![Actor Sheezan Arrested In Tunisha Sharma Suicde Case - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/25/love.jpg.webp?itok=K7ACsSXM)
ప్రముఖ సీరియల్ నటి తునీషా శర్మ ఆత్మహత్య ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. షూటింగ్ సెట్‌లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ధృవీకరించారు. ఇక ఈ కేసులో విచారణను ముంబై పోలీసులు వేగవంతం చేశారు.
సహ నటుడు షీజన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. తునీషా, షీజన్ రిలేషన్‌లో ఉండేవారని, అతని వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందంటే తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని అరెస్టి చేసి విచారిస్తున్నామని ఏసీపీ చంద్రకాంత్ తెలిపారు.
కాగా తునీషా శర్మ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ‘భారత్ క వీర్ పుత్ర మహారాణా ప్రతాప్’ సీనియల్‌లో తొలిసారి నటించింది. ఫితూర్, బార్ బార్ దేఖో, కహానీ 2: దుర్గా రాణి సింగ్, దబాంగ్-3 చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ‘అలీ బాబా : దస్తాన్-ఎ-కాబూల్’లో కీలక పాత్ర పోషిస్తుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న తునీషా ఇలా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం బాధాకరమని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment