ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లోని ప్రాంతంలోని ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు పిల్లలతో పాటు ఒక మహిళ సజీవదహనమయ్యింది.
ఒక కుటుంబంలోని నలుగురు మృతిచెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ ఘటన కాంచన్ పార్క్ కాలనీలో జరిగింది.
ఈరోజు (ఆదివారం) ఉదయం 7 గంటల సమయంలో పీఆర్వీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎనిమిది మంది ఉన్నారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు పిల్లలతో పాటు ఒక మహిళ సజీవ దహనమయ్యింది. వారు తీవ్రంగా కాలిపోవడంతో పాటు ఊపిరాడక విలవిలలాడిపోతూ ప్రాణాలొదిలారు.
అగ్నిమాపక దళం బృందం మంటలను అదుపు చేసింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. మంటలను ఆర్ఫిన అగ్నిమాపక దళం ఇంటి గోడను పగలగొట్టి, ఇంట్లో చిక్కుకున్న ఒక మహిళ ముగ్గురు పిల్లలను రక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ నలుగురి పరిస్థితి మరింత విషమంగా ఉందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: దీక్ష విరమించను.. వైద్య చికిత్సకు ఓకే: రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్
Comments
Please login to add a commentAdd a comment