ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ఆత్మహత్య.. సూసైడ్‌కి ముందు వీడియో రిలీజ్‌ | Fashion Designer Muskan Narang Found Hanging At Home | Sakshi
Sakshi News home page

Muskan Narang: ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ఆత్మహత్య.. సూసైడ్‌కి ముందు వీడియో రిలీజ్‌

Published Sat, Apr 29 2023 8:22 PM | Last Updated on Sat, Apr 29 2023 8:32 PM

Fashion Designer Muskan Narang Found Hanging At Home - Sakshi

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ముస్కాన్‌ నారంగ్‌ ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలె ముంబై నుంచి ఉత్తరప్రదేశ్‌ వెళ్లిన ఆమె గురువారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి సరదాగా భోజనం చేసింది. ఆ మరుసటి రోజు ఉదయం ముస్కాన్‌ తల్లి వెళ్లి చూడగా ఆమె గదిలో లేదు. ఇళ్లంతా వెతికినా ఎక్కడ కనిపించకపోవడంతో ఇంటి పైనున్న స్టోర్‌ రూమ్‌కి వెళ్లి చూడగా ముస్కాన్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

చదవండి: నాని30లో హీరోయిన్‌ శ్రుతి హాసన్‌.. మరి మృణాల్‌ సంగతి?

దీంతో ఆమెకు కిందికి దింపి ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే ముస్కాన్‌ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా సూసైడ్‌కు కొన్ని గంటల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేసిన ముస్కాన్‌.. ఇదే తన చివరి వీడియో అని చెప్పడం గమనార్హం. 'ఇదే నా లాస్ట్‌ వీడియో.

ఇకపై నేను మీకు కనిపించను. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ని కన్విన్స్‌ చేయడానికి చాలా ప్రయత్నించాను. కానీ రివర్స్‌లో వాళ్లే నన్ను కన్విన్స్‌ చేసేందుకు చూశారు. నేను చేసే దాంట్లో ఎవరి ప్రమేయం లేదు. దయచేసి ఎవరిని నిందించకండి అంటూ చివర్లో కామెడీతో వీడియోను ముగించింది. 

చదవండి: అప్పుడే ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం మీటర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement