Asin
-
అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
అమ్మా, నాన్న.. ఓ తమిళ అమ్మాయి చిత్రంతో రవితేజ సరసన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళీ భామ ఆసిన్. ఆ తర్వాత శివమణి, లక్ష్మీనరసింహా, షుర్షణ, అన్నవరం లాంటి చిత్రాల్లో స్టార్ హీరోలతో నటించింది. తమిళంతో పాటు హిందీలోనూ పలు సినిమాల్లో కనిపించింది. కోలీవుడ్‌లో కమల్ హాసన్ సరసన దశవతారం, సూర్యకు జంటగా గజిని లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. అయితే ఆసిన్ 2001లో మలయాళ చిత్రం నరేంద్రన్ మకాన్ జయకాంతన్ వకాతో సినిమాల్లో అడుగుపెట్టింది.అయితే ఆసిన్ చివరిసారిగా 2015లో వచ్చిన అభిషేక్ బచ్చన్, రిషి కపూర్, సుప్రియా పాఠక్‌లతో కలిసి ఆల్ ఈజ్ వెల్ అనే కామెడీ చిత్రంలో కనిపించింది. అంతకుముందు బాలీవుడ్లో అమీర్ ఖాన్ నటించిన గజిని, రెడీ, బోల్ బచ్చన్, హౌస్‌ఫుల్ -2 లాంటి హిట్ చిత్రాలలో నటించింది. కాగా.. అసిన్ 2016లో మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అక్టోబర్ 2017లో తమ అరిన్ జన్మించింది. అయితే రాహుల్ శర్మను పెళ్లాడిన తర్వాత ఆసిన్ సినిమాలకు పూర్తిగా దూరమైంది. అయితే తాజాగా ఆసిన్ భర్త రాహుల్ శర్మ గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. వ్యాపారరంగంలోకి అడుగుపెట్టిన ఆయన కెరీర్ సక్సెస్ వెనుక పెద్ద స్టోరీనే ఉంది. ఇప్పుడు అదేంటో తెలుసుకుందాం.రాహుల్ శర్మ మహారాష్ట్రలోని రాష్ట్రసంత్ తుకాడోజీ మహారాజ్ నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. అనంతరం కెనడా వెళ్లి సస్కట్చేవాన్ యూనివర్సిటీ నుంచి కామర్స్ బ్యాచిలర్ డిగ్రీ చేశాడు. చదువు పూర్తయిన వెంటనే రాహుల్ శర్మ తన తండ్రి వద్ద రూ. 3 లక్షలు అప్పుగా తీసుకుని వ్యాపారం ప్రారంభించారు. అప్పుడు కేవలం రూ. 3 లక్షల మొదలైన వ్యాపారం ఇప్పుడేమో ఏకంగా రూ. 1300 కోట్లకు చేరుకుంది.రాహుల్ శర్మ మొదట మైక్రో మ్యాక్స్ సహ వ్యవస్థాపకుడి, సీఈఓగా ఉన్నాడు. తన ముగ్గురు స్నేహితులతో కలిసి 2000 మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించారు. ఆ తరువాత 2008లో మొబైల్ రంగంలోకి ప్రవేశించారు. 2010 నాటికి హ్యూ జాక్మాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా తక్కువ ధరలోనే స్మార్ట్ ఫోన్లను అందించే సంస్థగా దేశంలోనే టాప్ లో నిలిచింది. 2017లో భారతదేశపు తొలి ఏఐ బేస్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రివోల్ట్ ఇంటెల్లి కార్ప్ కంపెనీకి వ్యవస్థాపకుడు కూడా రాహుల్ శర్మనే. కేవలం రూ.3 లక్షలతో వ్యాపార మొదలు పెట్టి.. వందల కోట్లకు చేరుకున్న రాహుల్ శర్మ నిజ జీవితంలో ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచారు. అక్షయ్ కుమార్ వల్లే పరిచయం..ఆసిన్‌ను పెళ్లి చేసుకోవడానికి రాహుల్ శర్మకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సహకరించాడు. అక్షయ్ కుమార్, అసిన్ కలిసి నటించిన కామెడీ చిత్రం హౌస్‌ఫుల్ 2. అదే సమయంలో అక్షయ్ తన బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ శర్మకు ఆసిన్‌ను పరిచయం చేశాడు. అలా రాహుల్, అసిన్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆసిన్ ఫ్యామిలీ ఢిల్లీలో ఉన్నారు. వీరికి ఢిల్లీలో ఫామ్‌హౌస్ ఉంది. అతని వద్ద ఖరీదైన బెంట్లీ సూపర్‌స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్, బీఎండబ్య్లూ, మెర్సిడెజ్ బెంజ్, రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. -
అమ్మా నాన్న ఒక ఆరిల్
సినిమాలకు దూరమైనా సరే, నటులపై ఆసక్తి మాత్రం దూరం కాదు. ‘ఫలానా నటుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ‘ఫలానా కథానాయిక ఇప్పుడు ఏ దేశంలో ఉంటుందో తెలుసా?’... ఇలాంటి విషయాలు అభిమానులకు ఎప్పుడూ ఆసక్తికరమే. ‘గజిని’ ‘అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి’ ‘ఘర్షణ’... మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆశిన్ పెళ్లి తరువాత నటనకు దూరమైంది. కొన్ని నెలల క్రితం... ఆసిన్ భర్త నుంచి విడాకులు తీసుకుందని, మళ్లీ సినిమాలలో నటించనుందని రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ‘అలాంటిది ఏమీ లేదండీ బాబూ. నేను మళ్లీ సినిమాల్లో నటించడం లేదు’ అని ఆసిన్ స్వయంగా ప్రకటించింది. తాజాగా... ప్యారిస్‌లో జరిగిన కుమార్తె ఆరిన్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఆసిన్. వీటిలో ఆమె భర్త రాహుల్ శర్మ కూడా ఉన్నాడు. ఇక రూమర్స్‌కు ఫుల్స్టాప్ పడినట్లే కదా! -
స్టార్ హీరోయిన్ కూతురు బర్త్‌డే.. సోషల్ మీడియాలో వైరల్!
అమ్మా, నాన్న.. ఓ తమిళ అమ్మాయి చిత్రంతో రవితేజ సరసన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళీ భామ ఆసిన్. ఆ తర్వాత శివమణి, లక్ష్మీనరసింహా, షుర్షణ, అన్నవరం లాంటి చిత్రాల్లో స్టార్ హీరోలతో నటించింది. తమిళంతో పాటు హిందీలోనూ పలు సినిమాల్లో కనిపించింది. కోలీవుడ్‌లో కమల్ హాసన్ సరసన దశవతారం, సూర్యకు జంటగా గజిని లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. ఆసిన్ ఏకంగా ఎనిమిది భాషల్లో మాట్లాడగలదు. అన్ని భాషల్లోనూ తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకునే టాలెంట్ ఆమె సొంతం. (ఇది చదవండి: రికార్డులు కొల్లగొడుతున్న లియో.. కమల్, రజినీ చిత్రాలను వెనక్కినెట్టి!) తాజాగా అసిన్ తన కుమార్తె అరిన్ పుట్టినరోజు వేడుకలు చేసుకుంది భామ. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఆసిన్ కూతురు తన ఆరో వసంతంలోకి అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. కాగా.. ఆసిన్ చివరిసారిగా 2015లో వచ్చిన అభిషేక్ బచ్చన్, రిషి కపూర్, సుప్రియా పాఠక్‌లతో కలిసి ఆల్ ఈజ్ వెల్ అనే కామెడీ చిత్రంలో కనిపించింది. అంతే కాకుండా బాలీవుడ్లో అమీర్ ఖాన్ నటించిన గజిని, రెడీ, బోల్ బచ్చన్, హౌస్‌ఫుల్ -2 లాంటి హిట్ చిత్రాలలో నటించింది. కాగా.. అసిన్ 2016లో మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకున్నారు. ఈ జంట అక్టోబర్ 2017లో తమ కుమార్తె అరిన్‌ను స్వాగతించారు. అయితే రాహుల్ శర్మను పెళ్లాడిన తర్వాత ఆసిన్ సినిమాలకు పూర్తిగా దూరమైంది. (ఇది చదవండి: గర్భస్రావమని చెప్పినా వినలేదు.. మరుసటి రోజే షూటింగ్: బుల్లితెర నటి) -
ఇప్పుడే బ్రేక్ ఫాస్ట్ కూడా చేశా.. విడాకులపై గజినీ హీరోయిన్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గజినీ సినిమా మీకు గుర్తుందా? ఎందుకు గుర్తుండదు మతిమరుపునే కథాంశంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అమాయకంగా కనిపించిన హీరోయిన్ ఆసిన్. కల్పనా శెట్టి పాత్రలో మెప్పించి అభిమానులను సంపాదించుకుంది. తమిళం, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లోనూ నటించింది. అయితే ఆసిన్ 2001లో మలయాళ చిత్రం నరేంద్రన్ మకాన్ జయకాంతన్ వకాతో సినిమాల్లో అడుగుపెట్టింది. (ఇది చదవండి: నారాయణతో సుధాకర్‌కి బ్రేక్ వస్తుంది: అనిల్ రావిపూడి) ఆ తర్వాత గజినీతో పాటు రెడీ, హౌస్‌ఫుల్ 2, బోల్ బచ్చన్, ఖిలాడీ 786తో పాటు.. చివరిసారిగా 2015లో ఆల్ ఈజ్ వెల్ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత 2016లో మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ను పెళ్లి చేసుకుంది. 2017లో వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన భామ.. చాలా రోజుల తర్వాత వార్తల్లో నిలిచింది. ఎందుకంటే ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై గజినీ భామ స్పందించింది. తనపై డైవర్స్ వార్తలకు చెక్ పెట్టింది ఆసిన్. వివరణ ఇస్తూ బుధవారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్సో ఓ నోట్ రాసుకొచ్చింది. తాను ప్రస్తుతం భర్త రాహుల్‌తో కలిసి వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. తనపై వస్తున్న వార్తలు నిరాధారమని తోసిపుచ్చింది. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. ఆసిన్ ఇన్‌స్టా స్టోరీలో రాస్తూ..' రాహుల్‌తో కలిసి వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నా. మాపై చాలా వార్తలు పూర్తిగా నిరాధారం. ఈరోజు మేమిద్దరం కూర్చుని బ్రేక్‌ఫాస్ట్ కూడా తిన్నాం. మేం విడిపోతున్నామనే ఒక బేస్ లెస్ వార్త విన్నా. ప్రస్తుతం మా కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే సమయాన్ని ఆస్వాదిస్తున్నా. దయచేసి వినండి. ఇప్పుడు దీని కోసం కూడా 5 నిమిషాల అద్భుతమైన సమయాన్ని వృధా చేసినందుకు నిరాశ చెందుతున్నా.' అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆసిన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. తనపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టింది గజినీ భామ. (ఇది చదవండి: ఆ సినిమాలో అన్యాయం.. అందుకే ఇండస్ట్రీని వదిలేశా: ప్రముఖ విలన్) రూమర్స్‌కు కారణమిదే.. అసిన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి ఒక్కటి మినహా రాహుల్‌తో ఉన్న అన్ని ఫోటోలను తొలగించింది. దీంతో డైవర్స్ అంటూ రూమర్స్ మొదలయ్యాయి. ఆమె తన సోషల్ మీడియా ప్రొఫైల్ నుంచి తన పెళ్లి ఫోటోలను కూడా తొలగించింది. ఇన్‌స్టాలో ఆమె చివరి పోస్ట్ కుమార్తె అరిన్ ఐదో పుట్టినరోజు సందర్బంగా అక్టోబర్ 2022లో చేసింది. ఇంతవరకు ఆమె ఎలాంటి ఫోటోలను షేర్ చేయలేదు. దీంతో ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోనుందని సోషల్ మీడియాలో తెగ చర్చ మొదలైంది. అంతే కాకుండా ఆసిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్తతో ఉన్న ఒక ఫోటోను మాత్రమే ఉంచింది. -
హీరోయిన్ అసిన్ కూతుర్ని చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి అసిన్. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ గజిని, శివమణి, ఘర్షణ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగుతో పాటు తమిళ,హిందీ భాషల్లో కూడా ఈమె క్రేజ్ ను సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే 2016లో రాహుల్ శర్మ అనే బిజినిస్ మెన్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన అసిన్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన పలు ఫోటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా తన భర్త రాహుల్‌కు కూతురు అరిన్ మేకప్ వేసింది. లిప్‌స్టిక్, ఐ షాడోస్, కాంపాక్ట్ వంటివి చక్కగా వేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను అసిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. -
గజిని హీరోయిన్ అసిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?
-
అసిన్ కూతురి ఫొటో వైరల్
చెన్నై,పెరంబూరు: ఓనం పండగ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా? ఒకప్పటి క్రేజీ కథానాయకి అసిన్ గారాల బిడ్డ. పేరు హారిణి. కేరళకు చెందిన అసిన్ తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ కథానాయకిగా వెలిగిన విషయం తెలిసిందే. అలా అగ్రనటిగా రాణిస్తున్న సమయంలోనే మైక్రోమాక్స్ సంస్థ అధినేత రాహుల్‌శర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి గత 2015లో ఘనంగా జరిగింది. కాగా 2017 అక్టోబరు 24న అసిన్ అందమైన పాపకు జన్మనిచ్చింది.అయితే బుధవారం ఓనం పండగ సందర్భంగా అసిన్ తన కూతురు హారిణి ఫొటోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి అందరికీ ఓనం శుభాకాంక్షలు తెలిపింది. అయితే హరిణి ఫోటో గత ఏడాది పుట్టిన రోజున తీసినదన్నది గమనార్హం. ఆ ఫోటో ఇప్పుడు సా మాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
అరిన్ డాటర్ ఆఫ్ అసిన్
‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, గజిని’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మలబార్ బ్యూటీ ఆసిన్. 2016లో రాహుల్ అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2015లో విడుదలైన ‘ఆల్ ఈజ్ వెల్’ అసిన్ చివరి చిత్రం. గతేడాది ఆమె ఓ పాపకు జన్మనిచ్చారు. అయితే ఆ పాప ఫొటోలను కానీ, పేరుని కానీ మీడియాతో పంచుకోలేదు. ఇప్పుడు మా అమ్మాయి ‘అరిన్’ అంటూ పాప మొదటి పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ బర్త్‌డే ఫొటోలను పంచుకున్నారామె. ‘‘మా చిన్నారి పాప అరిన్కి హ్యాపీ ఫస్ట్ బర్త్‌డే’’ అన్నారు అసిన్. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ముంబైలో ఉంటున్నారు అసిన్. -
‘నువ్వింత తొందరగా ఎదుగుతున్నావ్ ఎందుకు’
సుమారు సంవత్సర కాలంగా తమ కూతురికి సంబంధించిన విషయాలన్నింటినీ గోప్యంగా ఉంచుతున్న ఆసిన్- రాహుల్ శర్మ దంపతులు ఎట్టకేలకు తన ఫొటోలను షేర్ చేశారు. అంతేకాదు ఆమె పేరును కూడా వెల్లడించారు. ‘ఏడాది క్రితం మా ప్రపంచంలోకి అందమైన, తేజోవంతమైన రాకుమారిని ఆహ్వానించాం. ఈరోజు తను తొలి వసంతంలో అడుగుపెట్టింది. నా చిట్టితల్లి ఆరిన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వింత తొందరగా ఎందుకు ఎదుగుతున్నావ్ బంగారం’ అంటూ ఎలక్ట్రానిక్ దిగ్గజం మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడు, వ్యాపారవేత్త రాహుల్ శర్మ తన కూతురికి శుభాకాంక్షలు తెలిపారు. 2016లో వివాహ బంధంతో ఒక్కటైన నటి ఆసిన్, రాహుల్ శర్మ దంపతులు గతేడాది ఆడబిడ్డకు జన్మనిచ్చారు. గురువారం తమ కూతురి పుట్టిన రోజు సందర్భంగా తొలిసారిగా తన ఫొటోలను చేయడంతో పాటు, ఆమె పేరు ఆరిన్ అంటూ అభిమానులకు ఆనందాన్ని పంచారు. కాగా దక్షిణాదిన అగ్రనాయకిగా పేరొందిన ఆసిన్, గజినీ హిందీ రీమేక్ ద్వారా బాలీవుడ్ జనాల దృష్టిని ఆకర్షించారు. అయితే గజినీ తర్వాత ఆమె నటించిన సినిమాలు అంతగా విజయం సాధించలేదు. బాలీవుడ్లో నంబర్ వన్ స్థాయికి చేరుకోలేకపోయిన ఆసిన్... సహ నటుడు అక్షయ్ కుమార్ ద్వారా వ్యాపారవేత్త రాహుల్ శర్మ రూపంలో లైఫ్ పార్ట్నర్ను పొందారు. A year ago we welcomed a Gorgeous, bright eyed, little angel into this world. She just turned ONE!!! Where does time fly? Happy Birthday ARIN, my daughter! Why do u have to grow up so fast? Happy 1st Birthday!#Arinturnsone #ArinsFirstBirthday pic.twitter.com/Iklqpnf98w — Rahul Sharma (@rahulsharma) October 25, 2018 -
స్క్రీన్ టెస్ట్
1. ఆగస్ట్ 15న పుట్టిన ప్రముఖ తెలుగు నటుడెవరో తెలుసా? ఎ) బ్రహ్మాజీ బి) శ్రీహరి సి) నరేశ్ డి) రావు రమేశ్ 2. కమల్‌హాసన్ నటించిన ‘విశ్వరూపం 1, 2’లలో హీరోయిన్గా నటించిన నటి ఎవరో కనుక్కోండి? ఎ) మల్లికా శెరావత్ బి) జయప్రద సి) అసిన్ డి) పూజాకుమార్ 3 . సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘సుప్రీం’ చిత్రంలో బెల్లం శ్రీదేవి పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) రాశీ ఖన్నా బి) రెజీనా సి) రకుల్‌ప్రీత్ సింగ్ డి) లావణ్య త్రిపాఠి 4. చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న. ఈ ఆగస్టుకు ఆయన ఎన్నో సంవత్సరంలోకి అడుగు పెడతారో తెలుసా? ఎ) 61 బి) 60 సి) 62 డి) 64 5. నాగార్జున, నానీ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీకి దర్శకుడెవరో చూద్దామా? ఎ) శ్రీరామ్ ఆదిత్య బి) ప్రశాంత్ వర్మ సి) విరించి వర్మ డి) తరుణ్ భాస్కర్ 6. ‘చి.ల.సౌ’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన హీరోయిన్ పేరేంటి? ఎ) శోభిత దూళిపాళ్ల బి) రుహానీ శర్మ సి) సిమ్రన్ డి) కష్మీరి 7. ‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేశన్ పాత్రలో నటించారు ‘దుల్కర్ సల్మాన్’. ఆ సినిమాలో ఆయన మొదటి భార్యగా నటించిన హీరోయిన్ ఎవరో గుర్తుందా? ఎ) నందితా శ్వేత బి) మెహరీన్ సి) మాళవికా నాయర్ డి) నిత్యా మీనన్ 8. మహానేత వై.యస్. రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. ఆ చిత్రదర్శకుడు మహీ.వి.రాఘవ్ ఇటీవల తెరకెక్కించిన హిట్ సినిమా పేరేంటి? ఎ) జయమ్ము నిశ్చయమ్మురా బి) జంబలకిడి పంబ సి) అమీ తుమీ డి) ఆనందో బ్రహ్మ 9. తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘రోబో 2.0’లో విలన్‌గా నటించిన బాలీవుడ్ నటుడెవరో కనుక్కోండి? ఎ) అజయ్ దేవ్గన్ బి) అక్షయ్ కుమార్ సి) రాజ్‌కుమార్ రావు డి) జాకీ ష్రాఫ్ 10. రేవతి, మోహన్ జంటగా నటించిన ‘మౌన రాగం’ చిత్రదర్శకుడెవరో గుర్తు చేసుకుందామా? ఎ) భారతీరాజా బి) భాగ్యరాజా సి) మణిరత్నం డి) బాలచందర్ 11 దర్శకులు దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎక్కువ చిత్రాల్లో నటించిన హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) జయసుధ బి) జయప్రద సి) విజయశాంతి డి) విజయనిర్మల 12. ‘పంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మా...’ అనే పాటను పాడిన గాయకుడెవరో తెలుసా? ఎ) నిహాల్ బి) వేణు సి) మల్లిఖార్జున్ డి) అనూజ్ 13. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళితో ఎక్కువ సినిమాలకు పని చేసిన కెమెరామెన్ ఎవరో తెలుసా? ఎ) రత్నవేలు బి) కేకే సెంథిల్ కుమార్ సి) రసూల్ ఎల్లోర్ డి) హరి అనుమోలు 14. ‘మనసుకు నచ్చింది’ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన టాప్ హీరో ఎవరు? ఎ) ఎన్టీఆర్ బి) ప్రభాస్ సి) మహేశ్‌బాబు డి) వెంకటేశ్ 15. రీసెంట్ తెలుగు హిట్ మూవీ ‘ఆర్ఎక్స్ 100’ తమిళ రీమేక్‌లో నటిస్తున్న హీరో ఎవరు? ఎ) ఆది సాయికుమార్ బి) ఆది పినిశెట్టి సి) అడివి శేష్ డి) రాహుల్ రవీంద్రన్ 16. దాదాపు ఆరేళ్ల తర్వాత తెలుగు సినిమా చేస్తున్న కథానాయిక ఎవరు? ఎ) త్రిష బి) హన్సిక సి) ఇలియానా డి) శ్రుతీహాసన్ 17. ‘గీత గోవిందం’ చిత్రంలో ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి...’ అనే పాపులర్ సాంగ్‌ను రచించిన రచయితఎవరు? ఎ) శ్రీమణి బి) అనంత శ్రీరామ్ సి) వరికుప్పల యాదగిరి డి) రాంబాబు గోసాల 18. ‘ప్రస్థానం’ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించారు సాయికుమార్. హిందీ రీమేక్‌లో ఆ పాత్రను చేస్తున్న నటుడెవరు? ఎ) అనిల్ కపూర్ బి) సంజయ్ దత్ సి) నానా పటేకర్ డి) నవాజుద్దీన్ సిధ్ధిఖి 19. అక్కినేని, జమున జంటగా నటించిన ఈ స్టిల్ ఏ చిత్రంలోనిదో తెలుసా? ఎ) గుండమ్మకథ బి) దొంగరాముడు సి) ఇద్దరు మిత్రులు డి) చదువుకున్న అమ్మాయిలు 20. ‘మక్కళ్ నీది మయ్యమ్’ అనే రాజకీయ పార్టీని స్థాపించిన తమిళ హీరో ఎవరో కనుక్కోండి? ఎ) రజనీకాంత్ బి) శరత్‌కుమార్ సి) కమల్ హాసన్ డి) విజయ్‌కాంత్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) డి 3) ఎ 4) డి 5) ఎ 6) బి 7) సి 8) డి 9) బి 10) సి 11) ఎ 12) డి 13) బి 14) సి 15) బి 16) సి 17) బి 18) బి 19) బి 20) సి నిర్వహణ: శివ మల్లాల -
మురిపెం
ఆసిన్కి గత ఏడాది అక్టోబర్ 24న కూతురు పుట్టింది. భర్త రాహుల్ శర్మతో కలిసి ఆ తీపి కబురుని ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు ఆసిన్. అయితే కూతురు ఫొటో మాత్రం చూపించలేదు. ఆసిన్ పుట్టిన రోజు అక్టోబర్ 26. ఆ రోజుకి సరిగ్గా రెండు రోజుల ముందు ఆసిన్ తల్లి అయ్యారు. అందుకే, ‘నా జీవితంలోనే ఇది నా బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్’ అని కూతురు గురించి చెప్పుకున్నారు ఆసిన్. మూణ్ణెలలు గడిచాయి. ఆసిన్ కూతురు ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహలం ఫ్యాన్స్‌లో ఉండిపోయింది కానీ, వారి ఆశ నెరవేరలేదు. చివరికి నిన్న.. తల్లి ఇన్‌స్టాగ్రామ్‌లో కూతురు ప్రత్యక్షం అయింది. అయితే పూర్తిగా కాదు. అలాగని అసంపూర్తిగానూ కాదు. ఆర్టిస్టిక్‌గా. బొటనవేలికి వజ్రాల ఉంగరం తొడిగిన పాపాయి బుజ్జి పాదం ఒక్కటే ఆసిన్ పోస్ట్ చేశారు. ‘ఇప్పుడు మేం ముగ్గురం. అంతకు మించి ఏమీ అడక్కండి’ అని ఆ పోస్టుకి కామెంట్ పెట్టారు ఈ మాతృమూర్తి. ఆసిన్ కేరళ అమ్మాయి. ప్రస్తుతం ముంబైలోని తన సొంత ఇంట్లో ఉంటున్నారు. సినిమాలు దాదాపుగా మానేశారు. ఏడు భాషలను అనర్గళంగా మాట్లాడగలిగే ఆసిన్ ఇప్పుడు పాపాయే లోకంగా, ఆ పసిదానికి అర్థమయ్యే భాషను ప్రాక్టీస్ చేస్తున్నారు. -
ఏంజిల్ వచ్చిన వేళ!
మలయాళ కుట్టి అసిన్ గుర్తున్నారా? అదేనండీ.. ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, ‘శివమణి’, ‘లక్ష్మీ నరసింహా’.. ఇలా తెలుగులో చాలా సినిమాలు చేశారు కదా!. ‘గజిని’ హిందీ రీమేక్ ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైన ఈ భామ ఉత్తరాది ఇంటి కోడలైన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. మైక్రోమ్యాక్స్ మొబైల్స్ సంస్థ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ, అసిన్‌ల పెళ్లి గతేడాది జనవరిలో జరిగింది. ఈ దంపతులకు మంగళవారం పాప పుట్టింది. ‘‘మా ఇంటికి ఏంజిల్ వచ్చిన వేళ మా ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాం’’ అని రాహుల్ శర్మ పేర్కొన్నారు. కాగా, బాలీవుడ్లో అసిన్‌కి ఉన్న మంచి స్నేహితుల్లో హీరో అక్షయ్ కుమార్ ఒకరు. రాహుల్–అసిన్‌లు లవ్‌లో పడ్డప్పుడు ఈ హీరోగారు సపోర్ట్ చేశారు. పెళ్లప్పుడు కూడా దగ్గరున్నారు. అసిన్ తల్లయిన సందర్భంగా అక్షయ్ స్వయంగా వెళ్లి, పాపను ఎత్తుకుని, శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకో విషయం ఏంటంటే... నేడు (గురువారం) అసిన్ బర్త్‌డే. పుట్టినరోజుకి ఒకరోజు ముందు తల్లి కావడం... మొత్తం మీద అసిన్, రాహుల్ ఇంట రెండు పండగలు. -
ప్లేట్ ఫిరాయించిన అసిన్
క్షణ క్షణంబుల్ జవరాలి చిత్తంబుల్ అన్నారో కవివర్యులు. ఆ విషయాన్ని ఇంతకు ముందు చాలా మంది తారలు నిజం చేసినా, తానేమీ తక్కువ కాదన్నట్లు నటి అసిన్ రుజువు చేశారు. ఒకప్పటి క్రేజీ నటి అసిన్. దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా ఉండగానే బాలీవుడ్‌కు ఎగుమతై అక్కడే మకామ్ పెట్టేసిన ఈ కేరళా భామ హిందీలోనూ అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్‌కుమార్ ద్వారా పరిచయమైన మెక్రోమ్యాక్స్ కంపెనీ అధినేత రాహుల్ శర్మ ప్రేమలో మునిగి తేలి చివరికి ఆయన్నే మనువాడేశారు. ఇక్కడి వరకూ కథ బాగానే ఉంది. అసిన్ ప్రేమ వివాహానికి కొందరు అసూయ పడినా మరి కొందరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఇటీవల ఈ బ్యూటీ అనూహ్యంగా మీడియాపై విరుచుకు పడి వార్తల్లోకెక్కారు. ఆ కథేమిటంటే తాను వివాహానికి ముందే నటనకు పుల్ స్టాప్ పెట్టేశాన ని, వివాహానంతరం సంసార జీవితానికే పరిమితమైనట్టు పేర్కొన్నారు. అప్పటికి అంగీకరించిన చిత్రాలనూ, వాణిజ్య ప్రకటనలను పూర్తి చేశానని పేర్కొన్నారు. అయినా తనపై అసత్య ప్రచారం చేస్తున్నార ని, ఇకనైనా తన గురించి నిరాధార వార్తలను రాయడం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అన్న కొన్ని రోజులకే అసిన్ ప్లేట్ ఫిరాయించారు. ఇకపై నటించనున్న విషయంపై స్పందిస్తూ తాను అలా అన్నానా? ప్రస్తుతానికి వివాహ జీవితానికే పరిమితం అయ్యానని మాత్రమే తాను చెప్పినట్లు తను ట్విట్టర్లో పేర్కొంటూ మళ్లీ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మీడియాపై నెపం నెట్టేసే ప్రయత్నం అసిన్ చేశారు. ఏదేమైనా అసిన్ ఇలా ప్లేట్ ఫిరాయించడంతో త్వరలోనే మళ్లీ నటించడానికి వచ్చే అవకాశం ఉందనే విషయం అర్థం అవుతోందంటున్నారు సినీ వర్గాలు. -
సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేశా!
ఇటీవలే పెళ్ళయిన సినీ కథానాయిక అసిన్ మళ్లీ సినిమాల్లోకి రానున్నారా? త్వరలో ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? ఇవి సోమవారం వరకూ మీడియాలో వచ్చిన వార్తలు. వ్యాపారవేత్త రాహుల్ శర్మను పెళ్లాడాక అసిన్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. దాంతో, కొన్ని రోజులుగా అసిన్ మీద రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. చివరకు అసిన్ వీటిని కొట్టిపారేశారు. ‘‘నేను పెళ్లికి ముందు ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేసేశాను. చివరికి నేను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న బ్రాండ్స్‌కు సంబంధించిన యాడ్స్ నుంచి కూడా తప్పుకున్నాను. ప్రస్తుతానికి నా చేతిలో సినిమాల్లేవు. ఇప్పటి వరకూ మీడియాలో నా సినిమాల గురించి వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవే’’ అని అసిన్ తేల్చిచెప్పారు. -
పెళ్లయ్యాక సినిమాలు మానేశా: హీరోయిన్
గత జనవరిలో రాహుల్ శర్మను పెళ్లాడి వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆసిన్ థొట్టుంకల్. పెళ్లయిన తర్వాత ఎలాంటి సినిమా ఆఫర్లు ఆమె ఒప్పుకోవడం లేదట. ఈ విషయాన్నే పెళ్లికి ముందు కూడా చెప్పింది. అయినా తనకు పలు సినిమాల ఆఫర్లు వస్తున్నాయంటూ కథనాలు వస్తుండటంతో మళ్లీ ఓసారి వివరణ ఇచ్చింది. 'నేను గతంలో చెప్పిన దానిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిన నా మీడియా మిత్రులందరికీ మరోసారి తెలియజేస్తున్నా. నేను ఎలాంటి అసైన్మెంట్లను ఒప్పుకోవడం లేదు. నా బ్రాండ్ ఎండార్స్మెంట్లు సహా నా కమిట్మెంట్లన్నింటినీ పెళ్లికి ముందే పూర్తి చేశాను. నా వర్క్ గురించి, అసైన్మెంట్ల గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రస్తుతం నేను వాటిని చేయడం లేదు. పెళ్లికి ముందే నేను ప్రకటన చేశాను' అని ఆసిన్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో వెల్లడించింది. మైక్రోమాక్స్ కో ఫౌండర్ అయిన రాహుల్-ఆసిన్ పెళ్లి జనవరి 19న జరిగిన సంగతి తెలిసిందే. క్రైస్తవ, హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది. 2008లో 'గజినీ' సినిమాతో బాలీవుడ్‌కు హాయ్ చెప్పిన ఆసిన్.. పెళ్లికి ముందు చివరగా అభిషేక్ బచ్చన్ నటించిన 'ఆల్ ఈజ్ వెల్' సినిమాలో హీరోయిన్గా కనిపించింది. -
గోవా బ్యూటీని భయపెడుతున్న హీరో
రాక రాక ఒక్క అవకాశం వచ్చినా.. ఆ ఆనందాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేయలేకపోతుంది గోవా బ్యూటీ ఇలియానా. సౌత్‌లో మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ మీద మనసు పారేసుకున్న ఈమె ముంబైలో సెటిలయ్యింది. మొదట్లో కాస్త అవకాశాలు వచ్చినట్టుగానే కనిపించినా తరువాత బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈ భామను పట్టించుకోవటం మానేశారు. దీంతో ఏడాది కాలంగా ఒక్క సినిమా కూడా లేక ఖాళీగా ఉంది ఇలియానా. తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న రుస్తుం సినిమా కోసం ఇలియానాను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. అయితే అవకాశం వచ్చినందకు ఆనందపడాలా లేక అక్షయ్ సెంటిమెంట్‌కు భయపడాలో అర్థం కాక ఇలియానా తికమకపడిపోతుంది. సౌత్ బ్యూటీలకు అక్షయ్‌తో చేసిన సినిమాలు పెద్దగా కలిసి రాలేదు. ఈ హీరో పక్కన నటించిన దక్షిణాది భామలందరూ ఆ సినిమా తరువాత తిరుగు పయనమయ్యారు. గతంలో బాలీవుడ్లో పర్వాలేదనిపించుకున్న అసిన్, అక్షయ్ సరసన ఖిలాడీ 786 తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. స్పెషల్ చబ్బీస్లో నటించిన కాజల్ అగర్వాల్ కూడా తరువాత నార్త్‌లో సౌత్‌లో అవకాశాలు కరువై తెగ ఇబ్బంది పడింది. బేబీ సినిమాలో చేసిన ఢిల్లీ బ్యూటీ తాప్సీదీ అదే పరిస్థితి. అందుకే ఈ లిస్ట్‌లో తాను కూడా చేరిపోతానేమో అని కంగారు పడుతోంది ఇలియానా. మరి అక్షయ్ సెంటిమెంట్ ఇలియానా విషయంలో ఎంత వరకు పనిచేస్తుందో చూడాలి. -
భర్త హనీమూన్ ప్లాన్‌తో అసిన్ థ్రిల్
ముంబై: హీరోయిన్ అసిన్, బిజినెస్ మేన్ రాహుల్ శర్మ ప్రేమ, పెళ్లి వ్యవహారం మొదటి నుంచి ఆసక్తికర వార్తలు గానే నిలిచాయి.. ఇపుడు ఈ కొత్త దంపతుల హనీమూన్ ట్రిప్ కూడా సర్ప్రైజింగ్ గానే ఉంది. తన డార్లింగ్ తో హనీమూన్ సందర్భంగా స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసాడట రాహుల్ శర్మ. ముందుగా అనుకున్నట్లు కాకుండా ప్లాన్ మార్చి ఆమెను థ్రిల్ చేశాడట. అయితే ఈ నవదంపతులు తొలుత హార్వర్డ్ బోస్టన్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారట. కానీ అసిన్ ను సర్ప్రైజ్ చేయడానికి ఆమెకు ముందుగా చెప్పని లొకేషన్లకు తీసుకెళ్లి ఆశ్చర్యంలో ముంచెత్తాలనేది రాహుల్ ఆలోచన. తన ముద్దులభార్యకు తెలియకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్రదేశాలకు తీసుకెళ్లడం ద్వారా తమ హనీమూన్ మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని రాహుల్ నిర్ణయించాడట. కాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సినిమాలో నటించిన సమయంలో అసిన్ కు రాహుల్ శర్మ పరిచయం, ప్రేమ, పెళ్లి తెలిసిన విషయాలే. జనవరి 19న రెండు సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. -
పెళ్లి తరువాత తొలి ట్వీట్
ఇటీవల కాలంలో వార్తల్లో ప్రముఖంగా వినిపించిన పెళ్లి వార్త అసిన్, రాహుల్ శర్మలది. ఇద్దరు సెలబ్రిటీలు కావటంతో నేషనల్ మీడియా కూడా వీరి పెళ్లి విశేషాలను ప్రముఖంగా ప్రసారం చేసింది. ఈ నెల 19న కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఒక్కటైన ఈ ప్రేమ జంట, ఆ తరువాత మీడియాకు దూరంగా ఉన్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఎలాంటి పోస్ట్‌లు చేయలేదు. అసిన్ పెళ్లి ఫోటోలతో కాస్త హడావిడి చేసినా... రాహుల్ శర్మ మాత్రం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. పెళ్లి కార్యక్రమాలు పూర్తయి వారం రోజులు అవుతుండగా రాహుల్ శర్మ తొలి ట్వీట్ చేశాడు. అసిన్‌ను కౌగింలించుకొని ఉన్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన రాహుల్ ' నా ప్రపంచాన్ని నా చేతులతో పట్టుకున్నాను' అంటూ కామెంట్ చేశాడు. అసిన్ సౌత్ నార్త్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ కాగా, రాహుల్ శర్మ ప్రముఖ మొబైల్ కంపెనీ మైక్రోమ్యాక్స్‌కు కో ఫౌండర్‌గా ఉన్నారు. Holding MY WORLD in my arms!!! pic.twitter.com/3CdxudwZOx — Rahul Sharma (@rahulsharma) January 24, 2016 -
రెండు సాంప్రదాయాల్లో అసిన్ పెళ్లి
సౌత్‌తో పాటు నార్త్ ఇండస్ట్రీలోనూ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ అసిన్ పెళ్లి, బందువులు, అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. మైక్రోమ్యాక్స్ సంస్థ కో ఫౌండర్ రాహుల్ శర్మను జనవరి 19న అసిన్ వివాహం చేసుకుంది. ముందుగా క్యాథలిక్ సాంప్రదాయం ప్రకారం క్రిస్టియన్ వివాహం చేసుకున్న ఈ జంట, తరువాత హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. ఢిల్లీలోని ఓ రిసార్ట్ హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది. రాహుల్ శర్మకు చెందిన ఓ ఫార్మ్ హౌస్‌లో గురువారం బందువులకు పార్టీ ఇవ్వనున్నారు. త్వరలో ముంబైలోని సన్నిహితులు సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. అమీర్ ఖాన్ సరసన గజినీ సినిమాతో బాలీవుడుకి పరిచయం అయిన అసిన్ చివరి చిత్రం ఆల్ ఈజ్ వెల్. -
అసిన్‌కు పెళ్ళయింది!
అసిన్‌కు పెళ్ళయిపోయింది. ‘అమ్మ - నాన్న - ఓ తమిళ అమ్మాయి’, ‘శివమణి’ లాంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ప్రముఖ సినీ నటి ఈ మంగళవారం నాడు ఓ ఇంటి ఇల్లాలైంది. తెలుగు, తమిళాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ పేరు తెచ్చుకున్న ఈ అందమైన మలయాళీ భామ ఎట్టకేలకు ప్రముఖ మొబైల్ ఫోన్ సంస్థ ‘మైక్రోమ్యాక్స్’ సహ- వ్యవస్థాపకుడైన రాహుల్ శర్మను వివాహమాడింది. అసిన్ తొట్టుమ్కల్, రాహుల్ శర్మల వివాహం క్రైస్తవ సంప్రదాయంలో జరిగింది. ఆమిర్‌ఖాన్ నటించిన హిందీ ‘గజిని’ చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న 30 ఏళ్ళ ఈ పెళ్ళికూతురు సంప్రదాయ సిద్ధంగా తెల్లటి గౌన్ వేసుకుంటే, పెళ్ళికొడుకు నల్ల రంగు సూటు, టై ధరించారు. ఢిల్లీలోని ఓ రిసార్ట్ హోటల్లో మంగళవారం ఉదయం జరిగిన ఈ పెళ్ళికి వధూవరుల ఆప్తమిత్రుడూ, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి ప్రధాన కారకుడూ అయిన సినీ హీరో అక్షయ్‌కుమార్ హాజరయ్యారు. ఇరు కుటుంబాలకు అత్యంత ఆప్తులైన కొద్దిమంది సమక్షంలో పెళ్ళి ముగిసింది. ‘‘పెళ్ళి అద్భుతంగా జరిగింది. అందరూ అందంగా కనిపించారు. క్యాథలిక్ తరహాలో పెళ్ళి జరగాలన్నది అసిన్ ఆలోచన. అలాగే చేశాం’’ అని పెళ్ళికొడుకు తరఫు బంధువు ఒకరు చెప్పారు. పెళ్ళి సందర్భంగా ఢిల్లీకి చెందిన సంగీత బృందం ఎలోహిమ్ వర్షిప్ బ్యాండ్ పాటలు వినిపించారు. ఉదయం 11 గంటలకు మొదలైన క్రైస్తవ సంప్రదాయ వివాహం అరగంటలో ముగిసింది. ఆ తరువాత మంగళవారం సాయంత్రం అదే ప్రాంగణంలో హిందూ పద్ధతిలో వివాహ క్రతువు జరిగింది. పూర్తి ప్రైవేట్ కార్యక్రమంగా సన్నిహితుల మధ్య పెళ్ళి చేసుకున్న అసిన్ దంపతులు ఈ నెల 23న ముంబయ్‌లో పరిశ్రమ వర్గీయులకూ, ఇతర సన్నిహితు లకూ వివాహ విందు ఇవ్వనున్నారు. ఉయ్ విష్ అసిన్ ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్! -
అసిన్ పెళ్లయిపోయింది..
తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో మేటి నటిగా గుర్తింపు పొందిన అందాల తార అసిన్ వివాహం మైక్రో మ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మతో మంగళవారం ఉదయం న్యూ ఢిల్లీలోని ఓ చర్చిలో జరిగింది. కాగా సాయంత్రం ఓ రిసార్ట్స్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ జంట మరోసారి పెళ్లాడనుంది. గత కొంతకాలంగా రాహుల్, అసిన్‌ల మధ్య ప్రేమ వ్యవహారం నడిచిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం క్రైస్తవ ఆచారం ప్రకారం జరిగిన పెళ్లికి సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. సాయంత్రం అంగరంగ వైభవంగా జరుగనున్న వేడుకలో పెళ్లికూతురు అసిన్ ప్రముఖ డిజైనర్ సవ్యసాచి రూపొందించిన దుస్తుల్లో మెరవనున్నారు. ప్రత్యేకంగా తయారుచేయిస్తున్న పది వరుసల ఎత్తున్న కేకును దంపతులు కట్ చేయనున్నారు. ఇక పెళ్లి విందులో పూర్తి శాఖాహార భోజనం వడ్డించనున్నారు. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖుల సమక్షంలో జనవరి 23న ముంబైలో వీరి వివాహ రిసెప్షన్ జరుగనుంది. -
రెండు సంప్రదాయాల్లో అసిన్ పెళ్లి
రెండు సంప్రదాయాల్లో పెళ్లి చేసుకునేందుకు నటి అసిన్ సిద్ధమవుతున్నారు. ఇంతకు ముందు దక్షిణాదిని ఏలి ఆ తరువాత బాలీవుడ్లో మకామ్ పెట్టిన నటి అసిన్ అన్న విషయం తెలిసిందే. ఈ మలయాళీ కుట్టి ముంబైకి చెందిన మైక్రోమాక్స్ సంస్థ అధినేత రాహుల్‌శర్మను ప్రేమ ముగ్గులోకి దించి ఆయన్నే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రేమ జంట పెళ్లి తేదీ నిర్ణయమైంది. రాహుల్,అసిన్‌ల వివాహ తంతు రెండు రోజులు, రెండు మత సంప్రదాయ పద్ధతుల్లో జరగనుండడం విశేషం. హిందు, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వారు వివాహం చేసుకోనున్నారు. అసిన్,రాహుల్ పెళ్లి వేడుక ఈ నెల 19న ఢిల్లీలో మెహిందితో శ్రీకారం చుట్టుకోనుంది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు వంద మంది అతిథులు మాత్రమే పాల్గొననున్నారట. 20వ తేదీన హిందు, క్రిస్టియన్ మత సంప్రదాయాల ప్రకారం వివాహ వేడుకను నిర్వహించనున్నారు.ఇక 23వ తేదీన ముంబైలో అసిన్, రాహుల్ శర్మల వివాహ రిసెప్షన్‌ను జరుగ నుంది. ఈ వేడుకకు 250 మంది సినీ ప్రముఖలనే ఆహ్వానించడం గమనార్హం. అసిన్, రాహుల్ శర్మల ప్రేమకు వారధి బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్‌కుమార్ అన్న విషయాన్ని ఇంతకు ముందు అసినే స్వయంగా వెల్లడించిన విషయం విదితమే. అందువల్ల వివాహ ఆహ్వాన పత్రికను అసిన్ ముందుగా నటుడు అక్షయ్‌కుమార్‌కే అందించారట. ఆయన అసిన్ వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని శుభాశీస్సులు అందించారట. -
మొదటి శుభలేఖ అతనికే!
ఢిల్లీలో వివాహం ముంబయ్‌లో రిసెప్షన్ ♦ మలయాళ అందం అసిన్ ఉత్తరాది ఇంటి కోడలు కాబోతున్న విషయం తెలిసిందే. వ్యాపారవేత్త రాహుల్ శర్మను ఆమె ప్రేమ వివాహం చేసుకోనున్నారు. ఈ నెల 23న వీరి వివాహం అత్యంత వైభవంగా జరగనుంది. ప్రస్తుతం అసిన్, రాహుల్ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ మధ్య ‘సేవ్ యువర్ డేట్’ అంటూ కార్డులు పంచిన ఈ కాబోయే దంపతులు ఇప్పుడు శుభలేఖలు పంచుతున్నారు. అసిన్, రాహుల్‌ల లవ్‌స్టోరీ, పెళ్లి ఏర్పాట్లు గురించి తెలుసుకుందాం.... ♦ దక్షిణాదిన పలు చిత్రాల్లో కథానాయికగా నటించి, ‘గజిని’ హిందీ రీమేక్ ద్వారా ఉత్తరాది తెరకు పరిచయమయ్యారు అసిన్. ఆ చిత్రంతోనే బాలీవుడ్లో బోల్డంత క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ అవకాశాలు అంతంత మాత్రంగానే వచ్చాయి. కెరీర్‌పరంగా అసిన్‌కి నార్త్ కలిసొచ్చినా రాకపోయినా అక్కడికి వెళ్లడం ద్వారా వ్యక్తిగతంగా అసిన్‌కి కలిసొచ్చిందనే చెప్పాలి. అక్షయ్ కుమార్‌తో కలిసి ‘హౌస్‌ఫుల్ 2’, ‘కిలాడి 786’ చిత్రాల్లో నటించినప్పుడు అతని ద్వారా వ్యాపారవేత్త రాహుల్ శర్మతో అసిన్‌కి ఏర్పడిన పరిచయం పెళ్లి వరకూ వచ్చేసింది. ♦ అసిన్‌కి గ్రాండ్ లెవల్లో రాహుల్ శర్మ లవ్ ప్రపోజ్ చేశారు. ఆ సమయంలో సుమారు ఆరు కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రపుటుంగరాన్ని అసిన్‌కి రాహుల్ బహూకరించారనే వార్త ప్రచారమైంది. వాస్తవానికి అక్షయ్‌కుమార్ పరిచయం చేసినప్పుడు అసిన్, రాహుల్ జస్ట్ ‘హాయ్’ చెప్పుకున్నారట. ఆ తర్వాత పలు సందర్భాల్లో కలుసుకున్నప్పుడు కూడా పెద్దగా మట్లాడుకునేవాళ్లు కాదట. చాలా బిడియంగా ఉండేవారని అక్షయ్ ఓ సందర్భంలో అన్నారు. చివరకు అక్షయ్ చొరవ వల్లే ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ మామూలు మాటలు చివరికి ప్రేమకబుర్లుగా మారిపోయాయి. ♦ అసిన్‌ని రాహుల్ శర్మకు పరిచయం చేసింది తానే అయినప్పటికీ, వాళ్ల పెళ్లి కుదరడానికి తాను మాత్రం కారణం కాదనీ, ఎందుకంటే తానేం మ్యాచ్ మేకర్ కాదనీ ఇటీవల ఓ సందర్భంలో అక్షయ్ కుమార్ చమత్కరించారు. ఏదేమైనా తాము ఒకరికొకరు పరిచయం కావడానికి కారణమైన అక్షయ్ అంటే అసిన్‌కి అభిమానం ఏర్పడింది. రాహుల్‌కి అక్షయ్ మీద ఆల్రెడీ ఉన్న అభిమానం రెట్టింపు అయ్యింది. ♦ అక్షయ్ మీద ఉన్న అభిమానంతో అసిన్, రాహుల్ తమ తొలి శుభలేఖను ఆయనకే ఇచ్చారు. ఇద్దరూ స్వయంగా వెళ్లి, పెళ్లికి తప్పనిసరిగా రావాలని కోరారు. ‘‘నా క్లోజ్ ఫ్రెండ్స్ రాహుల్, అసిన్‌ల తొలి వెడ్డింగ్ కార్డ్‌ని ముందు నేనే అందుకున్నా. చాలా ఆనందంగా ఉంది. వాళ్లిద్దరూ జీవితాంతం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా’’ అని అక్షయ్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. డార్క్ బ్రౌన్ కార్డుపై బంగారు రంగు డిజైన్‌తో వెడ్డింగ్ కార్డు కవర్ చూడముచ్చటగా ఉంది. ♦ విశేషం ఏంటంటే.. వెడ్డింగ్ కార్డ్కన్నా ముందు అసిన్, రాహుల్ మరో మెటల్ కార్డుని తయారు చేశారు. అది ‘సేవ్ ది డేట్ కార్డ్’. జనవరి 23ని మా కోసం సేవ్ చేసుకోండి అంటూ ప్రత్యేకంగా కార్డ్ తయారు చేసి, గత ఏడాది చివర్లో ఆహ్వానితులకు అందజేశారు. ఆదివారం శుభలేఖలు పంచే కార్యక్రమం మొదలుపెట్టారు. ♦ పెళ్లి బట్టల గురించి చెప్పాలంటే.. ప్రముఖ డిజైనర్ సబ్యసాచిని అసిన్, రాహుల్ సంప్రతించారట. సినిమాలకే కాకుండా వ్యక్తిగతంగా కూడా పలువురు ప్రముఖ హిందీ తారలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంటారు సబ్యసాచి. ముంబయ్‌లో ఆయనకో పెద్ద డిజైనర్ స్టోర్ ఉంది. అసిన్, రాహుల్ అక్కడికెళ్లి, మ్యారేజ్, సంగీత్, మెహందీ రిసెప్షన్ వేడుకలకు కావల్సిన డిజైనర్ వేర్ని ఆర్డర్ చేశారట. ఢిల్లీలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్లో వివాహం, ముంబయ్‌లో రిసెప్షన్ జరగనున్నాయి. మెహందీ, సంగీత్, పెళ్లి, ఆ తర్వాత రిసెప్షన్.. ఇవన్నీ జీవితాంతం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయేలా రాహుల్, అసిన్ ప్లాన్ చేస్తున్నారు. -
ఆసిన్, రాహుల్ శుభలేఖ ఇలా ఉంటుంది!
బాలీవుడ్ హీరోయిన్ ఆసిన్, రాహుల్‌శర్మ పెళ్లి శుభలేఖ అందుకున్న విషయాన్ని హీరో అక్షయ్‌కుమార్ ఆదివారం ట్విట్టర్లో వెల్లడించారు. మైక్రోమాక్స్ సీఈవో రాహుల్‌శర్మ, ఆసిన్ వివాహం ఈ నెల 23న జరుగనుంది. గతకొంతకాలంగా చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకుంటారని చాలాకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సంప్రదాయకత, నవ్యత కలబోసి.. ముదురు ఎరుపు, బంగారు రంగుల్లో వీరి శుభలేఖ కవర్‌ను తీర్చిదిద్దారు. ఆసిన్-రాహుల్ శర్మ వివాహం ఢిల్లీలో జరుగనుండగా.. ముంబైలో తన బాలీవుడ్ స్నేహితులకు ఆసిన్ విందు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 'గజనీ' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన ఆసిన్ అడపదడపా విజయాలతో మొన్నటివరకు ప్రేక్షకులను పలుకరించింది. ఇటీవల ఆమె నటించిన 'ఆల్ ఈజ్ వెల్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తన సినిమా షూటింగ్‌లన్నింటికీ ఆసిన్ స్వస్తి చెప్పింది. తన ఆప్తమిత్రులైన ఆసిన్-రాహుల్ శర్మ తొలి శుభలేఖను అందుకున్నట్టు అక్షయ్ ట్విట్టర్లో ఆనందం వ్యక్తం చేశారు. Happy to receive the 1st wedding card of 2 of my close friends,Rahul & Asin. Wishing you both happiness always pic.twitter.com/1ILe2TfK0F — Akshay Kumar (@akshaykumar) January 10, 2016 -
ఆ ఉంగరం ఆరు కోట్లు
సౌత్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తరువాత బాలీవుడ్లో సత్తా చాటిన అసిన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఇటీవల నిశ్చితార్ధం చేసుకున్న అసిన్ కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే వెండితెరకు దూరమైనా, ఏదో ఒక విధంగా వార్తల్లో కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా రాహుల్ శర్మతో ప్రేమ, తరువాత త్వరలోనే పెళ్లి అంటూ వార్తలు వినిపించటం, వెంటనే నిశ్చితార్థం ఇలా వరుసగా అసిన్ పేరు బాలీవుడ్లో మారు మోగింది. తాజాగా మరోసారి అసిన్ పెళ్లి తెర మీదకు వచ్చింది. డిసెంబర్ 27న తన పుట్టిన రోజు సందర్భంగా సల్మాన్ ఇచ్చిన పార్టీకి తనకు కాబోయే భర్తతో కలిసి హాజరైంది అసిన్. ఈ ఫంక్షన్లో అసిన్ చేతికి ఉన్న నిశ్చితార్ధపు ఉంగరం అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్ టాప్ స్టార్స్ ను కూడా ఆకర్షించేంత గొప్పదనం ఆ ఉంగరంలో ఏముంది అనుకుంటున్నారా..? అది మూములు బంగారు ఉంగరం కాదు.. భారీ వజ్రం పొదిగిన ఉంగరం. దాని విలువ కూడా 6 కోట్ల పై మాటేనట. అందుకే ప్రస్తుతం అసిన్ ఉంగరం కూడా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. -
జనవరి 23న పెళ్లి
రెండేళ్లుగా ప్రేమిస్తున్న మైక్రోమ్యాక్స్ సంస్థ అధినేత రాహుల్ శర్మతో హీరోయిన్ అసిన్ వివాహం రానున్న జనవరి 23న ఢిల్లీలో జరగనుంది. వీరిద్దరి ప్రేమాయణం పెద్దలకు తెలియడం, వారు వారి పెళ్లికి పచ్చజెండా ఊపడంతో కొంత కాలంగా నటనకు అసిన్ ఫుల్స్టాప్ పెట్టేశారు. అంతకు ముందు అంగీకరించిన చిత్రాలు, వాణిజ్య ప్రకటనలను పూర్తి చేసేశారు. -
అసిన్ పెళ్లికి చిక్కులున్నాయా?
చెన్నై : ప్రముఖ హీరోయిన్ అసిన్ వివాహం నిర్ణయించిన తేదీ (నవంబర్ 26)న జరగదా? ఇలాంటి పలు సందేహాలకు ఆస్కారం కలిగేలా అసిన్ వ్యాఖ్యలు దొర్లుతుండడం గమనార్హం. ఈ కేరళా కుట్టి మరోసారి వార్తల్లోకెక్కింది. ఒకప్పుడు తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోయిన్గా ఏలిన నటి అసిన్. గజని చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అక్కడ ప్రాచుర్యం పొందారు. అలా ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయకుమార్ ద్వారా పరిచయమయిన మైక్రోమాక్స్ సంస్థ అధినేత రాహుల్‌శర్మను మోహితుడ్ని చేసుకుని ఆయనతో ఏడడుగులు నడవడానికి రెడీ అయ్యింది. ఈ విషయాన్ని చాలా కాలం రహస్యంగా ఉంచిన అసిన్ ఇటీవలే బహిర్గతం చేశారు. అంతేకాదు పనిలోపనిగా నవంబర్ 26న పెళ్లి అంటూ ముహూర్తం తేదీని కూడా వెల్లడించేశారు .అలాంటిది ఇప్పుడు పిల్లి మొగ్గలేస్తోంది. కారణం ఆమె పెళ్లికి చట్టపరమైన చిక్కులు ఏర్పడే అవకావం ఉందని భావించడమే నని సమాచారం. అసిన్ పెళ్లికి సిద్ధమవ్వడంతో సినీ అవకాశాలను వదిలేశారు. అయితే ఆమె అప్పటి వరకూ అంగీకరించిన వాణిజ్య ప్రకటనల ఒప్పందాలు ఈ ఏడాది చివరి వరకూ ఉన్నాయి. దీంతో ఆయా సంస్థల యాజమాన్యం అసిన్ పెళ్లి వార్త విని అసంతృప్తిని వెల్లడించాయి. ఈనేపథ్యంలోనే పెళ్లికి చిక్కులు ఏర్పడే అవకాశం ఉందని భావించి ప్లేట్ పిరాయించిందని టాక్. అసిన్ తాజాగా ఒక పత్రికకు ఇచ్చిన భేటీలో తన పెళ్లి ప్రచారం ఒక జోక్ అని ఆ ప్రచారంలో నిజం లేదని పేర్కొనడం చూసిన వారు ఔరా అసిన్ అనుకోకుండా ఉండలేక పోతున్నారు. ఏమైనా అసిన్ నటి కదా ఇలా కూడా తన చాతుర్యాన్ని చూపిస్తున్నారన్న మాట. -
అక్టోబర్ 26 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: మనో (సింగర్), అసిన్ (నటి), అమలాపాల్ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. పుట్టిన తేదీ 26. ఇది శనికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల వీరిపై శని ప్రభావం బలంగా ఉంటుంది. ఫలితంగా ఈ సంవత్సరం వీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో స్థిరత్వాన్ని, అభివృద్ధిని పొందుతారు. మనోబలం పెరుగుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో సీటు వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం, ఉద్యోగులకు ప్రమోషన్ ఉంటుంది. రాజకీయ నాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఐ.ఎ.ఎస్‌లు, ఐపీఎస్‌లు తదితర అధికారులకు పదోన్నతి ప్రాప్తిస్తుంది. ఈ ఏడాది పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. క్రమశిక్షణ, న్యాయం, ధర్మం, సమానత్వం అనే గుణాలను కలిగి ఉండటం వల్ల సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారు. పిల్లలకు వివాహాది శుభకార్యాలు జరిపిస్తారు. న్యాయవాద వృత్తిలో ఉన్న వారు, మేనేజిమెంట్ రంగంలోని వారు రాణిస్తారు. అయితే బీపీ, హృద్రోగాలు తలెత్తే అవకాశం ఉన్నందువల్ల అప్రమత్తంగా ఉండటం మంచిది. లక్కీ డేస్: 1,3,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, గోల్డెన్, బ్లూ, బ్లాక్; లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: శనికి తైలాభిషేకం, శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, అనాథలకు అన్నదానం, వృద్ధులను ఆదరించడం, పిల్లులకు, కుక్కలకు ఆహారం పెట్టడం, మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్త్రో న్యూమరాలజిస్ట్ -
స్టార్ స్టార్ సూపర్‌స్టార్ - ఆశిన్
-
పెళ్లిపీటలెక్కబోతున్న హీరోయిన్
'గజనీ' సినిమాతో ఇటు దక్షణాది వారిని, అటు బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ అసిన్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. వచ్చేనెల 26న తన చెలికాడు రాహుల్ శర్మను మనువాడనున్నారు. ఈ మేరకు వారి పెళ్లి ముహూర్తం ఖరారైనట్లు తెలిసింది. న్యూఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్లో వీరి వివాహం జరుగనుంది. నవంబర్ 27న ఢిల్లీలోని వెస్ట్ ఎండ్ గ్రీన్స్ ఫార్మ్‌హౌజ్‌లో ఈ జంట అతిథులకు రిసెప్షన్ ఇవ్వనుంది. ఈ వేడుకలో కుటుంబసభ్యులు, సన్నిహిత మిత్రులు మాత్రమే పాల్గొనున్నారు. ఇదే ఫామ్‌హౌజ్‌లో గతంలో షాహిద్, మీరాల రిసెప్షన్ జరిగింది. నవంబర్ 28న ముంబైలో ఈ దంపతులు మరో రిసెప్షన్ ఇవ్వనున్నారు. మైక్రోమాక్స్ సహ స్థాపకుడైన రాహుల్ శర్మ-అసిన్ కొంతకాలంగా స్నేహంగా ఉంటున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరి మనస్సులు కలువడంతో పెళ్లికి ఒప్పుకున్నట్టు తెలుస్తున్నది. -
హృదయం ఇక్కడ ఉన్నది...
‘ఆల్ ఈజ్ వెల్’ టైటిల్ అసిన్ (29)కు కలిసొచ్చినట్టుంది. ఆ టైటిల్‌కు తగినట్టుగానే ఆమె వృత్తిగత జీవితం, వ్యక్తిగత జీవితం ఆల్ ఈజ్ వెల్‌గా ఉండబోతోంది. మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న ఈ తాజా బాలీవుడ్ సినిమాలో అసిన్, అభిషేక్ బచ్చన్ పక్కన కనిపించనుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ హడావిడి కంటే అసిన్ పెళ్లి వార్త హడావిడే ఇప్పుడు ఎక్కువగా వార్తల్లో ఉంది. అవును. అసిన్ పెళ్లి చేసుకోబోతోంది. తను నటించిన ‘గజిని’ సినిమాలోలానే ఒక పెద్ద కోటీశ్వరుణ్ణి, పారిశ్రామికవేత్తను పెళ్లాడనుంది. సినిమా నిజమైంది... సంజయ్ రామస్వామి ప్రఖ్యాత మొబైల్ కంపెనీ అధినేత. కోటీశ్వరుడు. కాని అతడు ఒక సాదాసీదా మోడల్ ప్రేమలో పడతాడు. ఇది ‘గజిని’ సినిమాలో మనం చూశాం. ఇప్పుడు నిజ జీవితంలో కూడా అదే జరిగింది. మైక్రోమాక్స్ మొబైల్ కంపెనీ కో - ఫౌండర్, సి.ఇ.ఓ అయిన రాహుల్ శర్మ (36), అసిన్ ప్రేమలో పడ్డాడు. అసిన్ అతణ్ణి ఇష్టపడింది. వాళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అసిన్ ఈ వార్తను ధ్రువీకరించిందని భోగట్టా. ‘గజిని’ సినిమాలో తన దగ్గర ఏమీ లేకపోయినా సాటివారికి సాయం చేసే పాత్రలో అసిన్ నటించింది. వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె అలాంటి స్వభావం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందింది. చాలామంది పేద అమ్మాయిలను అసిన్ చదివిస్తోంది. శ్రీలంకలో షూటింగ్ చేయడానికి వెళ్లి అక్కడ తమిళ శిబిరాల వారి పరిస్థితికి చలించి వారి కోసం హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేసింది. ముంబైలో అనేక ఎన్జిఓలకు ఆమె సపోర్ట్ చేస్తోంది. ‘గజిని’లో ఆమెకు హీరో లభించకపోయి ఉండవచ్చు. కాని నిజ జీవితంలో రాకుమారుడు అందాడు. ‘ఆమె తన వృత్తిగతమైన ఒడంబడికలను త్వరగా ముగించుకుని వ్యక్తిగత జీవితానికి అంకితం కాదలుచుకుంది. బహుశా సినిమాలకు స్వస్తి కూడా చెప్పవచ్చు’ అని ఆమె సన్నిహితురాలు ఒకరు వ్యాఖ్యానించారు. ఎవరీ రాహుల్ శర్మ నాగపూర్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఆ తర్వాత కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాడు. ఇండియా తిరిగి వచ్చి మైక్రోమాక్స్ సంస్థను ప్రారంభించాడు. మొదట సాఫ్ట్వేర్ రంగంలో పని చేసిన ఈ సంస్థ క్రమంగా మొబైల్స్ రంగంలోకి వచ్చింది. ‘ఎక్కువ సమయం నిలబడగల బ్యాటరీ ఉండే మొబైల్‌ను’ వినియోగదారులకు అందించడం అనే ఐడియా నుంచి మైక్రోమాక్స్ మొబైల్స్‌ను మార్కెట్లోకి తెచ్చే ఆలోచనను రాహుల్ శర్మే చేశాడు. కొత్తల్లో ఇది అంత సులువు కాలేదు. కాని రాను రాను భారతీయ మార్కెట్లో మైక్రోమాక్స్ సంస్థ తన స్థానాన్ని సుస్థిర పరుచుకుంది. అక్షయ్ కుమార్ మధ్యవర్తిత్వం... అసిన్‌కు, రాహుల్ శర్మకు పరిచయం ఏర్పడటానికి హీరో అక్షయ్ కుమార్ కారణం. అసిన్, అక్షయ్‌కుమార్ కలిసి ‘ఖిలాడీ 786’ (2012)లో నటించారు. అక్షయ్ కుమార్ అప్పటికే మైక్రోసాఫ్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. అందువల్ల సాధారణంగా జరిగే సినిమా పార్టీల్లో వీళ్లను ఒకరికొకరిని పరిచయం చేసి ఉంటాడని భావిస్తున్నారు. అసిన్ అప్పటికే బాలీవుడ్లో టాప్‌స్టార్. ఆమె బాలీవుడ్లో నటించిన తొలి సినిమా ‘గజిని’ వంద కోట్లు వసూల్ చేసిన తొలి హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది. దానికి ముందే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇవన్నీ రాహుల్ ఆమె వైపు ఆకర్షింపబడటానికి కారణం అయ్యుండొచ్చు. రాహుల్ శర్మ అందగాడు కావడం, పారిశ్రామికవేత్తగా విజయాలు సాధించడం ఒక ఎత్తయితే అతడికి సంగీతం అంటే ఉండే ఆసక్తి, కార్ల మీద ఉండే క్రేజ్, కొత్త ప్రాంతాలు చూడాలనుకునే ఉత్సుకత ఇవన్నీ అసిన్‌కు నచ్చి ఉంటాయని ఊహించవచ్చు. రాహుల్ శర్మ దగ్గర ప్రస్తుతం ఒక రోల్స్ రాయిస్, బెంట్లే, బిఎండబ్ల్యు, మెర్సిడస్ ఉన్నాయి. అమెరికా వెళితే ఒక కారు తీసుకుని తోచిన ప్రాంతానికి వెళ్లిపోవడం అతడికి సరదా. సంగీతం అంటే ఇష్టం. అసిన్‌ను ఆకట్టుకోవడానికి ఇంతకు మించి ఏం కావాలి అంటున్నారు. కేరళ నుంచి కోట్లకు... కొచ్చిలో పుట్టి పెరిగిన అసిన్ది దాదాపుగా మధ్యతరగతి కుటుంబం. ఆమె తండ్రి మధ్యతరగతి వ్యాపారాలు చేసేవాడు. తల్లి డాక్టర్. మొదట మోడలింగ్‌లో అడుగుపెట్టిన అసిన్ 2001లో తొలిసారిగా మలయాళ సినిమాలో కనిపించింది. అయితే ఆమెను వెలుగులోకి తెచ్చింది మాత్రం తెలుగు సినిమా రంగమే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మా... నాన్నా... ఓ తమిళ అమ్మాయి’ సినిమా అసిన్‌ను తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడేసింది. అదే సినిమా తమిళంలో రిమేక్ అయ్యి, అక్కడా హిట్ సాధించి అసిన్‌ను బిజీ చేసింది. తెలుగులో ‘ఘర్షణ’, ‘లక్ష్మీ నరసింహ’, ‘చక్రం’ సినిమాల్లో నటించిన అసిన్ ‘గజిని’ సినిమాతో పెద్దస్థాయిని అందుకుంది. కమలహాసన్ సరసన ‘దశావతారం’లో నటించే అవకాశం కూడా దక్కించుకోవడంతో నం.1 సౌత్ హీరోయిన్గా ఎదిగింది. ఆ తర్వాత బాలీవుడ్లో అవకాశాలు రావడం కెరీర్ తొలి రోజుల్లోనే ఆమిర్‌ఖాన్, సల్మాన్ ఖాన్ సరనన నటించడం ఆమెకు పెద్ద హోదాను తెచ్చాయి. ప్రస్తుతం అసిన్ ముంబైలోని లోఖండ్వాలాలో నివాసం ఉంటుంది. కొచ్చి మెరైన్ డ్రైవ్‌లో ఆమెకు ఖరీదైన అపార్ట్మెంట్ ఉంది. కొట్టాయం సమీపంలో ఉన్న వెగమాన్ అనే హిల్ స్టేషన్లో ఆమెకు ఒక సొంత ఫామ్ హౌస్ కూడా ఉంది. -
అసిన్‌కు పెళ్లి కళ
నటి అసిన్‌కు పెళ్లి కళ వచ్చిందా? అవుననే అంటున్నారు. సినీ వర్గాలు. దక్షిణాదిలో ఒక వెలుగు వెలిగి ఉత్తరాదికి ఎగబాకిన నటి అసిన్. గజినీ చిత్రం ఆమెను బాలీవుడ్లో పాపులర్ చేసింది. ఆ తరువాత అక్కడ వరుసగా అవకాశాలు పొందినా ప్రస్తుతం కొరవడ్డాయని చెప్పకతప్పదు. అక్టోబర్ 26కు అసిన్‌కు 30 ఏళ్లు నిండుతాయి. దీంతో అమ్మడు పెళ్లికి సిద్ధమైందట. వ్యాపారవేత్తతో మూడుముళ్లు వేయించుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. త్వరలోనే ఆ ఘడియలు రానున్నట్లు సమాచారం. అయితో ఈ విషయం గురించి అసిన్ ఏమంటుందో చూడండి. నేను హిందీలో చాలా తక్కువ చిత్రాలే చేశాను. అయితే గ్లామరస్ పాత్రల అవకాశాలు చాలానే వచ్చాయి. అలాంటి పాత్రలు పోషించడం ఇష్టం లేక అంగీకరించలేదు. అలాంటి పరిస్థితిలోనూ నేను కోరుకున్న పాత్రలు వస్తూనే ఉన్నాయి. అసలు అవకాశాలు రాకపోయినా బాధపడను.ఇక పొతే వ్యాపారవేత్తతో వివాహమా?అని అడుగుతున్నారు. నా వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ చర్చిలేదు. ఒక్క విషయం మాత్రం నిజం నాకింకా వివాహం జరగలేదు. పెళ్లి ఎప్పుడన్నది నిర్ణయించలేదు. ఆ సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను. -
ఆశిన్‌చినంతగా..!
‘గజిని’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఆశిన్. అమీర్‌ఖాన్ సరసన నటించడం, ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ‘ఇక రాబోయే కాలమంతా అశిన్దే’ అనుకున్నారు సినీ పండితులు. టాప్-1 హీరోయిన్ల లిస్ట్‌లో ఆమె పేరు చేరడం ఖాయం అని కూడా అన్నారు. బరువు తగ్గడం నుంచి స్టైల్ సెన్స్ వరకు బాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్లుగా తనను తాను మలుచుకునే విషయంలో బాగానే కష్టపడింది. అయినప్పటికీ ఆమెకు ‘గజిని’ తరువాత చెప్పుకోదగ్గ సినిమాలేవీ రాలేదు. ఇప్పుడు అశిన్ చేతిలో ‘ఆల్ ఈజ్ వెల్’ సినిమా మాత్రమే ఉంది. ‘‘యువ హీరోలతో నటించాలని ఉంది’’ అని ఒక ఇంటర్య్వూలో చెప్పింది అశిన్. అయితే ఆమె కోరిక నెరవేరడం లేదు. ‘‘ఇక నా ప్రాధాన్యత బాలీవుడ్ మాత్రమే’’ అని సౌత్ఫిల్మ్స్ను తిరస్కరించిన అశిన్ రేసులో ఎందుకు వెనక బడింది? విశ్వసనీయ సమాచారం ప్రకారం, రకరకాల కండిషన్లు పెట్టే ధోరణి వల్లే దర్శక, నిర్మాతలెవరూ ఆశిన్ గురించి ఆలోచించడం లేదట. దీంతోపాటు వ్యక్తిగత విషయాలు కూడా ఆమె కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. మరోవైపు తమన్నా, కాజల్ అగర్వాల్, ఇలియానాలు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం కూడా...అశిన్ కెరీర్‌పై ప్రభావాన్ని చూపింది. వచ్చే నెలలో విడుదల కానున్న ‘ఆల్ఈజ్ వెల్’ హిట్ కాకపోతే...ఇక ముంబాయికి టాటా చెప్పి తట్టా బుట్టా సర్దుకోక తప్పదనే మాటలు వినిపిస్తున్నాయి! -
ఆసిన్పై ఆగ్రహం
భావ స్వేచ్ఛ ఉంది కదా అని సమయం, సందర్భం చూడకుండా మాట్లాడేస్తే నటి ఆసిన్లా తలనొప్పికి గురి కావలసిందే. చివరికి పోలీసులను ఆశ్రయించాల్సిందే. పైగా ఆసిన్ నోరు జారింది. సాధారణ అంశం పైనా దేశమంతా క్రికెట్ క్రీడాభిమానులు ఉద్రేకంతో ఉడికిపోయిన తరుణంలో ఆమె వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లయ్యింది. ఆసిన్ వ్యాఖ్యలు వ్యక్తిగతమే. అయితే ఆమె సగటు స్త్రీ కాదుగా. ప్రముఖ నటి. సెలబ్రెటి. ఇంతకీ ఆసిన్ చేసిన తప్పేమిటంటారా? చాలామందికి తెలిసినదే. ప్రపంచ కప్ క్రికెట్ క్రీడా పోటీలో ఆరు ఆటల్లో అజేయంగా నిలిచిన భారతజట్టు సెమీఫైనల్లో విరాట్ కొహ్లీ ఒకే ఒక్క రన్‌తో పీచేమూడ్ అనడం, భారతజట్టు ఓటమి పాలవడం క్రీడాభిమానులు జీర్ణించుకోలేని విషయం. ఆ పోటీలకు కోహ్లీ ప్రియురాలు అనుష్కశర్మ వెళ్లడం ఆమెకు శాపంగా మారింది. క్రికెట్ వీరాభిమానులు అనుష్క శర్మ కారణంగానే ఆటపై కాన్సంట్రేట్ చేయలేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అనుష్కశర్మను ఆడిపోసుకుంటున్నారు. సహనటిగా ఈ విషయాలు నటి ఆసిన్‌ను చిర్రెత్తేలా చేశాయి. దీంతో పరిస్థితుల ప్రభావాన్ని గుర్తించకుండా అనుష్క శర్మ చేసిన తప్పేంటి? అంటూ తన ట్విట్టర్లో పేర్కొని చాలా పెద్ద తప్పే చేశారు. దీంతో కొహ్లీని, అనుష్క శర్మను వదిలేసిన అభిమానులు ఆసిన్పై దుమ్మెత్తిపోయడం మొదలెట్టారు. వారి ఆగ్రహం ఎంతవరకు వెళ్లిందంటే ఏకంగా ఆసిన్ పేరుతో ఒక నకిలీ వెబ్‌సైట్‌ను ప్రారంభించి ఇష్టానికి మెసేజ్‌లు పోస్ట్ చేసేస్తున్నారు. క ఈ నకిలీ వెబ్సైట్ వ్యవహారం బాలీవుడ్ స్టార్ నటుడు అభిషేక్ లాంటి కొందరి చూపులకు చేరిపోయింది. వారు ఆసిన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆసిన్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట. ఆసిన్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వర్గం చెబుతోంది. -
కల నెరవేరింది
ప్రతి ఒక్కరూ కలలు కనాలి. వాటిని సాకారం చేసుకోవడానికి కృషి చేయాలి ఇది మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం పలికిన హితవు. అచ్చం అలానే నటి రాయ్‌లక్ష్మి చాలా కలలు కన్నారు. వాటిలో కొన్ని బాలీవుడ్‌తో పాటు, టాలీవుడ్‌లోనూ నటించాలని, హిందీ చిత్రంలో నటించనున్నానని, హాలీవుడ్ అవకాశం వచ్చిందని చెప్పుకుంటూ వచ్చారు. హాలీవుడ్‌లోకి ఎప్పుడు ప్రవేశిస్తుందోగాని ఈ భామ బాలీవుడ్ కల నెరవేరబోతోంది. అది చిన్న వేషం అయినా మంచి పాత్ర అని కూడా రాయ్‌లక్ష్మి చెబుతున్నారు. ఇంతకీ ఈ బ్యూటీకి బాలీవుడ్ అవకాశం కల్పించిందెవరో తెలుసా, నటి ఆసిన్‌ను బాలీవుడ్‌కు పంపించిన కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాసనే. తమిళంలో కత్తి వంటి సంచలన విజయం సాధించిన చిత్రాన్ని తెరకెక్కించిన ఆయన తాజాగా అకిరి పేరుతో హిందీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది తమిళంలో అనూహ్య విజయాన్ని సాధించిన మౌనగురు చిత్రానికి రీమేక్. ఇందులో సోనాక్షి సిన్హా హీరోయిన్. ఆమె తండ్రి సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రాయ్‌లక్ష్మికి నటించే అవకాశం రావడం విశేషం. దీని గురించి రాయ్‌లక్ష్మి చెబుతూ కాస్ట్యూమ్స్ డిజైనర్ ఒకరు తన పేరును దర్శకుడు మురుగదాస్‌కు సూచించడంతో తనకీ అవకాశం వచ్చిందని తెలిపారు. పాత్ర కూడా బాగుండడంతో కాదనకుండా ఒప్పేసుకున్నట్లు చెప్పారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించడం సంతోషం అని రాయ్‌లక్ష్మి అన్నారు. -
అనుష్కశర్మకు ఆసిన్ వకాల్తా
నటి అనుష్క శర్మకు ఆసిన్ వకల్తా పుచ్చుకున్నారు. సినిమా నటిగా ప్రాచుర్యం కంటే అధికంగా ఇప్పుడు వేరే విధంగా జనాల నోళ్లలో నానిపోతున్నారు నటి అనుష్కాశర్మ. ఆమెకు క్రికెట్ కళాకారుడు విరాట్‌కోహ్లికి మధ్య ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే వీరి సంబంధం గురించి ఇప్పుడు నిక్కర్లు తొడుక్కునే కుర్రాళ్ల వరకు తెలిసిపోయింది. ఇక సోషల్నెట్ వర్క్సులో అయితే ఈ సంచలన జంట గురించి రకరకాలుగా ఏకేస్తున్నారు. కారణం చెప్పనక్కరలేదు. ఇటీవల జరిగిన ప్రపంచకప్ క్రికెట్ క్రీడలో విరాట్‌కోహ్లి ఆట తీరు అది తిలకించడానికి సిడ్నీ వెళ్లిన నటి అనుష్క శర్మ ప్రవర్తన ఇండియా సెమీఫైనల్లో ఓడిపోవడానికి కారణం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. విరాట్‌కోహ్లి ఒకే ఒక్క రన్‌తో పెవిలియన్‌కు దారి తీయడం క్రికెట్ క్రీడా ప్రియులు జీర్ణం చేసుకోవడం లేదు. కోహ్లి, అనుష్కశర్మపై పెట్టిన ఏకాగ్రత క్రికెట్‌పై పెట్టలేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో నటి అనుష్క శర్మకు నటి ఆసిన్ వకాల్తా పలకడం విశేషం. ఆమె ఈ వ్యవహారం గురించి తన ట్విట్టర్లో పేర్కొంటూ అనుష్కశర్మను తప్పుపట్టడం మూర్ఖులు చేసే పని అన్నారు. భారత క్రికెట్ జట్టుకు మద్దతు ఇవ్వడానికి వెళ్లటం ఆమె చేసిన తప్పా అంటూ ప్రశ్నించారు. పని లేని కొందరు తన అమాయకత్వాన్ని వేరే విధంగా చూపుతున్నారని దుయ్యబట్టారు. ఇంతకుముందు ఆసిన్, భారత క్రికెట్ కెప్టెన్ ధోని మధ్య ఏదో ఉందనే ప్రచారం జోరుగా సాగింది. అది నిజం చేస్తూ ఆసిన్ అనుష్కశర్మకు వకాల్తా పలికే ధోరణిలో ధోనిని వెనకేసుకొస్తున్నట్లు టాక్ స్ప్రెడ్ అవడం గమనార్హం. -
మాలీవుడ్ నుంచి మరో బ్యూటీ
కోలీవుడ్‌కు మాలీవుడ్ నాయకిల దిగుమతి కొనసాగుతోంది. ఆసిన్, నయనతారల నుంచి ఈ తరం లక్ష్మీమీనన్‌ల వరకు కోలీవుడ్‌లో జయించిన మలయాళీ భామలే. ఈ వరసలో తాజాగా అనుమోల్ చేరనుంది. ఈ అమ్మడు ఇప్పటికే మలయాళంలో మంచి నటిగా ప్రకాశిస్తోంది. కాగా పరిశ్రమలో సినీ ఎడిటర్లు దర్శకులైన సంఘటనలు అరుదు. అయితే దర్శకత్వానికి ఎడిటింగ్‌కు చాలా అనుబంధం ఉంటుంది. చిత్రీకరణలో దర్శకుడు ఆశించిన అవుట్‌పుట్ రాకపోయినా ఎడిటింగ్‌లో సాధ్యమైనంత వరకు తన భావాలకనుగుణంగా మలచుకోవచ్చు. ఎడిటింగ్‌లో అంత విషయం ఉందన్నమాట. ఎడిటింగ్‌లో నేర్పరి అయితే దర్శకత్వంలో సులభంగా రాణించవచ్చు. అలాంటి ధైర్యంతోనే ఏమో యువ ఎడిటర్ ఆంటోని మెగాఫోన్ పట్టడానికి సాహసిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు ఎడిటర్‌గా పని చేసిన ఈయన మలయాళంలో మంచి విజయం సాధించిన షట్టర్ చిత్ర తమిళ రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నారు. ఇది ఒక వేశ్య ఇతివృత్తంతో కూడిన చిత్రం. మలయాళంలో ఈ పాత్రను సజిత మరత్తిల్ పోషించారు. కేరళ ప్రభుత్వ అవార్డును పొందిన ఈ చిత్ర తమిళ రీమేక్‌లో మలయాళకుట్టి అనుమోల్ నటించడానికి సిద్ధం అవుతోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో నటుడు సత్యరాజ్ ప్రముఖ పాత్రను పోషించనున్నారు. దర్శకుడు విజయ్ నిర్మించనున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. -
చక్కనమ్మా.. కాస్త చిక్కవమ్మా..
చక్కనమ్మ చిక్కినా అందమే కానీ.. బక్కనమ్మ ఒళ్లు చేస్తేనే కష్టం. ‘ఆల్ ఈజ్ వెల్’ సినిమా క్లాప్ కొట్టే టైంలో మెరుపుతీగలా ఉన్న అసిన్.. ఈ మధ్య కాస్త వెయిట్ పెరగడంతో వారు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో అసిన్ షెడ్యూల్ పూర్తయింది. అయితే ఇందులో నటించిన స్మృతి ఇరానీ ప్లేస్‌లో సుప్రియా పాఠక్‌ను తీసుకోవాల్సి వచ్చింది. దీంతో అసిన్, స్మృతి ఇరానీ కాంబినేషన్లోని సీన్లు రీషూట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ టైంలో అసిన్ వెయిట్ పెరగడంతో కాస్త చిక్కవమ్మా అంటూ అసిన్ ముందు ప్రొడ్యూసర్లు పొర్లు దండాలు పెడుతున్నారు. -
అసిన్‌ను వీడని ‘కిల్లాడి 786’ కేసు
తమిళసినిమా: కోలీవుడ్, టాలీవుడ్లో వెలిగిన నటి అసిన్. ఈ క్రే జ్ ఈ మలయాళి బ్యూటీని బాలీవుడ్‌కు ఎగబాకేలా చేసింది. అయితే ఆ తరువాత దక్షిణాది అవకాశాలను అంగీకరించడానికి అమ్మడు చాలా బెట్టుకుపోయింది. ముఖ్యంగా పారితోషికం విషయంలోనే కొండెక్కి కూర్చొంది. ఆ విధంగా పలు అవకాశాలను కాలదన్నుకున్న అశిన్ ప్రస్తుతం రెండింటికీ చెడ్డ రేవడిగా మారిందంటున్నాయి సినీ వర్గాలు. బాలీవుడ్‌కు పరిచయమైన తొలి చిత్రం గజని ఘనవిజయం సాధించడంతో ఫ్యూచర్ చాలా బ్రైట్‌గా కనిపిం చింది భామకు. తదుపరి అవకాశాలు కూడా అలానే వరించాయి. అయితే విజయాలే ముఖం చాటేశాయి. ఫలితం ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒకే ఒక్క చిత్రం ఉంది. దీంతో అసిన్ జాడ ఎక్కడని బాలీవుడ్ వెతుకుతున్న పరిస్థితి. ఎప్పుడో విడుదలై నిరాశపరచిన కిల్లాడి 786 చిత్రం తలనొప్పి మాత్రం ఈ ముద్దుగుమ్మను వెంటాడుతోంది. అసలు విషయం ఏమిటంటే 786 అనే సంఖ్యను ఇస్లాం మతస్తులు చాలా పవిత్రంగా భావిస్తారు. అలాంటి సంఖ్యను కిల్లాడి 786 చిత్రంలో తప్పుగా చూపించారట. దీంతో ఈ చిత్రంలో నటించిన హీరో అక్షయ్‌కుమార్, హీరోయిన్ అసిన్, దర్శక, నిర్మాతలపై తగిన చర్యలు తీసుకోవాలని నజీంబునో అనే వ్యక్తి ముంబయి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసు ముంబయిలోని అందేరి మెజిస్ట్రేట్ కోర్టులో విచారణకు వచ్చింది. కేసు విచారించిన మెజిస్ట్రేట్ అక్షయ్‌కుమార్, అసిన్, చిత్ర దర్శక నిర్మాతలని వెంటనే విచారించి ఫిబ్రవరి 11లోపు వివరాలను కోర్టుకు సమర్పించాలని పోలీసులను ఆదేశిం చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. -
సిఫార్సు చేయరూ
బాలీవుడ్‌కు అసిన్ అంటే ముఖం మొత్తిందా? ఐదేళ్ల క్రితం ఈ బ్యూటీ బాలీవుడ్ రంగప్రవేశం చేసింది. తొలి చిత్రం అమీర్‌ఖాన్ తో నటించే అవకాశం రావడం ఆ చిత్రం (గజని) అక్కడ బంపర్ హిట్ కావడంతో ఆసిన్ గాలిలో మేడలు కట్టేస్తూ భవిష్యత్తును ఊహించేసుకుంది. ఈమలయాళ కుట్టి ఊహించినట్లుగానే మరో స్టార్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో లండన్ డ్రీమ్స్, రెడీ చిత్రాల్లో నటించే అవకాశాలు వరించాయి. వీటిలో లండన్ డ్రీమ్స్ ఆశించిన విజయం సాధించకపోయినా ఆపై కూడా హౌస్‌ఫుల్-2, బోల్‌బచ్చన్ బోల్, కిల్లాడి 786 వంటి పలు చిత్రాలు అసిన్‌ను వరించాయి. దీంతో భవిష్యత్ బ్రహ్మాండంగా ఉండబోతుందని కలలు కన్న అసిన్‌కు అనూహ్యంగా అవకాశాలు తగ్గిపోయాయి. 2012, 2013లో అసిన్ నటించిన చిత్రమేదీ విడుదల కాలేదంటే ఆమె పరిస్థితి ఏమిటన్నది అర్థం అవుతోంది. ఎట్టకేలకు ఇటీవల ఆల్ ఈజ్ వెల్ అనే ఒక చిత్రం అవకాశాన్ని రాబట్టుకోగలిగింది. ఈ చిత్రం మినహా వేరే అవకాశం లేకపోవడంతో మళ్లీ కోలీవుడ్‌పై దృష్టి సారించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆ మధ్య దక్షిణాది చిత్రాల అవకాశాలను తిరస్కరించడంతో ఇక్కడి నిర్మాతలు ఈ అమ్మడిని పట్టిం చుకోవడం లేదని సినీ వర్గాల టాక్. అయితే తనకు పరిచయమైన హీరోలకు వాట్స్‌యాప్‌లో మెసేజ్‌లు పంపుతూ సిఫార్సు చేయమని కోరుతోందట. మరి ఈ మలయాళ కుట్టి మొర ఏ నటుడు ఆలకిస్తారో వేచి చూడాల్సిందే. -
లైంగిక కార్యకలాపాలకు ఎందుకు దూరంగా ఉండాలి?
అసభ్యకర వ్యాఖ్యలతో నటి ఇలియాన మరోసారి కలకలం రేపింది. ఉత్తరాది సినీ సంస్కృతికి, దక్షిణాది సినీ సంస్కృతికి చాలా వ్యత్యాసం ఉంది. బాలీవుడ్ తారలు ఏ విషయమైనా బహిరంగంగా మాట్లాడుతారు. హీరోలతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం నుంచి వారితో సంబంధాలు పెట్టుకోవడం వరకు దాపరికాలు లేకుండా చెప్పేస్తారు. కొందరు నటీమణులైతే నగ్నంగానే ఫొటోలకు పోజులిచ్చేస్తారు కూడా. అలాంటి సంస్కృతికి దక్షిణాది నటీమణులు దూరమనే చెప్పాలి. దక్షిణాది నుంచి ఉత్తరాది చిత్ర పరిశ్రమకు వెళ్లిన అసిన్, కాజల్ అగర్వాల్ లాంటి వారు పరిధికి మించి ప్రవర్తించలేదు. అయితే ఇలియూనాకు బాలీవుడ్ అలవాట్లు అబ్బినట్టున్నాయి. తెలుగులో ప్రముఖ కథానాయికగా రాణించిన ఈ బ్యూటీతమిళంలో నన్భన్ చిత్రంతో మంచి పేరునే సంపాదించుకుంది. ఆ తరువాత బాలీవుడ్లో మకాం పెట్టిన ఈ బ్యూటీకి అక్కడ తొలి చిత్రం బర్ఫీ మంచి ఫలితాన్నే ఇచ్చింది. దీంతో అక్కడ పరిస్థితి అమ్మడికి ఆశాజనకంగానే ఉందని చెప్పవచ్చు. అంతవరకు బాగానే ఉంది. ఈమె ప్రవర్తన మాత్రం బరి తెగించినట్లే అనిపిస్తోంది. పురుషులతో సంబంధం గురించి ఇటీవల ఇలియానా ఇచ్చిన ఇంటర్వ్యూ కలకలం రేపింది. ఆమె ఆ ఇంటర్వ్యూలో పేర్కొంటూ లైంగిక కార్యక్రమాల్లో పాల్గొనడం వలనే తన శరీరాన్ని చక్కని షేప్‌లో ఉంచుకోగలుగుతున్నానని, అది పరవశమైన తరుణమని, అలాంటప్పుడు దానికెందుకు దూరంగా ఉండాలి? అంటూ ఇలియానా చేసిన వ్యాఖ్యలు కలకలం పుట్టిస్తున్నాయి. ఇంతకు ముందు ఒకసారి లైంగిక విషయాల గురించి తన తండ్రితో చర్చిస్తానని చెప్పి ఇదే విధంగా సంచలనం సృష్టించింది. -
అసిన్ రిటర్న్స్
దక్షిణాదిలో ముఖ్యంగా తమిళతం, తెలుగు భాషల్లో నటిగా తన సత్తా చాటుకున్న హీరోయిన్లలో నటి అసిన్ ఒకరు. గజిని చిత్రంలో ఈ భామ నటనా ప్రతిభను ఆమె అభిమానులు మరచిపోలేదు. ఆమెను బాలీవుడ్కుతీసుకెళ్లింది కూడా ఆ చిత్రమే. హిందీ గజిని చిత్రం అసిన్‌ను ఉత్తరాది అభిమానులకు దగ్గర చేసినా, దక్షిణాది అభిమానులకు ఆమెను దూరం చేసింది. అసిన్ దక్షిణాది చిత్రాలో నటించి మూడేళ్లకు పైనే అయ్యింది. అయితే బాలీవుడ్లో గజిని మినహా చెప్పుకోదగ్గ విజయాలేమీ వరించలేదన్నది నిజం. ప్రస్తుతం అవకాశాలు కూడా అంత ఆశాజనకంగా లేవు. అసిన్ హిందీలో ఆల్ ఈజ్ వెల్ అనే ఒకే ఒక్క చిత్రం చేస్తున్నారు. కొత్త అవకాశాలు కూడా దరిదాపుల్లో లేవని సమాచారం. దీంతో అసిన్ మళ్లీ దక్షిణాది చిత్రాలపై దృష్టి సారించాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన మైక్రోబ్లాగ్‌లో పేర్కొన్నారు. మళ్లీ తమిళ చిత్రాల్లో నటించాలని ఆసక్తిగా ఉన్నట్లు ఈ ముద్దుగుమ్మ పేర్కొనడం విశేషం. అయితే కొలీవుడ్లో ఇప్పుడు అనుష్క, నయనతార, హన్సిక, సమంతల హవా కొనసాగుతోంది. లక్ష్మీమీనన్, ప్రియాఆనంద్ వంటి వర్ధమాన హీరోయిన్లు కూడా విజయాలతో దూసుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో అసిన్ మళ్లీ కోలీవుడ్‌లో పాగా వేసేనా? ఒక వేళ అలా జరిగితే ఆమె కంటే ఆనందించేది ఆమె అభిమానులే. అసిన్ చివరిగా మూడేళ్ల క్రితం విజయ్ సరసన కావలన్ చిత్రంలో నటించారు. ఆ తరువాత కొన్ని అవకాశాలు వచ్చినా ఆమె అంగీకరించలేదు. మరి ఇప్పుడామెను తమిళ చిత్ర పరిశ్రమ అంగీకరిస్తుందా? వేచి చూడాల్సిందే. -
అసిన్ అవయవదానం
అవయవదానం చేయడం మరణపుటంచుల్లో ఉన్న వారికి పునర్జీవం పోయడమే. ఇంతకంటే గొప్పదనం మరొకటి ఉండదు. అలాంటి దానానికి తాను సైతం అంటున్నారు ప్రముఖ నటి అసిన్. అవసరం అయినవారికి ఉపయోగపడేలా తన అవయవాలను దానం చేస్తానని అసిన్ వెల్లడించారు. తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా అభిషేక్‌బచ్చన్ సరసన ఆల్ ఈజ్ వెల్ చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో మంచి చిత్రాల్లో నటించాలనే ఆసక్తి ఉందంటున్న అసిన్ ప్రస్తుతం పలు కథలను వింటున్నారు. ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతు సాయం చేస్తున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ పలువురు పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇటీవల ఈ బ్యూటీ ముంబయిలోని ఒక సామాజిక సేవా సంస్థ నిర్వహించిన రక్తదానం కార్యక్రమంలో అతిథిగా పాల్గొని వారిలో ఒకరిగా రక్తదానం చేశారు. అంతేకాదు తన కళ్ల నుంచి అన్ని అవయవాలు దానం చేయనున్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన పత్రంలో అసిన్ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. అది ఇప్పుడు నెరవేరిందని పేర్కొన్నారు. అవసరం అయిన వారికి ఉపయోగపడాలనే తన అవయవదానం చేసినట్టు వివరించారు. తన ఈ నిర్ణయం మరికొందరికి స్ఫూర్తి దాయకం అవుతుందని నమ్ముతున్నట్లు అసిన్ పేర్కొన్నారు. -
కేరిర్ చివర దశలో ఉన్న తమిళ అమ్మాయి
-
నా గెస్ట్‌హౌస్‌కు రండి
నా గెస్ట్‌హౌస్‌ను సందర్శించండి అంటూ ఆసిన్ ఆహ్వానిస్తున్నారు. తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోయిన్గా వెలుగొందిన మలయాళ నటి అసిన్. హిందీ గజిని చిత్రంతో బాలీవుడ్లో పాగా వేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత దక్షిణాది చిత్రాలపై శీతకన్నేశారనే చెప్పాలి. కాగా ఈ బ్యూటి తాజాగా కేరళలో ఒక బ్రహ్మాండమైన గెస్ట్‌హౌస్‌ను కొన్నారు. విశ్రాం తి సమయాలను ఆ గెస్ట్ హౌస్‌లో గడిపేస్తున్న అసిన్ ఇప్పుడు బాలీవుడ్ హీరోలను తన గెస్ట్ హౌస్‌ను సందర్శించండంటూ ఆహ్వానిస్తున్నార ట. కేరళలోని కొట్టాయం సమీపంలోని కొండ ప్రాంతంలో సెలయేర్ల మధ్య బహు సుందరంగా ఉండే ఆ గెస్ట్ హౌస్‌కు అసిన్ తన కుటుంబ సభ్యులు, స్నేహితురాళ్లు ఎక్కువగా వస్తున్నారట. అంతేకాదు అక్కడ ఇతర గెస్ట్‌లు కూడా నివసించడానికి ఏర్పా ట్లు చేశారట. సుందరమైన చిత్రలేఖనంతోపాటు, స్వచ్ఛమెన గాలి, ప్రకృతి అందాలతో కూడిన తమ గెస్ట్‌హౌస్‌ను సందర్శించాలని బాలీవుడ్ హీరోలను ఆహ్వానిస్తున్నారట. ఇటీవల దర్శకుడు రోహిత్ శెట్టి ఈ గెస్ట్‌హౌస్‌కు వచ్చి ఆతిథ్యం స్వీకరించారట. ఆసిన్, అజ య్దేవగన్ జంటగా నటించిన బోల్ బచ్చాన్, షారూఖ్, దీపికా పడుకునేతో చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రాలను రోహిత్ శెట్టి తెరకెక్కించిన విషయం తెలిసిందే! -
నాగ్ సరసన ఐష్..కాదు అశిన్
తెలుగు-తమిళ ద్విభాషా మల్టీస్టారర్ చిత్రం - అగ్ర దర్శకుడు మణిరత్నం - అయినా హీరోయిన్ మారిపోయింది. చిన్న చిత్రం అయినా, పెద్ద చిత్రం అయినా, భారీ మల్టీస్టారర్ చిత్రం అయినా, ఎంతటి దర్శకుడైనా, ఎంతటి హీరోయిన్ అయినా ముందు అనుకున్న వారు ఆ తరువాత మారిపోవడం సహజమైపోయింది. దర్శకుడికి నచ్చకపోయినా, హీరోకి నచ్చకపోయినా హీరోయిన్ మారిపోవడం తరచూ జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ హీరోయినే నో చెప్పినట్లు తెలుస్తోంది. మాజీ ప్రపంచం సుందరి, ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో వెలిగిపోతున్న ఐశ్వర్యారాయ్ మణి రత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'ఇరువర్ (1997) ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. అటువంటి మణిరత్నం దర్శకత్వం వహించే చిత్రంలో నటించాలన్న ప్రపోజల్‌కు ఆమె నో చెప్పారని సమాచారం. అందాల తార ఐశ్వర్యారాయ్ మళ్లీ స్క్రీన్‌పై కనిపించి కనువిందు చేస్తుందని అందరూ ఆశగా చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఇంకా ఎక్కువ ఆశతో ఎదురు చూశారు. అదీ టాలీవుడ్ మన్మథుడు నాగార్జున సరసన కనిపించబోతోందని మన ప్రేక్షకులు తెగ ఆనందపడిపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే, మణిరత్నం డైరెక్ట్ చేయబోతోన్న మల్టీస్టారర్ మూవీలో నాగ్‌కు జోడీగా ఐష్ నటింస్తుందని వార్తలొచ్చాయి. కానీ, ఈ ప్రపోజల్‌కు ఐష్ నో చెప్పినట్లు తెలుస్తోంది. ఐష్ అందాల్ని చూద్దామనుకున్నవారికి నిరాశే మిగిలింది. తెలుగులో మళ్లీ మల్టీస్టార్ల యుగం మొదలైంది. గతంలో ఎన్టీఆర్-అక్కినేని, ఎన్టీఆర్-కృష్ణ, ఎన్టీఆర్- మోహన్ బాబు, కృష్ణ-శోభన్ బాబు, అక్కినేని-కృష్ణ....ఇలా ఎన్నో చిత్రాలు వచ్చాయి. విజయవంతమయ్యాయి. ఆ తరువాత చాలాకాలం మల్టీస్టార్ల చిత్రాలు రాలేదు. ఇటీవల వెంకటేష్-మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వెంకటేశ్-రామ్ మసాలా, అల్లు అర్జున్, రాం చరణ్ ‘ఎవడు’ చిత్రాలు వచ్చాయి. తాజాగా తమిళంలో అగ్ర దర్శకుడైన మణిరత్నం దర్శకత్వంలో తెలుగు సూపర్ స్టార్లు అక్కినేని నాగార్జున, మహేశ్ బాబు కాంబినేషన్లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం రూపొందనుంది. ఈ భారీ మూవీ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఐతే ఇందులో నాగ్ సరసన అశిన్ నటించే అవకాశాలున్నాయని ఫిలింనగర్ సమాచారం. గతంలో అశిన్ నాగ్‌తో శివమణి మూవీలో నటించింది. మళ్లీ ఇంతకాలం తరువాత వీరిద్దరి జోడీ రిపీట్ కాబోతోంది. -
ఐశ్వర్య లేకుంటే అసిన్
ఐశ్వర్యరాయ్ కాదంటే తదుపరి ప్రాధాన్యత అసిన్కే నంటున్నారు ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం. కడల్ తరువాత ఈయన తాజా చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రం ప్రారంభానికి ముందే మార్పులు, చేర్పులు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. మొదట తమిళం, తెలుగు భాషలలో రూపొందించనున్నారనే ప్రచారం జరిగింది. అలాగే టాలీవుడ్ స్టార్స్ మహేశ్ బాబు, నాగార్జున హీరోలుగా నటించే ఈ చిత్రంలో ముఖ్య భూమికను మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ పోషించనున్నారనే వార్తలు వెలువడ్డాయి. తాజాగా ఈ చిత్రాన్ని మణిరత్నం తొలుత తెలుగులోనే రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు కోలీవుడ్‌లో ఫైనాన్స్ సమస్య కారణం అని సమాచారం. తాజాగా చిత్రంలో ఐశ్వర్యారాయ్ కూడా నటించే అవకాశం లేదని తెలుస్తోంది. వివాహానంతరం ఐశ్వర్యారాయ్ మణిరత్నం చిత్రం ద్వారానే రీ ఎంట్రీ కావాలని ఆశించారని, అందుకే ఆయన అడగ్గానే నటించడానికి ఓకే చెప్పారని సమాచారం. ఈ సుందరి మళ్లీ నటించడానికి ఆమె అత్త జయబచ్చన్‌కు ఇష్టం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో వారి కుటుంబంలో మనస్పర్థలు రేగే పరిస్థితులు తలెత్తడంతో ఇదే విషయాన్ని ఐశ్వర్యారాయ్ మణిరత్నంతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. మణిరత్నం ఆమె కోసం మరి కొద్ది కాలం వేచి ఉండడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేశారని సమాచారం. అయినా ఐశ్వర్యారాయ్ నటించని పక్షంలో ఆ పాత్రకు నటి అసిన్‌ను ఎంపిక చేయాలని మణిరత్నం నిర్ణయించినట్లు తాజా సమాచారం. -
బిజినెస్ మేన్‌తో డేటింగ్ లో అసిన్
-
మంచి పాత్రలకే మొగ్గు
వంద కోట్ల ప్రాజెక్టులతో బాలీవుడ్ నటి అసిన్ విసిగిపోయింది. ప్రాధాన్యం కలిగిన పాత్రలు చేసేం దుకే మొగ్గు చూపుతానంది. ఆరేళ్ల తన కెరీర్లో ఆమిర్‌ఖాన్, అజయ్ దేవ్‌గణ్, అక్షయ్‌కుమార్, సల్మాన్‌ఖాన్ తదితర ప్రముఖ నటులతో అసిన్ నటించింది. 2012లో విడుదలైన ఖిలాడీ-786లో చివరిసారిగా కనిపించింది. ‘బాలీవుడ్లో కొనసాగడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది. అందువల్ల అదృష్టవంతురాలినేనని అనుకుంటున్నా. కొద్దిసమయంలోనే గొప్ప గొప్ప నటుల సరసన నటించా. ఆ సినిమాలు కూడా బాగా ఆడాయి. బాగా వసూళ్లు కూడా చేశాయి. ఒక్కోసారి బాక్సాఫీసు రికార్డులను కూడా బద్దలుకొట్టాయి. అయితే ఇటువంటి సినిమాలతో విసిగిపోయా. ఇకపై పాత్రకు విస్త్రత ప్రాధాన్యమున్న సినిమాల్లో మాత్రమే నటించాలని నిర్ణయించుకున్నా. కేవలం తెరపై కనిపించాలనే తపనతో మాత్రం సినిమాలు చేయను’ అని తెలిపింది. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్‌తో కలిసి ‘ఆల్ ఈజ్ వెల్’ అనే సినిమాలో అసిన్ నటిస్తోంది. గతంలో విడుదలైన ఓఎంజీ-ఓ మై గాడ్ సినిమాకు దర్శకత్వం వహించిన ఉమేశ్ శుక్లాయే ఈ సినిమాకు కూడా దర్శకుడు. ‘ఉమేశ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన ఫ్యాన్‌ని. ఓఎంజీ-ఓ మై గాడ్ సినిమా చూసిన తర్వాత ఉమేశ్‌తో కలసి పనిచేయడం ఎంతో ఆనందం కలిగిస్తోంది’ అంది. కాగా చిన్న వయసులోనే అసిన్ మలయాళ చిత్రరంగంలోకి అడుగు పెట్టింది. తెలుగు, తమిళ సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. -
పక్కన పెట్టేశారా?
పేరున్నప్పుడే అవకాశాలైనా, గౌరవమైనా కాస్త మార్కెట్ తగ్గితే హలో అని కూడా పలకరించే నాథుడుండడు. అది ఎవరైనా సరే. దటీజ్ సినిమా పరిశ్రమ. నటి అసిన్ పరిస్థితి దాదాపు ఇంతేనంటున్నాయి సినీ వర్గాలు. ఈ కేరళ కుట్టి టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్గా వెలిగారు. గజని చిత్రం బాలీవుడ్‌కు పరిచయం చేసింది ఆ చిత్రం హిందీలోనూ రికార్డులు బద్దలు కొట్టడంతో ఆసిన్‌కు బాగానే క్రేజ్ పెరిగింది. అయితే అది రెండుమూడు చిత్రాలకే పరిమితం కావడం విశేషం. అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ లాంటి స్టార్ హీరోల సరసన డ్యూయెట్లు పాడిన ఈ ముద్దుగుమ్మకు ఆ తరువాత అవకాశాలు ముఖం చాటేశాయి. మధ్యలో కోలీవుడ్ అవకాశాలు ఇచ్చినా అసిన్ బెట్టు చేశారు. ప్రస్తుతం హిందీలో ఆల్ ఈజ్ వెల్ అనే చిత్రం మాత్రమే ఈ బ్యూటీ చేతిలో వుంది. ఇంతకుముందు దక్షిణాది భామలను హీరోయిన్లుగా ఎంపిక చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిన బాలీవుడ్ దర్శక, హీరోలు ఇటీవల బాలీవుడ్ భామలపైనే మోజు పడుతున్నారు. దీపిక పడుకునే, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా వంటి వారు బాగా పాపులర్ కావడమే ఇందుకు కారణం. ఇది బాలీవుడ్‌ను నమ్మి వెళ్లిన దక్షిణాది హీరోయిన్లకు నిరాశను మిగిల్చింది. ఆ మేరకు బాలీవుడ్‌పై కన్నేసిన కాజల్ అగర్వాల్, తమన్నా వంటి దక్షిణాది ముద్దుగుమ్మలు తాజాగా గోడకు కొట్టిన బంతిలా తిరుగుముఖం పట్టడం చూస్తే బాలీవుడ్లో వారికి ఎదురైన పరిస్థితి అర్థం అవుతుంది. అసిన్ పరిస్థితి అలాగే తయారైంది. ఈ అమ్మడిని బాలీవుడ్ పక్కన పెట్టేసింది. అయితే దక్షిణాదిలోనూ అవకాశాలు రాకపోవడంతో ముంబయిలోనే ఉంటూ యాడ్స్‌పై దృష్టి సారిస్తున్నారు. -
‘గబ్బర్‌సింగ్ 2’లో అసిన్?
మలయాళ సుందరి అసిన్ తెలుగు చిత్రాల్లో నటించడం మానేసి దాదాపు ఏడేళ్లయ్యింది. హిందీ ‘గజిని’ రీమేక్‌లో నటించడానికి అంగీకరించిన తర్వాత మెల్లిగా తమిళ సినిమాలకు కూడా దూరమయ్యారామె. అయితే, హిందీలో ఒకటీ రెండు సినిమాలు మినహా చేయడంలేదు కాబట్టి, ఇకనుంచి దక్షిణాది చిత్రాల్లో కూడా నటించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి ‘గబ్బర్‌సింగ్ 2’లో నటించే అవకాశం ఆమెను వరించింది. ఈ విషయాన్ని అసిన్ తన ట్విట్టర్లో స్వయంగా పేర్కొన్నారు. ఓ రెండు రోజుల క్రితమే ‘గబ్బర్‌సింగ్ 2’ యూనిట్ ఆమెను ఈ విషయమై సంప్రదించారట. అయితే, ఈ చిత్రానికి అసిన్ పచ్చజెండా ఊపిందీ లేనిదీ మాత్రం పేర్కొనలేదు. ప్రస్తుతం ఆమె హిందీలో ‘మేరీ అప్నే’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది మినహా అసిన్ చేతిలో వేరే సినిమాలు లేవు. పైగా పవన్‌కళ్యాణ్ సరసన సినిమా అంటే అది జాక్పాట్లాంటిదే. కాబట్టి, ఈ అవకాశాన్ని అసిన్ వదులుకోరనే భావించవచ్చు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం త్వరలోనే మొదలు కానుంది. గతంలో ఆమె పవన్‌కళ్యాణ్ సరసన ‘అన్నవరం’లో నటించిన విషయం తెలిసిందే. -
ఈ విష సంస్కృతి ఇక్కడ మామూలే
‘‘మీడియానే అనుకుంటే... ఇండస్ట్రీ కూడా గాసిప్పులను సృష్టిస్తే ఎలా? నా కెరీర్‌ను నాశనం చేసేలా ఇలాంటి గాసిప్పుల్ని పుట్టించడం భావ్యం కాదు’’ అంటూ వాపోయారు అసిన్. ఇటీవల ఆమె అమెరికా పర్యటనకు వెళ్లారు. దాదాపు ఇరవై రోజుల పాటు ఈ పర్యటన సాగింది. అయితే... ఈ చిన్న వ్యవధిలో ఇండస్ట్రీలోనే అసిన్‌పై ఓ కొత్త వార్త హల్చల్ చేసింది. అసిన్ పెళ్లి పనిమీదే అమెరికా వెళ్లారని, కుర్రాడిది అమెరికానే అని, అక్కడ అసిన్‌కి వివాహం అయిపోయిందని ఈ వార్త సారాంశం. అమెరికాలో ఉండగానే... ఈ విషయంపై పరిశ్రమ నుంచే అసిన్‌ను ఎన్నో ఫోన్ కాల్స్ వెంటాడాయట. దీన్ని ఆసరాగా తీసుకొని అక్కడి మీడియాలో కూడా కథనాలు ప్రసారమయ్యాయి. ఇండియా తిరిగి వచ్చాక ఈ విషయంపై అసిన్ ఉద్వేగానికి లోనయ్యారు. ‘ఇలాంటి విష సంస్కృతి బాలీవుడ్లో మామూలే. వీటన్నింటినీ తట్టుకుంటేనే ఇక్కడ ఉండగలం. పెళ్లి కాకుండానే సహజీవనం చేయడాలు, బాయ్‌ఫ్రెండ్స్‌తో విదేశాలు చుట్టి రావడాలు, ఏమీ లేకపోయినా... ఏదేదో జరుగుతోందని ఊహించి వ్యక్తులపై లేనిపోని అపవాదులు వేయడాలూ... ఇక్కడ ఇవన్నీ సాధారణం. నేను మా కుటుంబంతో కలిసి టూర్‌కి వెళ్లాను. కానీ ఎవరికి తోచినట్టు వారు చెప్పుకున్నారు. ఇది నా కెరీర్‌పై ఎంతగా ప్రభావితం చేస్తుందో ఎవరూ అర్థం చేసుకోలేదు’’అని ఆవేదన వ్యక్తం చేశారామె. ఇంతకీ పెళ్లెప్పుడూ అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ -‘‘ఆ ఘడియ కూడా దగ్గరకు వచ్చేసింది. ప్రస్తుతం ఇంట్లోవారు అదే పనిమీద ఉన్నారు. ఇక్కడ చాలా మంది వివాహాలు చేసుకోకుండా లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అంటూ మన సంస్కృతిని పాడు చేస్తున్నారు. నేను అలాంటి దాన్ని కాదు. ఇంట్లోవారు చూసిన వారినే పెళ్లాడతా. అది కూడా మీకు చెప్పే చేసుకుంటా’’ అని చెప్పారు అసిన్. -
అప్పుడే పెళ్లా?
నటి అసిన్ పెళ్లి చేసుకున్నారా? ప్రస్తుతం బాలీవుడ్లో జరుగుతున్న వేడివేడి చర్చ ఇదే. కేరళ రాష్ట్రానికి చెందిన ముద్దుగుమ్మ అసిన్. తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్గా ఒక రౌండ్ కొట్టి గజని చిత్రంతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది. అక్కడ కూడా కొంత కాలం హవా కొనసాగించింది. ప్రస్తుతం అవకాశాలు ముఖం చాటేస్తున్నాయి. దీంతో అసిన్ పెళ్లి చేసుకుని సంసార జీవితానికి శ్రీకారం చుట్టినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సందర్భంగా ఆమెతో ప్రత్యేక ఇంటర్వ్యూ. మీకు పెళ్లి అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజంగానే ఓ ఇంటి వారయ్యారా? నేను నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకోవడానికి అమెరికా వెళ్లినప్పుడు ఇలాంటి ప్రచారం నా వరకు వచ్చింది. వివాహ నిశ్చితార్థం జరిగిందని, పెళ్లి కొడుకుది అమెరికా అని, పెళ్లి కూడా అయిపోయిందని బాలీవుడ్ ప్రచారం చేసింది. హిందీ చిత్ర పరిశ్రమ సంస్కృతి చాలా భిన్నమైంది. అక్కడ డేటింగ్‌ల సంస్కృతి ఎక్కువ. పెళ్లి కాకుండానే బాయ్‌ఫ్రెండ్‌తో విదేశాలు చుట్టి వస్తారు. నూతన సంవత్సరాన్ని ఎంజాయ్ చేస్తారు. నేను అమెరికా వెళ్లడం వల్ల నిశ్చితార్థం, పెళ్లి అంటూ ప్రచారం చేశారు. ఏదేమైనా మీకు పెళ్లి విషయం గురించి నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందిగా? నిజమే. నా జీవితంలో తదుపరి అంశం వివాహమే. అలాగని నేను పెళ్లికి తొందర పడను. హిందీ తారల్లో చాలా మంది పెళ్లే వద్దని కాలం గడిపేస్తున్నారు. పలువురు వివాహం చేసుకోకుండానే లివింగ్ రిలేషన్షిప్ పేరుతో సహజీవనం చేస్తున్నారు. నా వరకు వస్తే పెళ్లి చేసుకోమని ఇంటిలో ఒత్తిడి చేస్తున్నారు. మంచి వరుడి కోసం అన్వేషణ జరుగుతోంది. మరో ఏడాది వరకు పెళ్లి చేసుకోను. మీ జీవితంలో జరుగుతున్న మార్పులు? ముందుకంటే బరువు తగ్గి బాగా స్లిమ్‌గా తయారయ్యాను. మంచి చిత్రాల్లో నటించాను. నిజం చెప్పాలంటే నాకిప్పుడు కాస్త విశ్రాంతి అవసరం. చదువుకునే రోజుల్లోనే నటించడానికి వచ్చా ను. కుటుంబం, నటన మినహా నా మనసులో వేరే ఆలోచన లేదు. సన్నిహిత స్నేహితురాళ్ల పెళ్లిళ్లకు కూడా వెళ్లలేని పరిస్థితి. ఈ మధ్య విదేశాలు చుట్టొచ్చారట? గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు సుదీర్ఘ విదేశీయానం చేశాను. గ్రీస్ దేశంలో మొదలెట్టి రోమ్, వెని స్ వరకు వెళ్లాను. అమెరికా, కెనడా దేశాల్లోనూ కొన్ని రోజులు గడిపాను. ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌లోని అందాలను ఆస్వాదించాను. సినిమా అవకాశాలు లేకపోతే తారలకు నిద్ర పట్టదుగా? అలాంటి సందర్భం నా కెప్పుడు ఎదురుకాలేదు. నేనెప్పుడూ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటాను. డబ్బు కోసం నేనెప్పుడూ నటించలేదు. డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడను. షూటింగ్ అంటే సంతోషంగా వెళ్లాలి. ఇప్పుడు కూడా అలాంటి మంచి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను.