Ghaziabad
-
Uttar Pradesh: ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవ దహనం
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లోని ప్రాంతంలోని ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు పిల్లలతో పాటు ఒక మహిళ సజీవదహనమయ్యింది.ఒక కుటుంబంలోని నలుగురు మృతిచెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ ఘటన కాంచన్ పార్క్ కాలనీలో జరిగింది.ఈరోజు (ఆదివారం) ఉదయం 7 గంటల సమయంలో పీఆర్వీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎనిమిది మంది ఉన్నారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు పిల్లలతో పాటు ఒక మహిళ సజీవ దహనమయ్యింది. వారు తీవ్రంగా కాలిపోవడంతో పాటు ఊపిరాడక విలవిలలాడిపోతూ ప్రాణాలొదిలారు.అగ్నిమాపక దళం బృందం మంటలను అదుపు చేసింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. మంటలను ఆర్ఫిన అగ్నిమాపక దళం ఇంటి గోడను పగలగొట్టి, ఇంట్లో చిక్కుకున్న ఒక మహిళ ముగ్గురు పిల్లలను రక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ నలుగురి పరిస్థితి మరింత విషమంగా ఉందని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: దీక్ష విరమించను.. వైద్య చికిత్సకు ఓకే: రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్ -
వీడు మాములోడు కాదు.... ఖతర్నాక్!’ ఇదొక ఎమోషనల్ క్రైం స్టోరీ
ఓ ప్రొఫెషనల్ కిల్లర్ చేయని హత్యకు పోలీసుల నుంచి తప్పించుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో స్పైడర్‌మ్యాన్ మాదిరి జంప్ చేసి రైలెక్కుతాడు. ఆ రైల్లో ‘బేసిక్‌గానే బ్యాడ్ జాతకం’ ఉన్న ఓ వ్యక్తి పరిచయం అవుతాడు. ఇంటి నుంచి చిన్నప్పుడే పారిపోయిన ఆ వ్యక్తి.. తిరిగి కుటుంబాన్ని కలుసుకునే ఎగ్జైట్మెంట్లో ఉంటాడు. ఇంతలో బుల్లెట్ ప్రాణం ఆ వ్యక్తి తీసేస్తుంది. దీంతో అసలు పార్థు బదులు ‘అతడు’ బాసర్లపూడికి వెళ్లాల్సి వస్తుంది. ఇదో సినిమా కథ.. కానీ, ఇక్కడ నిజజీవితంలో కొడుకు కాని కొడుకు ఒకడు ఓ కుటుంబాన్ని మోసం చేయాలనుకున్న తీరు గురించి తెలిస్తే.. మీరు కూడా ‘వీడు మాములోడు కాదు.. ఖతర్నాక్’ అనుకోవడం ఖాయం!.ఊరు: యూపీ ఘజియాబాద్ స్థలం: ఖోడా పోలీస్ స్టేషన్.. తేదీ నవంబర్ 21, టైం.. సరిగ్గా తెలియదు.మూడు పదుల వయసులో ఉన్న ఓ వ్యక్తి పీఎస్‌కు వచ్చాడు. తనను చిన్నప్పుడే ఎవరో ఎత్తుకెళ్లారని.. కన్నవాళ్లకు దూరమై ఇన్నాళ్లు నరకయాతన అనుభవించానని.. వాళ్ల కోసం ఎక్కడెక్కడో తిరిగానని.. తన కుటుంబాన్ని ఎలాగైనా వెతికిపెట్టమని పోలీసులను బతిమిలాడాడు. ఆ కన్నీళ్లకు పోలీసులు జాలిపడ్డారు. బట్టలు, చెప్పులు కొనిచ్చి.. తిండి పెట్టి స్టేషన్లోనే ఉండనిచ్చారు. ఈలోపు అతనిచ్చిన సమాచారంతో మీడియాలో, సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చారు. ఆ ప్రయత్నం ఫలించి చివరకు ఓ కుటుంబం అతడి కోసం స్టేషన్‌కు వచ్చింది.అది 1993 సంవత్సరం.. తేదీ సెప్టెంబర్ 08సమయం: పిల్లలు బడుల నుంచి ఇళ్లకు వెళ్లే టైంస్కూల్ నుంచి షాహిబాబాద్(ఢిల్లీ)లోని ఇంటికి తన సోదరితో బయల్దేరిన ఏడేళ్ల రాజును.. ఎవరో బలవంతంగా తమ వాహనంలో ఎత్తుకెళ్లారు. ఆ చిన్నారి పరుగున వచ్చి అన్నను ఎవరో ఎత్తుకెళ్లారని ఇంట్లో విషయం చెప్పింది. ఆందోళనతో ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఊరంతా జల్లెడ పట్టారు. లాభం లేకపోయింది. అయితే అటు కిడ్నాపర్ల నుంచి ఎలాంటి డిమాండ్ లేకపోవడం.. పోలీసులు ఆ బాలుడి ఆచూకీ కనిపెట్టడంలో విఫలం కావడంతో ఇన్నేళ్లుగా ఆ కేసు ఓ మిస్టరీగానే ఉండిపోయింది.చివరకు.. ఇన్నేళ్ల తర్వాత తానే ఆ రాజునంటూ ఓ వ్యక్తి వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. తనను రాజస్థాన్‌కు తీసుకెళ్లి హింసించారని, ఓ ఇంట్లో బంధించి పనులు చేయించుకున్నారని, ఆ ఇంట్లో ఓ పాప తనకు ధైర్యం చెబుతూ వచ్చిందని, ఎలాగోలా తప్పించుకుని ఊరు దాటానని, ఇన్నేళ్లు ఏవేవో పనులు చేసుకుంటూ ఎక్కడెక్కడో తిరిగానని.. కన్నీళ్లతో చెప్పాడు రాజు. హనుమాన్ దయవల్లే తాను బతికి బట్టకట్టానని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పాడు. ఆ మాటలతో చలించిపోయిన వాళ్ల అమ్మ.. అతన్ని అక్కున చేర్చుకుంది. ఇన్నేళ్ల తర్వాత కొడుకు తిరిగి వచ్చాడన్న ఆనందంలో అంతా మునిగిపోయారు. అక్కడి మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా ఈ ఎమోషనల్ రీయూనియన్ మీద వరుసబెట్టి కథనాలు ఇచ్చింది. ఇక్కడితో కథ సుఖాంతం అయ్యిందనుకునేరు!.ఇంటికి చేరుకున్నవాడు తిన్నగా ఉంటే ఫర్వాలేదు. కానీ, ఆస్తుల గురించి, ఇంట్లో దాచిన బంగారం.. డబ్బు గురించి పదే పదే ఆరా తీయడం మొదలుపెట్టాడట. దీంతో వారం తిరగకముందే ఆ కుటుంబం మళ్లీ ఘజియాబాద్ పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. అనుమానాల నడుమ.. డీఎన్ఏ టెస్ట్ నిర్వహిస్తే అతను వాళ్ల కొడుకే కాదని తేలింది. దీంతో పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యింది. తమ స్టైల్ ఇంటరాగేషన్ చేసి నిజాలు కక్కించారు.రాజస్థాన్‌కు చెందిన రాజు అలియాస్ భీమ్ అలియాస్ ఇంద్రరాజ్ అలియాస్.. చిన్నప్పటి నుంచే దొంగతనం అలవర్చుకున్నాడు. బంధువుల ఇళ్లను సైతం వదల్లేదు. దీంతో వాళ్ల శాపనార్థాలు భరించలేక ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఊరూరా తిరుగుతూ చోరీలు చేస్తూ పోయాడు. ఈ క్రమంలో.. అతనికో ఆలోచన వచ్చింది.తన ఐడెంటిటీని మార్చుకుంటూ ఊర్లు తిరగసాగాడు. తన తల్లి చనిపోయిందని, తాను అనాథనంటూ పని కావాలంటూ.. ఎమోషనల్ డ్రామాలు ఆడేవాడు. దీంతో కరిగిపోయి వాళ్లు అతన్ని చేరదీసేవారు. అయితే చెప్పాపెట్టకుండా ఏదో ఒక రాత్రి.. ఆ ఇంట్లోని నగదు, బంగారంతో ఉడాయించేవాడు. అలా.. ఇప్పటిదాకా 9 కుటుంబాలను అతను మోసం చేసినట్లు ఘజియాబాద్ పోలీసులు నిర్ధారించారు.ఈ క్రమంలో.. ఘజియాబాద్‌లో ఓ ధనికుల కుటుంబంలో పిల్లాడు.. చిన్నవయసులోనే ఇంట్లోంచి పారిపోయాడని తెలుసుకున్నాడు. పోలీసులనే ఏమార్చి ఆ ఇంటికి కన్నం వేయాలనుకున్నాడు. కానీ, చివరకు అడ్డంగా దొరికిపోయి ఊచలు లెక్కిస్తున్నాడు ఈ కొడుకు కాని కొడుకు.गाजियाबाद में 30 साल पहले अगवा हुआ बेटा लौटा था घर, वो निकला धोखेबाज, इस तरह का अपराध कई बार कर चुका है; परिवारों को बताया कि वो उनका लापता परिजन है#Ghaziabad #Police #GhaziabadPolice #kidnapped #lostrelative @ghaziabadpolice #imposter #Jantv_BM #jantvdigital #jantvreel pic.twitter.com/gcnPLT77lU— JAN TV (@JANTV2012) December 7, 2024 Video Credits: JAN TV -
Ghaziabad: పండ్ల రసాల్లో మూత్రం కలిపిన వ్యాపారి అరెస్ట్
గజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్ జిల్లాలోని లోని బోర్డర్ ప్రాంతంలో పండ్ల రసాల్లో మానవ మూత్రాన్ని కలిపి విక్రయిస్తున్న 29 ఏళ్ల వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. అతని దగ్గర పనిచేస్తున్న 15 ఏళ్ల మైనర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అంకుర్ విహార్ ఏరియా అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ఏసీపీ) భాస్కర్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం ఒక జ్యూస్ విక్రేత పండ్ల రసాల్లో మానవ మూత్రాన్ని కలిపి విక్రయిస్తున్నాడని పలువురు వినియోగదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఆ జ్యూస్ విక్రయిస్తున్న వ్యక్తిని అమీర్ (29)గా గుర్తించినట్లు వర్మ తెలిపారు. అతని జ్యూస్ స్టాల్ నుంచి మూత్రం నింపిన డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై పోలీసులు అమీర్‌ను విచారించి, అరెస్టు చేశారన్నారు. అతని దగ్గర పనిచేస్తున్న ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితునిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భాస్కర్ వర్మ పేర్కొన్నారు.కాగా ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేలోని ఛుత్మల్పూర్లో ఇలాంటి ఉదంతం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఒక ధాబాలో తాండూర్‌లో రోటీలు కాల్చడానికి ముందు దానిని తయారు చేస్తున్న వ్యక్తి వాటిపై ఉమ్మి వేయడం వీడియోలో కనిపిస్తుంది. ఈ నేపధ్యంలో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. తరువాత ఆ ధాబాను మూసివేయించారు. ఇది కూడా చదవండి: వింత శబ్దాల మిస్టరీ వీడింది -
నేటి నుంచి ర్యాపిడ్ రైలు సేవల్లో మరో ముందడుగు
దేశంలో నేటి నుంచి ర్యాపిడ్ రైలు మరింత దూరం పరుగులు తీయనుంది. ఇది ఆధునిక రైల్వే యుగంలో మరో ముందడుగు కానుంది. మీరట్ సౌత్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ నుంచి ర్యాపిడ్ రైలు రాకపోకలు ప్రారంభం కానున్నాయిని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) తెలిపింది. దీంతో ఢిల్లీలోని ప్రయాణికులు ఎన్సీఆర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ వరకు రాకపోకలు సాగించగలుగుతారు.82 కిలోమీటర్ల రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్)లో 42 కి.మీల వినియోగం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఎన్సీఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈరోజు (ఆదివారం) మీరట్ మొదటి స్టేషన్ మధ్యాహ్నం రెండు గంటలకు తెరుచుకోనుంది. ఇప్పటి వరకు నమో భారత్ రైలు సర్వీసులు ఘజియాబాద్ నుంచి మోదీనగర్ నార్త్ వరకు మాత్రమే నడిచేవి. ఇప్పుడు మీరట్ నగరంలో సర్వీసు ప్రారంభం కావడంతో ఘజియాబాద్, ఢిల్లీ వైపు వెళ్లే వారి ప్రయాణం మరింత సులభతరం కానుంది.ఆర్ఆర్టీఎస్ 2023, అక్టోబర్‌లో ఘజియాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఘజియాబాద్‌లోని సాహిబాబాద్- దుహై డిపోల మధ్య 17 కిలోమీటర్ల దూరం ఉంది. ఇప్పటి వరకు ఈ మార్గంలో 22 లక్షల మంది ప్రయాణించారు. ఢిల్లీ - మీరట్ మధ్యనున్న కారిడార్‌లో మొత్తం 25 స్టేషన్లున్నాయి. జూన్ 2025 నాటికి ఢిల్లీ- మీరట్ మధ్య మొత్తం విస్తరణను పూర్తి చేయాలని ఎన్సీఆర్టీసీ భావిస్తోంది. -
భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం
చిన్నపాటి నిప్పు పెను ప్రమాదానికి దారితీస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లాంటివి చోటుచేసుకునే అవకాశం ఉంది. ఒక్కోసారి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఘజియాబాద్‌లో ఇలాంటి ఉదంతమే జరిగగా, ఐదుగురు సజీవ దహనమయ్యారు.ఢిల్లీకి ఆనుకుని ఉన్న యూపీలోని ఘజియాబాద్ పరిధిలోని ఓ గ్రామంలో మూడంతస్తుల ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ ఇంట్లో ఫోమ్ తయారీ పనులు జరుగుతుంటాయి. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక శాఖకు చెందిన పలు వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. అయితే అంతకుముందే ఆ ఇంటిలోని కుటుంబ సభ్యులంతా మంటల్లో చిక్కుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెహతా హాజీపూర్ గ్రామంలో ఇష్తియాక్ అలీకి మూడు అంతస్తుల ఇల్లు ఉంది. అతని కుటుంబ సభ్యులు ఈ ఇంట్లో నివసిస్తున్నారు. బుధవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అనంతరం వారు ఇంటిలోనికి ప్రవేశించిగా అక్కడ వారికి ఐదు మృతదేహాలు కనిపించాయి. మృతులలో ఫర్హీన్ (28), షీష్ (7 నెలలు), నజారా (30), సైఫుర్ రెహ్మాన్ (35), ఇఫ్రా (8)లు ఉన్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న బాధితులు టెర్రస్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించారని, అయితే అది సాధ్యం కాలేదని స్థానికులు చెబుతున్నారు. -
ఢిల్లీలో మారిన వాతావరణం... ఉన్నట్టుండి వర్షం
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారింది. నోయిడా-ఘజియాబాద్‌లో ఉన్నట్టుండి వర్షం కురిసింది. బలమైన గాలులతో పాటు ఢిల్లీ ఎన్సీఆర్లోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల చినుకులు పడ్డాయి.గత కొన్నాళ్లుగా ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షంతో కొంత ఉపశమనం లభించింది. కాగా ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో నేడు (గురువారం) పగటిపూట తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ సమయంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఇది ఉష్ణోగ్రతను తగ్గిస్తుందని పేర్కొంది. వర్షాలు కురవనున్న నేపధ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఢిల్లీ-ఎన్సీఆర్లో గంటకు 25 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన చినుకులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గత రాత్రి 12 గంటల తర్వాత ఎన్సీఆర్లో బలమైన గాలులు వీచాయి. హాపూర్‌లోని సింబావోలిలో ఎనిమిది గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
నామినేషన్లలోనే సగం మంది అవుట్!
నోయిడా: లోక్‌సభ ఎన్నికల రెండో దశ నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఉత్తర ప్రదేశ్‌లోని రెండు స్థానాల్లో దాఖలైన నామినేషన్లలో సగానికి పైగా తిరస్కరణకు గురయ్యాయి. ఘజియాబాద్‌లో 60 శాతం, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా)లో దాదాపు 56 శాతం మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్లు స్థానిక ఎన్నికల అధికారులు తెలిపారు. ఘజియాబాద్‌లో 35 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయగా, అందులో 14 మంది అభ్యర్థుల దరఖాస్తులు ఆమోదించినట్లు జిల్లా ఎన్నికల కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పక్కనే ఉన్న గౌతంబుద్ధ్ నగర్లో 34 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్లు వచ్చాయని, వారిలో 15 మంది అభ్యర్థులు చెల్లుబాటయ్యారని పేర్కొంది. రెండు నియోజకవర్గాల్లో కలిపి 69 నామినేషన్లు రాగా అందులో 40 తిరస్కరణకు గురయ్యాయి. ఘజియాబాద్‌లో నామినేషన్ల తిరస్కరణ 60 శాతం కాగా, గౌతమ్‌బుద్ధ్‌నగర్‌లో 55.89 శాతంగా నమోదైంది. అధికారిక జాబితా ప్రకారం.. ఘజియాబాద్‌లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే గౌతమ్‌బుద్ధ్‌నగర్‌లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు నలుగురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ రెండు స్థానాల్లోనూ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 8 కాగా ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. -
Delhi: ఢిల్లీలో భారీ వర్షం..
ఢిల్లీ-ఎన్సీఆర్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈరోజు (శనివారం) ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్ సహా ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఎడతెగని వర్షం కురుస్తోంది. ఢిల్లీ-ఎన్సీఆర్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌లో మార్చి 2 న వర్షం, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. లక్నో, బిజ్నోర్, మీరట్, బరేలీ, రాంపూర్, రాయ్ బరేలీ, గోరఖ్‌పూర్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. బీహార్, జార్ఖండ్, రాజస్థాన్‌లలో జల్లులు కురిసే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తుంది. Nowcast-1 Fresh scattered thunderclouds are developing all over #Delhi & #Ncr and #Haryana region to bring on/off spells of light-mod rains with isol heavy burst w/ #hailstorm followed by gusty winds upto 20-50km/h in #Delhi,#Gurgaon,#Ghaziabad, #Noida in next 3 hrs#DelhiRains https://t.co/k1ykuNUpLy pic.twitter.com/zKKl3CkLcJ — IndiaMetSky Weather (@indiametsky) March 2, 2024 వాతావరణ శాఖ సూచనల ప్రకారం శనివారం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో వాతావరణం చల్లగా మారనుంది. మార్చి 2న పశ్చిమ హిమాలయ ప్రాంతంలో మెరుపులు, బలమైన గాలులతో పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానాలో గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మార్చి 2న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్‌లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. Temperature is going to drop today 🥶I just kept warm clothes in bed 🙄#Delhirains pic.twitter.com/K62B7dpJ1E — Kritika vaid (@KritikaVaid91) March 2, 2024 And it's raining here in Delhi.. #DelhiRains pic.twitter.com/RruuQbouRL — Ankit Sinha (@imasinha) March 2, 2024 -
యూపీలో మళ్లీ కరోనా కలకలం
ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ఏడుగురికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఒకే రోజు ఏడుగురికి కరోనా నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖలో కలకలం చెలరేగింది. రాజ్‌నగర్, వసుంధర, వైశాలి, సాహిబాబాద్‌లలో ఈ కరోనా కేసులను గుర్తించారు. ప్రస్తుతం గాజియాబాద్‌లో మొత్తం తొమ్మదిమంది కరోనా బాధితులు ఉన్నారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. రాజ్‌నగర్‌లో నివసిస్తున్న 53 ఏళ్ల వ్యక్తి, అతని 26 ఏళ్ల కుమారుడు దగ్గు, జలుబుతో బాధపడుతూ, కోవిడ్ పరీక్ష చేయించుకున్నారని సీఎంఓ డాక్టర్ భవతోష్ శంఖధర్ తెలిపారు. వీరికి కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది. ఇదేవిధంగా వైశాలికి చెందిన 23 ఏళ్ల యువకుడు, సాహిబాబాద్‌కు చెంది 65 ఏళ్ల వృద్ధుడు, వసుంధరలో నివసిస్తున్న ఒక మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు కరోనా పాజిటివ్‌గా తేలారు. 2020 ప్రారంభం నుండి గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికి పైగా జనం కరోనా వైరస్ బారిన పడగా, 5.3 లక్షల మందికి పైగా మృతిచెందడం గమనార్హం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఇప్పటివరకు ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం. దేశంలో కోవిడ్-19 నివారణకు 220.67 కోట్ల డోస్‌ల టీకాలు అందించారు. -
ఎంత ఘోరం: పొగమంచు ఎఫెక్ట్.. రోడ్డుపై చెల్లాచెదురుగా శరీర భాగాలు
లక్నో: దేశంలోని పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. రహదారులు సరిగా కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచుతో వాతావరణం అనుకూలించక విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి.. పలు విమానాలు రద్దు అవుతున్నాయి. పొగమంచుతో ముందుగా వెళ్తున్న వ్యక్తులు, వాహనాలు, దారులు కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘోర ఘటనే ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని గమనించలేని వాహనాదారులు.. వేగంగా వెళ్లడంతో అతడి శరీరం ఛిద్రమైంది. శరీర భాగాలన్నీ రహదారిపై చిందరవందరగా పడిపోయాయి. ఘజియాబాద్‌లో మంగళవారం ఉదయం జాతీయ రహదారి 9పై కార్మికులు శుభ్రం చేస్తుండగా.. చెల్లాచెదురుగా పడి ఉన్న శరీరభాగాలు కనిపించాయి. దీంతో కార్మికులు షాక్‌కు గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. అయితే మరణించింది అబ్బాయా? అమ్మాయా అని గుర్తుపట్టలేనంతగా మృదేహాం తయారైంది. శరీర భాగాలన్నీ చెల్లచెదురుగా పడిపోయాయి. కొన్ని విడిపోయిన శరీర భాగాలు మాత్రమే పోలీసులకు లభించగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ మృతదేహాన్ని గుర్తించలేని పరిస్థితి నెలకొంది. సీసీటీవీ దృశ్యాల ద్వారా ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. కాగా సదరు వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. వేగంగా వెళ్తున్న వాహనం ఢీకొట్టడం వల్లే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తర్వాత వరుసగా వాహనాలు అతడిపై నుంచి వెళ్లడంతో శరీరం పూర్తిగా ఛిద్రమై ఉండవచ్చని అంచనా వేశారు. పొగమంచు వల్ల మొదట ఢీకొన్న వాహనాన్ని గుర్తించడం కష్టంగా మారిందని చెప్పారు. చదవండి: Film Nagar: ప్రేమోన్మాది ఘాతుకం.. వివాహితతో ప్రేమ, భర్త అడ్డొస్తున్నాడని -
బర్త్‌డే వేడుకల్లో బీభత్సం: కరెన్సీ నోట్లు గాల్లోకి విసిరి, రచ్చ..రచ్చ!
