
సీబీఐ అధికారులు సోదాలు చేయడంతో.. మనస్తాపం చెందిన ఓ పోస్టల్ అధికారి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోట్లాది రూపాయల అవకతవకలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు పోస్టాఫీసుపై దాడి చేశారు.
ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని ప్రధాన పోస్టాఫీసుపై మంగళవారం అర్థరాత్రి సీబీఐ అవినీతి నిరోధక విభాగం అధికారులు దాడులు చేశారు. రిటైర్డ్ ఫీల్డ్ ఆఫీసర్ సహా ఎనిమిది మందికి పైగా ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ త్రిభువన్ ప్రతాప్ సింగ్ బుధవారం ఉదయం అలీగఢ్‌లోని తన ఇంట్లో లైసెన్స్‌డ్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సీబీఐ దాడులతో త్రిభువన్ ఒత్తిడికి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ జరుపుతున్నారు. సింగ్‌కు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు.
అయితే దాడులతో ఒత్తిడికి గురయ్యాడనే ఆరోపణలను మృతుడి కుటుంబ సభ్యులు ఖండించారు. తనను ఒక మహిళ, కొందరు అధికారులు తమ వద్ద పని చేయమని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ప్రతాప్ సింగ్ సోదరుడు బాధితుడు రాసిన ఆత్మహత్య లేఖను వాట్సాప్‌లో షేర్ చేశాడు. తన అధికారిక లెటర్‌హెడ్‌తో కూడిన కాగితంపై హిందీలో రాసిన నోట్‌లో.. చాలా మంది సహోద్యోగులు తమ ఆదేశాల ప్రకారం పనిచేయమని తనను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment