందులోనూ తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగులు అయితే ఈ బాధ మరింత వర్ణనాతీతం. అలాంటి వారందికీ ఇన్ఫోసిస్ దిగ్గజం నారాయణమూర్తి భార్య సుధామూర్తి చెప్పే చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అవేంటంటే..ప్రతి ఒక్కరి కలలు వేర్వేరు..ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లల గురించి కలలు కంటుంటారు. తమ పిల్లలు ఒక నిర్థిష్ట ఉద్యోగాన్ని చేయాలని, ఇలా ఉండాలని భావిస్తుంటారు. అయితే పిల్లలు తమ తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్న కలలకు విరుద్ధంగా లేదా మరొక కల ఉండొచ్చు వారికి. ఇక్కడ ప్రతి తల్లిదండ్రులు గుర్తించాల్సింది తమ పిల్లలు ఏం కోరుకుంటున్నారనేది తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. అవసరానికి మించి డబ్బు ఇవ్వడం..చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు విలాసవంతమైన పార్టీలు పెట్టి వారికి బహుమతులు కొనిచ్చి పాడుచేస్తారు. బదులుగా, తల్లిదండ్రులు డబ్బు విలువను పిల్లలు తెలుసుకునేలా చేయాలి. తల్లిదండ్రులు ధనవంతులైతే తమ పిల్లలకు ఇతరులు సహయం చేయడం గురించి చెప్పాలి. అలాగే ఆర్థిక స్థోమత తక్కువగా ఉన్నవారు ఉన్నంతలో డబ్బుని సద్వినియోగం చేసుకోవడం తోపాటు దాని ప్రాధాన్యత గురించి కూడా తెలియజెప్పాలి.డిమాండ్లను నెరవేర్చవద్దుపిల్లవాడు ఏదైనా అడిగినప్పుడు, వెంటనే వారి డిమాండ్లను నెరవేర్చ వద్దు. అది వారికి ఎందుకు అవసరం?, అత్యవసరమైనదా? కాదా? అని ఆలోచించి నెరవేర్చాలి. అలాగే వారికి తక్షణమే డిమాండ్ తీర్చకుండా, ఓర్పుతో నిరీక్షించి డిమాండ్‌ని నెరవేర్చుకోవడం తప్పక నేర్పించాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు ఏది పడితే అది అడగరు, పేరెంట్స్‌ని అర్థం చేసుకునే వీలు ఉంటుంది. వారితో కమ్యూనికేట్గా ఉండండి..పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఇష్టపడేలా తల్లిదండ్రుల ప్రవర్తన ఉండటం చాలా ముఖ్యం. అలాగే వారు చెప్పే ప్రతి విషయాన్ని ఓపిగ్గా వినాలి. ఇలా చేయడం వల్ల వారి మనుసులో ఏం ఉంది, ఏం కోరుకుంటున్నారనేది తెలుస్తుంది. దీని వల్ల తల్లిదండ్రుల వద్ద ఎలాంటి దాపరికలు లేకుండా పిల్లలు ప్రవర్తిస్తారు.గాడ్జెట్లకు దూరంగా ఉండేలా చేయండి..పిల్లలు గాడ్జెట్లకు అలవాటు పడితే అసహనానికి, నిరాశనిస్ప్రుహలకు లోనయ్యే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల గాడ్జెట్లకు బదులుగా పుస్తకాలు చదివేలా చేయడానికి ప్రయత్నించండి. దీని వల్ల వారికి చదవడం వల్ల కలిగే వినోదం, ఆనందాన్ని తెలుస్తాయి. పైగా వారిలో భాషా నైపుణ్యాలు పెంపొంది, గొప్ప జ్ఞానం, పఠన శక్తి అలవరచుకునే అవకాశం ఉంటుంది. గౌరవం విలువ తెలియజేయాలి..పిల్లలు వారి తల్లిదండ్రులను చూస్తూ పెరుగుతారు. వారినే అనుకరిస్తారు కూడా. మనం గౌరవంతో వ్యవహరిస్తే వారు కూడా ఇతరుల పట్ల గౌరవంగా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా వారికి సామాజికి స్థితితో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ గౌరవింపబడటానికి అర్హులే అని పిల్లలకు తెలియజేయాలి. క్లీనర్ అయినా పెద్ద హోదాలో ఉన్న వ్యక్తినైనా అందర్ని ఒకేలా గౌరవించడం నేర్పించాలి.ఆలోచించి పనికి పూనుకోవడం..ఏదైనా చేసే ముందు ఆలోచించి సరైనా కాదా అని నిర్థారించుకుని చేయడం నేర్పించాలి. చాలామటుకు పిల్లలు వెంటవెంటనే ఫలితాలు రావాలనుకుంటారు. అలా ఆలోచించడం సరికాదని, ఆలోచించి నిధానంగా చేసే పని సరైనదని తెలియజేయాలి. దానికి సమయం తీసుకున్నా..పర్లేదని తొందరపాటుతో కూడిన నిర్ణయాలు మంచివి కావని తెలియజేయాలి.ఇతరులతో పోల్చవద్దుపిల్లలకు తమ వద్ద ఉన్నదానితో సంతృప్తిగా ఉండటం నేర్పించాలి. సంతృప్తిగా బతకడం నేర్పించాలి. తన స్నేహితుడి వద్ద ఖరీదైన బొమ్మలు ఉన్నా కూడా తన తల్లిదండ్రులు కొనిచ్చే బొమ్మే గొప్పదని తెలియజేయాలి. దానిలోని ఆనందాన్ని ఆస్వాదించడం వారికి నేర్పించాలి. దేన్ని ఇతరులతో పోల్చుకోకూడదని దాని వల్ల అధ్వాన్నంగా తయారవుతామని, ప్రయోజకులం కాలేమని పిల్లలకు అర్థమయ్యేలా చేయాలి.సుధామూర్తి చెప్పిన చిట్కాలను ఆచరిస్తే పిల్లలు మంచి ప్రయోజకులు అవ్వడమే గాకుండా కష్ట సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుస్తుంది. పైగా సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తయారవుతారు కూడా.(చదవండి: నీరు వర్సెస్ పాలు: డ్రై ఫ్రూట్స్‌ని ఎందులో నానబెట్టి తీసుకుంటే మంచిది?) -
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 15 మంది మృతి
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో గాజా పూర్తిగా ధ్వంసమైంది. ఇక్కడి ప్రజలకు తిండి కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు, పిల్లల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గాజాలో ఇజ్రాయెల్ దాడులు నిరంతరం కొనసాగుతున్నాయి.తాజాగా గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 15 మంది మృతిచెందారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం కానున్న తరుణంలో ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడింది. నెతన్యాహు యూఎస్ పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణపై చర్చ కూడా జరగనుంది.మరోవైపు గాజాలో పోలియో వైరస్ మరింతగా విస్తరిస్తోంది. గాజాలోని ప్రజలకు పారిశుద్ధ్య సేవలు కూడా అందడం లేదు. సెంట్రల్ గాజాలోని బురెజ్ శరణార్థుల శిబిరంపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు పిల్లలతో సహా తొమ్మిది మంది మృతిచెందారు. గాజా నగరాన్ని ఖాళీ చేసి దక్షిణం వైపు తరలివెళ్లాలని పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ సైన్యం గతంలోనే ఆదేశాలు జారీచేసింది. -
రేవంత్ అంకుల్.. మా ప్రాణాలకు రక్షణ ఏదీ?
కుత్బుల్లాపూర్: వీధి కుక్కల బెడదపై ఆదివారం కొంపల్లి ఎన్సీఎల్ కాలనీకి చెందిన చిన్నారులు వినూత్న తరహాలో నిరసన తెలిపారు. ‘రేవంత్ అంకుల్..మా ప్రాణాలకు రక్షణ ఏదీ?’ అంటూ ఆదివారం ప్లకార్డులు చేతబూని పెద్ద సంఖ్యలో చిన్నారులు పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వద్దకు చేరుకున్నారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఎన్సీఎస్ నార్త్ కాలనీలో వీధి కుక్కల దాడుల్లో గత ఆరు నెలల వ్యవధిలో సుమారు 70 మంది చిన్నారులు గాయపడ్డారు. ఈ విషయమై పలుమార్లు కొంపల్లి మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసినా సరిగ్గా స్పందించలేదు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ కాలనీకి చెందిన చిన్నారులు ప్లకార్డులతో నిరసన చెప్పారు. కొంపల్లి మున్సిపల్ కమిషనర్ హరికృష్ణపై సీఐ విజయవర్దన్కు ఫిర్యాదు చేశారు. చిన్నారుల ఫిర్యాదు మేరకు జీడీ నమోదు చేశామని, డీసీపీ దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు చేపడతామన్నారు. -
మసకేయిస్తున్న ‘మయోపియా’
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఓవైపు ఔట్‌డోర్ ఆటలకు అవకాశం లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు ఒకటే చదువులు.. ఇంకోవైపు కాస్తో కూస్తో దొరికిన విరామంలో స్మార్ట్ ఫోన్లతో కాలక్షేపం.. వెరసి పిల్లలు కంటి సమస్యల బారినపడుతున్నారు. ముఖ్యంగా మయోపియా కబళిస్తోంది. పిల్లల్లో దూర దృష్టి తగ్గిపోతోంది. కంటి లోపాలున్న పిల్లల్లో ప్రతి 20 మందిలో 18 మందిని మయోపియా వేధిస్తోంది. నేత్ర వైద్యులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఉదయాస్తమానం చదువులు, ఆ తర్వాత సెల్ఫోన్లో గేమ్స్‌కు అలవాటుపడుతున్న పిల్లల్లో మయోపియా సమస్యకు దారితీస్తోందని అంటున్నారు.‘స్మార్ట్’ కాటు..ప్రస్తుతం చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ స్మార్ట్ ఫోన్ చేతిలో లేనిదే నిమిషం గడవడం లేదు. ఎక్కువసేపు దీన్ని వాడే వారిలో పలు సమస్యలు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నిత్యం 5 నుంచి 6 గంటలు స్మార్ట్ ఫోన్ వినియోగించేవారు కళ్లు డ్రై అవడంతో సమస్యలకు గురవుతున్నారు. అలాంటి వారిలో కళ్లు మంటలు, దురదలు రావడం, వెలుతురు సరిగ్గా చూడలేకపోవడం, కళ్లు ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ దశలో సరైన చికిత్స పొందకుంటే చూపు మందగించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా డ్రైవింగ్ చేసే సమయంలో ఏకాగ్రతను కోల్పోయి కంగారు పడతారని అంటున్నారు.నివారణకు ఇలా చేయాలి..» పిల్లలు బయట ఆటలు ఆడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.» దగ్గర వాటితోపాటు దూరంగా ఉన్న వాటిని కూడా తరచూ చూస్తుండాలి.» బ్రైట్నెస్ తక్కువగా పెట్టుకుని స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించాలి. » కళ్లకు ఫోన్ 15 సెంటిమీటర్ల దూరంలో ఉంచి చూడాలి. ముఖానికి దగ్గరగా పెట్టుకోకూడదు. » 20 నిమిషాల పాటు ఫోన్, కంప్యూటర్ వాడాక 20 సెకన్ల పాటు దూరంలో ఉన్న వస్తువులను చూడాలి. కనురెప్పలు వేయడంతో నల్లగుడ్డు పొరపైకి నీరు చేరి కళ్లు డ్రై కావు. » ఎట్టి పరిస్థితుల్లో చీకట్లో స్మార్ట్ ఫోన్‌ను వినియోగించరాదు. » కంప్యూటర్‌పై పనిచేసే వారు యాంటీ రిఫ్లెక్టివ్ గ్లాసెస్ వాడితే ప్రయోజనకరంగా ఉంటుంది. » రోజులో ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్, కంప్యూటర్‌పై పనిచేసే వారు ఐడ్రాప్స్ వాడాలి.పిల్లల్లో దూర దృష్టి సమస్య..ప్రస్తుతం పిల్లల్లో ఎక్కువగా దూరపు చూపు తగ్గుతోంది. మా వద్దకు వచ్చే ప్రతి 20 మందిలో 18 మందికి ఇదే సమస్య ఉంటోంది. దీనికి కారణం పిల్లలు కేవలం పుస్తకాలు చదవడం, స్మార్ట్ ఫోన్లు చూడటానికి పరిమితం కావడమే. అలాంటి వారిలో కంటి సైజు పెరిగి దూరపు చూపు మందగిస్తోంది. ఔట్‌డోర్ క్రీడలు కూడా చాలా అవసరం. దూరంగా ఉన్న వాటిని కూడా పిల్లలు చూస్తూ ఉండాలి.. ఆటలు ఆడుతుండాలి. – డాక్టర్ బషీర్ అహ్మద్ మయోఖ్, నేత్ర వైద్య నిపుణుడు, విజయవాడ -
పొగచూరుతున్న బాల్యం!
సాక్షి, హైదరాబాద్: వాయు కాలుష్యంతో పసి మొగ్గలు రాలిపోతున్నాయి. ఐదేళ్లలోపు పిల్లల ఊపిరితిత్తులు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఫలితంగా దేశంలో రోజూ సగటున 464 మంది మృత్యువాత పడుతున్నారు. అమెరికాకు చెందిన లాభాపేక్షలేని పరిశోధనా సంస్థ ‘హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్’తొలిసారిగా ‘స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ ఎయిర్–2024’ నివేదికను విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలివీ..పిల్లలకు న్యుమోనియా, పెద్దలకు ఆస్తమామానవ ఆరోగ్యంపై పీఎం (పర్టిక్యులేట్ మ్యాటర్)–2.5, నైట్రోజన్ డయాక్సైడ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గాలి కాలుష్యంతో పిల్లలు న్యుమోనియా బారిన, పెద్దలు ఆస్తమా బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది కాలంలో వాయు కాలుష్యం సంబంధమైన వ్యాధుల కారణంగా 81 లక్షల మంది మరణించగా.. ఇందులో 7 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులే. ఇందులో సుమారు 5 లక్షల మంది పిల్లలు గృహాల నుంచి విడుదలయ్యే కాలుష్యం కారణంగానే మృత్యువాతపడ్డారు. ఇక, మన దేశంలో 21 లక్షల మంది చనిపోగా.. అత్యధికంగా చైనాలో 23 లక్షల మంది కన్నుమూశారు.శ్వాస, నాడీ వ్యవస్థలపై ప్రభావం అడ్డూఅదుపు లేని మానవ చర్యల కారణంగా వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. స్వచ్ఛమైన గాలి కరువైపోతోంది. ఫలితంగా అనునిత్యం భారీగా కాలుష్యకారకాలు ఊపిరితిత్తుల్లోకి చేరిపోతున్నాయి. ప్రధానంగా ఇది చిన్నారులపై తీవ్ర దుష్ర్పభావాన్ని చూపిస్తోంది. ఎదుగుతున్న దశలో ఉన్న వారి శ్వాస, నాడీ వ్యవస్థలను దెబ్బతీసి, ప్రాణసంకటంగా మారుతోంది. ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాలకు ప్రధాన కారణం పోషకాహార లోపం కాగా.. రెండో అత్యంత ప్రమాదకారి వాయు కాలుష్యమే. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులు నెలలు నిండకముందే పుట్టడం, తక్కువ బరువుతో జని్మంచడం, ఉబ్బసం, ఊపిరితిత్తుల వ్యాధులు వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.ప్రమాద ఘంటికలిలా.. ⇒ బాల్యంలో అధిక మోతాదులో వాయు కాలుష్యం బారినపడితే పెద్దయ్యాక గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. ⇒ వాయు కాలుష్యం ఎక్కువైతే చిన్నారుల్లో మెదడు, నాడీ వ్యవస్థలో వృద్ధి మందగిస్తుంది. విషయ పరిజ్ఞాన సామర్థ్యం తగ్గుతుంది. ⇒ఉబ్బసం ముప్పు పెరుగుతుంది. చిన్నతనంలోనే కేన్సర్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. ⇒నవజాత శిశువులకు ఇళ్లల్లోని వాయు కాలుష్యం ముప్పు ఎక్కువ. ⇒ గర్భిణీలు కలుíÙతమైన గాలికి గురైతే.. వారికి నెలలు నిండకుండానే కాన్పు అయి తక్కువ బరువుతో శిశువులు జన్మించే ప్రమాదం ఉంది.ఏం చేయాలంటే.. ⇒ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన వాయు నాణ్యత ప్రమాణాలను చేరుకోవడానికి ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలి. ⇒ శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలి. ఇంధన సమర్థతను పెంచడంపై పెట్టుబడులు పెంచాలి. ⇒ పునరి్వనియోగ వనరులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ⇒ బహిరంగంగా వ్యర్థాలను కాల్చడం తగ్గించాలి. వ్యర్థాల నిర్వహణ మెరుగుపడాలి. ⇒ రద్దీగా ఉండే రోడ్లు, కర్మాగారాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు వాయు కాలుష్యానికి ప్రధాన కారణం. కాబట్టి విద్యా సంస్థలు, క్రీడా మైదానాలు వీటికి దూరంగా ఏర్పాటు చేస్తే చిన్నారులను ఈ విషతుల్య వాయువుల నుంచి కాపాడొచ్చు. ⇒ రహదారుల వెంబడి ఆక్సిజన్ జనరేటర్లు, బూస్టర్లను ఏర్పాటు చేయాలి. ⇒ఎలక్ట్రిక్ వాహనాలను లేదా సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించాలి.