ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా, పోలీసులు సకాలంలో స్పందించడంతో యువకుడిని క్షేమంగా రక్షించారు. మెటా ఈమెయిల్ అలారం ద్వారా స్పందించిన పోలీసులు 15 నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకోవడంతో వ్యక్తి ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది.
వివరాలు..యూపీలోని కన్నౌజ్ ప్రాంతానికి చెందిన 23ఏళ్ల అభయ్ శుక్లా అనే యువకుడు ప్రస్తుతం ఘజియాబాద్‌లోని విజయ్ నగర్‌లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈవీడియోను గమనించిన కాలిఫోర్నియాలోని మెటా హెడ్‌క్వార్టర్స్ ఉత్తర ప్రదేశ్ పోలీసులకు చెందిన సోషల్ మీడియా సెంటర్‌కు ఈమెయిల్ అలర్ట్ పంపింది. శుక్లా రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌ను కూడా పంపించింది.
చదవండి: జమ్మూ కశ్మీర్‌లో జోషిమఠ్ పరిస్థితులు.. కుంగుతున్న భూమి, ఇళ్లకు పగుళ్లు
వెంటనే అప్రమత్తమైన యూపీ పోలీసులు వ్యక్తి వివరాలను ఘజియాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు.. అటు నుంచి విజయ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడి ఫోన్ నెంబర్ ఆధారంగా కేవలం 15 నిమిషాల్లోనే లోకేషన్ ట్రేస్ చేసి సంఘటన స్థలానికి చేరుకొని వ్యక్తి ప్రాణాలు రక్షించారు. బాధితుడిని కుటుంబ సభ్యులకు అప్పగించే ముందు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
అయితే సోదరి వివాహం కోసం తల్లి కూడబెట్టిన 90,000 రూపాయలను శుక్లా అప్పుగా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ మెత్తాన్ని బిజినెస్ వెంచర్‌లో తనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఉపయోగించడంతో డబ్బులు అన్నీ పోగొట్టుకోవడంతో ఆత్మహత్యకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయం ఇక మీదట తీసుకోవద్దని హెచ్చరించినట్లు చెప్పారు.
చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగికి షాక్! అటు ఉద్యోగం, ఇటు పెళ్లి చేసుకునే పిల్లా?
Comments
Please login to add a commentAdd a comment