
లైంగిక కార్యకలాపాలకు ఎందుకు దూరంగా ఉండాలి?
అసభ్యకర వ్యాఖ్యలతో నటి ఇలియాన మరోసారి కలకలం రేపింది. ఉత్తరాది సినీ సంస్కృతికి, దక్షిణాది సినీ సంస్కృతికి చాలా వ్యత్యాసం ఉంది. బాలీవుడ్ తారలు ఏ విషయమైనా బహిరంగంగా మాట్లాడుతారు. హీరోలతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం నుంచి వారితో సంబంధాలు పెట్టుకోవడం వరకు దాపరికాలు లేకుండా చెప్పేస్తారు. కొందరు నటీమణులైతే నగ్నంగానే ఫొటోలకు పోజులిచ్చేస్తారు కూడా. అలాంటి సంస్కృతికి దక్షిణాది నటీమణులు దూరమనే చెప్పాలి. దక్షిణాది నుంచి ఉత్తరాది చిత్ర పరిశ్రమకు వెళ్లిన అసిన్, కాజల్ అగర్వాల్ లాంటి వారు పరిధికి మించి ప్రవర్తించలేదు. అయితే ఇలియూనాకు బాలీవుడ్ అలవాట్లు అబ్బినట్టున్నాయి. తెలుగులో ప్రముఖ కథానాయికగా రాణించిన ఈ బ్యూటీతమిళంలో నన్భన్ చిత్రంతో మంచి పేరునే సంపాదించుకుంది.
ఆ తరువాత బాలీవుడ్‌లో మకాం పెట్టిన ఈ బ్యూటీకి అక్కడ తొలి చిత్రం బర్ఫీ మంచి ఫలితాన్నే ఇచ్చింది. దీంతో అక్కడ పరిస్థితి అమ్మడికి ఆశాజనకంగానే ఉందని చెప్పవచ్చు. అంతవరకు బాగానే ఉంది. ఈమె ప్రవర్తన మాత్రం బరి తెగించినట్లే అనిపిస్తోంది. పురుషులతో సంబంధం గురించి ఇటీవల ఇలియానా ఇచ్చిన ఇంటర్వ్యూ కలకలం రేపింది. ఆమె ఆ ఇంటర్వ్యూలో పేర్కొంటూ లైంగిక కార్యక్రమాల్లో పాల్గొనడం వలనే తన శరీరాన్ని చక్కని షేప్‌లో ఉంచుకోగలుగుతున్నానని, అది పరవశమైన తరుణమని, అలాంటప్పుడు దానికెందుకు దూరంగా ఉండాలి? అంటూ ఇలియానా చేసిన వ్యాఖ్యలు కలకలం పుట్టిస్తున్నాయి. ఇంతకు ముందు ఒకసారి లైంగిక విషయాల గురించి తన తండ్రితో చర్చిస్తానని చెప్పి ఇదే విధంగా సంచలనం సృష్టించింది.