టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి అసిన్. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ గజిని, శివమణి, ఘర్షణ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగుతో పాటు తమిళ,హిందీ భాషల్లో కూడా ఈమె క్రేజ్ ను సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే 2016లో రాహుల్ శర్మ అనే బిజినిస్ మెన్‌ను వివాహం చేసుకుంది.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన అసిన్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన పలు ఫోటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా తన భర్త రాహుల్‌కు కూతురు అరిన్ మేకప్ వేసింది. లిప్‌స్టిక్, ఐ షాడోస్, కాంపాక్ట్ వంటివి చక్కగా వేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను అసిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment