Make up
-
రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో బ్యూటీ సెన్సేషన్ ప్రొడక్ట్..!
సౌందర్య ప్రియులు, బ్యూటీ ఇండస్ట్రీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫౌండేషన్ ప్రొడక్ట్ షీగ్లామ్(SheGlam) ఇండియాలో లాంచ్ అయ్యింది. మేకప్ ప్రియులు ఇష్టపడే ఈ ప్రొడక్ట్‌ని రిలయన్స్ రిటైల్(Reliance Retail)కు చెందిన టిరా(Tira) ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మేకప్ ప్రోడక్ట్స్‌లో ది బెస్ట్ షీగ్లామ్ ప్రొడక్ట్స్. బ్యూటీ ప్రియులు అత్యంత మెచ్చే ప్రోడక్ట్ ఇది. ఈ షీగ్లామ్ ప్రొడక్ట్స్‌లో గ్లో బ్లూమ్ లిక్విడ్ హైలైటర్, డైనమాట్ బూమ్ లాస్టింగ్ లిప్‌స్టిక్‌లు, స్కిన్ఫైనెట్ హైడ్రేటింగ్ ఫౌండేషన్ వంటి ఇతర ఉత్పత్తలు అందుబాటలో ఉంటాయి. ఇవి ముఖానికి చక్కటి అందమైన మేకప్(Make Up)ని ఇస్తాయి. అంతేగాక సరసమైన ధరలో లభించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ల, మేకప్ ఆర్టిస్ట్‌లు తక్కవ ధరలోనే మంచి నాణ్యతతో కూడిన ఉత్పత్తి లభిస్తుందని ప్రశంసించిన ప్రొడక్ట్ ఇది. ఇప్పుడు టిరాలో షెగ్లామ్ అరంగేట్రంతో అందాల ఔత్సాహికులకు చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది. సమగ్ర సౌందర్యానికి భారతదేశాన్ని గమ్యస్థానంగా చేసేలా టిరా ఈ ప్రొడక్ట్ లాంచ్‌తో బలపరుస్తోంది. యావత్తు ప్రపంచం మెచ్చిన ఈ బ్రాండ్‌ని టిరా వెబ్సైట్లో, యాప్‌లలో అందుబాటులో ఉంటుందని రిలయన్స్ రిటైల్ టిరా ప్రకటించింది. ఇక త్వరలో టిరా స్టోర్లలో కూడా అందుబాటులో ఉండనుందని పేర్కొంది.చర్మ సంరక్షణ జాగ్రత్తలు..ఎంతటి బ్రాండెడ్ ఉత్పత్తులైనా.. చర్మానికి సరిపోతుందో లేదో పరీక్షించాలిఅవసరమైతే చర్మ నిపణలను సంప్రదించి వినియోగించడం మంచిదిఏ బ్యూటీ ప్రొడక్స్ట్ అయినా.. అతిగా వాడితే ప్రమాదమేనిద్రించే సమయంలో తప్పనిసరిగా మేకప్‌ని తొలగించుకోవాలి. (చదవండి: మహాకుంభమేళాలో ఆకర్షణగా మరో వింత బాబా..ఏకంగా తలపైనే పంటలు..!) -
ఇదేం మేకప్ సామీ..కన్నీళ్లు పెట్టించేస్తున్నారుగా!
అందానికి సంబంధించి.. సోషల్ మీడియాలో లెక్కలేనన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. పాదాల దగ్గర నుంచి హెయిర్ వరకు ప్రతిదాని సంరక్షణ కోసం విచిత్రమైన చిట్కాలతో వీడియోలు పోస్ట్ చేసేస్తున్నారు. ఇక మేకప్ విషయానికి వస్తే వామ్మో..! ఆ పదం ఎత్తాలంటేనే భయంగొలిపేలా పిచ్చి పిచ్చి మేకప్‌లతో జనాలను చంపేస్తున్నారనే చెప్పొచ్చు. ఏవేవో వింత వింత మేకప్‌ల వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. వాటిని చూసి జనాలు ఇవేం అందం పోకడలు అని నోరెళ్లబెడుతున్నారు. ఇప్పుడు తాజగా అదే మాదిరిగా ఓ మేకప్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది చూస్తే.. ఇందుకోసం కూడా మేకప్ అవసరమా అని తలపట్టుకుంటారు. ఇంతకీ ఏంటా మేకప్ అంటే..జపాన్ టిక్‌టాక్ బ్యూటీ క్రియేటర్ వెనెస్సా ఫ్యూన్స్ ఈ వీడియోని పోస్ట్ చేసింది. అందులో ఆమె హాట్ గ్లూగన్ అనే సరికొత్త మేకప్ గురించి వివరించింది. వేడివేడి జిగురుని ఉపయోగించి "3D టియర్‌డ్రాప్ మేకప్" వేస్తారు. ఇందులో ఏంటి స్పెషాల్టీ అంటే..మేకప్ ప్రక్రియలో భాగంగా ముఖంపై ప్లాస్టిక్ షీట్ వంటిదాన్ని పరిచి దాని మీద వేడి వేడి వెంట్రుకుల జిగురుని వేయడం జరుగుతుంది. అతి ముఖానికి అతుక్కుపోయిన వెంటనే..ఒలిస్తే కన్నీటి బిందువు ఆకారంలా ముఖంపై రావడం జరుగుతుంది. దీన్ని భావోద్వేగ భరితం లేదా దుఃఖ పూరితంగా కననిపించేలా చేసేందుకు ఈ మేకప్‌ని ఉపయోగిస్తారట. అంతేగాదు అనుకోని పరిస్థితుల్లో సానుభూతిని సంపాదించుకునేందుకు కూడా ఈ మేకప్ ఉపయోగపడుతుందట. ఆఖరికి ఏడుపుని కూడా మేకప్‌తో మాయ చేస్తారా అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఈ బ్యూటీ ట్రెండ్ చూస్తే.. ఇక రాను రాను కన్నీళ్లకు కూడా విలువ ఉండదేమోకదూ. అయితే నిపుణులు మాత్రం ఇలా చర్మంపై వేడి వేడి జిగురుని వేయడం అనేది మంచిది కాదని, ఇది చర్మ ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. (చదవండి: శీతాకాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే..?) -
కిడ్స్ మేకప్ కోసం ఈ బ్యూటీ కిట్..!
చాలామంది చిన్నారులు తమ తల్లుల్లాగానే మేకప్ వేసుకోవడం, స్పాకి వెళ్లడం వంటి పనులను ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఈ పనుల్లో తల్లులను అనుకరించాలని తహతహలాడతారు. అలాంటి వారికి మార్కెట్లో చాలానే డివైస్‌లు, కిట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. హెయిర్ స్టైల్స్ మెషిన్స్ మ్యానిక్యూర్– పెడిక్యూర్ కిట్స్, మేకప్ బాక్సెస్ ఇలా చాలానే ఉన్నాయి. వాటిపై ఓ లుక్ వేద్దామా?చిత్రంలోని ఈ కిట్ వెంట ఉంటే.. చిన్నారులంతా తమ చేతులను, కాళ్లను అందంగా మార్చుకోవచ్చు. ఫుట్ స్పా బాత్ సెట్, ఐ మాస్క్, నెయిల్ ఫ్యాన్ డ్రైయర్, వాటర్ ప్రూఫ్ స్టిక్కర్స్, మసాజ్ స్టోన్స్, గ్లిట్టర్ పౌడర్ ఇలా చాలానే ఈ కిట్‌లో లభిస్తాయి. 3 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు ఇది బెస్ట్ బహుమతి అవుతుంది. ఈ కిట్ ఇంట్లో ఉంటే చిన్నారులకు ఇంట్లోనే స్పా ఫీలింగ్ కలుగుతుంది. ఈ కిట్‌తో పిల్లలే చక్కగా నెయిల్స్ని క్లీన్ చేసుకోవచ్చు, నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు, కాళ్లను శుభ్రం చేసుకోవచ్చు. ఇలా తమ అందాన్ని తామే కాపాడుకుంటూ మెరిసిపోవచ్చు.మీ లిటిల్ ప్రిన్సెస్‌కి ఈ కిట్‌ని కొనిచ్చేస్తే.. వారి మేకప్ వారే వేసుకోవడం అలవాటు చేసుకుంటారు. ఇందులో బ్రష్‌లు, ఐ షాడోస్, బ్లష్‌లు, లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్‌లు, నెయిల్ స్టిక్కర్స్, ప్రత్యేకమైన కిరీటం, హెయిర్ యాక్సెసరీస్ వంటివి చాలానే ఉంటాయి. మందపాటి మృదువైన ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఈ కిట్‌ను తేలికగా ఓపెన్, క్లోజ్ చేసుకోవడానికి జిప్ ఉంటుంది. ఇలాంటి కిట్స్ ఆన్లైన్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. క్వాలిటీపైన, వినియోగించే తీరుపైన రివ్యూస్ చదివి చేసుకుంటే మంచిది. చిత్రంలోని ఈ డై హెయిర్ టూల్ బోలెడన్ని జడలల్లేస్తుంది. కొత్తకొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేసే అవకాశాన్నిస్తుంది. ఈ ‘రియలిస్టిక్ డై రోప్ హెయిర్ బ్రైడర్’ అందంగా క్యూట్‌గా కనిపించేందుకు రకరకాల హెయిర్ స్టైల్స్‌ను అందిస్తుంది. ఈ డివైస్ సెట్లో నాణ్యమైన ఎలక్ట్రానిక్ బ్రెయిడింగ్ మెషిన్, హెయిర్ రబ్బర్లు, ఒక దువ్వెన, హెయిర్ స్ప్లిటర్, బ్రెయిడింగ్ మెషిన్లో ఉపయోగించే త్రీ హుక్స్, వివిధ హెయిర్ యాక్సెసరీలు ఉంటాయి. దీన్ని పిల్లలకు బహుమతిగా అందివ్వొచ్చు. ఇలా తేలికగా పిల్లలు వారి జడలను వారే వేసుకునేలా మార్కెట్లో చాలా మెషిన్స్ అందుబాటులోకి వచ్చాయి.(చదవండి: చిన్నారుల ఆరోగ్యకరమైన అలవాట్ల కోసం తల్లిదండ్రులు చేయాల్సినవి..) -
అసామాన్య వనిత 'అంబికా పిళ్లై'!..ఓ పక్క కేన్సర్‌తో పోరాటం మరోవైపు..!
ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో ఊహించని మలుపులు ఎదురవుతుంటాయి. అవి ఎటువైపుకి తీసుకువెళ్తాయో కూడా చెప్పలేం. అలాంటి సమయాల్లో సరైన నిర్ణయాలతో అడుగులు వేసినవాళ్లే అసామాన్య వ్యక్తులుగా నిలిచిపోతారు. అందరికి స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి అసామాన్యురాలే ఈ అంబికా పిళ్లై. ఒకదాని వెంట ఒకటిలా కష్టాలు తరుముతున్న ఎక్కడ తన గమనం ఆపలేదు. తన అసామాన్య ప్రతిభతో దూసుకుపోయింది. చివరికి ప్రపంచమే మెచ్చే మేకప్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకుని ప్రశంసలందుకుంది.భారతదేశంలోని ప్రసిద్ధ మేకప్ ఆర్టిస్ట్‌లలో ఒకరు అంబికా పిళ్లై. జీవితంలో కష్టాలనేవి సహజమే. కానీ ఎలాంటి కష్టానికైనా.. తలవంచకుండా ధైర్యంగా సాగిపోయేవాడికే ఈ ధూనియా సలాం కొడుతుంది. అదే మేకప్ ఆర్టిస్ట్ అంబికా పిళ్లై విషయంలో జరిగింది. కేరళకు చెందిన పిళ్లై నలుగురు సోదరిమణులలో రెండోవది. ఆమె 17 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకుంది. 22 ఏళ్లకు కవిత అనే అమ్మాయికి జన్మనిచ్చింది. ఆ తర్వాత 24 ఏళ్లకే వైవాహి జీవితంలో మనస్పర్థలు తలెత్తి విడాకులకు దారితీసింది. ఆ బాధను పట్టిదిగువున బిగపెట్టి కూతురే జీవితంగా కెరీర్‌పై దృష్టి పెట్టింది. అలా ఆమె తనకెంతో ఇష్టమైన ఫ్యాషన్ రంగం వైపు అడుగులు వేసింది. బ్రెష్ పట్టుకుని ముఖానికి మెరుగులు దిగ్గే మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేయడం ప్రారంభించింది. అదే ఆమె జీవితాన్ని ఉన్నతమైన స్థితికి వెళ్లేలా చేసింది. చిన్న మేకప్ ఆర్టిస్ట్ కాస్త 1999-2000లో FDCI ఇండియన్ ఫ్యాషన్ వీక్కి పనిచేసే స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత రోహిత్ బాల్, సుస్మితా సేన్, సోనమ్ కపూర్ వంటి బాలీవుడ్ దిగ్గజ నటులకు పనిచేసే మేకప్ ఆర్టిస్ట్‌గా పేరుతెచ్చుకుంది. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో భయంకరమైన కేన్సర్ వ్యాధి బారినపడింది. సరిగ్గా అదే సమయంలో బిజినెస్ పరంగా స్నేహితురాలి చేతిలో దారుణంగా మోసపోయింది. రెండు కోలుకోలేని దెబ్బలతో తిరిగి కోలుకోలేనంతగా చతికిలపడింది అంబికా జీవితం. అంతా అంబికా అయిపోయింది అనుకున్నారు. కానీ ఆమె కష్టాలను చాలా ధైర్యంగా ఎదుర్కొంది. ఎవ్వరూ ఊహించని రీతిలో కేన్సర్‌ని జయించి మళ్లీ నెమ్మదిగా యథావిధిగా తన గమనం సాగించింది. ఇక స్నేహితురాలి మోసంతో తన సొంత పేరుతోనే స్వయంగా వ్యాపారం చేయడం ప్రారంభించింది. అలా ఆమె త్తమ మేకప్ ఆర్టిస్ట్‌గా IIFA అవార్డును కూడా అందుకుంది. ఆ తర్వాత 2019లో తన సొంత హెర్బల్ బ్యూటీ బ్రాండ్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఆమెకు 70 ఏళ్లు. ఈ వయసులోనూ అదే ఉత్సాహంతో పనిచేస్తుంది. ప్రస్తుతం ఇంటి నుంచే బిజినెస్ పనులన్ని నిర్వహిస్తోంది. ఆమెకు చిన్న చిన కథలు రాసే అలవాటు ఉందంట. అందుకని ఖాళీ సమయంలో ఎలాగైనా ఒక పుస్తకం రాయాలను భావిస్తోందట అంబికా పిళ్లై. ఇంత భయానక కష్టాలను అవలీలగా జయించుకుని రావమే గాక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుని ప్రపంచం తనవైపు చూసేలా చేసింది. జీవించడమంటే ఇది కథా.! అనేలా జీవించి చూపించి స్ఫూర్తిగా నిలిచింది అంబికా పిళ్లై.(చదవండి: సాల్మన్ చేపలతో సౌందర్యం..!) -
అత్యంత సంపన్న మేకప్ ఆర్టిస్ట్..ఎంత చార్జ్ చేస్తాడంటే..?
బాలీవుడ్ ప్రముఖులకు, సెలబ్రిటీలకు మేకప్ వేసే ఆర్టిస్టులుంటారు. వారిలో కొందరూ చాలా ఫేమస్ అవ్వడమే గాక. వాళ్ల ఆర్ట్‌తో తమ కంటూ సుస్థిరమైన స్థానాన్ని దక్కించుకుంటారు. ఎంతలా అంటే ప్రముఖులకు మేకప్ వేసే ఆర్టిస్ట్‌లుగా పేరు తెచ్చుకుంటారు. పైగా వాళ్ల ఫీజు కూడా కళ్లు చెదిరే రేంజ్లో ఉంటుంది. చెప్పాలంటే వాళ్లు ఈ స్థాయికి వచ్చేందుకు ఎన్ని కష్టాలు ఫేస్ చేసి ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. అలా కష్టాలు పడి సెలబ్రిటీలు ఇష్టపడే మేకప్ ఆర్టిస్ట్‌గా క్రేజ్‌గా తెచ్చకున్నాడో వ్యక్తి. అతడెవరంటే..అతడి పేరే మిక్కీ కాంట్రాక్టర్. అతడి ప్రస్థానం ముంబైలోని టోక్యో బ్యూటీ పార్లర్లో హెయిర్ డ్రెస్సర్‌గా మొదలయ్యింది. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న రాణి హెలెన్ మిక్కీ ముందుఖ/ వచ్చి నిలబడింది. ఆ రోజుల్లో ఆమె పెద్ద స్టార్ అందువల్ల ఏ ఇతర ఉద్యోగికి ఆమె విగ్గు తీసే అధికారం లేదు. అందువల్ల మిక్కీ ఆ సాహసం చేయలేక ఆమె అనుమతికై వేచి చూస్తున్నాడు. అప్పుడు ఆమెతో మాట్లాడుతూ..తన సినిమాలకు హెయిర్ డ్రెస్సర్‌గా ఉంటానని మిక్కీ అడిగాడు. అందుకు హెలెన్ సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే మేకప్ ఆర్టిస్ట్‌గా రమ్మని సలహ ఇచ్చింది. అదే బెస్ట్ అని మిక్కీకి హెలెన్ సూచించింది. అలా హెయిర్ డ్రెస్సర్ కాస్తా మేకప్ మ్యాన్‌గా బ్రెష్ పట్టుకుని ముఖానికి మెరుగులు దిద్దడం ప్రారంభించాడు. తన కలను నెరవేర్చుకునేందుకు, సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం ఎంతో ప్రయాసపడ్డాడు. చేయని ఉద్యోగం లేదు. అయితే కష్టపడి ఏదోరకంగా సినీ ఇండస్ట్రీలో మేకప్ మ్యాన్‌గా అవకాశం వచ్చినా..అది కేవలం సినిమాలో మిగతా తారాగణానికే వేయాల్సి వచ్చేది. సినిమాలో నటించే మెయిన్ హీరోయిన్‌కి వేసే అవకాశం దక్కేదే కాదు. ఆ అవకాశం ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎంతో ఎదురుచూపులు చూడాల్సి వచ్చేది. చివరికి 1992లో కాజోల్‌తో ‘బేఖుడి’ సినిమాతో మిక్కీకి మంచి బ్రేక్ వచ్చింది. అలా వెనుదిరిగి చూసుకోకుండా..హమ్ అప్కే హై కౌన్, దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ ఘమ్, కల్ హో నా హో, మొహబత్తెయిన్, మై నేమ్ ఈజ్ ఖాన్, కార్తీక్ కాలింగ్ కార్తీక్, డాన్, వీరే ది వెడ్డింగ్, వంటి చిత్రాలకు మేకప్ మ్యాన్‌గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. నీతా అంబానీ, ఇషా అంబానీ, టాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి, కరీనా కపూర్, అలియా భట్, అనన్యపాండే వంటి ప్రముఖులకు మేకప్ వేసేది మిక్కీనే. చెప్పాలంటే సెలబ్రిటీల మేకప్ ఆర్టిస్ట్‌గా పేరుతెచ్చుకున్నాడు. అతను మేకప్ వేయడానికి ఒకరోజుకి 75,000 నుండి రూ. లక్ష వరకు ఫీజు ఛార్జ్ చేస్తాడు. అంతేగాదు మిక్కీ భారతదేశంలోని అత్యంత సంపన్నమైన మేకప్ ఆర్టిస్ట్‌లో ఒకరు కూడా.(చదవండి: వెయిట్ లాస్ స్టోరీ: ఐస్‌క్రీం తింటూ 16 కిలోలు..!) -
మేకప్ లేకుంటే కంగనాను గుర్తుపట్టరు: మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
మండీ: హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై ఆ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగత్ సింగ్ నేగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర శాసనసభలో చర్చ సందర్భంగా జగత్ సింగ్ కంగన అంశాన్ని ప్రస్తావించారు. ‘జూన్ చివర్లో ముంచెత్తిన వర్షాలు, వరదలతో మన రాష్ట్రం అతలాకుతలమైంది. నేతలంతా వరద ప్రభావితకాలంలోనే పర్యటించి బాధితులను ఓదార్చారు. కంగన ప్రాతినిధ్యం వహిస్తున్న మండీ నియోజకవర్గం సైతం వర్గం, వరద బారిన పడింది.కానీ కంగన పరద సమయంలో పర్యటించలేదు. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టి అంతా సర్దుకున్నాక తీరిగ్గా కంగన పర్యటించారు. వర్షాల కాలంలో ఆమె బయటకు రాదు. ఎందుకంటే వర్షం కారణంగా ఆమె వేసుకున్న మేకప్ పోతుంది. మేకప్ లేకుంటే కంగనను ఎవరూ గుర్తుపట్టలేరు. ఎదురుగా ఉన్నది కంగననా? లేక ఆమె తల్లినా? అనేది కూడా ఎవరూ పోల్చుకోలేరు" అని అన్నారు. దీంతో బీజేపీ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.People have lost everything, in the vastness of that loss I feel immense pain and grief. pic.twitter.com/Mfh1Gg3YUq— Kangana Ranaut (@KanganaTeam) August 6, 2024కాగా ఇటీవేల హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వరదలు అతలాకుతలం చేశాయి. ఈ వర్షాల వల్ల దాదాపు 153 మంది మరణించారు. సుమారు రూ.1271 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీంతో, వరద ప్రభావిత ప్రాంతాన్ని ఆగష్టు 7న కంగన సందర్శించి.. బాధితులను పరామర్శించారు. ఆ ఫొటోలను కంగనా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ ఫొటోలపై జగత్ సింగ్ నేగి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
హీరోయిన్ల ముఖం అంతలా వెలిగిపోవడానికి కారణం ఇదేనా?
హీరోయిన్ భూమి ఫడ్నేకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ బాలీవుడ్లో మాత్రం ఈ బ్యూటీకి బాగానే ఫాలోయింగ్ ఉంది. 2015లో విడుదలైన ‘దమ్ లగాగే హైసా’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన భూమి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన టాయిలెట్ : ఏక్ ప్రేమ్ కథ, శుభ్ మంగళ్ సావధాన్,పతీ ఔర్ పత్నీ వంటి సినిమాలతో బీటౌన్‌లో క్రేజీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తరచూ ఫ్యాషన్, బ్యూటీకి సంబంధించిన పలు విషయాలను నెటిజన్లతో పంచుకుంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతున్న ఐ మేకప్ హ్యాక్‌ను ట్రై చేసింది. స్మోకీ స్మడ్జ్ క్యాట్ ఐలైనర్‌ను సులభంగా ఎలా వేసుకోవాలో చూపించింది. అంతేకాకుండా ఈ హ్యాక్ తనకు బాగా నచ్చిందని, తన రెగ్యులర్ మేకప్‌లో దీన్ని తప్పకుండా వాడతానంటూ ఇన్‌స్టాలో వీడియోను షేర్ చేసింది. View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) ఇక మరో వీడియోలో కేవలం ఐదు నిమిషాల్లో మేకప్ ఎలా వేసుకోవాలో చూపించి ఆశ్చర్యపరిచింది. సాధారణంగా హీరోయిన్స్ తమ బ్యూటీ సీక్రెట్స్‌ను, మేకప్ రొటీన్‌ను ఎక్కువగా షేర్ చేసుకోరు. కానీ ఈ బ్యూటీ మాత్రం తాను మేకప్ కోసం ఎలాంటి ప్రోడక్ట్స్ వాడుతుందో కూడా రివీల్ చేసింది. మరి మీకు నచ్చితే ఓసారి ట్రై చేసేయండి. -
తవ్వకాల్లో బయటపడిన రెండు వేల ఏళ్ల నాటి బ్యూటీ పార్లర్!
పురావస్తు శాఖ తవ్వకాల్లో ఎన్నో విచిత్ర వస్తువులు బయటపడ్డాయి. నాటి కాలంలోని మద్యం షాపుల ఆనవాళ్లు, ఆనాడే ఉపయోగించిన ఆయుధాలు, పనిముట్ల తీరు చూసి ఆశ్చర్యపోయాం. అంతేగాదు ఆ కాలంలో వైద్య చికిత్స విధానాలకు సంబంధించిన పుస్తకాలు, కొన్ని ఆధారాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఏకంగా పురాతన కాలం నాటి బ్యూటీపార్లర్ (మేకప్ షాప్) బయటపడింది. ఆ రోజుల్లో కూడా సౌందర్యాన్నికి ప్రాముఖ్యత ఇచ్చేవారని విన్నాం కానీ ఆధునికి కాలంలో ఉపయోగించే మేకప్ సామాగ్రి మాదిరిగా ఆకాలంలోను ఉందంటే నమ్మగలరా! వివరాల్లోకెళ్తే..ఈ పురాత మేకప్ షాప్‌ని టర్కీలోని ఐజోనోయ్ నగరంలో వెలుగుచూసింది. ఈ నగరం రోమన్ యుగంలో ఒకప్పుడూ రాజకీయ, ఆర్థిక కార్యకలాపాలను ముఖ్య కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో పెర్ఫ్యూమ్ కంటైనర్లు, మేకప్ అవశేషాలు తదితరాలు బయటపడ్డాయి. వీటిని రెండు వేల ఏళ్ల క్రితం రోమన్ మహిళలు ఉపయోగించేవారని భావిస్తున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. అందులో పూసపూసలుగా ఉండే నగలు, సౌందర్య ఉత్పత్తులు కూడా ఉన్నట్లు తెలిపారు. ఆ షాప్‌లో మేకప్ కిట్‌కి సంబంధించిన ఓస్టెర్ షెల్లు, మేకప్ పెట్టుకునే కంటైనర్లు, ఐషాడోలు, బుగ్గలకు వేసుకునే ఎరుపు రంగులు తదితరాలు ఉన్నాయి. కేవలం బుగ్గలకు వేసే ఎరుపు, గులాబీ రంగుల్లోనే పది రకాల విభిన్నమైన షేడ్స్ ఉండటం విశేషం. (చదవండి: ఆ ఊరిలోని మహిళలంతా ఐదు రోజులు దుస్తులు లేకుండా ఎందుకుంటారో తెలిస్తే..షాకవ్వుతారు!) -
రంగులతో ఎంత మాయో.?
-
ఆమెతో పెళ్లి వద్దు.. వధువు మేకప్ ప్లాన్ ఎంత పనిచేసింది!
పెళ్లి వేడుక సందర్బంగా బ్యూటీపార్లర్‌కు వెళ్లడమే ఆమె పాలిట శాపమైంది. చిన్న మిస్టేక్ కారణంగా వివాహం ఆగిపోయిన పరిస్థితి ఎదురైంది. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిదంటే.. వివరాల ప్రకారం.. కర్నాటకలోని హసన్ జిల్లాలోని అరసికెరె గ్రామానికి చెందిన ఓ యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. కాగా, పెళ్లి కోసమని ఆమె స్థానికంగా ఉన్న ఓ బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా ఫేషియల్ అనంతరం ఆవిరి పడుతున్న క్రమంలో వేడి కారణంగా ఆమె ముఖం వాడిపోయింది. దీంతో, ఆమె రూపం మొత్తం మారిపోయింది. ముఖం నల్లగా అయిపోయి.. ఆవిరి కారణంగా ముఖం వాచిపోయింది. అనంతరం, ఆమెను ఆసుపత్రిలో చేర్పించడంతో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో ఆమెను చూసిన వరుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఆమె ముఖం మారిపోవడంతో వరుడు పెళ్లికి తిరస్కరించాడు. కాగా, వరుడి నిర్ణయంలో వధువు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ ఘటనకు కారణమైన బ్యూటీ పార్లర్ యజమాని గంగపై మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యజమానిని పిలిపించి విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, పెళ్లి ఆనందంలో ఉన్న ఇంట్ల ఈ చిన్న కారణంగా వివాహం ఆగిపోవడంతో ఈ ఘటన స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది. -
సీరియల్ నటి ఆత్మహత్య కేసులో సహనటుడు అరెస్ట్
ప్రముఖ సీరియల్ నటి తునీషా శర్మ ఆత్మహత్య ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. షూటింగ్ సెట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ధృవీకరించారు. ఇక ఈ కేసులో విచారణను ముంబై పోలీసులు వేగవంతం చేశారు. సహ నటుడు షీజన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. తునీషా, షీజన్ రిలేషన్లో ఉండేవారని, అతని వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందంటే తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని అరెస్టి చేసి విచారిస్తున్నామని ఏసీపీ చంద్రకాంత్ తెలిపారు. కాగా తునీషా శర్మ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ‘భారత్ క వీర్ పుత్ర మహారాణా ప్రతాప్’ సీనియల్‌లో తొలిసారి నటించింది. ఫితూర్, బార్ బార్ దేఖో, కహానీ 2: దుర్గా రాణి సింగ్, దబాంగ్-3 చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ‘అలీ బాబా : దస్తాన్-ఎ-కాబూల్’లో కీలక పాత్ర పోషిస్తుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న తునీషా ఇలా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం బాధాకరమని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
హీరోయిన్ అసిన్ కూతుర్ని చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి అసిన్. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ గజిని, శివమణి, ఘర్షణ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగుతో పాటు తమిళ,హిందీ భాషల్లో కూడా ఈమె క్రేజ్ ను సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే 2016లో రాహుల్ శర్మ అనే బిజినిస్ మెన్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన అసిన్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన పలు ఫోటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా తన భర్త రాహుల్‌కు కూతురు అరిన్ మేకప్ వేసింది. లిప్‌స్టిక్, ఐ షాడోస్, కాంపాక్ట్ వంటివి చక్కగా వేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను అసిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. -
పుష్పరాజ్ కోసం ఎన్ని గంటలు మేకప్ వేశారో తెలుసా?
Allu Arjun Reveals Interesting Facts About Makeup of Pushpa Raj Getup: అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప' మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్లతో మూవీ టీం ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అల్లు అర్జున్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. పుష్ప కోసం చాలా కష్టపడ్డామని, అటవీ ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. ఇక పుష్పరాజ్ పాత్ర కోసం కేవలం మేకప్‌కే రెండున్నర గంటల సమయం పట్టిందని, అది తీసేయడానికి మరో 30 నిమిషాల సమయం పట్టిందని తెలిపాడు. ఇప్పటివరకు తన కెరీర్లో ఇంతటి మేకప్ అవసరం రాలేదని, చాలా మినిమల్ మేకపే వాడామని చెప్పుకొచ్చాడు. కాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించింది. చదవండి: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సమంత స్పెషల్ సాంగ్ -
Eyeliner: ఐలైనర్ వాడుతున్నారా.. అయితే...
మేకప్ ముఖాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతుంది. అయితే కళ్లకు పెట్టుకునే ఐలైనర్ మేకప్‌లో కీలకపాత్ర పోషిస్తుంది. ఐలైనర్ కాస్త అటూ ఇటూ అయినా మేకప్ మొత్తం చెడిపోతుంది. ఐలైనర్ లైన్ దాటకుండా అందాన్ని మరింతగా ఎలా పెంచుకోవచ్చో చూద్దాం... మార్కెట్లో వివిధ రకాలా ఐలైనర్లు దొరుకుతుంటాయి. అయితే మన్నికనిచ్చే కంపెనీ లేదా బ్రాండ్ ఐలైనర్‌ను మాత్రమే కొనాలి. ముఖ్యంగా వాటర్ ప్రూఫ్ అయ్యి ఉండేలా చూసుకోవాలి. వాటర్ ప్రూఫ్ అయితే ఎక్కువ సమయం నిలిచి ఉండడమేగాక, కళ్లకు ఎటువంటి హానీ కలిగించదు. ఐలైనర్ వేసే ముందుకంటే ముందుగా కనురెప్పలకు ప్రైమర్ వేయాలి. ప్రైమర్ వేసిన తరువాతే ఐలైనర్ వేయాలి. దీనివల్ల ఐలైనర్ ఎక్కువసమయం ఉండడమేగాక, కళ్లు మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. మేకప్ వేసే ముందు కంటికింది భాగంలో కన్సీలర్ రాయడం వల్ల మచ్చలు పోయి కళ్లు వికసించినట్లు కనిపిస్తాయి. అంతేగాకుండా ఐలైనర్ వేసేముందు కూడా కన్సీలర్ రాయడం మరింత మంచిది. పెన్సిల్ లేదా జెల్ ఐలైనర్ వాడేటప్పుడు తప్పనిసరిగా కళ్లకు నప్పే ఐషాడో వేయాలి. దీనివల్ల కంటి అందం మరింత మెరుగుపడుతుంది. లిప్‌స్టిక్ వేసినట్లుగా ఐలైనర్‌ను రెండు కోటింగ్‌లు వేయడం వల్ల ఐలైనర్ మరింత బ్రైట్‌గా కనిపించడమేగాక, కళ్లు పెద్దవిగానూ, అందంగానూ కనిపిస్తాయి. చదవండి: Dry Eye Irritation: కంట్లో దురదా.. ఇలా చేస్తే సమస్యలకు చెక్ పెట్టవచ్చు! -
‘పుష్ప’ కోసం బన్ని డెడికేషన్, మేకప్‌కు అంత సమయమా..!
Allu Arjun Pushpa Movie: పాత్రలతో ప్రయోగాలు చేసే నటులలో కమల్ హాసన్, విక్రమ్ చియాన్లు ముందుంటారు. వారి పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు ఎంత కష్టమైన ఇష్టంగా చేస్తారు. అందుకే ఎప్పుడూ వారు వైవిధ్యమైన కథలతో డిఫరెంట్‌లుక్‌తో ఆశ్చర్యపరుస్తుంటారు. అంతగా సినీ పరిశ్రమలో కమల్, విక్రమ్‌లు విలక్షణ నటులుగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్ర ‘పుష్ప’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది. చదవండి: హీరోయిన్ మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా? ఇందులో స్టైలిష్ స్టార్ మునుపెన్నడు చూడని విధంగా మాస్ లుక్‌తో అలరించబోతున్నాడని ఇప్పటికే విడుదలైన ఆయన ఫస్ట్‌లుక్ చూస్తే తెలుస్తోంది. ఊరమాస్‌గా భయంకరమైన స్మగ్లర్ పుష్పరాజుగా నటించబోతున్నాడు. అయితే ఇందులో తన లుక్ కోసం బన్ని బాగానే కష్టపడుతున్నాడట. స్టైలిష్‌గా లవర్ బాయ్‌లా ఉండే బన్ని ఈ మూవీలో పుష్ప రాజులా కనిపించడానికి తనని తాను మేకోవర్ చేసుకుంటున్నాడు. రోజు సెట్లో మేకప్‌కు వేసుకోవడానికి, తీయడానికి 3 గంటల పైనే సమయం కేటాయిస్తున్నాడట. రింగులజుట్టు, గడ్డంతో వీరమాస్ లుక్‌లో టాన్ టచ్ అప్లు చేయించుకుంటున్నాడు. ఈ మూవీలో అల్లు అర్జున్ మేకప్ వేయడానికి రెండు గంటలు, ఆ మేకప్‌ను తొలగించడానికి గంటకు పైనే సమయం పడుతుందా. ఆయన డెడికేషన్‌ను చూసి డైరెక్టర్‌తో పాటు సెట్లోని మిగతా బృందం ఫిదా అవుతున్నారట. అంతేగాక ప్రతిరోజు మేకప్ విషయంలో ఆయన ఓపిక చూసి వారంత ప్రశంసల వర్షం కురిపిస్తున్నారట. ఇది తెలిసి ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. కాగా ‘పుష్ప’ పార్ట్ వన్ క్రిస్మస్ రోజు విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే కమల్ హాసన్ హాసన్ .. భారతీయుడు సినిమాలో సేనాపతి లుక్ కోసం 4 గంటలు మేకప్ వేసుకునే వాళ్లు. ఇక దశావతారం సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విశ్వరూపం వేషధారణకి సంబంధించిన మేకప్‌కు ఎక్కువ శ్రమించాడు. ఇక ఐ సినిమాలో విక్రమ్ తన లుక్కు బాగానే శ్రమించాడు. దీనికి ఆ సినిమాలో ఆయన లుక్‌యే ఉదాహరణ. చదవండి: చిరంజీవి బర్త్‌డే వేడుకలో కనిపించని అల్లు అర్జున్, ఏమైంది.. -
పాపం.. ఆ రూపం కోసం ఎంత కష్టపడ్డారో!
‘ఒక శిల్పం అందంగా ఉందంటే ఆ గొప్పదనం అంతా శిల్పానిదే కాదు.. దానిని చెక్కిన శిల్పిది కూడా’.. అన్నాడో మహాకవి. ఒక సినిమా వెనుక నటీనటుల కష్టం ఎంతున్నా.. బిహైండ్ సీన్లో కష్టపడే టెక్నీషియన్ల కష్టం కూడా అంతే ఉంటుంది కూడా. అయితే గుర్తింపు దక్కనంత వరకు వాళ్ల కష్టం తెర వెనుకే ఉండిపోతుంది కూడా. అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ సినిమాలో లారా దత్తా అచ్చుగుద్దినట్లు ‘ఇందిరా గాంధీ’ లుక్‌తో మెస్మరైజ్ చేయగా.. దాని వెనుక మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్ అండ్ టీం శ్రమ దాగుంది. బెల్ బాటమ్ పిరీయాడికల్ ఫిల్మ్ కావడంతో తన టీం కాస్త ఎక్కువే కష్టపడ్డట్లు చెప్తున్నాడాయన. ఆ ‘ప్రోస్తెటిక్’ కష్టాలేంటో వాళ్ల మాటల్లోనే విందాం. చదవండి: ఈ హీరోను గుర్తుపట్టలేరని పందెం! విక్రమ్ గైక్వాడ్ మాటల్లో.. ఈ జనరేషన్‌కి ప్రోస్తెటిక్ మేకప్, మేకప్ ట్రిక్స్, గ్రాఫిక్స్ జిమ్మిక్కుల గురించి బాగా అవగాహన ఉంది. మేకప్‌లో కొంచెం తేడాలు కనిపిస్తే.. తిట్టడానికి, ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇందిరాగాంధీలాంటి ఛరిష్మా ఉన్న నేత క్యారెక్టర్ లారా దత్తాది. కానీ, ఇద్దరి ముఖాలకు కొంచెం కూడా పొలికలు లేవు. అందుకే కొంచెం శ్రద్ధ ఎక్కువ పెట్టాల్సి వచ్చింది అని అంటున్నాడాయన. ముక్కుతోనే.. ఇందిరకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రాత్రింబవలు కూర్చుని చూసింది మా టీం. ఇందిరాగాంధీ ముఖంలో కనుబొమ్మలు, ముక్కు, హెయిర్‌స్టైల్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాం. లారా కోసం ప్రోస్తెటిక్ ముక్కు కోసం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. అయినా ఎక్కడో ఒక అనుమానం. చివరికి లుక్ టెస్ట్ టైంలో లారా అవతారం చూసి మా కళ్లారా మేమే నమ్మలేకపోయాం. ఆపై దర్శకుడు రంజిత్ తివారీ, నిర్మాత జక్కీ భాగ్నానీ, హీరో అక్షయ్ కుమార్ ఆ లుక్ చూసి స్టన్ అయిపోయారు. అంత కష్టపడ్డాం గనుక లుక్ అవుట్‌పుట్ అంత బాగా వచ్చింది.. నెటిజన్స్ నుంచి అభినందనలు దక్కాయి అని తెలిపాడు విక్రమ్. ఇదే అసలు ఛాలెంజ్ ప్రోస్తెటిక్ మేకప్‌లో భాగంగా విడివిడి భాగాల్ని రూపొందించడం ఒక ఎత్తు అయితే.. వాటి అంచులు స్కిన్‌కు సూట్ అయ్యేలా చూసుకోవడం అసలు ఛాలెంజ్ అని చెబుతున్నాడాయన. ఈ క్రమంలో తన టీం పడ్డ కష్టానికి ప్రతిఫలం దొరికిందని సంబురపడుతున్నాడు. అయితే విక్రమ్ గైక్వాడ్ సామాన్యుడేం కాదు.. నాలుగు సార్లు నేషనల్ అవార్డు గ్రహీత కూడా. ‘ఓంకార, ఢిల్లీ-6, త్రీఇడియట్స్, ఇష్కియా, కమీనే, భాగ్ మిల్కా భాగ్, హంటర్, ఓకే కన్మణి, మిర్జయా, దంగల్ సినిమాలకు పని చేశాడు. అంతేకాదు తుకారాం, లోక్మాన్య ఎక్ యుగపురుష్, లపాచ్ఛపి సినిమాల్లో నటించాడు కూడా. ఫ్లైయిట్ హైజాకింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన బెల్ బాటమ్.. రిలీజ్‌పై స్పష్టత రావాల్సి ఉంది. -
వైరల్ వీడియో: ముఖం మొత్తం మేకప్.. చూస్తే గానీ తెలియదు!
వాషింగ్టన్: కాలం వేగంగా మారిపోతోంది. దాంతో పాటు మనుషుల అలవాట్లు మారుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు వయసు దాచుకోవాలని చూస్తున్నారు. అందుకే బ్యూటీ పార్లర్లకు ఫుల్ గిరాకీ. మరోవైపు అందంగా కనిపించాలంటే చాలా సమయం, శ్రమ వెచ్చించాలనుకుంటారు చాలా మంది అమ్మాయిలు. అయితే తాజాగా ఓ అమ్మాయి వేసుకున్న మేకప్ నెటిజన్లకు పరీక్ష పెడుతోంది. చూస్తే గానీ ఏది ముక్కు, ఏవి పెదాలు, ఏవి కళ్లు తెలియడం లేదు. ఈ వీడియోలోని ముఖం మొత్తం కళ్లు, పెదాలు, చెవులు ఉన్నాయి. ఈ వీడియోను అమెరికన్ మాజీ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తెగ వైరలవుతోంది. మేకప్ వేసుకున్న అమ్మాయి పెదవులపై లిప్‌స్టిక్‌ను పెట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది. కానీ, కళ్లు తెరిచే సరికి అసలు విషయం తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ వీడియోను 4.70 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ ఈ వీడియో నన్ను కాసేపు అయోమయంలో పడేసింది. ఏంటి ఈ పరీక్ష?’’ అంటూ కామెంట్ చేశారు. మరో నెటిజన్ ‘‘మేకప్ అదిరిపోయింది. అరే ఏవి ఎక్కడ వున్నాయో తెలియడం లేదు.. గోడపై పెయింటింగ్‌లా భలే ఉంది.’’ అంటూ చమత్కరించాడు. When the edibles hit… pic.twitter.com/BSeBnAAES9 — Rex Chapman🏇🏼 (@RexChapman) July 15, 2021 -
మేకప్ లేకుండా నాగార్జున ఇలా? ఫోటో వైరల్
ఆరు పదుల వయసులోనూ నవ మన్మథుడిగానే కనిపిస్తూ ఉంటాడు అక్కినేని నాగార్జున. గ్లామర్ విషయంలో ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా నిలిస్తుంటాడు. ఆయన ఎంచుకునే సినిమాలు కూడా అలాగే ఉంటాయి. కుర్ర హీరోలు కూడా అంత ఎనర్జిటిగ్గా నటించరేమో అన్నట్లుగా నాగ్ యాక్టింగ్ ఉంటుంది. ఆయన ఎనర్జీ, అందం రహస్యం ఏంటో ఇప్పటికీ మిస్టరీగానే మిలిగిపోయింది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు నాగార్జున పూర్తిగా మారిపోయాడు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోనే ఇందుకు నిదర్శనం. అందులో నాగ్ పూర్తిగా నెరిసిన జుట్టు, మీసకట్టుతో కనిపించడం అందరిని షాక్‌కు గురిచేస్తుంది. మేకప్ లేకుండా కింగ్ ఇలా ఉంటారా ? అనే సందేహం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం నాగ్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండా.. రా ఏజెంట్ పాత్రలో నాగ్ కనిపించబోతున్నాడు. అలాగే బంగార్రాజు అనే చిత్రంలోనూ నటించబోతున్నాడు. -
కొంప ముంచిన బ్యూటీ టిప్.. కంటి చూపు కోల్పోయిన టిక్‌టాక్ స్టార్
చాలా మంది అమ్మాయిలు అందంగా కపించడం కోసం మార్కెట్లో కనిపించే వివిధ ఫేస్ క్రీములను వాడుతుంటారు. ముఖ్యంగా యాడ్స్, సోషల్ మీడియాలో వచ్చే బ్యూటీ టిప్స్‌ని ఫాలో అవుతుంటారు. నిపుణుల సలహాలను తీసుకోకుండా దొరికిన క్రీములన్నింటిని ముఖాలపై ప్రయోగిస్తుంటారు. దీని వల్ల ఉన్న అందంతో పాటు కంటి చూపు కూడా కోల్పేయే ప్రమాదం ఉంది. అందుకే ఫేస్ క్రీముల విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఈ అమ్మాయి పరిస్థితే మీ అందరికి వచ్చే అవకాశం ఉంది. టిక్ టాక్ స్టార్, ఆస్ట్రేలియా బిగ్ బ్రదర్ కంటెస్టెంట్ అయిన టిల్లీ విట్ ఫెల్డ్ అనే యువతి.. ఓ వీడియో చూసి అప్లై చేసుకున్న బ్యూటీ టిప్... ఆమెను ఆస్పత్రిపాలు చేసింది. బిగ్ బ్రదర్ షోలో ఆమె... తన ఫేసుకు బ్లూ క్లే ఫేస్ మాస్క్ ధరించింది. అలా ఎందుకు ధరించావని నెటిజన్లు అడిగారు. దాంతో అసలేం జరిగిందో ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. టీవీ షోలు, ఫ్యాషన్ ప్రోగ్రామ్స్ కోసం నిరంతరం మేకప్ వేసుకునే టిల్లీ.. రెండు నెలల కిందట టిక్ టాక్ లో ఓ అక్యుపంక్చర్ బ్యూటీ టిప్ వీడియో చూసింది. అది నచ్చడంతో అదే తహాలో ప్రయత్నించింది. అయితే అది ఆమెకు రియాక్షన్ ఇచ్చింది. ముఖం మాడిపోయి, మచ్చలు వచ్చేశాయి. కురుపులు వచ్చేశాయి. మొత్తం తేడా కొట్టింది. దమైన ఫేస్ కాస్తా… అందవికారంగా మారింది. అంతేకాదు ఆమె కంటి చూపు కూడా తాత్కాలికంగా కోల్పోయింది. ఈ ఘటన తర్వాత ఆమె ఆస్పత్రి పాలైంది. ఎవరూ తనలాగా హోమ్ మ్యాక్స్ చేసుకొవద్దని, సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు చూసి మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది. నిపుణుల సలహాతో మేకప్ క్రీములు వాడాలని ఆమె సూచించింది. View this post on Instagram A post shared by T I L L Y 🍒 (@tillywhitfeld) -
మాస్క్ దెబ్బకు కళ్లకు కొత్త అందాలు
సాక్షి, హైదరాబాద్: కరోనా, లాక్డౌన్ల కారణంగా నగరవాసుల్లో సౌందర్య పోషణ పెరిగింది. అందివచ్చిన ఖాళీ సమయం కొత్త అందాలను అందుకోమని ప్రేరేపించింది. మాస్క్‌తో ముఖాన్ని మూసుకోవాల్సి వచ్చినా.. అధరాలు లిప్స్టిక్స్ అద్దుకుంటూనే ఉన్నాయి. కళ్లు కొత్త అందాలు సంతరించుకుంటూనే ఉన్నాయి. హెయిర్ కేర్, హైజీన్ కేర్ కూడా పెరిగింది. అత్యధిక సమయం నాలుగ్గోడల మధ్యనే నడిచిపోయింది కాబట్టి.. అందంగా కనపడాలనే ఆసక్తి తగ్గిందని అనుకుంటే అపోహే అంటున్నాయి కాస్మొటిక్ బ్రాండ్స్ తయారీ సంస్థలు. గతేడాది ఆన్లైన్ వేదికగా నమోదైన విక్రయాలు దీనినే సూచిస్తున్నాయని ప్రముఖ ఆన్లైన్ మేకప్ ఉత్పత్తుల విక్రయ సంస్థ పర్పుల్ డాట్ కామ్ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే మార్చి నుంచి జూన్ వరకూ కాస్త నిదానించినా.. ఆ తర్వాత రెట్టింపు విక్రయాలు నమోదయ్యాయంటున్నారు. సాధారణంగా ఒక తరహా మేకప్‌కు అలవాటైపోయిన తర్వాత అంత త్వరగా దాన్ని మార్చడానికి కార్పొరేట్, ఐటీ తదితర రంగాలకు చెందిన వారు ఇష్టపడరు. అలా గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న మేకప్ శైలులను మార్చుకునేందుకు అవసరమైన వెసులుబాటును లాక్డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్ అందించింది. దీంతో ప్రయోగాత్మక మేకప్ శైలులు అలవాటయ్యాయి. సౌకర్యవంతంగా ఉన్నాయి కదాని అంటిపెట్టుకున్న పాత స్టైల్స్ నుంచి బయటకు వచ్చేలా ఈ లాక్డౌన్ సిటిజనులను ప్రేరేపించింది. అదే కాస్మెటిక్స్ రంగానికి మరింత ఊతమిచ్చింది. అన్‌లాక్ సమయంలో హెల్త్, వెల్నెస్ ఉత్పత్తుల్లో 750శాతం పెరుగుదల నమోదైందని సమాచారం. హెయిర్ కేర్, హైజీన్ కేర్ కూడా మంచి సేల్స్ సాధించాయి. మాస్క్‌తో అందమైన ‘చూపు’.. మాస్క్‌లు తప్పనిసరి కావడంతో ఐ మేకప్‌కి బాగా డిమాండ్ ఏర్పడిందని నగరానికి చెందిన బ్యూటీషియన్ కపిల చెప్పారు. ముఖం మొత్తం మీద కళ్లు మాత్రమే బాగా కనిపించే అవకాశం ఏర్పడటంతో నగరవాసులు కంటిని మెరిపించేందుకు విభిన్న రకాల ప్రయత్నాలు చేస్తున్నారన్నారామె. విచిత్రమేమిటంటే.. ఐ మేకప్ ఉత్పత్తుల విక్రయాలను ఇది పెంచడంతో పాటు గతంతో పోలిస్తే లిప్ స్టిక్స్ సేల్స్ కూడా చెక్కు చెదరలేదు. ‘నిమిషానికి 2 లిప్స్టిక్స్ చొప్పున మేం విక్రయించాం. దాదాపుగా 10లక్షల లిప్స్టిక్స్ సేల్స్ నమోదయ్యాయని’ ఆన్లైన్ విక్రయసంస్థ ప్రతినిధి చెప్పారు. అలాగే హెల్త్‌కేర్ సప్లిమెంట్స్, హెర్బల్ టీ ఐటమ్స్, హెయిర్ మాస్క్‌లు, ఫేషియల్ సెరమ్స్, టోనర్స్ కూడా మంచి సేల్స్ సాధించాయి. మాయిశ్చరైజర్స్, బాడీ లోషన్స్ మాత్రం సీజనల్ మార్పులకు అనుగుణంగా హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. నేచురల్.. ఫుల్.. కరోనా కాలంలో నేచురల్ మేకప్ ఉత్పత్తులకు డిమాండ్ ఏర్పడింది. లాక్డౌన్ ప్రారంభంలో నెమ్మదించిన సేల్స్.. అన్‌లాక్ నుంచీ అనూహ్యంగా ఊపందుకున్నాయి. పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టుగా మొత్తం 750 బ్రాండ్స్, 50వేల ఉత్పత్తులకు పెంచాం. ప్రతి నెలా 300 కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తున్నాం. ఈ నెల 3 నుంచి 12 వరకూ ఐ హార్ట్ బ్యూటీ పేరిట పర్పుల్ డాట్ కామ్ వేదికగా అతిపెద్ద సేల్స్ నిర్వహిస్తున్నాం. – నిపుణ్ అనేజా, పర్పుల్ డాట్ కామ్. -
మేకప్ లేని ఫోటో షేర్ చేసిన హీరోయిన్!
సినిమా హీరోయిన్స్ అంటే ఎప్పుడూ మేకప్ వేసుకొని అందమైన ఫోటోలు షేర్ చేస్తూ తమ అభిమానులను అలరిస్తూ ఉంటారు. వారిని మేకప్ లేకుండా చూడాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఎప్పుడో ఒక్కసారి కానీ వారిని మేకప్ లేకుండా చూసే అవకాశం రాదు. తాజాగా బాలీవుడ్ భామ కరీనా కపూర్ ఖాన్ మేకప్ లేకుండా ఉన్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. ఐదు నెలలు మరింత బలవంతులం కాబోతున్నాం అని ఆమె క్యాప్షన్ జోడించారు. ఈ ఫోటోలో కరీనా ముఖం మీద ఒక్క మచ్చ కూడా లేకుండా ఉంది. ఆమె జుట్టు టైట్‌గా కట్టుకొని ఉంది. ఇక త్వరలోనే కరీనా కపూర్ మరో బిడ్డకు జన్మనియ్య బోతున్న సంగతి తెలిసిందే. చదవండి: బర్త్‌డే: స్వయంగా లేఖ రాసుకున్న కరీనా -
మేకప్.. మేకోవర్!
‘‘రంగేయడానికి ఒకళ్లు.. జడేయడానికి ఒకళ్లు.. బాగానే ఉంది దర్జా.. హ్హహ్హహ్హ’’.... ‘మహానటి’ సినిమాలోని డైలాగ్ ఇది. సావిత్రి పాత్రధారి కీర్తీ సురేషకి మేకప్ ఆర్టిస్ట్ మేకప్ వేసి, హెయిర్ స్టయిలిస్ట్ హెయిర్ స్టయిల్ చేసేటప్పుడు ఆమె పెదనాన్న పాత్రధారి రాజేంద్రప్రసాద్ ఈ డైలాగ్ అంటారు. షూటింగ్ ఉంటే అంతే.. సహాయకులు చాలామంది ఉంటారు. ఈ లాక్డౌన్లో షూటింగ్‌లు బంద్. ఇంట్లో ఉంటున్న తారలు ‘నో మేకప్’ అంటున్నారు. సీరత్ కపూర్ కూడా అలానే అనుకున్నారు. కానీ సొంతంగా మేకప్ చేసుకోగలమా? అని డౌట్ వచ్చినట్లుంది. అందుకే సొంత మేకప్ ప్రయత్నించారు. సీరత్ జుట్టు వంకీలు తిరిగి ఉంటుంది. ముందు ఆ జుట్టుని స్ట్రెయ్టినింగ్ చేశారు. ఆ తర్వాత ఓ కొత్తరకం హెయిర్ స్టయిల్ చేసుకుని, మేకప్ చేసుకున్నారు. ఇక లాక్డౌన్ టైమ్ గురించి సీరత్ మాట్లాడుతూ – ‘‘ఇల్లనేది అందమైన కవిత లాంటిదని నా ఫీలింగ్. కవితలో రాసేవన్నీ బాగుండాలనుకుంటాం. అలాగే ఇల్లంతా బాగుండాలని కోరుకుంటాను. ఇంటికి సంబంధించినవన్నీ స్వయంగా నేనే కొన్నాను. ఈ ఖాళీ సమయంలో ప్రతిదీ శుభ్రం చేస్తున్నాను. అయినా ఇంకా ఎంతో కొంత టైమ్ మిగులుతోంది. అందుకే సరదాగా సొంత మేకప్, కొత్త హెయిర్ స్టయిల్ ప్రయత్నించాను. షూటింగ్స్ బాగా మిస్సవుతున్నాననిపిస్తోంది’’ అన్నారు. మేకప్ చేసుకోవడమే కాదు.. మేకోవర్ మీద కూడా దృష్టి పెట్టారు సీరత్. ఆ విషయం గురించి సీరత్ మాట్లాడుతూ –‘‘ఆరోగ్యకరమైన పద్ధతిలో సన్నబడుతున్నాను. ‘ఈఎమ్ఎస్’ (ఎలక్ట్రో మజిల్ స్టిములేషన్) ట్రైనింగ్ తీసుకుంటున్నాను. వారానికి రెండుసార్లు 20 నిముషాలు ఈ ట్రైనింగ్ ఉంటుంది. ఇది వారానికి మూడుసార్లు చేసే ‘స్ట్రెంత్ ట్రైనింగ్’కి సమానంగా ఉంటుంది. ఈఎమ్ఎస్ కాకుండా పైలెట్స్ చేస్తాను. ఇప్పుడు ఇంటి పనులు కూడా చేస్తున్నాను కాబట్టి కొంచెం బరువు తగ్గడానికి చాన్స్ ఉంటుంది. హెల్తీ డైట్ ఫాలో అవుతున్నాను’’ అన్నారు. తెలుగులో ‘రన్ రాజా రన్’, ‘టైగర్’, ‘రాజుగారి గది 2’, ‘ఒక్క క్షణం’, ‘టచ్ చేసి చూడు’ చిత్రాల్లో ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే నటనను కనబరిచారు సీరత్. ఆమె నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ విడుదలకు సిద్ధమవుతోంది. -
ఛీ.. మేకప్ లేకుండానే బాగున్నావు
మలైకా అరోరా.. పవన్ కళ్యాణ్ గబ్బర్‌సింగ్‌లో కెవ్వుకేక పాటతో ఇటు టాలీవుడ్‌కు.. ఐటంసాంగ్స్‌తో అటు బాలీవుడ్‌కు పరిచయం చేయక్కర్లేని పేరు. లేటు వయసులోనూ తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ ఫొటోషూట్లతో అభిమానులను మురిపిస్తూ ఉంటుంది. ఇక బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ తమ్ముడు అర్భాజ్‌ఖాన్‌తో వివాహబంధానికి మలైకా కటీఫ్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా మలైకా.. తనకంటే చిన్నవాడైన అర్జున్‌కపూర్‌తో రెండో పెళ్లికి సిద్ధమవుతోందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ భామ ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీన్ని చూసిన కొంతమంది అభిమానులు.. ఎంతందంగా ఉన్నావే.. అని పాట పాడుకుంటుంటే, మరికొందరేమో ‘ఛీ.. మేకప్‌తో చూడలేకున్నాం. మేకప్ లేకుండానే బాగుందంటూ’ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది నెటిజన్లు మాత్రం ‘ఈ ఫొటోలో మరీ ముసలిదానిలా కనిపిస్తున్నావు’ అంటూ మలైకాను ఆడేసుకుంటున్నారు. మలైకా ఈ ఫొటోలో అచ్చు బాలీవుడ్ సెన్సేషన్ రణు మొండాల్లా ఉందంటూ ఆమెతో పోల్చుతూ చురకలంటిస్తున్నారు. -
మేకప్ అంటే అస్సలు నచ్చదు: రష్మిక
టాలీవుడ్లో ఇప్పుడు క్రేజీ నటి ఎవరంటే ముందుగా చెప్పే పేరు నటి రష్మిక మందన్నా. అవును అతికొద్ది కాలంలోనే స్టార్‌డమ్‌ను అందుకున్న నటి ఈ బ్యూటీ. కన్నడం నుంచి దిగుమతి అయిన రష్మిక ‘చలో’ చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత గీతగోవిందం చిత్రం వరించింది. అంతే ఆ చిత్ర అనూహ్య విజయంతో రష్మిక పేరు మారుమోగిపోయింది. అప్పుడే కోలీవుడ్ దృష్టి ఈ అమ్మడిపై పడింది. అప్పుడే నటుడు విజయ్‌తో రొమాన్స్ చేయబోతోందనే ప్రచారం హోరెత్తింది. అదే నిజం అయితే ఈ చిన్నది బిగిల్ చిత్రంలో నటించాల్సింది. అయితే అది ఒట్టి వదంతిగానే మిగిలిపోయింది. కాగా గీతగోవిందం తరువాత మరోసారి విజయ్‌దేవరకొండతో జతకట్టిన మిస్టర్ కామ్రేడ్ చిత్రాన్ని తమిళంలోనూ అనువదించి విడుదల చేశారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా రష్మిక పేరు బాగానే పాపులర్ అయ్యింది. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో సరిలేరు నీకెవ్వరూ, అల్లుఅర్జున్‌తో అల వైకుంఠపురములో, నితిన్‌కు జంటగా భీష్మా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అదే విధంగా కోలీవుడ్ ఎంట్రీ షురూ అయ్యింది. నటుడు కార్తీతో సుల్తాన్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా రష్మిక ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ప్రముఖ కథానాయకులతో నటించే అవకాశాలు వస్తున్నాయని, విశ్రాంతి లేకుండా నటించడం సంతోషంగా ఉందని చెప్పింది. అయితే ఎన్ని చిత్రాల్లో నటించినా, ఎంత పెద్ద స్టార్స్‌తో జత కట్టినా గర్వం అన్నది లేకుండా, నిరాడంబరంగానే ఉంటానని అంది. ఇంకా చెప్పాలంటే తనకు అలంకారాలు, ఆడంబరాలు అస్సలు నచ్చవని, సినిమాల కోసం అందంగా కనిపించినా, నిజజీవితంతో అలా అవసరం లేదని పేర్కొంది. తనకు మేకప్ వేసుకోవడం, అలంకరించుకోవడం నచ్చదని అంది. తన లాంటి నటీమణుల్ని చూడడానికి అభిమానులు ఇష్టపడతారా అని తొలి చిత్రంలో నటించినప్పుడు భయపడినట్లు తెలిపింది. అయితే కథలో పాత్ర బాగుంటే గ్లామర్ లేకపోయినా ఆదరిస్తారని ఆ తరువాత అర్థమైందని పేర్కొంది. తనకు సహజంగా ఉండడమే నచ్చుతుందని, షూటింగ్‌లకు కాకుండా బయటకు వెళితే ఎలాంటి మేకప్ వేసుకోకుండానే వెళతానంది. ఇకపోతే అవకాశాలు వస్తున్నాయి కదా అని అన్నీ ఒప్పేసుకోనని స్పష్టం చేసింది. తాను అంగీకరించిన చిత్రాలకు నూరు శాతం సహకరిస్తానని అంది. ఒక మంచి పాత్ర కోసం 10 ఏళ్లు అయినా వేచి ఉంటానని నటి రష్మిక అంటోంది. -
బ్యూటిప్స్
మేకప్ వేసుకునే అలవాటు ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు వెంట లిప్‌స్టిక్, బ్లషర్, పౌడర్, దువ్వెన, టిష్యూపేపర్, సేఫ్టీపిన్స్... ఇలాంటివన్నీ ఉండే చిన్న ‘టచ్–అప్’ కిట్‌ని వెంట తీసుకెళ్లాలి. మేకప్ చెదిరినా, తీసివేయాలన్నా తడుముకోవాల్సిన అవసరం ఉండదు. -
బార్బీ బొమ్మకు బ్రదర్వా..!
అందంగా కనిపించాలని ఎవరికైనా ఉంటుంది. అమ్మాయిలైతే ఈ విషయంలో కాస్త ముందంజలో ఉంటారు. కానీ ఇటీవల కాలంలో అబ్బాయిలు కూడా ఏమీ తగ్గట్లేదు. అమ్మాయిలేమో కుందనపు బొమ్మలా.. బార్బీ డాల్లాగా తయారయ్యేందుకు తెగ ముచ్చట పడతారు. మరి అబ్బాయిలు..! మేం కూడా ‘బొమ్మ’లా తయారవుతానని అనుకున్నాడేమో ఈ ఫొటోలోని అబ్బాయి. రెండేళ్ల నుంచి ఏకంగా అచ్చు బొమ్మలాగే తయారవుతున్నాడు. జపాన్‌కు చెందిన మట్ కువాటాకు 24 ఏళ్లు. అందంగా తయారు కావడం ఇతడికి ఇష్టం. అందంగా కనిపించడమే కాదు.. వినూత్నంగా.. విభిన్నంగా కనిపించడం అంటే మనోడికి పిచ్చి క్రేజ్. అందుకు తగ్గట్టుగానే అచ్చు బొమ్మలా మారిపోతున్నాడు. ఇందుకోసం గంటలు గంటలు మేకప్ వేయించుకుంటున్నాడు. ఇలా తయారై తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేస్తుంటాడు కువాటా. ఇంకేం మనోడికి లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే అలా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడని కొందరు.. ఫొటోను ఎడిటింగ్ చేయడం వల్లే ఇలా కనిపిస్తున్నాడని మరికొందరు ఇన్‌స్ట్రాగాంలో విమర్శలు చేస్తున్నారు. అయితే వీటిని కువాటా కొట్టిపారేస్తున్నాడు. మేకప్ కనుక నిజమే అయితే ఆ మేకప్ ఆర్టిస్ట్ ప్రపంచంలోనే గొప్ప వాడవుతాడంటూ కొందరు కితాబిస్తున్నారు. -
‘ఆ సమయంలో ఎన్టీఆర్‌కు నేనే మేకప్ వేశాను’
ఇటీవల జరిగిన ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకలో సీనియర్ నటుడు మోహన్‌బాబు నందమూరి తారక రామరావుతో తనకున్న అనుబంధాన్ని కొంతమేర ప్రేక్షకులతో పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మోహన్‌బాబు ఎన్టీఆర్‌తో తనకున్న చనువును ట్విటర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. ఎన్టీఆర్ మేకప్ కోసం పర్సనల్ మేకప్ మెన్కే ప్రాధాన్యత ఇచ్చేవారని తెలిపారు. అలాంటిది ఓ సందర్భంలో ఎన్టీఆర్‌కు తాను మేకప్ వేశానని అన్నారు. 1993లో మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని ‘పుణ్యభూమి నాదేశం’ పాట కోసం ఎన్టీఆర్ చాలా గెటప్పుల్లో కనిపించారని గుర్తుచేశారు. ఆ సందర్భంగా ఆయనకు తాను మేకప్ వేసినట్టు చెప్పారు. ప్రతి గెటప్లోను ఎన్టీఆర్ ఉదయం ఏడు గంటలకే మేకప్‌తో సహా లోకేషన్లో ఉండేవారని.. అంతటి గొప్ప నటుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ వేడుకలో మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన స్పీచ్ చివర్లో ‘క్రిష్.. యు డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్.. మా అన్నయే కనిపిస్తున్నాడు. ఎక్కడ సినిమాను ప్రారంభించావో.. ఎక్కడ ఫినిష్ చేశావో తెలియదు. దాన్లో చెడ్డవాళ్లను కూడా మంచి క్యారెక్టర్స్ చేశావో. ఎవరెవరిని ఎలా చేశావో నాకు తెలియదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేజర్ చంద్రకాంత్(1993) సినిమాలోని పుణ్యభూమి నాదేశం అనే పాట కోసం అన్నగారు చాలా గెటప్పులలో కనిపిస్తారు.. ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ తప్ప ఎవరు మేకప్ వేసేవారుకాదు. అలాంటిది నేను వేశాను. ప్రతి గెటప్ లోను అన్నగారు విత్ మేకప్ 7 గం||లకు లొకేషన్ లో ఉండేవారు. అంతటి గొప్ప నటుడు అన్నగారు. pic.twitter.com/ojB6okJ2tb — Mohan Babu M (@themohanbabu) 24 December 2018 -
కొరియా.. ఇదేం పిచ్చయా..
వెర్రి వెయ్యి విధాలు అంటారు.. ఆ మాటను పెద్దలు ఊరికే అనలేదు. అప్పుడప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుంటుంటే ఈ విషయం అర్థం అవుతుంటుంది. ఇదిగో ఆ కోవలోకే చెందుతాడు.. ఈ ఫొటోలోని వ్యక్తి. థాయ్‌లాండ్‌కు చెందిన 25 ఏళ్ల రచడపాంగ్ ప్రసిత్కు కొరియాకు చెందిన వ్యక్తిలాగా కనిపించడం అంటే ఇష్టం. అతడేమో థాయ్‌లాండ్‌కు చెందినవాడు. అందుకోసం ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించాడు. అది కూడా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 30 వరకు సర్జరీలు చేయించుకుని అసలు ముందున్న ముఖానికి, ప్రస్తుతం ఉన్న ముఖానికి కొంచెం కూడా సంబంధం లేకుండా తయారయ్యాడు. ఓ రకంగా కొత్త ముఖం పెట్టుకున్నాడనే చెప్పుకోవచ్చు. దీంతో ఆసియా మొత్తం ప్రసిత్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అయితే కొరియాకు చెందిన సింగర్, నటుడు మిన్హోను స్ఫూర్తిగా తీసుకుని ఆయనకు దగ్గరి పోలికలు ఉండేలా ముఖాన్ని మార్చుకున్నాడు. ఇలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగితే.. తాను డ్యాన్సర్‌ను అని, ఎన్ని టీవీ షోలకు ఆడిషన్స్ ఇచ్చినా ఎంపిక కాలేదని ప్రసిత్ చెప్పాడు. తన ముఖం వల్ల వ్యక్తిగతంగా గానీ, వృత్తి పరంగా కానీ తాను విజయవంతం కాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే తన ముఖాన్ని మార్చుకోవడమేననే ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పాడు. తన ముఖం మొత్తం ఇలా మార్పు చెందేందుకు రెండేళ్లు పట్టిందట. ముఖం మారిన తర్వాత లక్కు కలిసొచ్చిందని, డ్యాన్సర్‌గా చాలా టీవీ షోలు చేస్తున్నానని, జీవితం ఇప్పుడు సెట్ అయిందని సంతోషపడుతున్నాడు. మొత్తానికి కొరియా వాళ్ల ముఖం అంటే పిచ్చో.. లేదా కెరీర్ మీద దృష్టో కానీ ప్రసిత్ జీవితం అలా ప్రశాంతంగా గడిచిపోతోంది. -
మేకప్ ఆర్టిస్ట్‌గా మారిన టాప్ హీరోయిన్!
ముకుంద సినిమాతో మెరిసిన పూజా హెగ్డే.. ‘డీజే’ సినిమాతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసింది. డీజే సినిమా తరువాత వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది ఈ భామ. ప్రస్తుతం టాప్ హీరోలతో నటిస్తూ.. బిజీబిజీగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూజా చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. హీరోయిన్ మేకప్ వేసుకోవడం మానేసి, తనే మేకప్ వేసే బాధ్యతను తీసుకున్నట్టుంది. తన మేకప్ ఆర్టిస్ట్ సాహిత్యా శెట్టికి మేకప్ వేస్తున్న పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎంతో శ్రద్దతో మేకప్ వేస్తున్న పూజ..నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పూజా ప్రస్తుతం మహేష్ బాబు, ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉంది. -
చిక్కు తీసిన చక్కనమ్మ
జీవితంలో చిక్కులు తప్పవు. చిక్కులకు భయపడి.. భయంలో చిక్కుకుపోతే ఎదగం. ఎదగలేం. అదే.. ప్రతి చిక్కునూ విప్పుకుంటూ పోతే.. భయాన్ని జుట్టుపట్టి ఈడ్చిపారేయొచ్చు. అంబికా పిళ్లై కూడా అదే చేశారు. చిక్కులు తీసే ముస్తాబమ్మ అయ్యారు. తన చిక్కులు తీసుకున్న చక్కనమ్మా అయ్యారు. జీవితంలో నిలబడడం కన్నా... చక్కదనం ఏముంటుంది చెప్పండి?! అంబికా పిళ్లై వయసు 56 ఏళ్లు. సొంతూరు కేరళ రాష్ట్రంలోని కొల్లాం. ప్రస్తుతం ఉంటున్నది ఢిల్లీలో. సింగిల్ మదర్. తనక్కడ ‘డిజైనర్ సెలూన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించి ఎనిమిదేళ్లవుతోంది. 150 మంది ఉద్యోగస్తులు, పదికోట్ల టర్నోవర్‌తో ఆ సెలూన్స్‌ను నడిపిస్తోంది అంబికా. ‘‘జుట్టు కట్ చేసినంత ఈజీ కాదు ఈ వ్యవహారం.. వాటర్ ప్రూఫ్లేని మేకప్ వానకు కొట్టుకుపోయినట్టు.. నమ్మక ద్రోహంతో రెండుసార్లు వ్యాపారం తుడిచిపెట్టుకుపోయింది’’ అంటుంది అంబికా పిళ్లై! ఇరవై నాలుగేళ్లకే విడాకులు అంబికా వాళ్లది కాస్త కలిగిన కుటుంబమే. పదిహేడేళ్లకే ఆమెకు పెళ్లి చేసేశారు తల్లిదండ్రులు. అయితే ఆమె కాపురం కలహాలతో సాగింది. ప్రయత్నించినా భర్త తీరులో మార్పు రాలేదు. దాంతో విడాకులు తీసుకుంది. భర్తతో విడిపోయే నాటికి ఆమె వయసు 24 ఏళ్లు. చంకలో రెండేళ్ల పాపతో మెట్టినిల్లు వదిలి పుట్టింటి తలుపు కొట్టకుండా సొంత శక్తిమీద నిలబడాలని ఢిల్లీ వెళ్లింది. రకరకాల జడలు వేయడం, బట్టల సెలెక్షన్, మిక్స్ అండ్ మ్యాచ్, బాగా ముస్తాబు అవడం, స్నేహితులకు మేకోవర్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆసక్తి కూడా. అందుకే ఢిల్లీలో హెయిర్ స్టయిలిస్ట్ కోర్సు చేసి, మేకప్‌లో శిక్షణ తీసుకుంది. తండ్రి చేయూతనీ వద్దంది కోర్సు అయిన వెంటనే ఓ బ్యూటీ సెలూన్లో రెండువేల రూపాయలకు ఉద్యోగంలో చేరింది అంబిక. అందులో సగం రెంట్, మిగతా సగం ఇంటి ఖర్చులకే అయిపోయేది. అందుకే పెద్ద పెద్ద మేకప్ ఆర్టిస్టుల దగ్గర, హెయిర్ స్టయిలిస్టుల దగ్గర పార్ట్ టైమ్ చేసేది. అంటే.. ఫ్యాషన్ షోలకు, పెళ్లిళ్ల ఈవెంట్ మేనేజర్లకు అసిస్టెంటుగా వెళ్లేది. దీనివల్ల అదనపు ఆదాయంతో పాటు పనిలో నైపుణ్యం కూడా పెరిగింది ఆమెకు.అలా కష్టపడ్డ డబ్బును దాస్తూ, దాంట్లో కొంత మొత్తంతో ఓ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంది. తన సొంత సంపాదనతో కొన్న కారును తండ్రికి చూపించాలనే ఆరాటంతో తండ్రిని ఢిల్లీకి పిలిచింది. తన కారులోనే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి ఆయనను రిసీవ్ చేసుకుంది. ‘‘ఇది నీ కూతురు కారు...’’ అంటూ తన కారును చూపించింది. అప్పటికే హై ఎండ్ కార్లను వాడుతున్న ఆయన.. బిడ్డ కారును చూసి పెదవి విరిచాడు. ‘‘నన్ను అడిగితే మంచి కారే కొనిపెడతా కదా’’ అన్నాడు. చిన్నబుచ్చుకోలేదు అంబిక. ‘‘సొంత సంపాదనలో ఉన్న ఆనందం, అందే గౌరవం నీ కూతురికి బాగా తెలుసు నాన్నా’’ అంది కార్ స్టార్ట్ చేస్తూ! బిడ్డ ధైర్యాన్ని పరీక్షించిన తండ్రి మనసు కుదుటపడ్డది. పార్ట్నర్ దగా చేశాడు ‘‘ఎన్ని రోజులు ఇలా ఒకరి చేతి కింద పనిచేస్తాం? ధైర్యం చేయకపోతే ఏదీ సాధించలేం’’.. తనతో పాటే పనిచేస్తున్న ఫ్రెండ్ కామెంట్. ‘‘నిజమే.. నా దగ్గర కొంత డబ్బుంది. కొంత లోన్ తీసుకొని సొంతంగా సెలూన్ పెట్టుకుందామా?’’ అడిగింది అంబిక. ఫ్రెండ్‌కూ నచ్చి ఓకే అయింది ప్రపోజల్. సొంత సెలూన్ కోసం ఏడు లక్షలు అప్పు తెచ్చి రాత్రింబవళ్లు కష్టపడింది అంబిక. అకౌంట్స్ అన్నీ ఫ్రెండ్ చేతిలో పెట్టింది. పెళ్లిళ్ల సీజన్లో రోజుకు 22 మ్యారేజెస్ అటెండ్ చేస్తే రిజిస్టర్లో రెండు మ్యారేజెస్ మాత్రమే నమోదయినట్లు తెలిసింది అంబికకు... సెలూన్ నష్టాల్లో ఉందని ఫ్రెండ్ చెప్పినప్పుడు! హతాశురాలైంది. నిలదీస్తే... నిజం చెప్పకపోగా అంబిక మీదే నిందలు పడ్డాయి. అప్పుల కింద ఆమె పెట్టుబడిని జమకట్టుకొని ఎగ్జిట్ దారి చూపించారు. మరోవైపు కూతురు పెరుగుతోంది. వ్యాపారం వృద్ధిలోకి వస్తే పిల్లను బాగా చదివించుకోవచ్చని చాలా ఆశపడింది. కానీ ఇలా జరిగింది! కళ్లు తుడుచుకుని మళ్లీ లేచి నిలబడింది అంబిక. సొంత సంస్థకిప్పుడు 12 బ్రాంచీలు 2010లో పదకొండు మంది సిబ్బందితో ‘అంబికా పిళ్లై డిజైనర్ సెలూన్ ప్రైవేట్ లిమిటెడ్’ను మొదలుపెట్టింది. రోజుకు అయిదుగురి కంటే ఎక్కువ కస్టమర్స్ ఉండే వాళ్లు కాదు. ఇలాగైతే ఇదీ మూసేయాల్సిందే అనుకుంది. కాని స్థయిర్యం కోల్పోలేదు. రెండు నెలలు తిరిగేసరికి పుంజుకుంది. రెండేళ్లు తిరిగే సరికి ఢిల్లీలోనే 12 బ్రాంచ్‌లను ప్రారంభించింది. త్వరలోనే వెస్ట్ ఆసియాలోనూ ఓపెన్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఆమె కూతురు కవిత కూడా పెద్దదైంది. తల్లి వ్యాపారంలో భాగస్వామిగా చేరింది. జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. ‘‘ఇంతకుముందు ఉదయం నుంచి రాత్రి వరకూ పనిచేసేదాన్ని. ఇప్పుడంత ఓపిక ఉండట్లేదు. అందుకే పన్నెండు నుంచి అయిదింటి వరకు టైమింగ్స్‌ను కుదించుకున్నాను. మిగతా సమయంలో ఫేస్బుక్లో బ్యూటీ టిప్స్, హెయిర్‌కు సంబంధించిన సొల్యూషన్స్ ఇస్తున్నాను. ట్రావెలింగ్, రాయడం అంటే ఇష్టం. ఇప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. త్వరలోనే ఓ రెస్టారెంట్ ఓపెన్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నా’’ అంటుంది అంబిక. ఆమె ఫేస్ బుక్ పేజీకి ఎనిమిదిన్నర లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ‘‘నా ప్రొఫెషన్‌లోనూ.. పర్సనల్‌గానూ నన్ను చాలా మంది మోసం చేశారు. నా డబ్బు తీసుకున్నారు. కాని నా టాలెంట్‌ను, ధైర్యాన్ని, నా ఆత్మవిశ్వాసాన్ని తీసుకోలేకపోయారు’’ అంటుందీ విజేత. మేకప్ ఆర్టిస్ట్‌గా ఐఫా అవార్డు అంబిక పనితనం, కష్టపడే తత్వం తెలిసిన ఫ్యాషన్ డిజైనర్ హేమంత్ త్రివేది సపోర్ట్‌గా నిలిచాడు. ఆ సమయంలో.. అంటే 90ల్లో ఢిల్లీలో ఏవైనా ఫ్యాషన్ షోలు జరిగితే ముంబై మోడల్స్ అందరూ తమ సొంత మేకప్ ఆర్టిస్ట్స్, హెయిర్ స్టయిలిస్ట్లతో దిగేవారు. ఆ అవసరంలేదు.. అక్కడా మంచి హెయిర్ స్టయిలిస్ట్ ఉందని ఆ మోడల్స్‌కు అంబికను పరిచయం చేశాడు హేమంత్. అలా ఢిల్లీలో జరిగిన ఫ్యాషన్ షోల్లో పని కల్పించడమే కాక, సుభాష్ ఘయ్ ‘తాల్’ సినిమాకు చాన్స్ ఇప్పించాడు. ఆ సినిమాకు బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్‌గా ఐఫా అవార్డ్‌నూ అందుకుంది అంబిక. సొంత సెలూన్పెట్టి వట్టిచేతులతో నిలబడ్డ ఆమెకు అదెంతో రిలీఫ్‌నిచ్చింది. ఆ ఫీల్డ్‌లోనూ ఆదరణనూ పెంచింది. ఈసారి ఇంకో ఫ్రెండ్ వచ్చాడు సెలూన్ పెడ్దామని. మళ్లీ నమ్మింది. ఇంకోసారీ మోసపోయింది. తండ్రి గుర్తొచ్చాడు. వెళ్లింది. బాధపోయేలా ఏడ్చింది. కొత్త శక్తితో తిరిగొచ్చింది. -
మేకప్ పై పెరుగుతున్న వ్యామోహం..!
భారత్ లో సంప్రదాయ వివాహాల్లో ఇటీవల మేకప్ పై తీవ్ర వ్యామోహం పెరుగుతున్నట్లు మేకప్ పరిశ్రమ నిపుణులు పనాజీ వెల్లడించారు. దేశంలో మేకప్ ఇండస్ట్రీరీ ప్రతి సంవత్సరం ఇరవై శాతం చొప్పున అభివృద్ధి చెందేందుకు ఈ వివాహాలు దోహదం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత ప్రజలు సౌందర్యానికి అత్యధికంగా ఖర్చు చేస్తున్నారని ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా భారత వివాహాలు పరిశ్రమకు మంచి అభివృద్ధి సాధకాలుగా మారుతున్నాయని, ముంబైలోని బాలీవుడ్, హాలీవుడ్ ఇంటర్నేషనల్(BHI), మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్ అకాడమీ నిపుణుడు వివేక్ భారతీ వివరించారు. ముంబైలో ప్రారంభమైన ఓ అంతర్జాతీయ వర్క్ షాప్ సందర్భంగా మాట్లాడిన ఆయన... ఈ విషయాన్ని వెల్లడించారు. హాలీవుడ్ ప్రముఖ మేకప్ కళాకారుడు డోనాల్డ్ సిమ్ రాక్ ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా హజరయ్యారు. అభివృద్ధి చెందిన, అత్యంత సంపన్నదేశమైన అమెరికా చుట్టుపక్కల ప్రాంతాల్లో వివాహ సందర్భాల్లో మేకప్ కు సుమారు 150 నుంచి 200 డాలర్లను ఖర్చు పెడుతుంటే... ఇండియాలో మాత్రం బ్రైడల్ మేకప్ కు సుమారు 14 నుంచి 15 వేల రూపాయలు దాకా ఖర్చు చేయడం పెద్ద విషయంగా భావించడం లేదని నిపుణులు అంటున్నారు. కొన్ని ప్రత్యేక వివాహ వేడుకల్లో లక్షలకొద్దీ మేకప్ కోసం ఖర్చుచేసిన దాఖలాలు ఉన్నాయంటున్నారు. వివాహాన్ని ఓ చిరస్మరణీయ వేడుకగా జరుపుకునేందుకు భారతీయులు ఎంతో ఖర్చు పెడతారని ఈ సందర్భంగా భారతీ వివరించారు. వివాహం అనేది భారత కుటుంబాల్లో ఓ ప్రత్యేక కార్యక్రమం అని, ఇందులో వధువు దుస్తులతోపాటు, అలంకరణ, మేకప్ ఆకర్షణీయంగా ఉండేందుకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారని భారతీ అన్నారు. పెళ్ళి సందర్భంలో వధువు అత్యంత ఆకర్షణీయంగా కనిపించడం వారి ఐశ్వర్యాన్ని సూచిస్తుందని, ఆ సన్నివేశంలోని చిత్రాలను తరతరాలపాటు భద్రపరచుకొంటారని సూచించారు. బ్యూటీ ఇండ్రస్ట్రీ సంవత్సరానికి ఇరవై శాతం అభివృద్ధి చెందుతుండగా మేకప్ పై జనంలో ఏభైశాతం అవగాహన కూడ పెరుగిందని అయన తెలిపారు. ముఖ్యంగా పరిశ్రమ అభివృద్ధి భారతీయ సెలూన్లలో చూస్తే తెలుస్తుందని, గతంలో బ్యూటీ ఇండస్ల్రీపై అవగాహన అంతగా ఉండేది కాదని, నిరక్షరాస్యులే ఇందులో పనిచేసేందుకు ముందుకొచ్చేవారని అన్నారు. ఇప్పుడు ఉన్నత కుటుంబాల్లోని పిల్లలు బ్యూటీ పరిశ్రమలో అడుగిడి, దాన్ని ఉద్యోగంగా మార్చుకుంటున్నారన్నారు. అంతేకాక ఎక్కువ మొత్తంలో చెల్లింపులు పొందే ఉద్యోగంగా మేకప్ ఉద్యోగం మారుతోందని, మంచి మేకప్ ఆర్టిస్ట్ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో సంపాదిస్తున్నాడని ఆయన వివరించారు. -
ఆ సర్ప్రైజ్ మేకప్ ఖర్చు ఎంతో తెలుసా?
అలనాటి బాలీవుడ్ హీరో రిషీ కపూర్ తన తాజా సినిమా 'కపూర్ అండ్ సన్స్'లో సరికొత్త లుక్‌తో అభిమానులను విస్మయపరిచారు. ఈ వెటరన్ నటుడు ముఖంపై ముడతలు పడిన కురువృద్ధుడిగా ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆయన మేకప్ కోసం అక్షరాల రూ. 2 కోట్లు ఖర్చు చేశారట. ఈ విషయాన్ని ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ రిషీ కపూరే వెల్లడించాడు. 'టైటానిక్', 'ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్' వంటి సినిమాలకు పనిచేసిన అమెరికన్ మేకప్ ఆర్టిస్ట్ గ్రెగ్ కానమ్ సినిమాలో తనకీ ఈ కొత్త రూపును ఇచ్చినట్టు తెలిపాడు. 'నిజానికి నేనే షాక్ తిన్నాను. ఆశ్చర్యపోయాను. ఇదేమంత పెద్ద బడ్జెట్ సినిమా కాదు. నా ముఖాన్ని సరికొత్తగా తీర్చిదిద్దడానికి భారీగా ఖర్చు అయింది. దీనికితోడు మేకప్ ఆర్టిస్ట్ ప్రయాణ, బస ఖర్చులు అన్ని కలిపి రూ. 2 కోట్లు వరకు అయింది. రిషీ కపూర్‌కు మేకప్ వేయించడానికి ఏ నిర్మాత అయినా ఇంత ఖర్చు పెడతాడని నేనెప్పుడూ అనుకోలేదు. ఇది అసాధ్యమైన విషయం. అయితే ఇటీవలికాలంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా మారుతోంది. ప్రయోగాలకు పెద్దపీట వేస్తుంది. అందులో నేను భాగం కావడం ఆనందం కలిగిస్తోంది' అని రిషీ చెప్పాడు. 'కపూర్ అండ్ సన్స్' నిర్మాత కరణ్ జోహర్దే ఈ క్రెడిట్ అంతా అని ఆయన ప్రశంసల్లో ముంచెత్తాడు. -
మేకప్ లేకున్నా.. నేను అందగత్తెనే..!
-
మనోడు
ముఖానికి రంగులేయడానికి హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. ఇప్పుడు ముంబైలో సెలబ్రిటీలకు హెయిర్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అయ్యాడు. జన్నత్ 2, ఐయామ్.. తదితర బాలీవుడ్ సినిమాలు.. ఫ్యాషన్ షోలు, టాప్ బ్రాండ్ల యాడ్స్‌కు పనిచేస్తున్నాడు. వోగ్, ఎల్లె, గ్రాజియా, జిక్యు, కాండె నాస్ట్ ట్రావెలర్.. వంటి అంతర్జాతీయ మేగజైన్ల ఫ్యాషన్ ఎడిటోరియల్స్‌కు వన్నెలద్దాడు. పదేళ్లుగా సెలబ్రిటీ ఫ్యాషన్స్‌కు మెరుగులద్దుతున్న ఆయన పేరు ఎల్టన్ ఫెర్నాండెజ్.. పక్కా హైదరాబాదీ. యూట్యూబ్‌లో మన దేశపు తొలి ప్రొఫెషనల్ బ్యూటీ అండ్ మేకప్ చానల్ లాంచ్ చేసి ఇంటర్నేషనల్‌గా ఫేమస్ అయ్యాడు. ఇటీవల ఓ కార్యక్రమం సందర్భంగా సిటీకి వచ్చిన ఆయన ‘సిటీ ప్లస్’తో ముచ్చటి ంచాడు. విశేషాలు ఆయన మాటల్లోనే.. నేను పుట్టింది సికింద్రాబాద్‌లో. భవన్స్‌లో బీఏ ఇంగ్లిష్ లిటరేచర్ పూర్తి చేసి హెచ్ఎస్బీసీలో జాబ్ లో చేరా. రెండేళ్ల తర్వాత ఆన్లైన్ గేమింగ్ కంపెనీకి మారాను. కాన్వాస్ మీద ఆయిల్ పెయింటింగ్స్ వేసే నా హాబీని గమనించిన ఫ్రెండ్ సచిన్ డకొజి.. మనిషి ఫేస్‌ను కాన్వాస్ చేసుకోవడం ఎలాగో నేర్పించాడు. ఉద్యోగం చేస్తూనే.. వీకెండ్స్‌లో చిన్న చిన్న మేకప్ జాబ్స్ చేశాను. చివరికి నాకు శాటిస్ఫ్యాక్షన్ ఇస్తోంది మేకప్ రంగమే అని అర్థమయ్యాక... అందులోనే భవిష్యత్తును వెతుక్కుంటూ.. గూగుల్‌లో యాడ్ వర్డ్స్‌లో చేస్తున్న ఉద్యోగానికి గుడ్‌బై చెప్పా. ‘అది ఆడవాళ్ల పని’ అని అమ్మ, ‘దాని వల్ల వచ్చేదేం లేదు’ అని నాన్న గట్టిగా వ్యతిరేకించారు. మెచ్చిన కెరీర్ కోసం వారి మాటల్ని కాదన్నాను. ముంబైకి పయనమయ్యాను. అదంత ఈజీ కాదు.. ముంబై వె ళ్లాక కొన్ని రోజులకే ఎమ్ఏసీ కాస్మెటిక్స్ కంపెనీలో జాబ్ వచ్చింది. అది సేల్స్ జాబ్ కావడంతో 9 నెలలకే మానేశాను. ఓ ఏడాది నిరుద్యోగిగా ఉన్నా. నా కెరీర్లో అత్యంత కష్టకాలం అది. ఆ టైంలో మేకప్ రంగాన్ని దగ్గరగా చూశాను. దానికి తగ్గట్టుగా నా కెరీర్ ఎలా మలచుకోవాలో అర్థమైంది. ఏడాది గ్యాప్ తర్వాత ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్‌గా మొదలైన నా ప్రస్థానం వెనుకడుగు లేకుండా సాగింది. క్రియేటివ్ పీపుల్ తమ ఆత్మ, హృదయాలను ఒకటి చేసి వర్క్ చేస్తారు. దానికి ప్రశంస లభించకపోతే డిజప్పాయింట్ అవుతారు. ఇందుకు నేనూ మినహాయింపు కాదు. సౌత్ నుంచి వెళ్లినవారు నార్త్‌లో.. అందునా ఫ్యాషన్ రంగంలో సక్సెస్ కావడం ఈజీ కాదు. కొన్ని బ్యాడ్ కామెంట్స్ ఎదుర్కొన్నాను. మొదట్లో బాధపడ్డా, తర్వాత అందులో నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. ప్రతి ప్రసిద్ధ భారతీయ మేగజైన్‌తో పనిచేశాను. మైల్ స్టోన్స్.. 2014 మార్చిలో వోగ్ బిగ్గెస్ట్ ఫ్యాషన్ స్ప్రెడ్‌కు వర్క్ చేయడం ఒక అద్భుతమైన అనుభవం. అమెరికన్ కాండె నాస్ట్ ట్రావెలర్ కవర్ ఫొటోకు వర్క్ చేయడం గర్వంగా భావిస్తున్నాను. దక్షిణాదిలోనే తొలి వాల్ట్ డిస్నీ ఫిల్మ్ కోసం లక్ష్మీ మంచుతో (అనగనగా ఓ ధీరుడు), ఐయామ్ సినిమా కోసం మనీషా కొయిరాలా, జుహీచావ్లా, సంజయ్ సూరి, నందితాదాస్‌తో పని చేశా. ప్యూమా, లేస్, ప్రొవోగ్, ఐడియా, వెల్లా, ఫాస్ట్రాక్, గ్లోబస్, సన్ సిల్క్, శామ్సంగ్, వివెల్.. మరెన్నో బ్రాండ్స్‌తో నా కొలాబరేషన్ కొనసాగుతోంది. నా క్లోజ్ ఫ్రెండ్, మ్యుజీషియన్ మోనికాడోగ్రా తీసిన మ్యూజిక్ వీడియోకి పనిచేశాను. ఆమెతో కలసి ఆ వీడియోలో కనిపిస్తాను కూడా. పాఠాలు నేర్పే పనిలో.. లోరియల్ కోసం మిస్ మాలినితో షూట్లో పాల్గొన్నప్పుడు వచ్చిన ఆలోచన యూట్యూబ్‌లో ప్రొఫెషనల్ బ్యూటీ చానల్ లాంచ్ చేసిన తొలి మేకప్ ఆర్టిస్ట్‌గా నాకు పేరు తెచ్చింది. ఈ చానల్ ద్వారా మేకప్, హెయిర్ స్టైలింగ్‌పై దశల వారీగా ట్యుటోరియల్స్ అందిస్తున్నా. ఈ వీడియోల కోసం మోడల్స్‌ను ఎంపిక చేయడం, ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్‌ను తేవడం.. దర్శకత్వం, ఎడిటింగ్ అన్నీ నేనే చూసుకుంటున్నా. ఈ చానల్ 6 నెలల టైమ్‌లోనే 4 వేలకు పైగా సబ్స్క్రైబర్లు, 1.70 లక్షల మంది వీక్షకుల్ని సాధించింది. స్కూలింగ్ టైమ్ నుంచి డిజైనింగ్ అంటే ఇష్టం. ైడిజైనింగ్ గొప్ప చాలెంజ్. సోర్సింగ్, డైయింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, ప్యాట్రన్ మేకింగ్ ప్రతిదీ వైవిధ్యంగా చేయాలి. గత ఏడాది ఫిబ్రవరిలో నా కలెక్షన్స్ లాంచ్ చేశాను. అయితే ఇది నా రెగ్యులర్ జాబ్కాదు. టాప్ బ్యూటీ టిప్ ఫస్ట్... చర్మం మెత్తగా ఉండాలి కాబట్టి ఎప్పుడూ సరిపడా ద్రవ పదార్థాలు తీసుకుంటూ మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి. బ్లష్, మస్కరా, లిప్‌బామ్‌లు ఉపయోగించండి. మీ ఐబ్రోస్‌ను రైట్ షేప్ చేసుకోండి. ఎక్సెస్‌గా ఉన్న కలర్‌ను పెదాల మీద నుంచి చెంపలకు వేళ్లతో తీసుకెళ్లడం ద్వారా మీ లిప్‌స్టిక్‌ను ఒక బ్లషర్లా వాడండి. ఆత్మీయుల సిటీ.. హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. మేకప్‌లో ఓనమాలు నే ర్పించిన సచిన్ సహా ఎందరో ఆత్మీయులు సిటీలో ఉన్నారు. ప్రొఫెషన్లో భాగంగా ఇక్కడికి వస్తూనే ఉన్నా. ఆ మధ్య తాజ్ హోటల్స్ క్యాలెండర్ షూట్ కోసం ఇంటర్నేషనల్ సూపర్ మోడల్ ఉజ్వలారౌత్కు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మేకప్ చేశాను. అలాగే అతుల్ కస్బేకర్తో కలసి పలు షూట్ల కోసం సిటీకి వచ్చాను. - ఎస్.సత్యబాబు