పుట్టినరోజు సందర్భంగా ఓవర్ యాక్షన్ చేసిన వారిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. పటాకులు పేల్చి, కరెన్సీ నోట్లకు గాల్లోకి విసరడమే కాకుండా, స్థానికులతో అభ్యంతరకరంగా ప్రవర్తించి అసభ్యకరంగా దూషించి ఘటన కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నంద్‌గ్రామ్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ACP) రవి కుమార్ సింగ్ అందించిన సమాచారం ప్రకారం ముగ్గురు వ్యక్తులు పుట్టిన రోజు వేడుకల్లో బీభత్సం సృష్టించారు. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోపల కారు పైకప్పుపై నిలబడి విచ్చల విడిగా బాణా సంచా కాల్చడంతోపాటు కరెన్సీని గాల్లోకి విసిరి గలాటా సృష్టించారు. అంతేకాదు దీన్నిప్రశ్నించిన అపార్ట్మెంట్ వాసులను దుర్భాషలాడారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అపార్ట్మెంట్ ఓనర్స్ సంఘం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు. @ghaziabadpolice @DCPCityGZB #Ghaziabad pic.twitter.com/Q97dZabFch — Ajnara Integrity AOA (@integrityaoa) October 29, 2023 https://t.co/Nlf6IPi1Le — DCP CITY COMMISSIONERATE GHAZIABAD (@DCPCityGZB) October 29, 2023 -
ఐఏఎఫ్‌లోకి సీ–295 విమానం
ఘజియాబాద్: భారత వైమానిక దళం(ఐఏఎఫ్)లోకి మొదటి సీ–295 రకం రవాణా విమానం చేరింది. ఈ విమానాలు ఐఏఎఫ్ వ్యూహాత్మక రవాణా సామర్థ్యం పెంపులో కీలకంగా మారనున్నాయి. ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో సీ–295 విమానాన్ని ఐఏఎఫ్‌లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజ్‌నాథ్ సర్వ ధర్మపూజ నిర్వహించారు. వైమానిక దళ చీఫ్ వీఆర్ చౌధరితోపాటు సీనియర్ అధికారులు, విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ ప్రతినిధులు పాల్గొన్నారు. వడోదర ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి పనిచేసే స్క్వాడ్రన్ నంబర్ 11కు సీ–295ను అందజేయనున్నారు. కేంద్రం 56 సీ–295 రవాణా విమానాల్ని కొనుగోలు చేసేందుకు ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థతో రూ.21,935 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మొదటి సీ–295 విమానాన్ని ఈ నెల 13న ఐఏఎఫ్ చీఫ్ అందుకున్నారు. ఈ విమానాలను ప్రస్తుతమున్న పాతకాలం ఆవ్రో– 748ల బదులు వినియోగించుకుంటారు. ఒప్పందంలో భాగంగా 16 విమానాల్ని ఎయిర్‌బస్ సంస్థ అందజేస్తుంది. మిగతా 40 విమానాల్ని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌తో కలిసి భారత్‌లోనే ఉత్పత్తి చేస్తుంది. వి డి భాగాల తయారీ పనులు హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. -
కుక్క కరిచిన విషయాన్ని దాచి, నెలరోజల్లోనే విలవిల్లాడుతూ..
ఉత్తర ప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కుక్క కరిచిన విషయాన్ని ఓ బాలుడు తన పేరెంట్స్‌కు చెప్పకపోవడంతో.. నెలన్నర తర్వాత ప్రాణాంతక రేబిస్‌తో (కుక్కకాటు వల్ల వచ్చే రేబిస్ వ్యాధి) చనిపోయాడు. తండ్రి భూజాల మీదే చిన్నారి కన్నుమూయడం హృదయ విదారకం. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుడిని 8వ తరగతి చదువుతున్న షావేజ్‌గా గుర్తించారు. వివరాలు.. విజయ్ నగర్ పీఎస్ పరిధిలోని చరణ్ సింగ్ కాలనీకి చెందిన షావేజ్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. నెలన్నర కిత్రం అతన్ని పక్కింటి వారికి చెందిన కుక్క కరిచింది. ఈ విషయాన్ని చిన్నారి భయంతో తన తల్లిదండ్రుల దగ్గర చెప్పకుండా దాడిపెట్టాడు. అయితే ఆ కుక్కకు వ్యాక్సిన్ చేయించకపోవడంతో బాలుడికి రేబిస్ వ్యాధి వ్యాపించింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బాలుడి అనారోగ్యానికి గురయ్యాడు. అన్నం తినడం మానేసి వింతగా ప్రవర్తించడం, కుక్కలా మొరగడం మొదలు పెట్టాడు. గమనించిన తల్లిదండ్రులు గట్టిగా మందలించడంతో కొన్ని రోజుల క్రితం కుక్క కరిచిన విషయాన్ని తెలిపాడు. షావేజ్ కుటుంబీకులు అతన్ని ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. కానీ అక్కడ చికిత్స చేసేందుకు చేర్చుకోకపోవడంతో బులంద్‌షహర్‌లోని ఆయుర్వేద వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అయితే బాలుడి పరిస్థితి క్షీణించడంతో బులంద్‌షహర్ నుంచి ఘజియాబాద్‌కు బయల్దేరారు. If you can't vaccinate 🐕, then don't domestic one. Yesterday evening a 14-yr-old Shavez, died in his father's arm, as he did not inform his parents about dog bite, which he suffered more than a month ago due to negligence of his neighbour. #Ghaziabad #UttarPradesh pic.twitter.com/45wVyPw5nC — Arvind Chauhan 💮🛡️ (@Arv_Ind_Chauhan) September 5, 2023 అంబులెన్స్‌లో ఘజియాబాద్‌కు తీసుకువస్తున్న సమయంలో బాలుడు తన తండ్రి చేతుల్లోనే ప్రాణాలు విడిచాడు. అంబులెన్స్‌లో కొడుకు పరిస్థితిని చూసి కుమిలిపోతున్న తండ్రి, తండ్రి చేతిలో మృత్యువుతో పోరాడుతున్న బాలుడు నొప్పితో మెలికలు తిరుగుతున్న హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు బాలుడి మృతికి కారణమైన కుక్కతో పాటు దాని యజమానిపై చర్యలు తీసుకోవాలని షావాజ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. STORY | Ghaziabad boy dies of rabies over a month after dog bite, hid incident from parents out of fear READ: https://t.co/Ialssrekma VIDEO: pic.twitter.com/4VGnf1t4Y2 — Press Trust of India (@PTI_News) September 6, 2023 -
యమ్మీ..యమ్మీ.. 'కుల్ఫీ"ని ఇష్టపడని వారుండరు..ఎలా చేస్తారంటే..!
రకరకాల ఐస్‌క్రీం ప్లేవర్స్ ఉన్నా కూడా కుల్ఫీ చూడగానే దాన్ని తినేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తారు ప్రజలు. అది అంతలా మధురంగా యమ్మీ..యమ్మీగా ఉంటుంది. దీనికి తీసుపోనిదీ ఏదీ లేదన్నట్లుగా.. ఇష్టంగా తినే చల్లటి పదార్థాలలో దీనిదే అగ్రస్థానం. అంతలా తనదైన రుచితో ప్రజల మనసును దోచుకుంది. అలాంటి కుల్ఫీ ఎలా తయారవుతుందో, ఏవిధంగా ప్యాక్ చేస్తారో చూద్దాం మంచి ఎండల్లోనూ లేదా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చల్లటి కుల్ఫీ తింటే.. ఆ ఫీల్ వేరు. అబ్బా తలుచుకుంటేనే నోట్లోకి నీళ్లూరతాయి. పిల్లలు దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ దీని రుచికి ఫిదా అవుతారు. అలాంటి కుల్ఫీ ఎలా తయరవుతుందో తెలుసుకుందామనే ఆసక్తి అందరికీ ఉంటుంది కదా. ఐతే ఘజియాబాద్‌లోని ఓ ఫ్యాక్టరీ ఆ కుల్ఫీ ఎలా తయారువుతుందో విపులంగా వెల్లడించింది. సుమారు 120 లీటర్ల పాలనను మిషన్‌లో వేసి బాగా మరిగించి అందులో పాలపొడి, పంచదార తదితరాలను వేసి చిక్కగా మార్చుతుంది. ఆ తర్వాత 14 డిగ్రీల సెల్సియస్ చేరుకునేలా చల్లబరుస్తుంది. ఆ తర్వాత చక్కగా ప్యాక్ చేస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Amar Sirohi (@foodie_incarnate) (చదవండి: స్వాతంత్య్ర పోరాటానికి ప్రతీకగా నిలిచిన ఐకానిక్ స్వీట్ ఏంటో తెలుసా! ఎలా చేయాలంటే) -
ఢిల్లీ: వరుణుడి ప్రతాపం.. రోడ్లు జలమయం
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతాన్ని మరోసారి వరుణుడు ముంచెత్తాడు. బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షంతో నగర వాసులు ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీతో పాటు నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కు విపరీతంగా విఘాతం కలుగుతోంది. బుధవారం భారీ నుంచి అతి భారా వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పిడుగులతో కూడిన వర్షం కురవొచ్చని హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. తాజా వర్షాలతో యమునా నదికి వరద పోటెత్తుతోంది. మళ్లీ డేంజర్ మార్క్‌కు చేరుకునే అవకాశం ఉండడంతో.. అధికారుల్లో అందోళన నెలకొంది. #WATCH | UP: Noida wakes up to rain lashing parts of the city (Visuals from Noida Sector 20) pic.twitter.com/MMBJ7ExuAa — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 26, 2023 #WATCH | Rain lashes parts of the national capital. Visuals from Shantipath. pic.twitter.com/3uosfVnTa9 — ANI (@ANI) July 26, 2023 -
ఘోర ప్రమాదం.. ఎస్యూవీ కారును ఢీకొట్టిన పాఠశాల బస్సు.. వీడియో వైరల్
ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘాజియాబాద్‌లో ఓ కారును స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. రాహుల్ విహార్ సమీపంలోని ఢిల్లీ- మీరట్ ఎక్స్‌ప్రెస్ వే మీద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించిన భయంకర దృశ్యాలు స్థానికి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఇందులో ఎస్యూవీ కారు, స్కూల్ బస్సు ఎదురెదురుగా రావడం కనిపిస్తుంది. రాంగ్ రూట్లో వస్తున్న పాఠశాల బస్సు గురుగ్రామ్ వైపు వెళ్తున్న ఎస్యూవీ కారును ఢీకొట్టింది. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ఎనిమిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సు రాంగ్ రూట్లో వస్తుంటే ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. బస్సు డ్రైవర్, ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆరుగురు ప్రాణాలు పోయాయని ఆరోపిస్తున్నారు. చదవండి: ‘70 ఏళ్ల మా అమ్మ నా పక్క సద్దుతుంది’.. అనగానే.. Traffic police sleeping, bus was on wrong side. Who is responsible for these deaths. Horrific road accident on Delhi-Meerut Expressway, car flipped over, 6 people died. #DelhiMeerutExpressway #RoadAccident #BusAccident #CarAccident #TeJran #Article370 #SeemaHaider pic.twitter.com/yPVPrtnmLF — HINDUSTAN MERI JAAN (@Hindustan_Meri1) July 11, 2023 -
Prachi Bhatia: జీవితాన్ని అలంకరించుకుంది
అరకొర ఆర్థిక పరిస్థితులు బాల్యాన్ని సర్దుకు పొమ్మన్నాయి. ఏమీ తెలియని పసిమనసు కూడా పరిస్థితులకు తలొంచక తప్పలేదు. తన వయసుతో పాటు కుటుంబ ఆర్థికభారం పెరిగిపోతుంటే చూడలేకపోయింది. డిగ్రీలోనే సంపాదనకు నడుం బిగించి, 28 ఏళ్లకే సక్సెస్‌పుల్ ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తోంది ప్రాచీ భాటియా. ఘజియాబాద్‌కు చెందిన ప్రాచీ భాటియా దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. తండ్రి జర్నలిస్టు, తల్లి గృహిణి. తండ్రికొచ్చే కొద్దిపాటి ఆదాయమే కుటుంబానికి ఆధారం. ఆ ఆదాయం ఏమూలకూ సరిపోయేది కాదు. ప్రాచీ స్కూలు ఫీజులు కట్టడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఎప్పుడూ స్కూల్లో అందరికంటే ఆలస్యంగా ఫీజు చెల్లించేవారు. ఇంతటి గడ్డు పరిస్థితుల్లో సైతం ఇంటర్మీడియట్ పూర్తిచేసిన ప్రాచీ ... తనకెంతో ఇష్టమైన డిజైనింగ్ డిగ్రీ చేయాలనుకుంది. అనుకున్నట్టుగానే ఢిల్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్టీ) లో సీటు సంపాదించింది. కానీ అక్కడ హాస్టల్ ఫీజు, ఇతర ఖర్చులకు డబ్బులు లేక ఎన్ఐఎఫ్టీలో చేరలేదు. గురుగామ్‌లోని జీడీ గోయెంకా యూనివర్శిటీలో చేరింది. ► సంపాదిస్తూనే కాలేజీ టాపర్ అతి కష్టంమీద డిగ్రీలో చేరిన ప్రాచీ.. ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క చిన్న వ్యాపారం ప్రారంభించింది. కుటుంబానికి ఆర్థి కంగా సాయపడేందుకు.. గిఫ్ట్స్ తయారు చేసి విక్రయించేది. ఫొటో ఆల్బమ్స్, ఫొటో ప్రింటెడ్ ల్యాంప్స్, హ్యాండ్‌మేడ్ కార్డ్స్, రోజెస్ వంటివి తయారు చేసి ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసేది. ఇలా విక్రయిస్తూ నెలకు ఐదువేల రూపాయల దాకా సంపాదించేది. వాటిలో కొంత ఇంట్లో ఇచ్చి మిగతావి దాచుకునేది. ఆర్ట్స్, క్రాఫ్ట్స్ మీద ఆసక్తి ఉండడంతో సర్టిఫికెట్ కోర్సులు చేసేది. మరోపక్క డిగ్రీ చదువుతూ వచ్చే స్కాలర్‌షిప్‌తో తన ఎడ్యుకేషన్ లోన్ కట్టేది. ఇవన్నీ చేస్తూ కూడా డిగ్రీలో కాలేజ్ టాపర్‌గా నిలిచింది ప్రాచీ. ► ఎంప్లాయీ నుంచి ఎంట్రప్రెన్యూర్‌గా డిగ్రీ పూర్తవగానే ప్రాచీ గురుగామ్‌లోని ఓ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో అసిస్టెంట్ డిజైనర్‌గా చేరింది. కొన్నాళ్లు పనిచేశాక.. మరో బహుళ జాతి కంపెనీలో డిజైనర్‌గా ఉద్యోగావకాశం వచ్చింది. అందులోచేరిన కొద్దిరోజులకే ‘‘ఒకరి కింద నేనెందుకు పనిచేయాలి? నేనే ఏదైనా కొత్తగా ప్రారంభించవచ్చు కదా!’’ అనుకుని వెంటనే ఉద్యోగం వదిలేసింది. అప్పటిదాకా చేసిన ఉద్యోగ అనుభవ పాఠాలతో 24 ఏళ్ల వయసులో సొంతంగా ‘చౌఖట్’ పేరిట హోండెకార్ బ్రాండ్‌ను స్థాపించింది. అప్పటివరకు దాచుకున్న లక్ష రూపాయలను పెట్టుబడిగా పెట్టి.. ఇంటి అలంకరణలో ఉపయోగించే∙ఉత్పత్తులను పేపర్ మీద డిజైన్ చేసి, మొరాదాబాద్, జైపూర్, నోయిడాలలోని కళాకారులతో రకరకాల కళాఖండాలను తయారు చేయించేది. తయారైన ఉత్పత్తులను ఫోటోషూట్ చేసి తన సొంత వెబ్సైట్లో పెట్టి విక్రయించడం మొదలు పెట్టింది. విక్రయాలు కాస్త మందకొడిగా ఉండడంతో.. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రకటనలు ఇచ్చింది. వీటిద్వారా చౌఖట్కు గుర్తింపు రావడంతో వ్యాపారం ఊపందుకుంది. దీంతో తన మార్కెటింగ్ బడ్జెట్ నెలకు యాభైవేలకు చేరింది. తొలిఏడాది మూడు లక్షలు, రెండో ఏడాది పదకొండు లక్షలు. దురదృష్టవశాత్తూ మూడో ఏడాది కరోనా కారణంగా ఆశించినంత ఆదాయం రాలేదు. దాంతో ప్రాచీ తన ఐడియాలతో వ్యాపారం పుంజుకునేలా చేయడంతో... గతేడాది (నాలుగో సంవత్సరం) ఒక్కసారిగా 35.5 లక్షలకు చేరింది. ఐదు వందల నుంచి ఇరవై వేల రూపాయల ధరల్లో ఉన్న 70 రకాల ఛౌఖట్ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా ఆర్డర్లు వస్తున్నాయి. తను డిజైన్ చేసిన వస్తువులను స్కూటీ మీద మోసుకెళ్లిన ప్రాచీ ఇటీవలే తన సొంత డబ్బులతో కారు కొనుక్కుంది. ► రాయి శిల్పంగా మారినట్టు.. ‘‘నేను నడిచిన దారిలో అనేక బెదిరింపులు, వయసు వివక్షలు వంటి అనేక ఇబ్బందులు, సమస్యలు, ఒత్తిళ్లు ఎదురయ్యేవి. అయితే ఉలి దెబ్బలకు రాయి శిల్పంగా మారినట్లు వీటన్నింటిని భరిస్తూనే ఈ స్థాయికి వచ్చాను. భవిష్యత్‌లో చౌఖట్ టర్నోవర్‌ను నాలుగు వందల కోట్లకు తీసుకెళ్లాలి. ఇంటి అలంకరణ వస్తువులు కావాలంటే కస్టమర్లు నా చౌఖట్ను ఎంచుకునే స్థాయికి ఎదుగుతాను’’ అని ప్రాచీ సగర్వంగా చెబుతోంది. -
Video: బైక్‌పై లవర్స్ రొమాన్స్.. రహదారిపై హగ్‌లతో రెచ్చిపోయిన జంట
ఈ మధ్య యువత రెచ్చిపోతున్నారు. పబ్లిసిటీ కోసం పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా గమనించకుండా.. న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అదేదో ఫ్యాషన్, ట్రెండ్‌గా ఫీల్ అయిపోయి అసభ్యకర చేష్టలతో వార్తల్లోకెక్కుతున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ప్రవర్తనతో వైరల్‌గా మారి పోలీసులకు దొరికినా కొంతమందిలో మార్పు రావడం లేదు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఘాజియాబాదద్లో ఓ ప్రేమ జంట నడిరోడ్డుపై బైక్ మీద విచ్చలవిడి చేష్టలతో కనిపించారు. ఇందిరాపురం సమీపంలోని రద్దీగా ఉండే ఎన్‌హెచ్9 రహదారిపై ప్రమాకరంగా లవర్స్ రొమాన్స్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. స్పీడ్‌గా వెళ్తోన్న బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై యువకుడికి ఎదురుగా కూర్చున్న యువతి అతన్ని గట్టిగా కౌగిలించుకోవడం వీడియోలో కనిపిస్తోంది. ఇంకో విషయం ఏంటంటే ఇద్దరూ కనీసం హెల్మెట్ కూడా ధరించలేదు. చదవండి: బావా మరదలు సరదా ఆట! అసలు విషయం తెలియడంతో పెళ్లి క్యాన్సిల్ ఈ ఘటన జూన్ 20 మంగళవారం సాయంత్రం చోటు చేసుకోగా.. దీనిని అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు దీన్ని వీడియో తీశారు. అనంతరం ట్విటర్లో పోస్టు చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పాపులారిటీ కోసం వాహనాలపై ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నారని, బాధ్యత రహితంగా ప్రవర్తించిన ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని యూపీ ముఖ్యమంత్రి, పోలీసులను కోరారు. మరోవైపు ఈ ఘటనపై ఘజియాబాద్ కమిషనరేట్ డీసీపీ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోను పరిశీలించి.. సదరు జంటపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇందిరాపురం ఎస్సైని ఆదేశించారు. #गाजियाबाद में आशिक मिजाज बाइक सवार की वीडियो हुई वायरल इंदिरापुरम के NH 9 का बताया जा रहा है । वो कहते है ना - "हम तो मरेंगे सनम तुम्हे साथ लेके मरेंगे " पर नियम कानून ताक पर रख के ही सफर करेंगे ।@Gzbtrafficpol @uptrafficpolice @sacchayugnews pic.twitter.com/xPmSgzbfmO — Akash Kumar (@Akashkchoudhary) June 20, 2023 ट्विटर से प्राप्त शिकायत का संज्ञान लेते हुए, चालानी कार्यवाही की गई। pic.twitter.com/7HGAhqfkPF — Gzb Traffic police (@Gzbtrafficpol) June 21, 2023 -
ఆ ఇంట్లో బిగ్గరగా సంగీతం.. చివరికి షాకింగ్ ఘటన వెలుగులోకి..
ఢిల్లీ: ఘజియాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ ఇంట్లో నగలు చోరీ చేసిందనే అనుమానంతో 23 ఏళ్ల మహిళను ఆమె బంధువులే చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు. సమీనా అనే మహిళ ఘజియాబాద్‌లోని సిద్ధార్థ్ విహార్‌లో ఉన్న తన బంధువులు హీనా, రమేష్‌ల ఇంటికి బర్త్‌డే వేడుకకు వెళ్లింది. ఇంట్లో రూ.5 లక్షల విలువైన ఆభరణాలు కనిపించకపోవడంతో సమీనా చోరీ చేసిందని ఆ దంపతులు అనుమానించారు. చేసిన తప్పు ఒపుకోవాలంటూ బ్లేడ్, రాడ్‌తో దాడి చేశారు. వారికి బంధువులు కూడా తోడయ్యారు. ఆ మహిళ రక్షించాలంటూ కేకలు వేయడంతో, అరుపులు వినపడకుండా అధిక సౌండ్‌తో మ్యూజిక్ ప్లే చేశారు. చిత్రహింసల కారణంగా సమీనా మృతిచెందగా, నిందితులు పరారయ్యారు. కానీ మ్యూజిక్ ఆఫ్ చేయడం మరిచిపోయారు. రెండు రోజులుగా ఇంట్లో పెద్దగా సంగీతం వినిపించడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవికుమార్ తెలిపారు. చదవండి: యువకుడి బైక్‌పై మహిళ.. గమనించిన భర్త.. వారిని వెంబడించి.. -
విషాదం నింపిన హోలీ.. బాత్రూమ్లోకి వెళ్లి భార్యభర్తలు మృతి!
ఉత్తర ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్లోని బాత్రూమ్లో ఓ జంట అనుమానాస్పదంగా మృత్యువాతపడింది. హోలీ అనంతరం స్నానం కోసం వెళ్లిన దంపతులు బాత్రూమ్లో శవమై కనిపించారు. ఈ దురదృష్ట ఘటన ఘజియాబాద్ జిల్లా మురాద్‌నగర్ పట్టణంలోని అగ్రసేన్ మార్కెట్ సమీపంలో వెలుగు చూసింది. మృతిచెందిన దంపతులను దీప్కా గోయల్ (40), అతని భార్య శిల్పి (36)గా గుర్తించారు. వివరాలు.. తమ కుటుంబ సభ్యులతో గోయల్, శిల్పి గురువారం ఎంతో ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. తర్వాత మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రంగులు కడుక్కొని, స్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లిన జంట తిరిగి బయటకు రాలేదు. అనుమానించిన కుటుంబ సభ్యులు బలవంతంగా బాత్రూమ్ తలుపులు పగలగొట్టి చూడగా.. ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే దంపతులను ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం దంపతుల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. అయితే బాత్రూమ్లో సరైన వెంటిలేషన్ లేకపోవడం, గీజర్ నుంచి వెలువడే విష వాయువుల వల్లే ఊపిరాడక చనిపోయి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇళ్లంతా తనిఖీ చేసినప్పటికీ ఎలాంటి అనుమానాస్పదంగా అనిపించలేదని తెలిపారు. కాగా, పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతనే వారి మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మరో ఘటనలో మోదీనగర్‌లో హోలీ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ 30 ఏళ్ల వినీత్ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పద గుండెపోటుతో మరణించాడు. లక్ష్మీ నగర్ నివాసికి చెందిన వినీత్ హోలీ వేడుకల్లో డ్యాన్స్ చేస్తున్న సమయంలో కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుండెపోటుతో మృతిచెందినట్లు పేర్కొన్నారు. -
ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఆత్మహత్యాయత్నం.. 15 నిమిషాల్లోనే
ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇన్‌స్టా, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా, పోలీసులు సకాలంలో స్పందించడంతో యువకుడిని క్షేమంగా రక్షించారు. మెటా ఈమెయిల్ అలారం ద్వారా స్పందించిన పోలీసులు 15 నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకోవడంతో వ్యక్తి ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలు..యూపీలోని కన్నౌజ్ ప్రాంతానికి చెందిన 23ఏళ్ల అభయ్ శుక్లా అనే యువకుడు ప్రస్తుతం ఘజియాబాద్‌లోని విజయ్ నగర్లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈవీడియోను గమనించిన కాలిఫోర్నియాలోని మెటా హెడ్‌క్వార్టర్స్ ఉత్తర ప్రదేశ్ పోలీసులకు చెందిన సోషల్ మీడియా సెంటర్‌కు ఈమెయిల్ అలర్ట్ పంపింది. శుక్లా రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌ను కూడా పంపించింది. చదవండి: జమ్మూ కశ్మీర్లో జోషిమఠ్ పరిస్థితులు.. కుంగుతున్న భూమి, ఇళ్లకు పగుళ్లు వెంటనే అప్రమత్తమైన యూపీ పోలీసులు వ్యక్తి వివరాలను ఘజియాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు.. అటు నుంచి విజయ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడి ఫోన్ నెంబర్ ఆధారంగా కేవలం 15 నిమిషాల్లోనే లోకేషన్ ట్రేస్ చేసి సంఘటన స్థలానికి చేరుకొని వ్యక్తి ప్రాణాలు రక్షించారు. బాధితుడిని కుటుంబ సభ్యులకు అప్పగించే ముందు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే సోదరి వివాహం కోసం తల్లి కూడబెట్టిన 90,000 రూపాయలను శుక్లా అప్పుగా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ మెత్తాన్ని బిజినెస్ వెంచర్లో తనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఉపయోగించడంతో డబ్బులు అన్నీ పోగొట్టుకోవడంతో ఆత్మహత్యకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయం ఇక మీదట తీసుకోవద్దని హెచ్చరించినట్లు చెప్పారు. చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగికి షాక్! అటు ఉద్యోగం, ఇటు పెళ్లి చేసుకునే పిల్లా? -
బైక్ నడుపుతూ బీర్ తాగిన యువకుడు.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు
లక్నో: ఓ యువకుడు అతిగా ప్రవర్తించాడు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతూ బీర్ తాగాడు. రహదారిపై ఇతడు చేసిన చేష్టలను స్నేహితులే వీడియో తీశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన ఉత్తర ప్రదేశ్ గాజియాబాద్ పోలీసులు యువకుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. రూ.31,000 చలనా విధించారు. హెల్మెట్ ధరించకపోగా బైక్ నడుపుతూ మద్యం సేవించినందుకు ఇంత భారీమొత్తంలో జరిమానా వేశారు. ఇందుకు సంబంధించిన చలానాను సోషల్ మీడియాలో షేర్ చేశారు. #Ghaziabad DME पर बीयर पीकर रील रिकॉर्ड करने वाले इस सूरमा ने तो @Gzbtrafficpol की चालानी कार्यवाई की पोल खोल दी, DME पर 2 व्हीलर नही जा सकते यहाँ तो पूरी शूटिंग जारी है। मसूरी थाना क्षेत्र है। @ghaziabadpolice @uptrafficpolice @sharadsharma1 @bstvlive @DCPRuralGZB pic.twitter.com/Mvbj2sFZ2H — Lokesh Rai 🇮🇳 (@lokeshRlive) January 20, 2023 చదవండి: రష్యా నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు -
Video: రెస్టారెంట్లో దరిద్రం.. ఉమ్మివేస్తూ రోటీల తయారీ..
రోజూ ఇంట్లో తయారు చేసిన ఫుడ్ తిని బోర్ కొట్టి వారానికి ఒకసారి అయిన బయట భోజనం చేయాలని చాలా మందికి ఉంటుంది. హోటల్‌కి వెళ్లి నచ్చి ఆహారం తెచ్చుకోవడం లేదా ఆర్డర్ పెట్టడం చేస్తుంటారు. అయితే వెళ్లిన హోటల్ మంచిదేనా.. వారు వంట ఎలా చేస్తున్నారో అసలు పట్టించుకోం. రుచిగా ఉందా అని మాత్రమే ఆలోచిస్తాం. కానీ కొన్ని హోటళ్లలో కనీస శుచి, శుభ్రత పాటించకుండా దారుణంగా వంట చేస్తారు. దీనికి తోడు ఇటీవల కాలంలో ఆహార పదార్థాలు, స్నాక్స్ తయారు చేస్తూ వాటిలో ఉమ్మివేసిన ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి మరొ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. రెస్టారెంట్లో తందూరీ రోటీని తయారు చేస్తున్న ఓ వ్యక్తి పిండిపై ఉమ్మివేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో గురువారం జరిగింది. సాహిదాబాద్ ప్రాంతంలోని రెస్టారెంట్లో తసీరుద్దీన్ అనే వ్యక్తి తందూరి రోటీలపై ఉమ్మివేస్తూ తయారు చేస్తున్నాడు. దీనిని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సదరు రెస్టారెంట్‌ను మదీనా హోటల్‌గా గుర్తించిన తిలా మోర్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై బుధవారం 269, 270 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామని, అతనిపై చర్యలు తీసుకుంటామని సాహిబాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పూనమ్ మిశ్రా వెల్లడించారు. చదవండి: Delhi: మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు వేధింపులు.. బయటకొచ్చిన వీడియో..! Uttar Pradesh | A video was going viral on social media from the area under Tila More police station, in which a man was making rotis by applying spit. Accused Taseeruddin has been arrested in the case & further legal action is being taken: Poonam Mishra, ACP, Sahibabad (19.01) pic.twitter.com/cHi5jtOrwi — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 20, 2023 -
వీడేం మనిషి రా బాబు.. ఉమ్మివేస్తూ రోటీల తయారీ..
-
ఫార్చునర్ కారు కట్నంగా ఇవ్వలేదని పెళ్లి రద్దు చేసుకున్న లెక్చరర్..
లక్నో: తాను అడిగిన ఫార్చునర్ కారును కట్నంగా ఇవ్వలేదని పెళ్లినే రద్దు చేసుకున్నాడు ఓ ప్రభుత్వ కళాశాల లెక్చరర్. ఈ వివాహం తనకు వద్దని పెళ్లికుతూరుకు మెసేజ్ చేసి చెప్పాడు. దీంతో ఆమె కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. పెళ్లికొడుకుపై కేసు పెట్టారు. ఉత్తర్‌ప్రదేశ్ ఘాజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. పెళ్లికొడుకు పేరు సిద్ధార్థ్ విహార్. ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయింది. అయితే తనకు కట్నంగా ఫార్చునర్ కారు ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం వాగన్ఆర్ కారును బుక్ చేశారు. ఈ విషయం తెలిసిన పెళ్లికొడుకు కుటుంబసభ్యులు తమకు ఫార్చునర్ కారే కావాలని పట్టుబట్టారు. కానీ పెళ్లికూతురు కుటుంబం మాత్రం వాగన్ఆర్ మాత్రమే ఇప్పిస్తామని చెప్పింది. దీంతో ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు వధువుకు మేసేజ్ ద్వారా తెలియజేశాడు వరుడు. మరో ఘటనలో పెళ్లికొడుకు నచ్చలేదని.. అంతకుముందు ఉత్తర్‌ప్రదేశ్ ఇటావాలో కూడా ఓ పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. పెళ్లిమండపంలో దండలు మార్చుకున్న తర్వాత ఓ పెళ్లికూతురు అనూహ్యంగా పెళ్లి రద్దు చేసుకుంది. అక్కడి నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. పెళ్లి చూపుల్లో తాను చూసిన అబ్బాయి, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న అబ్బాయి వేరని వధువు చెప్పింది. ఈ అబ్బాయి నల్లగా ఉన్నాడని, తనకు నచ్చలేదని పేర్కొంది. ఇక చేసేదేమీ లేక పెళ్లికొడుకు కుటుంబం కూడా పెళ్లిని రద్దు చేసుకునేందుకు అంగీకరించింది. అయితే తాము పెళ్లికూతురుకు పెట్టిన నగలు తిరిగి ఇవ్వలేదని వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెళ్లి ఏర్పాట్లకు రూ.లక్షలు ఖర్చు అయ్యాయని తెలిపారు. చదవండి: స్వలింగసంపర్క వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు -
తనతో రాత్రి గడిపేందుకు ఒప్పుకోలేదని ప్రియురాలిని చంపిన ప్రియుడు
వయసుతో సంబంధం లేకుండా ప్రేమ, సహజీవనం పేరుతో పలువురు హద్దుమీరుతున్నారు. పరాయి వ్యక్తుల మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య కేసు ఇందుకు నిదర్శనంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఉదంతం అనంతరం ఇలాంటి కోవకే చెందిన మరిన్ని ఘటనలు నమోదవుతుండటం కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా తనతో కలిసి రాత్రి హోటల్లో గడిపేందుకు నిరాకరించిందని ప్రియురాలిని హత్య చేశాడు ఓ ప్రియుడు. ఈ ఘోర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. యూపీలోని బాగ్‌పట్‌కు చెందిన రచన(44) ఓప్రైవేటు కంపెనీలో క్లర్క్‌గా పనిచేస్తోంది. భర్త రాజ్ కుమార్ కూలీ పనులు చేస్తుంటాడు. అయితే రచనకు గత కొన్ని నెలలుగా బిహార్ రాష్ట్రంలోని భోజ్‌పూర్‌కు చెందిన వ్యక్తితో(34) పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 23న మీరట్‌లో కలుసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. అక్కడే హోటల్లో రెండు రాత్రులు బస చేసిన తర్వాత ఆదివారం సాయంత్రం ఘాజియాబాద్ చేరుకున్నారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మహిళ తన ప్రియుడు గౌతమ్ కలిసి హోటల్లో దిగారు. సోమవారం ఉదయం 10.30 నిమిషాలకు గౌతమ్ హోటల్ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. హోటల్ హౌజ్ కీపింగ్ సిబ్బంది మధ్యాహ్నం గదిలోకి వెళ్లి చూడగా రచన విగత జీవిగా కనిపించింది. వెంటనే హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బృందం సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రచన మృతిపై భర్తకు సమాచారం ఇచ్చి.. ఘటనపై విచారణ ప్రారంభించారు. చదవండి: Hyderabad: వజ్రాలు కొట్టేసి..గోవా చెక్కేసి.. డైమండ్స్ విలువ తెలియక.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడు గౌతమ్‌ను మురాద్‌నగర్‌లోని గంగ కెనాల్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. గత నాలుగు నెలలుగా రచనతో పరిచయం ఉందని అతడు వెల్లడించాడు. హోటల్లో తనతో కలిసి రాత్రి ఉండేందకు ఒప్పుకోలేదని, ఇంటికి వెళ్తానని పట్టుపట్టడంతో.. ఆవేశంతో గొంతు నులిమి చంపినట్లు గౌతమ్ అంగీకరించినట్లు న్నట్లు మురాదాబాద్ పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రే రచనను హత్య చేసి ఆ రాత్రంతా అదే గదిలో గడిపినట్లు తేలింది. ఐపీసీ సెక్షన్ 302, 506 సెక్షన్ల ప్రకారం హంతకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా ఆఫీస్‌కు వెళ్తున్నానని చెప్పి డిసెంబర్ 23న ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు రచన భర్త తెలిపారు. ‘అదే రోజు రాత్రి 8 గంటల వరకు రచన ఇంటికి రాకపోయే సరికి నేను కాల్ చేశాను. ఆఫీస్‌లో మీటింగ్ ఉంది ఆలస్యం అవుతుందని చెప్పింది. కానీ రాత్రి 11 గంటల వరకు కూడా ఆమె రాకపోవడంతో మళ్ల ఫోన్ చేయగా స్వీచ్ఛాఫ్ వచ్చింది. దీంతో తన ఆఫీస్‌కు వెళ్లాను. తను ఆ రోజు అసలు ఆఫీస్‌కే రాలేదని అప్పుడే తెలిసింది. డిసెంబర్ 25న ఉదయం 5గంటలకు తనే కాల్ చేసి ఇంటికి వస్తున్నట్లు తెలిపింది. కానీ ఎక్కడుందో వెల్లడించలేదు. అదే రోజు రాత్రి 10 గంటలకు మళ్లీ ఫోన్ చేసి ఘజియాబాద్‌లోని హోటల్లో ఉన్నట్లు, తనను గౌతమ్ ఇంటికి రానివ్వడం లేదని చెప్పి సాయం చేయాలని కోరింది. ఆమె కోసం వెతుకుతుండగానే సోమవారం మధ్యాహ్నం పోలీసులు కాల్ చేసి రచన చనిపోయినట్లు తెలిపారు’ అని భర్త రాజ్ కుమార్ తెలిపాడు. -
నర్సు నిర్వాకం.. ఊహించని రీతిలో పట్టించిన 13 ఏళ్ల కూతురు
భర్తను చంపి ఏమి ఎరుగనట్టు ఆస్పత్రికి తీసుకవచ్చింది ఓ నర్సు. ఆత్యహత్య చేసుకుని చనిపోయాడంటూ వైద్యులను నమ్మించేందుకు యత్నించి కటకటాల పాలయ్యింది. ఈ ఘటన ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..కవిత అనే మహిళ నర్సుగా పనిచేస్తోంది. ఆమె నవంబర్ 29న భర్తతో గోడవ పడి ఆవేశంలో చంపేసింది. ఆ తర్వాత ఏమి తెలియనట్లు తాను పనిచేసే ఆస్పత్రికే తీసుకువచ్చింది. వైద్యులకు భర్త దుప్పటితో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు చెప్పింది. దీంతో ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించి పోస్ట్‌మార్టం కార్యక్రమాలు నిర్వహించారు. పోస్ట్‌మార్టం నివేదికలో సదరు వ్యక్తి గొంతుపై ఊపిరాడకుండా చేసిన గుర్తులు ఉన్నట్లు పేర్కొంది. దీంతో పోలీసులు అనుమానంతో కవితను గట్టిగా విచారించగా...తన భర్త మహేశ్ తాగి వచ్చి తరుచు కొడుతూ ఉండేవాడని చెప్పింది. ఇలానే నవంబర్29న ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, దీంతో తన భర్త నిద్రపోతున్నప్పుడూ గొంతు నులిమి చంపినట్లు పేర్కొంది. అంతేగాదు ఆమె 13 ఏళ్ల కూతుర్ని కూడా విచారించగా...వాళ్ల అమ్మ కవిత తన తండ్రి నోటిని మూసి చంపుతుండటం చూసినట్లు తెలిపింది. విచారణలో భాగంగా ఆమె ఫోన్‌ని కూడా తనిఖీ చేయగా ఆమె ఆస్పత్రిలో ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వినయ్ శర్మతో ఆమెకు సంబంధం ఉందని తేలింది. ఈ హత్యలో వినయ్ ప్రమేయం కూడా ఉన్నట్లు చెప్పే.. వాట్సప్ చాట్లు, ఆడియో రికార్డులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. దీంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: ఇల్లరికపు అల్లుడు షాకింగ్ ట్విస్ట్.. భార్యకు వివాహేతర సంబంధం ఉందని..) -
Video: లిఫ్ట్‌లో ఇరుక్కున్న ముగ్గురు చిన్నారులు.. భయంతో కేకలు, ఏడుపు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో మరో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఓ సొసైటీ లిఫ్ట్‌లో ముగ్గురు చిన్నారులు ఇరుక్కుపోయారు. 8 నుంచి 10 సంవత్సరాల వయసున్న ముగ్గురు బాలికలు దాదాపు 25 నిమిషాల పాటు అందులోనే ఉండిపోయారు. ఘజియాబాద్‌లోని క్రాసింగ్స్ రిపబ్లిక్ టౌన్షిప్లో గల అసోటెక్ ది నెస్ట్‌లో నవంబర్ 29న ఈ ఘటన చోటుచేసుకుందిఈ దృశ్యాలన్నీ లిఫ్ట్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ముగ్గురు చిన్నారులు లిఫ్ట్‌లో ఉండగా అది సడెన్‌గా ఆగిపోయింది. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసేందుకు చిన్నారులు ఎంత ప్రయత్నించినా అది తెరుచుకోలేదు. ఎమర్జెన్సీ బటన్ నొక్కినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ముగ్గురిలో ఇద్దరు చిన్నారులు భయంతో ఏడవడం ప్రారంభించారు. మరో చిన్నారి వారికి దైర్యం చెప్పేందుకు ప్రయత్నించింది. లిఫ్ట్ డోర్‌ను బలంగా కొడుతూ.. సాయం కోసం గట్టిగా అరిచింది. అంతేగాక తన రెండు చేతులతో బలవంతంగా డోర్ తెరిచేందుకు ప్రయత్నించింది. అయినా అది ఓపెన్ కాపోవడంతో భయాందోళనకు గురైంది. ప్రాణ భయంతో ముగ్గురు పిల్లలు ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ, ఏడ్చడం వీడియో స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు ఆ చిన్నారులు అందులోనే ఉండిపోయారు. అనంతరం ఎట్టకేలకు చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చదవండి: నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు #Ghaziabad क्रासिंग रिपब्लिक के assotech Nest society में बीती शाम 3 मासूम बच्चियां लिफ्ट में 25 मिनट तक फंसी रही, बेहद मुश्किलात के बाद उन्हें बाहर निकाल लिया गया,AOA के अध्यक्ष और सचिव के खिलाफ FIR दर्ज हुई है।यूपी की सोसाइटी में लिफ्ट एक्ट की जरूरत है @ghaziabadpolice @UPGovt pic.twitter.com/D0IsBChls9 — Lokesh Rai 🇮🇳 (@lokeshRlive) December 1, 2022 ఈ ఘటనపై చిన్నారుల తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొసైటీ లిఫ్ట్‌లో జనాలు తరుచూ చిక్కుకుంటున్నారని, దీనిపై ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని తెలిపారు. లిఫ్ట్ ఆగిపోయిన సమయంలో అందులో సీనియర్ సిటీజన్లు, చిన్నారులు ఉంటే వారి ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని వాపోయారు. చిన్న పిల్లలు లిఫ్ట్ వాడేందుకే భయపడుతున్నారని తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అపార్ట్మెంట్ బిల్డర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సొసైటీలో ఉన్న లిఫ్ట్లల్లో తరచూ ఇలాంటి సమస్యలే తలెత్తుతున్నాయని చెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా అపార్ట్మెంట్ బిల్డర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులతో బెంచ్.. చరిత్రలో మూడోసారి.. -
జస్ట్ మిస్....లేదంటే పాపం ఆ చిన్నారి....
ఘజీయిబాద్: ఇటీవలకాలంలో చిన్నారులపై తరుచుగా వీధికుక్కల దాడులు గురించి వింటున్నాం. మొన్నటికి మొన్న ఒక మూడేళ్ల బాలుడు కుక్కల దాడిలో మృతి చెందాడు. అంతకుముందు ఒక పదేళ్ల చిన్నారి కుక్కల దాడిలో దారుణంగా గాయపడింది. ఈ ఘటనలు మరువక మునుపే అచ్చం అలాంటి ఘటనే ఘాజియా బాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....ఘజియాబాద్‌లోని 11 ఏళ్ల బాలికపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసేందుకు యత్నించాయి. ఆ చిన్నారి తన అపార్టమెంట్ కమ్యూనిటీ నుంచి బయటకు వెళ్లగా ఒక్కసారిగా ఎక్కడ నుంచి వచ్చాయో ఏమో! ఒక కుక్కల గుంపు ఆ చిన్నారి వెంట పడ్డాయి. దీంతో ఆ చిన్నారి ఒక్క ఊదుటన వేగంగా పరుగుతీసి తన అపార్టమెంట్స్ కమ్యూనిటీ గేట్లోకి వెళ్లిపోవటంతో ఆ కుక్కల బారి నుంచి తప్పించుకోగలిగింది. ఆమె ఇలా గేట్లోకి రాగానే వెంటనే అక్కడ ఉన్నసెక్యూరిటీ సిబ్బంది బయటకు వచ్చారు. దీంతో ఆ క్కుక్కల తోక ముడిచి వెనుదిరిగాయి. జస్ట్ మిస్ లేదంటే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ కుక్కల దాడి కి బలయ్యి ఉండేది. ➡स्ट्रीट डॉग के झुंड ने बच्ची पर किया हमला ➡कुत्तों के हमले की घटना CCTV में कैद ➡बच्ची चिल्लाते हुए वापस सोसायटी में घुसी ➡लेकिन एक कुत्ते ने बच्ची के पैर में काट लिया ➡बच्ची के चिल्लाने पर गार्ड दौड़कर पुहंचे ➡वैशाली की रामप्रस्था ग्रीन सोसायटी का मामला।#Ghaziabad pic.twitter.com/3Dmh0HGh6L — भारत समाचार | Bharat Samachar (@bstvlive) November 20, 2022 (చదవండి: 'నా పేరు సరిచేయండి' మహా ప్రభో! కుక్కలా మొరుగుతూ నిరసన) -
కలకలం.. జైల్లో 140 మంది ఖైదీలకు హెచ్ఐవీ నిర్ధారణ
లక్నో: జైలులో 140 మంది ఖైదీలకు హెచ్ఐవీ నిర్ధారణ కావడం సంచలనం రేపుతోంది. మరో 35 మందికి టీబీ ఉన్నట్లు తేలింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్‌లోని దాస్నా జైలులో వెలుగు చూసింది. ఈ విషయాన్ని స్వయంగా జైలు సీనియర్ అధికారులే ధ్రువీకరించారు. మొత్తం జైలులో 5500 మంది ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా.. అందులో 140 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలిందని వెల్లడించారు. కాగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. జైలు లోపలికి వచ్చే ప్రతీ ఖైదీకి హెచ్ఐవీ, టీబీ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి. ఘజియాబాద్ జైలులోని ఖైదీలకు ఎమ్‌ఎమ్‌జీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న యాంటీరెట్రోవైరల్ థెరపీ సెంటర్ వైద్యులు పరీక్షలు చేస్తారని జైలు సూపరింటెండెంట్ అలోక్ కుమార్ సింగ్ తెలిపారు. 2016లో ఘజియాబాద్ దస్నా జిల్లా జైల్లోకి వచ్చిన ఖైదీలకు పరీక్షలు చేయగా అందులో 46 మందికి హెచ్ఐవీ నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి వారు జైల్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం హెచ్ఐవీ బారిన పడిన బాధితుల సంఖ్య 140కి చేరిందని అలోక్ కుమార్ సింగ్ తెలిపారు. అందులో 35 మందికి టీబీ కూడా సోకిందని వెల్లడించారు. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా హెచ్ఐవీ రోగులకు చికిత్స అందిస్తున్నామన్నారు. పరిమితికి మించిన ఖైదీలతో దస్నా జైలు కిక్కిరిసి పోయిందని అధికారులు తెలిపారు. జైలులో 1706 మంది ఖైదీలను మాత్రమే ఉంచేందుకు సదుపాయాలు ఉండగా.. ప్రస్తుతం జైలులో మొత్తం 5,500 మంది ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 120 నుంచి 150 మంది హెచ్ఐవీ బాధితులు జైల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఈ వ్యాధి స్పర్శ ద్వారా వ్యాపించదని, ప్రభుత్వ సూచనల మేరకు ఈ ఖైదీలందరినీ సాధారణ ఖైదీలతో పాటు ఉంచుతున్నామని అధికారులు చెప్పారు. ప్రస్తుతానికి భయపడాల్సిన పని లేదన్నారు. హెచ్ఐవీ బారిన పడిన ఖైదీల్లో ఎక్కువ డ్రగ్స్‌కు బానిసలని, డ్రగ్స్ కోసం వాడే సిరంజీలను వాడడం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడి ఉంటారని జైలు అధికారులు భావిస్తున్నారు. చదవండి: అది మసాజ్ కాదు.. ట్రీట్మెంట్.. జైలు వీడియోపై ఆప్ కౌంటర్.. -
ప్రియుడితో కలిసి భర్తను చంపి.. అదే ఇంట్లో గోతి తీసి.. నాలుగేళ్ల తర్వాత
లక్నో: నాలుగేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసును ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ పోలీసులు తాజాగా చేధించారు. ఈ కేసులో మృతుడి భార్య, పొరుగింటిలో నివాసముండే అరుణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మహిళ తన ప్రియుడు అరుణ్‌తో కలిసి భర్తను కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య చేసిన అనంతరం ప్రియుడు ఇంట్లోనే ఆరు అడుగుల గోతి తీసి అందులో మృతదేహాన్ని పూడ్చి పెట్టినట్లు తేలింది. గొయ్యిపై నుంచి సిమెంట్ ఫ్లోరింగ్ చేసిన తరువాత అరుణ్ అదే ఇంట్లో ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో నిందితుడి ఇంట్లో నుంచి కుళ్లిపోయిన మృతదేహాన్ని, అస్థిపంజరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే హత్య చేసేందుకు ఉపయోగించిన పిస్టల్, గొడ్డలిని కనుగొన్నారు. భర్తను చంపకముందే గొయ్యి తీసి సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహం దుర్వాసన రాకుండా లోతుగా తవ్వినట్లు తెలిపారు. చదవండి: Girlfriend Murder In Delhi: యువతితో సహజీవనం, హత్య, ముక్కలుగా నరికి.. ఢిల్లీ అంతటా 18 రోజుల్లో.. అసలేం జరిగిందంటే తన భర్త చంద్రవీర్ సింగ్ కనిపించకుండాపోయాడని సవిత అనే మహిళ 2018లో ఘజియాబాద్‌లోని సిహానీ గేట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. భార్య ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్నారు. భర్త అదృశ్యం వెనక అతని తమ్ముడి హస్తం ఉన్నట్లు భార్య తన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ కేసులో సరైన సాక్క్క్ష్యాధారాలు లేకపోవడంతో మూసివేశారు. నాలుగు సంవత్సరాల తరువాత ఇటీవల ఈ కేసులోఘజియాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులకు కొన్ని ఆధారాలు లభ్యమవ్వడంతో మళ్లీ విచారణ ప్రారంభించినట్లు ఎస్పీ దిక్ష శర్మ తెలిపారు. ఈ క్రమంలోనే మృతుడి భార్య సవిత, ప్రియుడు అరుణ్ అలియాస్ అనిల్ కుమార్ కలిసి చంద్రవీర్‌ను హత్య చేసినట్లు వెల్లడైంది. ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించగా తమ నేరాన్ని అంగీకరించారు. 2017 నుంచి తమ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని నిందితులు పోలీసులకు వెల్లడించారు. ఈ విషయం భర్తకు తెలియడంతో తరుచూ గొడవలు జరిగేవని భార్య సవిత తెలిపింది. మరోసారి ఇలా జరగవద్దని పలుమార్లు హెచ్చరించాడని పేర్కొంది. #SSP_GZB @IPSMUNIRAJ के निर्देशन में क्राइम ब्रांच व थाना नन्दग्राम द्वारा 04 वर्षाें से लापता चल रहे चंद्रवीर उर्फ पप्पू नामक व्यक्ति की हत्या का खुलासा, पत्नी सहित प्रेमी गिरफ्तार, अभियुक्तगण ने हत्या कर शव को घर में दफना दिया था। मृतक का शव व घटना में प्रयुक्त आलाकत्ल बरामद। pic.twitter.com/NrGvHBEs1Y — GHAZIABAD POLICE (@ghaziabadpolice) November 14, 2022 దీంతో చంద్రవీర్ తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి అతడిని హత్య చేసేందుకు సవిత, అరుణ్ పథకం వేశారు. సెప్టెంబర్ 28, 2018న చంద్రవీర్ అర్థరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. వెంటనే సవిత అరుణ్‌ను ఇంట్లోకి పిలిపించడంతో.. చంద్రవీర్ గదిలోకి వెళ్లి అతని తలపై కాల్చి చంపాడు. అనంతరం అతని మృతదేహాన్ని ఎత్తుకుని అతని ఇంటికి తీసుకెళ్లాడు. అరుణ్ ఇంటి వద్ద సవిత సాయంతో ఆరడుగుల గొయ్యి తవ్వి అందులో చంద్రవీర్ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఇక ఈ కేసులో నిందితులైన సవిత, అరుణ్‌ను కోర్టులో హజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. -
అరే! ఏం మనుషుల్రా ఇంత రాక్షసత్వమా!
ఇటీవల మోగ జీవాల పట్ల కొంత మంది మనుషులు అత్యంత హేయంగా ప్రవర్తిస్తున్నారు. అదీకూడా కుక్కలపై అత్యంత ఘోరమైన అకృత్యాలకు పాల్పడుతున్నారు. మొన్నటికి మొన్న ఒక వ్యక్తి కుక్క మెడకు గొలుసు వేసి దాన్ని తన బైక్‌కి కట్టి ఈడ్చుకెళ్లడం, అంతకముందు ఒక కుక్క పదేపదే మొరుగుతుందని ఇటుకతో కొట్టి చంపేయడం వంటి కిరాతకాలకు ఒడిగడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడూ ముగ్గురు వ్యక్తులు ఒక కుక్క చనిపోయేలా ఉరి వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు వ్యక్తులు ఒక కుక్కను చిత్రహింసలకు గురిచేసి, ఆ కుక్క మెడకు ఉరి వేసి ఆనందించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఒక బిల్డింగ్ కనస్ట్రక్షన్ సైట్ వద్ద ముగ్గురు దుండగులు ఒక కుక్క మెడను గొలుసుతో ఒక గోడకు ఉరిలా వేలాడి దీసి రకరకాలుగా హింసించడం మొదలు పెట్టారు. అందుకు సంబంధించిన ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. ఐతే పోలీసులు ఈ ఘటన మూడు నెలల క్రితం జరిగిన ఘటన అని, సదరు వ్యక్తులకు పిలిపించి నోటీసులు జారీ చేశామని తెలిపారు. बेजुबान की बेरहमी से हत्या!#Ghaziabad : लोनी के पास ट्रॉनिका सिटी के इलाइचीपुर से कुत्ते को बेरहमी से मार देने का वीडियो हुआ वायरल, कुत्ते को जंजीर से लटका कर मारने का वीडियो वायरल हुआ है। मामले में पुलिस कर रही जांच पड़ताल। #Viralvideo@ghaziabadpolice @Uppolice pic.twitter.com/LTSsBBFz3F — निशान्त शर्मा (@Nishantjournali) November 14, 2022 (చదవండి: అమ్మనా జర్మనీ కోడలా?.. వైరల్) -
వీడియో: అంత బలుపెందుకు భయ్యా.. హైస్పీడ్‌లో బైకును ఢీకొట్టి..
అతి వేగం ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. అయితే, హై స్పీడ్‌లో ఉన్న ఓ కారు డ్రైవర్ రెచ్చిపోయాడు. నా కారుకే అడ్డు వస్తారా అనుకున్నాడో ఏమో.. రెండు బైకులకు కారుతో ఢీకొట్టి.. ఓ బైక్‌ను ఏకంగా కిలోమీటర్ దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. ఈ క్రమంలో తన కారుకు అడ్డుగా వచ్చిన రెండు బైకులను ఢీకొట్టాడు. అనంతరం.. కింద పడిపోయిన ఓ బైకును తన కారు ముందు భాగమైన బంపర్ కింద పెట్టుకుని దాదాపు కిలోమీటర్ దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ క్రమంలో బైక్.. రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్తుండగా రోడ్డుమీద మెరుపులు సైతం రావడం విశేషం. ఇంతలో మరో బైక్‌పై బైకర్లు ఇద్దరూ కారును వెంబడించి వీడియో తీశారు. వారిని గమనించిన కారు డ్రైవర్ కారును మరింత స్పీడ్‌తో డ్రైవ్ చేశాడు. ఇక, ఓ చోట కారును ఆపిన బైకర్లు.. డ్రైవర్‌ను కిందకు దిగాలని అడిగినప్పటికీ అతడు దిగేందుకు నిరాకరించాడు. అనంతరం.. ఈ ఘటనపై ఇందిరాపురం పరిధిలోని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో బైకర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. वीडियो चौकाने वाली हैं #Ghaziabad में सड़क पर दीवाली की चरखी नही बल्कि बाइक सवार 2 को टक्कर मारने के बाद कारचालक गाड़ी के अगले हिस्से में फंसी बाइक को 1 किमी तक घसीट ले गया जिससे चिंगारियां निकल रही है। ।घटना इंदिरापुरम के मंगल चौक की है pic.twitter.com/8RAJvBt1hl — Ankit Tiwari (@Unknowankitt) November 5, 2022 -
మరో ‘నిర్భయ’ కాదు.. అంతా ఉత్తుత్తి డ్రామా!
మరో నిర్భయ ఉదంతంగా.. సంచలనం సృష్టించిన ఘజియాబాద్ గ్యాంగ్ రేప్ కేసు ఉత్తదేనని పోలీసులు తేల్చారు. ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ట్వీట్‌తో ఈ కేసు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. 36 ఏళ్ల సదరు మహిళ ఉద్దేశపూర్వకంగానే సామూహిక అత్యాచార నాటకం ఆడినట్లు పోలీసులు ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్-ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో రెండు రోజుల కిందట వెలుగు చూసిన ఉదంతం.. దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. మహిళను అపహరించిన ఐదుగురు.. అత్యాచారం చేసి శారీరకంగా హింసించారనే ఉదంతం ప్రకంపనలు పుట్టించింది. కాళ్లు చేతులు కట్టేసి.. జననాంగాల్లో ఇనుపరాడ్లు పెట్టి ఓ గోనె సంచిలో కుక్కేసి ఢిల్లీ-ఘజియాబాద్ రూట్లోని ఆశ్రమ్ రోడ్డు దగ్గర పడేశారని, నిస్సహాయ స్థితిలో పడి ఉన్న ఆమెను గుర్తించి బుధవారం ఓ ఆస్పత్రిలో చేర్పించారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. అయితే.. పోలీసుల అదుపులో నిందితులు అయితే ఆమెతో వాళ్లకు ఆస్తి తగాదాలు ఉండడంతో.. ఈ కేసును ఆ కోణంలోనే విచారణ చేపట్టారు. ఈలోపు ఆమెకు పరీక్షలు నిర్వహించిన ఢిల్లీ జీటీబీ ఆస్పత్రి ఆమెకు అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదని తేల్చి చెప్పింది. దీంతో పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి. పైగా ఆమె ఆచూకీ లభ్యమైన తర్వాత రెండు ప్రభుత్వాసుపత్రులకు తీసుకెళ్లగా.. వైద్య పరీక్షలకు ఆమె నిరాకరించడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. బాధితురాలిగా చెప్పుకుంటున్న యువతి.. నాటకం ఆడిందని చెప్తున్న పోలీసులు చివరికి ఆమె మొబైల్ సిగ్నల్‌ను ట్రేస్ చేసి.. అసలు విషయాన్ని తేల్చేశారు పోలీసులు. స్నేహితురాలి బర్త్ డే పార్టీ ముగించుకుని ఇంటికి వస్తున్న తరుణంలో.. కారులో వచ్చిన నిందితులు తనను అపహరించుకు పోయి అఘాయిత్యానికి పాల్పడ్డారనేది ఆమె ఫిర్యాదు. అయితే.. ఆ సమయంలో ఆమెతో పాటు ఉన్న ఓ స్నేహితుడు.. అదే స్పాట్లో ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో.. అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. అంతేకాదు.. బాధితురాలిగా చెప్పుకుంటున్న మహిళ నుంచి ఆ స్నేహితుడికి పేటీఎం ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యిందని, ఈ వ్యవహారాన్ని అత్యాచారం కోణంలో ప్రచారం చేయించేందుకే అతనికి ఆమె డబ్బు ఇచ్చిందని పోలీసులు నిర్ధారించుకున్నారు. दिल्ली की लड़की से 5 लोगों ने किया गैंगरेप. उसके प्राइवेट पार्ट्स में रोड घुसा दी. लहूलुहान लड़की को बोरे में बांध कर सड़क पर फेंक दिया.@GhaziabadPolice के SSP को @DCWDelhi चेयरपर्सन @SwatiJaiHind ने दिया नोटिस दिया. वहशी दरिंदों के खिलाफ एक्शन हो @SandhyaTimes4u @NBTDilli pic.twitter.com/CMq4N1PMHc — सूरज सिंह/Suraj Singh 🇮🇳 (@SurajSolanki) October 19, 2022 ఆ ఐదుగురితో ఆస్తి తగాదాలు ఉండడంతోనే ఆమె అలా నాటకం ఆడిందని యూపీ రీజినల్ పోలీస్ చీఫ్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. తనపై రెండు రోజులు సామూహిక అత్యాచారం జరిగిందని చెప్తున్న టైంలో.. ఆమె తన స్నేహితులతో రిసార్ట్‌లో గడిపిందట. ఆ తర్వాత వాళ్ల సహకారంతోనే గ్యాంగ్ రేప్ డ్రామా ఆడిందని పోలీసులు దర్యాప్తులో తేల్చేశారు. పోలీసుల ప్రకటనపై బాధితురాలి నుంచిగానీ.. మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ నుంచిగానీ ఎటువంటి స్పందన రాలేదింకా. ఇదీ చదవండి: 3 నెలల కిందటే ప్రేమ పెళ్లి.. అఘాయిత్యానికి పాల్పడ్డ జంట -
వీడియో: లవర్‌తో భర్త షికార్లు.. పాపం ఇలా దొరికిపోతాడని అనుకోలేదేమో..
అతడికి అప్పటికే ఆమెతో వివాహం జరిగింది. వారి వివాహ బంధంలో కలతల కారణంగా భార్య.. భర్తకు దూరంగా పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో భర్త మరో యువతితో ఎంజాయ్ చేస్తూ షికార్లు చేస్తుండగా భార్య.. వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. షాకింగ్ మాల్లో అందరి ముందే చితకబాదింది. దీనికి సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన ఓ జంట మధ్య గొడవల కారణంగా భార్య.. తన పుట్టింట్లో ఉంటోంది. కాగా, కార్వా చౌతా పండుగ సందర్భంగా ఆమె తన తల్లితో కలిసి షాపింగ్ చేసేందుకు ఓ మాల్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా తన భర్త మరో యువతితో క్లోజ్ ఉండటం, షాపింగ్ చేస్తుండటాన్ని ఆమె గమనించింది. దీంతో, వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నిలదీసింది. భర్త కాలర్ పట్టుకుని.. నాకు ఎందుకు అన్యాయం చేస్తున్నావంటూ చితకబాదింది. అటు భర్తతో వచ్చిన సదరు యువతిని సైతం ఆమె కుటుంబ సభ్యులు చితకబాదారు. करवा चौथ के दिन दूसरी महिला काे शॉपिंग करवाने आया था पति। पत्नी ने पकड़ा। https://t.co/T3jB1xVOWn pic.twitter.com/gSFGxGaghn — Ankit tiwari/अंकित तिवारी (@ankitnbt) October 13, 2022 మరోవైపు.. ఈ ఘటనపై సదరు వ్యక్తి భార్య.. పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం. ఇక, ఈ ఘటన జరుగుతున్న సందర్భంగా షాపింగ్ మాల్లో పెద్ద సంఖ్యలో కస్టమర్లు అక్కడ గుమ్మిగూడారు. దీంతో, మాల్లోని కొందరు దుకాణాల యజమానులు బయటకు వెళ్లిపోవాలని సూచించారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
ఎల్ఈడీ టీవీ పేలి బాలుడు మృతి.. మీరూ ఈ తప్పులు చేస్తున్నారా?
లక్నో: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది. దాదాపుగా అన్ని ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీలే ఉపయోగిస్తున్నారు. అయితే, వాటిని వినియోగించటంలో చిన్న చిన్న తప్పులు చేయటం వల్ల ఒక్కోసారి ప్రాణాలపైకి వస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లోని ఓ ఇంటిలో ఎల్ఈడీ టీవీ పేలిపోయి 16 ఏళ్ల అమరేందర్ అనే బాలుడు మృతి చెందిన విషాద ఘటన వెలుగు చూసింది. తన స్నేహితులతో కలిసి బాధితుడు సినిమా చూస్తుండగా ఒక్కసారిగా టీవీ పేలిపోయింది. పేలుడు దాటికి భవనం గోడలు సైతం బీటలువారాయంటే ఏ స్థాయిలో పేలుడు సంభవించిందో ఊహించవచ్చు. ఈ ఘటనలో బాధితుడి తల్లి, సోదరుడు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విధంగా టీవీలు పేలిన సంఘటనలు చాలా అరుదు. దీనికి గల కారణాలపై నిపుణులు సైతం అంచనాకు రాలేకపోతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘ఇద్దరు మహిళలు, ఇద్దరు బాలురు గాయపడ్డారు. దురదృష్టవశాత్తు ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గోడకు బిగించిన ఎల్ఈడీ టీవీ పేలటం వల్లే బాలుడు మరణించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.’ అని గాజియాబాద్ పోలీసు అధికారి జ్ఞానేంద్ర సింగ్ తెలిపారు. టీవీ పేలిపోవటంతో గోడలకు ఏర్పడిన పగుళ్లు ఎల్ఈడీ టీవీ బ్లాస్ట్‌కు కారణాలు.. ►పాత, నకిలీ కెపాసిటర్: ఎల్ఈడీ టీవీలు పేలడానికి ప్రధానంగా పాత లేదా నకిలీ కెపాసిటర్ కారణమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సరైన స్థాయిలో కెపాసిటర్ విద్యుత్తును సరఫరా చేస్తుంది. అయితే, కెపాసిటర్ వల్ల ఆ స్థాయిలో పేలుడు సంభవించకపోవచ్చు. ► ఓల్టేజ్ హెచ్చుతగ్గులు: విద్యుత్తు ఓల్టెజ్ హెచ్చుతగ్గులకు లోనవటమూ ఓ కారణంగా చెప్పవచ్చు. ఒక్కసారిగా హైఓల్టేజ్ సరఫరా అవుతే టీవీలు పేలిపోతాయి. ► ఓవర్ హీట్: టీవీ ఎక్కువగా వేడెక్కడం సైతం పేలిపోవటానికి దారితీస్తుంది. ఒక్కటికంటే ఎక్కువ డివైజ్లతో కనెక్ట్ చేస్తే ఓవర్ హీట్ అవుతుంది. నకిలీ కెపాసిటర్ లాగే ఓవర్ హీట్ కూడా పేలుడుకు కారణమవుతుంది. ►నిర్వహణ లేకపోవటం: టీవీని గోడకు బిగించామంటే దానిని పట్టించుకోరు. నిర్వహణ సరిగా లేకపోవటం, రిపేర్లు సరైన రీతిలో చేయించకపోవటం వంటివి సైతం పేలడానికి దారితీస్తాయి. రిపేర్ వచ్చినప్పుడు సరైన సర్వీస్ సెంటర్లకు తీసుకెళ్లాలి. రిపేర్ కోసం నాణ్యతకు ప్రాధాన్యత నివ్వాలి. ఇదీ చదవండి: రష్యా, ఉక్రెయిన్ హక్కుల గ్రూప్‌లకు నోబెల్ శాంతి బహుమతి -
గజియాబాద్ పేలుడు ఘటన.. టీవీలు పేలడానికి ప్రధాన కారణాలు ఏవో తెలుసా!
ఇటీవల ఎలక్ట్రిక్ బైకులు, స్మార్ట్ఫోన్లు పేలిన ఘటనలను చూస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ఈ ప్రమాదాల కారణంగా కొందరు తీవ్రంగా గాయపడగా, ఇంకొందరి ప్రాణాలు కూడా పోయాయి. తాజాగా గజియాబాద్‌లో టీవీ పేలి ఓ టీనేజర్ మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఎలక్ట్రిక్ పరికరాల వాడడంపై కాకుండా సురక్షితం ఎలా వాడాలో తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా టీవీలు పేలడం అరుదుగా జరిగే ఘటనలే అయినప్పటికీ ప్రమాద తీవ్రత భారీ స్థాయిలో ఉంటుందని గజియాబాద్ సంఘటన చెప్తోంది. ఈ నేపథ్యంలో వీటి పేలుడుకి ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. గజియాబాద్ ఘటనలో టీవి పేలుడు ధాటికి దెబ్బతిన్న ఇంటి గోడ ఎల్ఈడీ టీవీలు పేలడానికి గల కారణాలు ఇవే! ఎల్ఈడీ టీవీలు పేలడానికి రకరకాల కారణాలున్నాయి. టీవీలో ఉండే కెపాసిటర్లు వల్ల పేలుడు సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే కెపాసిటర్ అంటే విద్యుత్ శక్తిని నిల్వ చేసుకుని.. బ్యాటరీలా పని చేస్తుంది. టీవీ ఆపరేట్ చేయడానికి, అవసరమైన సమయంలో స్టాండ్‌బై మోడ్‌లో ఉండటానికి అవసరమైన కొద్దిపాటి శక్తిని నిల్వ చేస్తుంది. అయితే క్వాలిటీ కెపాసిటర్ వాడడం వల్ల, లేదా టీవీలోని కెపాసిటర్లు పాతవి కావడం వల్లే పేలుళ్లు సంభవిస్తాయి. అయితే గజియాబాద్ పేలుడు ఇంత తీవ్రస్థాయిలో ఉండడానికి గది వాతావరణం కూడా కారణమై ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓవర్ హీటింగ్ ఎలక్ట్రికల్ డివైజ్‌లు చాలా వరకు అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంటలు లేదా పేలుడుకు గురవుతాయి. టీవీలను ఎక్కువసేపు ఉపయోగించినప్పుడు లేదా చాలా పరికరాలను టీవీలకు కనెక్ట్ చేసి వాడుతున్న సమయంలో అవి సులభంగా వేడెక్కుతుంది. ఈ క్రమంలో వేడెక్కిన పరికారాలు వాటి పరిమితి దాటిన వెంటనే పేలుడికి దారితీస్తాయి. అకస్మాత్తుగా వోల్టేజ్లో మార్పు.. భారత్ వంటి దేశాలలో టీవీ పేలుడు సంభవించడానికి ప్రధాన కారణాలలో ఒకటి విద్యుత్ లేదా వోల్టేజ్లో ఆకస్మిక పెరుగుదల కూడా ఒకటి. దీనినే మరో రకంగా పవర్ సర్జ్ అని కూడా అంటాం. తప్పుడు వైరింగ్ ఉన్న ప్రాంతాల్లో ఇది జరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఆకస్మిక విద్యుత్ పెరుగుదల నుంచి డివైజ్ డ్యామేజ్ కాకుండా సురక్షితంగా ఉంచేందుకు కంపెనీలు టీవీలో అనేక పరికారలను ఏర్పాటు చేస్తాయి. తద్వారా ఆది ఆకస్మిక వోల్టేజ్ పెరుగుదలను తట్టుకోగలదు, అయినప్పటికీ, అవి కూడా కొన్నిసార్లు విఫలమయ్యే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. అందుకే ఉరుములు ,మెరుపులతో కూడిన వర్షాల సమయంలో టీవీలను ఆఫ్ చేయమని చెబుతుంటారు. చదవండి: బ్యాంక్ కస్టమర్లకు వార్నింగ్.. ఆ యాప్‌లు ఉంటే మీ ఖాతా ఖాళీ,డిలీట్ చేసేయండి! -
యజమాని ముందే పెంపుడు కుక్క దాడి... బాధతో విలవిల్లాడిన చిన్నారి: వీడియో వైరల్
యజమాని ముందే ఒక పెంపుడు కుక్క చిన్నారిపై దాడి చేసింది. ఈ ఘటన ఘజియాబాద్‌లోని హౌసింగ్ సొసైటి లిఫ్ట్‌లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో సదరు పెంపుడు కుక్క యజమాని చూస్తుండగానే ఒక బాలుడిపై కుక్క దాడి చేస్తుంది. దీంతో ఆ చిన్నారి బాధతో విలవిలాడుతూ లిఫ్ట్ ముందుకు వచ్చి నిలబడతాడు. కానీ ఆ యజమాని కనీసం ఆ బాలుడిని ఓదార్చడం గానీ, సాయం చేయడం గానీ చేయకుండా బండరాయిలా నుంచొని ఉంది. పైగా తన కుక్కకు ఏమైన జరిగిందేమోనని చూస్తుందే తప్ప ఆ బాలుడిని ఓదార్చే పని చేయదు. దీంతో ఆకాష్ ఆశోక్ గుప్తా అనే నెటిజన్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ఆ లిఫ్ట్‌లో వారిద్దరే ఉన్నారని, ఎవ్వరూ చూడలేదని ఇంతలా నైతిక విలువలు లేకుండా ప్రవర్తిస్తారా? అని ఆగ్రహంతో ప్రశ్నించారు. దీంతో ఘజియాబాద్ పోలీసులు వెంటనే స్పందించి....ఆ బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో నెటిజన్లు ఇలా దయాదాక్షిణ్యం లేకుండా ప్రవర్తించిన మహిళలను వదిలిపెట్టకూడదు...కఠినంగా శిక్షించాలి అంటూ ఫైర్ అయ్యారు. a pet dog bites a kid in the lift while the pet owner keeps watching even while the pet owner the kid is in pain! where is the moral code here just cos no one is looking? . . p.s: @ghaziabadpolice Location: Charms Castle, Rajnagar Extension, Ghaziabad Dtd: 5-Sep-22 | 6:01 PM IST pic.twitter.com/Qyk6jj6u1e — Akassh Ashok Gupta (@peepoye_) September 6, 2022 "दिनांक 05.09.22 को राजनगर एक्सटेंशन स्थित एक सोसाइटी की लिफ्ट में एक कुत्ते द्वारा अपने मालिक की मौजूदगी में बच्चे को काट लेने के वायरल वीडियो के सम्बन्ध में बच्चे के पिता की तहरीर पर थाना नंदग्राम पर अभियोग पंजीकृत करते हुए अग्रिम विधिक कार्यवाही की जा रही हैं" बाइट-सीओ सिटी-2 pic.twitter.com/dvLwBXyUaT — GHAZIABAD POLICE (@ghaziabadpolice) September 6, 2022 (చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్) -
Priyanka Panwar: ఆమెకు వంద ముఖాలు! అతడి మరణవార్త విని.. మొదటిసారి..
ముఖ కవళికలను మరింత అందంగా తీర్చిదిద్దడానికి మంచి సాధనం మేకప్. ఒకప్పుడు అందాన్ని పెంచడానికి వాడే ఈ సాధనం నేడు అనేక రకాల మేకప్ ట్రెండ్స్‌తో కొత్త పుంతలు తొక్కుతోంది. మేకప్‌లో సరికొత్త మెళకువలతో చిత్ర విచిత్ర జిమ్మిక్కులను ఆకర్షణీయంగా రూపొందించి అలరిస్తున్నారు కళాకారులు. మేకప్ మీద ఉన్న మక్కువతో చేస్తోన్న ఉద్యోగాన్ని సైతం వదిలేసి మంచి ఆర్టిస్ట్‌గా మారింది ప్రియాంక పన్వర్. దేశవిదేశాల్లోని ప్రముఖ సెలబ్రెటీల ముఖాన్ని తన ముఖంపై చిత్రించి ఔరా అనిపిస్తోంది. దివికేగిన ఎంతో మంది సెలబ్రెటీలకు సైతం తన మేకప్ ద్వారా నివాళులర్పిస్తోంది. ఆసక్తి లేకపోవడంతో.. ఘజియాబాద్‌కు చెందిన ప్రియాంక పన్వర్ ఫార్మసీలో మాస్టర్స్ చేసిన తరువాత, రెగ్యులేటరీ అఫైర్స్‌లో ఉద్యోగం చేసుకుంటూ బిజీగా ఉండేది. ఉద్యోగంలో చేసే పని బావున్నప్పటికీ తనకి పెద్ద ఆసక్తి ఉండేది కాదు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా.. తనకి ఎంతో ఇష్టమైన కెనడాకు చెందిన ఇల్యూషన్ ఆర్టిస్ట్ ‘మిమి చాయిస్’ మేకప్ వీడియోలను చూస్తూ తను కూడా ఆమెలానే ఆర్టిస్ట్ కావాలనుకుంది. అనుకున్న వెంటనే బేసిక్ మేకప్ కోర్సు నేర్చుకుంది. తనకు నచ్చిన సెలబ్రెటీల రూపాలను వేయడం ప్రారంభించి చక్కగా వేయడం వచ్చాక చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయాన్ని ఇల్యూషన్ మేకప్‌కు కేటాయించింది. View this post on Instagram A post shared by Illusion Mua - Priyanka Panwar (@makeupbypriyankapanwar) అతని మరణ వార్త విని.. తనకు నచ్చిన ముఖ కవళికలను మేకప్ మెళకువలతో అందంగా రూపొందిస్తూ ‘మేకప్ బై ప్రియాంక పన్వర్’ పేరుతో ఉన్న తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్టు చేస్తుండేది. ప్రియాంక మేకప్ వీడియోలు నెటిజనులకు నచ్చుతుండడంతో మరింత ఉత్సాహంతో ఇల్యూషన్ స్కెచ్‌లు వేస్తుండేది. సుశాంత్ రాజ్‌పుత్‌సింగ్ ఇక లేడన్న వార్త తెలియడంతో .. మేకప్‌తో తనముఖంపై సుశాంత్ ముఖాన్ని చిత్రించి నివాళులు అర్పించింది. సుశాంత్ రూపం తీసుకురావడానికి ఏడు గంటలపాటు కష్టపడి పనిచేసింది. తొలి సెలబ్రెటీ రూపం అయినప్పటికీ ఎంతో చక్కగా వచ్చిందని వ్యూవర్స్ కామెంట్స్ చేయడంతో ఆమె అప్పటినుంచి ఇల్యూషన్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతోంది. View this post on Instagram A post shared by Illusion Mua - Priyanka Panwar (@makeupbypriyankapanwar) సెలబ్రెటీల నుంచి సినిమాలదాకా సుశాంత్ సింగ్ముఖంతో ప్రారంభమైన ప్రియాంక ఇల్యూషన్ మేకప్ ఆ తరువాత విరాట్ కోహ్లి, మనీ హీస్ట్ నటులు, బప్పీ లహరీ, రాజ్‌కుమార్ రావ్, అల్లు అర్జున్, గురురంధ్వా, కెల్లీ జెన్నర్, బిల్లీ పోర్టర్, దిల్జిత్ సింగ్, మిల్కా సింగ్, మొన్న హత్యకు గురైన గాయకుడు మూసావాల రూపాలను చక్కగా తీర్చిదిద్ది వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. సెలబ్రెటీల ముఖాలేగాక ‘రే’ సినిమాలోని కేకే మీనన్ క్యారెక్టర్‌ను తన ఇల్యూషన్ ఆర్ట్‌తో చక్కగా తీర్చిదిద్దింది. ఎంతోమంది సెలబ్రెటీల రూపాలు చిత్రించిన ప్రియాంక తన నానమ్మ ముఖాన్ని చిత్రించిన వీడియో బాగా వైరల్ అయ్యింది. View this post on Instagram A post shared by Illusion Mua - Priyanka Panwar (@makeupbypriyankapanwar) మనసు పెడితే కష్టం కాదు మేకప్‌లో చిన్న తప్పు జరిగినా మొత్తం పాడైపోతుంది. అనుకున్న రూపు రేఖలు రావు. ఇల్యూషన్ ఆర్ట్ సవాలుతో కూడుకున్నదైనప్పటికీ మనసుపెట్టి వేస్తే పెద్ద కష్టం కాదు. ఒక్కో ముఖాన్ని అచ్చుగుద్దినట్టు తీసుకురావడానికి కొన్ని గంటలు పడితే, మరికొన్నింటికి రోజంతా పడుతుంది. త్రీడి ఇమేజ్ రావాలంటే చాలా కష్టపడాలి. యాక్సెసరీస్, విగ్స్, లెన్స్, అవుట్ ఫిట్స్ అన్నీ చక్కగా కుదిరితేనే ఇల్యూషన్ ఇమేజ్ చక్కగా వస్తుంది. ‘‘ఏపీజే అబ్దుల్ కలాం, విక్రమ్ బాత్ర, జీత్లాల మా నానమ్మ ముఖాలు నేను రూపొందించిన వాటిలో నాకు బాగా నచ్చినవి. – ప్రియాంక పన్వర్ చదవండి: వ్యర్థాల నుంచి అర్థాలు: హీనంగా చూడకు దేన్నీ పనికొచ్చేవేనోయ్ అన్నీ! -
రాహుల్ గాంధీ ఫేక్ వీడియో కేసులో న్యూస్ యాంకర్ అరెస్టు!
న్యూఢిల్లీ: జీ టీవీ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్ని అతని నివాసంలోనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వాస్తవానికి చత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా ఘజియాబాద్ పోలీసులు జోక్యం చేసుకుని రంజన్ని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. అయితే యాంకర్ రంజన్‌ను అరెస్టు చేస్తున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే నాటకీయ పరిణామాల మధ్య అతను అరెస్టు కావల్సి వచ్చింది. ప్రస్తుతం అతను యూపీ పోలీసుల అధీనంలో ఉన్నాడు. అసలేం జరిగిందంటే...రోహిత్ జీ టీవీ ఛానెల్లో పేరుగాంచిన డీఎన్ఏ షోకి వ్యాఖ్యతగా చేస్తున్నాడు. రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక వీడియో న్యూస్‌ని తప్పుగా అందించారు. ఆ తర్వాత ఛానెల్ వెంటనే సరిచేసుకుని క్షమాపణల చెప్పింది. ఐతే ఆ వీడియోలో రాహుల్ గాంధీ ఏం మాట్లాడారంటే.."రాహుల్ గాంధీ తన వయనాడ్ కార్యాలయంపై దాడిని ప్రస్తావిస్తూ...ఇలా చేసిన యువకులు చాలా బాధ్యతారహితం ప్రవర్తించారు. అయినా వారు చిన్న పిల్లలు క్షమించండి. అని అన్నారు." అయితే జీ ఛానెల్ ఉదయపూర్‌లో కన్హయ్య లాల్‌ను చంపిన ఘటనతో లింక్ చేస్తూ... వారు చిన్నపిల్లలని, వారిని క్షమించాలంటూ చెబుతున్నట్లుగా వక్రీకరించి సమాచారాన్ని ఇచ్చింది. దీంతో ఆ యాంకర్‌పై చత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో కేసులు నమోదయ్యాయి. అంతేకాదు ఆ ఛానల్ జర్నలిస్ట్ ట్విట్టర్లో..చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా తనని ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసం నుంచి ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఎలా తీసుకువెళ్లారని రంజన్ ప్రశ్నించారు. ఈ విషయమై పోలీసులు స్పందిస్తూ...సమాచారం ఇవ్వాలనే నియమం లేదు. అయినా ఇప్పడూ మీకు తెలిసింది కాబట్టి తమకు సహకరించాలని రంజన్కి చెప్పారు. దీంతో ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ..బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. జర్నలిస్టుల పై దాడులు నిర్వహించేందుకు చత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లను నిర్మోహమాటంగా కాంగ్రెస్ వినియోగించేస్తుందంటూ.. విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాటి అధికార జ్ఞాపకాల మత్తులో కూరుకుపోయి ఇలాంటి ఘటనలకు పాల్పడతోందని అన్నారు. बिना लोकल पुलिस को जानकारी दिए छत्तीसगढ़ पुलिस मेरे घर के बाहर मुझे अरेस्ट करने के लिए खड़ी है,क्या ये क़ानूनन सही है @myogiadityanath @SspGhaziabad @adgzonelucknow — Rohit Ranjan (@irohitr) July 5, 2022 (చదవండి: శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు.. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు?) -
భారత్‌లో మంకీపాక్స్ కలకలం!
దేశంలో మంకీపాక్స్ వైరస్ కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లో మంకీపాక్స్ లక్షణాలు బయటకు వచ్చాయి. వివరాల ప్రకారం.. యూపీలోని ఘజియాబాద్‌లో ఐదేళ్ల చిన్నారిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. కాగా, బాధితురాలి శరీరంపై దద్దర్లు రాగా, దురద ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో, శాంపిల్స్ సేకరించి పూణేలోని ల్యాబ్‌కు టెస్ట్ కోసం పంపినట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ఇక, చిన్నారి కుటుంబానికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో వైద్యశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఇదిలా ఉండగా.. ఫ్రాన్స్‌లో శుక్రవారం ఒక్కరోజే 51 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. బుధవారం నాటికి 33గా ఉన్న మొత్తం కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే వందకు చేరువైంది. కాగా, ఫ్రాన్స్‌లో మొదటి మంకీపాక్స్ కేసు మే నెలలో నమోదు అయింది. ఇక, జూన్ నాటికి ఈ కేసుల సంఖ్య 100ను దాటింది. #Ghaziabad: Doctor flags possible case of #monkeypox in five-year-old, NIB to test sampleshttps://t.co/njkFjJRbhh#MonkeypoxVirus pic.twitter.com/YOBL06cJxK — The Times Of India (@timesofindia) June 4, 2022 ఇది కూడా చదవండి: మంకీపాక్స్ టెర్రర్.. ఒక్కరోజే 51 కేసులు.. -
పెళ్లై విడాకులు.. బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం.. అనుమానంతో
ఘజియాబాద్: మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో మహిళను ఆమె ప్రియుడే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ఢిల్లీకి చెందిన ఓ మహిళ(30) పెళ్లై భర్తతో విడాకులు తీసుకుంది. అనంతరం ఆమె తన ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తోంది. అయితే మహిళకు వేరొకరితో ఎఫైర్ ఉందని, త్వరలో అతడిని పెళ్లి చేసుకోబోతుందని అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు తన ప్రియురాలిని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచీలో వేసి నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు. మృతురాలికి చెందిన టీవీ, ఇతర వస్తువులతో నిందితుడు ఉడాయించాడు. ఏప్రిల్ 29న ఘజియాబాద్‌లోని సరిహద్దు ప్రాంతంలో గోనె సంచిలో మహిళా మృతదేం లభ్యమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 48 గంటల్లోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి: పనికోసం ఇంటికొస్తే వ్యభిచారం చేయించారు.. -
తాగేసి కారు పైకి ఎక్కి హంగామా... ఊహించని ట్విస్ట్!
Ghaziabad Traffic Police has fined a car owner: ఇటీవలకాలంలో సోషల్ మాధ్యమాల్లో స్టార్డమ్ కోసమో లేక ప్రత్యేక ఆకర్షణగా ఉండేందుకో కొన్ని విచిత్రమైన ఫీట్లు చేస్తుంటారు. అవి ఒకోసారి ప్రాణాంతకంగా మారడమో లేక పోలీసులు ఆగ్రహానికి గురై కటకటాల పాలవడమో జరుగుతుంటుంది. అచ్చం అలాంటి సంఘటనే ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఘజియాబాద్‌లోని రద్దీగా ఉండే ఢిల్లీ మీరట్ ఎక్క్‌ప్రెస్ హైవేలో ఇద్దరు యువకులు మద్యం సేవించి కారు పై డ్యాన్స్ చేశారు. అయితే ఆ కారుని ఒక వ్యక్తి నడుపుతుండగా ..మరో వ్యక్తి ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. దీంతో మోహిత్ గుర్జార్ అనే ఒక సోషల్ మీడియా వినియోగ దారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అంతేకాదు ఆ వాహనాన్ని మారుతి సుజికి ఎర్టిగా గుర్తించారు. వీడియోలో కనిపిస్తున్న నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆ వాహన యజమాని పై ట్రాఫిక్ పోలీసులు సుమారు రూ. 20 వేలు జరిమానా విధించారు. ఈ ఘటన ఘజియాబాద్‌లో బులంద్‌షహర్ రోడ్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో రాత్రి 8 గం.ల సమయంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినందుకుగానూ అతని వాహన రిజిస్ట్రేషన్‌ని రద్దు చేశారు. ఈ మేరకు ఆ ఘటనకు సంబంధించిన వీడియోతోపాటు, ఫైన్ వేసిన ఈ చలానా కాపీని కూడా ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. Meanwhile in Ghaziabad, a group of boys, visibly drunk, dancing on the roof of their car on the Delhi-Meerut expressway. Hope @ghaziabadpolice makes them dance to their tunes in the lockup sooner. pic.twitter.com/mJck8JQ4Kh — Prashant Kumar (@scribe_prashant) April 2, 2022 (చదవండి: కోతుల బెడద.. ఆ కటౌట్ చూసి పరిగెత్తాలి డ్యూడ్) -
Viral Video: ‘వీడు మనిషేనా.. కొంచెం చూసుకొని డ్రైవ్ చేయాలని తెలీదా!’
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఘజియాబాద్‌లో ఓ వృద్దుడు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు అతన్ని ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ దృశ్యాలన్నీ స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఇంటి ముందు ఉన్న ఇరుకైన రోడ్డు పక్కన ఓ వృద్ధుడు కూర్చీలో కూర్చున్నాడు. అనంతరం కూర్చీ పట్టుకొని మెల్లమెల్లగా రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే వేగంగా వచ్చిన కారు అకస్మాత్తుగా వృద్దుడిని ఢీకొట్టి దూసుకెళ్లింది. ఆ పెద్దాయన రోడ్డుపై పడిపోయినప్పటికీ.. డ్రైవర్ ఆగకుండా వేగంగా వెళ్లిపోయాడు. అనంతరం కుటుంబ సభ్యులు వచ్చి వృద్ధుడిని ఆసుపత్రిలో చేర్చారు. అయితే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందని వృద్ధుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆరు నెలల క్రితం మొదలైన ఓ వివాదం కారణంగా తన ఇరుగుపొరుగువారు ఈ పని చేసి ఉండొచ్చని ఆరోపించారు. చదవండి: Viral Video: ‘కచ్చా బాదం’ మరువక ముందే ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న మరో సాంగ్ Watch #video: #CCTV camera shows driver speeding #car over #elderly man in #UttarPradesh's #Ghaziabad. pic.twitter.com/xiLb8IVJys — Free Press Journal (@fpjindia) March 31, 2022 ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారు నడిపిన వ్యక్తిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘వీడు మనిషేనా.. అంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తారా.. రోడ్డుపై ముసలివాళ్లు కనిపించినప్పుడు కాస్తా చూసుకొని నెమ్మదిగా డ్రైవ్ చేయాలని తెలీదా?..’ అంటూ మండిపడుతున్నారు. -
హీనా శర్మ.. శాపాన్ని వరంగా మార్చుకుంది
కొందరికి పుట్టుకతోనే వైకల్యం ప్రాప్తిస్తుంది. కొందరు ప్రమాదవశాత్తు వైకల్యం బారిన పడతారు. వీరిలో చాలామంది ఈ జీవనం ‘శాపం’ అంటూ భారంగా రోజులు గడిపేస్తుంటారు. అతి కొద్ది మంది మాత్రమే అత్యంత అరుదుగా శాపాన్ని కూడా వరంగా మార్చుకుంటారు. అలాంటి అరుదైన వారిలో ఒకరు 28 ఏళ్ల హీనా శర్మ. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉంటున్న హీనా శర్మ అనారోగ్యం కారణంగా చిన్నప్పుడే వీల్‌చెయిర్‌కి పరిమితమైంది. కానీ, పడి లేచిన కెరటంలా తన జీవితాన్ని తనే మలుచుకుంది. వీల్‌చెయిర్‌లో కూర్చొని డ్యాన్స్ చేస్తుంది. పాటలు పాడుతుంది. వేదికల మీద ప్రదర్శనలు ఇస్తుంది. మోడల్‌గా ర్యాంప్‌వాక్ చేస్తుంది. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వీటితో పాటు మిస్ వీల్‌చెయిర్ ఇండియా 2022 ఫైనల్‌కి కూడా చేరింది. ‘వీల్ చెయిర్‌పై ఉండటమనేది విచారకరం కాదు. నిస్సహాయతతో కాకుండా సరదాగా జీవితాన్ని గడపడం నేర్చుకున్నాను’ అంటోంది. ఇతరులపై ఆధారపడకుండా, మిమ్మల్ని మీరు నమ్ముకోండి అని చెబుతున్న హీనా శర్మ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. తన జీవితంలోని ఆటుపోట్లను ఈ విధంగా వివరిస్తోంది.. పాటలు పాడుతూ.. కండరాల క్షీణత ‘‘అందరు పిల్లల్లాగే తొమ్మిది నెలల వయసులోనే తొలి అడుగులు వేశానట. కానీ, అనుకోకుండా ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చారు అమ్మానాన్న. ఆరునెలలు ఆసుపత్రిలోనే ఉంచారు. ‘వెన్నెముక బలహీనంగా ఉంది. కండరాల క్షీణత వల్ల నిటారుగా నిలబడలేదు’ అని చెప్పారు డాక్టర్లు. అప్పటినుంచి నా కాళ్లలో కదలిక లేదు. వెన్నెముక ‘సి’ ఆకారంలోకి మారిపోయింది. అయినా, ఆశచావక అమ్మానాన్నలు చికిత్స కోసం నన్ను దేశమంతా తిప్పారు. డాక్టర్ల సలహా మేరకు పదే పదే ఆపరేషన్లు చేయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నా పాదాలకు శస్త్ర చికిత్స చేశారు. అటునుంచి గోరఖ్‌పూర్‌లో ఫిజియోథెరపీ చేయించారు. మరోసారి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది కానీ, ప్రాణానికి హామీ ఇవ్వలేమన్నారు డాక్టర్లు. అమ్మ భయపడి తిరిగి ఇంటికి తీసుకొచ్చేసింది. దీంతో ఆగిపోయిన చదువు మళ్లీ మొదలుపెట్టాను. స్కూల్లో అందరూ ఇష్టపడేవారు. అందరూ సాయంగా ఉండేవారు. పదవ తరగతిలో ఆటోమేటిక్ వీల్‌చైర్ వచ్చింది. అప్పటినుంచి నా జీవితం చాలా సరళంగా మారిపోయింది. ఎక్కడకు వెళ్లాలనుకున్నా ఒంటరిగానే వెళ్లేదాన్ని. సంగీతం క్లాసులు ఆరో తరగతిలో ఉన్నప్పుడు సంగీతం నేర్చుకోవాలనే ఆశ బలంగా మారింది. దీంతో స్కూల్ టైమ్ అయ్యాక, మా అక్కను తీసుకొని సంగీతం క్లాసులకు వెళ్లేదాన్ని. పై అంతస్తు లో క్లాస్ ఉంటే ఎత్తుకునే తీసుకు వెళ్లేది. అలా నాలుగేళ్లు సంగీతం నేర్చుకున్నాను. అక్క పెళ్లవడంతో సంగీతం నేర్చుకోవడం మధ్యలోనే ఆగిపోయింది. కానీ, నాకు వచ్చినంతవరకు నేనే ఇంటి వద్ద సంగీతం క్లాసులు తీసుకోవడం మొదలుపెట్టాను. కాలేజీ చదువు పూర్తయ్యాక ట్యూషన్లు చెప్పడం కూడా ఆరంభించాను. పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయం, వీల్‌చెయిర్.. అన్నింటి వల్ల చదువు అంతా సవ్యంగానే సాగింది. ఆ తర్వాతనే నిజమైన పోరాటం అంటే ఏంటో తెలిసొచ్చింది. ఉద్యోగం ఓ సవాల్... ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా నిరాశే ఎదురయ్యింది. వెళ్లిన ప్రతిచోటా ‘ఎలా పనిచేస్తారు, ఎలా వస్తారు, ఎలా వెళతారు..’ ఇవే ప్రశ్నలు. చాలా నిరాశగా అనిపించేది. వికలాంగులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు ఇప్పించే స్వచ్ఛంద సంస్థ ఉందని తెలిసి వారిని కలిసి, శిక్షణకు వెళ్లేదాన్ని. రోజూ ఘజియాబాద్ నుంచి నజాఫ్‌గడ్‌కు మూడు గంటలపాటు ఒంటరిగానే ప్రయాణించే దాన్ని. శిక్షణ సమయంలో రోజంతా సెంటర్లో కూర్చుంటే బాత్రూమ్కు తీసుకెళ్లేవాళ్లు లేక యూరిన్ బ్యాగ్ కూడా వీల్‌చెయిర్‌కు సెట్ చేసుకునేదాన్ని. రెండు నెలల శిక్షణ పెద్ద పోరాటమే అని చెప్పాలి. అయినా ఉద్యోగం రాలేదు. పోస్టుగ్రాడ్యుయేషన్ చేసినా పదవ తరగతి చదివేవారికి ఇచ్చే ఉద్యోగం కూడా ఇవ్వలేమన్నట్లే మాట్లాడేవారు. నన్ను నేను నమ్ముకున్నాను.. మళ్లీ ఆరు నెలల శిక్షణ తీసుకున్నాను. ఈసారి ఉద్యోగం కోసం పోరాటం కొనసాగించాను. వివిధ ఆన్లైన్ పోర్టళ్లలో నా పేరు నమోదు చేసుకున్నాను. దీంతో కొన్ని ఎన్జీవోలకు నా పూర్తి సమాచారం చేరింది. టెక్ మహీంద్రా కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇంటినుండి పని చేసుకునే పర్మనెంట్ అవకాశం గల ఉద్యోగం కావడంతో సులభంగా చేయగలుగుతున్నాను. సంగీత పరిజ్ఞానం ఉండటంతో వేదికల మీద ప్రదర్శనలు ఇస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాను. ‘రైజింగ్ స్టార్’ టీవీ షోస్‌లో పాల్గొన్నాను. ఆస్మాన్ ఫౌండేషన్ వారి కార్యక్రమంలో ఇళయరాజా పాట పాడటం నా జీవితంలో అతి ముఖ్యమైనది. అమితాబ్ బచ్చన్‌తోపాటు చాలా మంది ప్రముఖులు ఆ పాటను రీట్వీట్ చేయడంతో దేశవ్యాప్తంగా పేరు పొందాను. ఈ యేడాది ‘మిస్ వీల్ చెయిర్ ఇండియా’ పోటీల్లో ఫైనల్స్‌కి చేరాను. కూర్చొని డ్యాన్స్ చేస్తాను. పాడతాను. రోజంతా హుషారుగా గడుపుతాను. నా జీవితంలో నేను జాలిపడేది ఏమీ లేదని నాకు అర్థమైంది. చాలామంది వికలాంగులతో నాకు పరిచయం ఉంది. జీవితం పట్ల వారిలో భయాందోళనలను గమనించాను. సానుభూతిని కోరుకోవడం చూశాను. బతికినంత కాలం నా మనసులో ఏముందో అదంతా చేసేస్తాను. ఎవరైనా తమను తాము ఉన్నట్లుగా అంగీకరించాలి. అప్పుడు మన జీవితాన్ని నిస్సహాయతతో కాకుండా సరదాగా గడపగలుగుతాం’’ అని చెబుతున్న హీనా శర్మ మాటలే కాదు చేతలు కూడా నేటి యువతకు స్ఫూర్తిని కలిగిస్తాయి. -
వరుడ్ని చితకబాదిన వధువు బంధువులు.. అసలు ఏం జరిగిందంటే..
లక్నో: వరకట్న వేధింపులు అనేవి పురాతన కాలం నుంచి ఆడపిల్లలను, వారి తల్లిదండ్రులను పట్టి పీడిస్తున్న సమస్య. ఇవే వేధింపులు ఎక్కువగా మారి హత్యలు, ఆత్మహత్యలకు దారితీసిన ఘటనలు కూడా బోలెడు ఉన్నాయి. తాజాగా ఓ వరుడు అదనపు కట్నం కావాలని అడిగినందుకు పెళ్లి మండపలోనే వధువు తరపు బంధువులు చితకబాదారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ముందు చెప్పిన దానికంటే వరుడి తండ్రి కట్నంగా రూ. 10 లక్షలు ఇవ్వాలని వధువు తల్లిదండ్రులను డిమాండ్ చేశాడు. అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోతే పెళ్లిని రద్దు చేస్తానని బెదిరించాడు. అయితే వధువు కుటుంబీకులు ఇప్పటికే రూ.3 లక్షల నగదు, రూ.లక్ష విలువైన డైమండ్ రింగ్ ఇచ్చారు. అయితే అది సరిపోదని తాము అడిగినంత ఇవ్వాల్సిందేనంటూ వరుడు తండ్రి పట్టుబట్టారు. పెండ్లి సజావుగా జరగాలని వధువు తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వరుడితోపాటు అతని కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన పెండ్లి కుమార్తె కుటుంబ సభ్యులు పెండ్లి కొడుకుపై దాడి చేశారు. అందరు చూస్తుండగానే ఆ వరుడిని చితకబాదారు. ఇదంతా కొందరు వీడియోలో చిత్రీకరించగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లి వరుడి కుటుంబం కేసు నమోదైంది. చదవండి: Vicky Kaushal: పెళ్లైన పది రోజులకే.. ఏంది భయ్యా? విక్కీ కౌశల్‌కు నెటిజన్ల ప్రశ్నలు -
అమ్మతనానికే కళంకం.. పిల్లల ముందే ప్రియుడితో కలిసి వ్యభిచారం
లక్నో: అమ్మ ప్రేమ గురించి కవులు, పుస్తకాలు ఎంతో గొప్పగా వర్ణించారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే తల్లి ప్రేమ గురించి వర్ణించడానికి మాటలు చాలవు. కానీ నేటి కాలంలో కొందరు మహిళలు బరితెగించి ప్రవర్తిస్తూ.. అమ్మ అనే మాటకే మాయని మచ్చగా మిగులుతున్నారు. శారీరక సుఖం కోసం కన్న బిడ్డలను బలి తీసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్ కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం నిందుతురాలైన మహిళతో వివాహం అయ్యింది. వారికి ఓ అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు సంతానం. కొన్నేళ్లపాటు వారి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత సదరు వ్యక్తి భార్యకు ఓ క్యాబ్ డ్రైవర్‌తో పరిచయం ఏర్పడి.. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో భర్త పని కోసం ఇంటి నుంచి వెళ్లగానే.. క్యాబ్ డ్రైవర్ వారి ఇంటికి వచ్చేవాడు. (చదవండి: నాడు యువతి చేతిలో చెంప దెబ్బలు.. నేడు రాజకీయాల్లో ప్రవేశం) ఇక ఇంట్లో పిల్లల ముందే.. సదరు మహిళ, క్యాబ్ డ్రైవర్ విచ్చలవిడిగా ప్రవర్తించేవారు. పిల్లల ముందే వారి తల్లి.. క్యాబ్‌డ్రైవర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించేది. అంతేకాక ప్రియుడి కోరిక మేరకు అతడు చెప్పిన వారికి నగ్నంగా మారి వీడియో కాల్స్ చేసేది. వీరి వికృత చేష్టలు చూసి పిల్లలు తీవ్రంగా భయపడేవారు. వారి అరచకాలు అంతటితో ఆగలేదు. సదరు క్యాబ్ డ్రైవర్ తన ప్రియురాలి పిల్లలతో కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీని గురించి ఎవరికైనా చెబితే.. తండ్రిని చంపేస్తామని బెదిరించేవాడు. ఇలా సాగుతున్న వీరి వికృత చేష్టల గురించి ఓ సారి సదరు మహిళ భర్తకు తెలిసింది. ఇరుగుపొరుగు వారు.. అతడు బయటకు వెళ్లాక ఇంటికి ఎవరో ఒక వ్యక్తి వస్తున్నాడని.. రోజు ఇలానే జరుగుతుందిన తెలిపారు. (చదవండి: పోలీస్ కస్టడీలో యువకుడు మృతి.. హత్యా? ఆత్మహత్యా?) అప్పటికే భార్య ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం వచ్చిన సదరు వ్యక్తి.. భార్యకు తెలియకుండా ఇంట్లో సీసీటీవీ కెమెరా అమర్చాడు. ఇక దానిలో రికార్డయిన దృశ్యాలు చూసి.. అతడికి ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. భార్య, ఆమె ప్రియుడి వికృత వేషాలు అతడి కంటపడ్డాయి. దీని గురించి భార్యను నిలదీయగా.. నా ఇష్టం.. నా దారికి అడ్డువచ్చావంటే చంపేస్తానని బెదిరించింది. దాంతో సదరు వ్యక్తి పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. ఫిర్యాదు చేశాడు. తన భార్య, ఆమె ప్రియుడితో కలిసి తన ఇంట్లోనే వ్యభిచారం చేస్తుందని పేర్కొన్నాడు. తనను, పిల్లలను చంపుతామని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో పోలీసులు బాధితుడి భార్య, ఆమె లవర్ మీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. చదవండి: భయపెట్టమంటే.. భయానికే భయం పుట్టించాడు! -
దూషించొద్దు అన్నందుకు స్నేహితులే హత్య చేశారు!
ఘజియాబాద్: కుల వివక్షత నేరం అని తెలిసి కూడా చాలా మంది కులం పేరుతో బడుగు బలహీన వర్గాలను దూషిస్తూనే ఉంటున్నారు. పైగా వాళ్లను అనేక రకాలుగా బాధపెడుతూ అవమానిస్తున్నారు. అచ్చం అలాంటి ఘటనే ఘజియాబాద్‌లో జరిగింది. (చదవండి: చపాతీలు కోసం చంపేశారు..!) అసలు విషయంలోకెళ్లితే... ఘజియాబాద్‌లో ఓ దివ్యాంగుడు తనపై చేసిన కులపరమైన దూషణలకు అభ్యంతరం చెప్పడంతో అతని స్నేహితులే అత్యంత పాశవికంగా హత్య చేసి చంపేశారు. ఈ మేరకు మృతుడి హర్బన్స్ నగర్ కాలనీలో తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుందని నగర సర్కిల్ ఆఫీసర్ అవినాష్ కుమార్ అన్నారు . పైగా నిందితులు ఆ వ్యక్తిని ఉక్కిరిబిక్కిరి చేసి, కత్తెరతో పొడిచి చంపడమే కాక మృత దేహాన్నిచెత్త కుప్పపై వేసి కాల్చేశారని వెల్లడించారు. ఈ మేరకు మృతిడి సోదరులు సందీప్, విశాల్ అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారని అన్నారు. అయితే ఆ సోదరులు కాలిపోయిన దుస్తులు అవి చూసి తమ సోదరుడిగా గుర్తించారని చెప్పారు. ఈ మేరకు తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమే కాక నిందితులు సౌరభ్, వివేక్, రవిలుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నాం అని అన్నారు. అయితే సచిన్ అనే వ్యక్తి ఇంకా పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. (చదవండి: నువ్వా!...నేనా.. అంటూ ఒక ఆట ఆడించిన సింహం!) -
నగ్నంగా వీడియో కాల్స్ చేసి.. 200 మందిని మోసం చేసిన జంట
లక్నో: కొందరు కేటుగాళ్లు సోషల్‌మీడియా సాయంతో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా నగ్నంగా వీడియో కాల్స్ చేస్తూ దాదాపు 200 మందిని మోసం చేసిన ఘటన యూపీలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌కు చెందిన సప్నాగౌతమ్, యోగేశ్ భార్యాభర్తలు. వీరికి ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆశ పుట్టింది. దీంతో ఆ దంపతులకు ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తితో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతూ రికార్డు చేసి బాధితుల నుంచి డబ్బులు లాగొచ్చని సలహా ఇచ్చాడు. దీంతో సప్నా గౌతమ్, యోగేశ్ జంట ఈ దందాలోకి దిగింది. యోగేశ్ వ్యక్తుల వివరాలు సేకరించడంతో ఆ వివరాలతో వీడియో కాల్స్ ఎలా మాట్లాడలో కొంతమంది యువతులకు సప్నా శిక్షణ ఇవ్వటం ప్రారంభించింది. దీని కోసం వీరు ముందుగా ఓ వెబ్సైట్ సాయంతో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడేవారు. దానికి నిమిషానికి రూ.200పైగా ముందుగానే చెల్లించాలని చెప్పేవారు. ఇందులో సగం వెబ్సైట్ వారికిపోగా మిగిలిన సగం ఈ దంపతులకు చేరుతుంది. తర్వాత ఆ రేటు కంటే తక్కువకే తాము వీడియో కాల్స్ చేస్తామంటూ బాధితుల నుంచి ఫోన్ నంబర్లు సేకరించేవారు. వాట్సాప్ లేదా ఇతర మాధ్యమాల్లో వీడియో కాల్స్ చేసి, అవతలి వారు నగ్నంగా మాట్లాడేలా చేసి రికార్డు చేసేవారు. అడిగినంత డబ్బులు ఇవ్వాలని లేకుంటే.. వారి వీడియోలు బయట పెడతామని బాధితులను బెదిరించేవారు. ఇలా ఎంతో మందిని మోసం చేసి గత రెండేళ్లుగా సుమారు రూ.22 కోట్లను పలువురు బాధితుల నుంచి దోచుకున్నారు. యువతులను రిక్రూట్ చేసుకుని వారికి నెలకు రూ.25 వేల చొప్పున జీతాలు చెల్లించి నగ్న వీడియో కాల్స్ చేయించారు. కేవలం మెసేజ్‌లు చేసే వారికి నెలకు రూ.15వేలు ఇచ్చేవారు. ఓ కంపెనీకి చెందిన ఉద్యోగి రూ.80 లక్షలను కంపెనీ ఖాతా నుంచి బదిలీ చేయడంతో ఆ కంపెనీ యజమాని గుజరాత్‌లోని రాజ్‌కోట్ పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ జంట దందా వెలుగులోకి వచ్చింది. ఆ కేసు విచారణలో రాజ్‌కోట్ పోలీసులు ఘజియాబాద్ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేస్తుంటే హనీ ట్రాప్ విషయం బయటపడింది. ఈ కేసులో భార్యాభర్తలు సహా, మరో ముగ్గురు యువతులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు. -
వైరల్ వీడియో: తందూరి కాదు ‘ఉమ్మి’ రోటీ
లక్నో: సాధారణంగా బయట ఆహారం తీసుకోవాడానికి చాలామంది ఇష్టపడరు. ఎలాంటి పదార్థాలు వాడతారో తెలియదు.. వంట చేసేవాళ్లు.. అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంటాయో లేదో తెలియదు. కరోనా వచ్చిన దగ్గర నుంచి ఈ భయం మరింత పెరిగింది. పైగా అప్పుడప్పుడు కొందరు నికృష్టపు పనులు చేస్తూ ఉంటారు. గతంలో పానీపూరీ బండి వ్యక్తి ఎలాంటి నీచమైన పని చేశాడో చూశాం కదా. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. తందూరి రోటీలు చేస్తున్న వ్యక్తి వాటి మీద ఉమ్మి.. ఆ తర్వాత కాలుస్తున్నాడు. ఆ వివరాలు.. ఈ సంఘటన ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న ధాబాలో ఓ వ్యక్తి తందూరి రోటీలు తయారు చేస్తుంటాడు. రోటీ తయారు చేసేటప్పుడు సాధారణంగా నూనె, నీరు వాడతారు. కానీ ఇతగాడు మాత్రం వాటి మీద ఉమ్మి.. ఆ తర్వాత రోటీ చేసి.. వాటిని కాలుస్తాడు. (చదవండి: వైరల్: అరెరే.. పాక్కుంటూ వెళ్లినా, అడ్డంగా బుక్కయ్యావ్ కదా!) ఇలా ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు కానీ.. కొన్ని రోజుల క్రితం ధాబాకు వచ్చిన ఓ వ్యక్తి.. సదరు వ్యక్తి చేస్తున్న దారుణాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో ఇది కాస్త వైరల్‌గా మారడమే కాక సదరు ధాబా మీద కేసు నమోదయ్యింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి: ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసిన బిస్కెట్లు, చిప్స్..? गाजियाबाद के एक चिकन पॉइंट का वीडियो सामने आया है, जिसमें एक शख्स थूक लगाकर रोटी बनाता दिख रहा है. pic.twitter.com/utDi9Jh9F8 — Anubhav Veer Shakya (@AnubhavVeer) October 17, 2021 -
విషాదం: 25వ అంతస్తు నుంచి పడి కవలలు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 25వ అంతస్తు నుంచి కిందపడి ఇద్దరు కవల సోదరులు మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆ వివరాలు.. తొమ్మిదవ తరగతి చదువుతున్న సత్యనారాయణ, సూర్యనారాయణ ఇద్దరు కవలలు. వీరికి మరో సోదరి కూడా ఉంది. చెన్నైకి చెందిన వీరు రెండు సంవత్సరాల క్రితం తల్లిదండ్రులతో కలిసి ఘజియాబాద్ వచ్చారు. అక్కడ సిద్ధార్థ్ విహార్ కాంప్లెక్స్‌లో 25వ అంతస్తులో నివసిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి భోజనం ముగించుకుని.. తల్లి మొబైల్ తీసుకుని ఆన్లైన్ క్లాస్ విన్నారు. ఆ తర్వాత బాల్కనీలోకి వెళ్లి కూర్చుని మొబైల్లో గేమ్స్ ఆడసాగారు. (చదవండి: ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసిన బిస్కెట్లు, చిప్స్..?) తల్లి వచ్చి పడుకోమని చెప్పడంతో ఇంట్లోకి వెళ్లారు కవల సోదరులు. తల్లి నిద్రపోయిన తర్వాత తిరిగి బాల్కనీలోకి వచ్చారు ఇద్దరు సోదరులు. అర్థరాత్రి 1 గంట సమయంలో ఇద్దరు సోదరులు 25వ అంతస్తు నుంచి పడి.. మృతి చెందారు. కాసేపటి తర్వాత తల్లి లేచి పిల్లల కోసం వెతికింది. బాల్కనీ తలుపు తీసి ఉండటంతో అక్కడకు వెళ్లి చూసింది.. కానీ కనిపించలేదు. కింద జనాలు గుంపులుగా చేరడం చూసి అక్కడకు వెళ్లింది. అక్కడ ఆమెకు కనిపించిన దృశ్యం చూసి ఒక్కనిమిషం ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది. (చదవండి: వీథి బాలల్ని బడిపిల్లలుగా మార్చింది...మమ్మీజీ) కింద రక్తపు మడుగులో తన ఇద్దరు కుమారులు విగత జీవులుగా పడి ఉండటాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయింది. బిడ్డల మృతదేహాలను పట్టుకుని గుండెలవిసేలా ఏడ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి.. కేసు నమోదు చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం సత్య, సూర్యల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. బాల్కనీలో మాకు ప్లాస్టిక్ చైర్, దాని మీద ఓ కూర్చి కనిపించింది. చంద్రుడిని చూడాలని భావించి.. ఇలా ఏర్పాటు చేసుకుని ఉంటారు. కానీ దురదృస్టవశాత్తు పైనుంచి కిందపడి మరణించి ఉంటారని భావిస్తున్నాం. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి’’ అని తెలిపాడు. చదవండి: 70 ఏళ్ల తర్వాత కలుసుకుని.. అరుదైన రికార్డు సృష్టించిన కవలలు -
Viral Photos: ట్రైలరే ఇలా ఉంటే.. సిన్మా ఎలా ఉంటుందో?
ఘజియాబాద్: ఎయిర్ ఫోర్స్-డేను పురస్కరించుకొని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అక్టోబర్ 8( శుక్రవారం)న 89వ వార్షికోత్సవాలను నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఎయిర్ క్రాఫ్టులతో ఐఏఎఫ్ ఎయిర్ షో ప్రదర్శించనుంది. అందులో భాగంగా ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్టుల ప్రదర్శన రిహార్సల్స్ చేస్తోంది. తాజాగా ఎయిర్ షోకు సంబంధించిన రిహార్సల్స్ ఫోటోలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు అత్యాధునిక ఎయిర్ క్రాఫ్టులను ఈ వేడుకల్లో ప్రదర్శిస్తామని ఐఏఎఫ్ పేర్కొంది.శుక్రవారం ఉదయం 8గంటలకు ఏఎన్-32 ఎయిర్ క్రాఫ్టు ప్రదర్శనతో ఎయిర్ షో మొదలుకానుందని తెలిపారు. తర్వాత హెరిటేజ్ ఎయిర్ క్రాఫ్టు, మోడరన్ ట్రాన్‌పోర్టు, ఫ్రంట్‌లైన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్టుల ప్రదర్శన ఉంటుందని ఐఏఎఫ్ అధికారులు పేర్కొన్నారు. హిందన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఈ ప్రదర్శనలు జరుగుతాయిని తెలిపారు. అదే విధంగా ఢిల్లీ, ఘజియాబాద్ ప్రాంతంలోని ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని ఐఏఎఫ్ అధికారులు విజ్ఞప్తి చేశారు. చెత్త బయట వేయటం వల్ల పక్షలు తిరుగుతాయిని దాని వల్ల తక్కువ ఎత్తులో జరిగే ఎయిర్ షోకు ఇబ్బందులు కలుగుతాయిని తెలిపారు. -
తొమ్మిదో అంతస్తు నుంచి కింద పడిన మహిళ
-
షాకింగ్ వీడియో: తొమ్మిదో అంతస్తు నుంచి కింద పడిన మహిళ
లక్నో: ఆకాశానికి చాలా ఎత్తులో ఉండే బిల్డింగ్ నుంచి ఎవరైనా కిందపడితే ఎముకలు విరిగి అక్కడికక్కడే చనిపోవడం ఖాయం. కానీ ఘజియాబాద్‌లో ఒక మహిళ మాత్రం ప్రమాదవశాత్తు తొమ్మిదో ఫ్లోర్ నుంచి జారిపడినా ఆమె బతికి బట్టకట్టింది. కానీ తీవ్ర గాయాలు కావడంతో ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. ఈ ఒళ్లు గగుర్పొడిచే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌లోని ఒక అపార్ట్మెంట్లో దంపతుల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వారు ఉంటున్న తొమ్మిదో ఫ్లోర్ బాల్కనీలో మాట్లాడుతుండగా మహిళ పట్టుతప్పింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆమె భర్త ఆమె చేతిని గట్టిగా పట్టుకొని పైకి లాగే ప్రయత్నం చేశాడు. కానీ అతని చేతి పట్టు జారి ఆమె ఒక్కసారిగా అందరూ చూస్తుండగానే కిందపడిపోయింది. అంత ఎత్తు నుంచి పడడంతో ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని అంతా భావించారు. కానీ ఆమె తీవ్ర గాయాలతో పడి ఉంది. దీంతో వెంటనే ఆమె భర్త స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరు ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు తమ విచారణనను ప్రారంభించారు. మహిళ ప్రమాదవశాత్తు జారి పడిందా లేక ఆమె భర్త ఆమెనే తోసేశాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. -
వైరల్: అరెరే.. పాక్కుంటూ వెళ్లినా, అడ్డంగా బుక్కయ్యావ్ కదా!
కొంతమంది పవర్ బిల్ కట్టకుండా ఎగ్గొట్టేందుకు నానా వేషాలు వేస్తుంటారు. అధికారులకు తెలియకుండా పోల్ నుంచి దొంగతనంగా వైర్లను ఏర్పరుచుకొని కరెంట్ వినియోస్తుంటారు. చదువుకోని వారు, అవగాహన లేని వాళ్లే ఇలాంటి దొంగ పనులు చేస్తారనుకుంటే పొరపాటే. చదువుకున్నవారు సైతం తెలివిగా కరెంట్ దొంగతనాలు చేయడానికి అలవాటుపడుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అచ్చం ఇలాగే విద్యుత్ చౌర్యానికి అలవాటుపడి మూడో కంటికి తెలియకుండా కరెంట్ వాడుకునేవాడు. రోజంతా అక్రమంగా విద్యుత్ వినియోగించుకుంటూ అధికారులు పర్యవేక్షించడానికి వచ్చినప్పుడు మాత్రం వెంటనే కరెంట్ వైర్లను కట్ చేసి తమకు ఏం తెలియదన్నట్లు నటించేవాడు. అయితే విద్యుత్ దొంగతనం జరుగుతుందని ఫిర్యాదు అందడంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ విషయంపై విచారించడానికి అక్కడికి వెళ్లారు. అధికారుల రాకను గమనించిన వ్యక్తి వెంటనే బాల్కనీపైకి మెల్లగా పాకుతూ వెళ్లి అక్కడున్న లింక్వైర్ను కట్ చేయబోయాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. టెర్రస్ మీద ఉన్న మెట్లపై ఇటుక రాళ్లతో కప్పి ఉన్న జాయింట్ వైర్లు కట్ చేస్తున్న క్రమంలో అప్పటికే ఓ అధికారి టెర్రస్ మీదకు వెళ్లి ఇదంతా వీడియో తీస్తున్నాడు. వ్యక్తిని గమనిస్తూ వీడియో తీస్తున్న ఎలక్ట్రిసిటీ అధికారి ‘బ్రదర్.. నేనిక్కడే నిల్చొన్నా’ అంటూ బదులిచ్చాడు. ఆ మాట విని అయ్యో దొరికిపోయానా అనే రేంజ్లో కరెంట్ దొంగ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఇక దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా యూపీలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతుండటంతో వీటి కోసం పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ग़ाज़ियाबाद में जब एक कटियाबाज़ के यहां बिजली विभाग का छापा पड़ा तो वो रेंगते हुए अपना अवैध कनेक्शन काटने गया,जिससे उसे कोई देख न पाए,लेकिन बिजली विभाग एक कर्मचारी उससे 2 कदम आगे निकला,वो पहले ही बगल वाले कि छत से वीडियो बना रहा था,फिर क्या हुआ देखिये pic.twitter.com/3Gs5rDIneD — Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) July 13, 2021 -
లవర్‌కు పెళ్లి ఫిక్స్; కోపంతో కాల్పులు.. వదిన మృతి
లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. తాను ప్రేమించిన యువతి వేరొకరికి సొంతం అవుతుందనే కోపంలో యువతి ఇంట్లోకి దూరి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో యువతి వదినకు బులెట్ తగలడంతో రక్తపుమడుగులో అక్కడే ప్రాణాలు విడిచింది. వివరాలు.. రోహిత్(24) అనే యువకుడు ఘజియాబాద్ జిల్లాలోని షేర్పూర్ గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. అయితే సదరు యువతికి వేరొకరితో పెళ్లి నిశ్చయమైందని రోహిత్ తెలుసుకున్నాడు. తాను ప్రేమించిన యువతి మరొకరికి దక్కకూడదనే అక్కసుతో గురువారం రాత్రి షేర్పూర్ గ్రామంలోని ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. యువతిని బలవంతంగా అక్కడినుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా కుటుంబసభ్యులు అడ్డువచ్చారు. ఈ నేపథ్యంలో రోహిత్ తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో యువతి వదిన పవిత్రకు బులెట్లు తగిలి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కాల్పుల శబ్దంతో స్థానికులు అప్రమత్తమయి పోలీసులకు సమాచారం అందించారు. అయితే రోహిత్ తన వెంట తెచ్చకున్న తుపాకీతో గాల్లోకి కాల్పులు జరుపుతూ అక్కడినుంచి పారిపోయాడు. కాగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పవిత్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా తాను ప్రేమించిన యువతికి మరొకరితో పెళ్లి నిశ్చయించారనే కోపంతో కాల్పులకు తెగబడ్డాడని ఎస్ఐ ఇరాజ్ రాజా తెలిపారు. రోహిత్‌పై కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. -
నేరగాళ్లకు సింహస్వప్నం కామాక్షిశర్మ..
లక్నో: ప్రస్తుతం నడుస్తోంది టెక్నాలజీ యుగం. ఈ సాంకేతికతను కొంత మంది తమ అభివృద్దికి, ఆవిష్కరణలకు ఉపయోగిస్తే.. మరికొంత మంది వక్ర మార్గంతో మోసాలకు పాల్పడుతున్నారు. నాణానికి ఇరువైపులా ఉండే, బొమ్మ బొరుసు మాదిరిగానే.. ప్రతి దాంట్లో మంచి చెడులు ఉంటాయి. మనం ఉపయోగించే విధానాన్ని బట్టి ఫలితాలు వస్తాయి. ఈ మధ్య కొంత మంది కేటుగాళ్లు, సైబర్ క్రైమ్ నేరాలు, ఫోన్లో వేధింపులు, ఆన్లైన్ మోసాలు వంటివి పాల్పడుతున్న సంఘటనలు మనకు తెలిసిందే. అయితే, యూపీకి చెందిన ఒక యువతి ఇదే సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాళ్ల పాలిట సింహస్వప్నంలా మారింది. ఆమె తాజాగా సైబర్ నేరాల మీద 50 వేల మంది పోలీసులకు శిక్షణ ఇచ్చింది. దీంతో, ఆమెను ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో చేర్చారు. దీంతో ప్రస్తుతం ఈమె వార్తల్లో నిలిచి అందరి ప్రశంసలను పొందుతోంది. వివరాలు.. ఘజియాబాద్ చెందిన కామాక్షి శర్మ యువతి బీటేక్ చదివింది. ఆమెకు చిన్నతనం నుంచి టెక్నాలజీ అంటే ఇష్టం. తాను బీటేక్ చదివే రోజుల్లో సరదాగా తన మిత్రుల ఫేస్బుక్ ఖాతాల ఐడీలను వారు చెప్పకపోయినా తెలుసుకునేది. అప్పట్లో సరదాగా చేసినప్పడికీ ఇప్పుడు అదే ఆమె వృత్తిగా ఎంచుకుంది. ఈ క్రమంలో ఆమె టెక్నాలజీలో మంచి నైపుణ్యం సాధించింది. 2017లో కళాశాలలో ఉన్నప్పుడు తన మిత్రులు ఎవరైనా.. హ్యాకింగ్ కు గురైనా, వేధింపులు ఎదుర్కొన్నా కామాక్షిని సంప్రదించేవారు. దీంతో ఆమె వెంటనే నేరగాళ్లను కనిపెట్టేసేది. ఈ క్రమంలో.. కామాక్షికి ఘజియాబాద్ పోలీసులతో పరిచయం ఏర్పడింది. ఘజియాబాద్ పోలీసు వారు కొన్ని సెల్‌ఫోన్ చోరీ కేసులలో, ఐపీ అడ్రస్‌ను కనుగొనడంలో కామాక్షి సహకారం అందించింది. దీంతో, పోలీసులు అనేక కేసులను తేలికగా ఛేదించారు. ఈక్రమంలో ఆమె 2019లో సైబర్ మిషన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ మిషన్‌తో ఇప్పటి వరకు జమ్ము-కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 30 నగరాలలో సుమారు యూభైవేల మంది పోలీసులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. అనేక పరిశోధన సంస్థలతో కలిసి పనిచేస్తున్నానని.. భారత సైన్యం కోసం ఫ్రీలాన్సర్‌గా కూడా సేవలందిస్తున్నట్లు వివరించింది. కాగా, ఇప్పటికే తాను ‘ఇండియా బుక్ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదిచానని తెలిపింది. అయితే, ప్రపంచ దేశాల్లోని సైబర్ పోలీసులను ఒక ప్లాట్‌ఫాం పైకి తేవాలనేదే తన కోరిక అని చెప్పింది. ఈ ఆన్లైన్ మిషన్ లో ఢిల్లీ ఏసీపీ రాజ్‌పాల్ దాబస్, ఘజియాబాద్ ఇన్స్పెక్టర్ వినోద్ పాండెతో కలిసి పనిచేస్తున్నానని తెలిపింది. తామంతా.. ఒక టీమ్‌గా ఏర్పడి పాఠశాల స్థాయి నుంచి సైబర్ మోసాల బారినపడకుండా అవగాహన కల్పిస్తున్నామని తెలిపింది. చదవండి: ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: సీఎం జగన్ -
జూమ్ గీమ్ జాన్తా నయ్.. పీఎస్‌కి రావాల్సిందే!
కొత్త ఐటీ పాలసీ, రూల్స్ పాటించాలన్న విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, మైక్రో బ్లాంగిగ్ సైట్ ట్విటర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇప్పటికే ట్విటర్‌కు మధ్యవర్తిత్వ హోదా కేంద్రం తొలగించగా.. ఘజియాబాద్ వృద్ధుడి దాడి ఘటనలో యూపీ పోలీసుల నోటీసులతో ఇరకాటంలో పడింది. తాజాగా ఈ కేసులో ట్విటర్ ఎండీ మనీశ్ మహేశ్వరిని తమ ఎదుట హాజరుకావాలని ఘజియాబాద్ పోలీసులు నోటీసులు కూడా పంపారు. అయితే తాను వర్చువల్ విచారణకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో యూపీ పోలీసులు సున్నితంగా హెచ్చరించారు. లక్నో: యూపీ పోలీసులు ట్విటర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరికి మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24వ తేదీన స్వయంగా లోనీ బోర్డర్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. జూమ్‌లో విచారణ కుదరదని, స్వయంగా హాజరు కావాలని తేల్చి చెప్పింది యూపీ పోలీస్ శాఖ. లేని పక్షంలో కేసు విచారణకు సహకరించడం లేదని భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు. చట్ట బద్ధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు ఈ వ్యవహారంలో 26 సార్లు నోటీసులు పంపినప్పటికీ మనీష్ స్పందించలేదని ఘజియాబాద్ పోలీసులు ఆరోపిస్తున్నారు. కాగా, ఘజియాబాద్‌లో ఓ వృద్ధుడి మీద జరిగిన దాడి ఘటనకు మతం రంగు పులమాలని కొందరు ప్రయత్నిస్తే.. ట్విటర్ ద్వారా ఆ వీడియోలు ఎక్కువగా వైరల్ అయ్యాయి. దీంతో ట్విటర్ నిర్లక్ష్యం వహించిందనేది యూపీ పోలీసుల ఆరోపణ. ఈ మేరకు ట్విటర్‌పై ఫిర్యాదులు కూడా నమోదు కావడంతో ఎండీ మనీష్ మహేశ్వరికి నోటీసులు పంపారు. కాగా, ఇటువంటి వివాదాలతో తనకు సంబంధం లేదని, వీటిని తాన్ డీల్ చేయనని మనీష్ ఇదివరకే పోలీసులకు బదులు కూడా ఇచ్చాడు. అయినప్పటికీ ఆ వివరణపై సంతృప్తి చెందని ఘజియాబాద్ పోలీసులు.. ఫేస్ టు ఫేస్ విచారణను ఎదుర్కొవాల్సిందేనని తేల్చిబాధ్యత చెప్పారు. చదవండి: బాధ్యత ఉండక్కర్లా? -
ఘజియాబాద్ వీడియో: ట్విటర్ ఎండీకి లీగల్ నోటీసులు.. వారం గడువు
న్యూఢిల్లీ: యూపీ ఘజియాబాద్‌లో వృద్ధుడిపై దాడి ఘటన కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఆ వృద్ధుడి ఫిర్యాదుపై భిన్న వాదనలు వినిపిస్తుండగా.. తాజాగా ఈ వీడియోకు సంబంధించి ఉత్తర ప్రదేశ్ పోలీసులు ట్విటర్ ఇండియా ఎండీకి నోటీసులు జారీచేశారు. ఉత్తర ప్రదేశ్ పోలీసులు ట్విటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ మహేశ్వరికి నోటీసులు జారీచేశారు. వారం రోజుల్లోగా లోని పోలీస్ స్టేషన్‌కొచ్చి.. వివరణ ఇచ్చుకోవాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. కాగా, మత విద్వేషాల్ని రెచ్చగొట్టేలా ఆ వీడియోను వైరల్ చేసిందంటూ ట్విటర్‌పై అభియోగాల్ని యూపీ పోలీసులు నమోదుచేశారు. ‘‘ట్విటర్ మాధ్యమాన్ని ఉపయోగించి కొందరు ఆ వీడియోల్ని వైరల్ చేశారు. కానీ, ట్విటర్ మాత్రం ఆ అకౌంట్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సంఘ విద్రోహ శక్తుల సందేశాల్ని అలా ఎలా జనాలకు చేరవేస్తారు? అంటూ ఆనోటీసుల్లో పోలీసులు ట్విటర్ ఎండీని ప్రశ్నించారు. కాగా, ఈ వ్యవహారంలో ఇప్పటికే కొందరు జర్నలిస్టులకు, కాంగ్రెస్ లీడర్ల పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేయగా, నటి స్వరభాస్కర్‌పై కూడా ఫిర్యాదు అందింది. మరోవైపు తాయెత్తులు అమ్మే సూఫీ అబ్దుల్ సమద్‌పై ఆ వ్యవహారంలోనే కక్షకట్టి దాడి చేశారని, ఇందులో మత కోణం లేదని పోలీసులు చెప్తుండగా.. మరోవైపు సమద్ కుటుంబం మాత్రం అది ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన దాడేనని చెబుతోంది. Ghaziabad Police sent legal notice to Managing Director of Twitter India over viral video of an elderly man in Loni being assaulted with the intent of "provoking communal unrest" The MD has been asked to come to the Police Station Loni Border & record the statement within 7 days pic.twitter.com/u5Ct8Omq6l — ANI UP (@ANINewsUP) June 18, 2021 టైం కావాలి ఇక కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఇవాళ ట్విట్టర్ ప్రతినిధులు హాజరయ్యారు. సామాజిక మాధ్యమ వేదికలు దుర్వినియోగం కాకుండా, పౌరహక్కులకు భంగం కలగకుండా.. ప్రత్యేకంగా మహిళల భద్రతపరంగా ఏవిధమైన నివారణ చర్యలు తీసుకోవాలనే విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా ట్విటర్ ఉన్నతాధికారులను కమిటీ ఇదివరకే ఆదేశించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ట్విటర్ అధికారుల అభిప్రాయాల్ని తీసుకుంది. కొవిడ్ కారణంగా పూర్తి చర్యలు చేపట్టేందుకు కొంచెం సమయం కావాలని ట్విటర్ కోరినట్లు తెలుస్తోంది. చదవండి: ఏం రాహుల్.. విషం నింపుతున్నావా? -
స్వరా భాస్కర్, ట్విటర్ ఇండియా హెడ్‌పై ఫిర్యాదు.. కారణం?
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి స్వరా భాస్కర్‌తోపాటు ట్విటర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరిపై ఢిల్లీలో ఫిర్యాదు నమోదైంది. ఈ నెల ప్రారంభంలో ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన వీడియోపై అనుచిత ట్వీట్లు చేసినందుకు వీరిద్దరిపై ఫిర్యాదు అందింది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనప్పటికీ ఢిల్లీ పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా ఘజియాబాద్‌లో సూఫీ అబ్దుల్ సమద్ అనే వృద్ధుడిపై కొంతమంది దాడి చేసి తన గడ్డం కత్తిరించాడని ఆరోపించిన విషయం తెలిసిందే. అతనితో వందే మాతరం, జై శ్రీ రామ్ అనాలని బలవంతం చేశారని ఆరోపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేతలు, జర్నలిస్టులు తమ ట్విటర్లలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే నటి స్వరా భాస్కర్, పాత్రికేయురాలు ఆర్ఫా కన్నుమ్ శర్వాణి, ఆసిఫ్ ఖాన్ దాడి వీడియోను తమ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో ఓ న్యాయవాది తన ఫిర్యాదుతో బుధవారం ఢిల్లీ పోలీసులను సంప్రదించారు. మత పరమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ వీడియోను వీరంతా షేర్ చేసి... శాంతికి విఘాతం కల్పించడంతో పాటు పౌరుల మధ్య మత కల్లోలాలను సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అయితే ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు స్పందిస్తూ ఇందులో మతతత్వానికి సంబంధించిన విషయం ఏం లేదని స్పష్టం చేశారు. అదృష్టం పేరుతో మోసగించినందుకు అతనిపై కోపంతో హిందువులు, ముస్లింలు మొత్తం ఆరుగురు దాడి చేశారని పేర్కొన్నారు.ఇక ఇదే వీడియోపై ట్విట్టర్, ట్విట్టర్ కమ్యూనికేషన్ ఇండియా, ద వైర్ జర్నలిస్టులు మహ్మద్ జుబైర్, రానా అయూబ్, కాంగ్రెస్ నేతలు శర్మ మహ్మద్, సల్మాన్ నిజామీ, మస్కూర్ ఉస్మానీ, రచయిత సభా నఖ్వీలపై ఉత్తరప్రదేశ్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. -
దారుణం: కావలసినంత కట్నం తేలేదని కాల్పులు
ఘజియాబాద్: సమాజంలో వరకట్నమనేది సామాజిక దురాచారం. దీని వలన స్త్రీలపై ఊహకందని రీతిలో చిత్రహింసలు, నేరాలు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తగినంత కట్నం తీసుకురాలేదని 24 ఏళ్ల భార్యను ఆమె భర్త కాల్చి చంపిన దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ముజఫర్ నగర్ జిల్లాలోని బుధానా తహసీల్ ఉపవాలి గ్రామానికి చెందిన సారికా (24)కు కుల్దీప్ అలియాస్ మింటూతో గత ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. వివాహం అనంతరం ఎక్కువ కట్నం ఇవ్వలేదని భార్య సారికాను కుల్దీప్ నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో జూన్ 1న కుల్దీప్ తన భార్య సారికతో రూ.50 లక్షల కట్నం తీసుకురాలేదని గొడవకు దిగాడు. ఆ సమయంలో అతడు తుపాకీ తీసి భార్యపై మూడు సార్లు కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయాలతో సారిక అక్కడికక్కడే మరణించింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకుని, రక్తపు మడుగులో పడి ఉన్న సారిక మృతదేహాన్ని పోస్టుమాస్టం తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు . బార్యను హత్య చేసిన తర్వాత కుల్దీప్, అతని తండ్రి మూల్‌చంద్ ఇంట్లో నుంచి పారిపోయినట్టు తెలిపారు. పరారీలో ఉన్న తండ్రి, కొడుకును అరెస్టు చేయడానికి పోలీసు బృందాలను పంపినట్టు వెల్లడించారు. కాగా నిందితుడు కుల్దీప్ గతంలో ఓ వ్యాపారవేత్త హత్య కేసులో జైలు శిక్ష అనుభవించినట్టు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: Viral: నేను పులిరాజును.. అయితే నాకేంటి!) -
నాన్‌వెజ్ పిజ్జా ఇస్తావా? రూ.కోటి ఇవ్వాల్సిందే
కొందరు శాఖాహారులకు మాంసం వాసనే గిట్టదు. అలాంటిది ఏకంగా వారు తినేదాంట్లో మాంసం కలిపేస్తే ఊరుకుంటారా? ఛాన్సే లేదు. ఇదిగో ఇక్కడ చెప్పుకునే దీపాళి త్యాగి అనే మహిళ కూడా శుద్ధ శాఖాహారి. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నివాసముండే ఆమె గతేడాది హోలి పండగ రోజు ఆకలితో ఉన్న తన పిల్లలకోసం అమెరికన్ పిజ్జా రెస్టారెంట్ నుంచి వెజ్ పిజ్జాను ఆర్డర్ చేసింది. కానీ చెప్పిన సమయాని కన్నా అరగంట ఆలస్యంగా డెలివరీ తన ఇంటి ముందుకు వచ్చింది. పోనీలేనని, తనకు తాను సర్ది చెప్పుకుని ఆ డెలివరీ బాక్స్ ఓపెన్ చేసి గబగబా తిన్నారు. ఈ క్రమంలో పిజ్జాలో మాసం ముక్కలు పంటికి తగులడంతో అది మాంసాహార పిజ్జా అని అర్థమైంది. దాన్ని క్షుణ్ణంగా చూస్తే పుట్టగొడుగుల స్థానంలో మాంసం ముక్కలు ఉన్నాయని స్పష్టమైంది. దీంతో ఖంగు తిన్న మహిళ సదరు రెస్టారెంట్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. సంప్రదాయాలు, ఆచారాలు, మత విశ్వాసాలను పాటించే నన్నే మోసం చేస్తావా? అంటూ రెస్టారెంట్‌ను కోర్టుకు లాగింది. నాన్‌వెజ్ పిజ్జా ఇచ్చి చీట్ చేశారంటూ ఇందుకు తనకు కోటి రూపాయల పరిహారం చెల్లించాల్సిందేనంటూ వినియోగదారుల వివాద పరిష్కార కోర్టుకెక్కింది. అయితే దీనిపై ఆమె అదే ఏడాది మార్చి 26న కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా.. మేనేజర్ ఉచితంగా వెజ్ పిజ్జాను పంపుతానని ఆఫర్ చేసినట్లు తెలిపింది. కానీ ఇది అంత చిన్న విషయం కాదని, తన సంప్రదాయాలను దెబ్బతీయడమేనని పేర్కొంది. తనను మానసిక క్షోభకు గురి చేసినందుకుగానూ కోటి రూపాయలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేసింది. మహిళ ఫిర్యాదుపై స్పందించాలంటూ ఢిల్లీలోని జిల్లా వినియోగదారుల పరిష్కార కమిషన్ సదరు పిజ్జా సంస్థను ఆదేశించింది. అనంతరం దీనిపై ఈ నెల 17న విచారణ జరపనున్నట్లు తెలిపింది. చదవండి: ఫ్రిజ్‌లో ఎలా కూర్చున్నాడబ్బా?! -
యూట్యూబ్ స్ఫూర్తితో హ్యాకింగ్.. తండ్రికే రూ.10కోట్లు డిమాండ్
ఘజియాబాద్: సోషల్ మీడియాతో చిన్నారులు పక్కదారి పడుతున్నారనే దానికి మరో నిదర్శనం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన. యూట్యూబ్‌లో సైబర్ క్రైమ్ వీడియో చూసి ఏకంగా తండ్రికే రూ.పది కోట్లు డిమాండ్ చేశాడో ఓ బాలుడు. ఈమెయిల్ హ్యాక్ చేసి మీ వ్యక్తిగత వివరాలు, కుటుంబసభ్యుల ఫొటోలు బహిరంగ పరుస్తానని బెదిరించాడు. రూ.పది కోట్లు ఇస్తే వదిలేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. ఘజియాబాద్‌లోని ఓ వ్యక్తి జనవరి 1వ తేదీన తన ఈమెయిల్, ఇతర వివరాలు హ్యాకయ్యాయని.. ఎవరో ఫోన్ చేసి తనకు రూ.పది కోట్లు ఇవ్వాలని.. డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ వ్యక్తిగత వివరాలతో పాటు ఫొటోలు బయటపెడతానని హెచ్చరించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఎక్కడి నుంచి బెదిరింపులు వస్తున్నాయో పోలీసులు ఆరా తీశారు. ఐపీ అడ్రస్ పరిశీలించగా ఫిర్యాదుచేసిన వ్యక్తి ఇంటి నుంచే వస్తుండడం పోలీసులకు షాకిచ్చింది. దీంతో ఇంట్లో వివరాలు సేకరించగా అతడి కుమారుడే ఈ పని చేస్తున్నాడని గ్రహించి అవాక్కయ్యారు. ఐదో తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలుడు యూట్యూబ్‌లో సైబర్ క్రైమ్ వీడియోలు చూసి ఇలా తండ్రిపైనే ప్రయోగించాడని పోలీసులు గుర్తించారు. హ్యాకింగ్‌కు సంబంధించిన వీడియోలతో పాటు ఆన్లైన్ మోసాలకు సంబంధించిన వీడియోలు చూసి తాను నేర్చుకున్నట్లు బాలుడు పోలీసులకు తెలిపాడు. ఆ విధంగా తండ్రికి ఇతర మెయిల్స్ నుంచి పంపి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆ బాలుడు వివరించడంతో పోలీసులు నోరు వెళ్లబెట్టారు. -
చిన్నారిపై హత్యాచారం: సంచలన తీర్పు
లక్నో : రెండున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో ఘజియాబాద్ ప్రత్యేక పోక్సో కోర్టు బుధవారం నిందితులకు మరణశిక్ష విధించింది. విచారణ అనంతరం కేవలం 29 రోజుల రికార్డు సమయంలోనే సంచలన తీర్పును వెలువరించింది. వివరాల ప్రకారం..అక్టోబర్19న ఘజియాబాద్ కవి నగర్ ప్రాంతానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారి హత్యాచారానికి గురయ్యింది. రోడ్డు పక్కనే ఉన్న చెట్ల పొదల్లో బాలిక మృతదేహం కనిపించింది. బాలిక తండ్రికి సన్నిహితుడైన చందన్ అనే వ్యక్తే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడయ్యింది. (కొడుకును చంపించడానికి రూ.3 లక్షల సుపారీ ) ఈ మేరకు డిసెంబర్29నే చార్జిషీట్ దాఖలు చేసినట్లు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ అవినాష్ కుమార్ తెలిపారు. తీర్పు వెలువరించే రోజు సైతం పదిమంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్షాదారాలను పరిశీలించిన అనంతరం నిందితుడికి మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి మహేంద్ర శ్రీవాస్తవ తీర్పు నిచ్చారు. కాగా ఇది ఓ సంచలన నిర్ణయమని, రికార్డు సమయంలోనే నిందితుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పురావడం ఓ మైలురాయి అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉత్కర్ష్ వాట్స్ అన్నారు. (పోకిరీ చేతిలో వ్యక్తి హతం) -
శ్మశానంలో ప్రమాదం.. 23 మంది మృతి
ఘజియాబాద్: బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శ్మశానవాటికకు వెళ్లిన 23 మందిని మృత్యువు కబళించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మురాద్‌నగర్‌లోని ఉఖ్లార్సికి చెందిన జైరామ్ అంత్యక్రియలు స్థానిక శ్మశానవాటికలో జరుగుతున్నాయి. అదే సమయంలో వర్షం ప్రారంభం కావడంతో హాజరైన చాలామంది అక్కడే ఉన్న భవనంలోకి చేరుకున్నారు. అకస్మాత్తుగా భవనం పైకప్పు కూలి వారిపై పడింది. దీంతో అక్కడికక్కడే 23 మంది చనిపోగా మరో 15 మంది గాయపడ్డారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. డాగ్‌స్క్వాడ్ సాయంతో శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని గుర్తించి వెలికితీశారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఆదివారం సాయంత్రం వరకు మృతుల్లో 18 మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఇటీవలే నిర్మించిన ఈ కట్టడం కూలి, అనూహ్యంగా ప్రాణ నష్టం సంభవించడంపై సీఎం పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. మృతదేహాలను తరలిస్తున్న దృశ్యం -
ప్రసవం అయిన 14 రోజులకే విధుల్లోకి!
లక్నో : ‘సృష్టిలో దేవుడు స్త్రీకి అత్యంత శక్తిని ఇచ్చాడు. బిడ్డలను కనడమే కాదు వారి పాలనను కూడా అంతే సక్రమంగా చూస్తుంది’ అంటోంది ఐఎఎస్ అధికారి సౌమ్య పాండే. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా ఐఏఎస్ అధికారి సౌమ్య పాండే ప్రసవం అయిన 14 రోజులకే తిరిగి విధుల్లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. కుమార్తెతో డ్యూటీ చేస్తున్న సౌమ్య ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చదవండి: ఆమ్రపాలి: ఒంగోలు టూ పీఎంవో బిజీగా మహమ్మారి పనులు.. ‘కోవిడ్–19 సమయంలో సక్రమంగా పనులు చేయడం మనందరి కర్తవ్యం’ అంటున్న సౌమ్య కరోనా సమయంలో ఎస్డీఎం అధికారిగా నియమించబడ్డారు. డెలివరీ అయిన 14 రోజుల తరువాత తన మూడు వారాల కుమార్తెతో కార్యాలయానికి వచ్చి, పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ– ‘గ్రామంలోని మహిళలు గర్భధారణ సమయంలో ఇంటి సంబంధిత పనులన్నీ చేస్తారు. ప్రసవించిన తరువాత ఆ పనులతో పాటు పిల్లల సంరక్షణ కూడా చేస్తారు. అదేవిధంగా, నా మూడు వారాల శిశువుతో పరిపాలనా పని చేయగలుగుతున్నాను. చదవండి: ఘజియాబాద్‌లో బీజేపీ బంధువు దారుణ హత్య ఈ పరిస్థితులలో నా కుటుంబం నాకు మద్దతు ఇచ్చింది. తహసీల్, ఘజియాబాద్ జిల్లా పరిపాలన నాకు ఒక కుటుంబం లాంటిది. జూలై నుండి సెప్టెంబర్ వరకు ఘజియాబాద్‌లో ఎస్డిఎమ్ ఆఫీసర్‌గా ఉన్నాను. సెప్టెంబరులో నా ఆపరేషన్ సమయంలో 22 రోజుల సెలవు వచ్చింది. ప్రసవించిన రెండు వారాల తర్వాత నేను తహసీల్‌లో చేరాను. ఈ అంటువ్యాధి సమయంలో పనిచేసేటప్పుడు ప్రతి గర్భిణీ స్త్రీల అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల’ని సౌమ్య పాండే సూచనలు చేసింది. -
ఘజియాబాద్‌లో బీజేపీ బంధువు దారుణ హత్య
ఘజియాబాద్ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యేకి చెందిన బంధువును శుక్రవారం ఆగంతకులు కాల్చి చంపారు. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని తన ఇంటి సమీపంలో ఈ ఘటన జరిగింది. రోజువారి మార్నింగ్ వాక్‌లో భాగంగా తన పనుల్లో ఉండగా, గుర్తుతెలియని ఇద్దరు దుండగులు వచ్చి అతనిపై కాల్పులు జరిపారు. దీంతో బాధితుడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన వెనక కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు మురద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే అజిత్ పాల్ త్యాగి బంధువు. కాల్పుల ఘటనతో సదరు ఎమ్మెల్యేకి సైతం భద్రత పెంచారు. (కోల్‌కతాలో యుద్ధ వాతావరణం) -
కర్మాగారంలో పేలుడు, ఏడుగురు మృతి
సాక్షి, ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఓ కర్మాగారంలో పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. ఘజియాబాద్‌లోని మోదీ నగర్లో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ అజయ్ శంకర్ పాండే తెలిపారు. మరోవైపు సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సగం కాలిన స్థితిలో కరోనా మృతదేహం
లక్నో: పుదుచ్చేరిలో కోవిడ్‌తో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని గుంతలో విసిరేసిన ఘటన మరువకముందే మరో ఉదంతం వెలుగు చూసింది. కరోనా మృతదేహాన్ని సగం కాలిన స్థితిలో వదిలేసిన దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. ఇందిరాపురానికి చెందిన వ్యాపారవేత్త కరోనాతో పోరాడి సోమవారం తనువు చాలించాడు. ప్రోటోకాల్ ప్రకారం అతని శవాన్ని వైద్యసిబ్బంది ఘజియాబాద్‌లోని విద్యుత్ శ్మశానవాటికకు తరలించారు. అక్కడ విద్యుత్ మిషన్‌లో మృతదేహాన్ని పెట్టి వెళ్లిపోయారు.. కనీసం పూర్తిగా ఖననం అయ్యేవరకు కూడా ఉండలేదు. (ఆస్పత్రి నుంచి తప్పించుకుని సొంతూరుకు) అయితే సదరు యంత్రం మధ్యలో ఆగిపోవడంతో అతని మృతదేహం సగం కాలిన స్థితిలో పడి ఉంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అతడిని దహనం చేస్తే ఇప్పటికీ అక్కడ శవం సగం కాలిన స్థితిలోనే ఉందని మండిపడ్డారు. దీంతో చర్యలు చేపట్టిన అధికారులు సుమారు 29గంటల తరువాత అంటే బుధవారం మధ్యాహ్నం నాటికి తిరిగి అతని శవాన్ని పూర్తిగా ఖననం చేశారు. అతని అంత్యక్రియలు పూర్తి కాకపోవడంతో కుటుంబం సహా బంధువులు అంతా ఒకరోజు పస్తులు ఉండాల్సి వచ్చింది. (వాళ్లను రానిస్తే మీ ఇంట్లో కరెంట్, నీళ్లు కట్) -
ఇంటికెళ్లేందుకు రూ.1.5 లక్షలు ఖర్చు పెట్టాడు!
ఘజియాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో ఓ వ్యక్తి తన స్వస్థలానికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనాన్ని దొంగిలించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ వ్యక్తి అందుకు భిన్నంగా స్వస్థలానికి చేరుకునేందుకు మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో కుటుంబంతో సహా చిక్కుకుపోయిన లల్లాన్ అనే వ్యక్తి స్వస్థలమైన గోరఖ్‌పూర్‌లోని కైతోలియా గ్రామానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం శ్రామిక్ రైలులో సీట్లు బుక్ చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ సీటు దొరకలేదు. అటు బస్సులో వెళ్దామనుకుంటే కిక్కిరిసి ఉండే జనాభా వల్ల కరోనా సోకే అవకాశాలుంటాయని కాస్త భయాందోళనకు గురయ్యాడు. దీంతో లల్లాన్ మరో ప్రత్యామ్నాయం ఆలోచించాడు. (శ్రామిక్ రైలులో విషాదం.. 5 రోజుల తర్వాత..) ఇప్పటివరకు దాచుకున్న డబ్బుతో సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. దీని కోసం రూ.1.5 లక్షలు వెచ్చించాడు. ఆ కారులో మే 29న ఘజియాబాద్ నుంచి బయలు దేరగా 14 గంటల తర్వాత ఆ కుటుంబం ఇంటికి చేరుకుంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ఈ విషయం గురించి లల్లాన్ మాట్లాడుతూ.. 'లాక్డౌన్ తర్వాత అన్ని పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నాను. ప్రస్తుత సమయంలో నేను, నా కుటుంబం స్వగ్రామానికి తిరిగి వెళ్లడమే మంచిదని భావించాను. దీంతో బస్సులో కానీ రైలులో కానీ సీట్లు పొందేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. అందుకే పైసా పైసా కూడబెట్టిన డబ్బుతో కారు తీసుకుని ఇంటికి చేరుకున్నాం. ఇక్కడే ఏదైనా పని దొరికితే ఘజియాబాద్‌కు తిరిగి వెళ్ల'నని పేర్కొన్నాడు. ('నా చావుకు లాక్డౌన్ పొడిగింపే కారణం') -
వైరల్ వీడియో: ఏటీఎంలో అనుకోని అతిథి
లక్నో : లాక్డౌన్ కారణంగా రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారడంతో అడవి జంతువున్నీ జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇటీవల ఓ కోతి ఏటీఎం మెషిన్‌ను ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే అలాంటి మరో ఘటన చోటుకేసుకుంది. అయితే ఈసారి కోతికి బదులు ఓ భారీ పాము ఏకంగా ఏటీఎం మెషిన్‌లోకి చొరబడింది. పామును చూసి డబ్బు డ్రా చేసుకోవడానికి వచ్చిన వారంతా భయాందోళనకు గురయ్యారు. చేసేదేమీ లేక దూరం నుంచి తమ మొబైల్ కెమేరాల్లో బందించారు. అనంతం అటవీశాక అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ ఐసీఐసీఐ ఏటీఎంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా... అదికాస్తా వైరల్‌గా మారింది. వేసవి నేపథ్యంలో ఈ పాము చల్లదనం కోసం ఏటీఎంలోకి దూరి ఉంటుందని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. -
వాళ్లను రానిస్తే మీ ఇంట్లో కరెంట్, నీళ్లు కట్
ఘజియాబాద్: బయటివాళ్లను అపార్ట్మెంట్ లోపలికి అనుమతిస్తే జరిమానాతో పాటు కరెంటు, నీళ్లను కట్ చేస్తామంటూ ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రకటించింది. కరోనా కట్టడిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నోటీసులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తున్న నేపథ్యంలో ఈ కఠిన నిబంధనలు తెచ్చినట్లు పేర్కొంది. అపార్ట్మెంట్ వాసులు కొత్తవారిని లోపలికి అనుమతిస్తే 11 వేల రూపాయల జరిమానాతో పాటు నీళ్లు, కరెంట్ కూడా కట్ చేస్తామని అసోసియేషన్ వెల్లడించింది. అంతేకాకుండా జరిమానా డబ్బులు చెల్లించేంత వరకు కరెంట్, నీళ్ల సేవలు పునరిద్దరించమంటూ తీవ్రంగా హెచ్చరించింది. (సరుకులు తీసుకురమ్మంటే అమ్మాయిని తెచ్చాడు) ఇప్పటికే రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని మూడు సొసైటీలు కంటైన్మెంట్ జోన్లలోకి వెళ్లడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నిబంధనలు అతిక్రమిస్తే లీగల్ నోటీసులను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది. తాజా నిబంధనలపై అపార్ట్మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమతో సంప్రదించకుండా ఎంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందించిన అపార్ట్మెంట్ అసోసిషేయన్ సభ్యులు నిబంధనలు అతిక్రమించిన రోడ్లపైకి వచ్చేవారిపై పోలీసులు ఎలా చర్యలు తీసుకుంటున్నారో మేము కూడా అపార్ట్మెంట్ వాసుల సంక్షేమం దృష్ట్యా కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మొత్తం డబ్బును పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇస్తామని అసోసియేషన్ ప్రకటించింది. -
‘కొట్టు’కెళ్లి కోడలిని పట్టుకొచ్చాడు
ఘజియాబాద్: కొట్టుకెళ్లి పచారీ సరుకులు తీసుకురారా కొడుకా అంటే ఓ యువకుడు ఏకంగా ఓ అమ్మాయినే వెంటబెట్టుకొచ్చాడు. దీంతో షాక్ తిన్న తల్లి పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తింది. జరిగింది తెలుసుకుని పోలీసులూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ వింత ఘటన బుధవారం ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఘజియాబాద్‌లోని సహీదాబాద్‌కు చెందిన గుడ్డు రెండు నెలల క్రితం సవితా అనే యువతిని హరిద్వార్‌లో ఆర్య సమాజ్ మందిర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. కానీ ఆ పెళ్లికి ప్రత్యక్ష సాక్ష్యులు లేక మ్యారేజ్ సర్టిఫికెట్ దక్కలేదు. సర్టిఫికెట్ కోసం ప్రయత్నాలు చేద్దామనుకునేలోపే లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ఇంట్లో పెళ్లి విషయం చెప్పని గుడ్డు తన భార్యను ఢిల్లీలోని ఓ అద్దె ఇంట్లో ఉంచాడు. అతను మాత్రం సహీదాబాద్‌లోని స్వగృహంలోనే ఉన్నాడు. (సొంత జిల్లాలకు వలస కూలీలు) మరోవైపు తన భార్య ఇంటి యజమానులు ఆమెను ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆమెను ఎలాగైనా ఇంటికి తీసుకురావాలనుకున్నాడు. ఈ క్రమంలో అతని తల్లి బుధవారం కిరాణ వస్తువులు తీసుకురమ్మని గుడ్డును బయటకు పంపింది. ఇదే మంచి సమయమని భావించిన అతగాడు బయటకు వెళ్లిన కాసేపటికే ఇంటిముందు భార్యతో సహా ప్రత్యక్షమయ్యాడు. ఇదెక్కడి ఘోరం అనుకున్న తల్లి పోలీసులను ఆశ్రయించగా వారు తాత్కాలిక పరిష్కారాన్ని కనుగొన్నారు. ఢిల్లీలోని సవిత ఇంటి యజమానులతో మాట్లాడిన పోలీసులు ఈ జంటను లాక్డౌన్ ముగిసేవరకు అక్కడే ఉండేందుకు అనుమతించాలన్నారు. దీనికి వారు కూడా అంగీకరించారు. (3 వేల కి.మీ. ప్రయాణం.. మృతదేహాన్ని) -
లాక్‌డౌన్‌లోనూ చేతివాటం చూపించాడు!
ఘజియాబాద్: కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తుండటంతో నేరాలు చాలా వరకు తగ్గిపోయాయి. అంతకుముందుతో పోలిస్తే చోరీలు, హత్యలు, ఇతర నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ అక్కడక్కడ చోరశిఖామణులు పంజా విసురుతూనే ఉన్నారు. ప్రపంచమంతా విపత్కర పరిస్థితుల్లో ఉన్నా కొంతమంది చోరులు మాత్రం తమ చేతికి పనిచెబుతూనే ఉన్నారు. (ఆ ఐదు రాష్ట్రాల్లో కరోనా లేదు: కేంద్రం) తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోరీ చేస్తూ ఓ దొంగ సీసీ కెమెరాకు చిక్కాడు. స్థానిక గిరి మార్కెట్లో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సరుకులు కొనేందుకు ఓ పెద్దాయన స్కూటర్ మీద దుకాణానికి వచ్చాడు. బండిని దుకాణం ఎదుటే పార్కింగ్ చేసి సరుకులు కొనడానికి వెళ్లాడు. ఆయన వెనుకే తాపీగా వచ్చిన చోరుడు అదును చూసి బండితో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ తతంగమంతా అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డయింది. దీని ఆధారంగా దొంగను పట్టుకునేందుకు యూపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దొంగ తన పని తాను చేసినట్టుగానే సీసీ టీవీ కూడా చేసిందని ఈ వీడియో చూసినవాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. అబద్దపు ప్రచారాన్ని నమ్మకండి: డీసీపీ -
కరోనా: 20 మందికి విందు.. ఆమెకు పాజిటివ్
లక్నో: కరోనా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి 20 మందికి విందు ఏర్పాటు చేసిన ఓ మహిళ (54)ను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆమెకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో కలకలం రేగింది. వివరాలు.. లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా మహిళ బహ్రెయిచ్ నుంచి ఘజియాబాద్ వెళ్లారు. గులాం అలీ పురాలోని తన నివాసంలో వారం క్రితం 20 మందికి విందు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని.. కోవిడ్ టెస్టు చేయించగా.. పాజిటివ్ వచ్చింది. ఆమె ఇంటిని, గులాం అలీ పురా ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. పార్టీలో పాల్గొన్నవారి వివరాలు సేకరిస్తున్నామని ఎస్పీ విపిన్ మిశ్రా వెల్లడించారు. ఇక ఉత్తర్‌ప్రదేశ్ వ్యాప్తంగా 1604 కరోనా కేసులు నమోదు కాగా.. 24 మంది మృతి చెందారు. 206 మంది కోలుకున్నారు. (చదవండి: నెమ్మదించిన మహమ్మారి!) -
జమాత్ సభ్యులపై అస్త్రం ప్రయోగించిన యోగి
సాక్షి, న్యూ ఢిల్లీ: ప్రజల ప్రాణాలు రక్షించడమే తమ కర్తవ్యంగా వైద్యులు భయంకరమైన కరోనా శత్రువుతో పోరాడుతున్నారు. ఈ పోరాటానికి వారికి చేయెత్తి నమస్కరించాల్సింది పోయి కనీస సంస్కారం లేకుండా దాడులకు దిగుతూ, దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేస్తున్నాయి. పైగా దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి మూల కారణంగా భావిస్తున్న తబ్లిగి జమాత్ సభ్యులే ఈ దాడులకు దిగడం శోచనీయం. వీరి ఆగడాలపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. (‘తబ్లిగీ’కి వెళ్లిన వారిలో 9,000 మంది క్వారంటైన్ ) ఘజియాబాద్‌లోని క్వారంటైన్ కేంద్రంలో మహిళా నర్సుల ఎదుటే అర్ధనగ్నంగా తిరుగుతూ, అసభ్య పదజాలాన్ని వాడుతూ అనుచితంగా ప్రవర్తించిన తబ్లిగి జమాత్ సభ్యులపై ప్రజా భద్రత చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. తబ్లిగి సభ్యులు ఉన్న కోవిడ్-19 వార్డులో మహిళా నర్సులు, మహిళా పోలీసులను తొలగించాలని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వైద్యసిబ్బందిపై దాడి వంటి ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. కాగా ఓ వ్యక్తి వల్ల దేశ ప్రయోజనాలకుగానీ లేదా శాంతి భద్రతలకుగానీ ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించినప్పుడు అతనిపై ఎన్ఎస్ఏ ప్రయోగించే అవకాశం ఉంటుంది. (డాక్టర్లపై ఉమ్మివేసినవారి అరెస్ట్) (కదిలిస్తే కన్నీళ్లే!) -
ఘజియాబాద్‌లో హృదయ విదారక ఘటన
సాక్షి, ఘజియాబాద్ : ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో అయిదుగురు చిన్నారులు ఉన్నారు. వారిలో ఓ చిన్నారి వయసు అయిదేళ్లు మాత్రమే. లోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బెహతా హాజీపూర్‌లోని మౌలానా ఆజాద్ కాలనీలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సంఘటన జరిగినప్పుడు వీరంతా ఒకే గదిలో ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. మృతులు పర్వీన్ (40), ఫాతిమా (12), సహిమా (10), రతియా (8), అబ్దుల్ అజీమ్ (8), అబ్దుల్ అహద్ (5) గా గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ కుటుంబం ఆత్మహత్యకు కారణం అదే..
సాక్షి, న్యూఢిల్లీ: ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో కలకలం సృష్టించిన కుటుంబం ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని పోలీసులు తేల్చారు. ఆర్థిక ఇబ్బందులు, మానసిన ఒత్తిడి కారణంగానే ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. వ్యాపారంలో నష్టాలు రావడంతోనే వారంత తనువు చాలించారని వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. గుల్షన్ వాసుదేవ ఉత్తర ఢిల్లీలోని గాంధీనగర్‌లో గార్మెంట్ బిజినెస్ నడిపిస్తున్నాడు. గత ఐదేళ్లుగా వ్యాపారంలో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాడు. దీంతో అతడికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. కుటుంబ పోషణ కూడా భారం కాసాగింది. ఈక్రమంలోనే కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. గుల్షర్ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మిత్రుడు అరోరాకు టెక్స్ట్ మెసేజ్ చేశాడు. అనంతరం కాసేపటికి వీడియో కాల్ చేసి మాట్లాడాడు. శాశ్వతంగా నిద్రపుచ్చిన తన పిల్లలను, గోడపై రాసిన సూసైడ్ నోట్‌ను చూపించాడు. అందులో వారి చావుకు రాకేశ్ వర్మ కారణమంటూ గోడపై రాతలు కనిపించాయి. కాగా గుల్షన్ అతని బంధువు రాకేశ్ వర్మకు రూ.2 కోట్లు అప్పుగా ఇచ్చాడు. కానీ అతను ఇచ్చిన చెక్‌లు బౌన్స్ అయ్యాయి. ఆ తర్వాత అతని దగ్గర నుంచి డబ్బు వసూలు చేయలేకపోయాడు. దీంతో 2015లో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు కూడా నమోదు చేశారు. కుటుంబం ఆత్మహత్య ఏదారి కనిపించక మరణమే శరణ్యమని భావించిన గుల్షన్ పిల్లలను చంపేసి, భార్యతో కలిసి ఎనిమిదో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్లతో పాటు అతని ఆఫీసు ఉద్యోగి సంజన కూడా ఆత్మహత్యకు యత్నించటం విచారకరం. ఆత్మహత్యకు యత్నించి తీవ్రగాయాలపాలై చికిత్స తీసుకుంటున్న సంజనను ముందుగా గుల్షన్ రెండో భార్యగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కానీ, విచారణలో ఆమెను ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగిగా తేల్చారు. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వీడియో కాల్లో శవాలను చూపించి..
ఘజియాబాద్: ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని కష్టాల సుడిలోకి నెట్టాయి. కన్నతండ్రి తన పిల్లలను చంపేందుకు కారణమయ్యాయి. ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో కలకలం సృష్టించిన కుటుంబం ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని పోలీసులు తేల్చారు. ఐదేళ్లుగా నష్టాలే.. గుల్షన్ వాసుదేవ ఉత్తర ఢిల్లీలోని గాంధీనగర్‌లో గార్మెంట్ బిజినెస్ నడిపిస్తున్నాడు. గత ఐదేళ్లుగా వ్యాపారంలో నష్టాలను చవిచూస్తున్నాడు. దీంతో అతడికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. కుటుంబ పోషణ కూడా భారం కాసాగింది. ఈ క్రమంలో గుల్షన్ తన కారుకు ఈఎమ్ఐ కూడా కట్టలేని నిస్సహాయస్థితికి చేరుకున్నాడు. పరిస్థితి ఇలానే కొనసాగితే కుటుంబం అంతా కలిసి చనిపోవడం తప్ప మరోదారి లేదంటూ చిన్ననాటి స్నేహితుడైన అరోరాతో తన గోడు వెల్లబోసుకునేవాడు. తెల్లవారుజామున స్నేహితుడికి మెసేజ్.. గుల్షర్ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మిత్రుడు అరోరాకు టెక్స్ట్ మెసేజ్ చేశాడు. అనంతరం కాసేపటికి వీడియో కాల్ చేసి మాట్లాడాడు. శాశ్వతంగా నిద్రపుచ్చిన తన పిల్లలను, గోడపై రాసిన సూసైడ్ నోట్‌ను చూపించాడు. అందులో వారి చావుకు రాకేశ్ వర్మ కారణమంటూ గోడపై రాతలు కనిపించాయి. అతను ఇచ్చిన బౌన్స్ అయిన చెక్కులు కూడా అక్కడ ఉన్నాయి. కాగా గుల్షన్ అతని బంధువు రాకేశ్ వర్మకు రూ.2 కోట్లు అప్పుగా ఇచ్చాడు. కానీ అతను ఇచ్చిన చెక్‌లు బౌన్స్ అయ్యాయి. ఆ తర్వాత అతని దగ్గర నుంచి డబ్బు వసూలు చేయలేకపోయాడు. దీంతో 2015లో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు కూడా నమోదు చేశారు. కుటుంబం ఆత్మహత్య ఏదారి కనిపించక మరణమే శరణ్యమని భావించిన గుల్షన్ పిల్లలను చంపేసి, భార్యతో కలిసి ఎనిమిదో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్లతో పాటు అతని ఆఫీసు ఉద్యోగి సంజన కూడా ఆత్మహత్యకు యత్నించటం విచారకరం. ఆత్మహత్యకు యత్నించి తీవ్రగాయాలపాలై చికిత్స తీసుకుంటున్న సంజనను ముందుగా గుల్షన్ రెండో భార్యగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కానీ, విచారణలో ఆమెను ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగిగా తేల్చారు. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఘజియాబాద్‌లో కుటుంబం ఆత్మహత్య) -
కుటుంబం ఆత్మహత్య.. ఆస్పత్రిలో రెండో భార్య!
లక్నో: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. నిద్రపోతున్న పిల్లలను శాశ్వతంగా నిద్రపుచ్చి అనంతరం తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌లోని ఇందిరాపురమ్‌లో నివాసముంటున్న ఓ జంట ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం వేకువజామున పిల్లలు నిద్రిస్తున్న సమయంలో వారిని హత్య చేశారు. అనంతరం ఆ జంటతో పాటు మరో మహిళ వారు నివసిస్తున్న అపార్ట్మెంట్లో ఎనిమిదో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు సంఘటనా స్థలంలోనే మరణించగా మరో మహిళ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయపడిన మహిళను మరణించిన వ్యక్తి రెండో భార్యగా భావిస్తున్నారు. అయితే రెండో భార్య ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసిందనేది తెలియాల్సి ఉంది. మృతుల ఇంట్లో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు విచారణ చేపడుతున్నారు.